TG: సంగెం భీమలింగేశ్వరుడి సాక్షిగా మూసీ ప్రక్షాళన చేసి తీరుతాం: సీఎం రేవంత్ రెడ్డి
యాదాద్రి జిల్లా, వలిగొండ మండలం:
మూసి పరివాహక ప్రాంత ప్రజలు కోరుకుంటున్నట్టుగానే సంగెం భీమలింగేశ్వరుడి సాక్షిగా మూసీ ప్రక్షాళన చేసి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. కాలుష్యమయమైన మూసీకి పునరుజ్జీవం తేవాలని, సీఎం తన జన్మదినం రోజున శుక్రవారం సంగెం మూసి పరివాహక ప్రాంతంలో పాదయాత్ర చేసి సంకల్పం తీసుకున్నారు.
ముందుగా సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం హైదరాబాదు నుండి వచ్చి యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు. తర్వాత అక్కడి నుంచి వలిగొండ మండలం సంగెం గ్రామం చేరుకుని సంగమస్థలి మూసీ ఒడ్డున భీమలింగం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం పడవలో ప్రయాణించి కలుషితాలతో ప్రవహిస్తున్న మూసీ ప్రవాహాన్ని పరిశీలించారు. మూసీ వెంట పాదయాత్ర చేస్తూ స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.
సంగెం - నాగిరెడ్డిపల్లి రోడ్డు మార్గంలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో ప్రసంగించారు. మూసీ కాలుష్య కాసారంగా మారిన కారణంగా తలెత్తుతున్న విష పరిణామాలను వివరించారు. సీఎం తన జన్మదినం రోజున దర్శించుకుని మూసీ పునరుజ్జీవం చేస్తామన్న సంకల్పం తీసుకోవడంతో జన్మ ధన్యమైందిగా భావిస్తానని చెప్పారు.
మూసీ పునరుజ్జీవ సంకల్పంలో భాగంగా 2025 జనవరి మొదటి వారంలో మూసీ, కృష్ణా నదిలో కలిసే వాడపల్లి నుండి చార్మినార్ వరకు పాదయాత్ర చేపడుతానని ప్రకటించారు.మూసీ కాలుష్యం అణుబాంబు కన్నా ప్రమాదకరంగా మారిందని, పరీవాహక ప్రాంతాలకు వరంగా ఉండాల్సిన మూసీ శాపంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు.
కొందరు మూసీ ప్రక్షాళనను అడ్డుకోవాలని చూస్తున్నారని, అలా చేస్తే పౌరుషాల గడ్డ నల్గొండ జిల్లా ప్రజలు తగిన సమాధానం చెబుతారని అన్నారు. అనంత పద్మనాభుడి పాదాల చెంత పుట్టిన మూసీని ప్రక్షాళన చేయడానికి దేవుడు తనకు ఒక అవకాశం ఇచ్చారని, ప్రతి ఒక్కరూ జెండాలు, ఎజెండాలు పక్కన పెట్టి ప్రజలను కాపాడాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు.
రేవంత్ రెడ్డి పైన నల్గొండ గద్దర్ నర్సన్న పాడిన కొత్త పాటను విడుదల చేశారు. అలాగే సంగెం గ్రామానికి చెందిన సురుకంటి రాజేందర్ మూసీ ప్రక్షాళన అంశంపై రాసిన పుస్తకాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి లతో పాటు ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

యాదాద్రి జిల్లా, వలిగొండ మండలం:
ముందుగా సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం హైదరాబాదు నుండి వచ్చి యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు. తర్వాత అక్కడి నుంచి వలిగొండ మండలం సంగెం గ్రామం చేరుకుని సంగమస్థలి మూసీ ఒడ్డున భీమలింగం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఎస్సై లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన ఘటన నిజామాబాద్ జిల్లాలో జరిగింది.
నల్లగొండ: ఈనెల 11 ,12,13 తేదీలలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరిగే రాష్ట్ర 68 వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ బాలికల U/17 రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు, ఉమ్మడి నల్లగొండ జిల్లా జట్టు ఎంపిక ప్రక్రియను, పట్టణంలోని మేకల అభినవ్ స్టేడియంలో శుక్రవారం నల్లగొండ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ దగ్గుపాటి విమల ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బాలికలు పాఠశాల స్థాయి నుండి క్రీడల పై ఆసక్తి పెంచుకోవడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుందని చెప్పారు. ఈ ఎంపికల ప్రక్రియలో ఉమ్మడి జిల్లా నుండి 80 మంది క్రీడాకారిణిలు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ వ్యాయమ ఉపాధ్యాయులు మెర్సీ ప్రభావతి, రవీందర్, బోనగిరి శ్రీనివాసులు, గుండా శ్రీనివాస్, కవిత, ఇమామ్ కరీం, శంభు లింగం, గఫర్ తదితరులు పాల్గొన్నారు.
నల్లగొండ జిల్లా:
నల్గొండ: పట్టణంలోని బొట్టుగూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10 వ తరగతి చదువుతున్న విద్యార్థిని లుబ్నంతన్వీర్, మేడ్చల్ జిల్లాలో జరగబోయే స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్రస్థాయి అండర్ 17 బాలికల చెస్ పోటీలకు ఎంపికైందని శుక్రవారం, ప్రధానోపాధ్యాయులు తీగల శంకరయ్య తెలిపారు. ఈ మేరకు ఆయన విద్యార్థిని అభినందించారు.
ఫిజికల్ డైరెక్టర్ బొమ్మపాల గిరిబాబు, ఉపాధ్యాయులు విద్యార్థినిని అభినందించి, చెస్ క్రీడలో ఉన్నత స్థాయి క్రీడాకారిణిగా రాణించాలని ఆకాంక్షించారు.
హనుమకొండ: భద్రకాళి చెరువు పూడికతిత పనులకు ముందస్తు చర్యలలో భాగంగా, కాపువాడ సమీపంలో ఉన్న భద్రకాళి చెరువు మత్తడితో పాటు.. కాపువాడ వద్ద ఉన్న నీటి కాలువ ను జిడబ్ల్యూఎంసి కమిషనర్ మరియు సంబంధిత అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య పరిశీలించారు.
యాదాద్రి జిల్లా:
HYD: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఈ నెల 17, 18 తేదీలలో నిర్వహిస్తున్న గ్రూప్-III పరీక్ష పరీక్షలకు మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లాలో మొత్తం 115 పరీక్షా కేంద్రాలలో 65,361 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని మేడ్చెల్ మల్కాజిగిరి జల్లా కలెక్టరు గౌతం పొట్రు ఒక ప్రకటనలో తెలిపారు.
నల్లగొండ: కలెక్టర్ ఇలా త్రిపాటి ఇంటికి సర్వే నిమిత్తం వచ్చిన ఎన్యుమరేటర్ కు జిల్లా కలెక్టర్ తన ఇంటి వివరాలు తెలిపారు.
Nov 09 2024, 11:17
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
4- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
9.9k