వైఎస్ భాస్కర్ రెడ్డికి సుప్రీం కోర్టు నోటీసులు

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును సీబీఐ విచారిస్తోంది. దాదాపు హత్య జరిగి ఐదేళ్లు గడిచినా ఈ దారుణానికి ఒడిగట్టింది ఎవరనే దానిపై అధికారికంగా స్పష్టత రాలేదు. ఈ హత్య చేసిందేవరో కోర్టు తుది తీర్పు తర్వాతనే తేలనుంది. సీబీఐ సుదీర్ఘకాలంగా కేసును విచారిస్తోంది. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి అరెస్ట్ తర్వాత ఈ కేసు విచారణలో స్పీడ్ తగ్గింది.

వైఎస్ భాస్కర్ రెడ్డి (YS Bhaskar Reddy)కి సుప్రీం కోర్టు (Supreme Court ) నోటీసులు (Notices) జారీ చేసింది. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు (YS Vivekananda Reddy murder case)లో నిందితుడు భాస్కర్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు (Telangana High Court) బెయిల్ (Bail) మంజూరు చేసింది. ఈ క్రమంలో భాస్కర్ రెడ్డికి హైకోర్టు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సీబీఐ (CBI) సుప్రీంలో పిటీషన్ దాఖలు చేసింది. దీనిపై శుక్రవారం సిజెఐ సంజీవ్ ఖన్నా (CJI Sanjeev Khanna) నేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణ జరిగింది. అనంతరం భాస్కర్ రెడ్డికి నోటీసులు జారీచేస్తూ... తదుపరి విచారణ మార్చికి వాయిదా వేసింది.

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును సీబీఐ విచారిస్తోంది. దాదాపు హత్య జరిగి ఐదేళ్లు గడిచినా ఈ దారుణానికి ఒడిగట్టింది ఎవరనే దానిపై అధికారికంగా స్పష్టత రాలేదు. ఈ హత్య చేసిందేవరో కోర్టు తుది తీర్పు తర్వాతనే తేలనుంది. సీబీఐ సుదీర్ఘకాలంగా కేసును విచారిస్తోంది. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి అరెస్ట్ తర్వాత ఈ కేసు విచారణలో స్పీడ్ తగ్గింది. వాస్తవానికి వైఎస్ అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేయడానికి ప్రయత్నించినా.. కుదరలేదు. చివరికి తెలంగాణ హైకోర్టులో ఆయన ముందస్తు బెయిల్ పొందడంతో అవినాష్ అరెస్ట్ విషయం వెనక్కి వెళ్లిపోయింది. ఇంత జరుగుతున్నా.. వివేకానంద రెడ్డి హత్య ఎందుకు జరిగింది.. ఈ హత్యలో ఎవరు పాత్రదారులు.. ఎవరు సూత్రదారులు అనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే. చట్టప్రకారం దర్యాప్తు సంస్థలు విచారణ పూర్తి చేసి సాక్ష్యాధారాలను కోర్టులో సమర్పించిన తర్వాత.. న్యాయస్థానం తీర్పు తర్వాత ఈ హత్యలో దోషులు ఎవరో అధికారికంగా తేలుతుంది.

సార్వత్రిక ఎన్నికలకు ముందు సీబీఐ విచారణ మందగించింది. ఓవైపు ఎన్నికల సమయం కావడంతో కొంత గ్యాప్ ఇచ్చినట్లు తెలుస్తోంది. గత ఐదేళ్లుగా సీబీఐ ఈ కేసులో అసలు నిందితులను అరెస్ట్ చేసే ప్రయత్నం చేసినా.. గత వైసీపీ ప్రభుత్వం ఏదో విధంగా వారి విధులకు ఆటంకం కలిగిస్తూనే ఉందనే ఆరోపణలు ఉన్నాయి. నిందితులను కాపాడేందుకు జగన్ తీవ్రంగా ప్రయత్నించారనే ఆరోపణలు ఉన్నాయి. దర్యాప్తు సక్రమంగా జరగకుండా మాజీ సీఎం జగన్ కుట్రలు చేసినట్లు ప్రచారం జరిగింది. ఏకంగా సీబీఐ అధికారులపై కేసులు నమోదు చేసిన సందర్భాలు చూశాము. దర్యాప్తు సంస్థల అధికారుల నైతికతను, ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం గత వైసీపీ ప్రభుత్వం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వైసీపీ అధికారంలో లేదు. జగన్ ప్రజల మద్దతును కోల్పోయారు. ఈ నేపథ్యంలో సీబీఐ వివేకా కేసు దర్యాప్తును వేగవంతం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో రాష్ట్రప్రభుత్వ దర్యాప్తు సంస్థలపై విశ్వాసం లేదని.. నిందితులను ప్రభుత్వం కాపాడే అవకాశం ఉందన్న అనుమానంతో వివేకా కుమార్తె సునీత కోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ కేసు దర్యాప్తును న్యాయస్థానం సీబీఐకి అప్పగించింది. సీబీఐ దర్యాప్తుతో అసలు విషయాలు బయటకు వస్తాయని అంతా భావించారు. అనుకున్నట్లుగానే కడప ఎంపీ అవినాష్ రెడ్డి పాత్ర ఈ హత్యలో ఉన్నట్లు సీబీఐ ప్రాథమికంగా ఆధారాలు సేకరించిందనే ప్రచారం జరిగింది. గూగుల్ టేకవుట్, టైమ్ లైన్ ఆధారంగా అవినాష్‌ రెడ్డికి ఈ హత్యతో ప్రమేయం ఉన్నట్లు సీబీఐ నిర్థారణకు వచ్చిందన్న ప్రచారం జరిగింది. కానీ అవినాష్ రెడ్డిని ఇప్పటిరవకు ఈ కేసులో అరెస్ట్ కాలేదు. సీఎం జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డిని కాపాడుతూ వస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.

అవినాష్ రెడ్డిని కస్టడీలోకి తీసుకుని సీబీఐ అధికారులు విచారిస్తే అసలు విషయాలు బయటకు వస్తాయని.. అదే జరిగితే మాజీ సీఎం జగన్‌తో పాటు ఆమె భార్య భారతి ఇరుక్కునే అవకాశం ఉండటంతోనే అవినాష్ రెడ్డిని జగన్ కాపాడుతున్నారనే చర్చ జరుగుతోంది. ఎంపీ టికెట్ కోసమే ఈ హత్యను చేసినట్లు కేసులోని కొందరు సాక్ష్యులు, నిందితులు ఇప్పటికే చెప్పారు. దీంతో ఈ విషయం బయటకు వస్తే వైసీపీతో పాటు జగన్ రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం ఉండటంతోనే జగన్ నిందితులకు అండగా నిలుస్తున్నట్లు తెలుస్తోంది.

ఏపీకి త‌ప్పిన తుపాను ముప్పు

ఏపీకి తుపాను ముప్పు లేద‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు వెల్ల‌డించారు. బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం తుపానుగా రూపాంత‌రం చెంద‌లేద‌ని, ఇది ఈరోజు సాయంత్రానికి వాయుగుండంగా బ‌ల‌హీన‌ప‌డుతుంద‌న్నారు.

ఇది గురువారం సాయంత్రానికి శ్రీలంక‌లోని ట్రింకోమ‌లీకి 200 కి.మీ, నాగ‌ప‌ట్ట‌ణానికి 340, చెన్నైకి 470, పుదుచ్చేరికి 410 కి.మీ. దూరంలో కేంద్రీకృత‌మై ఉంది.  

రేపు (శ‌నివారం) ఉద‌యం క‌ల్లా కారైకాల్‌, మ‌హాబ‌లిపురం మ‌ధ్య‌లో తీరం దాట‌వ‌చ్చ‌ని పేర్కొన్నారు. అయితే, తుపాను ముప్పు లేకున్నా వాయుగుండం ప్ర‌భావంతో ఈరోజు రేపు ద‌క్షిణ కోస్తా రాయ‌ల‌సీమ‌లో అక్క‌డ‌క్క‌డ భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది.

నెల్లూరు జిల్లాలో ఆక‌స్మిక వ‌ర‌ద‌లు రావొచ్చ‌ని హెచ్చ‌రించింది.

దిలావల్‌పూర్ ఇథనాల్ కంపెనీ ఎపిసోడ్

నిర్మల్‌ జిల్లా దిలావర్‌పూర్‌లో ఇథనాల్‌ పరిశ్రమ ఏర్పాటు అంశం తీవ్ర చర్చకు దారి తీసిన నేపథ్యంలో ఈ ఎపిసోడ్‌పై సర్కార్ సీరియస్ అయ్యింది. గత ప్రభుత్వ అండతో పీఎంకే డిస్టలరీ కంపనీ నిబంధనలు తుంగలో తొక్కిందని ఫైర్ అయ్యింది. ప్రభుత్వ విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈసీ తీసుకునే విషయంలో సదరు కంపనీ కేంద్రాన్ని, పర్యావరణ శాఖను మోసం చేసినట్లు గుర్తించింది. 2023, డిసెంబర్ 7కు ముందే టీఎస్-ఐపాస్ (TS-iPASS) ద్వారా ఆ కంపెనీకి అనుమతులు జారీ అయినట్లు సర్కార్ చెబుతోంది.

నిర్మల్ జిల్లా దిలావల్పూర్ ఇథనాల్ కంపనీ ఎపిసోడ్‌పై ప్రభుత్వం (Telangana Govt) సీరియస్ అయ్యింది. ఆ కంపెనీకి అనుమతులు నిబంధనల ఉల్లంఘన వ్యవహారాలపై సర్కార్ ఆగ్రహం వ్యక్తం చేసింది. గత ప్రభుత్వం అడ్డగోలుగా అనుమతి ఇచ్చిందని.. అప్పటి ప్రభుత్వ అండతో పీఎంకే డిస్టలరీ కంపనీ నిబంధనలు తుంగలో తొక్కిందని ఫైర్ అయ్యింది. ప్రభుత్వ విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈసీ తీసుకునే విషయంలో సదరు కంపనీ కేంద్రాన్ని, పర్యావరణ శాఖను మోసం చేసినట్లు గుర్తించింది. 2023, డిసెంబర్ 7కు ముందే టీఎస్-ఐపాస్ (TS-iPASS) ద్వారా ఆ కంపెనీకి అనుమతులు జారీ అయినట్లు సర్కార్ చెబుతోంది. పీఎంకే డిస్టిలేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ఫ్యూయల్ ఇథనాల్‌కు మాత్రమే కేంద్రం అనుమతి ఇచ్చింది.. కానీ ఇథనాల్, ఎక్స్ ట్రా న్యూటల్ ఆల్కహాల్, ఇండస్ట్రియల్ స్పిరిట్స్, అబ్జల్యూట్ ఆల్కహాల్ లాంటి అన్ని ఉత్పత్తులకు అప్పటి మంత్రివర్గం అనుమతి ఇవ్వడం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్న పరిస్థితి.

కేసీఆర్ ప్రభుత్వం పీఎంకే కంపెనీకి అనుకూలంగా మంత్రివర్గంలోనే అడ్డగోలు అనుమతులు జారీ చేసిందని రేవంత్ సర్కార్ చెబుతోంది. ఫ్యూయల్ ఇథనాల్ సాకు చూపించి ఏకంగా ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా మినహాయింపు పొందేందుకు ఇథనాల్ కంపనీ అడ్డదారులు తొక్కినట్లు గుర్తించింది. కేంద్రం ఇచ్చిన పర్యావరణ అనుమతి ప్రకారం అక్కడి స్థానిక సంస్థల నుంచి ఎన్‌వోసీ తీసుకోవడం తప్పనిసరి. ఎన్‌వోసీ తీసుకోకుండానే పీఎంకే డిస్టిలేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ.. అప్పట్లోనే ప్రహరి నిర్మించేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వం అండదండలతోనే పర్యావరణ అనుమతుల నిబంధనలను యధేచ్ఛగా ఉల్లంఘించిందనేది సర్కార్ వారి మాట.

2022, అక్టోబర్ 22న 600 లక్షల లీటర్ల ఇథనాల్ / ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్/ ఇండస్ట్రియల్ స్పిరిట్స్ / అబ్సల్యూట్ ఆల్కహాల్ తయారీకి లెటర్ ఆఫ్ ఇండెంట్ కేసీఆర్ ప్రభుత్వం జారీ చేసింది. అప్పటి ప్రభుత్వం కేబినేట్ ఆమోదం లేకుండానే అత్యవసరం పేరిట ఆదేశాలు జారీ చేసినట్లు విచారణలో వెల్లడైంది. 2022 డిసెంబర్‌లో ఆ నిర్ణయాన్ని కేసీఆర్ కేబినెట్ ర్యాటిఫై చేసింది. ఇథనాల్ తయారీకి కేంద్ర ప్రభుత్వంతో పాటు పర్యావరణ అనుమతి తప్పనిసరి. ఇథనాల్ / ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ / ఇండస్ట్రియల్ స్పిరిట్స్ / అబ్సల్యూట్ ఆల్కహాల్ తయారీకి పీఎంకే డిస్టిలెషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లెటర్ ఆఫ్ ఇండెంట్ తీసుకుంది.. కానీ కేంద్ర పర్యావరణ శాఖకు మాత్రం"ఫ్యూయల్ ఎథనాల్" కోసమే దరఖాస్తు చేసినట్లు విచారణలో బయటపడింది. 

అక్కడ ప్రతిపాదించిన 300 కేఎన్‌పీడీ సామర్థ్యం మొత్తం ఫ్యూయల్ ఇథనాల్ తయారీకేనని కంపెనీ స్వీయ ధ్రువీకరణ పత్రం సమర్పించింది. కంపెనీ సమర్పించిన స్వీయ ధ్రువీకరణ ఆధారంగా ఈ ఫ్యాక్టరీ బీ2 కేటగిరీకి వస్తుందని.. ప్రజాభిప్రాయ సేకరణ నుంచి అప్పటి ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. 2023 ఫిబ్రవరి 24 కేంద్ర పర్యావరణ శాఖ కేవలం ఫ్యూయల్ ఇథనాల్ ఉత్పత్తికి మాత్రమే అనుమతి ఇచ్చింది. కానీ అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 2023 ఏప్రిల్ 1న ఆ ఫ్యాక్టరీకి ఇచ్చిన లెటర్ ఆఫ్ ఇండెంట్లో ఫ్యూయల్ ఇథనాల్‌‌కు పరిమితం కాలేదు. మిగతా ఉత్పత్తులన్నీ జోడించిన లెటర్ ఆఫ్ ఇండెంట్‌ను (LOI) కేసీఆర్ ప్రభుత్వం జారీ చేసింది.

కొత్త లెటర్ ఆఫ్ ఇండెంట్‌ను చూపించి 2023 జూన్ 7న ఇథనాల్ / ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్/ ఇండస్ట్రియల్ స్పిరిట్స్ / అబ్సల్యూట్ ఆల్కహాల్ ఉత్పత్తుల తయారీ లైసెన్స్‌కు పీఎంకే కంపెనీ దరఖాస్తు చేసుకుంది. పర్యావరణ శాఖ అనుమతి ప్రకారం అక్కడి స్థానిక సంస్థల నుంచి నో ఆబ్జక్షన్ సర్టిఫికెట్ (NoC) తీసుకోవటం తప్పనిసరి. కానీ పీఎంకే డిస్టిలేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్థానికంగా అనుమతి తీసుకోకుండానే కాంపౌండ్ వాల్ నిర్మించేసింది. దీంతో పర్యావరణ అనుమతుల నిబంధనలను ఉల్లంఘించింది సదరు కంపెనీ. కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన లెటర్ ఆఫ్ ఇండెంట్ ఆధారంగా 2023 జూన్ 15న ఇరిగేషన్ డిపార్టుమెంట్ ఆదిలాబాద్ చీఫ్ ఇంజనీర్ విభాగం నీటి కేటాయింపులకు అనుమతి ఇచ్చినట్లు విచారణలో అధికారులు గుర్తించారు.

లగచర్ల భూసేకరణ రద్దు

రాష్ట్రంలో సంచలనంగా మారిన లగచర్ల భూ వివాదంలో రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. గిరిజనుల ఆందోళనకు ప్రభుత్వం వెనక్కి తగ్గింది.

రాష్ట్రంలో సంచలనంగా మారిన లగచర్ల భూ వివాదంలో కాంగ్రెస్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.

గిరిజనుల ఆందోళనకు లగచర్ల విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గింది.

లగచర్ల భూసేకరణ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఫార్మా విలేజ్ కోసం దుద్యాల మండలం లగచర్లలో భూసేకరణను నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది.

ఖాళీ బాటిళ్లతో ఆదాయం

తాగునీరు, కూల్‌డ్రింక్‌ ఖాళీ బాటిళ్లతో మీరు ఆదాయం/కానుకలు పొందవచ్చు. ఆ దిశగా జీహెచ్‌ఎంసీ(GHMC) కసరత్తు మొదలుపెట్టింది. పర్యావరణంపై ప్రభావం..సేకరణ, రవాణా వ్యయం లేకుండా ఖాళీ బాటిళ్లను ప్రాథమిక దశలోనే సేకరించేలా రివర్స్‌ వెండింగ్‌ యంత్రాల(ఆర్‌వీఎం)ను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది.

తాగునీరు, కూల్‌డ్రింక్‌ ఖాళీ బాటిళ్లతో మీరు ఆదాయం/కానుకలు పొందవచ్చు. ఆ దిశగా జీహెచ్‌ఎంసీ(GHMC) కసరత్తు మొదలుపెట్టింది. పర్యావరణంపై ప్రభావం..సేకరణ, రవాణా వ్యయం లేకుండా ఖాళీ బాటిళ్లను ప్రాథమిక దశలోనే సేకరించేలా రివర్స్‌ వెండింగ్‌ యంత్రాల(ఆర్‌వీఎం)ను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. ఇందుకోసం పలు ఏజెన్సీలతో సంప్రదింపులు జరుపుతోంది. వ్యాపారులు, తాగునీరు, కూల్‌డ్రింక్‌ తయారీ సంస్థలనూ సామాజిక బాధ్యతగా ఇందులో భాగస్వాములను చేయాలని భావిస్తున్నారు.

గ్రేటర్‌లో నిత్యం 8 వేల మెట్రిక్‌ టన్నుల చెత్త వెలువడుతుండగా, ఇందులో వివిధ రకాల ప్లాస్టిక్‌ వ్యర్థాలు 1500 టన్నుల వరకు ఉంటాయి. వీటిలో ప్లాస్టిక్‌ బాటిళ్లు 80 నుంచి 100 టన్నులుంటాయని జీహెచ్‌ఎంసీ వర్గాలు చెబుతున్నాయి. లో గ్రేడ్‌ ప్లాస్టిక్‌ కవర్లు 950 టన్నుల వరకు ఉంటాయి. డంపింగ్‌ యార్డుకు తరలించిన అనంతరం తడి, పొడి చెత్తను వేరు చేసి ప్లాస్టిక్‌ వ్యర్థాలను విద్యుదుత్పత్తి కోసం వాడుతున్నారు. తడి చెత్తతో సేంద్రియ ఎరువులు తయారు చేస్తున్నారు. ఇళ్లు, వ్యాపార సంస్థలు, కార్యాలయాల నుంచి వ్యర్థాలను సేకరించి నగరం నుంచి జవహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డుకు తరలిస్తున్నారు. ఇందుకు కోట్లాది రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈ వ్యయాన్ని తగ్గించడం.. పర్యావరణహితంగా ఉండేలా బాటిళ్ల సేకరణకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించారు.

మాల్స్‌, వ్యాపార సముదాయాలున్న చోట పైలట్‌ ప్రాజెక్టుగా ఆర్‌వీఎంలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. యంత్రాల ఏర్పాటు బాధ్యతలను వ్యాపార సంస్థలకు అప్పగించాలా..? ప్లాస్టిక్‌ వ్యర్థాలు సేకరించే ఏజెన్సీల ద్వారా యంత్రాలు ఏర్పాటు చేయాలా..? అన్న దానిపై ఉన్నతస్థాయిలో చర్చలు జరుగుతున్నాయి.

200 మిల్లీలీటర్ల నుంచి 2 లీటర్ల వరకు ఉండే ఖాళీ బాటిళ్లు డిపాజిట్‌ చేసేలా మొదటగా ఆర్‌వీఎంలు ఏర్పాటు చేయనున్నారు. యంత్రాల్లో ఖాళీ సీసాలు వేస్తే.. బాటిళ్ల సామర్థ్యం (ఎంత ఎంఎల్‌..? లీటర్లు) బట్టి రూపాయి నుంచి రూ.5 వరకు ఇచ్చే అవకాశముంటుంది.

లేనిపక్షంలో రివార్డులు/పిల్లలను ఆకర్షించేలా పెన్నులు, షార్ప్‌నర్‌, ఎరేజర్‌ వంటివి ఇచ్చినా ప్రోత్సాహకరంగా ఉంటుందని ఓ అధికారి తెలిపారు. మాల్స్‌కు వచ్చినప్పుడు సరదా కోసమైనా పిల్లలే ఇళ్లలో ఉండే సీసాలను తీసుకొస్తారని ఆయన పేర్కొన్నారు.

ప్రస్తుతం ఖాళీ సీసాలను చాలా మంది రోడ్ల పక్కన, ఖాళీ స్థలాల్లో విసిరేస్తుంటారు. ఆర్‌వీఎంలు అందుబాటులోకి వస్తే ఈ పరిస్థితి ఉండదని బల్దియా భావిస్తోంది. దశల వారీగా మార్కెట్లు, బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్లలోనూ ఆర్‌వీఎంలు ఏర్పాటు చేయాలనుకుంటున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఢిల్లీ, నోయిడా, లక్నో తదితర నగరాల్లో ఇప్పటికే ఆర్‌వీఎంలు ఉన్నాయి.

ఆర్జీవీ లొంగిపోతే ఉత్తమం లేకపోతే

పోలీసుల ట్రాప్‌ను ఆర్జీవీ గుర్తించలేకపోతున్నారు. తనను పట్టుకోవడం లేదని అనుకుంటున్నారు. తాను పరారీలో లేనని అంటున్నారు. సాంకేతికంగా ఆయన పరారీలో ఉన్నట్లుగా పోలీసులు ఫ్రేమ్ సృష్టించారు.

ఆయన ఎదురుగా ఉన్నా ఇప్పుడు పోలీసులు పట్టించుకోకపోవచ్చు. ఎందుకంటే ఆయనకు న్యాయపరమైన అన్ని అవకాశాలను ముగించాలని పోలీసులు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఆ ట్రాప్‌లో ఆర్జీవీ ఇరుక్కున్నారు.

తనను అరెస్టు చేసి కొడతారని ఆర్జీవీ భయడపడుతున్నారు. ఆయనను కొట్టాల్సినంత కోపం ఏపీ పోలీసులకు.. లేకపోతే ప్రభుత్వ పెద్దలకు ఎందుకు ఉంటుంది?. తనను ఓ జోకర్‌గా చూడాలని.. జోకులేనని..సెటైర్లేశానని ఆయన చెప్పుకుంటున్నారు.

కానీ ఎలా చూడాలో చట్టం కోణం నుంచి చూస్తున్నారు. సోషల్ మీడియా పోస్టులు పెట్టే వారిని అరెస్టు చేయవద్దంటూ విజయ్ బాబు వేసిన పిటిషన్‌పై హైకోర్టు స్పందన చూస్తే ఆర్జీవీకి న్యాయపరంగా కూడా ఎలాంటి రిలీఫ్ రాదని అర్థమైపోయింది.

ఆర్జీవీకి తాను చేసిన తప్పేమిటో తెలుసు. రెండు, మూడు టీవీ చానళ్లకు పిలిపించుకుని తనదైన సుత్తి చెప్పి కన్ ఫ్యూజ్ చేయవచ్చని అనుకుంటున్నారో.. లేక తనను అరెస్టు చేసి కొడతారని జాతీయ మీడియా చానళ్లన్నింటికీ ట్యాగ్ చేసి చెబితే.. పోలీసులు వెనక్కి తగ్గుతారని అనుకుంటున్నారో కానీ.. రోజు రోజుకు ఆర్జీవీ.. మరింత కూరుకుపోతున్నారు. ఆయనకు న్యాయసలహాలు ఇస్తున్న హైకోర్టు లాయర్‌గా మారిన సాక్షి టీవీ అనలిస్ట్ క్లీన్ షేవ్ బాలయ్య .. రాజమండ్రి జైలు బయట కూడా అలాంటి ప్రెస్‌మీట్లు పెడతారు. దాని వల్ల ఆయన మీడియాలో కనిపిస్తారు కానీ.. ఆర్జీవీ మాత్రం జైల్లో ఉంటారు.

30 లక్షల సైబర్ మోసాన్ని చాకచక్యంగా అడ్డుకున్న ఎస్బీఐ అధికారులు

సైబర్ నేరగాళ్ల బారి నుంచి ఓ వ్యక్తిని ఎస్బీఐ అధికారులు కాపాడారు. ఆ క్రమంలో రూ. 30 లక్షలు పోగొట్టుకోకుండా కట్టడి చేశారు. అయితే అసలు ఏం జరిగిందనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

సైబర్ నేరగాళ్లు (cyber fraud) ఎప్పటికప్పుడూ సామాన్యులను టార్గెట్ చేసుకుని లూటీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అందుకోసం పలురకాల ఆఫర్లు లేదా అరెస్టుల పేరుతో జనాలను మభ్యపెట్టి దోచేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా సైబర్ కేటుగాళ్లు ఓ వ్యక్తిని బురిడి కొట్టించే ప్రయత్నాన్ని SBI అధికారులు చాకచక్యంగా అడ్డుకున్నారు. ఈ సంఘటన హైదరాబాద్‌లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) లోతుకుంట బ్రాంచ్‌లో చోటుచేసుకుంది. ఇక వివరాల్లోకి వెళితే ఓ 78 ఏళ్ల సీనియర్ సిటిజన్ ఎస్బీఐ బ్రాంచ్‌ని సందర్శించారు.

ఆ క్రమంలో తన సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) మూసివేయాలని బ్రాంచ్ మేనేజర్‌ను కలిసి అభ్యర్థించారు. దానిలోని రూ. 30 లక్షలను ఓ సేవింగ్స్ బ్యాంక్ ఖాతాకు బదిలీ చేయాలని కోరారు. అదే సమయంలో కస్టమర్ మొబైల్‌కు మోసగాళ్ల నుంచి త్వరగా నగదు బదిలీ చేయాలని తరచుగా కాల్స్ రావడాన్ని మేనేజర్ గమనించారు. అయితే మొత్తం డబ్బులు ఎందుకని మేనేజర్ ప్రశ్నించగా ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన తన భార్య చికిత్స కోసం నిధులు అవసరమని కస్టమర్ చెప్పాడు.

ఆ క్రమంలో బ్యాంకు అధికారికి అనుమానం వచ్చి ఆస్పత్రి పేరు, పేషెంట్ వివరాలను అడిగారు. కానీ ఆ వివరాలతో పేషంట్ ఎవరు లేరని తేలింది. దీంతో మేనేజర్ పోలీసులకు సమాచారం అందించారు. ఆ క్రమంలో కస్టమర్ అసలు విషయం వెల్లడించారు. సీనియర్ సిటిజన్ తనకు మలేషియా నుంచి 16 పాస్‌పోర్ట్‌లు, ATM కార్డులతో కూడిన పార్శిల్ వచ్చాయని తనను తాను ఢిల్లీ కస్టమ్స్ ఆఫీసర్‌గా పరిచయం చేసుకున్న వ్యక్తి గురించి తెలిపారు. ఆ వ్యక్తి సీనియర్ సిటిజన్ పేరుతో ఆధార్ కార్డుల ఆధారంగా 30 బ్యాంకు ఖాతాలు తెరిచి రూ. 88 కోట్ల మనీలాండరింగ్ మోసానికి పాల్పడ్డారని బెదిరించినట్లు చెప్పారు.

ఆ కేసు తొలగిపోవాలంటే తమ ఖాతాకు డబ్బులను బదిలీ చేయాలని సైబర్ నేరగాళ్లు కోరారని పూర్తి వివరాలను వెల్లడించారు. దీంతో అది నిజం కాదని కస్టమర్‌కు అధికారులు సర్ది చెప్పి పంపించారు. అంతేకాదు బ్రాంచ్ సిబ్బంది జోక్యం సీనియర్ సిటిజన్ డబ్బును పోగొట్టుకోకుండా కాపాడారని SBI ఈ సందర్భంగా వెల్లడించారు. దీంతోపాటు డిజిటల్ మోసాలు/అరెస్టుల గురించి ఏదైనా తెలియని కాల్స్ వస్తే 1930 లేదా ప్రభుత్వ పోర్టల్ www.cybercrime.gov.inకి ఫిర్యాదు చేయాలని వినియోగదారులకు సూచించింది.

గతంలో కూడా ఇలాంటి ఘటనలు అనేకం చోటుచేసుకున్నాయి. ఇదే నెలలో ఓ ఉద్యోగికి పలువురు డిజిటల్ అరెస్ట్ పేరుతో ఫోన్ చేసి దాదాపు రూ.13 లక్షలు లూటీ చేశారు. దీనికంటే ముందు ఓ మహిళకు కాల్ చేసి ఏకంగా 37 లక్షలకు బురిడీ కొట్టించారు. ఈ విధంగా సైబర్ నేరగాళ్లు ప్రతి రోజు అనేక మందిని టార్గెట్ చేసుకుని దోచేందుకు ప్లాన్ చేస్తున్నారు. దీంతో ఇలాంటి వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని అధికారులు, పోలీసులు సూచిస్తున్నారు.

మహారాష్ట్ర కొత్త సీఎం ఎంపిక

గత కొన్ని రోజులుగా ఆసక్తిరేపిన మహారాష్ట్ర కొత్త సీఎం పేరు దాదాపు ఖరారైంది. మహారాష్ట్ర కొత్త సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ఎన్నికయ్యారు. ఇంకా ప్రకటన వెలువడనప్పటికీ, ఆయా వర్గాల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం, దేవేంద్ర ఫడ్నవీస్ పేరుపై ఏకాభిప్రాయం కుదిరింది.

మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి (Maharashtra CM) పేరు దాదాపు ఖరారైనట్లు తెలిసింది. మహారాష్ట్ర కొత్త సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis) ఎన్నికైనట్లు సమాచారం. ఆయా వర్గాల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం తెలిసింది. ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్‌లను ఉప ముఖ్యమంత్రులు చేయనున్నట్లు తెలుస్తోంది.

ఈ విషయంపై చర్చించేందుకు గురువారం రాత్రి మహాయుతి నేతలు దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ హోంమంత్రి అమిత్ షాను కలిసేందుకు ఢిల్లీ చేరుకున్నారు. ఈ సమావేశంలోనే ఈ సమీకరణ ఖరారైనట్లు సమాచారం.

బీజేపీ నేత ముఖ్యమంత్రి అయితే ఇరు పార్టీలకు ఎలాంటి అభ్యంతరం ఉండదని సమావేశంలో ఇరు పక్షాలు అంగీకరించాయి. ఢిల్లీలోని తన నివాసంలో మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన రెండు గంటల సుదీర్ఘ సమావేశం అర్ధరాత్రి ముగిసింది.

బ్యాడ్ న్యూస్ చెప్పిన రామ్ గోపాల్ వర్మ

తాను పరారీలో ఉన్నానంటూ వస్తోన్న వార్తలపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఘాటుగా స్పందించారు. తాను ఎక్కడికీ పారిపోలేదని, తన కార్యాలయం ఆర్జీవీ డెన్లోనే ఉంటోన్నానని వెల్లడించారు. తనను అరెస్ట్ చేయడానికి ఏ పోలీసూ రాలేదని తేల్చి చెప్పారు. దీనిపై నా కేసు- ఆర్జీవీ అంటూ ఓ సుదీర్ఘ ట్వీట్ పోస్ట్ చేశారు.

అరెస్ట్ నుంచి తప్పించుకోడానికి పరారీలో ఉన్నానని, మహారాష్ట్ర, చెన్నై లాంటి ఇతర రాష్ట్రాల్లో కూడా పోలీసులు తన కోసం వెతుకుతున్నరని ఆనందపదుతున్న వాళ్లందరికీ ఓ బ్యాడ్ న్యూస్ అంటూ ట్వీట్‌ను మొదలు పెట్టారు ఆర్జీవీ. భారత న్యాయసంహిత కింద ఎలాంటి కేసులు నమోదయ్యాయో.. అందులో ఏవి తనకు వర్తిస్తాయో, వర్తించవో కూడా వివరించారు.

ఇంత వరకు పోలీసులు తన ఆఫీసు లోకి కాలే పెట్టలేదని, పైగా అరెస్టు చేయడానికి వచ్చినట్లు తన మనుషులతో గానీ మీడియాతో గానీ చెప్పలేదని, తనను అరెస్టు చేయడానికే వస్తే ఆఫీసులోకి ఎందుకు రారు అని ప్రశ్నించారు. ఎప్పుడో ఒక సంవత్సరం క్రితం సోషల్ మీడియా అకౌంట్‌లో పెట్టాను అని అంటున్న కొన్ని మీమ్స్ వల్ల కేసు పెట్టారని, ఇప్పుడు సడెన్‌గా అసలు సంబంధం లేని వ్యక్తుల మనోభావాలు దెబ్బతినటం వల్ల కంప్లైంట్ ఇచ్చారట అని గుర్తుచేశారు.

నలుగురు వేర్వేరు వ్యక్తులు, ఏపీలోని నాలుగు వేర్వేరు జిల్లాల్లో తన మీద ఈ కేసు పెట్టారని, మీడియా చెబుతున్న దాని ప్రకారం మరో అయిదు కేసులు కూడా నమోదు అయ్యాయని, మొత్తంగా తొమ్మిది కేసులు ఈ నాలుగైదు రోజుల్లోనే నమోదయ్యాయిని ఆర్జీవీ వివరించారు.

పోలీసుల నుంచి నోటీసు అందిన వెంటనే, సినిమా పనుల వల్ల సంబంధిత అధికారిని కొంత సమయం కోరానని ఆర్జీవీ చెప్పారు. ఆయన కూడా దీనికి అనుమతి ఇచ్చారని వివరించారు. సినిమా పనులు పూర్తి కాకపోవడం వల్ల ఇంకొంత గడువు అడిగానని చెప్పారు. దీనికి అంగీకరించకపోతే వీడియో ద్వారా విచారణకు హాజరవుతాననీ తెలియజేశానని అన్నారు.

అదే సమయంలో తనపై వేర్వేరు ప్రాంతాల్లో కేసులు నమోదు అవ్వడం వెనక ఏదో కుట్ర ఉందని తనకు, తన తోటి వారికి అనుమానం కలిగిందని రామ్ గోపాల్ వర్మ అన్నారు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటానని, రోజుకు 10 నుంచి 15 పోస్టులు పెడుతుంటానని చెప్పుకొచ్చారు.

ఒక రాజకీయ వ్యంగ్య చిత్రానికి సంబంధించి సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇవ్వడం, ఆ చిత్రం విడుదల కావడం కూడా జరిగిపోయి చాలా నెలలు అయిందని ఆర్జీవీ గుర్తుచేశారు. నేను పెట్టాను అంటున్న ఆ పోస్టుల వల్ల తమ మనోభావాలు ఎలా దెబ్బ తిన్నాయని వేర్వేరు ప్రాంతాలకు చెందిన కొందరు వ్యక్తులు ఎలా అంటున్నారో వాటిని వివరించారు.

ఈ మీమ్స్ వల్ల తనపై బీఎన్ఎస్ కింద 336 (4), 353 (2), 356 (2), 61 (2), 196, 352, ఐటీ చట్టంలోని సెక్షన్ 67 కింద కేసులు నమోదయ్యాయని ఆర్జీవీ తెలిపారు. ఏవైనా డాక్యుమెంట్లు, ఎలక్ట్రానిక్ రికార్డులు, ఇతరులను మోసం చేయడానికి లేదా వారి పరువుకు భంగం కలిగించడానికి ఉద్దేశపూర్వకంగా నకిలీవి సృష్టించితే సెక్షన్ 336 (4) వర్తిస్తుందని, తాను చేసిన పోస్టులను చూస్తే, అందులో ఫోర్జరీ ఎక్కడుందని ప్రశ్నించారు.

అది కేవలం ఒక కార్టూన్, ఒకవేళ దీని వల్ల ఒకరి పరువుకు భంగం కలిగింది అంటే మరి కొన్ని లక్షల మంది ఇంకొన్ని లక్షల మంది మీద రోజు పెడుతున్న వాటి సంగతి ఏంటని అన్నారు. తప్పుడు సమాచారం, వదంతులు లేదా భయపెట్టే వార్తలను ప్రోత్సహించడం, మతం, జాతి, భాష లేదా ప్రాంతీయ సమూహాలు/కులాలు/వర్గాల మధ్య శత్రుత్వం, ద్వేషాన్ని పెంచడంపై బీఎన్ఎస్ 353 (2) సెక్షన్ కింద- కేసు నమోదు చేస్తారని, ఇది ఎలా వర్తిస్తుందో అర్థం కావట్లేదని అన్నారు.

పడవెనుక పడవ పెట్టి

నిండు గోదావరిలో పడవెనుక పడవను పెట్టి... నీటిలో మునిగి బకెట్‌తో లోపలున్న ఇసుకను తోడి.. పైకి తెచ్చి పడవలో నింపి ఒడ్డుకు చేర్చడం

నిండు గోదావరిలో పడవెనుక పడవను పెట్టి... నీటిలో మునిగి బకెట్‌తో లోపలున్న ఇసుకను తోడి.. పైకి తెచ్చి పడవలో నింపి ఒడ్డుకు చేర్చడం... నిత్యం అర్ధరాత్రి దాటిన తర్వాత రెండున్నర గంటల నుంచి నడి నెత్తికి సూర్యుడు వచ్చే మధ్యాహ్నం 12 గంటల వరకూ జరిగే తంతు ఇది. చిన్న పడవలో ఐదుగురు కార్మికులు కలిసి తొమ్మిది టన్నుల ఇసుకను ఒడ్డుకు చేరుస్తారు.

ఇలా 12 గంటల నిర్విరామ శ్రమతో నాలుగైదు ట్రిప్పులు వేస్తారు. టన్ను ఇసుక ఒడ్డుకు చేర్చినందుకు రూ.195లు ఇస్తారు. ఇక పెద్ద పడవలో అయితే పదిమంది కార్మికులు కలిసి 44 టన్నుల వరకూ ఇసుకను తీస్తారు. ఇవైతే రోజుకు రెండు ట్రిప్పులు వేస్తారు. ఈ ఇసుకపై సుమారు 3 వేల మంది ఉపాధి పొందుతున్నారు. ఒక్క తూర్పుగోదావరి జిల్లాలోనే బోట్స్‌మన్‌ సొసైటీలు 160 వరకూ ఉన్నాయి.

వాటి ద్వారా 1600 మంది ఉపాధి పొందుతున్నారు. ఇవికాక తూర్పుగోదావరి జిల్లా అఖండ గోదావరి ప్రాంతంలోని రాజమహేంద్రవరం వైపు గాయత్రి, కోటిలింగాల కొవ్వూరు ర్యాంపుల్లోనూ బోట్స్‌మన్‌ సొసైటీల ద్వారా డీసిల్టేషన్‌ పేరుతో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి.

ఈ ఇసుక తీసే పనిలో పడవలపై పనిచేసేవారంతా దాదాపు యూపీ, బిహార్‌ తదితర రాష్ర్టాల నుంచి వచ్చినవారే.