హలో నేను సీజేఐని రూ.500 పంపగలరా

సోషల్ మీడియాను(Social Media) ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు(Cyber Criminals) రెచ్చిపోతున్నారు. ఇన్నాళ్లు ముఖ్యమంత్రులు, మంత్రుల పేర్లతో తమను తాము పరిచయం చేసుకున్న వారు ఇప్పుడు ఏకంగా దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిని టార్గెట్ చేశారు.

సోషల్ మీడియాను(Social Media) ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు(Cyber Criminals) రెచ్చిపోతున్నారు. ఇన్నాళ్లు ముఖ్యమంత్రులు, మంత్రుల పేర్లతో తమను తాము పరిచయం చేసుకున్న వారు ఇప్పుడు ఏకంగా దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిని టార్గెట్ చేశారు. తమను తాము సీజేఐగా పరిచయం చేసుకుంటూ డబ్బులు అడగిన ఉదంతం చర్చనీయాంశం అవుతోంది. సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్‌లా(Chief Justice DY Chandrachud) తనను తాను పరిచయం చేసుకుంటూ క్యాబ్ ఛార్జీల కోసం డబ్బులు అడిగిన ఓ సైబర్ నేరగాడిపై సుప్రీంకోర్టు మంగళవారం ఢిల్లీ సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేసింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన మెసేజ్ స్క్రీన్‌షాట్‌ను సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ నోట్ చూసి అవాక్కయ్యారు. సీజేఐ ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు భద్రతా విభాగం సైబర్ క్రైమ్ విభాగంలో ఎఫ్ఐఆర్‌(FIR)ను నమోదు చేసింది.

వైరల్ అవుతున్న ఆ పోస్ట్‌లో, CJI పేరును దాని హ్యాండిల్‌గా, డిస్‌ప్లే ఇమేజ్‌కి ఆయన చిత్రాన్ని ఉపయోగించిన స్కామర్, కొలీజియం సమావేశానికి హాజరయ్యేందుకు క్యాబ్‌ కోసం రూ.500 కావాలని కైలాష్ మేఘ్‌వాల్‌ అనే ఎక్స్ వినియోగదారుడిని కోరాడు. ఆ డబ్బు సుప్రీంకోర్టుకు చేరిన తర్వాత తిరిగి ఇస్తానని హామీ ఇచ్చాడు. "హలో, నేను CJIని. ఇవాళ కొలీజియం అత్యవసర సమావేశాన్ని నిర్వహిస్తున్నాం. నేను కనాట్‌లో చిక్కుకున్నాను. మీరు క్యాబ్ కోసం 500 రూపాయలు నాకు పంపగలరా?" అని సైబర్ నేరగాడు తన చాట్‌లో రాశాడు.

ఈ ఏడాది మార్చిలో జరిగిన మరో సంఘటనలో ఢిల్లీ పోలీసు క్రైమ్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్‌గా నటించి, విలాసవంతమైన కార్లు, ఖరీదైన సెల్‌ఫోన్‌లను విక్రయిస్తామనే సాకుతో ఓ సైబర్ నేరగాడు ఇద్దరి నుంచి రూ.4 లక్షలు దోచుకున్నాడు. తరువాత పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. సైబర్ నేరాలపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

మూసీని.. మూసేసి..!

అనంతగిరి కొండల్లో జన్మించి.. వికారాబాద్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌-మల్కాజిగిరి, యాదాద్రి-భువనగిరి, నల్లగొండ జిల్లాల మీదుగా మఠంపల్లి వద్ద కృష్ణాలో కలిసే మూసీనదిని ఎక్కడికక్కడ మూసేస్తున్నారు..!

అనంతగిరి కొండల్లో జన్మించి.. వికారాబాద్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌-మల్కాజిగిరి, యాదాద్రి-భువనగిరి, నల్లగొండ జిల్లాల మీదుగా మఠంపల్లి వద్ద కృష్ణాలో కలిసే మూసీనదిని ఎక్కడికక్కడ మూసేస్తున్నారు..! రేవంత్‌ సర్కారు లండన్‌లోని థేమ్స్‌ నది మాదిరిగా మూసీని అభివృద్ధి చేయాలని కృతనిశ్చయమైనా.. రూ. లక్షన్నర కోట్ల అంచనా వ్యయమయ్యే ఈ మహా క్రతువుకు అడుగడుగునా అడ్డంకులుగా కబ్జాలు, పూడికలు, డంపింగ్‌ యార్డులు ఉన్నాయి.

స్వాతంత్ర్యానికి పూర్వం కూడా హైదరాబాద్‌ నగర దాహార్తిని తీర్చి.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పంటపొలాలకు నీరందించిన మూసీ.. ఇప్పుడు ఆక్రమణలతో కుంచించుకుపోయింది. కొన్ని చోట్ల ఉనికినే కోల్పోయే పరిస్థితిలో ఉంది. ‘ఆంధ్రజ్యోతి’ బృందం నార్సింగ్‌ ఔటర్‌ నుంచి.. నాగోల్‌లోని మూసీ బ్రిడ్జి వరకు క్షేత్రస్థాయిలో పరిశీలన జరపగా.. విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. మూసీని మూసేసిన వైనంపై.. ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం..!

అనంతగిరి కొండల నుంచి గండిపేట సమీపం వరకు మాత్రమే మూసీ నది నీరు స్వచ్ఛంగా ఉంటోంది. ఆ తర్వాత పూర్తిస్థాయిలో కలుషిత జలాలు ప్రవహిస్తున్నాయి. గండిపేట నుంచి టిప్పుఖాన్‌ బ్రిడ్జి వరకు నాలుగు కిలోమీటర్ల మేర మూసీ నది ఉండగా.. రెండు కిలోమీటర్ల మేర ఆర్మీ ఆర్టిలరీ సెంటర్‌ మీదుగా ప్రవహిస్తోంది. మిగతా రెండు కిలోమీటర్లలో.. నార్సింగ్‌, గండిపేట, మంచిరేవుల, పీరంచెరువు గ్రామ పంచాయతీల పరిధుల్లో.. బఫర్‌ జోన్లు ఆక్రమణలకు గురయ్యాయి.

యథేచ్ఛగా నిర్మాణాలు వెలుస్తున్నా.. రెవెన్యూ, నీటిపారుదల శాఖల అధికారులు మామూళ్ల మత్తులో చూసీచూడనట్లు వదిలేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పక్కనే ఉన్న ఐటీ కారిడార్‌ బహుళ అంతస్తుల డ్రైనేజీ మొత్తం మూసీలోనే కలుస్తోంది. అంటే.. కోకాపేట, నార్సింగ్‌, పుప్పాల్‌గూడ, మణికొండ, రాయదుర్గంతోపాటు.. మాదాపూర్‌, జూబ్లీహిల్స్‌ తదితర ప్రాంతాల మురుగుకు మూసీ అడ్డా అవుతోందన్నమాట.టిప్పుఖాన్‌ బ్రిడ్జి నుంచి అత్తాపూర్‌ వంతెన వరకు మూసీని రెండు వైపులా మట్టితో నింపేసిన భూబకాసురులు.. యథేచ్ఛగా కబ్జాచేసి, లేఅవుట్లు వేశారు. ఆరు కిలోమీటర్ల మేర ఈ కబ్జాలు, అక్రమ నిర్మాణాలు కనిపిస్తున్నాయి. లంగర్‌హౌస్‌ బాపూనగర్‌ బస్తీ వెనక కబ్జా పరిస్థితి తారాస్థాయిలో ఉంది. బాపూఘాట్‌, డిఫెన్స్‌ కాలనీ వెనక వైపున్న మూసీ బఫర్‌ జోన్‌లో ఏకంగా రాజకీయ నాయకులే లేఅవుట్లు వేశారు. అంతేకాదు.. టోలిచౌకి, హకీంపేట్‌ ప్రాంతాల్లోని దాదాపు 100 కాలనీల మురుగునీరు బాపూఘాట్‌ వద్ద మూసీలో కలుస్తోంది. టిప్పుఖాన్‌ బ్రిడ్జి నుంచి అత్తాపూర్‌ వరకు మూసీ తీరమంతా చెత్త డంపింగ్‌ యార్డుగా మారిపోయింది.కార్వాన్‌లో మండపాల నిర్మాణం

కార్వాన్‌ గిర్కపల్లి, రాంసింగ్‌పుర, మొఘల్‌-కా-నాలా, అంద్రూనీ/బైరూనీ కార్వాన్‌ ప్రాంతాల్లో మూసీ పరివాహక ప్రాంతాన్ని కొంతమంది కబ్జాదారులు ఆక్రమించారు. రాంసింగ్‌పుర ప్రాంతంలో పరీవాహక ప్రాంతంలో మండపాలను నిర్మించారు. ఈ ప్రాంతంలో మూసీ నది వెడల్పు పూర్తిగా తగ్గిపోయి.. చిన్న కాలువలా కనిపించడం గమనార్హం..! పక్కనే ఉన్న జియాగూడలో సుమారు 15 గోదాములు మూసీ బఫర్‌జోన్‌లో కొనసాగుతున్నాయి.పహిల్వాన్లు, రాజకీయ నాయకులు ఏర్పాటు చేసిన ఈ గోదాములకు నెలవారీ అద్దెను వసూలు చేస్తున్నారు. నెలరోజుల క్రితం అప్పటి జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దానకిశోర్‌ ఈ ప్రాంతాన్ని సందర్శించి.. రెండ్రోజుల్లో అక్రమ నిర్మాణాలను తొలగించాలని ఆదేశించినా.. ఇప్పటికీ ఆ దిశలో చర్యలు తీసుకోకపోవడం గమనార్హం..! మొఘల్‌-కా-నాలా, కేసరి హనుమాన్‌, గిర్కపల్లి ప్రాంతాల్లో మూసీ బఫర్‌ జోన్‌లో దుకాణాలు కొనసాగుతున్నాయి. ఇక జియాగూడలోని కబేలాలో మేకలు, గొర్రెల వ్యర్థాలను పైప్‌లైన్ల ద్వారా మూసీలోకి వదిలేస్తున్నారు. దీంతో ఈ ప్రాంతాలు దుర్గంధంగా తయారవుతున్నాయి. గౌలిగూడలోని స్టేట్‌ సెంట్రల్‌ లైబ్రరీ సమీపంలోని మూసీ ఖాళీ స్థలంలో ఓ వ్యక్తి అనధికారికంగా నర్సరీని కొనసాగిస్తున్నాడు.పురానపూల్‌ వద్ద హిందూ శ్మశానవాటిక, ఒక దర్గా ఉంది. ఈ రెండూ మూసీ నదిలోనే కొనసాగుతున్నాయి. రోజురోజుకూ ఈ రెండూ విస్తరిస్తూ.. మూసీని కుంచించుకుపోయేలా చేస్తున్నాయి. దూద్‌బౌలిలోని రమ్నా్‌సపురలో ఉన్న పశువధశాల నుంచి కూడా మూసీలోకి వ్యర్థాలను వదులుతున్నారు. చాదర్‌ఘాట్‌ కాజ్‌వే బ్రిడ్జి కింద 18 ద్వారాలుండగా.. అటూఇటూ కలిపి.. 10 ద్వారాలు మూసుకుపోయేలా మట్టితో పూడ్చేశారు. దీంతో కేవలం 8 ద్వారాలే కనిపిస్తున్నాయి. చాదర్‌ఘాట్‌ పరిసరాల్లో మూసీ చాలా వరకు కబ్జాకు గురైంది. అంబర్‌పేట్‌ వరకు కబ్జాదారులు మూసీలో అరటి, కొబ్బరిచెట్లను పెంచుతూ.. వ్యాపార కేంద్రంగా మార్చుకున్నారు.వాహెద్‌నగర్‌లో మూసీని మట్టితో పూడ్చడంతో పక్కనే ఉన్న హైటెన్షన్‌ విద్యుత్తు తీగలతో ‘ఎర్త్‌’ వస్తుంది. దీంతో.. ఇక్కడ ఆడుకోడానికి వచ్చిన చిన్నారులు పలుమార్లు విద్యుదాఘాతానికి గురయ్యారు. అధికారులు ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డులు కూడా ఇక్కడ కనిపిస్తాయి. ముసారాంబాగ్‌ బ్రిడ్జి కింద మట్టి, కోళ్ల వ్యర్థాలతో మూసీని కప్పేస్తున్నారు. ఈ ప్రాంతాల్లో మూసీని ఆక్రమించి దుకాణాలను నిర్మిస్తున్నారు. ఇక కొత్తపేట డివిజన్‌లోని జనప్రియ అవెన్యూ, సత్యానగర్‌ కాలనీల వద్ద పచ్చటి తడ్డి పొలాలు ఉన్నాయి. మూసీలో ఎగువ ప్రాంతాల మురుగు మూసీలోకి ప్రవహిస్తోంది. పరిసర కాలనీల మురుగను పైప్‌లైన్ల ద్వారా మూసీలో కలుపుతున్నారు.

రామంతాపూర్‌, ఉప్పల్‌ భగాయత్‌ గడ్డి భూములలో మాజీ సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ పేరిట బస్తీలు వెలిశాయి. ఇవన్నీ మూసీ బఫర్‌జోన్‌లో ఏర్పాటైనవే కావడం గమనార్హం..! సందేట్లో సడేమియా అన్నట్లు కొందరు నేతలు ఇక్కడ లేఅవుట్లు వేసి, ప్లాట్ల విక్రయాలు జరుపుతున్నారు. ఇక్కడ ప్లాట్లు కొన్నవారికి ఠంచన్‌గా జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ.. ఇతర విభాగాల అనుమతులు లభిస్తున్నాయి. ఇక్కడ అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నా.. అధికారులు, విజిలెన్స్‌ విభాగం వీటి జోలికి వెళ్లడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నాగోల్‌ ప్రాంతంలోనూ మూసీని కబ్జా చేస్తూ లేఅవుట్లు, వెంచర్లు వెలుస్తున్నాయి. దీనిపై నీటిపారుదల శాఖ, హెచ్‌ఎండీఏ అధికారులకు చేస్తున్న ఫిర్యాదులు బుట్టదాఖలవుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. మూసీ బఫర్‌జోన్‌లో బహుళ అంతస్తుల భవనాలు, అపార్ట్‌మెంట్లు కొనసాగుతున్నాయి.అంబర్‌పేట డివిజన్‌లో దుర్గానగర్‌, న్యూదుర్గానగర్‌, అహ్మద్‌నగర్‌, నరేంద్రనగర్‌, తదితర ప్రాంతాలు మూసీని ఆనుకుని ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో మూసీనది క్రమంగా కబ్జాలతో కుంచించుకుపోతోంది. కొందరు ప్లాట్లు చేసి, విక్రయించగా.. ఇంకొందరు గడ్డిని పెంచుతున్నారు. దీంతో దోమల వృద్ధికి ఈ ప్రాంతాలు దోహదపడుతున్నాయి. ఫలితంగా డెంగీ, మలేరియా వంటి వ్యాధులు వ్యాప్తిచెందుతున్నాయి. ఈ ప్రాంతాల్లోని చికెన్‌ సెంటర్ల నిర్వాహకులు.. వ్యర్థాలను యథేచ్ఛగా మూసీలో వేస్తున్నారు.

హైడ్రా కమిషనర్ రంగనాథ్ దూకుడు.. రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం..!

ప్రస్తుతం హైదరాబాద్‌లో హాట్ టాపిక్ ఏదైనా ఉంది అంటే అది హైడ్రా కూల్చివేతలే. ఎఫ్‌టీఎల్, బఫర్‌ జోన్‌ పరిధిలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను నిర్ధాక్షిణ్యంగా కూల్చేస్తున్నారు హైడ్రా అధికారులు. సామాన్యులే కాదు.. రాజకీయ నాయకులు, సినిమా ప్రముఖులకు సంబంధించిన ఫౌమ్ హౌస్‌లు, ఫంక్షన్ హాళ్లు కూల్చేస్తూ.. సంచలనంగా మారింది. అయితే.. ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా ధైర్యంగా అక్రమ కట్టడాలపై బుల్డోజర్లను ప్రయోగిస్తున్న హైడ్రాను నడపిస్తుంది సీనియర్ ఐపీఎస్ ఏవీ రంగనాథ్. హైడ్రాకు కమిషనర్‌గా ఉన్న ఏవీ రంగనాథ్.. ఈ కూల్చివేతల విషయంలో సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్తున్న వేళ.. ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌‌కు భద్రత పెంచింది రేవంత్ రెడ్డి సర్కార్. రంగానాథ్ ఇంటి దగ్గర పోలీసులు భద్రత పెంచారు. మధురానగర్‌ కాలనీ డీ-81లోని ఆయన ఇంటి వద్ద ఇద్దరు సెక్యూరిటీతో కూడిన ఔట్‌ పోస్టు కూడా ఏర్పాటు చేశారు. అక్రమ కట్టడాల తొలగింపు ప్రక్రియను వేగవంతం చేసిన నేపథ్యంలో రంగనాథ్‌కు ఏమైనా ముప్పు ఏర్పడవచ్చనే అనుమానంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేసింది.

ఇప్పటికే.. 18 ప్రాంతాల్లో కూల్చివేతలు ప్రారంభించినట్టు తెలుస్తుండగా.. అందులో పలువురు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖుల నిర్మాణాలు కూడా ఉండటం గమనార్హం. అందులోనూ టాలీవుడ్ అగ్ర కథానాయకుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్‌ కన్వెన్షన్‌ను కూడా నేలమట్టం చేయటం ఇప్పుడు సర్వత్రా సంచలనంగా మారింది. మరోవైపు.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉంటున్న జన్వాడా ఫాంహౌస్ కూడా రేపో ఎల్లుండో కూల్చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు రంగానాథ్ బృందం. దీంతో.. హైడ్రా చర్యలపై కేవలం హైదరాబాద్‌లోనే కాదు.. మిగతా రాష్ట్రాల్లోనూ దుమారం చెలరేగుతోంది.

కాగా.. ఈ హైడ్రా కూల్చివేతలపై అటు పలువురు రాజకీయ నేతల నుంచి.. పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తోంది. హైడ్రా పేరుతో సామాన్యులను రేవంత్ రెడ్డి సర్కార్ భయపెట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపిస్తున్నారు. చాలా మంది నేతల ఫౌంహౌసులు.. ఇలా బఫర్ జోన్‌లోనే ఉన్నాయని ఇప్పటికే ఓ జాబితా కూడా వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో.. వాళ్లంతా మీడియా ముందుకొచ్చి గగ్గోలు పెడుతున్నారు

కవిత బెయిల్ బీఆర్ఎస్-కాంగ్రెస్‌ల ఉమ్మడి విజయం - బండి సంజయ్ సెటైర్లు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బెయిల్ రావడం పట్ల కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఎద్దేవా చేస్తూ స్పందించారు. కల్వకుంట్ల కవితకు బెయిల్ రావడం అనేది కాంగ్రెస్ పార్టీ - బీఆర్ఎస్ పార్టీలు సాధించిన విజయం అని సెటైర్లు వేశారు. వారి కృషి చివరికి ఫలించిందని వ్యాఖ్యానించారు. కవిత బెయిల్ ద్వారా బయటకు వస్తే.. కాంగ్రెస్ నేత తెలంగాణ నుంచి రాజ్యసభలోకి వెళ్తున్నారని విమర్శించారు.

ప్రసిద్ధ మద్యం కుంభకోణంలో BRS ఎమ్మెల్సీ కవితకు బెయిల్ ఇప్పించడంలో విజయాన్ని సాధించినందుకు అభినందనలు. మీ అవిశ్రాంత కృషి చివరికి ఫలించింది. ఈ బెయిల్ బీఆర్ఎస్, కాంగ్రెస్ సమిష్టి విజయం. బీఆర్ఎస్ నేత బెయిల్ మీద బయటకు వచ్చారు - కాంగ్రెస్ నాయకుడు రాజ్యసభలోకి వెళ్తున్నారు. కేసీఆర్ అద్భుతమైన రాజకీయ చతురతకు హ్యాట్సాఫ్. బెయిల్ కోసం వాదించిన అభ్యర్థికి బీఆర్ఎస్ మద్దతు ఇవ్వడం.. అధికార కాంగ్రెస్ ఏకపక్షంగా రాజ్యసభకు నామినేట్ చేయడం.. ఈ క్విడ్ ప్రో కో నేరంలో పాలు పంచుకున్న భాగస్వామ్యులకు అభినందనలు. విలీనం మాట ముచ్చట పూర్తయింది.. ఇక "అప్పగింతలే" తరువాయి’’ అని బండి సంజయ్ కుమార్ ఎద్దేవా చేశారు.

బీఆర్ఎస్ కౌంటర్

మద్యం పాలసీలో ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం రాజకీయ కక్ష్యతో దర్యాప్తు సంస్థలు పెట్టిన కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడం పట్ల మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఒక ప్రకటనలో హర్షం ప్రకటించారు. ఆధారాల్లేని కేసులో 5 నెలలు జైలులో ఉంచడం బాధాకరమని, సుప్రీం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు.

సుప్రీం కోర్టు బెయిలు మంజూరు చేయడాన్ని 2 రాజకీయ పార్టీల ఒప్పందంగా పేర్కొనడం కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్న బండి సంజయ్ రాజకీయ అజ్ఞానానికి నిదర్శనం అని, ఈ వ్యాఖ్యలు కోర్టు ధిక్కరణ కిందకే వస్తాయని అన్నారు. కవిత కేసులో న్యాయవాది వృత్తిపరంగా వ్యవహరించారన్న విషయం గుర్తుంచుకోవాలని అన్నారు.కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వ అక్రమాలు బయటపడి, తెలంగాణ కాంగ్రెస్ నేతలకు దానితో సంబంధం ఉందని తెలుస్తున్నా, కోట్ల రూపాయలు అక్రమంగా అనుమానాస్పద ఖాతాల్లోకి మళ్లాయని ఆరోపణలు వస్తున్నా, ఇప్పటి వరకు ఈడీ చర్యలు తీసుకోక పోవడంతోనే ఏ పార్టీ ఏ పార్టీతో కలిసి పనిచేస్తుందో అర్ధమవుతున్నదని విమర్శించారు.

తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఏర్పాటైన కొత్తలో ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరించిన సర్కార్.. ఇప్పుడు మరో దరఫా ప్రజా పాలన కార్యక్రమం నిర్వహించేందుకు సిద్ధమైంది. రేషన్ కార్డు, హెల్త్ కార్డుల కోసం వివరాలు సేకరించనుంది. పూర్తి హెల్త్ ప్రొఫైల్‌తో రాష్ట్రంలో ప్రతి పౌరుడికి హెల్త్ కార్డు..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఏర్పాటైన కొత్తలో ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరించిన సర్కార్.. ఇప్పుడు మరో దరఫా ప్రజా పాలన కార్యక్రమం నిర్వహించేందుకు సిద్ధమైంది. రేషన్ కార్డు, హెల్త్ కార్డుల కోసం వివరాలు సేకరించనుంది. పూర్తి హెల్త్ ప్రొఫైల్‌తో రాష్ట్రంలో ప్రతి పౌరుడికి హెల్త్ కార్డు మంజూరు చేయాలని భావిస్తోంది. ఇందుకు సంబంధించి క్షేత్రస్థాయిలో అధికారులను సన్నద్ధం చేయాలని సీఎం ఆదేశించారు.

కాగా, మంగళవారం నాడు స్పీడ్(స్మార్ట్ ప్రోయాక్టీవ్ ఎఫిషియెంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ)పై అధికారులతో సీఎం సమావేశమయ్యారు. ఈ భేటీలో అధికారులకు సీఎం కీలక సూచనలు, సలహాలు ఇచ్చారు. సెప్టెంబర్ 17వ తేదీ నుంచి పది రోజుల పాటు మరోసారి ప్రజాపాలన కార్యక్రమం చేపట్టాలని ఆదేశించారు. ఇందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.

అలాగే, హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రిని గోషామహల్‌కు తరలించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఇందుకు సంబంధించి భూ బదలాయింపు కార్యక్రమాన్ని ముమ్మరం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఆస్పత్రి నిర్మాణానికి ఆర్కిటెక్ట్స్‌తో డిజైన్లు రూపొందించాలన్నారు. వచ్చే 50 ఏళ్లను దృష్టిలో ఉంచుకుని ఆస్పత్రిని నిర్మించాలని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా డిజైన్లు ఉండాలన్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా రోడ్ కనెక్టివిటీ ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి.

తెలంగాణ గవర్నర్ ములుగు పర్యటనలో అపశ్రతి.. ఏం జరిగిందంటే?

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ తొలిసారి రాష్ట్రంలో అధికారిక పర్యాటన చేపట్టిన సంగతి తెలిసిందే. పర్యాటనలో భాగంగా ఈ రోజు ఆయన ములుగు జిల్లాకు వెళ్లారు. అయితే అక్కడ ఓ అనుకోని సంఘటన చోటు చేసుకుంది. గవర్నర్‌ పర్యటన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు చోటు చేసుకోకుండా గ్రే హౌండ్స్‌తో అధికారులు ముందస్తుగా భారీగా ఏర్పాట్లు చేశారు. భారీ సంఖ్యలో భద్రతా దళాలను..

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ తొలిసారి రాష్ట్రంలో అధికారిక పర్యాటన చేపట్టిన సంగతి తెలిసిందే. పర్యాటనలో భాగంగా ఈ రోజు ఆయన ములుగు జిల్లాకు వెళ్లారు. అయితే అక్కడ ఓ అనుకోని సంఘటన చోటు చేసుకుంది. గవర్నర్‌ పర్యటన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు చోటు చేసుకోకుండా గ్రే హౌండ్స్‌తో అధికారులు ముందస్తుగా భారీగా ఏర్పాట్లు చేశారు. భారీ సంఖ్యలో భద్రతా దళాలను మోహరించారు. అయితే భద్రత నేపథ్యంలో వెంకటాపూర్ మండలంలోని దట్టమైన అడవిలో విధుల్లో ఉన్న గ్రేహౌండ్ పోలీస్ కానిస్టేబుల్ గుండ్ల ప్రశాంత్ అనే వ్యక్తిని పాము కాటు వేసింది. దీంతో అతను తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. గమనించిన తోటి సిబ్బంది హుటాహుటున కానిస్టేబుల్‌ను ములుగు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్‌కు చికిత్స నిమిత్తం తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి వరంగల్‌కు తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరోవైపు నేడు, రేపు.. వరుసగా రెండు రోజుల పాటు యాదాద్రి, వరంగల్, ములుగు జిల్లాల్లో రాష్ట్ర గవర్నర్‌ జిష్ణు దేవ్ వర్మ పర్యటనలో ఉన్నారు. పుణ్య క్షేత్రాలు, ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాల సందర్శన అనంతరం లక్నవరం హాలాండ్స్‌లో బస చేస్తారు. గవర్నర్ తొలిసారి పర్యటనకు అధికార యంత్రాగం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

ఆగస్టు 27వ తేదీన గవర్నర్‌ జిష్ణుదేవ్‌వర్మ ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలో కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో 25 మంది ప్రముఖ రచయితలు, కళాకారులు, జాతీయ, రాష్ట్ర స్థాయి అవార్డు గ్రహితలతో గవర్నర్‌ పరస్పరం చర్చల అనంతరం.. వెంకటాపురం(ఎం) మండలంలోని రామప్ప, గోవిందరావుపేట మండలంలోని లక్నవరంలో బసచేసి మరుసటి రోజు హనుమకొండకు చేరుకుంటారు.

తెలుగోడు ఒక్కడు లేడు.. ఎందుకంటే!

ప్రోకబడ్డీ లీగ్ సీజన్ 11కు రంగం సిద్దమైంది. అక్టోబర్ 18 నుంచి మళ్లీ కబడ్డీ కూత సందడి చేయనుంది. ఇప్పటికే ఈ సీజన్‌కు సంబంధించిన వేలం పూర్తయింది. స్టార్ ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు రూ. కోట్లు కురిపించాయి. లీగ్ చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా ఈసారి 8 మంది కబడ్డీ ఆటగాళ్లు కోట్లు పలికారు.

రెండు రోజుల పాటు సాగిన వేలంలో సచిన్ తన్వార్ అత్యధిక ధర దక్కించుకున్నాడు. ఈ వేలంలో 12 ఫ్రాంచైజీలు మొత్తం 118 మంది ఆటగాళ్లను కొనుగోలు చేశాయి.అయితే తెలుగురాష్ట్రాలకు చెందిన కబడ్డీ ప్లేయర్లకు ఈసారి కూడా నిరాశే ఎదురైంది. ఒక్క ఆటగాడిని కూడా వేలంలో ఫ్రాంచైజీలు కొనుగోలు చేయలేదు. గతేడాది కూడా తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్కరు కూడా ప్రోకబడ్డీ లీగ్‌లో ప్రాతినిథ్యం వహించలేదు.

ప్రోకబడ్డీ టోర్నీలో హర్యానా ఆటగాళ్లదే పూర్తి ఆధిపత్యం నడుస్తోంది. ఆ రాష్ట్రం నుంచి 106 మంది ఆటగాళ్లు ఈ టోర్నీలో భాగమయ్యారు. ఆ తర్వాత మహారాష్ట్ర నుంచి 39 మంది, తమిళనాడు నుంచి 22 మంది, ఉత్తరప్రదేశ్ నుంచి 21 మంది కబడ్డీ ప్లేయర్లు ఈ ఫ్రాంచైజీ లీగ్‌లో భాగమయ్యారు. తెలుగు రాష్ట్రాలు అయిన ఏపీ, తెలంగాణ నుంచి ఒక్క ప్లేయర్ కూడా అవకాశం అందుకోలేకపోయారు.

చివరకు జమ్మూ కశ్మీర్ నుంచి ఇద్దరు ప్లేయర్లు ఎంపికవ్వగా.. బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్, ఉత్తరాఖండ్ నుంచి ఒక్కొక్కరు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలకు ప్రాతినిథ్యం వహిస్తున్న తెలుగు టైటాన్స్ కూడా ఒక్క ప్లేయర్‌ను తీసుకోలేదు. లోకల్ టాలెంట్‌ను ఎంకరేజ్ చేయాల్సిన సొంత ఫ్రాంచైజీ స్థానిక ఆటగాళ్లను పట్టించుకోకపోవడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంప్రదాయ క్రీడ అయిన కబడ్డీలో కూడా తెలుగు రాష్ట్రాల ప్రాతినిథ్యం లేకపోవడం ఏంటని అసహనం వ్యక్తం చేస్తున్నారు.ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు క్రీడాకారుల కోసం బాగా ఖర్చు పెడుతున్నాయని చెబుతున్నా.. ఒక్క ప్లేయర్ లేకపోవడం విడ్డూరంగా ఉందని కామెంట్ చేస్తున్నారు. పల్లె క్రీడ అయిన కబడ్డీకి సరైన ప్రోత్సాహకం లభించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాల్లో నైపుణ్యం కలిగిన కబడ్డీ క్రీడాకారులు ఎందరో ఉన్నారని, కానీ వారికి సరైన గైడెన్స్, ప్రోత్సాహకం లేక మధ్యలోనే వదిలేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.స్కూల్ లెవల్, జిల్లా, రాష్ట్ర స్థాయిలో సరైన టోర్నీలు నిర్వహించకపోవడం.. కబడ్డీ అసోసియేషన్స్ అన్నీ రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారడంతో నైపుణ్యం కలిగిన ఆటగాళ్లకు సరైన ప్రోత్సాహం లభించడం లేదనే వాదన వినిపిస్తోంది. కబడ్డీని కెరీర్‌గా ఎంచుకున్న కొంతమంది ఆటగాళ్లు కూడా ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే వరకు ఆటలో కొనసాగి తర్వాత వదిలేయడం, మరికొంతమంది ఆర్థిక సమస్యలతో తప్పుకోవడంతో తెలుగు రాష్ట్రాల నుంచి ప్రోకబడ్డీ లీగ్‌లో ప్రాతినిథ్యం లేకుండా పోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇప్పటికైనా ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు.. ఛాంపియన్లకు భారీ నగదు ప్రోత్సాహకం అందించే బదులు.. మట్టిలో మాణిక్యాలు వెలుగులోకి వచ్చే కార్యక్రమాలు చేపట్టాలని సూచిస్తున్నారు.

క్రెడిట్ కార్డ్ కొత్త రూల్స్.. HDFC, IDFC బ్యాంకుల ప్రకటన.. ఒకటో తేదీ నుంచే అమల్లోకి..!

ఇటీవలి కాలంలో క్రెడిట్ కార్డులు వాడే వారి సంఖ్య పెరిగి పోయిందని చెప్పొచ్చు. ఎన్నో అవసరాలకు ఇది ఎమర్జెన్సీ కింద ఉపయోగపడుతుంది. ఇంకా బ్యాంకులు, క్రెడిట్ కార్డు జారీ సంస్థలు కూడా మంచి మంచి డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్స్‌తో వీటిని ఆఫర్ చేస్తుంది. ఈ క్రమంలోనే కొత్త కొత్త రూల్స్ కూడా అమల్లోకి వస్తున్నాయి. తాజాగా రెండు దిగ్గజ బ్యాంకులు.. తమ క్రెడిట్ కార్డ్ టర్మ్స్ అండ్ కండీషన్స్ అప్డేట్ చేశాయి. ఈ వివరాలు చూద్దాం.

ప్రజలు రకరకాల పేమెంట్లు చేసేందుకు, ఎమర్జెన్సీగా డబ్బులు అవసరం పడినప్పుడు.. క్రెడిట్ కార్డుల్ని ఉపయోగిస్తున్నారని చెప్పొచ్చు. కొన్ని రకాల పేమెంట్స్‌పై స్పెషల్ డిస్కౌంట్స్, క్యాష్‌బ్యాక్స్, రివార్డ్ పాయింట్లు వంటివి లభించడం.. ఇంకా బిల్లింగ్ సైకిల్ మధ్య గ్యాప్ ఉండటం ఇందుకు కారణం. పేమెంట్స్‌ను ఈఎంఐల్లో చెల్లించేందుకు వెసులుబాటు ఉండటం కూడా ఒక కారణం. అయితే క్రెడిట్ కార్డులకు సంబంధించి రూల్స్ ఎప్పుడూ ఒకేలా ఉండవు. తమ ప్రయోజనాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాయి. అందుకే రివార్డ్ పాయింట్స్, క్యాష్‌బ్యాక్స్ వంటి ఆఫర్లు తరచుగా మారుతుంటాయి. దీని గురించి కస్టమర్లు కచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

ఈ మారుతున్న రూల్స్ తెలుసుకోలేకపోతే బెనిఫిట్స్ కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఇంకా అదనంగా ఛార్జీలు కూడా భరించాల్సి వస్తుంది. ఇప్పుడు దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ అయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకు రెండు కూడా మ క్రెడిట్ కార్డులకు సంబంధించి టర్మ్స్ & కండీషన్స్ అప్‌డేట్ చేసినట్లు వెల్లడించాయి. ఈ కొత్త రూల్స్ 2024, సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తుందని స్పష్టం చేశాయి.

HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డులకు సంబంధించిన క్రెడిట్ కార్డు లాయల్టీ ప్రోగ్రామ్‌ను సవరిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మార్పులతో ప్రభావితమైన కస్టమర్లకు బ్యాంక్.. ఇ- మెయిల్ ద్వారా సమాచారం అందించింది. ముఖ్యంగా యుటిలిటీ ట్రాన్సాక్షన్స్‌పై (కరెంట్, వాటర్, డిష్, పేపర్, ఇంటర్నెట్ బిల్స్) సంపాదించే రివార్డ్ పాయింట్లపై పరిమితి విధించింది. నెలకు ఇప్పుడు 2 వేల వరకు మాత్రమే గరిష్టంగా పొందొచ్చు.

యుటిలిటీ ట్రాన్సాక్షన్స్ మాదిరిగానే.. కేబుల్ ట్రాన్సాక్షన్స్, టెలికాం ట్రాన్సాక్షన్లపై ఆర్జించే.. రివార్డ్ పాయింట్లను కూడా నెలకు 2 వేల పాయింట్లకు పరిమితం చేసింది. చెక్, క్రెడ్, మొబిక్విక్ వంటి థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా చేసే ఎడ్యుకేషనల్ పేమెంట్స్‌కు ఇక రివార్డ్ పాయింట్స్ రావు. స్కూల్ లేదా కాలేజ్ వెబ్‌సైట్స్ లేదా POS మెషీన్ల ద్వారా నేరుగా చేసే పేమెంట్స్‌కు మాత్రం రివార్డ్ పాయింట్స్ వస్తాయి.ఈజీ ఈఎంఐ, వాలెట్ లోడింగ్‌కు సంబంధించిన లావాదేవీలపై కస్టమర్లు రివార్డ్ పాయింట్లు పొందలేరు. ట్రాన్సాక్షన్స్ కేటగిరీల్ని నిర్ణయించే మర్చంట్ కేటగిరీ కోడ్‌ను పేమెంట్ నెట్‌వర్క్స్ సెట్ చేస్తాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కాదు.ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకు కూడా క్రెడిట్ కార్డు రూల్స్ మార్చేసింది. ఇక్కడ ప్రత్యేకంగా మినిమం అమౌంట్ డ్యూ, పేమెంట్ డ్యూ డేట్స్‌లో మార్పులు చేసింది. సెప్టెంబర్ స్టేట్మెంట్ నుంచి మినిమం అమౌంట్ డ్యూ, ప్రిన్సిపల్ బ్యాలెన్స్‌లో 5 శాతం నుంచి 2 శాతానికి తగ్గుతుంది. అయితే ఇక్కడ ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి రావొచ్చు.

వినాయకచవితి వేడుకలు… తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

వినాయకచవితి సమీపిస్తుండటంతో నగరంలో వినాయక ప్రతిమలు విభిన్న రూపాల్లో అందంగా రూపుదిద్దుకుంటున్నాయి. కొన్ని చోట్ల విగ్రహాల విక్రయాలూ జోరందుకున్నాయి. మట్టి విగ్రహాలు వినియోగించి సహకరించాలని ఐటీ మంత్రి శ్రీధర్ బాబు ప్రజలని విజ్ఞప్తి చేశారు. గణేష్ ఉత్సవాలకు సంభందించి వివిధ శాఖలతో సమావేశం నిర్వహించామన్నారు. పోలీస్, ఫైర్, హెల్త్, జీహెచ్ఎంసీకి సంబందించిన సిబ్బంది పాల్గొన్నారని తెలిపారు.

ప్రతి సంవత్సరం గణేష్ ఉత్సవం ఎంతో ముఖ్యమైనదన్నారు. వివిధ ఉత్సవ కమిటీకి సంభంధించిన నిర్వాహకులు ఈ సమావేశం లో పాల్గొన్నారని తెలిపారు. వారు గతం లో ఎదురుకున్నా చిన్న చిన్న ఇబ్బందులను మా దృష్టికి తెచ్చారన్నారు. వాటిని పునరావృతం కాకుండా చూడాలని అధికారులను అదేశించామన్నారు. ముఖ్యంగా ట్రాఫిక్, కరెంట్ ఇబ్బందులు రాకుండా చూడాలని అధికారులను ఆదేశించామన్నారు.

అందరినీ కలుపుకొని ఈ ఉత్సవాలు ఘనంగా జరుపుకోవాలని నిర్ణయించామన్నారు. అందరు కూడా సహకరించి ముందుకు వెళతామని వారు తెలియజేశారన్నారు. పొల్యూషన్ నీ దృష్టిలో పెట్టుకుని మట్టి విగ్రహాలు పెట్టేలా ప్రోత్సహించాలని నిర్ణయించామన్నారు.

అందరికీ మట్టి విగ్రహాలు అందుబాటులో ఉండేలా చూడాలని అదేశించామన్నారు. మట్టి విగ్రహాల ఉపయోగంపై పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేయాలని నిర్ణయించామని తెలిపారు. మట్టి విగ్రహాలు వినియోగించి సహకరించాలని ప్రజలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.

జొన్వాడ ఫామ్ హౌస్ కు ఇరిగేషన్ అధికారులు.. ఏం జరుగుతోంది?

దాదాపు మూడేళ్ల కిందట మీడియాలో ప్రముఖంగా నిలిచింది జొన్వాడ ఫామ్ హౌస్. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలోని కీలక మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కు చెందినదిగా కథనాలు రావడమే దీనికి కారణం. అయితే, ఇదే సమయంలో అప్పటి టీపీసీసీ అధ్యక్షుడ రేవంత్ రెడ్డి జొన్వాడ ఫాంహౌస్ పై డ్రోన్ ఎగురవేశారు. దీంతో ఆయన మీద కేసు నమోదు చేశారు. జైలుకు కూడా పంపారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి అయ్యాక అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. మరోవైపు రేవంత్ సీఎం అయ్యాక తీసుకొన్న పెద్ద నిర్ణయం హైడ్రా ఏర్పాటు. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రిటెక్షన్ అథారిటీ (హైడ్రా)కి సీనియర్ ఐపీఎస్ ఏవీ రంగనాథ్ ను కమిషనర్ గా నియమించడం.. ఆ సంస్థ దూకుడుగా అక్రమణ నిర్మాణాలను కూల్చివేయడం అంతా పెద్ద సంచలనం అవుతోంది. ఈ క్రమంలో గత ఆదివారం హైడ్రా గండిపేట జలాశయం ఫుల్ ట్యాంక్ లెవల్ లో ఉన్న ప్రముఖుల నిర్మాణాలను పడగొట్టింది. ఇక తదుపరి వంతు జొన్వాడ ఫాంహౌజ్ అనే మాట వినిపించింది.

18వ తేదీన గండిపేట చెరువు ఎఫ్టీఎల్ లోని నిర్మాణాలను కూల్చివేసిన హైడ్రా బుల్డోజర్లు.. తదుపరి జొన్వాడ ఫాంహౌజ్ దిశగా కదులుతున్నాయన్న కథనాలతో ఆ ఫాంహౌజ్ యజమాని ప్రదీప్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. హైడ్రా కూల్చే ప్రమాదం ఉందని ముందస్తు పిటిషన్ దాఖలు చేశారు. కూల్చకుండా స్టే ఇవ్వాలని కోరారు. వాదనలు విన్న న్యాయస్థానం, హైడ్రా విధి విధానాలను ప్రశ్నించింది. ఏ ప్రాతిపదికన ఏర్పాటు చేశారని అడిగింది. విచారణ అనంతరం, పిటిషనర్ వాదనను తోసిపుచ్చింది. కూల్చివేత నిబంధనల ప్రకారమే ఉండాలని స్పష్టం చేసింది. జీవో 99 ప్రకారం ముందుకు సాగాలని హైడ్రాకు సూచించింది. కాగా, జొన్వాడ ఫాం హౌజ్ జంట జలాశయాల పరిరక్షణకు ఉద్దేశించినా 111 జీవో పరిధిలో ఉందనే ఆరోపణలున్నాయి.

జొన్వాడ్ ఫాంహౌజ్ తనది కాదని.. తన మిత్రుడు ప్రదీప్ రెడ్డి నుంచి లీజుకు తీసుకున్నట్లు కేటీఆర్ చెబుతున్నారు. తనకు ఫాం హౌజ్ లేదని స్పష్టం చేశారు. హైడ్రా ఎటువంటి చర్యలు తీసుకున్నా ఇబ్బంది లేదని చెప్పారు. ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉంటే కూల్చుకోమని పేర్కొన్నారు. కాగా,జొన్వాడ ఫాంహౌస్‌ వెనుకే సర్వే నెంబర్ 301లో కేటీఆర్ భార్య శైలిమ భూమి కొని పండ్ల తోట వేశారనే ఆరోపణలున్నాయి. ఆ భూమిలోకి ఈ ఫాంహౌస్‌ గేటులో నుంచే వెళ్లాలని... ఫాంహౌస్ నుంచి మరోవైపున ఉన్న ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ కు కనెక్ట్ అయ్యేలా మరో రోడ్డు కూడా వేశారని చెబుతారు. అన్నిటికిమించి సర్వే నం.311లో జొన్వాడ ఫాంహౌజ్ ఉంది. రేవంత్ రెడ్డి గతంలో దీనిపై ఎన్జీటీలో ఫిర్యాదు చేశారు కూడా. ఎన్జీటీ ఓ కమిటీని వేయగా.. అది రంగంలోకి దిగకుండానే హైకోర్టును ఆశ్రయించారు కేటీఆర్‌. ఆ ఫాంహౌజ్ తనది అంటూ ప్రదీప్‌ రెడ్డి కూడా హైకోర్టులో పిల్ వేశారు. అదంతా వదిలేస్తే కేటీఆర్ ఫాంహౌజ్ ను లీజుకు తీసుకోవడం ఏమిటనే ప్రశ్నలు కూడా వచ్చాయి.

రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలంలోని జొన్వాడ ఫాంహౌజ్ కు మంగళవారం సాగునీటి శాఖ అధికారులు చేరుకున్నారు. కొలతలు వేశారు. చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో జొన్వాడ ఫాంహౌజ్ ను నిర్మించారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఏం జరగబోతున్నది అనే ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ సినీ హీరో నాగార్జన ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేసినట్లు ఏ తెల్లవారుజామున హైడ్రా బుల్డోజర్లు జొన్వాడ ఫామ్ హౌజ్ మీదకు వెళ్తే అది పెద్ద సంచలనమే అవుతుంది.