ఉపాధి’లో అక్రమాలపై చర్యలు
ఖమ్మం జిల్లా కామేపల్లి మండలంలో జాతీయ ఉపాధి పథకంలో వెలుగు చూసిన అక్రమాలపై అధికారులు చర్యలు చేపట్టారు. పలువురు ప్రభుత్వ ఉద్యోగులను ఉపాధి కూలీలుగా చూపుతూ వారి ఖాతాల్లో నగదు బదిలీ చేసిన వ్యవహారంలో ఓ ఫీల్డ్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు పడింది.
ఖమ్మం జిల్లా కామేపల్లి మండలంలో జాతీయ ఉపాధి పథకంలో వెలుగు చూసిన అక్రమాలపై అధికారులు చర్యలు చేపట్టారు. పలువురు ప్రభుత్వ ఉద్యోగులను ఉపాధి కూలీలుగా చూపుతూ వారి ఖాతాల్లో నగదు బదిలీ చేసిన వ్యవహారంలో ఓ ఫీల్డ్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు పడింది. మరొకర్ని బదిలీ చేశారు. ముగ్గురు మేట్లను ఉపాధి హామీ పనుల నుంచి తొలగించారు.
బర్లగూడెం పంచాయతీలో జరిగిన ఉపాధి అక్రమా లపై జూలై 9న ‘ఉపాధి సొమ్ము ఉద్యోగుల ఖాతా ల్లోకి’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’ ప్రధాన సంచికలో కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘ఉపాధి హామీ’లో అక్రమాలపై విచారణ చేపట్టాలని ఖమ్మం జిల్లా డీఆర్‌డీఏ అడిషనల్ పీవోను ఉన్నతాధికారులు ఆదేశించారు.
ఈ విచారణ లో ఫీల్డ్ అసిస్టెంట్ రాజేష్, ముగ్గురు సీనియర్ మేట్లు అక్రమాలకు పాల్పడినట్లు విచారణలో తేలింది. రాజేష్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. టీఏ డేవిడ్ రాజును డిప్యుటేషన్‌పై వైరాకు బదిలీ చేశారు.
ఉపాధి’ అక్రమాలపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన కథనంలో పలువురు ప్రభుత్వ ఉద్యోగుల ఖాతాల్లో ఉపాధి సొమ్ము జమ అయినట్లు సవివరంగా ప్రచురించింది. కానీ అధికారుల విచారణ నివేదికలో కొందరి పేర్లు లేకపోవడం గమనార్హం.
నివేదికలో భూక్య చంద్రశేఖర్ అనే వ్యక్తి పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్ పోస్ట్‌మాస్టర్‌గా పనిచేస్తున్నారని, అతడికి 12 రోజులకు రూ.2,470 జమ అయ్యాయని నివే దికలో పేర్కొన్నారు. దాంతో ఆ సొమ్ము రికవరీ చే యాలని ఆదేశించారు.
అయితే అక్రమంగా ఉపాధి నిధులు పొందిన కొందరి పేర్లు నివేదికలో లేకపోవడం గమనార్హం. దీనిపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు
Aug 07 2024, 12:53