సూర్యాపేటలో సాగర్ ఎడమ కాలువకు గండి..
సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలంలో నాగార్జునసాగర్ (Nagarjuna Sagar) ఎడమ కాలువకు గండి పడింది. మండలంలోని రామచంద్రాపురం వద్ద కాలువకు గండి పడి కట్ట కొట్టుకుపోయింది.
సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలంలో నాగార్జునసాగర్ (Nagarjuna Sagar) ఎడమ కాలువకు గండి పడింది. మండలంలోని రామచంద్రాపురం వద్ద కాలువకు గండి పడి కట్ట కొట్టుకుపోయింది. దీంతో పంట పొలాల ద్వారా గ్రామంలోకి వరద నీరు చేరుతున్నది. గతంలో ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు పట్టించుకోలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కాగా, గత నెల 6న కూడా సాగర్ లో లెవల్ కాలువకు గండిపడిన విషయం తెలిసిందే. నల్లగొండ జిల్లా అనుముల మండలం మారేపల్లి వద్ద కాలువకు గండిపడటంతో నీరు పొల్లాలోకి చేరింది.
ఇక మూసీ ఎడమ కాలువకు కూడా గండి పడింది. ఆదివారం మధ్యాహ్నం పిల్లలమర్రి, పిన్నాయిపాలం మధ్య ఎడమ కాలువకు గండిపడింది. దీంతో నీరు వృధాగా పోతున్నది. దీంతో సమీపంలోని పంటపొలాల్లోకి వరద నీరు పోతున్నది. గండిపడిన ప్రదేశానికి ఇరిగేషన్ అధికారులు చేరుకున్నారు. గండిని పూడ్చడానికి ప్రయత్నిస్తున్నారు.











Sep 01 2024, 14:46
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
1- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
10.3k