రిజిస్ట్రేషన్‌ల నిలిపివేత అప్రజాస్వామ్యం
రిజిస్ట్రేషన్‌ల నిలిపివేత అప్రజాస్వామ్యమని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. మల్కాజిగిరి సర్కిల్ పరిధిలోని వక్ఫ్ బోర్డు భూములని(Waqf Board Lands) కొన్ని సర్వే నంబర్లలో రిజిస్ట్రేషన్‌లను నిలిపివేయడంలో ప్రజలలో గందరగోళం ఏర్పడిందన్నారు.
రిజిస్ట్రేషన్‌ల నిలిపివేత అప్రజాస్వామ్యమని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. శుక్రవారం బోయిన్‌పల్లి క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే (MLA Rajasekhar Reddy) మాట్లాడుతూ.. మల్కాజిగిరి సర్కిల్ పరిధిలోని వక్ఫ్ బోర్డు భూములని(Waqf Board Lands) కొన్ని సర్వే నంబర్లలో రిజిస్ట్రేషన్‌లను నిలిపివేయడంలో ప్రజలలో గందరగోళం ఏర్పడిందన్నారు. కొన్ని దశాబ్దాలుగా అన్ని రకాల ప్రభుత్వ పన్నులు కట్టి 40గజాలు, 50గజాలు, 100గజాలలో పేదలు ఇండ్లు కట్టుకుని నివసిస్తున్నారని పేర్కొన్నారు.
ప్రభుత్వం విద్యుత్ కనెక్షన్‌లు, సీసీ రోడ్లు, స్ట్రీట్ లైట్లు, డ్రైనేజీ సౌకర్యం కల్పించాయి. పేదల కోసం వక్ఫ్ బోర్డు కొన్ని సవరణలు చేయాల్సిఉందని, లేదంటే ప్రజల పక్షాన నిలబడి వారికి చట్ట బద్దంగా న్యాయం జరిగేలా పోరాటం చేస్తామని అన్నారు. వక్ఫ్ బోర్డు తమ భూమిఅని చెబుతున్న సర్వే నంబర్ 398, 399లో దాదాపు 20ఎకరాల ఖాళీగా ఉన్న భూమి రిజిస్ట్రేషన్ చట్టం సెక్షన్ 22ఎ నిషేధిత జాబితాలో ఉన్న ఆ ఖాళీ భూమిని తమదంటూ ఇతరులు స్థానిక పోలీసుల సహకారంతో కబ్జాలో ఉన్నారని అన్నారు.
ఈ భూమిని కాపాడాల్సిన వక్ఫ్ బోర్డు సీఈఓ, జిల్లా ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఆడిటర్(వక్ఫ్), మూతవాలి వక్ఫ్ బోర్డు చట్టం సెక్షన్ 52ఎ కింద కేసులు నమోదు చేయడంలో విఫలమయరన్నారు. ఇప్పటికైనా ఆ భూమిని కాపాడాలని, కబ్జా చేసిన వారిపై వక్ఫ్ బోర్డు చట్టం సెక్షన్ 52ఎ కింద పోలీస్ స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. పేద ప్రజల కోసం న్యాయపరంగా ఏ సాయం చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని ఎమ్మెల్యే తెలిపారు.
Nov 15 2024, 18:38