రంగారెడ్డి కలెక్టర్‌గా నారాయణరెడ్డి
రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా శ్రీపురం నారాయణరెడ్డి(Sripuram Narayana Reddy)ని ప్రభుత్వం నియమించింది. ప్రస్తుత కలెక్టర్ శశాంకను కొత్తగా చేపడుతున్న ఫ్యూచర్‌సిటీ, ఇతర ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు కమిషనర్‌గా నియమించింది. వాస్తవానికి కొద్దిరోజులుగా రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లు బదిలీ అవుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా శ్రీపురం నారాయణరెడ్డి(Sripuram Narayana Reddy)ని ప్రభుత్వం నియమించింది. ప్రస్తుత కలెక్టర్ శశాంకను కొత్తగా చేపడుతున్న ఫ్యూచర్‌సిటీ, ఇతర ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు కమిషనర్‌గా నియమించింది. వాస్తవానికి కొద్దిరోజులుగా రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లు బదిలీ అవుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ప్రభుత్వం సోమవారం జిల్లా కలెక్టర్‌ను బదిలీ చేసి ఆయన స్థానంలో నల్గొండ కలెక్టర్‌గా పనిచేస్తున్న సి.నారాయణరెడ్డిని నియమించింది. ఉమ్మడి మహబూబ్‌నగర్(Mahbubnagar) జిల్లాలోని నర్వ మండలానికి చెందిన నారాయణరెడ్డి.. ఇంతకుముందు వికారాబాద్, నిజామాబాద్, ములుగు జిల్లాల కలెక్టర్‌గా పనిచేశారు. సోమవారం రాత్రి ఆయన బాధ్యతలు స్వీకరించారు.
ఇప్పటిదాకా రంగారెడ్డి కలెక్టర్‌గా పనిచేసిన శశాంక ఇక్కడ 10 నెలలే పనిచేశారు. ఆయన పాలనాపరంగా తనదైన ముద్ర వేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నగర శివార్లలోని అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములపై దృష్టిసారించింది. దీంతో ఆయన ఎక్కువగా రెవెన్యూ వ్యవహారాలే చూశారు. జిల్లాలోని పలు భూ కుంభకోణాలను వెలికితీశారు. రెవెన్యూ వ్యవస్థను గాడిలో పెట్టే యత్నం చేశారు. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా పనిచేశారు.
నిక్కచ్చిగా వ్యవహరించడం కూడా కొందరు రాజకీయనేతలకు నచ్చలేదు. ఆయన బదిలీ కోసం కొన్నాళ్లుగా తెరవెనుక తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఆయన బదిలీ అనివార్యమని గత జూన్ నుంచే ప్రచారం జరిగింది. ప్రభుత్వం అప్పగించిన పనులను సమర్థంగా నిర్వహించడంతో ఆయనకు ప్రభుత్వం మరో కీలక బాధ్యత అప్పగించింది. ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఫ్యూచర్‌సిటీ ప్రాజెక్టుతోపాటు ఇతర ముఖ్య ప్రాజెక్టులకు కమిషనర్‌గా నియమించింది.
Oct 29 2024, 11:17