హైడ్రా పేరుతో రూ.20 లక్షలు డిమాండ్‌...

సోషల్‌ వర్కర్‌ ముసుగులో హైడ్రా పేరు చెప్పి రూ. 20 లక్షలు ఇవ్వాలని బిల్డర్లను డిమాండ్‌ చేసిన వ్యక్తిపై అమీన్‌పూర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌(Sangareddy District Aminpur) మున్సిపాలిటీ పరిధిలో సాయివిల్లాస్‌ రోడ్డులో ఎంసీఆర్‌ఓ ప్రాజెక్ట్‌ పేరుతో జూబ్లీహిల్స్‌(Jubilee Hills)కు చెందిన బిల్డర్లు వాడల రాజేంద్రనాథ్‌, మంజునాథ్‌రెడ్డి అపార్ట్‌మెంట్‌ నిర్మిస్తున్నారు.

 లక్షలు ఇవ్వాలని బిల్డర్లను డిమాండ్‌ చేసిన వ్యక్తిపై అమీన్‌పూర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌(Sangareddy District Aminpur) మున్సిపాలిటీ పరిధిలో సాయివిల్లాస్‌ రోడ్డులో ఎంసీఆర్‌ఓ ప్రాజెక్ట్‌ పేరుతో జూబ్లీహిల్స్‌(Jubilee Hills)కు చెందిన బిల్డర్లు వాడల రాజేంద్రనాథ్‌, మంజునాథ్‌రెడ్డి అపార్ట్‌మెంట్‌ నిర్మిస్తున్నారు. అన్ని రకాల అనుమతులు ఉన్నప్పటికీ, అపార్ట్‌మెంట్‌ పెద్దచెరువు నాలా బఫర్‌జోన్‌ పరిధిలోకి వస్తుందని, అదే కాలనీలో అద్దెకు ఉండే ఫిజియోథెరపిస్ట్‌ డాక్టర్‌ బండ్ల విప్లవ్‌సిన్హా కొంతకాలంగా వేధింపులకు గురిచేస్తున్నాడు.

ఫ్లాట్లు చూసేందుకు వచ్చే కస్టమర్లకు తప్పుడు సమాచారం ఇస్తున్నాడు. సామాజిక కార్యకర్తగా చెప్పుకునే ఆయన పలు ప్రభుత్వ శాఖలకు పదేపదే ఫిర్యాదులు చేస్తున్నాడు. ఇటీవల ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రాను అడ్డం పెట్టుకుని పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేయడం ప్రారంభించాడు. హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ పలుమార్లు అమీన్‌పూర్‌లో పర్యటించిన సందర్భంలో ఠంచన్‌గా ప్రత్యక్షమై ఆయనతో ఫొటోలు తీయించుకున్నాడు. గత నెలలో హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ వచ్చిన మరుసటి రోజు బిల్డర్లు రాజేంద్రనాథ్‌రెడ్డి, మంజునాథ్‌రెడ్డిలను అశోక్‌నగర్‌ పిస్తాహౌజ్‌ వద్దకు పిలిపించి, తనకు హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ చాలా దగ్గర అని ఫొటోలు చూపించి బెదిరించాడు.

అపార్ట్‌మెంట్‌ కూల్చకుండా ఉండాలంటే తనకు రూ.20 లక్షలు ముట్టచెప్పాలని లేదంటే, పత్రికల్లో వార్తలు రాయించి కూల్చివేయిస్తానన్నాడు. మరోమారు గచ్చిబౌలి ఆఫ్రికన్‌ కాఫీ హౌజ్‌ వద్దకు పిలిపించి తక్షణం ఎంతోకొంత డబ్బు ఇవ్వాలని, లేదంటే కూల్చడం ఖాయమని తీవ్రంగా బెదిరించాడు. హైడ్రా కమిషనర్‌తో పాటు గతంలో మంత్రులు పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, దామోదర రాజనర్సింహతో దిగిన ఫొటోలను చూపించి బ్లాక్‌మెయిల్‌ చేయడంతో బిల్డర్లు కంగుతిన్నారు. ఇతడి వేధింపులు భరించలేక బాధితులు అమీన్‌పూర్‌ పోలీ్‌సస్టేషన్‌లో మంగళవారం ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అమీన్‌పూర్‌ ఎస్‌ఐ టి.విజయరావు తెలిపారు.

ఆర్జిత సేవలను రద్దు చేసిన టీటీడీ- ఆ తేదీలు ఇవే

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆల‌యంలో ఈ నెల 10వ తేదీన కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం కార్యక్రమం జరుగనుంది. 16వ తేదీ నుంచి పవిత్రోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు.

ఆ రోజున తెల్లవారు జామున సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చ‌న, శుద్ధి నిర్వ‌హిస్తారు. ఉదయం 7 నుంచి 9.30 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరగనుంది. ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేస్తారు.

అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రమిశ్రమాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. ఉదయం 10 గంటల నుంచి పద్మావతి అమ్మవారి సర్వదర్శనానికి భక్తులకు అనుమతిస్తారు.

ఈ నెల 16 నుంచి 18వ తేదీ వరకు మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలను నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలకు 15వ తేదీ సాయంత్రం అంకురార్పణ చేస్తారు ఆలయ అర్చకులు. విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, మృత్సంగ్ర‌హణం, సేనాధిపతి ఉత్సవాలను చేపడతారు.

ఆల‌యానికి వచ్చే భక్తులు లేదా ఇక్కడ విధుల్లో ఉండే సిబ్బంది వల్ల గానీ కొన్ని దోషాలు తెలియక జరుగుతుంటాయి. ఇలాంటి వాటి వల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి విఘాతం కలకుండా నివారించడానికి ప్రతి సంవత్సరం మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.ఈ పవిత్రోత్సవాలలో ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. 16వ తేదీన పవిత్ర ప్రతిష్ఠ, 17న పవిత్ర సమర్పణ, 18న పూర్ణాహుతి కార్యక్రమాలు ఉంటాయి. 750 రూపాయలను చెల్లించడం ద్వారా ఈ పవిత్రోత్సవాల ఆర్జిత సేవలో పాల్గొనవచ్చు.

హైడ్రా పేరుతో వసూళ్లకు పాల్పడితే జైలుకే

హైడ్రాకు ఫిర్యాదు చేస్తామంటూ బెదిరించి వసూళ్లకు పాల్పడితే జైలు జీవితం తప్పదని హైడ్రా కమిషనర్ హెచ్చరించారు. గత కొద్ది రోజులు ట్రై సిటీ పరిధిలో హైడ్రా విభాగం విస్తృతంగా అక్రమ నిర్మాణాల తొలగింపులు చేపడుతున్న నేపథ్యంలో కొద్ది మంది సామాజిక కార్యకర్తల ముసుగులో బఫర్ జోన్, ఎఫ్.టి.ఎల్ పరిధిలో లేదా వాటి పరిసరాల్లో నిర్మాణం చేపడుతున్న బిల్డర్లను ఇది అక్రమ నిర్మాణమని, బఫర్ జోన్, ఎఫ్.టి.ఎల్ పరిధిలో నిర్మిస్తున్నారని హైడ్రాకు ఫిర్యాదు చేస్తామని, అలాగే అధికారులతో వున్న ఫోటోలు చూపించి హైడ్రా విభాగంలోని ఉన్నతాధికారులతో తమకు పరిచయాలు వున్నాయని, మీకు ఎలాంటి సమస్య రాకుండా చేస్తామని ఇందుకోసం కొంత డబ్బు ముట్టజెప్పాల్సిందిగా.. లేదంటే హైడ్రాకు ఫిర్యాదు చేస్తామని కొద్ది మంది వ్యక్తులు, సంస్థలు బిల్డర్లను బెదిరింపులు పాల్పడటంతో పాటు గత కొద్దికాలంగా బహుళ అంతస్తుల్లో, వ్యక్తిగత గృహల్లో నివాసం వుంటున్న వారి వద్ద ఇలాంటి బెదిరింపులకు పాల్పడడం జరుగుతోంది.

ఎవరైనా మిమ్మల్ని ఇలాంటి బెదిరింపులకు పాల్పడుతున్నట్లైతే.. అలాగే ఇతర ప్రభుత్వ విభాగాలైన రెవెన్యూ, మున్సిపల్, నీటి పారుదల విభాగాలతో పాటు హైడ్రా విభాగానికి చెందిన అధికారులు, సిబ్బంది సైతం ఎవరైనా కూడా హైడ్రా పేరుతో బెదిరింపులకు పాల్పడుతూ డబ్బు కావాలని ఒత్తిడి చేస్తే ప్రజలు, బిల్డర్లు తక్షణమే స్థానిక పోలీస్ స్టేషన్ లో కానీ, ఎస్పీకి, సీపీకి కానీ లేదా హైడ్రా కమిషనర్, ఏసీబీకి కూడా ఫిర్యాదు చేయాలన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి మంచి ఉద్దేశాలతో ఈ హైడ్రా విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, ఎవరైనా ఈ విభాగాన్ని నీరుగార్చే ప్రయత్నాలు కానీ, తప్పుదోవ పట్టించే విధంగా యత్నించే వారిపై కూడా కఠినంగా వ్యవహరిస్తామని, ఈ విభాగం పేరుతో ఎవరైనా వ్యక్తులు స్వార్థ ప్రయోజనాల కోసం డబ్బు వసూళ్ల చర్యలకు పాల్పడితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని హైడ్రా కమిషనర్ హెచ్చరించారు.

హైడ్రా పేరుతో డబ్బు వసూళ్ళకు పాల్పడిన వ్యక్తి అరెస్ట్…

ఈ బెదిరింపు వసూళ్లకు సంబంధించి సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ ప్రాంతానికి చెందిన డా.విప్లవ్ సామాజిక కార్యకర్త ముసుగులో స్థానిక బిల్డర్ ను డబ్బుల కోసం బెదిరింపులకు పాల్పడుతున్నట్లుగా సదరు బాధిత బిల్డర్ గత సోమవారం హైడ్రా కమిషనర్ ను కలిసి ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదును పరిశీలించిన వాస్తవాలు గ్రహించి అనంతరం హైడ్రా కమిషనర్ సూచన మేరకు ఎస్పీ సంగారెడ్డి బాధిత బిల్డర్ నుండి ఫిర్యాదు స్వీకరించారు. ఈ ఫిర్యాదుతో ఎస్పీ ఆదేశాల మేరకు స్థానిక పోలీసులు హైడ్రా పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్న డా.విప్లవ్ అనే వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని పోలీసులు ఇవాళ ఉదయం అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

శ్రీశైలం రైట్ పవర్ హౌస్‌లో భారీ పేలుడు..

శ్రీశైలం కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఏడో నంబర్ యూనిట్‌లో కండెన్సర్ కాలిపోయి భారీ శబ్దాలతో పేలుడు జరిగింది. పవర్ హౌస్‌లో వచ్చిన శబ్దాలకు సిబ్బింది పరుగులు పెట్టారు.

శ్రీశైలం కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఏడో నంబర్ యూనిట్‌లో కండెన్సర్ కాలిపోయి భారీ శబ్దాలతో పేలుడు జరిగింది. పవర్ హౌస్‌లో వచ్చిన శబ్దాలకు సిబ్బింది పరుగులు పెట్టారు. కాసేపు ఏం జరిగింతో అర్థంకాక ఉద్యోగులు అయోమయానికి గురయ్యారు. అసలే జలశయానికి వరద ఉద్ధృతి అధికంగా ఉండడంతో ఏం జరిగిందో అని భయాందోళనకు గురయ్యారు.

ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు ఏడో నంబర్ యూనిట్‍లో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేశారు. అనంతరం సమస్యను గుర్తించిన అధికారులు సాంకేతిక లోపం తలెత్తి శబ్దాలు వచ్చినట్లు తెలిపారు. కండెన్సర్ కాలిపోయి పేలుడు సంభవించినట్లు గుర్తించి మరమ్మతులు చేపట్టారు. సమస్యను పరిష్కరించిన విద్యుత్ ఉత్పత్రి ప్రారంభించేందుకు చర్యలు చేపట్టారు

మరోవైపు శ్రీశైలం జలాశయానికి వరద ఉద్ధృతి కాస్త తగ్గింది. ప్రాజెక్టు ఇన్ ఫ్లో 99,615క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో 1,81,235క్యూసెక్కులుగా ఉంది. దీంతో జలాశయం 6గేట్లు 10అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885అడుగులు కాగా.. ప్రస్తుతం 883.50అడుగులకు చేరుకుంది.

సికింద్రాబాద్‌-విజయవాడ రైళ్లకు నేటి సాయంత్రం నుంచి అనుమతి!

మహబూబాబాద్‌ జిల్లాలో ఆరు చోట్ల ధ్వంసమైన రైల్వే ట్రాక్‌ల పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి.

క్‌ల పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. ఒక్కో ప్రాంతంలో 100 మంది చొప్పున సుమారు 600 మంది కూలీలు పనులు చేస్తున్నారు. సుమారు 200 మంది అధికారులు, సిబ్బంది పనులను పర్యవేక్షిస్తున్నారు.

బుధవారం సాయంత్రం నుంచి సికింద్రాబాద్‌-విజయవాడ మార్గంలో రైళ్ల రాకపోకలకు అనుమతిస్తామని అధికారులు తెలిపారు. ఆదివారం వరద ఉధృతికి ఇంటికన్నె-కేసముద్రం సెక్షన్‌లో రెండు చోట్ల 70 మీటర్ల చొప్పున ట్రాక్‌ కొట్టుకుపోయింది. మహబూబాబాద్‌-కేసముద్రం సెక్షన్‌లో నాలుగు చోట్ల ఇదే పరిస్థితి నెలకొంది.

మొత్తం 420 మీటర్ల ట్రాక్‌ కొట్టుకుపోయింది. మహబూబాబాద్‌- కేసముద్రంమధ్య పునరుద్ధరణ పనులను పూర్తి చేసి గూడ్స్‌ రైలుతో ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. అయితే, ఇంటికన్నె-కేసముద్రం సెక్షన్‌లో వరద ఉధృతి తగ్గకపోవడంతో పనులు నెమ్మదిగా సాగుతున్నాయి.

అదుకో మంటున్న ఆంధ్ర ప్రదేశ్

దాతలు తమ విరాళాలు ఇలా పంపండి..

ఊహించని ఉపద్రవం వారిని ముంచెత్తింది. ఒక్కసారిగా దూసుకొచ్చిన రాకసి వరద.. నిలువ నీడ లేకుండా చేసింది. ఇళ్లకు ఇళ్లను ముంచెత్తడంతో వేలాది మంది నిరాశ్రయులయ్యారు. కట్టుబట్టలు మినహా దిక్కులేక ఆర్తనాదాలు చేస్తున్నారు. ఆదుకోండయ్యా అని దీనంగా చూస్తున్నారు.

ఊహించని ఉపద్రవం వారిని ముంచెత్తింది. ఒక్కసారిగా దూసుకొచ్చిన రాకసి వరద.. నిలువ నీడ లేకుండా చేసింది. ఇళ్లకు ఇళ్లను ముంచెత్తడంతో వేలాది మంది నిరాశ్రయులయ్యారు. కట్టుబట్టలు మినహా దిక్కులేక ఆర్తనాదాలు చేస్తున్నారు. ఆదుకోండయ్యా అని దీనంగా చూస్తున్నారు. ఇలాంటి సమయంలోనే.. సాటి మనుషుగా వరద బాధితులకు మనందరం అండగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సైతం తనవంతు బాధితులకు భరోసా ఇస్తోంది. వరద బాధితులు భారీ స్థాయిలో ఉండటంతో దాతలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. దాతలు తమకు తోచినంత సాయం చేయాలని.. వరద బాధితులకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే చాలా మంది ప్రముఖులు వరద బాధితుల కోసం సీఎం సహాయ నిధికి విరాళాలు ఇస్తున్నారు.

వరద బాధితులకు స్వచ్ఛందంగా ఆహారం ఇవ్వదలచిన దాతల కోసం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో పాయింట్ ఏర్పాటు చేశారు. సాయం చేసే దాతలు ఐఏఎస్ మనజీర్‌ను సంప్రదించాలని ప్రభుత్వం ప్రకటించింది. ఆయన నెంబర్ కూడా ప్రకటించింది. దాతలు 79067 96105 కు సంప్రదించొచ్చని తెలిపింది. ఇక వ్యక్తిగత ధన సహాయం చేయదల్చిన దాతలు ఆన్‌లైన్ ద్వారా చెల్లించొచ్చని ప్రభుత్వం తెలిపింది. ఇందుకోసం ప్రభుత్వ బ్యాంక్ అకౌంట్ వివరాలను ప్రకటించింది.

దాతలు ఈ అకౌంట్‌కు నిధులు పంపొచ్చు..

SBI

A/c name : CMRF

A/c number : 38588079208

Branch: AP Secretariat, Velagapudi.

IFSC code : SBIN0018884

Union Bank of India

A/c name : CM Relief Fund

A/c number : 110310100029039

Branch: AP Secretariat, Velagapudi.

IFSC code : UBIN0830798.

అదానీ గ్రూప్ కొత్త కంపెనీకి ఆమోదం.. షేర్లు అమ్మేస్తున్న ఇన్వెస్టర్స్..

అదానీ గ్రూప్ దేశంలోని ఎనర్జీ రంగంలో కొత్త కంపెనీ ఏర్పాటుకు తీవ్రంగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. అయితే గ్రూప్ తీసుకున్న ఈ నిర్ణయంతో అనేక మంది ఇన్వెస్టర్లు అదానీ గ్రీన్ ఎనర్జీ షేర్లను విక్రయిస్తున్నారు.

గౌతమ్ అదానీ గ్రూప్ కంపెనీ అయిన అదానీ గ్రీన్ ఎనర్జీ డైరెక్టర్ల బోర్డు టోటల్ ఎనర్జీస్‌తో జాయింట్ వెంచర్ ఒప్పందాన్ని ఆమోదించింది. దీని కింద రెండు సంస్థలు 50:50 నిష్పత్తిలో జాయింట్ వెంచర్‌లో వాటాను కలిగి ఉంటాయని వెల్లడైంది. తాజా డీల్ ద్వారా విదేశీ సంస్థ అదానీ గ్రూప్ కంపెనీలో కొత్తగా 444 మిలియన్ డాలర్లను అదనంగా పెట్టుబడి పెట్టనుంది. అయితే కంపెనీ కొత్త అడుగులు వేస్తున్న తరుణంలో అదానీ గ్రీన్ ఎనర్జీ షేర్లు క్షీణించాయి. ఈ క్రమంలో స్టాక్ ధర 2 శాతానికి పైగా క్షీణించింది. మార్కెట్ల క్లోజింగ్ సమయంలో స్టాక్ ధర ఎన్ఎస్ఈలో ఒక్కోటి 2.66 శాతం క్షీణించి రూ.1894 వద్ద స్థిరపడింది.

అదానీ గ్రీన్ ఎనర్జీ కంపెనీ, టోటల్ ఎనర్జీస్, అదానీ రెన్యూవబుల్ ఎనర్జీ సిక్స్టీ ఫోర్ లిమిటెడ్ మధ్య గట్టి ఒప్పందాలు చేసుకోనున్నట్లు స్టాక్ మార్కెట్‌కు ఇచ్చిన సమాచారంలో పేర్కొంది. ఒప్పందంలోని వివరాల ప్రకారం అదానీ గ్రీన్ ఎనర్జీతో కొత్తగా ఏర్పాటు చేయనున్న జాయింట్ వెంచర్ కంపెనీలో ఫ్రెంచ్ సంస్థ టోటల్ ఎనర్జీస్ నేరుగా లేదా దాని అనుబంధ సంస్థల ద్వారా అవసరమైన పెట్టుబడి మెుత్తాన్ని ఇన్వెస్ట్ చేయనున్నట్లు వెల్లడైంది. కొత్తగా ఏర్పాటౌతున్న కంపెనీ 1,150 మెగావాట్ల సోలార్ ఎనర్జీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

అదానీ గ్రూప్ ఇంధన రంగంపై దృష్టి సారిస్తున్న ప్రస్తుత సమయంలో కొత్త కంపెనీ ఏర్పాటు చాలా కీలకంగా మారింది. కంపెనీ ప్రస్తుత చర్యలతో రానున్న కాలంలో అదానీ గ్రీన్ ఎనర్జీ నిర్వహణ సామర్థ్యం 30 శాతానికి పైగా పెరిగి 2030 నాటికి 50,000 మెగావాట్లను దాటే అవకాశం ఉంది. అదానీ గ్రీన్ ఎనర్జీ వార్షిక ప్రాతిపదికన 6,000 నుంచి 7,000 మెగావాట్ల సామర్థ్యాన్ని జోడించి ప్రపంచంలోనే అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి కంపెనీగా అవతరించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం అదానీ గ్రీన్ ఎనర్జీ హోల్డింగ్ పరిశీలిస్తే ప్రమోటర్లు కంపెనీలో 57.52 శాతం వాటాలను కలిగి ఉన్నారు.

తెలుగు రాష్ట్రాలకు భారీ విరాళం ప్రకటించిన నందమూరి బాలకృష్ణ

సీఎం సహాయ నిధికి విరాళాలు అందించాలని ఇరురాష్ట్రాల సీఎంలు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ పిలుపునకు హిందూపురం ఎమ్మెల్యే, దిగ్గజ సినీనటుడు నందమూరి బాలకృష్ణ స్పందించారు. తెలుగు రాష్ట్రాల సీఎంల సహాయనిధికి కోటి రూపాయల విరాళాన్ని బాలయ్య ప్రకటించారు.

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తెలుగు రాష్ట్రాలు ఎంతలా తల్లిడిల్లిపోయాయో తెలిసిందే. ఏపీలో విజయవాడ, పరిసర ప్రాంతాలు, తెలంగాణలోని ఖమ్మం పట్టణ పరిసర ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. ముఖ్యంగా ఏపీలో లక్షలాది మంది నిరాశ్రయులుగా మారారు. ఈ నేపథ్యంలో సీఎం సహాయ నిధికి విరాళాలు అందించాలని ఇటు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు.. అటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ పిలుపునకు హిందూపురం ఎమ్మెల్యే, దిగ్గజ సినీనటుడు నందమూరి బాలకృష్ణ స్పందించారు.

తెలుగు రాష్ట్రాల సీఎంల సహాయనిధికి కోటి రూపాయల విరాళాన్ని బాలయ్య ప్రకటించారు. బాధాతప్త హృదయంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50 లక్షలు, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50 లక్షలు తనవంతు బాధ్యతగా బాధిత ప్రజల సహాయార్థం విరాళంగా అందిస్తున్నానని ఆయన తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆయన ప్రకటన చేశారు.

50 ఏళ్ల క్రితం మా నాన్న గారు నా నుదుటిన దిద్దిన తిలకం ఇంకా మెరుస్తూనే ఉంది. 50 ఏళ్ల నుంచి నా నట ప్రస్థానం కొనసాగుతూనే ఉంది. వెలుగుతూనే ఉంది. తెలుగు భాష ఆశీస్సులతో, తెలుగుజాతి అభిమాన నీరాజనాలతో పెనవేసుకున్న బంధం ఇది. ఈ ఋణం తీరనిది. ఈ జన్మ మీ కోసం.. మీ ఆనందం కోసం.. నా ఈ ప్రయాణంలో సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ప్రస్తుతం తెలుగు నేలను వరద ముంచెత్తుతోంది. ఈ విపత్కర పరిస్థితులలో బాధాతప్త హృదయంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50 లక్షలు, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50 లక్షలు నావంతు బాధ్యతగా బాధిత ప్రజల సహాయార్థం విరాళంగా అందిస్తున్నాను. రెండు రాష్ట్రాలలో మళ్లీ అతి త్వరలోనే సాధారణ పరిస్థితులు నెలకొనాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. మీ నందమూరి బాలకృష్ణ’’ అని బాలయ్య భావోద్వేగ పోస్ట్ పెట్టారు.

సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ (మంగళవారం) కీలకమైన ప్రకటన చేశారు. వరద బాధితులకు అండగా నిలిచేందుకు మంచి మనసుతో ముందుకు రావాలని, ఎవరికి తోచిన విధంగా వారు సీఎం సహాయనిధికి సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. సీఎం ఇచ్చిన ఈ పిలుపునకు స్పందన వస్తోంది. టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న సీఎం సహాయ నిధికి రూ.5 లక్షలు విరాళం ప్రకటించారు. మరోవైపు స్వస్ఛంధ సేవాలు కూడా కదిలాయి. విజయవాడ వరద బాధితులకు సాయం చేసేందుకు స్వచ్ఛంద సేవా సంస్థలు, దాతలు ముందుకొచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లు జై భారత్ క్షీరా ఆక్వా సంఘం తరఫున 2000, కాస్మో క్లబ్ తరఫున 3000 ఆహార పొట్లాలు విజయవాడకు తరలిస్తున్నారు. కాగా స్వచ్చంధంగా ముందుకొచ్చే దాతలకు మరింత సమాచారం అందించేందుకు 79067 96105 నెంబర్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

వ‌ర‌ద బాధితులకు ఆ న‌లుగురు భారీ విరాళం!

భారీ వ‌ర్షాలు తెలుగు రాష్ట్రాల్ని ముంచెత్తిన సంగ‌తి తెలిసిందే. దీంతో సినీ ప‌రిశ్ర‌మ నుంచి పెద్ద ఎత్తున విరాళాలు అందుతున్నాయి. ఇప్ప‌టికే ప‌లువురు న‌టులు, నిర్మాత‌లు విరాళం అందించ‌గా తాజాగా మ‌రింత మంది ముందుకొచ్చారు. ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్, నిర్మాతలు ఎస్ . రాధాకృష్ణ‌, నాగ‌వంశీ 50 లక్ష‌లు విరాళం ప్ర‌క‌టించారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ కి 25 ల‌క్ష‌లు, తెలంగాణ‌కు 25 ల‌క్ష‌లు చొప్పున 50 ల‌క్ష‌లు ముఖ్య‌మంత్రుల‌ స‌హాయ నిధికి అంద‌జేస్తున్న‌ట్లు తెలిపారు. `భారీ వ‌ర్షాల వ‌ల్ల ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో జ‌రుగుతోన్న ఆస్తి, ప్రాణ న‌ష్టాలు మ‌మ్మ‌ల్ని ఎంత‌గానో క‌లచి వేసాయి. ఆ విప‌త్తు నుంచి తెలుగు ప్ర‌జ‌లు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆ దేవుడిని ప్రార్ధిస్తూ మా వంతు స‌హాయం అందిస్తున్నాం` అన్నారు.

అలాగే యువ న‌టుడు సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ కూడా ఆప‌న్న హ‌స్తం అందించారు. ఒక్కో రాష్ట్రానికి 15 ల‌క్ష‌లు చొప్పున రెండు తెలుగు రాష్ట్రాల‌కు 30 ల‌క్ష‌లు విరాళం అందించారు.` తెలుగు రాష్ట్రాల‌ను వ‌ర‌ద‌లు ముంచెత్త‌డం బాధాక‌రం. ప్ర‌జ‌లు ప‌డుతోన్న ఇబ్బంది చూస్తుంటే ఎవ‌రికీ ఇలాంటి ప‌రిస్థితి రాకూడ‌దనిపిస్తుంది.

ఈ వ‌ర‌ద‌లు చాలా కుటుంబాల‌ను క‌ష్టాల్లోకి నెట్టేసాయి. ఇలాంటి స‌మ‌యంలో ఒక‌రికొక‌రు తోడుగా ఉండటం ఎంతైనా అవ‌స‌రం. వ‌ర‌ద బాధితుల‌కు నా వంతుగా తెలుగు రాష్ట్రాల‌కు 30 ల‌క్ష‌లు అందిస్తున్నా. ఇది కొంత మందికి ఏదో రూపంలో ఉప‌యోగ ప‌డుతుంద‌ని ఆశిస్తున్నాను` అని అన్నారు.

వాతావరణ శాఖ మరో హెచ్చరిక.. మరో మూడు రోజుల్లో మరో ముప్పు..

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో దేశంలోని అనేక ప్రాంతాల్లో రుతుపవనాల వర్షాలు కురుస్తున్నాయి. శని, ఆదివారాల్లో కురిసిన భారీ వర్షాలు సోమవారం నాటికి తగ్గుముఖం పట్టినా ముసురు మాత్రం ఎడతెరిపి లేకుండా పోతోంది. సోమవారం రాత్రి 9 గంటల వరకు నగరంలోని నాగోల్‌లో అత్యధికంగా 1.33 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఇప్పటికే తీరం దాటిన వాయుగుండం 12 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని, దీని ప్రభావంతో రాగల మరో మూడు రోజులు గ్రేటర్‌లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు, మరికొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు తెలిపారు. కాగా.. నేటి నుంచి వచ్చే 4 రోజుల వరకు రాష్ట్రవ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. హైదరాబాద్‌లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. దీంతో తెలంగాణకు ఐఎండీ ఎల్లో అలర్ట్ ప్రకటించింది.

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోనూ వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టాయి. అయితే ఈరోజు కూడా ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. అలాగే ఇతర జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.

సెప్టెంబర్ 5 నాటికి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం..

మరోవైపు ఏపీ, తెలంగాణలకు భారత వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ చేసింది. మరో మూడు రోజుల్లో మరో ముప్పు వుందని వాతావరణ శాఖ హెచ్చరింది. అంటే సెప్టెంబర్ 5 నాటికి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ ఉపరితల ద్రోణి రాజస్థాన్‌లోని జైసల్మేర్ నుంచి తెలంగాణ మీదుగా కొనసాగుతుందని అధికారులు వివరించారు. కోస్తాంధ్ర కోస్తాకు అతి సమీపంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఏపీ, తెలంగాణల్లో మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.