కనుమరుగైన ప్రాచీన నగరం

ఆ నగరం పేరు ద్వారకాపురి 12వ శతాబ్దంలో దాని వైభవం అంతా ఇంతా కాదు. ఒకవైపు సిరి సంపదలతో తుల తూగుతుండగా.. మరోవైపు సంగీత, సాహిత్య శిల్పకళలకు కాణాచిగా నిలిచిందని తమ పూర్వీకులు చెప్పేవారని స్థానికులు చెబుతున్నారు.

దుర్గి మండలం ధర్మవరం గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో ద్వారకాపురి పట్టణం సుమారు వంద ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇందులో సగభాగం బుగ్గవాగు రిజర్వాయర్లో మునిగిపోగా, మిగిలిన సగభాగం వ్యవసాయ భూమిగా మారింది. వ్యవసాయ భూమిలో ఎక్కడ చూసినా పగిలిపోయిన కుండ పెంకులు, గాజు ముక్కలు కనిపిస్తుంటాయి. అంగుళానికి ఈ కుండపెంకులు విస్తరించి కనిపిస్తున్నాయి. దుక్కి దున్నుతున్నప్పుడు మట్టి కుండలు, పిడతలు పైకి రావడం సర్వసాధారణం. పొలం గట్లపై దేవతామూర్తుల విగ్రహాలు పడి దర్శనమిస్తాయి. వీటిలో నాగ దేవత, వినాయకుడు, గజలక్ష్మి, ఏనుగును అదిరోహించిన వీరవనిత తదితర విగ్రహాలు ఉన్నాయి.

చేనేత వస్త్రాలకు రంగులు తయారుచేసే ఒక యూనిట్ ఈనాటికీ శిదిలావస్థలో అక్కడ దర్శనమిస్తుంది. ప్రాంతంలో కొంతభాగాన్ని నాగులకట్ట, మరి కొంత బాగాన్ని కుమ్మరి గుట్ట అని పిలుస్తుంటారు. ఈ భూములను సాగు చేస్తున్న రైతులకు తరచూ బంగారు నాణాలు, ఆభరణాలు ఇప్పటికీ లభిస్తున్నాయి. ఇక్కడ నాలుగు శిథిలాలయాలు కూడా ఉన్నాయి. ఈ ఊరికి పక్కన నిరంతరం నీరు ప్రవహించే బుగ్గవాగు ఉండగా, వాగుకు ఆవలవైన బుగ్గమల్లేశ్వరస్వామి ఆలయం ఉంది. ఈ ఆలయం మెట్లకు దిగువ భాగాన పాతాళగంగా నిరంతరం భూమిపైకి పొంగుతూ ఉంటుంది. ఆ నీరు ఆనాటి ద్వారకాపురి పట్టణ వాసుల సాగు, తాగునీటి అవసరాలను తీర్చేది. 1964లో నిర్మించిన బుగ్గవాగు రిజర్వాయర్ వల్ల బుగ్గమల్లేశ్వరస్వామి ఆలయంతో పాటు భూమిపైకి ఉబికి వచ్చే పాతళగంగ కూడా మునిగి ఉనికి కోల్పోయాయి.

శిథిల ఆలయం ముందు కనిపిస్తున్న శిలాశాసనంలో ఓరుగల్లు రాజుల ప్రసక్తి ఉంది. దీన్ని బట్టి 12వ శతాబ్దంలో ఈ పట్టణం విలసిల్లినట్లు ఊహించవచ్చు. వైభవ ప్రాభవాన్ని అనుభవించిన ఆ పట్టణం ఎందుకు శిథిలస్థితికి చేరిందో ఇప్పటికీ అర్ధం కాదు. ఆనాటి ముస్లిం రాజుల దండయాత్ర వల్లనో, లేక ప్రకృతి వైపరీత్యాల కారణంగానో ద్వారకావురి విధ్వంసానికి గురై ఉండవచ్చు. అయితే స్థానికులు మరో కథనం చెబుతుంటారు. శ్రీశైలం అడవుల్లో నివసించే చెంచు తెగల దాడి వల్లనే ఈ పట్టణం ధ్వంసమైందని ఈ ప్రాంత వాసులు విశ్వసిస్తున్నారు. వారి కథనం ప్రకారం.. చెంచు తెగకు చెందిన ఓ మహిళ తేనె అమ్మడానికి తన కుక్కతో ఈ పట్టణానికి వచ్చింది. ఓ ఇంట్లో తేనె విక్రయిస్తుండగా అక్కడ తిరుగుతున్న పిల్లిని చూసి ఆ కుక్క దానిపై దాడి చేసి చంపింది.

ఈ విషయమై ఆ చెంచు మహిళకు కుటుంబ సభ్యులకు ఘర్షణ జరిగి చివరకు ఆ తేనే అమ్ముకునే మహిళ హత్యకు దారితీసింది. ఆమె హత్య విషయం తెలుసుకున్న చెంచులు ప్రతీకారంతో రగిలిపోయారు. రాత్రికి రాత్రే ద్వారకాపురి పట్టణంపై దాడి చేసి మగ వారి గొంతులు కోశారని, ఈ దాడితో పట్టణం శవాల గుట్టలతో శ్మశానంగా మారిందని చెబుతుంటారు. మగ దిక్కు కోల్పోయిన మహిళలంతా పట్టణం వీడిపోగా, తప్పించుకున్న మగవారు కొన్నాళ్లకు తిరిగివచ్చారు. వారిలో కొందరు దర్మవరంలో అంతర్భాగంగా ఉన్న దారివేముల గ్రామాన్ని ఏర్పరుచుకోగా.. కొందరు దుర్గి ప్రాంతానికి వచ్చి నేటి దుర్గి గ్రామాన్ని నిర్మించుకున్నారు.

చరిత్ర నుంచి అదృశ్యమైన వాటి ద్వారకాసురి చరిత్ర నేటికీ పురావస్తు శాఖ దృష్టికి రాలేదు. అపురూప శిల్పసంపద, శిలాశాసనాలు, చారిత్రక అవశేషాలకు నిలయమైన ద్వారకాపురి ఏళ్ల తరబడి నిర్లక్ష్యానికి నిలువటద్దంలా నిలిచి ఉంది.

ఎస్ఎస్‌బీఎన్ ఎస్-4 అణు జలాంతర్గామి.

భారతదేశ రక్షణ రంగాన్ని పటిష్టం చేయడంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. విశాఖ సముద్ర తీరంలో అణుసామర్థ్యం కలిగిన ఎస్ఎస్‌బీఎన్ ఎస్-4 అనే నాలుగవ జలాంతర్గామిని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆవిష్కరించినట్లు కథనాలు వెలవడ్డాయి.

భారతదేశ రక్షణ రంగాన్ని పటిష్టం చేయడంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. విశాఖ సముద్ర తీరంలో అణుసామర్థ్యం కలిగిన ఎస్ఎస్‌బీఎన్ ఎస్-4 అనే నాలుగవ జలాంతర్గామిని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆవిష్కరించినట్లు కథనాలు వెలవడ్డాయి.

ఇది బాలిస్టిక్ క్షిపణి వ్యవస్థ కలిగిన మెుట్టమెుదటి జలాంతర్గామి కావడం విశేషం. ఇటీవల తెలంగాణలో నేవీ ర్యాడార్ కేంద్రం ప్రారంభించిన మరసటి రోజే అంటే.. అక్టోబర్ 16న విశాఖ షిప్ బిల్డింగ్ సెంటర్‌లో ఎస్ఎస్‌బీఎన్ ఎస్-4 జలాంతర్గామి ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగినట్లు తెలుస్తోంది.

ఈ ఏడాది ఆగస్టు 29వ తేదీన ఎస్ఎస్‌బీఎన్ అరిఘాత్‌ను విశాఖ కేంద్రంగా రాజ్‌నాథ్ సింగ్ జాతికి అంకితం చేశారు. మరోవైపు అక్టోబర్ 9, 2025న అణుశక్తి కలిగిన మరో జలాంతర్గామిని అరిధామాన్‌ను ప్రారంభించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. కొత్తగా ప్రారంభించబడిన ఎస్ఎఎస్‌బీఎన్ ఎస్-4ను దాదాపు 75శాతం స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేశారు.

దీనిలో 3,500 కి.మీ. దూరంలో ఉన్న లక్ష్యాన్ని సైతం ఛేదించేలా కె-4 అణు బాలిస్టిక్ క్షిపణులను అమర్చారు. అయితే మెుట్టమెుదటి అణు జలాంతర్గామి అయిన ఐఎన్ఎస్ అరిహంత్ కేవల 750కి.మీ. పరిధి లక్ష్యాన్ని మాత్రమే ఛేదించగలదు. దీనిలో కె-15 అణు క్షిపణులు ఉన్నాయి. కొత్తగా మరో అణు జలాంతర్గామి రక్షణ వ్యవస్థలోకి చేరి దేశానికి సేవలు అందించనుంది.

మరో భారీ రియల్ ఎస్టేట్ మోసం !

హైదరాబాద్‌లో స్పెక్ట్రా రియల్ ఎస్టేట్ అనే సంస్థ బోర్డు తిప్పేసింది. తక్కువ ధరలే ప్లాట్లు ఇస్తామని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్న ఈ కంపెనీ వంద కోట్లలకుపైగా వసూళ్లు చేసినట్లుగా తెలుస్తోంది. అయితే నెలలు గడిచిపోతున్నా ప్లాట్లు ఇవ్వకపోవడం తమ డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో బాధితులంతా ఆ కంపెనీ కార్యాలయం ఉన్న ఎల్బీనగర్ లో ఆందోళనకు దిగారు.

స్పెక్ట్రా రియల్ ఎస్టేట్ సంస్థ ఫామ్ ల్యాండ్స్, హెచ్‌ఎండీఏ ప్లాట్లు అమ్ముతామని ఏజెంట్లను పెట్టుకుని విస్తృతంగా ప్రచారం చేసుకుంది. మొదట్లో పెద్ద ఎత్తున లగ్జరీ కార్యక్రమాలు నిర్వహించింది. ఏజెంట్లకు ఆడికార్లు వంటివి బహుకరించింది.

ఈ బిల్డప్ చూసి భారీగా భూములున్నాయని చాలా మంది అనుకున్నారు. పద్ద ఎత్తున రిటర్న్స్ వస్తాయని చెప్పి ప్లాట్ల కోసం డబ్బులు కట్టించుకున్నారు. ఏవో ఒప్పంద పత్రాలు ఇచ్చారు కానీ అందులో భూమి, ప్లాట్ల వివరాలు లేవు.

మూడేళ్ల నుంచి వారి కార్యకలాపాలు తగ్గిపోయాయి. డబ్బులు కట్టిన వారు తమ ప్లాట్లు తమకు ఇవ్వాలని అడుగుతున్నా స్పందించడం లేదు.

చివరికి వారు స్పెక్ట్రా కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. తక్కువ ధరకు ప్లాట్లు అని చెబితే… సర్వం పోగొట్టుకున్న కుటుంబాలు లబోదిబోమంటున్నాయి.

శ్రీశైలంలో కార్తీక మాసోత్సవాలు

శని, ఆది, సోమవారం కార్తీక పౌర్ణమి, ఏకాదశి రోజులశ్రీశైలంలో కార్తీక మాసోత్సవాలులో స్వామివారి స్పర్శ దర్శనం అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ఉంటుందని ఈవో తెలిపారు. రద్దీ రోజులలో మినహా మిగిలిన రోజులలో విడతల వారిగా సామూహిక అభిషేకాలకు అవకాశం కల్పించాలని నిర్ణయించినట్లు చెప్పారు.

నంద్యాల జిల్లా శ్రీశైలం (Srisailam) శ్రీభ్రమరాంబా మల్లికార్జునస్వామి పుణ్యక్షేత్రం దేవీనవరాత్రులు అంగరంగవైభవంగా ముగిశాయి. ఇప్పుడు కార్తీక మాసోత్సవాలకు శ్రీశైలం క్షేత్రం ముస్తాబవుతోంది. శ్రీశైలంలో నవంబర్ 2 నుంచి డిసెంబర్ 1 వరకు కార్తీక మాసోత్సవాలు జరుగనున్నాయి. ఈ మేరకు మంగళవారం ఉదయం ఉత్సవాలకు సంబంధించిన వివరాలను ఈవో చంద్రశేఖర్ రెడ్డి మీడియాకు తెలియజేశారు. కార్తీకమాసమంతా శ్రీశైలంలో గర్భాలయ అభిషేకాలు పూర్తిగా నిలుపుదల చేశామని వెల్లడించారు.

శని, ఆది, సోమవారం కార్తీక పౌర్ణమి, ఏకాదశి రోజులలో స్వామివారి స్పర్శ దర్శనం అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. రద్దీ రోజులలో మినహా మిగిలిన రోజులలో విడతల వారిగా సామూహిక అభిషేకాలకు అవకాశం కల్పించాలని నిర్ణయించినట్లు చెప్పారు. రద్దీ రోజులలో అమ్మవారి అంతరాలయంలో కుంకుమార్చన, పూజలు తాత్కాలికంగా నిలుపుదల చేసి.. అమ్మవారి ఆశీర్వచన మండపంలో కొనసాగింపు ఉంటుందన్నారు. కార్తీక దీపారాధనకు భక్తులకు ఆలయ ఉత్తర మాడవీధిలో ఏర్పాటుకు సిద్ధం చేసినట్లు తెలిపారు. నవంబర్ 15న కార్తీక పౌర్ణమి కావడంతో కృష్ణమ్మకు పుణ్య నదిహారతి, సారే సమర్పణ, జ్వాలతోరణం కార్యక్రమం ఉంటుందని ఈవో చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు.

మరోవైపు ఇటీవల శ్రీశైలం పుణ్యక్షేత్రంలో దసరాశరన్నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా ఏర్పాట్లు చేశారు. ప్రతీరోజు ఒక్కో రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. అక్టోబర్ 3 నుంచి 12 వరకు దసరా మహోత్సవాలను దేవస్థానం అత్యంత వైభవంగా నిర్వహించింది. ఉత్సవాలలో స్వామి, అమ్మవార్లకు విశేష అర్చనలు, రుద్రయాగం, చండీయాగం, జపపారాయణలు, అమ్మవారి ఉత్సవమూర్తికి నవదుర్గ అలంకరణలు, స్వామి, అమ్మవార్లకు వివిధ వాహన సేవలు నిర్వహించారు. ఉత్సవాల్లో నేపథ్యంలో ఆలయ ప్రాంగణాన్ని పుష్పాలతో సుందరీకరించారు. ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేశారు. గ్రామోత్సవాన్ని తిలకించేందుకు ప్రధాన ఆలయానికి ముందుభాగాన ఎల్‌ఈడీ స్క్రీన్లను కూడా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

మరోవైపు శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు జలాశయం 4 గేట్లు 10 అడుగులు మేర ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం జలాశయం ఇన్ ఫ్లో 1,60,146 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 1,77,040 క్యూసెక్కులుగా ఉంది. అలాగే పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం నీటిమట్టం 884.20 అడుగులకు చేరింది. దాంతో పాటు పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలకు గాను ప్రస్తుతం 210.9946 టీఎంసీలుగా కొనసాగుతోంది. అటు కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.

మూడో అంతస్తు నుంచి పడి యువకుడు మృతి

హోటల్‌లో కుక్క వెంటపడటంతో మూడో అంతస్తు నుంచి పడి యువకుడి మృతి చెందాడు. స్నేహితులతో కలిసి హోటల్‌కు వెళ్లిన యువకుడు అక్కడ ఓ పెంపుడు కుక్క వెంటపడంతో ప్రమాదవశాత్తు కిటికీలో నుంచి కిందకు దూకేశాడు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర ఘటన హైదరాబాద్ చందానగర్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

హైదరాబాద్‌ చందానగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఓ హోటల్‌లో పెంపుడు కుక్క వెంటపడటంతో ప్రమాదవశాత్తు మూడో అంతస్తు నుంచి పడి యువకుడు మృతిచెందాడు. తీవ్ర గాయాలపాలైన యువకుడు స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయాడు. దీంతో అతడి కుటుంబంలో విషాదం అలుముకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రామచంద్రాపురంలోని అశోక్‌నగర్‌లో ఏపీలోని ఉమ్మడి గుంటూరు జిల్లా తెనాలికి చెందిన యువకుడు ఉదయ్‌ (23) నివాసం ఉంటున్నాడు.

ఆదివారం (అక్టోబర్ 20) స్నేహితులతో కలిసి అతడు చందానగర్‌లోని వీవీప్రైడ్‌ హోటల్‌కు డిన్నర్‌కు వెళ్లాడు. హోటల్‌ మూడో అంతస్తు బాల్కనీలోకి వెళ్లగానే అతడికి ఓ పెంపుడు కుక్క కనిపించింది. ఉదయ్ దాన్ని తరిమే ప్రయత్నం చేశాడు. దీంతో కుక్క ఉదయ్ వెంట పడటంతో.. దాన్నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో హోటల్‌ కిటికీ నుంచి ఉదయ్‌ కిందపడిపోయాడు. గమనించిన స్నేహితులు కిందకు వెళ్లి చూడగా.. అతడు అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు. అందుకు సంబంధించిన దృశ్యాలు హోటల్‌లోని సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఆదివారం రాత్రి ఈ ఘటన జరగ్గా.. విషయం బయటకు రాకుండా హోటల్ యాజమాన్యం జాగ్రత్త పడింది. తాజాగా విషయం బయటపడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

ఇక గతేడాది హైదరాబాద్‌లో ఇటువంటి విషాదకర ఘటనే చోటు చేసుకుంది. కస్టమర్ పెంపుడు కుక్క తరమడంతో బిల్డింగ్ పైనుంచి పడి స్విగ్గీ డెలివరీ బాయ్ మృతి చెందాడు. డెలివరీ ఇవ్వడానికి వెళ్లి కస్టమర్‌కు చెందిన పెంపుడు కుక్క తరమడంతో బిల్డింగ్ పైనుంచి పడి ప్రాణాలు దురదుష్టవశాత్తు ప్రాణాలు విడిచాడు. నగరానికి చెందిన 23 ఏళ్ల మహ్మద్ రిజ్వాన్ స్విగ్గీ ఏజెంట్ బాయ్‌గా పనిచేస్తుండగా.. గతేడాది జనవరిలో బంజారాహిల్స్‌లోని లుంబిని రాక్ కాజిల్ అపార్ట్‌మెంట్స్‌లో డెలివరీ ఇచ్చేందుకు వెళ్లాడు.

కస్టమర్ ఉంటున్న ఫ్లాట్‌కు వెళ్లి తలుపు తీశాడు. కొత్త వ్యక్తి కావటంతో కస్టమర్ జర్మన్ షెపర్డ్ కుక్క రిజ్వాన్‌పై దాడికి ప్రయత్నంచింది. భయపడిపోయిన రిజ్వాన్ దాన్నుంచి తప్పించుకునే క్రమంలో బిల్డింగ్‌ పైనుంచి పడి ప్రాణాలు కోల్పోయాడు. దీంతో అతడి కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది.

నవంబర్‌ నుంచివిద్యుత్తు చార్జీలు పెంచేందుకు కసరత్తు.

రాష్ట్రంలో విద్యుత్తు చార్జీల ధరలు నవంబర్‌ నుంచి పెరగనున్నాయి. దాదాపు రూ. 1200 కోట్ల మేర ప్రజలపై భారం వేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. హెచ్‌టీ క్యాటగిరీలో విద్యుత్తు చార్జీల పెంపు, ఎల్‌టీ క్యాటగిరీలో నెలకు 300 యూనిట్లకు పైగా వాడే వారికి ఫిక్స్‌డ్‌ చార్జీలను పెంచేందుకు అనుమతించాలని ఈఆర్సీ ముందు డిస్కంలు ప్రతిపాదించాయి.

రాష్ట్రంలో విద్యుత్తు చార్జీల ధరలు నవంబర్‌ నుంచి పెరగనున్నాయి. దాదాపు రూ. 1200 కోట్ల మేర ప్రజలపై భారం వేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. హెచ్‌టీ క్యాటగిరీలో విద్యుత్తు చార్జీల పెంపు, ఎల్‌టీ క్యాటగిరీలో నెలకు 300 యూనిట్లకు పైగా వాడే వారికి ఫిక్స్‌డ్‌ చార్జీలను పెంచేందుకు అనుమతించాలని ఈఆర్సీ ముందు డిస్కంలు ప్రతిపాదించాయి. ఎల్‌టీ క్యాటగిరీలో ప్రతి కిలోవాట్‌కు రూ. 10 ఫిక్స్‌డ్‌ చార్జీలుగా వసూలు చేస్తుండగా, ఇప్పుది కిలోవాట్‌కు 30 రూపాయలు పెరగనుంది. ఇలాంటి వినియోగదారులు 26 లక్షల మంది ఉన్నారు. ఈ పెంపుతో రూ. 400 కోట్లను డిస్కంలు రాబట్టుకోనున్నాయి. హెచ్‌టీలో 11కేవీ, 33కేవీ, 132 కేవీ కెపాసిటీ కనెక్షన్లకు వేర్వేరు చార్జీలుండేవి. 33 కేవీకి యూనిట్‌కు రూ. 7.15, 11 కేవీకి యూనిట్‌కు రూ. 7.65, 132 కేవీ ఆపైన యూనిట్‌కు రూ. 6.62 చొప్పున వసూలు చేస్తున్నారు. ఇకపై అన్ని క్యాటగిరీల వారికి యూనిట్‌కు రూ. 7.65 చొప్పున వసూలు చేసేందుకు అనుమతించాలని డిస్కంలు కోరాయి. దీంతో ఆయా వినియోగదారులపై రూ. 800 కోట్ల భారం పడనుంది. ఈఆర్సీ చైర్మన్‌, సభ్యుల కాలపరిమితి ఈ నెల 29తో ముగియనుంది. ఈనేపథ్యంలో డిస్కం ప్రతిపాదనలకు ఈఆర్సీ అనుమతినివ్వడం లాంఛనంగానే కనిపిస్తున్నది. ఇదే జరిగితే నవంబర్‌ ఒకటి నుంచి పెంచిన చార్జీలు అమల్లోకి వస్తాయి.

విద్యుత్తు సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లపై తెలంగాణ విద్యుత్తు నియంత్రణ మండలి (ఈఆర్సీ) బహిరంగ విచారణలు చేపట్టింది. సోమవారం జెన్‌కో ఫిక్స్‌డ్‌ ఛార్జీలు, ట్రూప్‌ అప్‌ చార్జీలపై టీజీఈఆర్సీ బహిరంగ విచారణ జరిపింది. ఇంధన సర్దుబాటు చార్జీల కింద రూ. 963.18 కోట్లకు అనుమతించాలని జెన్‌కో కోరింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి ట్రూ అప్‌ చార్జీలు, 2024-25 నుంచి 2028-29 కాలానికి (ఐదో నియంత్రణ కాలానికి) మల్టీ ఇయర్‌ టారిఫ్‌పై విద్యుత్తు నియంత్రణ మండలి (ఈఆర్సీ) సోమవారం బహిరంగ విచారణ జరిపింది. టీజీజెన్‌కో సమర్పించిన పిటిషన్‌పై తొలుత జెన్‌కో అధికారులు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ చేయగా, ఆ తర్వాత పలు ఎఫ్‌టీసీసీఐ, తెలంగాణ స్పిన్నింగ్‌ మిల్స్‌ అసోసియేషన్‌, స్టీల్‌ రంగ నిపుణులు తమతమ అభ్యంతరాలు వ్యక్తంచేశారు. ట్రాన్స్‌కో దాఖలు చేసిన రూ. 16, 346 కోట్ల ఏఆర్‌ఆర్‌ పిటిషన్‌పై ఈఆర్సీ మంగళవారం విచారణ జరపనుంది. 23న టీజీఎస్పీడీసీఎల్‌ పిటిషన్‌పై హైదరాబాద్‌లో, 24న టీజీఎన్పీడీసీఎల్‌ పిటిషన్‌పై నిజామాబాద్‌లో, 25న సెస్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై సిరిసిల్లలో ఈఆర్సీ బహిరంగ విచారణలు జరపనుంది.

కొత్త విద్యుత్తు ప్లాంట్లు 65 శాతమే పనిచేస్తే ఎలా అని ఎనర్జీ కన్సల్టెంట్‌ రణదీప్‌ ప్రశ్నించారు. ఇవి 85 శాతం పనిచేయాల్సి ఉండగా, కొన్ని 65 శాతమే పనిచేస్తున్నాయని, దీంతో నష్టాలొస్తున్నాయని పేర్కొన్నారు. తక్షణ విద్యుత్తు అవసరాలు తీర్చేందుకు బయట అధిక ధరలకు విద్యుత్తును కొనుగోలు చేయడం, స్వల్పకాలిక ఒప్పందాలు చేసుకోవాల్సి వస్తున్నదని తెలిపారు. పరిశ్రమలే డిస్కంలకు వెన్నెముకలాంటివని, కానీ డిస్కంల చర్యలు పరిశ్రమలను నిరుత్సాహపరిచేలా ఉన్నాయని విమర్శించారు. పిటిషన్ల దాఖలు తర్వాత అభ్యంతరాలు వ్యక్తం చేసేందుకు తక్కువ సమయం ఇస్తున్నారని, ఇది సరికాదని పేర్కొన్నారు. అధ్యయనం చేసి, అభ్యంతరాలు వ్యక్తం చేసేంత సమయం తమకు ఇవ్వడం లేదని పేర్కొన్నారు.

ట్రూ అప్‌ చార్జీల పెంపునకు విద్యుత్తు సంస్థలు పేర్కొన్న కారణాలు సహేతుకం కాదని సెంటర్‌ ఫర్‌ పవర్‌ స్టడీస్‌ ప్రతినిధి వేణుగోపాలరావు అభ్యంతరం వ్యక్తంచేశారు. విద్యుత్తు ప్లాంట్ల పీఎల్‌ఎఫ్‌ సామర్థ్యం పెరిగితే ఇన్సెంటివ్‌లు ఇస్తున్నట్టేనని, పీఎల్‌ఎఫ్‌ పడిపోతే జరిమానాలు ఎందుకు విధించడం లేదని ప్రశ్నించారు. విద్యుత్తు ప్లాంట్లల్లో సామర్థ్యానికంటే తక్కువగా విద్యుత్తును ఉత్పత్తి చేసి, ఓపెన్‌ మార్కెట్‌లో విద్యుత్తును కొనడంతో ప్రజలపై మోయలేని భారాన్ని మోపుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. తాము 25 ఏండ్లుగా సూచనలిస్తున్నా, వాటిని పరిగణిలోకి తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు.

వైఎస్‌ జగన్‌ రేపు గుంటూరు, కడప జిల్లాలో పర్యటన

శాంతిభద్రతలు క్షీణించడంతో ఆకతాయిల చేతుల్లో మోసపోయిన కుటుంబాన్ని పరామర్శించేందుకు మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ సిద్ధమయ్యారు. ఆయన షెడ్యూల్‌ ఇలా ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతలు క్షీణించాయని.. మహిళలకు రక్షణ కరువైందని చంద్రబాబు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి రంగంలోకి దిగనున్నారు.

స్వయంగా బాధితులను కలిసి వారికి జీవితంపై భరోసా కల్పించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే వైఎస్‌ జగన్‌ బుధవారం రెండు జిల్లాల్లో పర్యటించనున్నారు.

ఈ మేరకు జగన్‌ పర్యటన షెడ్యూల్‌ విడుదలైంది. అత్యాచార, హత్య సంఘటనలు జరిగిన గుంటూరు, కడప జిల్లాలో పర్యటన చేపట్టనున్నారు. ఈ విషయాన్ని వైఎస్సార్‌సీపీ వర్గాలు తెలిపాయి.

ఇంజనీరింగ్‌ కాలేజీలు సొంతంగా సీట్లు భర్తీ చేసుకోవచ్చు!

ఇంజనీరింగ్‌ కళాశాలలు ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఏఐసీటీఈ అనుమతించిన మేరకు కొత్త కోర్సులు, పెంచిన సీట్లు భర్తీ చేసుకునేందుకు తెలంగాణ హైకోర్టు అనుమతినిచ్చింది.

ఇంజనీరింగ్‌ కళాశాలలు ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఏఐసీటీఈ అనుమతించిన మేరకు కొత్త కోర్సులు, పెంచిన సీట్లు భర్తీ చేసుకునేందుకు తెలంగాణ హైకోర్టు అనుమతినిచ్చింది. ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కాలేజీల్లో పెంచిన సీట్లకు, కోర్సులకు మాప్‌అప్‌ రౌండ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించాలని సెప్టెంబర్‌ 9న హైకోర్టు ఉత్తర్వులిచ్చింది.

వాటి ప్రకారం కౌన్సెలింగ్‌ నిర్వహించనందుకు అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేసింది. ఉత్తర్వులను అమలు చేసే ఉద్దేశం లేదని చాలా స్పష్టంగా అర్థమవుతోందని వ్యాఖ్యానించింది. ‘‘కోర్టు ధిక్కరణ చర్యల కింద శిక్ష విధిస్తే దానిపై సుప్రీంకు వెళ్లడం ద్వారా కాలయాపన చేద్దామని అనుకుంటున్నారు. టెక్నికల్‌ కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియకు అక్టోబర్‌ 23వ తేదీ దాటిపోతే గడువు తీరిపోతుంది కాబట్టి చేతులెత్తేద్దామనుకుంటున్నారు’’ అని పేర్కొంది.

కోర్టు ధిక్కరణ వ్యాజ్యాలు దాఖలు చేసిన కాలేజీలకు సీట్లు భర్తీ చేసుకునేలా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు ఈ తీర్పును సుప్రీంలో సవాల్‌ చేయాలని సర్కారు నిర్ణయించింది. సీట్ల పెంపుకు ఏఐసీటీఈ అనుమతినిచ్చినా, జేఎన్టీయూ అనుమతిలేనిదే కోర్సులకు గుర్తింపు ఉండదు. ఇప్పటికే కౌన్సెలింగ్‌ పూర్తయిన వాటిలో మొదటి సెమిస్టర్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.

మళ్లీ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తే గతంలో వేరే కోర్సుల్లో చేరిన వారు, దూరం కాలేజీలో చేరినవారు మళ్లీ హాజరయ్యేందుకు ప్రయత్నిస్తారు. కాలేజీలు భర్తీ చేసుకున్నా ప్రభుత్వ అనుమతి లేనందున విద్యార్థులకు సర్టిఫికేట్స్‌ వచ్చే అవకాశం లేదు. ఇంకోవైపు, సింగిల్‌ జడ్జి బెంచ్‌ నుంచి వెలువడే పూర్తిస్థాయి ఉత్తర్వుల ప్రకారం నడుచుకోవాలని డివిజన్‌ పేర్కొంది. ఒకవేళ ఆ తీర్పుకు దీనికి వ్యతిరేకంగా వస్తే విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోతారు.

నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో పులి సంచారం

నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో గతంలో అంటే.. 2018లో 68 పులులు ఉన్నాయి. తాజా లెక్కల ప్రకారం.. వాటి సంఖ్య 90 నుంచి 95కు పెరిగింది. 2025 నాటికి ఈ పులుల సంఖ్య 100 దాటుతుందని అధికారులు అటవీశాఖ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

నాగార్జునసాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో పులి సంచరిస్తుంది. నాగార్జున సాగర్ డ్యామ్ ‌సమీపంలోని నాగులేటి రేంజ్ వద్ద ఈ పులి సంచరిస్తుంది. దీనిని అటవీ శాఖ సిబ్బంది వీడియోలో చిత్రీకరించింది. ఈ పులికి ఐదేళ్లు ఉంటాయని వారు తెలిపారు. గత వారం అటవీ శాఖ సిబ్బంది ఎప్పటిలాగా గస్తీ నిర్వహిస్తుంది. ఆ సమయంలో రహదారి పక్కనే ఉన్న పోదల్లో నుంచి పులి బయటకు వచ్చింది. కాసేపు పులి అక్కడే ఉండి.. అనంతరం మళ్లీ చెట్ల పోదల్లోకి వెళ్లిపోయింది.

శివాలయం, వీఆర్ఎస్‌పీ ఆనకట్ట సమీపంలోని నాగులుటి రేంజ్ వరకు శాశ్వత నీటి వనరులు ఉన్నాయి. ఆయా ప్రాంతంలో జింకలు, మొసళ్లతో సహా వన్యప్రాణులు సమృద్ధిగా ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ వన్యప్రాణుల అధికారి ఈ సందర్భంగా ధృవీకరించారు. ఇది పులులకు ఆవాసమైన ప్రాంతమని తెలిపారు. ఈ ప్రాంతం మూడు పులులకు నిలయంగా మారింది. అందులో చిన్న మగ, రెండు ఆడ పులులున్నాయని అటవీ శాఖ అధికారి వివరించారు.

ఇటీవలి సంతానోత్పత్తి కాలం అనంతరం ఈ ప్రాంతంలో ఆడ పులులు త్వరలో జన్మనిస్తాయని అధికారి పేర్కొన్నారు. మగ పులి సుమారు నెలన్నర పాటు ఆడ పులితో గడుపుతున్న దృశ్యాన్ని అటవీ అధికారులు ఏర్పాటు చేసిన కెమెరా ట్రాప్‌లో బంధించారు. అయితే నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో గతంలో అంటే.. 2018లో 68 పులులు ఉన్నాయి. కానీ తాజా లెక్కల ప్రకారం.. వాటి సంఖ్య 90 నుంచి 95కు పెరిగింది. 2025 నాటికి ఈ పులుల సంఖ్య 100 దాటుతుందని అధికారులు ఈ సందర్బంగా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఇక బెంగాల్ టైగర్లు తమ భూభాగాన్ని గుర్తిస్తాయి. ఇవి సరిహద్దులను ఏర్పాటు చేయడానికి, ఆహారం, నీరు వనరులతోపాటు సహచరులను ఆకర్షించడానికి వీలు కల్పిస్తుంటాయి. 2-ఎసిటైల్-1-పైరోలిన్ (బాసుమతి బియ్యానికి ఉండే విలక్షణమైన సువాసనను అందించే సమ్మేళనం) అనే అణువు ఉండే మూత్రాన్ని స్ప్రే చేయడం ద్వారా పులులు తమ ఉనికిని మరియు ఆధిపత్యాన్ని ఆ ప్రాంతంలోని ఇతర పులులకు తెలియజేస్తాయి.

సువాసన గుర్తుతో పాటు, పులులు తమ ప్రాదేశిక వాదాలను మరింత నొక్కి చెప్పడానికి చెట్లకు పంజా వేసి ఈ పులులు గర్జిస్తాయి. అనేక ముఖ్యమైన కారణాల వల్ల పులులు తమ భూభాగాన్ని గుర్తించుకుంటాయి. అడవిలో జీవించడంతోపాటు వృద్ధి చెందడానికి వాటికి ఇవి సహాయపడతాయి.

సీఎం స్టాలిన్ కీలక వ్యాఖ్యలు

జనాభా నియంత్రణపై ఆందోళన వ్యక్తం చేస్తూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆసిక్తకర వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఒక్కరూ 16 మంది పిల్లలను కనాలనే ఆలోచనతో ఎందుకు ఉండకూడదు అని ప్రశ్నించారు.

తిరువాన్మియూర్లోని మరుంధీశ్వరార్ ఆలయం కళ్యాణ మండపంలో సోమవారం నిర్వహించిన 31 జంటల కల్యాణోత్సవానికి సీఎం స్టాలిన్ హాజరయ్యారు. ఈ కార్యక్రమం అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు. జనాభా నియంత్రణ విధానాలు పకడ్బందీగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలకు పార్లమెంటులో ప్రాతినిధ్యం తగ్గిపోయి, నిధుల కేటాయింపులో కోత పడొచ్చన్న విశ్లేషణల నేపథ్యంలో స్టాలిన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

'కొత్తగా పెళ్లయిన జంటలకు 16 రకాల ఆస్తులను పొందాలని పూర్వం పెద్దలు ఆశీర్వాదించేవారు. ఇప్పుడు ఆస్తికి బదులుగా 16 మంది పిల్లలను కనాలని, వారు ఆనందంగా జీవించాలని దీవించండి. జనాభా నియంత్రణ కారణంగా పార్లమెంట్ నియోజకవర్గాల సంఖ్య తగ్గిపోతోంది. పరిస్థితులు తగ్గట్టుగా మారాలి. ప్రతి ఒక్కరూ 16 మంది పిల్లలను కనాలనే ఆలోచనతో ఎందుకు ఉండకూడదు?' అని స్టాలిన్ ప్రశ్నించారు.

మరోవైపు కుటుంబ నియంత్రణలో విజయం సాధించిన దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని కాంగ్రెస్ పేర్కొంది. లోక్సభలో సీట్ల కేటాయింపు కోసం జనాభా లెక్కలను ఉపయోగించాలా అని కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్ ప్రశ్నించారు. 'కుటుంబ నియంత్రణను అమలు చేయడంలో దక్షిణాది రాష్ట్రాలు ముందున్నాయి. 1988లో కేరళ, 1993లో తమిళనాడు, 2001లో ఆంధ్రప్రదేశ్, 2005లో కర్ణాటక- జనాభా పెరుగుదల నియంత్రణలో మొదటి స్థానంలో నిలిచాయి.

అయితే ఈ విజయాలు పార్లమెంట్లో ప్రాతినిధ్యాన్ని తగ్గిస్తుందని గత కొంత కాలంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. 2001లో వాజ్‌పేయీ ప్రభుత్వం 84వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా లోక్‌సభ సభ్యుల సంఖ్యను 2026 వరకు మార్పు చేయకూడదని నిర్దేశించింది. అంటే 2031 జనాభా లెక్కల ప్రకారమే నియోజకవర్గాల పునర్‌ వ్యవస్థీకరణ ఉంటుంది. ఇంతవరకు 2021 జనాభా లెక్కలను నిర్వహించలేదు. త్వరలో ప్రారంభిస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఒకవేళ లెక్కిస్తే వాటిని లోక్సభ సీట్ల కోసం ఉపయోగిస్తారా లేదో చూడాలి' అని జైరాం రమేశ్ అన్నారు.