◆ జోరుగా ప్రచార పర్వం ◆ సామాన్యుడిని.. ఆశీర్వదించండి
.
● శింగనమల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు. నిరుపేద కుటుంబం నుంచి వచ్చి సామాన్య పార్టీ కార్యకర్తగా ఉన్న తనకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా పెద్ద బాధ్యత అప్పగించారని తనను గెలిపించాలని ఎం. వీరాంజనేయులు కోరారు. గార్లదిన్నె మండలం ముకుందాపురం, యర్రగుంట్ల, కేకే తాండ, కొట్టాలపల్లి, కామలాపురం గ్రామాల్లో " మన ఊరికి మన వీరా" కార్యక్రమంలో భాగంగా వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు పైలా నరసింహయ్య, అనంతపురం ఎంపీ అభ్యర్థి శంకర్ నారాయణ, ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బోయ గిరిజమ్మ, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెన్నోబుళేసు, మాజీ ఏడిసిసి బ్యాంక్ చైర్మన్ పామిడి వీరాంజనేయులుతో కలసి ఆయన ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. గ్రామాల్లోని పార్టీ శ్రేణులు శాలువాలతో సన్మానించి ఘన స్వాగతం పలికారు. ఇంటింటికి తిరుగుతూ సంక్షేమ పథకాల లబ్దిని వివరిస్తూ, నిరుపేదను దీవించి "ఫ్యాన్" గుర్తుకు ఓటు వేసి మెజార్టీతో గెలిపించాలని కరపత్రాలను అందజేస్తూ అభ్యర్థించారు. వీరాంజనేయులు మాట్లాడుతూ.. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో లేని వలంటీర్ల వ్యవస్థతో మన రాష్ట్రంలో ఇంటింటికి సంక్షేమ పథకాలు అందించి అగ్రగామిగా నిలిచిందన్నారు. సీఎం జగనన్న పై కక్షతో పేదలను ఇబ్బంది పెట్టేలా చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నాడని విమర్శించారు. వలంటీర్లపై ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయం వల్ల పెన్షన్ తీసుకునే అవ్వా, తాతలు, వికలాంగులు తీవ్రంగా ఇబ్బంది పడుతారని ఈసీ తన నిర్ణయాన్ని పునఃసమీక్షిస్తే బాగుంటుందని విజ్ఞప్తి చేశారు. జగనన్న పరిపాలనలో ఇంటి దగ్గరికి సంక్షేమ పథకాలు అందించడం వల్ల చంద్రబాబు నాయుడు ఓటమి భయంతో ఇలాంటి నీచ పనులకు పాల్పడుతున్నారన్నారు. పేదల ఉసురు తగులుతుందన్నారు. ఇలాంటి ఘాతకానికి తలపడుతున్న టిడిపికి ఓటు వేసే ప్రసక్తే లేదని ప్రజలు చెబుతున్నారన్నారు. రానున్న ఎన్నికలలో అసెంబ్లీ స్థానానికి తనకు, ఎంపీ అభ్యర్థి గా శంకర్ నారాయణ కు "ఫ్యాన్ " గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
Sep 09 2024, 08:09