వినేష్ ఫొగాట్‌పై ఒలింపిక్ సంఘం అనర్హత వేటు.. రెజ్లింగ్‌లో బరువుకు సంబంధించిన నియమాలు ఏమిటి?
పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు భారీ షాక్ తగిలింది. అధిక బరువు కారణంగా స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌పై అనర్హత వేటు పడింది.
వినేష్ మహిళల 50 కిలోల విభాగంలో ఫైనల్ ఆడాల్సి ఉంది, అయితే మ్యాచ్‌కు ముందు బరువును పరిశీలించినప్పుడు,ఆమె అధిక బరువుతో ఉన్నట్లు తేలింది.
ఆ తర్వాత ఆమెను అనర్హురాలిగాగా ప్రకటించారు. ఆమె దాదాపు 100 గ్రాముల బరువుతో ఉన్నట్లు చెబుతున్నారు.
అటువంటి పరిస్థితిలో,రెజ్లింగ్‌లో బరువుకు సంబంధించిన నియమాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆ తర్వాత ఆమెని ఎందుకు అనర్హులుగా ప్రకటించారో మీకే అర్థమవుతుంది.
యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (UWW) అనేది ప్రధాన రెజ్లింగ్ సమాఖ్య. దాని నిబంధనల ప్రకారం, రెజ్లర్‌లను రెండుసార్లు తూకం వేయాలి. ఒకసారి పోటీకి ముందు, అనంతరం ఫైనల్ మ్యాచ్ ముందు రెండోసారి.
ఒక మల్లయోధుడు పోటీకి లేదా ఫైనల్స్‌కు ముందు తన బరువు తరగతిని చేరుకోకపోతే లేదా కొలతకు అందుబాటులో లేకుంటే, అతను అనర్హుడవుతాడు.
వినేష్ విషయంలో కూడా అలాంటిదే జరిగింది.
అనర్హులుగా ప్రకటించడం వల్ల కలిగే పరిణామాలు ఏమిటి?
UWW నియమాల ప్రకారం, అనర్హత వేటు వేస్తే రెజ్లర్ తదుపరి పోటీలలో పాల్గొనలేకపోవడం, మునుపటి అన్ని మ్యాచ్‌ల ఫలితాలు శూన్యమే.
వారు ఎటువంటి పతకం పొందలేరు . ఆ బరువు విభాగంలో పట్టికలో చివరి స్థానంలో నిలుస్తారు.
ఇలాంటి పరిస్థితిలో ఫైనల్స్‌కు చేరినా వినేష్ చివరి స్థానంతో భారత్‌కు తిరిగి వస్తుంది.
Aug 07 2024, 20:07