మరింత డేంజర్‌లోకి మేడిగడ్డ బ్యారేజ్ !

వర్షాలు పడ్డాయి.. వరదలొచ్చాయి.. మేడిగడ్డ బ్యారేజ్ మీదుగా నీళ్ల పారాయి.. ప్రపంచ అద్భుతాన్నికూలిపోయిందని.. కూలిపోతుందని ప్రచారం చేస్తారా అని బీఆర్ఎస్ చేసిన హడావుడి ఇంకా కళ్ల మందే ఉంది.

కానీ మేడిగడ్డ బ్యారేజ్ లో మరిన్ని పియర్స్ కు పగుళ్లు వచ్చాయని తాజాగా తేలింది. బ్యారేజ్‌లో గేట్లు అన్ని ఎత్తి పెట్టారు. నీరు నిల్వ చేయడానికి గేట్లు మూసి ఉంటే.. పెను ప్రమాదం సంభవించి ఉండేది. కానీ నీళ్లు ఎత్తిపోయలేదని ఆరోపిస్తూ కేటీఆర్ రెండు రోజుల పాటు టూర్ వేశారు. తామే మోటార్లు ఆన్ చేస్తామని కూడా ప్రకటించారు.

కానీ ఇప్పుడు మేడిగడ్డకు జరిగిన డ్యామేజ్ అలాంటి ఇలాంటి ది కాదని.. తాజాగా వెల్లడవుతున్న నివేదికలు వెల్లడిస్తున్నాయి. నీరు బ్యారేజీ మీదుగా ఇంకా వెళ్తోంది. వరద తగ్గిన తర్వాత పరిస్థితిని నిపుణులు మరోసారి పరిశీలన జరిపితే..

అసలు ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందో అర్థమయ్యే అవకాశం ఉంది. వర్షాలు..గోదావరికి వరద సీజన్ ముగిసిన తర్వాతనే మరమ్మత్తులో.. పగుళ్లిచ్చిన పియర్స్ ను తీసేసి మళ్లీ కొత్త వాటిని నిర్మంచడమో చేయాల్సి ఉంది.

కాళేశ్వరం విషయంలో తమ తప్పును చాలా చిన్నదిగా చూపించడానికి కేటీఆర్ బీఆర్ఎస్ చాలా ప్రయత్నాలు చేస్తున్నాయి.ఈ క్రమంలో ప్రతీ దాన్ని కాళేశ్వరంతో పోల్చేసుకుంటున్నారు.

వచ్చే ప్రతీ నీటిని కాళేశ్వరం నీళ్లంటున్నారు. కానీ ఈ ప్రాజెక్టు డొల్లతనంపై రోజు రోజుకు ప్రజల్లో చర్చ జరుగుతోంది. ఆ ప్రాజెక్టుకు అసలు డ్యామేజీ జరగకపోయినా అతి పెద్ద నిరర్థక ప్రాజెక్టు అని..

అది సృష్టించే సంపద కరెంట్ బిల్లులకూ సరిపోదని ఇప్పటికే కాగ్ లాంటి రిపోర్టులు వెల్లడించాయని కాంగ్రెస్ నేతలు గుర్తు చేస్తున్నారు.

అవినీతికి అడ్డగా గన్నేరువరం తహశీల్దార్ ఆఫీస్‌.. అధికారిపై కేసు

ప్రభు త్వాలు మారినా కరీంనగర్‌ జిల్లాలో మాత్రం అధికారుల తీరు మారడం లేదు...

ప్రభుత్వాలు మారినా అధికారుల తీరు మారడం లేదు. తప్పులు చేస్తే కటకటాల పాలవుతామన్న భయమే లేదు. కొందరు అధికారులు లంచాలకు అలవాటుపడి నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు. డబ్బులకు ఆశపడి తమకు ఉన్న అధికారాన్ని అవినీతి పనులకు ఉపయోగిస్తున్నారు.

అమాయక ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అసలు వారసులకు కాకుండా వేరొకరికి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ జారీ చేసి అధికారులు నిజమైన వారసులను ఇబ్బందులు పెడుతున్నారు. అటువంటి ఘటన గన్నేరువరం మండలంలోని తహశీల్దార్ కార్యాలయంలో చోటుచేసుకుంది. అధికారులు లంచాలు తీసుకొని అనర్హులకు సర్టిఫికెట్ జారీ చేశారని బాధితురాలు వాపోతోంది. అయితే ఈ విషయమై గన్నరువరం పోలీస్ స్టేషన్‌లో రెవెన్యూ అధికారిపై ఫేక్ సర్టిఫికెట్ ఇచ్చినట్లు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.

కుటుంబ యజమాని మరణించినప్పుడు కుటుంబ సభ్యులు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. దాన్ని వారసత్వ ధ్రువీకరణగా కూడా పరిగణిస్తారు. కుటుంబ యజమానికి సంబంధించి స్థలాలు, ఆస్తుల బదలాయింపు ఇతర అవసరాల నిమిత్తం ఈ సర్టిఫికెట్‌ను స్థానిక తహశీల్దార్ కార్యాలయాల్లో అప్లై చేసుకుని తీసుకుంటారు. ఎవరైనా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కోసం కార్యాలయాల్లో అప్లై చేస్తున్న అధికారులు విచారణ చేపట్టి సర్టిఫికెట్లు జారీ చేయాల్సి ఉంటుంది. కానీ కొందరు అవినీతి అధికారులు ఎలాంటి విచారణ చేపట్టకుండా ఇష్టానుసారం డబ్బులు వసూలు చేస్తూ అసలు వారసులను పక్కనపెడుతున్నారు.

ఆ కుటుంబంలోని దగ్గర బంధువులకు సర్టిఫికెట్లు ఇస్తూ కుటుంబీకుల మధ్య చిచ్చురేపుతున్నారు. అధికారులు అన్నీ తెలిసే ఇలాంటి ఘాతుకాలకు పాల్పడుతున్నారా? లేదా నేతల ప్రలోభాలకు లొంగి అనర్హులకు వారసత్వ పత్రాలను జారీ చేసి ఆస్తుల పంపకంలో తగాదాలు సృష్టించాలనుకుంటున్నారా? అనేది తెలియడం లేదు.

గన్నేరువరం మండల రెవెన్యూ అధికారులు అసలు వారసులను పక్కనపెట్టి మరొకరికి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ జారీ చేశారు. ఆలస్యంగా నిజం తెలుసుకున్న అసలు వారసులు సర్టిఫికెట్‌పై అధికారులను ప్రశ్నించగా ఎలాంటి సమాధానం చెప్పలేదని వాపోయారు. దీంతో బాధితులు జరిగిన విషయాన్ని ఆర్డీవోకు చెప్పడంతో విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. కుటుంబంలో చిచ్చుపెట్టి ఇష్టానుసారం సర్టిఫికెట్లు జారీ చేసిన అధికారులపై ఉన్నతాధికారులు స్పందించి సస్పెండ్ చేయాలని బాధితులు కోరుకుంటున్నారు.

బాధితురాలు కొయెడ వనిత తెలిపిన వివరాల ప్రకారం... కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని గునుకులకొండాపూర్ గ్రామానికి చెందిన లింగంపల్లి మల్లయ్య, లచ్చవ్వలకు ఇద్దరు బిడ్డలు, ఒక కొడుకు ఉన్నారు. పెద్ద కూతురు జాలిగం బాలవ్వ, 2వ కూతురు కొయెడ వనిత, కొడుకు లింగంపల్లి శ్రీనివాస్ ఉన్నారు. అయితే ముగ్గురిలో తమ పెద్దక్క జాలిగం బాలవ్వ, తన తమ్ముడు లింగంపల్లి శ్రీనివాస్ చనిపోయినట్లు 2వ కూతురు వనిత తెలిపారు. ఇదివరకు తమ తండ్రి, తల్లి అందరు చనిపోయారు. ఇక ఉన్నది తాను మాత్రమే ఉన్నానని వాపోయింది. వారసురాలిని అయిన తాను ఉండగా మా అక్క కొడుకుకు తన పేరు మీద తనకు తెలియకుండానే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్‌ను గన్నేరువరం తహసీల్దార్ జారీ చేశారని వాపోయింది. ఇదేంటీ సారు నా ప్రమేయం లేకుండా నా సంతకంతో ఎవరు తీసుకున్నారని అడిగితే సమాధానం చెప్పలేదని ఆవేదన వ్యక్తం చేసింది. రైట్ ఇన్ ఫర్మేషన్ యాక్టుతో రెవెన్యూ ఆఫీస్‌లో వారసత్వం ఫ్యామిలీ సర్టిఫికెట్ ఎవరు తీసుకున్నారని సర్టిఫైడ్ కాపీ కావాలని కోరడంతో సంబంధం లేని వ్యక్తికి ఇచ్చినట్టు అధికారికంగా తనకు తెలిపినట్లు వాపోయింది. అయితే ఈవిషయమై తాను గన్నేరువరం పోలీస్ స్టేషన్‌లో రెవెన్యూ అధికారిపై తప్పుడు సర్టిఫికెట్ ఇచ్చినట్లు ఫిర్యాదు చేశామని తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

సగానికి పైగా నిండిన ఎస్సారెస్పీ

గోదావరి పరిధిలోని శ్రీరాంసాగర్‌ నీటితో కళకళలాడుతోంది. ప్రాజెక్టు సగానికి పైగా నిండింది. ప్రాజెక్టులోకి 12 వేల క్యూసెక్కుల వరద వస్తోంది. ఎగువన మహారాష్ట్రలో ఉన్న జైక్వాడి ప్రాజెక్టుకు 48 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది.

గోదావరి పరిధిలోని శ్రీరాంసాగర్‌ నీటితో కళకళలాడుతోంది. ప్రాజెక్టు సగానికి పైగా నిండింది. ప్రాజెక్టులోకి 12 వేల క్యూసెక్కుల వరద వస్తోంది. ఎగువన మహారాష్ట్రలో ఉన్న జైక్వాడి ప్రాజెక్టుకు 48 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండితేనే శ్రీరాంసాగర్‌కు ఇన్‌ఫ్లో పెరిగే అవకాశాలున్నాయి. ఎస్సారెస్పీ పూర్తి సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 46.06 టీఎంసీల నీరు ఉంది.

కృష్ణా పరిధిలో ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది. ఆల్మట్టి ప్రాజెక్టుకు 2.97 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా 2 లక్షల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. నారాయణపూర్‌ ప్రాజెక్టుకు 2 లక్షల క్యూసెక్కుల వర ద వస్తుంటే దాదాపు అంతే స్థాయిలో ఔట్‌ఫ్లో ఉంది. జూరాలకు 2.52 లక్షల క్యూసెక్కులు, తుంగభద్రకు 84 వేల క్యూసెక్కుల వరద వచ్చిచేరుతోంది. శ్రీశైలం ప్రాజెక్టుకు 3.71 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా ప్రాజెక్టు గేట్లన్నీ ఎత్తేసి.. 3.99 లక్షల క్యూసెక్కులను నాగార్జున సాగర్‌కు వదులుతున్నారు.

సాగర్‌కు 3.14 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా... 22 గేట్ల ద్వారా 3.54 లక్షల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. పులిచింతల ప్రాజెక్టుకు 3.71 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా... గేట్లు ఎత్తి... 1.08 లక్షలను ప్రకాశం బ్యారేజీకి వదులుతున్నారు. ఇక్కడ రెండేళ్ల తర్వాత జలవిద్యుదుత్పత్తి చేపట్టడం గమనార్హం. సాగర్‌ నుంచి కృష్ణమ్మ పొంగిపొర్లుతుండటంతో ప్రకృతి అందాలను తిలకించేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు.

కాగా సాగర్‌ ఎడమ కాల్వ పరిధిలోని ఎలిమినేటి మాధవరెడ్డి (ఏఎమ్మార్పీ) వరద కాల్వకు సోమవారం రాత్రి గండిపడింది. నల్లగొండ జిల్లా అనుముల మండలం మారేంపల్లి వద్ద గండిపడటాన్ని రైతులు గుర్తించారు. అప్రమత్తమైన అధికారులు అక్కంపల్లి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నుంచి నీటిని నిలుపివేసి.. గండి పూడ్చివేత పనుల్లో నిమగ్నమయ్యారు. మంగళవారం రాష్ట్రంలోని పలుచోట్ల వర్షాలు పడ్డాయి. ఖమ్మం, మహబూబాబాద్‌, పాలమూరు జిల్లాల్లో భారీ వర్షం పడింది.

ఖమ్మం జిల్లా తల్లాడ, వైరా, కల్లూరు, కొణిజర్ల, రఘునాథపాలెంలో భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లాయి. తల్లాడలో 12.8 సెం.మీ వర్షపాతం నమోదైంది. మహబూబాబాద్‌ శివారులోని జంగిలిగొండ శివారు దూర్యతండాలో చెట్లు విరిగిపడ్డాయి.

పత్తి చేలల్లో నీళ్లు నిలిచాయి. పాలమూరు జిల్లా దేవరకద్ర, రాజాపూర్‌, జడ్చర్ల, గండీడ్‌, బాలానగర్‌ మండలాల్లో వర్షం పడింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో చిరుజల్లులు కురిశాయి.

నోబెల్ అవార్డు గ్రహీత సారథ్యంలో కొత్త ప్రభుత్వం

పొరుగుదేశం బంగ్లాదేశ్‌లో చెలరేగిన అల్లర్ల నేపథ్యంలో తన పదవికి రాజీనామా చేసిన ఆ దేశ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా.. ప్రస్తుతం భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో గల హిండన్ ఎయిర్‌బేస్‌లో తలదాచుకుంటోన్నారు. ఇది తాత్కాలికమే.

బంగ్లాదేశ్‌లో పార్లమెంట్ ఎన్నికలు ముగిసినప్పటి నుంచీ అల్లర్లు కొనసాగుతూనే వస్తోన్న విషయం తెలిసిందే. ఎన్నికల్లో షేక్ హసీనా అక్రమంగా విజయం సాధించారనేది అక్కడి ప్రజల ఆరోపణ. దీనికితోడు ఆర్థిక సంక్షోభం, ఉద్యోగాల్లో కోటా వ్యవస్థ.. వంటి ఆమె సారథ్యంలోని ఆవామీ లీగ్ ప్రభుత్వ పతనానికి దారితీసింది.

సొంతదేశం నుంచి హెలికాప్టర్‌లో పారిపోయిన షేక్ హసీనా భారత్‌కు చేరుకున్నారు. సోమవారం సాయంత్రం ఆమె తొలుత అగర్తల చేరుకున్నారు. అక్కడి నుంచి సీ-30 రకానికి చెందిన భారత ఆర్మీకి చెందిన రవాణా హెలికాప్టర్ హెర్కులెస్‌లో హిండన్ ఎయిర్‌బేస్‌కు వచ్చారు.

దీని తరువాత బంగ్లాదేశ్‌లో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోయాయి. ఆ దేశాధ్యక్షుడు మహ్మద్ షహబుద్దీన్ కీలక నిర్ణయాలను తీసుకున్నారు. సైన్యాధికారులతో భేటీ అయ్యారు. ఆర్మీ చీఫ్ వకార్ ఉజ్ జమాన్, జమాతె ఇస్లామీ పార్టీ నాయకులతో సమావేశం అయ్యారు.

జైలు శిక్షను అనుభవిస్తోన్న మాజీ ప్రధాని, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ చీఫ్ ప్రతిపక్ష నాయకురాలు బేగం ఖలీదా జియా విడుదలకు ఆదేశాలు జారీ చేశారు. తక్షణమే ఆమెను విడుదల చేయాలంటూ ఈ సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. పరిస్థితులు మరింత ముదరకముందే తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుందని తీర్మానించారు

2018 నుంచీ ఖలీదా జియా కారాగార శిక్షను అనుభవిస్తోన్నారు. ఆమెకు 17 సంవత్సరాల కఠిన కారాగార శిక్షను విధించింది అక్కడి కోర్టు. వృద్ధాప్యం, అనారోగ్య కారణాల వల్ల ప్రస్తుతం ఆసుపత్రిలో ఉంటోన్నారు. అక్కడే సైనిక నిర్బంధంలో కొనసాగుతున్నారు. ఆమెను వెంటనే విడుదల చేయాలంటూ అధ్యక్షుడు ఆదేశాలు జారీ చేశారు.

అదే సమయంలో బంగ్లాదేశ్‌లో ఏర్పడబోయే మధ్యంతర ప్రభుత్వానికి ప్రధాన సలహాదారుగా ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ అవార్డు గ్రహీత డాక్టర్ మహ్మద్ యూనుస్‌ నియమితులు కానున్నారు. ఈ మధ్యాహ్నం 12 గంటలకు ఆర్మీ చీఫ్ వకార్ ఉజ్ జమాన్.. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

1940 జూన్ 28వ తేదీన చిట్టగాంగ్‌లో జన్మించారు యూనస్. ఆర్థికశాస్త్రంలో 2006లో నోబెల్ అవార్డును అందుకున్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను అత్యంత బలోపేతం చేశారాయన. మైక్రోక్రెడిట్, మైక్రోఫైనాన్స్‌ రంగంపై ఆయనకు గట్టిపట్టు ఉంది. బ్యాంకింగ్ సేవలను గ్రామణీ ప్రాంతాలకు విస్తరింపజేయడంలో కీలకంగా వ్యవహరించారు.

2009లో యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్, 2010లో కాంగ్రెషనల్ గోల్డ్ మెడల్‌తో సహా పలు ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా సామాజిక కార్యకలాపాలను చేపట్టడానికి 2011లో యూనస్ సోషల్ బిజినెస్- గ్లోబల్ ఇనిషియేటివ్స్‌ను స్థాపించారు.

ఢాకా విశ్వవిద్యాలయంలో చదివారు. 1969లో ఆర్థిక శాస్త్రంలో పీహెచ్‌డీ పూర్తి చేశారు. డాక్టరేట్ అందుకున్నారు. వాండర్‌బిల్ట్ విశ్వవిద్యాలయంలో చదువుకోడానికి ఫుల్‌బ్రైట్ స్కాలర్‌షిప్‌ను సైతం పొందారాయన. విద్యాభ్యాసం ముగిసి తరువాత మిడిల్ టేన్నెస్సీ స్టేట్ యూనివర్శిటీలో ఎకనామిక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేశారు. చిట్టాగాంగ్ యూనివర్శిటీ ఎకనమిక్స్ హెడ్‌గా అపాయింట్ అయ్యారు.

ఒక్కసారి ఈ కుర్చీలో కుర్చుంటే తెలుస్తుంది.. లాయర్ల తీరుపై సీజేఐ అసహనం

పలువురు సుప్రీంకోర్టు లాయర్ల తీరుపై సీజేఐ జస్టిస్ డి.వై చంద్రచూడ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

లాయర్లు ఒక రోజు సీజేఐ స్థానంలో కూర్చుంటే తెలుస్తుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఒక్కరూ తమ కేసు ముందుగా విచారణ చేపట్టాలని కోరుతున్నారు.

కానీ జడ్జీలపై ఉన్న ఒత్తిడిని ఎవరూ పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. కోర్టులు, జడ్జీలపై ఎంత ఒత్తిడి ఉందో అర్థం చేసుకోవాలి. లాయర్లు ఒక రోజు సీజేఐ స్థానంలో కూర్చుని భరిస్తే తెలుస్తుంది. ఒక్కసారి కూర్చుంటే..

మళ్లీ జీవితంలో ఆ స్థానంలోకి రాకుండా పారిపోతారన్నారు. మంగళవారం ముంబయి చెంబుర్ కాలేజీలో బురఖా, హిజాబ్ రద్దు వ్యవహారంపై విచారణ సందర్భంగా సీజేఐ ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్రతి ఒక్కరి పిటిషన్ పై విచారణ చేస్తామని.. దానికి ఒక తేదీని ఇస్తాం. అంతే కానీ జడ్జీలను, కోర్టును శాసించవద్దని హెచ్చరించారు.

SB news

SB news

SB news

నేటి నుంచి ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఉప ఎన్నికల నామినేషన్లు, పోటాపోటీగా పార్టీల వ్యూహాలు

రాష్ట్రంలో అసెంబ్లీ వేడి నుండి ఇప్పుడిప్పుడే బ‌య‌ట‌ ప‌డుతున్న రాజ‌కీయ పార్టీల‌కు మ‌ళ్లీ ప‌రీక్ష మొద‌లైంది. అసెంబ్లీ ఎన్నిక‌లకు ముందు విశాఖ‌ప‌ట్నం స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ వంశీ కృష్ణ యాద‌వ్ వైసీపీకి, ఎమ్మెల్సీ ప‌ద‌వికీ రాజీనామా చేసి జ‌న‌సేన‌లో చేరారు. ఆయ‌న రాజీనామాను అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందే శాస‌న‌మండ‌లి చైర్మ‌న్ ఆమోదించారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యం అయింది.

అసెంబ్లీ ఎన్నిక‌ల్లో భారీ మెజార్టీతో గెలిచిన టీడీపీ కూట‌మి ఎలాగైన ఈ ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుచుకోవాల‌ని ప్ర‌య‌త్నిస్తోంది. అలాగే త‌మ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవ‌డానికి వైసీపీ కూడా అదే స్థాయిలో వ్యూహా ర‌చ‌న చేస్తోంది. అందులో భాగంగానే వైసీపీ ఇప్ప‌టికే ఉత్త‌రాంధ్రాలో సీనియ‌ర్ నేత, మాజీ మంత్రి బొత్స స‌త్యన్నారాయ‌ణను అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించింది.

టీడీపీ కూట‌మి ఇంకా మంత‌నాలు చేస్తూనే ఉంది. సోమ‌వారం రాత్రి టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు ప‌ల్లా శ్రీ‌నివాస‌రావు ఆధ్వ‌ర్యంలో విశాఖ‌ప‌ట్నంలోని సీతంపేట‌లోని ఆయ‌న నివాసంలో టీడీపీ, జ‌నసేన‌, బీజేపీ నేత‌లు భేటీ అయ్యారు. అసెంబ్లీ స్పీక‌ర్ అయ‌న్న‌పాత్రుడు, ఎమ్మెల్యేలు బండారు స‌త్య‌నారాయ‌ణమూర్తి, కోళ్ల ల‌లిత‌కుమారి, వెల‌గ‌పూడి రామ‌కృష్ణ‌బాబు, కేఎస్ఎన్ రాజు, బీజేపీ ఎమ్మెల్యే పీ. విష్ణుకుమార్ రాఉ, జ‌న‌సేన ఎమ్మెల్యేలు వంశీకృష్ణ శ్రీ‌నివాస్‌, పంచ‌క‌ర్ల ర‌మేష్ బాబు, ఎమ్మెల్సీలు దువ్వార‌పు రామారావు, మాజీ ఎమ్మెల్యేలు గండిబాబ్జీ, పీలా గోవింద స‌త్య‌నారాయ‌ణ‌, పార్టీ ఇన్‌ఛార్జి దామ‌చ‌ర్ల స‌త్య‌, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా నాగ‌జ‌గ‌దీశ్వ‌ర‌రావు త‌దిత‌రులు పాల్గొన్నారు.

టీడీపీ ఎమ్మెల్సీ టిక్కెట్టు ఆశిస్తున్న‌వారు ముగ్గురు ఉన్నారు. అందులో ఒక‌రు టీడీపీ విశాఖ‌ప‌ట్నం లోక్‌స‌భ‌ అధ్య‌క్షుడు గండిబాబ్జీ కాగా, మ‌రో ముగ్గురు అన‌కాప‌ల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవిందు స‌త్య‌న్నారాయ‌ణ‌, పీవీజీ కుమార్‌, తాత‌య్య‌బాబులు ఉన్నారు. వీరి పేర్ల‌ను పార్టీ అధిష్ఠానానికి పంపించారు. అయితే టీడీపీ విశాఖ‌ప‌ట్నం లోక్‌స‌భ‌ అధ్య‌క్షుడు గండి బాబ్జీని అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది.

విశాఖ‌ప‌ట్నం స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ స్థానం ఉప ఎన్నిక‌కు సంబంధించి నేడు నోటిఫికేష‌న్‌ను రిట‌ర్నింగ్ అధికారి (ఆర్ఓ), జిల్లా జాయింట్ క‌లెక్ట‌ర్ కె.మ‌యూర్ అశోక్‌ జారీ చేయ‌నున్నారు. నేటీ ఉద‌యం 11 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 3 గంట‌ల వ‌ర‌కు నామినేష‌న్ల‌ను స్వీక‌రిస్తారు. నామినేష‌న్ల ప్ర‌క్రియ‌ ఈనెల 13 (మంగ‌ళ‌వారం) వ‌ర‌కు జ‌రుగుతుంది. ఈనెల 14న నామినేష‌న్ల‌ను ప‌రిశీలిస్తారు. 16 వ‌ర‌కు నామినేష‌న్ల‌ను ఉప‌సంహ‌రించుకోవ‌డానికి గ‌డువు ఇచ్చారు. ఈనెల 30 తేదీన ఎన్నిక‌కు సంబంధించిన పోలింగ్ జ‌రుగుతుంది.

రిట‌ర్నింగ్ అధికారి కార్యాల‌యంలోనే నామినేష‌న్ల స్వీక‌ర‌ణ ఉంటుంది. ఆయ‌న‌కు స‌హాయ రిట‌ర్నింగ్ అధికారులుగా ఉమ్మ‌డి విశాఖ‌ప‌ట్నం జిల్లాల డీఆర్‌వోలు వ్య‌వ‌హ‌రిస్తారు. ఉమ్మ‌డి విశాఖ‌ప‌ట్నం జిల్లాలో విశాఖ‌ప‌ట్నం, భీమిలి, అన‌కాప‌ల్లి, న‌ర్సీప‌ట్నం, పాడేరు ఆర్‌డీఓ కార్యాల‌యాల్లో ఐదు పోలింగ్ కేంద్రాలు పెడ‌తారు. ఈ 838 మంది ఓట‌ర్లు ఈ ఐదు పోలింగ్ కేంద్రాల్లో ఓటు హ‌క్కును వినియోగించు కుంటారు. పోటీ చేసే అభ్య‌ర్థిని మొత్తం ప‌ది మంది ఓట‌ర్లు బ‌ప‌ర‌చాల్సి ఉంటుంది.

ఎమ్మెల్సీ ఎన్నిక‌కు 838 ఓట్ల‌తో జాబితాను సిద్ధం చేశారు. ఉమ్మడి విశాఖ‌ప‌ట్నం జిల్లాలో 652 మంది ఎంపీటీసీల‌కు గాను 16 ఖాళీగా ఉన్నాయి. 39 జెడ్పీటీసీల‌కు గాను మూడు ఖాళీగా ఉన్నాయి. 98 కార్పొరేష‌న్ వార్డుల‌కు గాను ఒక స్థానం ఖాళీగా ఉంది. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కార్పొరేట‌ర్లు, కౌన్సిల‌ర్లు క‌లిపి 822 మంది ఓట‌ర్లు ఉన్నారు.విశాఖ‌ప‌ట్నంలో న‌లుగురు (ద‌క్షిణం, ఉత్త‌రం, తూర్పు, ప‌శ్చిమ‌), భీమిలి, పెందుర్తి, గాజువాక‌, అన‌కాప‌ల్లి ఎమ్మెల్యేలు, విశాఖ‌ప‌ట్నం, అన‌కాప‌ల్లి లోక్‌స‌భ ఎంపీలు, రాజ్య‌స‌భ ఎంపీ వి.విజ‌యసాయి రెడ్డి, ఎమ్మెల్సీలు ర‌వీంద్ర‌బాబు, డి.రామారావు, వేపాడ చిరంజీవి జీవీఎంసీలో ఎక్స్ అఫిషియో స‌భ్యులుగా ఉన్నారు.

న‌ర్సీప‌ట్నం, ఎల‌మంచిలి ఎమ్మెల్యేలు న‌ర్సీప‌ట్నం, ఎల‌మంచిలి మున్సిపాల‌టీల్లో కూడా ఎక్స్ అఫిషియో స‌భ్యులుగా ఉన్నారు. మొత్తం 16 మంది ఎక్స్ అఫిషియో స‌భ్యులు ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఓటు ఉంది. దీంతో మొత్తం ఓట‌ర్లు 838 మంది ఉన్నారు.

ఎమ్మెల్సీ ఉప ఎన్నిక‌ల నేప‌థ్యంలో విశాఖ‌ప‌ట్నంలో ఎన్నిక‌ల కోడ్ అమ‌లులో ఉంది. దీంతో సోమ‌వారం నిర్వ‌హించాల్సిన ప్ర‌జా ఫిర్యాదుల ప‌రిష్కార కార్య‌క్ర‌మం (పీజీఆర్ఎస్‌)ను ర‌ద్దు చేశారు. జీవీఎంసీ, కలెక్ట‌రేట్‌, పోలీసు క‌మిష‌న‌రేట్‌లో జ‌రగాల్సిన పీజీఆర్ఎస్‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు అధికారులు తెలిపారు. అలాగే జీవీఎంసీ ప‌రిధిలోని అన్ని జోన‌ల్ కార్యాల‌యాల్లో కూడా పీజీఆర్ఎస్ ర‌ద్దు చేశారు. సెప్టెంబ‌ర్ 6 వ‌ర‌కు ఎన్నిక‌ల కోడ్ అమ‌లులో ఉంటుంది. ఈ విష‌యాన్ని ప్ర‌జ‌లు గ‌మ‌నించాల‌ని అధికారులు విజ్ఞ‌ప్తి చేశారు.

లండన్ సిగ్నల్ కోసం ఢిల్లీలో హసీనా వెయిటింగ్ ! గతంలో భారత్ శరణార్థులుగా వీరే..!

బంగ్లాదేశ్ లో రిజర్వేషన్ల అల్లర్ల నేపథ్యంలో ఆర్మీ హెచ్చరికతో ప్రధాని పదవిని వదిలేసి భారత్ పారిపోయి వచ్చేసిన షేక్ హసీనా కేంద్రం ఆతిధ్యంతో ఢిల్లీలో అతిధిగా ఆశ్రయం పొందుతున్నారు. అయితే భారత్ లోనూ ఎక్కువ కాలం ఉండటం ఎవరికీ మంచిది కాదన్న సూచనలతో ఆమె బ్రిటన్ ను శరణు కోరారు.

అయితే బ్రిటన్ ప్రభుత్వం కూడా హసీనాకు శరణార్ధిగా స్వీకరించేందుకు ఆలోచిస్తోంది. దీంతో ప్రస్తుతానికి హసీనా ఢిల్లీలోనే వేచి చూస్తున్నారు.

బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనాను భారత్‌లోని సురక్షిత ప్రదేశానికి తరలించినట్లు తెలుస్తోంది. లండన్ నుంచి కాల్ వస్తే తప్ప భారత్ నుంచి ఆమె బయలుదేరి వెళ్లే అవకాశాలు లేకపోవచ్చు. మరోవైపు ఢాకాలో చోటు చేసుకుంటున్న పరిణామాలను న్యూఢిల్లీ నిశితంగా పరిశీలిస్తోందని భారత ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

ఇప్పటికే విదేశాంగమంత్రి జైశంకర్ ప్రధాని మోడీతో పాటు లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని విడివిడిగా కలిసి తాజా పరిణామాల్ని వివరించారు. దీంతో ప్రధాని కేబినెట్ భేటీ ఏర్పాటు చేయబోతున్నారు. మరోవైపు భారత్‌ వైమానిక దళం, సైన్యం, సరిహద్దు భద్రతా బలగాలను అప్రమత్తం చేసింది.

మరోవైపు భారత్ లో ప్రస్తుతానికి తాత్కాలిక శరణార్ధిగా ఉన్న షేక్ హసీనా గతంలోనూ ఓసారి శరణార్ధిగా ఉన్నారు. 1975లో హసీనా తల్లితండ్రులు, కుటుంబ సభ్యుల హత్యల తర్వాత 1981 వరకూ ఢిల్లీలోని పండారా రోడ్డులో ఆమె పిల్లలతో కలిసి రహస్య శరణార్ధిగా ఉన్నారు.

హసీనా కాకుండా బౌద్ధగురువు దలైలామా, మాల్దీవుల నేతలు మొహమ్మద్ నషీద్, అహ్మద్ అదీబ్ అబ్దుల్ గపూర్, ఆప్ఘనిస్తాన్ నేత అబ్దుల్లా అబ్దుల్లా, శ్రీలంక నేత వరదరాజ్ పెరుమాళ్ వంటి వారికి భారత్ శరణార్ధులుగా కొంతకాలం ఆశ్రయం ఇచ్చింది.

వాళ్ల స్వదేశాల్లో పరిస్ధితులు చక్కబడ్డాక తిరిగి వీరిలో కొందరు వెళ్లిపోగా.. దలైలామా వంటి వారు ఇక్కడే శాశ్వత శరణార్దులుగా ఉండిపోయారు.

బిగ్ బ్రేకింగ్.. సాగర్ ఎడమ కాలువ(వరద కాలువ)కు భారీ గండి

శ్రీశైలం జలాశయం నుంచి సాగర్ కు భారీగా వరద వస్తుండటంతో అధికారులు సాగర్ గేట్లతో పాటు కుడి, ఎడమ కాలువల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

శ్రీశైలం జలాశయం నుంచి సాగర్ కు భారీగా వరద వస్తుండటంతో అధికారులు సాగర్ గేట్లతో పాటు కుడి, ఎడమ కాలువల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

ఈ క్రమంలో మంగళవారం వరద ఉధృతి భారీగా పెరగడం, డ్యాం పూర్తి స్థాయిలో నిండటంతో 22 గేట్లన ఎత్తిన అధికారులు కాలువల గేట్లను కూడా మరింత పైకి ఎత్తి నీటిని తరలిస్తున్నారు. అయితే సాగర్ ఎడమ కాలువలో నీరు భారీగా ప్రవహిస్తుండటంతో.. వరద కాలువకు గండి పడింది.

అనుములు మండలం మారెపల్లి వద్ద భారీ గండి పడటంతో కాలువలోని నీరు పొలాల్లోకి భారీ ఎత్తున చేరుకున్నాయి. దీంతో అప్రమత్తమైన అధికారుల వెంటనే ఎడమ కాలువను మూసి వేసినట్లు తెలిపారు.

అలాగే గండి పడిన ప్రదేశానికి చేరుకుని పూడిక పనులు ప్రారంభించినట్లు తెలుస్తుంది.

కాగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

22 ఏళ్ల తర్వాత సీబీ‘ఐ’కి చిక్కిన నిందితుడు.. 3 వేషాలు మార్చి ఎలా తప్పించుకున్నాడో తెలుసా.

రెండు దశాబ్దాలుగా పరారీలో ఉన్న నిందితుడిని సోమవారం సీబీఐ ఆఫీసర్లు అరెస్ట్ చేశారు.

రెండు దశాబ్దాలుగా పరారీలో ఉన్న నిందితుడిని సోమవారం సీబీఐ ఆఫీసర్లు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని చందులాల్ బిరాదారి ఎస్‌బీఐ బ్రాంచి‌లో రూ.50 లక్షల వరకు మోసానికి పాల్పడి 22 ఏండ్ల నుంచి తప్పించుకుని తిరుగుతున్న అతడిని తమిళనాడులో అరెస్టు చేసి హైదరాబాద్‌కు తీసుకొచ్చి రిమాండ్‌కు తరలించారు. ఏండ్లుగా నిందితుడు వేషాలు, పేర్లు మార్చుకున్నా సీబీఐ అతడిని వెంటాడి పట్టుకోవడంతో ఈ కేసు ఆసక్తిని రేపింది.

హైదరాబాద్‌కు చెందిన వి.చలపతిరావు 2002 మే నెలలో చందులాల్ బిరాదరి బ్రాంచి‌లో ఫేక్ శాలరీ సర్టిఫికెట్లు, ఎలక్ట్రానిక్ షాప్‌లకు సంబంధించిన తప్పుడు కొటేషన్లను ఇచ్చి ఎస్‌బీఐను రూ.50 లక్షల వరకు మోసం చేశాడు. దీనిపై సీబీఐ మే1వ తేదీన కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తులో భాగంగా 2004లో రెండు చార్జ్‌షీట్‌లను కోర్టులో దాఖలు చేసింది. అప్పటి నుంచి చలపతి‌రావు అదృశ్యమయ్యారు.

ఈ క్రమంలోనే నిందితుడు చలపతిరావు భార్య, తన భర్త అదృశ్యమైనట్టు కామాటిపుర పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. 7 ఏండ్ల నుంచి తన భర్త కనిపించడం లేదని, అతను చనిపోయినట్టు పరిగణించాలని సివిల్ కోర్టు‌లో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కోర్టు డిక్రీ ఇచ్చింది. చలపతిరావు ఆస్తులను జప్తు చేయడానికి ప్రయత్నించినప్పుడు అతని భార్య హైకోర్టు నుంచి స్టే తీసుకొచ్చింది. ఆ తర్వాత సీబీఐ సీఆర్పీసీ సెక్షన్ 82, 83 కింద చలపతిరావును నేరస్థుడిగా ప్రకటించింది. 3 అవతారాలు, 10 ఫోన్ నంబర్లు

హైదరాబాద్ నుంచి పారిపోయిన చలపతిరావు సాలెం ప్రాంతానికి వెళ్లాడు. అక్కడ 2007లో వినీత్ కుమార్‌గా పేరు మార్చుకుని ఆధార్ కార్డు పొంది అక్కడి యువతిని వివాహం చేసుకున్నాడు. 2014లో సాలెం నుంచి భోపాల్‌కు వచ్చాడు. అక్కడ కొన్ని రోజుల పాటు లోన్స్ రికవరీ ఏజెంట్‌గా పనిచేశాడు. అక్కడి నుంచి ఉత్తరాఖండ్ రుద్రాపూర్‌కు వెళ్లి ఓ స్కూల్‌లో పనిచేశాడు. ఆ సమాచారం తెలుసుకుని సీబీఐ అక్కడికి చేరుకునే సరికి నిందితుడు 2016లో రుద్రాపూర్ నుంచి వెళ్లిపోయినట్టు తెలిసింది.

దీంతో సీబీఐ అప్పటివరకు చలపతిరావు వాడిన ఈ-మెయిల్ ఐడీలు, ఆధార్ కార్డు ఆధారంగా ఔరంగాబాద్‌లోని వేరుల్ గ్రామంలో 2016-2021 వరకు ఓ ఆశ్రమంలో స్వామి విధితత్మానంద్ తీర్త్‌గా చెలామణి అయినట్టు గుర్తించింది. ఆశ్రమంలో రూ.70 లక్షలు మోసం చేసి నిందితుడు రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌కు చేరుకున్నాడు.

అక్కడ కొన్ని రోజుల పాటు ఉండి..ఇటీవల తమిళనాడు తిరుణవెల్లి‌కి చేరుకున్నాడు. ఇక్కడి నుంచి శ్రీలంకకు సముద్ర మార్గంలో పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా సీబీఐ ఆఫీసర్లు అతడిని అరెస్ట్ చేశారు. ఏండ్ల సస్పెన్స్‌కు తెరదించారు. ఈ 20 ఏండ్ల కాలంలో నిందితుడు 10 ఫోన్ నంబర్లు మార్చినా సీబీఐ ఆఫీసర్లు అతడిని వదిలిపెట్టలేదు.

ఇసుక మేటరేంటి..?

ప్రకాశం బ్యారేజీ వద్ద బ్యాథిమెట్రక్‌ సర్వే చేయించాలని జలవనరుల శాఖ అధికారులు భావిస్తున్నారు.

ప్రకాశం బ్యారేజీ వద్ద బ్యాథిమెట్రక్‌ సర్వే చేయించాలని జలవనరుల శాఖ అధికారులు భావిస్తున్నారు. బ్యారేజీకి ఎగువన 365 రోజుల పాటు నీరు నిల్వ ఉంటుంది. ఇక్కడ 3.07 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉంది. బ్యారేజీ పూర్తిస్థాయి నీటిమట్టం 12 అడుగులు. వరదలు వచ్చినప్పుడు ఇన్‌ఫ్లో లెక్కలను బట్టి గేట్లను పైకి ఎత్తుతారు. బ్యారేజీకి రెండు విధాలుగా వరదలు వస్తుంటాయి. నాగార్జున సాగర్‌ గేట్లు ఎత్తినప్పుడు ఆ నీరు పులిచింతలకు చేరుతుంది. పులిచింతల పూర్తిగా నిండాక ఎగువ నుంచి నీరు విడుదల చేస్తారు. తెలంగాణలో కురిసిన వర్షాల కారణంగా కీసర, పాలేరు, వైరా, కట్టలేరు వంటి వాగుల ద్వారా వరద నీరు వస్తోంది. బ్యారేజీలో నీటిమట్టం తక్కువగా ఉన్నప్పుడు పట్టిసీమ ద్వారా నీటిని విడుదల చేస్తారు. ఇలా ఎగువ నుంచి వస్తున్న నీటితో పాటు చెత్తాచెదారం కొట్టుకు వస్తుంది. ఇందులో కొంతభాగం గేట్లు ఎత్తినప్పుడు నీటిలో దిగువకు వెళ్లిపోతుంది. చాలావరకు చెత్తాచెదారం బ్యారేజీ గేట్ల వెనుక భాగాన ఉండిపోతుంది. ఇదంతా సిల్టుగా మారుతుంది

బ్యారేజీ వద్ద బ్యాథిమెట్రిక్‌ సర్వే నిర్వహించడం ఇదే మొదటిసారి కాదు. వైసీపీ ప్రభుత్వ హయాంలో 2021వ సంవత్సరంలో గుంటూరు జిల్లా వెంకటాయపాలెం నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు బ్యాథిమెట్రిక్‌ సర్వే నిర్వహించారు. బ్యారేజీ వద్ద 1.8 లక్షల మెట్రిక్‌ టన్నుల సిల్టు ఉన్నట్టు గుర్తించారు. ఇలా సిల్టు తీసినప్పుడు ఇసుక బయటకు వస్తుంది.

ఈ ఇసుకకు మంచి డిమాండ్‌ ఉంటుంది. నదిలో నుంచి తీస్తున్న ఇసుక కంటే ఈ ఇసుకలో పటిష్టత ఎక్కువగా ఉంటుందని భవన నిర్మాణ ఇంజనీర్లు చెబుతున్నారు. అందుకే సిల్టు ద్వారా వచ్చిన ఇసుకకు అధిక ధర ఉంటుంది. ఇలా తీసిన ఇసుకను ముందుగా జలవనరుల శాఖ ఉపయోగించుకుంటుంది. ఆ శాఖ ఆధ్వర్యంలో జరిగే నిర్మాణాలకు ఈ ఇసుకను ఉపయోగిస్తారు. ఇంకా మిగిలిన ఇసుకను భూగర్భ గనుల శాఖకు అప్పగిస్తారు. 

2021 తర్వాత ప్రకాశం బ్యారేజీకి వరదలు పెద్దగా వచ్చిన దాఖలాలు లేవు. ఇప్పుడు బ్యారేజీ పరిసర ప్రాంతాల్లో బ్యాథిమెట్రిక్‌ సర్వే చేయాలని జలవనరుల శాఖ అధికారులు నిర్ణయించారు. ఈ సర్వే చేయడానికి మెరైన్‌ ఇంజనీరింగ్‌ సంస్థలను టెండర్లకు ఆహ్వానించాలి. ఆ సంస్థలు సర్వే చేసి ఇసుక, సిల్టు అంచనాలను నివేదిక రూపంలో ఇవ్వడానికి రూ.40 లక్షల వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేశారు.

ప్రస్తుతం ఉచిత ఇసుక వ్యవహారాలను భూగర్భ గనుల శాఖ అధికారులు పర్యవేక్షిస్తున్నందున బ్యాథిమెట్రిక్‌ సర్వేకు అవసరమైన నిధులను ఇవ్వాలని భూగర్భ గనుల శాఖ అధికారులకు జలవనరుల శాఖ అధికారులు లేఖ రాశారు. ఇలా నిధులను ఇచ్చే అధికారం తమకు లేదని చెప్పిన భూగర్భ గనుల శాఖ అధికారులు ఆ ప్రతిపాదనను ఉన్నతాధికారులకు పంపారు.

టలు వేసిన ఇసుకను గుర్తించడానికి ఈ బ్యాథిమెట్రిక్‌ సర్వేను నిర్వహిస్తారు. దీన్నే హైడ్రోగ్రాఫిక్‌ సర్వే అని వ్యవహరిస్తారు. నదీగర్భంలో నేల ఏ ఆకారంలో ఉంది. ఎక్కడెక్కడ ఎత్తు పల్లాలు ఉన్నాయి, ఇసుకను అక్కడ తవ్వడం వల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తాయన్న అంశాలను ఈ సర్వేలో తెలుసుకుంటారు.

ఈ సర్వే చేయడానికి అత్యాధునిక టెక్నాలజీతో కూడిన బోటు ఉంటుంది. దానిద్వారా మాత్రమే ఈ సర్వేను నిర్వహించడానికి అవకాశం ఉంటుంది. బోటుకు సెన్సార్‌, జీపీఎస్‌ సిస్టమ్‌ ఉంటాయి. ఏడీసీపీ (అకాస్టిక్‌ డాప్లర్‌ కరెంట్‌ ప్రొఫైలర్స్‌) ద్వారా నీటి ప్రవాహాన్ని తెలుసుకుంటారు. అలల తీవ్రతను ఈ ఏడీసీపీ తెలియజేస్తుంది.