రంగారెడ్డి కలెక్టర్‌గా నారాయణరెడ్డి

రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా శ్రీపురం నారాయణరెడ్డి(Sripuram Narayana Reddy)ని ప్రభుత్వం నియమించింది. ప్రస్తుత కలెక్టర్‌ శశాంకను కొత్తగా చేపడుతున్న ఫ్యూచర్‌సిటీ, ఇతర ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు కమిషనర్‌గా నియమించింది. వాస్తవానికి కొద్దిరోజులుగా రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల కలెక్టర్లు బదిలీ అవుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా శ్రీపురం నారాయణరెడ్డి(Sripuram Narayana Reddy)ని ప్రభుత్వం నియమించింది. ప్రస్తుత కలెక్టర్‌ శశాంకను కొత్తగా చేపడుతున్న ఫ్యూచర్‌సిటీ, ఇతర ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు కమిషనర్‌గా నియమించింది. వాస్తవానికి కొద్దిరోజులుగా రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల కలెక్టర్లు బదిలీ అవుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ప్రభుత్వం సోమవారం జిల్లా కలెక్టర్‌ను బదిలీ చేసి ఆయన స్థానంలో నల్గొండ కలెక్టర్‌గా పనిచేస్తున్న సి.నారాయణరెడ్డిని నియమించింది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌(Mahbubnagar) జిల్లాలోని నర్వ మండలానికి చెందిన నారాయణరెడ్డి.. ఇంతకుముందు వికారాబాద్‌, నిజామాబాద్‌, ములుగు జిల్లాల కలెక్టర్‌గా పనిచేశారు. సోమవారం రాత్రి ఆయన బాధ్యతలు స్వీకరించారు.

ఇప్పటిదాకా రంగారెడ్డి కలెక్టర్‌గా పనిచేసిన శశాంక ఇక్కడ 10 నెలలే పనిచేశారు. ఆయన పాలనాపరంగా తనదైన ముద్ర వేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం నగర శివార్లలోని అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములపై దృష్టిసారించింది. దీంతో ఆయన ఎక్కువగా రెవెన్యూ వ్యవహారాలే చూశారు. జిల్లాలోని పలు భూ కుంభకోణాలను వెలికితీశారు. రెవెన్యూ వ్యవస్థను గాడిలో పెట్టే యత్నం చేశారు. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా పనిచేశారు.

నిక్కచ్చిగా వ్యవహరించడం కూడా కొందరు రాజకీయనేతలకు నచ్చలేదు. ఆయన బదిలీ కోసం కొన్నాళ్లుగా తెరవెనుక తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఆయన బదిలీ అనివార్యమని గత జూన్‌ నుంచే ప్రచారం జరిగింది. ప్రభుత్వం అప్పగించిన పనులను సమర్థంగా నిర్వహించడంతో ఆయనకు ప్రభుత్వం మరో కీలక బాధ్యత అప్పగించింది. ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఫ్యూచర్‌సిటీ ప్రాజెక్టుతోపాటు ఇతర ముఖ్య ప్రాజెక్టులకు కమిషనర్‌గా నియమించింది.

బాణాసంచా కాల్చే సమయంలో భారీ ప్రమాదం.

కేరళలోని కాసర్‌గోడ్‌ నుంచి విషాదకరమైన వార్త వెలుగులోకి వచ్చింది. కేరళ టెంపుల్ ఫెస్టివల్ సందర్భంగా ఇక్కడ బాణాసంచా నిల్వలో భారీ పేలుడు సంభవించింది. దీంతో అక్కడ భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 150 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉంది. నీలేశ్వరం సమీపంలోని ఓ ఆలయంలో సోమవారం అర్థరాత్రి ఈ ఘోర ప్రమాదం జరిగింది.

ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను కాసరగోడ్, కన్నూర్, మంగళూరులోని ఆసుపత్రులకు తరలించారు. ఆందోళనకర పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని కలెక్టర్, జిల్లా పోలీసు ఉన్నతాధికారులు సహా జిల్లా అధికార యంత్రాంగం సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధిత ప్రజలను ఆదుకునేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.

వీరకవు దేవాలయం సమీపంలోని ఓ దుకాణంలో బాణసంచా ఉంచినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అందులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం జరిగింది. సంఘటనా స్థలంలో కలెక్టర్‌, జిల్లా పోలీసు ఉన్నతాధికారులతో పాటు జిల్లా యంత్రాంగంలోని ఉన్నతాధికారులు ఉన్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

అంజుతాంబలం వీరర్కవు ఆలయంలో వార్షిక కాళియాట్టం ఉత్సవం జరుపుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. కార్యక్రమానికి బాణాసంచా ఆర్డర్ చేశారు. దానిని స్టోరేజీలో భద్రంగా ఉంచారు. ఇంతలో రాత్రి 12.30 గంటల సమయంలో ఒక్కసారిగా స్టోరేజీలో పెద్ద పేలుడు సంభవించింది. అక్కడ పటాకులన్నీ ఒకదాని తర్వాత ఒకటి కాల్చడం ప్రారంభించాయి. ఏమైందంటే స్టోరేజీలో భారీగా మంటలు చెలరేగాయి. ఆ సమయంలో అక్కడ పెద్ద ఎత్తున జనం కూడా ఉన్నారు. గుంపులో ఉన్న వ్యక్తులు ఈ మంటలను వీడియోలు చేయడం ప్రారంభించారు. మంటలు విపరీతంగా ఉండడంతో ఒక్క క్షణంలో 150 మందికి పైగా మంటల్లో చిక్కుకున్నారు.

వెంటనే అందరినీ ఆసుపత్రిలో చేర్పించారు. 8 మంది పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే అగ్నిమాపక వాహనాలను రప్పించారు. చాలా శ్రమ తర్వాత మంటలు అదుపులోకి వచ్చాయి. పలువురు ఉన్నతాధికారులు అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. క్షతగాత్రులకు అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పారు.

మోమోస్ తిని ఫుడ్ పాయిజన్.. ఒకరు మృతి, 20 మందికి పైగా అస్వస్థత

హైదరాబాద్‌లోని నందినగర్‌లో విషాదం చోటుచేసుకుంది. నంది నగర్‌లో మోమోస్ తిని ఓ మహిళ మృతి చెందగా.. మరో 20 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. బాధితులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తు్న్నారు. నందినగర్‌లో వారాంతపు సంతలో పెట్టిన మోమోస్‌ను బాధితులు తిన్నట్లు తెలిసింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 20 మందికి పైగా అస్వస్థతకు గురి కాగా.. బాధితులు ఇంకా పెరుతున్నారు.

పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. మృతురాలు సింగాడికుంటకు చెందిన మహిళగా గుర్తించారు. ఈ ఘటనపై బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారాంతపు సంతలో మోమోస్ పెట్టారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఒక్కొక్కరిగా బాధితులు బయటికి వస్తున్నారు. బంజారాహిల్స్ పరిధిలో జరిగే వీక్లీ మార్కెట్లలో మోమోస్ విక్రయాలు జరిగాయి. సింగాడికుంట, నందినగర్, వెంకటేశ్వర కాలనీలతో పాటు పలు ప్రాంతాల్లో మోమోస్ బాధితులు ఉన్నట్లు తెలిసింది

మోమోస్ తిని గత వారం తీవ్ర అస్వస్థతతో హాస్పిటల్‌కు చేరిన రేష్మ అనే మహిళా.. చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతురాలి కుమారుడి ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. మోమోస్ షాప్ నిర్వహిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇది వైసీపీ కాదు.. కూట‌మి ప్ర‌భుత్వం జాగ్ర‌త్త‌: ప‌వ‌న్‌

ఇది వైసీపీ ప్ర‌భుత్వం కాదు. ఎవ‌రికి న‌చ్చిన‌ట్టు వారు చేయ‌డానికి. ఎవ‌రికి ఇష్టం వ‌చ్చిన‌ట్టు వారు వ్య‌వహరించ‌డానికి నిధులు దారి మ‌ళ్లించ‌డానికి. ఇది కూట‌మి ప్ర‌భుత్వం అన్న విష‌యం గుర్తు పెట్టుకోండి. ప్ర‌తి పైసాకు.. లెక్క ఉంటుంది. ప్ర‌తి రూపాయికీ జ‌వాబుదారీ త‌నం ఉంటుంది అని ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ తేల్చి చెప్పారు.

తాజాగా ఆయ‌న పంచాయ‌తీరాజ్ శాఖ అధికారుల‌తో వీసీ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా పంచాయ‌తీల‌కు కేంద్రం నుంచి వ‌చ్చిన నిధుల‌పై ఆరా తీశారు.

ఆయా నిధుల‌ను ఎలా ఖ‌ర్చు చేస్తున్నారో.. పూర్తి వివ‌రాలు ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉండాల‌ని ప‌వ‌న్ సూచించారు. “అందుబాటులో అంటే.. అర్ధం కాని వివ‌రాలు, ఇంగ్లీష్‌లో ఉండ‌డం కాదు. ప‌దో త‌ర‌గ‌తి చ‌దువుకున్న వారికి కూడా.. మ‌నం ఏం చేస్తున్నామో.. చ‌ద‌వ‌గానే అర్ధం కావాలి. ప్ర‌తి రూపాయికీ లెక్క చూపించాలి. ప్ర‌తి గ్రామంలోనూ చేప‌ట్టిన ప‌నులు.. ఎవ‌రు చేస్తున్నారు. ఏయే ప‌నుల‌కు ఎంతెంత ఖ‌ర్చు చేస్తున్నాం అనే వివ‌రాలు స్ప‌ష్టంగా ఉండాలి” అని ప‌వ‌న్ ఆదేశించారు.

గ‌తంలో వైసీపీ హ‌యాంలో కేంద్రం నుంచి పంచాయ‌తీల‌కు వ‌చ్చిన నిధుల‌ను దారి మ‌ళ్లించార‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఇప్పుడు కూట‌మి స‌ర్కారుపై గ్రామీణులు చాలానే ఆశలు పెట్టుకున్నార‌ని తెలిపారు. వారి ఆశ‌లు వ‌మ్ముకావ‌డానికి వీల్లేద‌ని.. ప్ర‌తి రూపాయినీ వారికి చెప్పాల‌ని అన్నారు. కేంద్రం నుంచి వ‌స్తున్న ప్ర‌తిరూపాయీ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి బ‌ద‌లాయించాల‌న్నారు. అదేవిధంగా అధికారులు జ‌వాబు దారీ త‌నంతో వ్య‌వ‌హ‌రించాల‌ని సూచించారు.

ఇక‌, ప‌ల్లె -పండుగ‌, పంచాయ‌తీ వారోత్స‌వాల్లో అనుమ‌తించిన ర‌హ‌దారుల నిర్మాణం, మంచినీటి పైపు లైన్ల నిర్మాణాల‌కు సంబంధించిన ప‌నులను వేగంగా పూర్తి చేయాల‌ని చెప్పారు. ఈ ప‌నులు అత్యంత నాణ్యంగా ఉండాల‌ని.. సొంత ఇంటికి ఎలా అయితే.. శ్ర‌ద్ధ‌తో ప‌నులు చేయించుకుంటారో.. అలానే ఈ ప‌నులు కూడా ఉండాల‌ని అధికారుల‌కు హిత‌వు ప‌లికారు. ముఖ్యంగా ఇది వైసీపీ ప్ర‌భుత్వం కాద‌న్న విష‌యాన్ని గుర్తుంచుకోవాల‌ని ప‌దే పదే చెప్ప‌డం గ‌మ‌నార్హం.

ఈ రోజు పంచాంగం

తెలుగు పంచాంగం ప్రకారం, అశ్విని మాసంలోని రామ ఏకాదశి తిథి నాడు, సోమవారం ఈరోజున రాహుకాలం, దుర్ముహుర్తం, సూర్యోదయం, సూర్యాస్తమయంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాల గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

తెలుగు పంచాంగం ప్రకారం, శ్రీ క్రోధి నామ సంవత్సరంలో అక్టోబర్(October) 28వ తేదీన యమగండం, విజయ ముహుర్తం, బ్రహ్మా ముహుర్తాలు, అశుభ ఘడియలు ఎప్పుడెప్పుడొచ్చాయనే పూర్తి వివరాలను ఆచార్య కృష్ణ దత్త శర్మ మాటల్లో తెలుసుకుందాం...

రాష్ట్రీయ మితి కార్తీక 06, శాఖ సంవత్సరం 1945, అశ్విని మాసం, క్రిష్ణ పక్షం, ఏకాదశి తిథి, విక్రమ సంవత్సరం 2080. రబీ-ఉల్సాని 24, హిజ్రీ 1446(ముస్లిం), AD ప్రకారం, ఇంగ్లీష్ తేదీ 28 అక్టోబర్ 2024 సూర్యుడు దక్షిణయానం, రాహుకాలం ఉదయం 7:30 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు. ఏకాదశి తిథి ఉదయం 7:51 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత ద్వాదశి తిథి ప్రారంభమవుతుంది. ఈరోజు పూర్వఫాల్గుణి నక్షత్రం మధ్యాహ్నం 3:24 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత ఉత్తర ఫాల్గుణి నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు చంద్రుడు సింహం నుంచి కన్యా రాశిలో సంచారం చేయనున్నాడు.

నేడు శుభ ముహుర్తాలివే..

బ్రహ్మ ముహుర్తం : ఉదయం 4:48 గంటల నుంచి ఉదయం 5:39 గంటల వరకు

విజయ ముహుర్తం : మధ్యాహ్నం 1:56 గంటల నుంచి మధ్యాహ్నం 2:41 గంటల వరకు

నిశిత కాలం : అర్ధరాత్రి 11:39 గంటల నుంచి రాత్రి 12:31 గంటల వరకు

సంధ్యా సమయం : సాయంత్రం 5:39 గంటల నుంచి సాయంత్రం 6:05 గంటల వరకు

అమృత కాలం : ఉదయం 6:30 గంటల నుంచి ఉదయం 7:54 గంటల వరకు

సూర్యోదయం సమయం 28 అక్టోబర్ 2024 : ఉదయం 6:30 గంటలకు

సూర్యాస్తమయం సమయం 28 అక్టోబర్ 2024: సాయంత్రం 5:39 గంటలకు

నేటి ఉపవాస పండుగ : ఏకాదశి వ్రతం, గోవత్స ద్వాదశి

నేడు అశుభ ముహుర్తాలివే..

రాహు కాలం : ఉదయం 7:30 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు

గులిక్ కాలం : మధ్యాహ్నం 1:30 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు

యమ గండం : ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు

దుర్ముహుర్తం : మధ్యాహ్నం 12:27 గంటల నుంచి మధ్యాహ్నం 1:11 గంటల వరకు, ఆ తర్వాత మధ్యాహ్నం 2:41 గంటల నుంచి మధ్యాహ్నం 3:25 గంటల వరకు

నేటి పరిహారం : ఈరోజు శ్రీ మహావిష్ణువును పూజించి, తులసిలో దీపం వెలిగించాలి.

స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగుల కోటా తేల్చాలని డిమాండ్

స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగుల కోటా తేల్చాలని డిమాండ్ చేస్తూ భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ ఆధ్వర్యంలో నల్గొండలో జాతీయ రహదారి 565 ను దిగ్భందించిన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ బృందం

స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగుల కోట తేల్చేంతవరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ పై సమరం తప్పదని డిసెంబర్ 3 అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం లోపు స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగుల కోట తేల్చకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ కేంద్రంగా వేలాదిమంది వికలాంగులతో ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని స్వష్టం చేసిన రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్

స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగుల కోట తేల్చేంతవరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ పై సమరం తప్పదని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ అన్నారు డిసెంబర్ 3 అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవంలోపు స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం నల్గొండలో సంఘం నేతలతో కలిస జాతీయ రహదారి 565 దిబ్బందించిన ఆయన దిబ్బందనం కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ 78 ఏళ్ల స్వతంత్ర భారతవనిలో రాజ్యాధికారానికి దూరమై దుర్భర జీవితాలు గడుపుతున్న వికలాంగుల సమస్యలపై వికలాంగుల ఓట్లతో గద్దేనెక్కిన సకలాంగుల ప్రజాప్రతినిధులు వికలాంగుల సమస్యలపై చట్టసభల్లో చర్చించకుండా అడుగడుగున వికలాంగుల సంక్షేమాన్ని విస్మరిస్తున్నారని విద్య ఉద్యోగ రంగాల్లో వికలాంగులకు రిజర్వేషన్ మాదిరిగానే చట్టసభల్లోను వికలాంగులకు రిజర్వేషన్ కల్పిస్తేనే వికలాంగులకు సామాజిక న్యాయం చేకూరుతుందని లేకుంటే సకలాంగుల పాలకుల చేతుల్లో వికలాంగుల సంక్షేమం పత్రికల్లో ప్రచురణకే పరిమితమవుతుందని అందుకు ఉదాహరణ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల ముందు

అధికారంలోకొస్తే మరుసటి నెల నుంచే వికలాంగుల పెన్షన్ 6000 కు పెంచుతామని ఆర్టీసీలో వికలాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తామని రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టం 2016 సమర్థవంతంగా అమలు చేస్తామని అనేక హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వికలాంగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకపోవడమేనని డిసెంబర్ 3 అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం లోపు స్థానిక సంస్థలు ఎన్నికల్లో వికలాంగుల రిజర్వేషన్ కల్పించి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వికలాంగుల పెన్షన్ 6000 పెంచి ఆర్టీసీలో వికలాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేయాలని లేకుంటే

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ కేంద్రంగానే వేలాదిమంది వికలాంగులతో ఆమరణ దీక్షకు దిగుతామని స్వష్టం చేశారు సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షుడు చిన్నపాక మత్స్యగిరి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర మహిళా నాయకురాలు గుడిపల్లి సుమతి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కావలి నర్సిసింహులు సంఘం వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు పోతురాజు సుధీర్ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వరంగల్ జిల్లా అధ్యక్షులు మహమ్మద్ షరీఫ్ సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షులు గోగుల శేఖర్ రెడ్డి సంఘం జిల్లా మహిళా నాయకురాలు గుండెబోయిన అలివేలు సంఘం మునుగోడు మండల ఉపాధ్యక్షులు ఒంటేపాక ముత్తయ్య సంఘం చండూరు మండలం అధ్యక్షుడు ఆకారపు వెంకన్న సంఘం మునుగోడు మండల అధ్యక్షులు సహదేవుడు సంఘం వర్ధన్నపేట అధ్యక్షులు జేట్టబోయిన శ్రీనివాస్ సంఘం రాయపర్తి మండల అధ్యక్షులు ఇస్లావత్ బాలకృష్ణ సంఘం సూర్యాపేట జిల్లా నాయకులు చెక్కా లక్ష్మణరావు సంఘం చండూరు మండల అధ్యక్షురాలు కారింగుల రేణుక సంఘం చెండూరు మండలం యూత్ అధ్యక్షులు శ్రీకాంత్ తదితరులు జేట్టబోయిన మౌనిక పాల్గొన్నారు

నాగార్జున సాగర్, శ్రీశైలం వెళ్ళే పర్యాటకులకు ఎగిరి గంతేసే వార్త

శ్రీశైలం ప్రాజెక్టు, నాగార్జునసాగర్ ప్రాజెక్టు జలకళను సంతరించుకున్న వేళ ఈ రెండు ప్రాజెక్టులను ఇటీవల పర్యాటకులు అధిక సంఖ్యలో దర్శించి కృష్ణమ్మ పరవళ్లను చూస్తూ అద్భుతమైన అనుభూతిని పొందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో హైదరాబాద్ నుండి సాగర్ వరకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిన విషయం కూడా తెలిసిందే.

ఇక ఇదే క్రమంలో పరవళ్ళు తొక్కుతున్న కృష్ణా నదిపైన నాగార్జునసాగర్ నుంచి శ్రీశైలం వరకు బోట్ షికారు చేసేలా పర్యటకుల కోసం పర్యాటక అభివృద్ధి సంస్థ త్వరలోనే లాంచీలను ప్రారంభించునుంది. నవంబర్ రెండవ తేదీ నుంచి నాగార్జునసాగర్ శ్రీశైలం మధ్య లాంచి ప్రయాణం అందుబాటులోకి రానుంది. ఈ మేరకు పర్యాటక అభివృద్ధి సంస్థ వాటర్ ఫ్లీట్ జనరల్ మేనేజర్ ఇబ్రహీం ఒక ప్రకటనలో తెలిపారు.

పరవళ్ళు తొక్కే కృష్ణ నది అందాలను ఆస్వాదిస్తూ ఆ చుట్టుపక్కల ఉన్న ప్రకృతి సౌందర్యాన్ని వీక్షిస్తూ నాగార్జునసాగర్ నుండి శ్రీశైలానికి ప్రయాణించే కొత్త అనుభూతి ఇకపై పర్యాటకులకు కలగనుందని ఆయన తెలిపారు. ఒకవైపు నల్లమల అటవీ ప్రాంతం తో పాటు మరోవైపు కృష్ణమ్మ పరవళ్లతో పచ్చని ప్రకృతి దృశ్యం మధ్య సాగే ప్రయాణం ఆద్యంతం మరువలేని స్మృతులను మిగులుస్తుందన్నారు.

ప్రకృతి ప్రేమికులు, పర్యాటకులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. నాగార్జునసాగర్ నుంచి శ్రీశైలం వరకు జరిగే ఈ ప్రయాణం దాదాపు 7 గంటల పాటు జరుగుతుందని, పక్షుల కిలకిల రావాలతో, జలసవ్వడితో, ప్రకృతి కాంత సోయగాలతో మనసుకు ఆహ్లాదాన్ని ఇస్తుందని, కచ్చితంగా ఈ లాంచి ప్రయాణం కొత్త అనుభూతిని నింపుతుందని ఆయన పేర్కొన్నారు.

నవంబర్ 2 నుంచి లాంచీ ప్రయాణం

నాగార్జునసాగర్ నుంచి శ్రీశైలం కు బోట్ షికారు చేయాలనుకునేవారు ఒకవైపుకు మాత్రమే ప్రయాణం చేయాలంటే పెద్దలకు రూ. 2000 పిల్లలకు 1600 గా నిర్ణయించినట్లు తెలిపారు. అదే రెండు వైపులా బోట్ ద్వారానే ప్రయాణం చేయాలనుకుంటే పెద్దలకు 3000 రూపాయలు పిల్లలకు 2400 టికెట్ ధర నిర్ణయించినట్టు ఆయన తెలిపారు. ఇక నాగార్జునసాగర్, శ్రీశైలంలో ప్రకృతి సోయగాలను తనివితీరా చూడాలనుకునేవారు నవంబర్ 2 నుంచి లాంచీ ప్రయాణం ద్వారా చూడవచ్చు అని పేర్కొన్నారు.

జగన్ ను జైలుకు పంపడమే మీ ఉద్దేశ్యమా.

వైఎస్ ఫ్యామిలీ ఆస్తుల వివాదంపై విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. షర్మిలకు కన్నీళ్లకు విలువలేదని.. ప్రజలు నమ్మే స్థితిలో లేరని అన్నారు. జగన్ ప్రత్యర్థుల కుట్రలో షర్మిల పావుగా మాట్లాడారని ఆరోపించారు. దొంగ సంతకాలతో షేర్లు ట్రాన్స్ ఫర్ చేసుకున్నారని విమర్శించారు. 

వైఎస్ ఫ్యామిలీలో ఆస్తుల వివాదం రోజూకో మలుపు తిరుగుతోంది. విషయం కాస్త కోర్టు వరకు చేరటంతో… అటు షర్మిల, మరోవైపు వైసీపీ నేతల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. ఆదివారం వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ… కీలక వ్యాఖ్యలు చేశారు.

జగన్ రాజకీయ ప్రత్యర్థుల కుట్రలో వైఎస్ షర్మిల పావుగా మారారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. షర్మిలకు కన్నీళ్లకు విలువలేదన్నారు.ఆమెను ప్రజలు నమ్మే స్థితిలో లేరని అన్నారు. జగన్ పై అనేక కేసులు మోపిన కాంగ్రెస్ పార్టీతో పాటు… కుట్రలు చేసిన చంద్రబాబుతో చేతులు కలుపుతారా అని ప్రశ్నించారు. జగన్ కు వ్యతిరేకంగా షర్మిలను చంద్రబాబు పావుగా వాడుకుంటున్నారని వ్యాఖ్యానించారు. జగన్ కు రాసిన లేఖ టీడీపీ చేతికి ఎలా చేరిందని వైఎస్ షర్మిలను ప్రశ్నించారు. ప్రత్యర్థుల కుట్రలో మీరు భాగమవ్వటం శోఛనీయమన్నారు.

ఆస్తుల పంపకంపై 2019లో ఒప్పందం జరిగిందని విజయసాయిరెడ్డి తెలిపారు. రాజశేఖర్ రెడ్డి చనిపోయిన 10 ఏళ్ల తర్వాత జగనే స్వయంగా… ఆస్తులను పంచి ఇస్తానని చెప్పారని గుర్తు చేశారు. తన స్వార్జితమైన ఆస్తుల్లో 40 శాతం ఇస్తానని ఏంవోయూ చేశారని వివరించారు. ఆస్తులపై ఉన్న కోర్టు కేసులు పూర్తి అయిన తర్వాత ఇస్తామని ఏంవోయూలో పేర్కొన్నారని తెలిపారు. కానీ జగన్ కు తెలియకుండా హుటాహుటిన దొంగ సంతకాలతో షేర్లు ట్రాన్స్ ఫర్ చేసుకోవాల్సిన అవసరం ఏం వచ్చిందని నిలదీశారు. కేసుల ఉన్న నేపథ్యంలో ఆస్తుల ట్రాన్స్ ఫర్ జరిగితే జగన్ బెయిల్ రద్దు అవుతుందన్న విషయం కూడా షర్మిలకు తెలుసని విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు.

జగన్ బెయిల్ రద్దు కావాలని... చంద్రబాబు అజెండా ఉందని విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఈ కుట్రలో షర్మిల పావుగా మారిపోయారని చెప్పారు. ఆస్తుల ట్రాన్స్ ఫర్ విషయంలో చంద్రబాబు హస్తం ఉందన్నారు. జగన్ ను జైలుకు పంపడమే మీ ఉద్దేశ్యమా అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. సొంత అన్నపై కుట్ర చేయటం ఏంటని షర్మిలను నిలదీశారు. జగన్ బెయిల్ రద్దు చేసేందుకు ప్రత్యర్థులంతా కలిసి కుట్ర చేస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆస్తుల విషయంలో చాలా చర్చలు జరిగాయని విజయసాయిరెడ్డి చెప్పారు. ఈ సమస్య ఇద్దరిది మాత్రమే అని… కానీ ప్రత్యర్థులు రంగంలోకి దిగటంతో కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. గతంలో జరిగిన చర్చల విషయం గురించి బయటికి తెలియాలంటే… వైఎస్ షర్మిలనే అడగాలని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు విజయసాయిరెడ్డి బదులిచ్చారు.

బెటాలియన్ పోలీసుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి..

గత కొద్ది రోజులుగా బెటాలియన్ పోలీసులు తమ కుటుంబాలతో చేస్తున్న.. ఆందోళనల పట్ల.. నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి ..తమ ఆవేదన వ్యక్తం చేశారు..

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా.. బెటాలియన్ పోలీసుల మహిళలు.. చిన్నపిల్లలతో సహా.. రోడ్డెక్కి తమ సమస్యల పట్ల ఆందోళన చేయటం అత్యంత బాధాకరం అని అన్నారు...

 ప్రభుత్వం వారి సమస్యలను సానుభూతి తో అర్థం చేసుకొని పరిష్కరించవలసి ఉన్నది..

కానీ వారి సమస్యల పట్ల నిర్లక్ష్యంగా... వ్యవహరిస్తూ వారి పట్ల అమానుషంగా ప్రవర్తిస్తుందని అన్నారు... తాము నిన్న.. 12 th బెటాలియన్ లో.. ఆందోళన చేస్తున్న వారి పట్ల సానుభూతిగా వారిని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు..

పోలీసులు తమ పట్ల.. దౌర్జన్యంగా ప్రవర్తించి అరెస్టు చేశారని...ఇది ఏ రకమైన ప్రజాస్వామ్యమని అన్నారు.

 చరిత్రలో ఇంతవరకు ఎప్పుడు కూడా పోలీసులు యూనిఫామ్స్ తో ఆందోళన చేసిన దాఖలాలు లేవని.. ప్రభుత్వం వీరి సమస్యల పట్ల నిమ్మకు నీరెత్తినట్టు ఉండటం వలనే..వారు ఆందోళనకు దిగవల్సి వచ్చిందని... అదేవిధంగా కొంతమంది పోలీస్ ఉన్నతాధికారులు.. కిందిస్థాయి అధికారులు.. వారి ఆందోళన

తాళం పగులగొట్టి ఇంటి గోడలు కూల్చివేత

జీహెచ్‌ఎంసీ మూసాపేట్‌ సర్కిల్‌ టౌన్‌ప్లానింగ్‌ అధికారులు శనివారం బాలాజీనగర్‌(Balajinagar)లోని హెచ్‌ఐజీ 53లో అక్రమ నిర్మాణం అంటూ చేపట్టిన కూల్చివేతలు దుమారం లేపాయి. 267 గజాల్లో స్టిల్ట్‌ ప్లస్‌ 3 అంతస్తులకు జీహెచ్‌ఎంసీ అనుమతి తీసుకొని ఐదు అంతస్తులు నిర్మించా రు. ఏడాది క్రితమే భవనం పూర్తయి ప్రస్తుతం ఐదో అంతస్తులోని రెండు ఫ్లాట్స్‌లో ఒకదాంట్లో గత తొమ్మిది నెలలుగా ఓ కుటుంబం అద్దెకు ఉంటోంది.

జీహెచ్‌ఎంసీ మూసాపేట్‌ సర్కిల్‌ టౌన్‌ప్లానింగ్‌ అధికారులు శనివారం బాలాజీనగర్‌(Balajinagar)లోని హెచ్‌ఐజీ 53లో అక్రమ నిర్మాణం అంటూ చేపట్టిన కూల్చివేతలు దుమారం లేపాయి. 267 గజాల్లో స్టిల్ట్‌ ప్లస్‌ 3 అంతస్తులకు జీహెచ్‌ఎంసీ అనుమతి తీసుకొని ఐదు అంతస్తులు నిర్మించా రు. ఏడాది క్రితమే భవనం పూర్తయి ప్రస్తుతం ఐదో అంతస్తులోని రెండు ఫ్లాట్స్‌లో ఒకదాంట్లో గత తొమ్మిది నెలలుగా ఓ కుటుంబం అద్దెకు ఉంటోంది. మరో దాంట్లో ఇంటి యజమానికి చెందిన కంపెనీ సిబ్బంది ఉంటున్నారు.

నివాసం ఉంటున్న ఇంటిని ఎటువంటి అనుమతి లేకపోయినా హైడ్రా కూడా కూల్చదని ప్రకటించిన నేపథ్యంలో ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా తాజాగా జీహెచ్‌ఎంసీ టౌన్‌ప్లానింగ్‌ సూపర్‌వైజర్‌ ప్రభావతి(GHMC Town Planning Supervisor Prabhavathi) దగ్గరుండి తాళం తొలగించి కిటికీలు, గోడలు తొలగించడమే కాదు.. స్లాబ్‌కు రంధ్రాలు పెట్టడం కూకట్‌పల్లి ప్రాం తంలో హాట్‌టాపిక్‌ఘా మారింది. ఇది ఇలా ఉండగా.. గతంలో ఇక్కడ పనిచేసిన సూపర్‌వైజర్‌, చైర్‌మెన్‌కు ముడుపులు ఇచ్చారా? కొత్తగా వచ్చిన నన్ను పట్టించుకోరా అన్న కోణంలో ఆమె వ్యవహరించారా అంటూ స్థానికులు చర్చించుకుంటున్నారు.

ఇదే భవన నిర్మాణంలో ఇద్దరు ముగ్గురు తొలి నుంచీ ఫిర్యాదులు చేస్తూనే ఉండడంతో ఇదే అదనుగా చేసుకొని టౌన్‌ప్లానింగ్‌ అధికారులు కూల్చివేతలకు పాల్పడినట్టు తెలిసింది. సమాచారం అందుకున్న మేమే టీపీఎస్‌ మా ఇంటిని కూల్చడానికి మీకు ఉన్న అధికారాలు ఏంటి, ఉంటే ఏదైనా నోటీసు చూపండంటూ ఆమెపై వాగ్వాదానికి దిగడంతో పనులు ఆపేసి అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు ఇంటి యజమాని సోదరుడు సుబ్బారావు తెలిపారు. దీనిపై టీపీఎస్‌ ప్రభావతి, ఏసీపీ మల్లేశ్వర్‌ను వివరణ కోరే ప్రయత్నం చేయగా ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా వారు అందుబాటులోకి రాలేదు.