తాళం పగులగొట్టి ఇంటి గోడలు కూల్చివేత
జీహెచ్‌ఎంసీ మూసాపేట్ సర్కిల్ టౌన్‌ప్లానింగ్ అధికారులు శనివారం బాలాజీనగర్(Balajinagar)లోని హెచ్‌ఐజీ 53లో అక్రమ నిర్మాణం అంటూ చేపట్టిన కూల్చివేతలు దుమారం లేపాయి. 267 గజాల్లో స్టిల్ట్ ప్లస్ 3 అంతస్తులకు జీహెచ్‌ఎంసీ అనుమతి తీసుకొని ఐదు అంతస్తులు నిర్మించా రు. ఏడాది క్రితమే భవనం పూర్తయి ప్రస్తుతం ఐదో అంతస్తులోని రెండు ఫ్లాట్స్‌లో ఒకదాంట్లో గత తొమ్మిది నెలలుగా ఓ కుటుంబం అద్దెకు ఉంటోంది.
జీహెచ్‌ఎంసీ మూసాపేట్ సర్కిల్ టౌన్‌ప్లానింగ్ అధికారులు శనివారం బాలాజీనగర్(Balajinagar)లోని హెచ్‌ఐజీ 53లో అక్రమ నిర్మాణం అంటూ చేపట్టిన కూల్చివేతలు దుమారం లేపాయి. 267 గజాల్లో స్టిల్ట్ ప్లస్ 3 అంతస్తులకు జీహెచ్‌ఎంసీ అనుమతి తీసుకొని ఐదు అంతస్తులు నిర్మించా రు. ఏడాది క్రితమే భవనం పూర్తయి ప్రస్తుతం ఐదో అంతస్తులోని రెండు ఫ్లాట్స్‌లో ఒకదాంట్లో గత తొమ్మిది నెలలుగా ఓ కుటుంబం అద్దెకు ఉంటోంది. మరో దాంట్లో ఇంటి యజమానికి చెందిన కంపెనీ సిబ్బంది ఉంటున్నారు.
నివాసం ఉంటున్న ఇంటిని ఎటువంటి అనుమతి లేకపోయినా హైడ్రా కూడా కూల్చదని ప్రకటించిన నేపథ్యంలో ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా తాజాగా జీహెచ్‌ఎంసీ టౌన్‌ప్లానింగ్ సూపర్‌వైజర్ ప్రభావతి(GHMC Town Planning Supervisor Prabhavathi) దగ్గరుండి తాళం తొలగించి కిటికీలు, గోడలు తొలగించడమే కాదు.. స్లాబ్‌కు రంధ్రాలు పెట్టడం కూకట్‌పల్లి ప్రాం తంలో హాట్‌టాపిక్‌ఘా మారింది. ఇది ఇలా ఉండగా.. గతంలో ఇక్కడ పనిచేసిన సూపర్‌వైజర్, చైర్‌మెన్‌కు ముడుపులు ఇచ్చారా? కొత్తగా వచ్చిన నన్ను పట్టించుకోరా అన్న కోణంలో ఆమె వ్యవహరించారా అంటూ స్థానికులు చర్చించుకుంటున్నారు.
ఇదే భవన నిర్మాణంలో ఇద్దరు ముగ్గురు తొలి నుంచీ ఫిర్యాదులు చేస్తూనే ఉండడంతో ఇదే అదనుగా చేసుకొని టౌన్‌ప్లానింగ్ అధికారులు కూల్చివేతలకు పాల్పడినట్టు తెలిసింది. సమాచారం అందుకున్న మేమే టీపీఎస్ మా ఇంటిని కూల్చడానికి మీకు ఉన్న అధికారాలు ఏంటి, ఉంటే ఏదైనా నోటీసు చూపండంటూ ఆమెపై వాగ్వాదానికి దిగడంతో పనులు ఆపేసి అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు ఇంటి యజమాని సోదరుడు సుబ్బారావు తెలిపారు. దీనిపై టీపీఎస్ ప్రభావతి, ఏసీపీ మల్లేశ్వర్‌ను వివరణ కోరే ప్రయత్నం చేయగా ఎన్నిసార్లు ఫోన్ చేసినా వారు అందుబాటులోకి రాలేదు.
Oct 27 2024, 16:23