గ్రూప్-1 పిటిషన్లపై విచారణ నవంబర్ 26కు వాయిదా
గ్రూప్-1 నోటిఫికేషన్‌పై దాఖలైన పిటిషన్లను హైకోర్టు బుధవారం విచారించింది. విచారణ అనంతరం తదుపరి విచారణను నవంబర్ 26వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.
గ్రూప్-1 నోటిఫికేషన్‌పై దాఖలైన పిటిషన్లను హైకోర్టు బుధవారం విచారించింది. విచారణ అనంతరం తదుపరి విచారణను నవంబర్ 26వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. జీవో-29, ట్రాన్స్‌జెండర్ రిజర్వేషన్లు, లోకల్, నాన్ లోకల్ అంశాలపై దాఖలైన పిటిషన్లను హైకోర్టు డివిజన్ బెంచ్ విచారించింది.
కోర్టు తీర్పు వెలువడే వరకు గ్రూప్-1 ఫలితాలు విడుదల చేయొద్దని పిటిషన్ల తరపు అడ్వకేట్స్ డివిజన్ బెంచ్‌ను కోరారు. ఇందుకు జడ్జిలు అంగీకరించారు. అయితే అన్ని కేసులు కలిపి వింటామని జడ్జిలు చెప్పారు.
అన్ని పిటిషన్లను అదే వారంలో కంప్లీట్ చేద్దామని జడ్జిలు చెప్పినట్లు సమాచారం. ఈ పిటిషన్లపై కౌంటర్‌లకు ప్రభుత్వ తరపు అడ్వకేట్లు సిద్ధంగా ఉండాలని జడ్జిలు చెప్పారు. వాదనలకు పిటిషనర్ల తరపు అడ్వకేట్ సుధీర్‌కు కూడా అవకాశం ఇస్తామని జడ్జిలు వెల్లడించారు.
Nov 20 2024, 19:00