సరసమైన ధరలకు, నాణ్యమైన సరుకుల అమ్మకాలు మరింత పెంచాలి.. జిల్లాలో 51 ప్రత్యేక కౌంటర్ల ఏర్పాటు.. జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్.
నగరంలోని రైతుబజార్ ని, జిల్లా ఉద్యానశాఖ కార్యాలయాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అనంతపురం, ఆగస్టు 02 సరసమైన ధరలకు అందించే నాణ్యమైన సరుకులు అమ్మకాలను మరింత పెంచాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం అనంతపురం నగరంలోని రైతుబజార్ లో రైతు బజార్లు మరియు పెద్ద సంస్థాగత దుకాణాల వద్ద సరసమైన ధరలలో అందించే నాణ్యమైన సరుకులు అమ్మకం స్టోర్ ని జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నాణ్యమైన సరుకుల అమ్మకాలపై విస్తృత ప్రచారం కల్పించాలని ఆదేశించారు. బయట మార్కెట్ కన్నా తక్కువగా అందించే నాణ్యమైన సరుకులు అమ్మకాలను వినియోగదారులు సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. వినియోగదారుల వ్యవహారాలు, ఆహార మరియు పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో రైతు బజార్లు మరియు పెద్ద సంస్థాగత దుకాణాల వద్ద తక్కువ ధరలకు నిత్యావసర సరుకులను అందించడం జరుగుతోందన్నారు. ప్రస్తుతం బయట మార్కెట్లో నిత్యవసర సరుకులైన కందిపప్పు (దేశవాళి) కిలో ధర 181 రూపాయలు, బియ్యం (స్టీమ్డ్, బిపిటి/సోనామసూరి)కిలో ధర 55.85 రూపాయలు, బియ్యం (పచ్చి, బిపిటి/సోనామసూరి) కిలో ధర 52.40 రూపాయలు ఉందన్నారు. గత నెల జులై 11 వతేదీ నుంచి 31వ తేదీ వరకు రైతు బజార్ లో కందిపప్పు (దేశవాళి) కిలో ధర 160 రూపాయలు, బియ్యం (స్టీమ్డ్, బిపిటి/సోనామసూరి)కిలో ధర 49 రూపాయలు, బియ్యం (పచ్చి, బిపిటి/సోనామసూరి) కిలో ధర 48 రూపాయల తక్కువ ధరకు విక్రయించడం జరిగిందన్నారు. ప్రస్తుతం నాణ్యమైన సరుకుల ధరలను మరింత తగ్గించి జిల్లాలోని రైతు బజార్లు మరియు పెద్ద సంస్థాగత దుకాణాల వద్ద కందిపప్పు (దేశవాళి) కిలో ధర 150 రూపాయలు, బియ్యం (స్టీమ్డ్, బిపిటి/సోనామసూరి)కిలో ధర 48 రూపాయలు, బియ్యం (పచ్చి, బిపిటి/సోనామసూరి) కిలో ధర 47 రూపాయలకు అందించడం జరుగుతోందన్నారు. ఆహార మరియు పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో అతి తక్కువ ధరలకు అందించే నాణ్యమైన సరుకులను అందరూ ఉపయోగించుకోవాలని కోరారు. జిల్లాలో 51 ప్రత్యేక కౌంటర్ల ద్వారా అమ్మకాలు చేపట్టాలి. జిల్లాలో 51 ప్రత్యేక కౌంటర్ల ద్వారా సరసమైన ధరలలో అందించే నాణ్యమైన సరుకుల అమ్మకాలు చేపట్టాలన్నారు. అనంతపురం నగరంలోని రైతు బజార్, రుద్రంపేటలోని రెవెన్యూ సూపర్ మార్కెట్ (డి-మార్ట్), శ్రీనివాస్ నగర్ లోని రిలయన్స్ మార్ట్, ఆకుతోటపల్లిలోని రిలయన్స్ రిటైల్ లిమిటెడ్, కళ్యాణదుర్గం బైపాస్ రోడ్డులోని రిలయన్స్ రిటైల్ లిమిటెడ్ లో, రాంనగర్ లోని రిలయన్స్ మార్ట్ లో, రామచంద్ర నగర్ లోని విశాల్ మైగా మార్ట్ లో, టీచర్స్ కాలనీలోని ఎస్సీ డిగ్రీ కాలేజ్ వద్దనున్న మోర్ సూపర్ మార్కెట్లో, ఐదవ రోడ్డులోని మోర్ సూపర్ మార్కెట్లో నాణ్యమైన సరుకుల అమ్మకాలు చెప్పడం జరుగుతుందన్నారు. అలాగే ఆత్మకూరు మండల కేంద్రంలోని వాసవి రిటైల్ షాప్ లో, బెలుగుప్ప మండల కేంద్రంలోని జనరల్ స్టోర్ లో, బుక్కరాయసముద్రంలోని సూపర్ కే మాల్ లో, బొమ్మనహల్ లోని హోల్ సేలర్స్ వద్ద, బ్రహ్మాసముద్రంలోని జనరల్ స్టోర్ లో, డీ.హీరేహల్ లో హోల్ సేలర్స్ వద్ద, గార్లదిన్నెలోని విలేజ్ మార్ట్ లో, గుత్తి పట్టణంలోని హోల్ సేలర్స్ వద్ద మరియు అనంతపురం రోడ్డులోని మోర్ సూపర్ మార్కెట్ లో, గుమ్మగట్ట మండల కేంద్రంలోని జనరల్ స్టోర్ లో, గుంతకల్లు పట్టణంలోని రిలయన్స్ రిటైల్ లిమిటెడ్ లో, గోకుల్ కిరాణా షాప్, ఎస్.ఎల్.వి టాకీస్ వద్ద ఉన్న మోర్ సూపర్ మార్కెట్లో, మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న సెవెన్ హిల్స్ సూపర్ బజార్ లో, ఎన్టీఆర్ సర్కిల్ లోని హోల్ సేలర్స్ వద్ద అమ్మకాలు జరుగుతాయన్నారు. కళ్యాణదుర్గం పట్టణంలోని కన్యకా పరమేశ్వరి కాంప్లెక్స్ లో, హోల్ సేలర్స్ వద్ద & రిటైలర్స్ వద్ద, కంబదూరు మండల కేంద్రంలోని ఎన్టీఆర్ సర్కిల్ లో ఉన్న హోల్ సేలర్స్ వద్ద, కనేకల్లు పట్టణంలోని శ్రీ చిక్కనేశ్వర షాపులో, కూడేరులోని విలేజ్ మార్ట్ లో, కుందుర్పిలోని హోల్ సేలర్స్ లో, నార్పలలోని మహిళా మార్ట్, పామిడిలోని హైపర్ మార్ట్, పెద్దపప్పూరులోని జనరల్ స్టోర్ లో, పెద్దవడుగూరులోని హోల్ సేలర్స్ లో, పుట్లూరులోని హోల్ సేలర్స్ లో, రాప్తాడులోని సూపర్ మార్ట్ లో, రాయదుర్గం పట్టణంలోని రిలయన్స్ రిటైలర్ లిమిటెడ్, నీలకంటేశ్వర ట్రేడర్స్ వారి హోల్ సేలర్స్ లో, సెట్టూరు మండల కేంద్రంలోని జనరల్ స్టోర్ లో, సింగనమలలోని జనరల్ స్టోర్ లో, తాడిపత్రి పట్టణంలోని తాలూకా కార్యాలయం ఎదురుగా ఉన్న రిలయన్స్ రిటైల్ లిమిటెడ్, కృష్ణాపురం జీరో రోడ్డులోని రిలయన్స్ రిటైల్ లిమిటెడ్, ద మండి మర్చంట్ అసోసియేషన్ వారి హోల్ సేలర్స్ వద్ద, సీబీ రోడ్డులోని మోర్ సూపర్ మార్కెట్లో, ఎల్&టి అల్ట్రాటెక్ క్యాంపస్ లోని మోర్ సూపర్ మార్కెట్లో మరియు రామచంద్ర నగర్ లోని విశాల్ మెగా మార్ట్ లో, ఉరవకొండ పట్టణంలోని ఓల్డ్ బస్టాండ్ వద్దనున్న హోల్ సేలర్స్ వద్ద, కవిత హోటల్ వద్దనే ఉన్న హోల్ సేలర్స్ వద్ద, వజ్రకరూరు మండల కేంద్రంలోని ఆర్కే జనరల్ స్టోర్ లో, విడపనకల్లోని హోల్ సేలర్స్ వద్ద, యాడికిలోని హోల్ సేలర్స్ వద్ద, యల్లనూరు మండల కేంద్రంలోని జనరల్ స్టోర్ లో సరసమైన ధరలలో అందించే నాణ్యమైన సరుకుల అమ్మకం చేపట్టడం జరుగుతోందన్నారు. అమ్మకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా రైతు బజార్ లో ఎన్ని షాపులు ఉన్నాయి, ఎన్ని షాపులను లీజుకు ఇవ్వడం జరిగింది, తదితర వివరాలను జిల్లా కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం షాప్ యజమానులతో మాట్లాడుతూ ఎన్ని సంవత్సరాలు నుంచి షాప్ లను నడుపుతున్నారు, బాగా వ్యాపారం జరుగుతుందా, అంటూ వివరాలు ఆరా తీశారు. జిల్లా ఉద్యానశాఖ కార్యాలయాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్. అనంతరం జిల్లా ఉద్యానశాఖ కార్యాలయాన్ని, ఎపిఎంఐపి కార్యాలయాన్ని, ఉద్యానశాఖ శిక్షణా కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఆయా కార్యాలయాలకు ISO 9001:2015 సర్టిఫికేట్ లు వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు జిల్లా కలెక్టర్ సూచించారు. ఆయా కార్యాలయాల ద్వారా నాణ్యమైన సేవలు అందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జ్ ఆర్డీఓ వసంత బాబు, డిఎస్ఓ శోభారాణి, ఉద్యాన శాఖ జిల్లా అధికారి నరసింహారావు, ఏపీఎంఐపి పిడి రఘునాథరెడ్డి, మార్కెటింగ్ ఏడీ సత్యనారాయణ చౌదరి, డిప్యూటీ తహసీల్దార్ పునీత్, రైతు బజార్ అధికారులు, ఆయా శాఖల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Aug 07 2024, 06:59