తెలంగాణలో భూ ప్రకంపనలు
తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు కలకలం రేపాయి. ఏపీలోని కృష్ణా, ఏలూరు జిల్లాలతో పాటుగా.. తెలంగాణలోని పలు జిలాల్లో స్వల్ప భూకంపం చోటు చేసుకుంది. ఉదయం ఏడున్నర గంటల ప్రాంతంలో ఓ రెండు, మూడు సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో స్థానికులు ఇళ్ల నుంచి ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు.
తెలంగాణలోని భూప్రకంపనలు స్థానికులను కలవరపాటుకు గురి చేశాయి. పలు జిల్లాల్లో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. సుమారు మూడు సెకన్ల పాటు భూమి కంపించింది. ఇవాళ ఉదయం 7.25 గంటల నుంచి 7.28 గంటల మధ్య భూమి కంపించింది. భూ ప్రకంపనలతో ప్రజలు ప్రాణభయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఏం జరుగుతుందో అర్థం కాక హడలిపోయారు. ఖమ్మం, మహబూబాబాద్, నల్గొండలోని కొన్ని ప్రాంతాలు, వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి, మంచిర్యాల, భద్రాద్రి జిల్లాల్లో భూ ప్రకంపనలు కనిపించాయి. ప్రధానంగా ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం, చర్ల, చింతకాని, నాగులవంచ, మణుగూరు, భద్రాచలం ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయి.
ఉదయం 7.25 గంటల సమయంలో భూప్రకంపనలు చోటు చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. ఉత్తరం నుంచి దక్షిణం, దక్షిణం నుంచి ఉత్తరానికి కొన్ని సెకన్ల పాటు భూమి కంపించినట్లు ప్రజలు తెలిపారు. హఠాత్తుగా భూమి కంపించటంతో ప్రజలు హడలిపోయారు. అసలేం జరగుతోందో అర్థం కాక.. భయంతో వణికిపోయారు. ముఖ్యంగా ఇంట్లో వంట సామాగ్రి, వస్తువులు ఉన్నట్లుండి కింద పడిపోవంతో ప్రజలు హడలిపోయారు. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. నగర పరిధిలోని వనస్థలిపురం, హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్ పరిసర ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది. దీంతో నగర ప్రజలు భయంతో వణికిపోయారు.
ఏపీలోని కృష్ణా, ఏలూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లోనూ భూమి స్వల్పంగా కంపించింది. ప్రధానంగా గోదావరి పరివాహాక ప్రాంతంతో పాటుగా.. కోల్ బెల్ట్ ఏరియాలో ఎక్కువగా భూమి కంపించినట్లు అధికారులు చెపుతున్నారు. రికార్డు స్కేల్‌పై 5.3 తీవ్రతతో భూమి కంపించినట్లు అధికారులు వెల్లడించారు. భూమి లోపల 40 కి.మీ లోపల ఈ రేడియేషన్ ఉద్భవించి ఉంటుందని తెలిపారు. మహారాష్ట్ర ఛత్తీస్‌గడ్‌లోనూ భూకంపం సంభవించినట్లు అధికారులు తెలిపారు. గడ్చిరౌలి జిల్లాలోని పలు ప్రాంతాల్లో స్వల్పంగా భూమి కంపించినట్లు స్థానికులు తెలిపారు. తెలంగాణలో భూకంపాలు రావటం చాలా అరుదు అని.. అటువంటింది 5.3 తీవ్రతతో భూమి కంపంచటం పట్ల అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Dec 04 2024, 08:38