మహీంద్రా సీబీజీ యువో టెక్‌ ప్లస్‌ ట్రాక్టర్‌

మహీంద్రా ట్రాక్టర్స్‌.. కంప్రెస్డ్‌ బయోగ్యా్‌సతో (సీబీజీ) పని చేసే యువో టెక్‌ ప్లస్‌ ట్రాక్టర్‌ను కేంద్ర రోడ్డు రవాణా, హైవే శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ సమక్షంలో ఆవిష్కరించింది.

మహీంద్రా ట్రాక్టర్స్‌.. కంప్రెస్డ్‌ బయోగ్యా్‌సతో (సీబీజీ) పని చేసే యువో టెక్‌ ప్లస్‌ ట్రాక్టర్‌ను కేంద్ర రోడ్డు రవాణా, హైవే శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ సమక్షంలో ఆవిష్కరించింది.

సీబీజీతో పని చేసే ఈ ట్రాక్టర్‌ కాలుష్యం, కర్బన వ్యర్థాలను గణనీయంగా తగ్గించగలుగుతుందని కంపెనీ తెలిపింది.

సీఎన్‌జీ అయితే శిలాజ ఇంధనాల నుంచి తయారవుతుందని, దానికి భిన్నంగా సీబీజీ పూర్తిగా హరిత, పునరుత్పాదక ఇంధనాల నుంచి తయారవుతుందని కంపెనీ పేర్కొంది.

12 ఏళ్లుగా రోజుకు 30 నిమిషాలే నిద్రపోతున్న వ్యక్తి.. ఎందుకో తెలుసా?

మనిషి చక్కటి ఆరోగ్యంతో ఉండాలంటే రోజుకు సగటున 6-8 గంటల నిద్రపోవడం చాలా ముఖ్యం. తగిన నిద్ర లేకపోతే మానసిక ప్రవర్తనపై ప్రభావం చూపుతుందని, దైనందిన జీవితాన్ని దెబ్బతీస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. స్థిరంగా 6-8 గంటలు నిద్రపోవడం ఆరోగ్యాన్ని పదిల పరుస్తుందని నిపుణులు సైతం నిర్ధారిస్తున్నారు.

అయితే జపాన్‌కు చెందిన ఓ వ్యక్తి గత 12 ఏళ్లుగా రోజుకు 30 నిమిషాలు మాత్రమే నిద్రపోతున్నాడు. నమ్మశక్యంగా లేకపోయిన ఇది నిజం. డైసుకే హోరి అనే వ్యక్తి తన జీవితాన్ని రెట్టింపు చేసుకునేందుకు రోజుకు అరగంట నిద్రను కొనసాగిస్తున్నాడు. పశ్చిమ జపాన్‌లోని హ్యోగోకు చెందిన 40 ఏళ్ల ఆ వ్యక్తి.. 30 నిమిషాలే నిద్రపోయినప్పటికీ తన శరీరం, మెదడును తక్కువ నిద్రతో సాధారణంగా పనిచేసేలా ట్రైనింగ్ ఇచ్చానని, ఈ విధంగా రోజూ ప్రాక్టీస్ చేయడంతో తన పని సామర్థ్యం గణనీయంగా మెరుగుపడిందని డైసుకే హోరి వెల్లడించాడు.

తినడానికి ఒక గంట ముందు వ్యాయామం లేదా కాఫీ తాగితే నిద్ర మత్తును దూరం చేసుకోవచ్చునని డైసుకే చెప్పినట్టు ‘సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్’ పేర్కొంది. మనిషి ఏకాగ్రతతో ఉండాలంటే ఎక్కువ సేపు నిద్రపోవడం కంటే నాణ్యమైన నిద్రపోవడం చాలా ముఖ్యమని డైసుకే చెప్పాడు. ‘‘పనిలో స్థిరమైన ఏకాగ్రత అవసరమయ్యే వ్యక్తులు ఎక్కువ సేపు నిద్రపోవడం కంటే నాణ్యత కలిగిన నిద్రతో ఎక్కువ ప్రయోజనం పొందుతారు. ఉదాహరణకు తీసుకుంటే వైద్యులు, అగ్నిమాపక సిబ్బంది తక్కువ సమయం విశ్రాంతి తీసుకుంటుంటారు. కానీ అధిక సామర్థ్యాన్ని కలిగి ఉంటారు’’ అని డైసుకే చెప్పాడు.

డైసుకే హోరి చెప్పే విషయాలను మరింతగా తెలుసుకునేందుకు జపాన్‌కు చెందిన యోమియురి టీవీ ‘విల్ యు గో విత్ మీ’ అనే రియాలిటీ షో అతడిని 3 రోజుల పాటు అనుసరించింది. హోరీ కేవలం 26 నిమిషాలే నిద్రపోయి మంచి ఎనర్జీతో మేల్కొంటున్నాడని, అల్పాహారం చేసి పనిలో నిమగ్నం అవుతున్నాడని, జిమ్‌కి కూడా వెళ్లిన సందర్భాన్ని ఈ రియాలిటీ షో వెల్లడించింది. 

కాగా డైసుకే హోరీ ఒక వ్యవస్థాపకుడిగా కూడా ఉన్నాడు. తన ప్రత్యేకమైన నిద్ర అలవాటుతో 2016లో ‘జపాన్ షార్ట్ స్లీపర్స్ ట్రైనింగ్ అసోసియేషన్‌’ను స్థాపించాడు. నిద్ర, ఆరోగ్యంపై అతడు పాఠాలు బోధిస్తున్నాడు. అల్ట్రా-షార్ట్ స్లీపర్‌లుగా మారేందుకు ఇప్పటివరకు 2,100 మంది విద్యార్థులకు ట్రైనింగ్ ఇచ్చాడు.తక్కువ నిద్రకు సంబంధించి ఆసక్తికర విషయాలకు వస్తే.. వియత్నాం దేశానికి చెందిన థాయ్ ఎన్‌గోక్ అనే 80 ఏళ్ల తాను 60 ఏళ్లకు పైగా నిద్రపోలేదని కథాలు చెబుతున్నాయి. 1962లో జ్వరం వచ్చిన తర్వాత అతడు నిద్రపోయే సామర్థ్యాన్ని కోల్పోయినట్టు అతడు చెబుతున్నాడు. చికిత్సలు తీసుకున్నా, నిద్ర మాత్రలు వాడినప్పటికీ నిద్రలేమి మారలేదని అతడు వివరించాడు.

ఎస్‌బీఐలో మరో తెలుగు తేజం

దేశీయ బ్యాంకిం గ్‌ దిగ్గజం భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ (ఎస్‌బీఐ)లో కీలక పదవికి మరో తెలుగు తేజం ఎంపియ్యారు. ఆంధ్రప్రదేశ్‌, బాపట్లకు చెందిన రామ మోహన రావు అమర.. బ్యాం క్‌ కొత్త మేనేజింగ్‌ డైరెక్టర్‌ (ఎండీ)గా ఎంపికయ్యారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎ్‌సబీ), ఆర్థిక సంస్థల

దేశీయ బ్యాంకిం గ్‌ దిగ్గజం భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ (ఎస్‌బీఐ)లో కీలక పదవికి మరో తెలుగు తేజం ఎంపియ్యారు. ఆంధ్రప్రదేశ్‌, బాపట్లకు చెందిన రామ మోహన రావు అమర.. బ్యాం క్‌ కొత్త మేనేజింగ్‌ డైరెక్టర్‌ (ఎండీ)గా ఎంపికయ్యారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎ్‌సబీ), ఆర్థిక సంస్థల కీలక పదవులకు అభ్యర్ధులను ఎంపిక చేసే ‘ది ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఇనిస్టిట్యూషన్స్‌ బ్యూరో (ఎఫ్‌ఎ్‌సఐబీ) మొత్తం తొమ్మిది మంది అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసి రామ మోహన రావు పేరును ఎంపిక చేసింది. ఈ సిఫారసును కేంద్ర క్యాబినెట్‌ ఆమోదించాల్సి ఉంటుంది.

ఇప్పటి వరకు ఎస్‌బీఐ ఎండీగా ఉన్న మరో తెలుగు తేజం సీ శ్రీనివాసులు శెట్టి ఇటీవలే ఎస్‌బీఐ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆయన స్థానంలో రామ మోహన రావు బ్యాంక్‌ ఎండీగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఇంజనీరింగ్‌ పట్టభద్రుడైన రావు 1991లో ప్రొబేషనరీ ఆఫీసరుగా ఎస్‌బీఐలో చేరారు.

తన 32 సంవత్సరాల సర్వీసులో దేశ, విదేశాల్లోని ఎస్‌బీఐ శాఖల్లో ఆయన అనేక కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం ఈయన ఎస్‌బీఐ డిప్యూటీ ఎండీగా ఉన్నారు. భారత బ్యాంకింగ్‌ రంగంలో రారాజుగా భావించే ఎస్‌బీఐ చరిత్రలో రెండు కీలక పదవులకు ఇరువురు తెలుగు వారు ఒకేసారి ఎంపిక కావడం ఇదే మొదటిసారి.

వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం పర్యటన.. అధికారుల తీరుపై తీవ్ర అసహనం..

భారీ వర్షాలు, వరదలు.. కృష్ణా నదిలో వరద ఉధృతితో.. విజయవాడ, ఎన్టీఆర్‌ జిల్లా, గుంటూరు జిల్లాలోని పలు ప్రాంతాలు అతలాకుతలం అవుతున్నాయి.. ఇక, వరుసగా వర్షాలు, వరదలపై సమీక్షలు నిర్వహిస్తూ.. ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తూ వస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. అవకాశం దొరికినప్పుడల్లా.. వరద ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటనకు వెళ్తున్నారు.. ఈ రోజు రెండు గంటలపాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు సీఎం చంద్రబాబు..

రామలింగేశ్వర నగర్, జక్కంపూడి కాలనీ, సింగ్ నగర్ ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన కొనసాగగా.. సహాయక చర్యలను పరిశీలించారు.. ఆహారం అందుతుందా..? లేదా..? అనే అంశంపై ఆరా తీశారు.. రెండు గంటల పర్యటన అనంతరం ఎన్టీఆర్ జిల్లా కలక్టరేట్ కు చేరుకున్న చంద్రబాబు… కలెక్టరేట్‌లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.. ఈ సమావేశంలో మంత్రులు నారా లోకేష్, అనిత, అచ్చెన్నాయుడు, కొలుసు పార్థసారథి, కొండపల్లి శ్రీనివాసరావు, కొల్లు రవీంద్ర సహా పలువురు అధికారులు పాల్గొన్నారు.

రెండు గంటల పాటు క్షేత్ర స్థాయి పర్యటన అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు.. సహాయక చర్యల్లో అధికారుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.. అధికారులకు లెఫ్ట్ అండ్ రైట్ వాయించారు.. తానే స్వయంగా రంగంలోకి దిగినా అధికారుల మొద్దు నిద్ర వీడకుంటే ఎలా అంటూ అధికారులకు క్లాస్ తీసుకున్నారు ఏపీ సీఎం.. గత ప్రభుత్వం జాఢ్యాన్ని వదిలించుకోకుంటే సహించేదే లేదంటూ సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చారు.. బాధితులకు సహాయ చర్యల విషయంలో ఇప్పటికీ కొందరు అధికారులు అలసత్వాన్ని వీడడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల పని తీరు ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా ఉండాలని.. కానీ, చెడ్డపేరు తెచ్చేలా ఉంటే మాత్రం ఊరుకునేది లేదంటా వార్నింగ్‌ ఇచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు.

శ్రీశైలం ప్రాజెక్టు గేట్లలో సాంకేతిక సమస్య

శ్రీశైలం ప్రాజెక్టు గేట్లలో సాంకేతిక సమస్య ఎదురైంది. ఎగువ నుంచి భారీగా వరద వచ్చి చేరుతుండడంతో నీటిని కిందికి వదిలేందుకు అధికారులు ప్రయత్నించారు. గేట్లు ఎత్తుతుండగా నీటి ఒత్తిడి కారణంగా 2, 3 నెంబర్ గేట్ల ప్యానెల్ లోని బ్రేక్ కాయిల్స్ కాలిపోయాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే మరమ్మతులు చేపట్టారు. బ్రేక్ కాయిల్స్ మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎగువన జూరాల, సుంకేశుల ప్రాజెక్టుల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు వరదనీరు భారీగా వచ్చి చేరుతోంది.

ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో 3.26 లక్షల క్యూసెక్కులుగా ఉందని అధికారులు చెప్పారు. దీంతో కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ దిగువన నాగార్జున సాగర్ కు నీటిని విడుదల చేస్తున్నట్లు వివరించారు.

ప్రాజెక్టు నుంచి 3.80 లక్షల క్యూసెక్కుల వరద నీటిని సాగర్ కు వదులుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టు నీటి నిల్వ 214.8870 టీఎంసీలకు చేరిందని, పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు అని పేర్కొన్నారు.

బాబాయ్‌కి వ‌రుణ్ బ‌ర్త్‌డే విషెస్‌... ఆక‌ట్టుకుంటున్న ప‌వ‌న్‌ అరుదైన ఫొటో

నేడు ఏపీ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన అధినేత‌, న‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆయ‌న‌పై బ‌ర్త్‌డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి. సినీ, రాజ‌కీయ‌, ఇత‌ర రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు, అభిమానులు జ‌న‌సేనానికి భారీ ఎత్తున పుట్టినరోజు శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు. 

ఇక ప‌వ‌న్ కుటుంబ స‌భ్యులు చిరంజీవి, నాగబాబు, రామ్ చ‌ర‌ణ్‌, అల్లు అర్జున్ కూడా విషెస్ తెలిపారు. ఇప్పుడు నాగబాబు త‌న‌యుడు వ‌రుణ్ తేజ్ 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా బాబాయ్‌కి శుభాకాంక్ష‌లు తెలుపుతూ అరుదైన ఫొటోను షేర్ చేశాడు. దాంతో ఈ ట్వీట్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

పుట్టినరోజు శుభాకాంక్షలు బాబాయ్! నేను ఎప్పుడూ మీరు పై స్థాయిలో ఉండాల‌ని కోరుకుంటాను. ధ‌ర్మం వైపు మీరు అనుస‌రించిన మార్గం, ఇత‌రుల‌కు స‌హాయం చేయాల‌నే మీ తిరుగులేని సంక‌ల్పం ఎప్పటికీ స్ఫూర్తిదాయ‌కం. మీలోని అగ్ని ప్ర‌కాశ‌వంతంగా మండుతూనే ఉంటుంది. మీరు ఎల్ల‌ప్పుడూ ఆరోగ్యంగా, బ‌లంగా ఉండాల‌ని కోరుకుంటున్నాను. మిమ్మ‌ల్ని ఎప్ప‌టికీ ప్రేమిస్తునే ఉంటాను. మీరు నా పవర్ స్టార్మ్. హ్యాపీ బ‌ర్త్‌డే జ‌న‌సేనాని" అంటూ వ‌రుణ్ త‌న ట్వీట్‌లో రాసుకొచ్చాడు

ఇక ఈ ట్వీట్‌కు త‌న చిన్న‌నాటి ఫొటో ఒక‌టి జోడించాడు. ఆ ఫొటోలో ప‌వ‌న్ సోఫాలో కూర్చొని ఉండ‌గా, వ‌రుణ్ ఆయ‌న కాళ్లు ప‌డుతున్నాడు. వ‌రుణ్‌ను ప‌వ‌న్ ఆశీర్వ‌దిస్తున్న‌ట్లు పోజు పెట్ట‌డం కూడా ఆ ఫొటోలో ఉంది.

వరద సహాయక చర్యల్లో నేవీ హెలీకాఫ్టర్లు...

ఏపీలో భారీ వర్షాలతో జనజీవనం స్తంభించింది. దీంతో వరద సహాయ చర్యల కోసం నేవీ హెలీకాప్టర్లు రంగంలోకి దిగాయి. ఇప్పటి వరకు నేవీ నుంచి మూడు హెలీకాప్టర్లు వచ్చాయి. హకింగ్‌పేట ఎయిర్ బేస్ నుంచి మరో నాలుగు హెలీకాఫ్టర్లు బయలుదేరాయి. వరద ముంపు ప్రాంతాల్లో హెలీ కాప్టర్ల ద్వారా ఆహారం, మంచినీరు సరఫరాకు అధికారులు చర్యలు తీసుకున్నారు.

ఏపీలో (Andhrapradesh) భారీ వర్షాలతో (Heavy Rains) జనజీవనం స్తంభించింది. దీంతో వరద సహాయ చర్యల కోసం నేవీ హెలీకాప్టర్లు (Navy helicopters) రంగంలోకి దిగాయి. ఇప్పటి వరకు నేవీ నుంచి మూడు హెలీకాప్టర్లు వచ్చాయి. హకింగ్‌పేట ఎయిర్ బేస్ నుంచి మరో నాలుగు హెలీకాఫ్టర్లు బయలుదేరాయి. వరద ముంపు ప్రాంతాల్లో హెలీ కాప్టర్ల ద్వారా ఆహారం, మంచినీరు సరఫరాకు అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇప్పటి వరకు 2,97,500 మందికి ఆహారం, మంచినీరు అందజేశారు.

నిరాశ్రయుల కోసం విజయవాడ నగరంలో 78 పునరావాస శిబిరాలు ఏర్పాటు చేశారు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా 17 చోట్ల రోడ్లు తెగిపోయాయి. దీంతో అధికార యంత్రాంగం పునరుద్ధరణకు చర్యలు చేపట్టింది. ప్రకాశం బ్యారేజీ నుంచి ప్రస్తుతం 11,41,276 క్యూసెక్కుల ప్రవాహం వచ్చిచేరుతోంది. వరద బాధితులకు ఆహారం, మంచినీరు పంపిణీ కార్యక్రమాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు నిమగ్నమయ్యాయి. మరోవైపు కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఎప్పటికప్పుడు వరద సహాయ చర్యలను పర్యవేక్షిస్తూ అధికారులకు సూచనలిస్తున్నారు.

మరోవైపు ప్రకాశం బ్యారేజి వద్ద కృష్ణమ్మ మహోగ్రరూపం దాల్చింది. ఇప్పటికే ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియక జనం బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తుంటే.. కృష్ణమ్మ మహోగ్రరూపం దాల్చిందన్న విషయం జనం గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. బ్యారేజి వద్ద 11 లక్షల 40 వేల 776 క్యుసెక్కులకు వరద చేరుకుంది. ఇంత భారీ స్థాయిలో వరద రావడం ప్రకాశం బ్యారేజి చరిత్రలో ఇదే మొదటిసారి. మధ్యాహ్నం తరువాత వరద తగ్గుతుందని జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ప్రకాశం బ్యారేజ్ వద్ద రెండవ ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 11,39,351 క్యూసెక్కులుగా ఉంది. విజయవాడకు కేంద్రం నుంచి ప్రత్యేకంగా 10 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వచ్చాయి.

3 తమిళనాడు, 4 పంజాబ్, 3 ఒడిశా రాష్ట్రల నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు విజయవాడకు చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. పవర్ బోట్లు, రెస్క్యూ పరికరాలతో బృందాలు రంగంలోకి దిగాయి. ఇప్పటికే ఎన్టీఆర్ జిల్లా సహాయక చర్యల్లో 8 ఎన్డీఆర్ఎఫ్, 10 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పని చేస్తున్నాయి. అలాగే వాయుమార్గం ద్వారా సహాయక చర్యల్లో చాపర్ పాల్గొంటోంది. మరికాసేపట్లో విజయవాడ రానున్న మరో 4 చాపర్స్ రానున్నాయి. ప్రజలు భయాందళోనకు గురికావొద్దని అటు ప్రభుత్వం.. ఇటు విపత్తుల నిర్వహణ సంస్థ చెబుతోంది. పొంగిపొర్లే వాగులు, కాలువలు, రోడ్లు, కల్వర్టులు, మ్యాన్ హోల్స్‌కు దూరంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.

సీఎం చంద్రబాబు సమీక్ష

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారీ వర్షాలు, వరదలు, జిల్లాల్లో ప్రస్తుత పరిస్థితులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీఎస్, డీజీపీ, మంత్రులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం (Low Pressure) కారణంగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారీ వర్షాలు, వరదలు, జిల్లాల్లో ప్రస్తుత పరిస్థితులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) సీఎస్ (CS), డీజీపీ (DGP), మంత్రులు (Ministers), జిల్లా కలెక్టర్లు (Collectors), ఎస్పీ (SPs)లతో టెలికాన్ఫరెన్స్ (Teleconference) ద్వారా సమీక్ష (Review) నిర్వహించారు. జిల్లాలు, శాఖల వారీగా తాజా పరిస్థితులు, తీసుకుంటున్న చర్యలపై ముఖ్యమంత్రి రివ్యూ చేశారు. డ్రోన్లు, సీసీ కెమేరాల ద్వారా రియల్ టైంలో పరిస్థితిపై అధికార యంత్రాంగం స్పందించాలని సూచించారు. మీడియాలో, సోషల్ మీడియాలో, వాట్సాప్ గ్రూప్‌లలో వచ్చే విజ్ఞప్తులపై తక్షణ స్పందన ఉండాలని ఆదేశించారు.

వరద తగ్గిన వెంటనే పంటనష్టంపై వివరాలు సేకరించాలని వ్యవసాయ శాఖ అధికారులకు సిఎం చంద్రబాబు అదేశించారు. సాయంత్రం వరకు ప్రకాశం బ్యారేజ్‌కు 9 లక్షల క్యూసెక్కులపైచిలుకు వరద వస్తుందని టెలికాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. శనివారంతో పోల్చుకుంటే జిల్లాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం వర్షాల తీవ్రత తగ్గిందని, అయితే ఇంకా వరదలోనే ఇళ్లు, కాలనీలు ఉన్నాయన్నారు. రహదారులపైనున్న నీటికి బయటకు పంపడమే కాదు.. కాలనీలు, ప్రజల ఇళ్లలో ఉన్న వరద సమస్యను పరిష్కరించాలని సూచించారు. పలు ప్రాంతాల్లో 27 సెంటీమీటర్లకు పైగా వర్షం పడిందని, ఇలాంటి చోట్ల పరిస్థితిపై ఫోకస్ పెట్టాలన్నారు.

గత 50 ఏళ్లలో ఎప్పుడూ పడనంతగా వర్షం పడిందని, ఎప్పుడూ లేని విధంగా నేషనల్ హైవేలు కూడా వరద నీటితో చెరువులను తలపించాయని సీఎం చంద్రబాబు అన్నారు. నేషనల్ హైవే అథారిటీకి కూడా లేఖ రాసి సమస్యపై సమన్వయంతో పనిచేయాలని సూచించారు. వరద ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా పరిస్థితిని సమీక్షించాలని... దానికి అనుగుణంగా రిస్క్యూ ప్లాన్ చేయాలన్నారు. వర్షాలు, వరదల కారణంగా ఆహారం, నీరు కలుషితం అవుతుందని, గ్రామాల్లో పారిశుధ్య చర్యలు చేపట్టాలని, నివాస ప్రాంతాల మధ్య నుండి వరద నీటిని వీలైనంత త్వరగా లేకుండా చేయాలని ఆదేశించారు. వ్యాధులు ప్రభలకుండా బ్లీచింగ్ చల్లడంతో పాటు మెడికల్ క్యాంప్‌లు ఏర్పాటు చేయాలన్నారు.

ఎన్టీఆర్ జిల్లాలో బుడమేరు వరద కారణంగా పలు ప్రాంతాలు ముంపు బారిన పడ్డాయని తెలిపిన మంత్రి నారాయణ తెలిపారు. ఇరిగేషన్ సహా ఇతర శాఖల అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారం కోసం ప్రయత్నించాలని సీఎం చంద్రబాబు సూచించారు. నూజువీడు నియోజకవర్గంలో రికార్డు స్థాయి వర్షాలకు జరిగిన నష్టాన్ని మంత్రి కొలుసు పార్థసారధి వివరించారు. ఇబ్బందుల్లో ఉన్న పలుప్రాంతాల వారికి బియ్యం, నిత్యావసరాలు సరఫరా చేసినట్లు సీఎంకు మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. వరదలపై వ్యవసాయ శాఖ తరుపున తీసుకుంటున్న చర్యలను మంత్రి అచ్చెన్నాయుడు వివరించారు. వరద తగ్గిన తరువాత ఆస్తి, పంటనష్టం వివరాలు సేకరించాలని... రైతులకు, కుటుంబాలకు వెంటనే సాయం అందించాలన్నారు.ప్రకాశం బ్యారేజ్ నుంచి ఆదివారం సాయంత్రానికి నీటి ప్రవాహం 9 నుంచి 10 లక్షల క్యూసెక్కులకు చేరవచ్చని అధికారుల అంచనా వేశారు. ప్రకాశం బ్యారేజ్ దిగువన బాపట్ల జిల్లాలో 6 వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. బ్యారేజ్ దిగువ ప్రాంతాల్లో ఉన్న గ్రామాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని, పునరావాస కేంద్రాలకు పంపాలని సీఎం సూచించారు. ఎన్టీఆర్ జిల్లా, రాయనపాడు రైల్వే స్టేషన్ వద్ద వరద కారణంగా రైలు నిలిపివేత, ప్రయాణికులకు సాయంపై జిల్లా కలెక్టర్, డీజీపీ వివరించారు. కేంద్ర ప్రభుత్వానికి కూడా నష్టం అంచనా వేసి పంపాలని చంద్రబాబు సూచించారు. మనం చేసే పనితో ప్రజల్లో సంతృత్తి కలగాలని, మనం మంచి చేసి సాయం అందిస్తే ప్రజలు గుర్తు పెట్టుకుంటారన్నారు. పంటల అంచనాను తప్పకుండా వేయాలని, ఎక్కడా పెండింగ్‌లో పెట్టకూడదని, డ్రోన్ల ద్వారా దెబ్బతిన్న పంటలను అంచనా వేయాలని, ఒక్క ఎకరా కూడా మిస్ కావొద్దన్నారు. ఏ ఒక్క రైతుకూ అన్యాయం జరగకూడదని, దెబ్బతిన్న ఇళ్లు, పశునష్టాన్ని కూడా మదింపు చేయాలన్నారు. పనితీరు, వ్యవస్థలో లోపాలు ఉంటే సరైన సమాచారం ప్రజలకు అందదని.. మనమంతా ప్రజల కోసమే పని చేస్తున్నామని... వారికి ఎక్కడా చిన్న ఇబ్బంది కూడా కలగకూడదని మరోసారి సూచించారు. ప్రజలకు సేవ చేస్తే ప్రభుత్వంపై నమ్మకం, విశ్వాసం కలుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.

స్వయంగా రంగంలో దిగిన హైడ్రా కమిషనర్

భారీ వర్షాలతో హైదరాబాద్ బెంబేలెత్తుతోంది. అతలాకుతలమౌతోంది. ఎడతెరపి లేకుండా కురుస్తోన్న వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇళ్లల్లోకి వర్షపు నీరు ప్రవేశించింది. రోడ్లపై భారీగా వర్షపు నీరు చేరుకోవడంతో పలుచోట్ల వాహనాల రాకపోకలకు ఆటంకం కలిగింది.

భారీ వర్షాల ధాటికి అమీర్‌పేట్, బేగంపేట్, షేక్‌పేట్, టోలీచౌకీ, గచ్చిబౌలి, కొండాపూర్, అత్తాపూర్ వంటి ప్రాంతాల్లోని లోతట్టు ప్రదేశాలు జలమయం అయ్యాయి. ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. మురుగునీరు, వరదనీటి పారుదల కాలువల్లో చెత్త పేరుకుపోవడం వల్ల అవన్నీ కూడా పొంగిపొర్లుతున్నాయి.

ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ ఆమ్రపాలి.. నగరవాసులకు పలు సూచనలు జారీ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భారీ వర్షాలు కురుస్తాయంటూ వాతావరణ శాఖ హెచ్చరించడం, రెడ్ అలెర్ట్ ప్రకటించిన నేపథ్యంలో ప్రజలు- అత్యవసరం ఉంటేనే బయటకు వెళ్లాలని కోరారు.

రోడ్లపై నిలిచిన వర్షపునీటిలో పిల్లలు, వృద్దులు ఒంటరిగా బయటికి వెళ్లకూడదని విజ్ఞప్తి చేశారు. ద్విచక్ర వాహనాలను కూడా వినియోగించవద్దని సూచించారు. వర్షపు నీరు వెళ్లిపోవాలనే ఉద్దేశంతో స్థానికులు తమ పరిధిలో ఉన్న మ్యాన్ హోల్స్‌ను తెరవకూడని అన్నారు. ఒకవేళ అవి తెరచి ఉంటే జీహెచ్‌ఎంసీ కంట్రోల్ రూమ్‌కు తెలియజేయాలని ఆమ్రపాలి విజ్ఞప్తి చేశారు.

ఈ పరిస్థితుల మధ్య హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్వయంగా రంగంలోకి దిగారు. షేక్‌పేట్, టోలీచౌకీల్లో పర్యటించారు. లోతట్టు ప్రాంతాల్లో కలియదిరిగారు. విధి నిర్వహణలో నిమగ్నమైన సిబ్బందితో మాట్లాడారు. వర్షపునీరు ఎక్కడా నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్‌, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, ఇతర విపత్తు నిర్వహణ ఏజెన్సీలు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ వరద పరిస్థితులను ఎదుర్కొంటోన్నాయని, నగరవాసులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందుజాగ్రత్త చర్యలను తీసుకుంటున్నామని అన్నారు.

సూర్యాపేటలో సాగర్‌ ఎడమ కాలువకు గండి..

సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలంలో నాగార్జునసాగర్‌ (Nagarjuna Sagar) ఎడమ కాలువకు గండి పడింది. మండలంలోని రామచంద్రాపురం వద్ద కాలువకు గండి పడి కట్ట కొట్టుకుపోయింది.

సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలంలో నాగార్జునసాగర్‌ (Nagarjuna Sagar) ఎడమ కాలువకు గండి పడింది. మండలంలోని రామచంద్రాపురం వద్ద కాలువకు గండి పడి కట్ట కొట్టుకుపోయింది. దీంతో పంట పొలాల ద్వారా గ్రామంలోకి వరద నీరు చేరుతున్నది. గతంలో ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు పట్టించుకోలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కాగా, గత నెల 6న కూడా సాగర్‌ లో లెవల్‌ కాలువకు గండిపడిన విషయం తెలిసిందే. నల్లగొండ జిల్లా అనుముల మండలం మారేపల్లి వద్ద కాలువకు గండిపడటంతో నీరు పొల్లాలోకి చేరింది.

ఇక మూసీ ఎడమ కాలువకు కూడా గండి పడింది. ఆదివారం మధ్యాహ్నం పిల్లలమర్రి, పిన్నాయిపాలం మధ్య ఎడమ కాలువకు గండిపడింది. దీంతో నీరు వృధాగా పోతున్నది. దీంతో సమీపంలోని పంటపొలాల్లోకి వరద నీరు పోతున్నది. గండిపడిన ప్రదేశానికి ఇరిగేషన్‌ అధికారులు చేరుకున్నారు. గండిని పూడ్చడానికి ప్రయత్నిస్తున్నారు.