త్వరలో సిటీ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ బస్సులు
హైదరాబాద్ నగరం వేగంగా అభివృద్ధి చెందుతోంది. సిటీలో అదే జనాలు పెరుగుతోన్నారు. అదే స్థాయిలో వాహనాలు పెరుగుతోన్నాయి. ఇందులో 90 శాతానికి పైగా పెట్రోల్, డీజిల్ వాహనాలు ఉన్నాయి. దీంతో భాగ్యనగరంలో కాలుష్యం పెరుగుతోంది. ఇప్పుడిప్పుడు కొంత మంది ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేస్తున్నారు. ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య చాలా తక్కువగా ఉంది. భవిష్యత్ లో హైదరాబాద్ లో వాయు కాలుష్యం భారీగా పెరిగే అవకాశం ఉంది. ఇదే జరిగితే నగరవాసులు తీవ్ర ఇబ్బందుల పడనున్నారు.
ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీలో వాయి కాలుష్యం భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రోడ్ రవాణా సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రెసెంట్ నగరంలో తిరుగుతున్న పాత డీజిల్ బస్సులన్నింటినీ దశల వారీగా నిలివేయాలని భావిస్తోన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లో ఇప్పుడు 100 ఎలక్ట్రిక్బస్సులు తిప్పుతున్నారు. డిసెంబర్ నాటికి సిటీలో మరో 500 బస్సులు తిప్పాలని యోచిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కొద్ది రోజుల క్రితం ఆర్టీసీ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
గ్రేటర్పరిధిలో పూర్తిగా ఎలక్ట్రిక్ బస్సులు నడపాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మొదటగా సెంట్రల్ యూనివర్సిటీ డిపో పరిధిలో 69 ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొచ్చారు. డిపోలన్నిటిలో కూడా ఎలక్ట్రిక్ బస్సులు తీసుకురానున్నారు. సిటీలో దశల వారీగా 2,500 ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం సికింద్రాబాద్- పటాన్చెరుమధ్య 19 ఎలక్ట్రిక్ బస్సులు, కొండాపూర్- సికింద్రాబాద్ రూట్ 10, లింగంపల్లి- కోఠి మధ్య లో 13 ఎలక్ట్రిక్ బస్సులు నడిపిస్తున్నారు.
లింగంపల్లి- మెహదీపట్నం మధ్య 10 బస్సులు నడుస్తున్నాయి. జేఎన్టీయూ - మెహిదీపట్నం మధ్యలో 5 ఎలక్ట్రిక్ బస్సులు సేవలు అందిస్తున్నాయి. సిటీలో ఆర్టీసీ పూర్తిగా ఎలక్ట్రిక్ బస్సులను నడిపిస్తే వాయు కాలుష్యం తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. అలాగే హైదరాబాద్ పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు ముందుకు వస్తాయి.
Oct 30 2024, 13:12