తాళం పగులగొట్టి ఇంటి గోడలు కూల్చివేత

జీహెచ్‌ఎంసీ మూసాపేట్‌ సర్కిల్‌ టౌన్‌ప్లానింగ్‌ అధికారులు శనివారం బాలాజీనగర్‌(Balajinagar)లోని హెచ్‌ఐజీ 53లో అక్రమ నిర్మాణం అంటూ చేపట్టిన కూల్చివేతలు దుమారం లేపాయి. 267 గజాల్లో స్టిల్ట్‌ ప్లస్‌ 3 అంతస్తులకు జీహెచ్‌ఎంసీ అనుమతి తీసుకొని ఐదు అంతస్తులు నిర్మించా రు. ఏడాది క్రితమే భవనం పూర్తయి ప్రస్తుతం ఐదో అంతస్తులోని రెండు ఫ్లాట్స్‌లో ఒకదాంట్లో గత తొమ్మిది నెలలుగా ఓ కుటుంబం అద్దెకు ఉంటోంది.

జీహెచ్‌ఎంసీ మూసాపేట్‌ సర్కిల్‌ టౌన్‌ప్లానింగ్‌ అధికారులు శనివారం బాలాజీనగర్‌(Balajinagar)లోని హెచ్‌ఐజీ 53లో అక్రమ నిర్మాణం అంటూ చేపట్టిన కూల్చివేతలు దుమారం లేపాయి. 267 గజాల్లో స్టిల్ట్‌ ప్లస్‌ 3 అంతస్తులకు జీహెచ్‌ఎంసీ అనుమతి తీసుకొని ఐదు అంతస్తులు నిర్మించా రు. ఏడాది క్రితమే భవనం పూర్తయి ప్రస్తుతం ఐదో అంతస్తులోని రెండు ఫ్లాట్స్‌లో ఒకదాంట్లో గత తొమ్మిది నెలలుగా ఓ కుటుంబం అద్దెకు ఉంటోంది. మరో దాంట్లో ఇంటి యజమానికి చెందిన కంపెనీ సిబ్బంది ఉంటున్నారు.

నివాసం ఉంటున్న ఇంటిని ఎటువంటి అనుమతి లేకపోయినా హైడ్రా కూడా కూల్చదని ప్రకటించిన నేపథ్యంలో ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా తాజాగా జీహెచ్‌ఎంసీ టౌన్‌ప్లానింగ్‌ సూపర్‌వైజర్‌ ప్రభావతి(GHMC Town Planning Supervisor Prabhavathi) దగ్గరుండి తాళం తొలగించి కిటికీలు, గోడలు తొలగించడమే కాదు.. స్లాబ్‌కు రంధ్రాలు పెట్టడం కూకట్‌పల్లి ప్రాం తంలో హాట్‌టాపిక్‌ఘా మారింది. ఇది ఇలా ఉండగా.. గతంలో ఇక్కడ పనిచేసిన సూపర్‌వైజర్‌, చైర్‌మెన్‌కు ముడుపులు ఇచ్చారా? కొత్తగా వచ్చిన నన్ను పట్టించుకోరా అన్న కోణంలో ఆమె వ్యవహరించారా అంటూ స్థానికులు చర్చించుకుంటున్నారు.

ఇదే భవన నిర్మాణంలో ఇద్దరు ముగ్గురు తొలి నుంచీ ఫిర్యాదులు చేస్తూనే ఉండడంతో ఇదే అదనుగా చేసుకొని టౌన్‌ప్లానింగ్‌ అధికారులు కూల్చివేతలకు పాల్పడినట్టు తెలిసింది. సమాచారం అందుకున్న మేమే టీపీఎస్‌ మా ఇంటిని కూల్చడానికి మీకు ఉన్న అధికారాలు ఏంటి, ఉంటే ఏదైనా నోటీసు చూపండంటూ ఆమెపై వాగ్వాదానికి దిగడంతో పనులు ఆపేసి అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు ఇంటి యజమాని సోదరుడు సుబ్బారావు తెలిపారు. దీనిపై టీపీఎస్‌ ప్రభావతి, ఏసీపీ మల్లేశ్వర్‌ను వివరణ కోరే ప్రయత్నం చేయగా ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా వారు అందుబాటులోకి రాలేదు.

జన్వాడ ఫామ్ హౌస్ కేసుతో డిఫెన్స్ లో పడిన బీఆర్ఎస్..!

జన్వాడ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బామ్మర్ది అడ్డంగా బుక్ అవడంతో కేటీఆర్ ఇరకాటంలో పడ్డారు. పార్టీలో పాల్గొన్న ఒక వ్యక్తికి డ్రగ్స్ టెస్ట్ లో పాజిటివ్ రావడంతో బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్, బీజేపీ చుక్కలు చూపిస్తున్నాయి. దీనిపై కేటీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. రేవ్ పార్టీపై మీ స్పందన ఏంటి కేటీఆర్ స్పందన ఏమిటని కాంగ్రెస్ మీడియా కమిటీ ఛైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి నిలదీశారు. కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాల ఫామ్ హౌస్ లో పోలీసులు దాడులు చేశారని రామ్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు.

పార్టీలో ఒక వ్యక్తికి కోకైన్ డ్రగ్ పాజిటివ్ వచ్చిందన్నారు. సదరు వ్యక్తి కొకైన్ తీసుకున్నట్టుగా డ్రగ్ టెస్ట్ లో తేలడంతో ఎన్డీపీఎస్(NDPS) యాక్ట్ కింద కేసు నమోదు చేశారని పేర్కొన్నారు. రాజ్ పాకాలపై సెక్షన్ 34(Section 34), ఎక్సైజ్ యాక్ట్(Excise Act) కింద మరో కేసు నమోదు చేశారని రాసుకొచ్చారు. కేటీఆర్ దీనిపై మీ స్పందన? ఏమిటి అంటూ కేటీఆర్ ను ట్యాగ్ చేశారు.కేటీఆర్ బామ్మర్ది ఫామ్ హౌస్ లో జరిగిన విషయం ఘటనలు చూసి తెలంగాణ సమాజం సిగ్గు పడుతోందని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ అన్నారు.

తెలంగాణను డగ్స్ ఫ్రీ రాష్ట్రంగా చేయాలని ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. కేటీఆర్ సొంత బావమరిది ఫామ్‌ హౌస్‌లోనే రేవ్ పార్టీలు జరగడం దారుణమన్నారు. పోలీసుల సోదాలు చేసేకంటే ముందే రేవ్ పార్టీ నుంచి మరో 20 మంది వరకు వెళ్లిపోయారనే సమాచారం ఉందని చెప్పారు. హైదరాబాద్ చుట్టూ వీకెండ్ వచ్చిందంటే రేవ్ పార్టీలు, రావుల పార్టీలు అని జరుగుతున్నాయని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. రాజులు, యువరాజులు కూర్చుని విదేశీ మాధకద్రవ్యాలతో పాటు, కోకైన్ లాంటి ఇతర డ్రగ్స్ తీసుకొంటున్నారని ఆరోపించారు.

రేవంత్ రెడ్డి ఆ ఫామ్‌హౌస్ యాజమానితోని కుమ్మక్కు కాకపోతే.. ఫామ్‌హౌస్‌లో ఎస్ఓటీ పోలీసులు రైడ్ సమయంలో ఫామ్‌హౌస్ లోపల, చుట్టూ ఉన్నా సీసీ కెమెరా దృశ్యాలు బయట పెట్టాలని వారు డిమాండ్ చేశారు. కాగా ఈ ఘటనపై కేటీఆర్ ఇంకా స్పందించలేదు. కేటీఆర్ మాజీ మంత్రి మల్లారెడ్డి మనవరాలి పెళ్లికి వెళ్లినట్లు తెలుస్తోంది. కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ రోజు పంచాంగం

తెలుగు పంచాంగం ప్రకారం, అశ్విని మాసంలోని ఏకాదశి తిథి నాడు, ఆదివారం ఈరోజున రాహుకాలం, దుర్ముహుర్తం, సూర్యోదయం, సూర్యాస్తమయంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాల గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

తెలుగు పంచాంగం ప్రకారం, శ్రీ క్రోధి నామ సంవత్సరంలో అక్టోబర్(October) 27వ తేదీన యమగండం, విజయ ముహుర్తం, బ్రహ్మా ముహుర్తాలు, అశుభ ఘడియలు ఎప్పుడెప్పుడొచ్చాయనే పూర్తి వివరాలను ఆచార్య కృష్ణ దత్త శర్మ మాటల్లో తెలుసుకుందాం...

రాష్ట్రీయ మితి కార్తీకం 05, శాఖ సంవత్సరం 1945, అశ్విని మాసం, క్రిష్ణ పక్షం, ఏకాదశి తిథి, విక్రమ సంవత్సరం 2080. రబీ-ఉల్సాని 23, హిజ్రీ 1446(ముస్లిం), AD ప్రకారం, ఇంగ్లీష్ తేదీ 27 అక్టోబర్ 2024 సూర్యుడు దక్షిణయానం, రాహుకాలం సాయంత్రం 4:30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు. ఏకాదశి తిథి ఉదయం సూర్యోదయం నుంచి మరుసటి రోజు ఉదయం 7:15 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత ద్వాదశి తిథి ప్రారంభమవుతుంది. ఈరోజు మాఘ నక్షత్రం మధ్యాహ్నం 12:24 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత పూర్వఫాల్గుణి నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు చంద్రుడు పగలు, రాత్రి సింహ రాశిలో సంచారం చేయనున్నాడు.

నేడు శుభ ముహుర్తాలివే..

బ్రహ్మ ముహుర్తం : ఉదయం 4:47 గంటల నుంచి ఉదయం 5:38 గంటల వరకు

విజయ ముహుర్తం : మధ్యాహ్నం 1:56 గంటల నుంచి మధ్యాహ్నం 2:41 గంటల వరకు

నిశిత కాలం : అర్ధరాత్రి 11:39 గంటల రాత్రి 12:31 గంటల వరకు

సంధ్యా సమయం : సాయంత్రం 5:40 గంటల నుంచి సాయంత్రం 6:05 గంటల వరకు

అమృత కాలం : ఉదయం 9:17 గంటల నుంచి ఉదయం 10:41 గంటల వరకు

సూర్యోదయం సమయం 27 అక్టోబర్ 2024 : ఉదయం 6:29 గంటలకు

సూర్యాస్తమయం సమయం 27 అక్టోబర్ 2024: సాయంత్రం 5:40 గంటలకు

నేటి ఉపవాస పండుగ : కౌముదీ మహోత్సవం

నేడు అశుభ ముహుర్తాలివే..

రాహు కాలం : సాయంత్రం 4:30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు

గులిక్ కాలం : మధ్యాహ్నం 3:30 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు

యమగండం : మధ్యాహ్నం 12 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు

దుర్ముహుర్తం : సాయంత్రం 4:10 గంటల నుంచి సాయంత్రం 4:55 గంటల వరకు

నేటి పరిహారం : ఈరోజు ఉదయించే సూర్యుడికి అర్ఘ్యం సమర్పించి అందులో ఎర్రని పువ్వును ఉంచాలి.

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

రాజధాని అమరావతి పనులపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. గత వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయం తీసుకోవడంతో అమరావతిలో రాజధాని నిర్మాణాలు పూర్తిగా ఆగిపోయాయి. 2019 ఎన్నికలకు ముందు చేపట్టిన పనులు నిలిచిపోయాయి. ఇటీవలి ఎన్నికల్లో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాజధాని పనులకు అమరావతిలో కదలిక ప్రారంభం అయింది. 

ఇప్పటికే రాజధాని ప్రాంతంలో జంగిల్ క్లియరెన్స్ పనులు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో రాజధాని నిర్మాణాలపై మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ కీలక ప్రకటన చేశారు.

అమరావతి నిర్మాణంలో భాగంగా గతంలో పిలిచిన కాంట్రాక్టులను 15 రోజుల్లో రద్దు చేసి కొత్తవి ఆహ్వానించనున్నట్లు మంత్రి తెలిపారు. నవంబర్, డిసెంబర్ నెలల్లో అన్ని పనులకు టెండర్లు పిలుస్తామని చెప్పారు. 

360 కిలోమీటర్ల ట్రంక్ రోడ్లు, లే అవుట్లు, కొండవీటి, పాలవాగు, గ్రావిటీ కెనాల్స్, కరకట్ట రోడ్డుకు టెండర్లు పిలవనున్నట్లు తెలిపారు. సచివాలయ భవనాల నిర్మాణాలకు డిసెంబర్‌లో, అసెంబ్లీ, హైకోర్టు నిర్మాణాలకు వచ్చే ఏడాది జనవరి నెలాఖరులో టెండర్లు ఖరారు చేస్తామని వెల్లడించారు.

అమరావతి రైల్వే లైన్ కు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడం శుభపరిణామమంటూ ఈ సందర్బంగా మంత్రి నారాయణ హర్షం వ్యక్తం చేశారు.

శ్రీశైలానికి భారీగా వరద..

శ్రీశైలం జలాశయానికి ఎగువ నుంచి భారీగా వరద కొనసాగుతోంది. జూరాల నుంచి 70,552 క్యూసెక్కులు, సుంకేశుల నుంచి 1,18,776 క్యూసెక్కులు మొత్తం 1,89,328 నీరు శ్రీశైలానికి వస్తోంది.

శ్రీశైలం జలాశయానికి ఎగువ నుంచి భారీగా వరద కొనసాగుతోంది. జూరాల నుంచి 70,552 క్యూసెక్కులు, సుంకేశుల నుంచి 1,18,776 క్యూసెక్కులు మొత్తం 1,89,328 నీరు శ్రీశైలానికి వస్తోంది. శ్రీశైలం డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 885 అడుగులకు చేరింది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో అధికారులు శ్రీశైలం డ్యాం 4 గేట్లను 10 అడుగులమేర ఎత్తి 1,12,300 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

ఏపీ జలవిద్యుత్‌ కేంద్రం ద్వారా 31,276 క్యూసెక్కులు, తెలంగాణ జల విద్యుత్‌ కేంద్రం ద్వారా 36,600 క్యూసెక్కుల నీటితో విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్నారు. శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కు 2,10,149 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. 20 గేట్లను ఎత్తి 1,62,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

దీంతోపాటు సాగర్‌ కుడి కాలువ ద్వారా 10,350 క్యూసెక్కులు, ఎడమ కాలువ ద్వారా 6,173 క్యూసెక్కులు, ప్రధాన జలవిద్యుత్‌ కేంద్రం ద్వారా 28,826 క్యూసెక్కులు, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 2400, ఎల్‌ఎల్‌సీ ద్వారా 400 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు.

ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభం

మెడికల్ కళాశాలలో తరగతుల ప్రారంభోత్సవంలో పాల్గొనడటం సంతోషంగా ఉందని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలతో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఎనిమిది మెడికల్ కళాశాలలు రావాలని ఎంతో శ్రమించామన్నారు.

జిల్లాలోని నూతన మెడికల్ కళాశాలలో (Medak Medical Collage) ఎంబీబీఎస్ తరగతులు గురువారం ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ (Minister Damodara Rajanarsimha), ఇంచార్జీ మినిస్టర్ కొండా సురేఖ (Minister Konda Surekha) క్లాసులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనరసింహ మాట్లాడుతూ.. మెడికల్ కళాశాలలో తరగతుల ప్రారంభోత్సవంలో పాల్గొనడటం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలతో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఎనిమిది మెడికల్ కళాశాలలు రావాలని ఎంతో శ్రమించామన్నారు.

దేశంలో, రాష్ట్రంలో అత్యధికంగా డయాబెటీస్ పెరుగుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మేజర్ వ్యాధులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని నిర్ణయం తీసుకుందన్నారు. 90 శాతం ట్రీట్మెంట్ అనేది హైదరాబాద్‌కు వెళ్లకుండా జరగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. రాబోయే విద్యా సంవత్సరం నర్సింగ్, పారా మెడికల్ కళాశాల మంజూరు చేస్తామని ప్రకటించారు. రాజకీయాలు శాశ్వతం కాదన్నారు. ప్రజలకు వైద్యం, విద్య, సంక్షేమం అందించాలన్నదే తమ ప్రభుత్వం లక్ష్యమని స్పష్టం చేశారు. తెలంగాణలో హైవేలపై 74 ట్రామా సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి దామోదర్ రాజనరసింహ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ మైనం పల్లి రోహిత్ రావు, ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ.. ప్రధానిగా మోడీ 327 కొత్త మెడికల్ కళాశాలలు ఇచ్చారన్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరికి వినతిపత్రం అందించామని తెలిపారు. తెలంగాణకు ఏయిమ్స్ ఇచ్చింది మోడీ అని అన్నారు. పేదలకు ఫ్రీగా ఉచిత వైద్యం అందించాలన్నదే మోడీ సర్కార్ లక్ష్యమని ఎంపీ తెలిపారు. మెదక్‌లోని మెడికల్ కళాశాలలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని జిల్లా ఇంచార్జి మినిస్టర్ కొండా సురేఖ తెలిపారు. విద్యార్థులు ఉత్తమ డాక్టర్లుగా కావాలని మంత్రి ఆకాంక్షించారు.

ప్రియాంక గాంధీ ఆస్తుల వివరాలు ఇవిగో.

కేరళలోని వయనాడ్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన ప్రియాంక గాంధీ తన ఆస్తులను రూ.12 కోట్లుగా ప్రకటించారు. తల్లి సోనియా గాంధీ, సోదరుడు, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో కలిసి వచ్చిన ప్రియాంక నిన్న నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా తన ఎన్నికల అఫిడవిట్లో ఆస్తుల వివరాలను వెల్లడించారు.

తనకు ఉన్న రూ.12 కోట్ల విలువైన ఆస్తిలో రూ.4.24 కోట్ల విలువ చేసే చరాస్తులు, రూ.7.74 కోట్ల విలువ చేసే స్థిరాస్తులు ఉన్నట్లుగా ప్రకటించారు. మూడు బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టినట్లు తెలిపారు. తన భర్త రాబర్ట్ వాద్రా బహుమతిగా ఇచ్చిన హోడా సీఆర్వీ కారు, రూ.1.15 కోట్ల విలువైన 4 కిలోలకు పైగా బంగారు నగలు ఉన్నట్లు పేర్కొన్నారు. 

దేశ రాజధాని ఢిల్లీలోని మోహ్రాలీ ప్రాంతంలో వారసత్వంగా వచ్చిన వ్యవసాయ భూమి, ఫామ్ హౌస్‌లో సగం వాటా ఉన్నట్లు వెల్లడించారు. సిమ్లాలో తన పేరిట రూ.5.63 కోట్ల విలువైన ఓ నివాస భవనం ఉందన్నారు.

గత ఆర్థిక సంవత్సరంలో తన ఆదాయం రూ.46.39 లక్షలుగా ఉందని పేర్కొన్నారు. భర్త రాబర్ట్ వాద్రా నికర ఆస్తులు రూ.65.54 కోట్లుగా ప్రియాంక గాంధీ వెల్లడించారు. ఇందులో రూ.37.9 కోట్ల చరాస్తులు, రూ.27.64 కోట్ల స్థిరాస్తులు ఉన్నట్లు తెలిపారు.

హైకోర్టులో విచారణ వాయిదా

మాజీ ఎంపీ నందిగం సురేష్ బెయిల్ పిటిషన్‌పై విచారణ హైకోర్టులో వాయిదా పడింది. శుక్రవారానికి కేసు విచారణను వాయిదా వేసింది న్యాయస్థానం. సాక్షాలను తారుమారు చేసే అవకాశం ఉందని, అతనికి బెయిల్ ఇవ్వొదని పోలీసుల తరుపున న్యాయవాది వాదనలు వినిపించే అవకాశం ఉంది.

బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ (Bapatla Former MP Nandigam Suresh) బెయిల్ పిటిషన్‌పై హైకోర్ట్‌లో (AP High Court) గురువారం విచారణ జరిగింది. సురేష్ తరపున వాదనలు ముగిశాయి. వాదనలు వినిపించేందుకు పోలీసుల తరపు న్యాయవాది కోర్టును సమయం కోరారు. దీంతో తదుపరి విచారణను హైకోర్టు ధర్మాసనం రేపటి (శుక్రవారం) కి వాయిదా వేసింది.

తుళ్లూరులోని వెలగపూడికి చెందిన మరియమ్మ హత్య కేసులో సురేష్ ఇప్పటికే అరెస్ట్ అయి గుంటూరు జిల్లా జైలులో (Guntur Jail) రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇప్పటికే రెండు రోజుల పాటు సురేష్‌ను కస్టడీకి తీసుకుని తుళ్లూరు పోలీసులు విచారణ జరిపిన విషయం తెలిసిందే. అయితే విచారణలో మాజీ ఎంపీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, విచారణకు సహకరించని పరిస్థితి. ఈ క్రమంలో తనకు బెయిల్ ఇవ్వాలంటూ నందిగం సురేష్ హైకోర్టులో బెయిల్ పిటిషన్‌ను దాఖలు చేశారు.

అయితే విచారణకు సహకరించనందున బెయిల్ ఇవ్వొద్దంటూ పోలీసులు న్యాయస్థానం ఎదుట వాదనలు వినిపించే అవకాశం ఉంది. దీనికై కొంత సమయం కావాలని పోలీసు తరుపున న్యాయవాది కోర్టును కోరడంతో విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది హైకోర్టు. దీంతో రేపు మరోసారి నందిగం సురేష్ బెయిల్ పిటిషన్‌పై విచారణ జరుగనుంది. ఆ తరువాత బెయిల్‌పై న్యాయమూర్తి తీర్పును వెలవరించే అవకాశం ఉంది.

నందిగం సురేష్ స్థానికుడు కావడంతో సాక్షులను బెదిరించి సాక్షాలను తారుమారు చేసే అవకాశం ఉందని, అతనికి బెయిల్ ఇవ్వొదని పోలీసుల తరుపున న్యాయవాది వాదనలు వినిపించే అవకాశం ఉంది. ఈ కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదని, కేసులో తన పేరు ఉందని కూడా తనకు తెలియదంటూ పోలీసు కస్టడీలో మాజీ ఎంపీ అబద్ధం చెప్పిన నేపథ్యంలో సాక్షాలను తారుమారు చేసి అవకాశం ఉంది కాబట్టి బెయిల్ ఇవ్వొద్దని కోరడంతో పాటు బలమైన ఆధారాలను సమర్పించేందుకు పోలీసు తరుపున న్యాయవాదులు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందు కోసం కొంత సమయం కావాలని హైకోర్టును పోలీసు తరపు న్యాయవాది కోరినట్లు సమాచారం. అయితే మాజీ ఎంపీకి బెయిల్ వస్తుందా.. రాదా అనేది రేపటి విచారణలో తెలియనుంది.

రైల్వే లైన్‌కి కేంద్ర మంత్రివర్గం ఆమోదం

కేంద్ర మంత్రివర్గం మరో రైల్వే లైన్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు కేంద్రం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.ఎర్రుపాలెం నుంచి అమరావతి మీదుగా నంబూరు వరకు కొత్త లైన్‌ను కేంద్రం శ్రీకారం చుట్టింది.

అమరావతి రైల్వే లైన్‌కి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 57 కిలోమీటర్ల పొడవున కొత్త రైల్వే లైన్ నిర్మాణం చేపట్టనున్నట్లు ప్రకటించింది. రూ. 2,245 కోట్లతో రైల్వే లైన్ నిర్మాణం చేస్తుంది. ఎర్రుపాలెం నుంచి అమరావతి మీదుగా నంబూరు వరకు కొత్త లైన్‌ను కేంద్రం శ్రీకారం చుట్టింది. కొత్తగా కృష్ణ నదిపై 3 కిలో మీటర్ల మేర బ్రిడ్జి నిర్మాణం చేపట్టనుంది.

కాగా.. అమరావతి రైలు మార్గానికి తొలి అడుగుపడింది. గత ఐదేళ్లుగా వైసీపీ పాలనలో నిర్లక్ష్యానికి గురైన రాజధాని రైలు మార్గానికి కూటమి ప్రభుత్వంలో తొలి ఏడాదిలోనే నిధులు కేటాయింపు జరిగింది. తొలిసారిగా రూ.50.01 కోట్ల నిధులను కేటాయించడంతో సాధ్యమైనంత త్వరలోనే పనులు ప్రారంభమౌతాయని పలువురు భావిస్తున్నారు. అమరావతి రైలుతో పాటు గుంటూరు రైల్వే డివిజన్‌కి సంబంధించి కొత్త ప్రాజెక్టులు, ఇప్పటికే నిర్మాణంలో ఉన్న వాటిని మరింత ముందుకు తీసుకెళ్లేలా కేంద్రం నిధుల కేటాయింపు జరిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గుంటూరు రైల్వే డివిజన్‌ పరిధిలోని ప్రాజెక్టులకు రూ.1100 కోట్లకు పైగా నిధులు కేటాయించడంపై రైల్వే వర్గాలతో పాటు ఉమ్మడి గుంటూరు జిల్లావాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టిన నెల తర్వాత రైల్వే కేటాయింపులకు సంబంధించిన పింక్‌బుక్‌ ఎట్టకేలకు రైల్వేపోర్టల్‌లో అందుబాటులోకి రావడంతో ఈ అంశాలు వెలుగుచూశాయి. అటు కేంద్రం, ఇటు రాష్ట్రంలో ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వాలు(డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌) కావడంతో ఏపీకి బడ్జెట్‌ కేటాయింపుల్లో మరింత ప్రాధాన్యం ఇచ్చినట్లు తేలింది. సీఎం చంద్రబాబునాయుడు, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌, ఎంపీల ప్రయత్నాలు ఫలించినట్లు అర్థమవుతోంది. ఇంచుమించు ఏడు, ఎనిమిదేళ్ల క్రితం అమరావతి రాజధాని నూతన రైలుమార్గానికి పింక్‌బుక్‌లో చోటు దక్కింది. ఆ తర్వాత తొలిగా ఈ బడ్జెట్‌లో నిధులు కేటాయించి కేంద్రం ఉదారతను చాటుకున్నది. మరికొన్ని ప్రాజెక్టులకు కూడా భారీగానే నిధులు కేటాయించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమౌతున్నది.

అమరావతి రాజధానికి రైలుమార్గం ఉంటే అభివృద్ధి వేగవంతంగా జరుగుతుందని 2014-19 మధ్యనే టీడీపీ ప్రభుత్వం ఆలోచన చేసింది. అప్పట్లో కేంద్రంలో ఉన్న ఎన్‌డీఏ-1 ప్రభుత్వంతో మాట్లాడి ప్రాజెక్టుని మంజూరు చేయించింది. ఈ రైలుమార్గం మొత్తం పొడవు 106 కిలోమీటర్లు. ఇందులో ఒక సెక్షన్‌ ఎర్రుపాలెం - నంబూరు మధ్య 55.8 కిలోమీటర్ల పొడవు, రెండోది అమరావతి - పెదకూరపాడు 24.5 కిలోమీటర్లు, మూడోది సత్తెనపల్లి - నరసరావుపేట 25 కిలోమీటర్ల పొడవునా డీపీఆర్‌ కూడా ఆమోదించారు. మొత్తం ప్రాజెక్టు నిర్మాణానికి రూ.2679.59 కోట్ల ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఈ రైలుమార్గానికి అవసరమయ్యే భూమిని రాష్ట్ర ప్రభుత్వం సేకరించి ఇవ్వాలి. అయితే ఎన్‌డీఏ-1 చివరలో బీజేపీ, టీడీపీకి మధ్య అభిప్రాయభేదాలతో ప్రాజెక్టు ముందుకు కదలలేదు. ఆ తర్వాత అధికారం చేపట్టిన వైసీపీ ప్రభుత్వం అసలు ఈ ప్రాజెక్టు ప్రస్తావన అనేది ఐదేళ్లలో తీసుకురాలేదు. దాంతో ఏటా కేంద్ర బడ్జెట్‌లో మొక్కుబడిగా రూ.లక్ష మాత్రమే కేటాయిస్తూ వచ్చింది. ఇప్పుడు మళ్లీ ఎన్‌డీఏ ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడటం, అందులో టీడీపీ భాగస్వామ్యం కావడంతో అమరావతి రైలుమార్గానికి మళ్లీ మంచి రోజులొచ్చాయి.

ఇక నిర్మాణంలో ఉన్న నడికుడి - శ్రీకాళహస్తి నూతన రైలుమార్గం పనులను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కేంద్రం ప్రాధాన్యం ఇచ్చింది. ఎస్‌ ఫండ్‌ కింద రూ.250 కోట్లు, కేపిటల్‌ ఫండ్‌ కింద రూ.60 కోట్లు కలిపి మొత్తం రూ.310 కోట్లు కేటాయించింది. గుంటూరు - గుంతకల్లు డబ్లింగ్‌లో కీలకమైన నల్లమడ అటవీ ప్రాంతంలో పనులు చేపట్టాల్సి ఉన్నది. ఇందుకు ఖర్చు కూడా ఎక్కువ కానుండటంతో ఏకంగా ఈ బడ్జెట్‌లో రూ.480 కోట్లు కేటాయింపులు జరిపింది. రద్దీ మార్గాల్లో ఒకటిగా మారిన గుంటూరు - బీబీనగర్‌ డబ్లింగ్‌ కోసం ఇప్పటికే భూసేకరణ ప్రక్రియ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టుకి రూ.220 కోట్లు కేటాయించింది. విష్ణుపురం బైపాసు రైలుమార్గానికి రూ.20 కోట్లు, మోటుమర్రి - విష్ణుపురం డబ్లింగ్‌ ప్రాజెక్టుకి రూ.50 కోట్లు కేటాయించింది. 88 కిలోమీటర్ల పొడవునా నిర్మించనున్న ఈ రైలుమార్గంలో మోటుమర్రి వద్ద రైల్‌ ఓవర్‌ రైలు బ్రిడ్జిని కూడా నిర్మిస్తారు. అలానే గుంటూరు యార్డులో మల్టీ ట్రాకింగ్‌ కనెక్టివిటీ పనుల నిమిత్తం మరో రూ.50 కోట్లు కేటాయించింది.

నేడు విజయనగరం జిల్లా పర్యటనకు జగన్

వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గురువారం విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. గుర్ల వెళ్లి డయేరియా బాధితులను పరామర్శించనున్నారు. జగన్ రాక నేపథ్యంలో వైసీపీ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు (YCP Chief) జగన్మోహన్ రెడ్డి (Jaganmohan Reddy) గురువారం విజయనగరం జిల్లా (Vizianagaram Dist.,)లో పర్యటించనున్నారు. ఉదయం పదకొండు గంటలకు తాడేపల్లి నుంచి హెలికాఫ్టర్‌లో బయలుదేరి నెల్లిమర్ల సమీపంలోని దత్తా ఎస్టేట్స్‌కి చేరుకుని.. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో గుర్ల వెళ్లి డయేరియా బాధితులను (Diarrhea victims) పరామర్శించనున్నారు. జగన్ రాక నేపథ్యంలో వైసీపీ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

కాగా గుర్ల మండలంలో డయేరియా ప్రబలిన అంశాన్ని కొద్దిరోజులుగా వైసీపీ రాజకీయం చేస్తోంది. వేర్వేరు కారణాలతో మృతిచెందిన వారికి డయేరియాను ఆపాదిస్తోంది. 11 మంది మృత్యువాత పడ్డారని ఆరోపిస్తోంది. ఇప్పుడు ఆ పార్టీ అధినేత జగన్‌ కూడా అదే దారిలో వెళ్తున్నారు. ప్రభుత్వాన్ని అహేతుకంగా విమర్శించేందుకు ఏకంగా గుర్ల గ్రామానికి గురువారం వస్తున్నారు. కాగా వైద్య ఆరోగ్య శాఖ మాత్రం ఒక్కరు మాత్రమే డయేరియాతో మృతిచెందినట్టు స్పష్టంచేసింది. వైసీపీ మాత్రం జిల్లాలో ఏదో జరిగిపోతోందని, అందుకు ప్రభుత్వమే కారణమని అదే పనిగా ఆరోపణలు చేస్తోంది. ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వ వైఫల్యం అంటూ ముద్ర వేసే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు భూగర్భ జలాలు కలుషితమే డయేరియాకు కారణమని అధికారుల నివేదికలో తేలింది. అదే సమయంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు నెలలే అవుతోంది. ఈ తక్కువ వ్యవధిలో అద్భుతాలు చేసేయగలదా అన్న విషయాన్ని వైసీపీ విస్మరిస్తోంది. ఐదేళ్లుగా వైసీపీ అధికారంలో ఉన్న విషయాన్ని ఆ పార్టీ నేతలు మరిచిపోయి విమర్శలు చేస్తున్నారు. ఇటీవలే డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ బాధితులను పరామర్శించారు. ఇది గత ప్రభుత్వ వైఫల్యమేనని తేల్చేశారు. గ్రామాల్లో పారిశుధ్యం, తాగునీరు వంటి విషయాలను నిర్లక్ష్యంగా విడిచిపెట్టడం వల్లే ఈ దుస్థితి వచ్చిందని ఆరోపించారు. దీనిని ఖండించేందుకే జగన్‌ పనిగట్టుకుని జిల్లాకు వస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. నాడు పాలనలో వైఫల్యం చెంది ఇప్పుడు బాధితులను ఏ మొహం పెట్టుకొని వస్తున్నారని కూటమి పార్టీల నేతలు ప్రశ్నిస్తున్నారు.

వైసీపీ ప్రభుత్వ హయాంలో జిల్లాలో ఎన్నో రకాల విధ్వంసాలు, అపచారాలు, ప్రభుత్వ వైఫల్యాలు బయటపడ్డాయి. అయినా నాడు సీఎం హోదాలో ఉన్న జగన్‌ జిల్లా వైపు కనీసం చూడలేదు. రాష్ట్రంలోనే ప్రముఖ దేవస్థానాల్లో ఒకటైన రామతీర్థంంలో బోడికొండపై ఉన్న కోదండరామాలయంలోని విగ్రహాలను 2020 డిసెంబరు 28న అగంతుకులు ధ్వంసం చేశారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కుదిపేసింది. అప్పటి ప్రధాన ప్రతిపక్షాలైన టీడీపీ, బీజేపీలు ఈ ఘటనపై తీవ్రంగా స్పందించాయి. టీడీపీ అధినేత చంద్రబాబు ఆలయాన్ని సందర్శించారు. వివిధ పీఠాధిపతులు సందర్శించి ఘటనపై విస్మయం వ్యక్తం చేశారు. ధార్మిక సంఘాలు ఆందోళన చేశాయి. ఇంత పెద్ద ఘటన జరిగినా శాంతిభద్రతలు అదుపు తప్పే అవకాశం ఉన్నా సీఎం హోదాలో ఉన్న జగన్‌ ఇటువైపుగా చూడలేదు. కేవలం కేసును సీబీ సీఐడీకి అప్పగించి చేతులు దులుపుకున్నారు. కాగా గుర్ల డయేరియా అంశాన్ని కూడా రాజకీయంగా వాడుకోవాలని జగన్‌ భావించారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

విజయనగరం జిల్లా ప్రజలను డయేరియా వణికిస్తోంది. అనేక గ్రామాల్లో పారిశుధ్యం పడకేసింది. తాగునీరు కాలుష్యమవుతోంది. ఈ కారణాల వల్లే డయేరియా ప్రబలుతోందని వైద్యులు సైతం నిర్ధారించారు. ఐదేళ్ల కాలంలో గ్రామాల అభివృద్ధిని విస్మరించిన కారణంగానే ఈ దుస్థితి నెలకొందని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. గుర్లలో డయేరియా విజృభించడం జిల్లా, రాష్ట్ర స్థాయిలో చర్చనీయాంశమైంది. గజపతినగరం మండలంలోని కెంగువ, దత్తిరాజేరు మండలంలోని దాసరిపేట, కన్నాం, గుచ్చిమి వంటి గ్రామాల్లోనూ డయేరియా కేసులు బయటపడడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్ధితిలో జిల్లా వ్యాప్తంగా వైద్య సిబ్బందితోపాటు సచివాలయం ఉద్యోగులు ఇంటింటా వెళ్లి ఎవరికైనా వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారా అంటూ అడిగి తెలుసుకుంటున్నారు. కాగా ఐదేళ్లూ వైసీపీ పాలనలో పంచాయతీలను పూర్తిగా గాలికి వదిలేశారు. గతంలో టీడీపీ హయంలో గ్రామాల్లో మంచి నీటి పరీక్షలు నిర్వహించేవారు. బోరు లేదా రక్షిత నీటి పథకాలకు చెందిన నీరు తాగవచ్చా? లేదా అనేది ప్రజలకు చెప్పేవారు. వైసీపీ హయంలో మంచినీటి పరీక్షలు ఎక్కడా నిర్వహించలేదు. ఆ కిట్లు కూడా మూలకు చేర్చారు. అలాగే చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలను కూడా విస్మరించంతో గ్రామాల్లో పారిశుధ్యం తగ్గింది. ఆ ఫలితం నేడు కనిపిస్తోందనేది టీడీపీ నాయకుల మాట.