తెలంగాణలో అదానీ సామ్రాజ్యం
ప్రముఖ పారిశ్రామికవేత్త అదానీ విషయంలో కాంగ్రెస్ అధిష్ఠానం చేస్తున్న వ్యాఖ్యలకు, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి పొంతన కుదరడం లేదు. రాహుల్‌గాంధీ నిత్యం అదానీ లక్ష్యంగా కేంద్రంపై దాడి చేస్తుంటే, రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు మాత్రం అదానీకి రెడ్‌కార్పెట్ పరుస్తున్నది. సిమెంట్ పరిశ్రమలో గుత్తాధిపత్యం సాధించాలన్న అదానీ ప్రణాళికలకు రాష్ట్ర సర్కారు బాసటగా నిలుస్తూ తనవంతు సహకారం అందిస్తున్నది.
ప్రముఖ పారిశ్రామికవేత్త అదానీ విషయంలో కాంగ్రెస్ అధిష్ఠానం చేస్తున్న వ్యాఖ్యలకు, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి పొంతన కుదరడం లేదు. రాహుల్‌గాంధీ నిత్యం అదానీ లక్ష్యంగా కేంద్రంపై దాడి చేస్తుంటే, రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు మాత్రం అదానీకి రెడ్‌కార్పెట్ పరుస్తున్నది. సిమెంట్ పరిశ్రమలో గుత్తాధిపత్యం సాధించాలన్న అదానీ ప్రణాళికలకు రాష్ట్ర సర్కారు బాసటగా నిలుస్తూ తనవంతు సహకారం అందిస్తున్నది. తాజాగా అదానీ గ్రూప్‌కు చెందిన సిమెంట్ పరిశ్రమ కోసం నల్లగొండ జిల్లాలో సున్నపురాయి గనులను విస్తరించేందుకు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతున్నది.
ఇప్పటికే యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటలో అదానీ సిమెంట్ ప్లాంట్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ప్రజలు ఆం దోళన చేస్తుండగా, తాజాగా నల్లగొండ జిల్లా లో సున్నపురాయి గనిని విస్తరించేందుకు స న్నాహాలు చేస్తుంది. నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం గగన్‌పహాడ్‌లో ఉన్న పెన్నా సిమెంట్ ఇండస్ట్రీస్‌కు చెందిన చాణక్య సిమెం ట్స్ లైమ్‌స్టోన్ మైన్ విస్తరణపై 29న ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించనున్నట్టు పీసీబీ తెలిసింది. పెన్నా సిమెంట్ కంపెనీని ఆగస్టులో అదానీ గ్రూపు రూ.10,422 కోట్లకు టేకోవర్ చేసింది. అదానీకి చెందిన అంబుజా సిమెంట్ కు పెన్నా అనుబంధ కంపెనీగా మారిపోయిం ది. 875 ఎకరాల చాణక్య సిమెంట్ సున్నపురాయి గనిని విస్తరించాలని నిర్ణయించింది.
తెలంగాణలో సిమెంట్ ప్లాంట్ ఏర్పాటుకు రూ.1,400 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్టు ఇప్పటికే అదానీ గ్రూపు ప్రకటించింది. ఇందు లో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటలో 70 ఎకరాల్లో వచ్చే ఐదేండ్లలో సంవత్సరానికి ఆరు మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల సిమెంట్ ప్లాంట్‌ను ఏర్పాటుచేయాలని కంపెనీ నిర్ణయించింది. అంబుజా సిమెంట్ కంపెనీ ఏర్పాటు చేయనున్న ఈ పరిశ్రమ కోసం ఇటీవల పీసీబీ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టగా, ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. సిమెంట్ కంపెనీతో తమ జీవితాలు బుగ్గిపాలవుతాయని, ఎట్టి పరిస్థితిలోనూ అనుమతించేది లేదని స్థానికులు ఆందోళన చేపట్టారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత అదానీతో బంధం బలపడుతున్నట్టు పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రంలో ఏ ర్పాటు చేస్తున్న స్కిల్ యూనివర్సిటీకి అదానీ గ్రూపు రూ.100 కోట్లు విరాళం ఇచ్చారు. రాష్ట్రంలో విద్యుత్తు, సిమెంట్, డాటా సెంటర్లు తదితర రంగాల్లో రూ.12,400 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు జనవరిలో దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో ప్రభుత్వంతో ఒప్పందం కుదిరింది. అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, సీఎం రేవంత్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు.
డాటా సెంట ర్ ఏర్పాటుకు రూ.ఐదు వేల కోట్లు, గ్రీన్ ఎనర్జీకి సంబంధించిన రెండు పంప్ స్టోరేజ్ ప్రాజెక్టు(పీఎస్‌పీ)ల ఏర్పాటుకు ఐదు వేల కోట్లు, రక్షణ రంగంలో ఆర్‌అండ్‌డీ ఎకోసిస్టం ఏర్పాటుకు రూ.1,000 కోట్లు, సిమెంట్ ప్లాంట్ ఏర్పాటుకు రూ.1,400 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్టు కంపెనీ తెలిపింది. ఇప్పటికే పెన్నా సిమెంట్‌ను సొంతం చేసుకున్న అదానీ గ్రూ ప్.. రామన్నపేటలో సిమెంట్ ప్లాంట్ ఏర్పా టుకు సన్నాహాలు చేస్తున్నది. మరోవైపు, రా ష్ట్రంలో విద్యుత్తు పంపిణీ వ్యవస్థను ఇప్పటికే అదానీకి అప్పగించినట్టు వార్తలొస్తున్నాయి. ఇటీవల పాతబస్తీలో కరెంట్ మీటర్ల వివరాల ను ఆ గ్రూప్‌కు చెందిన సిబ్బంది సేకరించడంతో స్థానికులు తీవ్రంగా వ్యతిరేకించారు.
2028 నాటికి ఏటా 140 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం (ఎంటీపీఏ) సాధించాలని అంబుజా సిమెంట్స్ ప్రణాళికలు సిద్ధం చేసుకున్నది. ఇప్పటికే గుజరాత్‌లో పలు సిమెంట్ పరిశ్రమలను కొ నుగోలు చేయడం, పలు కంపెనీల్లో వా టాలు కొనుగోలు చేయడం ద్వారా ఉత్ప త్తి సామర్థ్యాన్ని భారీగా పెంచుకున్నది. అపార సున్నపురాయి గనులు ఉన్న పెన్నా సిమెంట్‌ను కూడా అదానీ గ్రూప్ కొనుగోలు చేసింది. దీంతోపాటు రామన్నపేటలో కొత్తగా సిమెంట్ ప్లాంట్ ఏర్పాటు ద్వారా ఇటు దక్షిణాది రాష్ర్టాలతోపాటు తూర్పు ప్రాంతానికి, అటు సీపోర్టు ద్వారా శ్రీలంకకు సిమెంట్ ఎగుమతి చేయవచ్చని అదానీ గ్రూప్ భావిస్తున్నది. ఇటీవలే బీహార్‌లో గ్రైండింగ్ యూనిట్ ఏర్పాటుకు 1,600 కోట్లు పెట్టుబడి పెట్టింది. బిర్లా గ్రూప్‌కు చెందిన అల్ట్రాటెక్‌ను అధిగమించి ప్రథమ స్థానానికి ఎగబాకేందుకు అదానీ గ్రూప్ అడుగులు వేస్తున్నది.
Nov 18 2024, 18:13