తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 06 2024, 13:30

బిగ్ బ్రేకింగ్.. సాగర్ ఎడమ కాలువ(వరద కాలువ)కు భారీ గండి

శ్రీశైలం జలాశయం నుంచి సాగర్ కు భారీగా వరద వస్తుండటంతో అధికారులు సాగర్ గేట్లతో పాటు కుడి, ఎడమ కాలువల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

శ్రీశైలం జలాశయం నుంచి సాగర్ కు భారీగా వరద వస్తుండటంతో అధికారులు సాగర్ గేట్లతో పాటు కుడి, ఎడమ కాలువల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

ఈ క్రమంలో మంగళవారం వరద ఉధృతి భారీగా పెరగడం, డ్యాం పూర్తి స్థాయిలో నిండటంతో 22 గేట్లన ఎత్తిన అధికారులు కాలువల గేట్లను కూడా మరింత పైకి ఎత్తి నీటిని తరలిస్తున్నారు. అయితే సాగర్ ఎడమ కాలువలో నీరు భారీగా ప్రవహిస్తుండటంతో.. వరద కాలువకు గండి పడింది.

అనుములు మండలం మారెపల్లి వద్ద భారీ గండి పడటంతో కాలువలోని నీరు పొలాల్లోకి భారీ ఎత్తున చేరుకున్నాయి. దీంతో అప్రమత్తమైన అధికారుల వెంటనే ఎడమ కాలువను మూసి వేసినట్లు తెలిపారు.

అలాగే గండి పడిన ప్రదేశానికి చేరుకుని పూడిక పనులు ప్రారంభించినట్లు తెలుస్తుంది.

కాగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 06 2024, 13:28

22 ఏళ్ల తర్వాత సీబీ‘ఐ’కి చిక్కిన నిందితుడు.. 3 వేషాలు మార్చి ఎలా తప్పించుకున్నాడో తెలుసా.

రెండు దశాబ్దాలుగా పరారీలో ఉన్న నిందితుడిని సోమవారం సీబీఐ ఆఫీసర్లు అరెస్ట్ చేశారు.

రెండు దశాబ్దాలుగా పరారీలో ఉన్న నిందితుడిని సోమవారం సీబీఐ ఆఫీసర్లు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని చందులాల్ బిరాదారి ఎస్‌బీఐ బ్రాంచి‌లో రూ.50 లక్షల వరకు మోసానికి పాల్పడి 22 ఏండ్ల నుంచి తప్పించుకుని తిరుగుతున్న అతడిని తమిళనాడులో అరెస్టు చేసి హైదరాబాద్‌కు తీసుకొచ్చి రిమాండ్‌కు తరలించారు. ఏండ్లుగా నిందితుడు వేషాలు, పేర్లు మార్చుకున్నా సీబీఐ అతడిని వెంటాడి పట్టుకోవడంతో ఈ కేసు ఆసక్తిని రేపింది.

హైదరాబాద్‌కు చెందిన వి.చలపతిరావు 2002 మే నెలలో చందులాల్ బిరాదరి బ్రాంచి‌లో ఫేక్ శాలరీ సర్టిఫికెట్లు, ఎలక్ట్రానిక్ షాప్‌లకు సంబంధించిన తప్పుడు కొటేషన్లను ఇచ్చి ఎస్‌బీఐను రూ.50 లక్షల వరకు మోసం చేశాడు. దీనిపై సీబీఐ మే1వ తేదీన కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తులో భాగంగా 2004లో రెండు చార్జ్‌షీట్‌లను కోర్టులో దాఖలు చేసింది. అప్పటి నుంచి చలపతి‌రావు అదృశ్యమయ్యారు.

ఈ క్రమంలోనే నిందితుడు చలపతిరావు భార్య, తన భర్త అదృశ్యమైనట్టు కామాటిపుర పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. 7 ఏండ్ల నుంచి తన భర్త కనిపించడం లేదని, అతను చనిపోయినట్టు పరిగణించాలని సివిల్ కోర్టు‌లో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కోర్టు డిక్రీ ఇచ్చింది. చలపతిరావు ఆస్తులను జప్తు చేయడానికి ప్రయత్నించినప్పుడు అతని భార్య హైకోర్టు నుంచి స్టే తీసుకొచ్చింది. ఆ తర్వాత సీబీఐ సీఆర్పీసీ సెక్షన్ 82, 83 కింద చలపతిరావును నేరస్థుడిగా ప్రకటించింది. 3 అవతారాలు, 10 ఫోన్ నంబర్లు

హైదరాబాద్ నుంచి పారిపోయిన చలపతిరావు సాలెం ప్రాంతానికి వెళ్లాడు. అక్కడ 2007లో వినీత్ కుమార్‌గా పేరు మార్చుకుని ఆధార్ కార్డు పొంది అక్కడి యువతిని వివాహం చేసుకున్నాడు. 2014లో సాలెం నుంచి భోపాల్‌కు వచ్చాడు. అక్కడ కొన్ని రోజుల పాటు లోన్స్ రికవరీ ఏజెంట్‌గా పనిచేశాడు. అక్కడి నుంచి ఉత్తరాఖండ్ రుద్రాపూర్‌కు వెళ్లి ఓ స్కూల్‌లో పనిచేశాడు. ఆ సమాచారం తెలుసుకుని సీబీఐ అక్కడికి చేరుకునే సరికి నిందితుడు 2016లో రుద్రాపూర్ నుంచి వెళ్లిపోయినట్టు తెలిసింది.

దీంతో సీబీఐ అప్పటివరకు చలపతిరావు వాడిన ఈ-మెయిల్ ఐడీలు, ఆధార్ కార్డు ఆధారంగా ఔరంగాబాద్‌లోని వేరుల్ గ్రామంలో 2016-2021 వరకు ఓ ఆశ్రమంలో స్వామి విధితత్మానంద్ తీర్త్‌గా చెలామణి అయినట్టు గుర్తించింది. ఆశ్రమంలో రూ.70 లక్షలు మోసం చేసి నిందితుడు రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌కు చేరుకున్నాడు.

అక్కడ కొన్ని రోజుల పాటు ఉండి..ఇటీవల తమిళనాడు తిరుణవెల్లి‌కి చేరుకున్నాడు. ఇక్కడి నుంచి శ్రీలంకకు సముద్ర మార్గంలో పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా సీబీఐ ఆఫీసర్లు అతడిని అరెస్ట్ చేశారు. ఏండ్ల సస్పెన్స్‌కు తెరదించారు. ఈ 20 ఏండ్ల కాలంలో నిందితుడు 10 ఫోన్ నంబర్లు మార్చినా సీబీఐ ఆఫీసర్లు అతడిని వదిలిపెట్టలేదు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 06 2024, 13:26

ఇసుక మేటరేంటి..?

ప్రకాశం బ్యారేజీ వద్ద బ్యాథిమెట్రక్‌ సర్వే చేయించాలని జలవనరుల శాఖ అధికారులు భావిస్తున్నారు.

ప్రకాశం బ్యారేజీ వద్ద బ్యాథిమెట్రక్‌ సర్వే చేయించాలని జలవనరుల శాఖ అధికారులు భావిస్తున్నారు. బ్యారేజీకి ఎగువన 365 రోజుల పాటు నీరు నిల్వ ఉంటుంది. ఇక్కడ 3.07 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉంది. బ్యారేజీ పూర్తిస్థాయి నీటిమట్టం 12 అడుగులు. వరదలు వచ్చినప్పుడు ఇన్‌ఫ్లో లెక్కలను బట్టి గేట్లను పైకి ఎత్తుతారు. బ్యారేజీకి రెండు విధాలుగా వరదలు వస్తుంటాయి. నాగార్జున సాగర్‌ గేట్లు ఎత్తినప్పుడు ఆ నీరు పులిచింతలకు చేరుతుంది. పులిచింతల పూర్తిగా నిండాక ఎగువ నుంచి నీరు విడుదల చేస్తారు. తెలంగాణలో కురిసిన వర్షాల కారణంగా కీసర, పాలేరు, వైరా, కట్టలేరు వంటి వాగుల ద్వారా వరద నీరు వస్తోంది. బ్యారేజీలో నీటిమట్టం తక్కువగా ఉన్నప్పుడు పట్టిసీమ ద్వారా నీటిని విడుదల చేస్తారు. ఇలా ఎగువ నుంచి వస్తున్న నీటితో పాటు చెత్తాచెదారం కొట్టుకు వస్తుంది. ఇందులో కొంతభాగం గేట్లు ఎత్తినప్పుడు నీటిలో దిగువకు వెళ్లిపోతుంది. చాలావరకు చెత్తాచెదారం బ్యారేజీ గేట్ల వెనుక భాగాన ఉండిపోతుంది. ఇదంతా సిల్టుగా మారుతుంది

బ్యారేజీ వద్ద బ్యాథిమెట్రిక్‌ సర్వే నిర్వహించడం ఇదే మొదటిసారి కాదు. వైసీపీ ప్రభుత్వ హయాంలో 2021వ సంవత్సరంలో గుంటూరు జిల్లా వెంకటాయపాలెం నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు బ్యాథిమెట్రిక్‌ సర్వే నిర్వహించారు. బ్యారేజీ వద్ద 1.8 లక్షల మెట్రిక్‌ టన్నుల సిల్టు ఉన్నట్టు గుర్తించారు. ఇలా సిల్టు తీసినప్పుడు ఇసుక బయటకు వస్తుంది.

ఈ ఇసుకకు మంచి డిమాండ్‌ ఉంటుంది. నదిలో నుంచి తీస్తున్న ఇసుక కంటే ఈ ఇసుకలో పటిష్టత ఎక్కువగా ఉంటుందని భవన నిర్మాణ ఇంజనీర్లు చెబుతున్నారు. అందుకే సిల్టు ద్వారా వచ్చిన ఇసుకకు అధిక ధర ఉంటుంది. ఇలా తీసిన ఇసుకను ముందుగా జలవనరుల శాఖ ఉపయోగించుకుంటుంది. ఆ శాఖ ఆధ్వర్యంలో జరిగే నిర్మాణాలకు ఈ ఇసుకను ఉపయోగిస్తారు. ఇంకా మిగిలిన ఇసుకను భూగర్భ గనుల శాఖకు అప్పగిస్తారు. 

2021 తర్వాత ప్రకాశం బ్యారేజీకి వరదలు పెద్దగా వచ్చిన దాఖలాలు లేవు. ఇప్పుడు బ్యారేజీ పరిసర ప్రాంతాల్లో బ్యాథిమెట్రిక్‌ సర్వే చేయాలని జలవనరుల శాఖ అధికారులు నిర్ణయించారు. ఈ సర్వే చేయడానికి మెరైన్‌ ఇంజనీరింగ్‌ సంస్థలను టెండర్లకు ఆహ్వానించాలి. ఆ సంస్థలు సర్వే చేసి ఇసుక, సిల్టు అంచనాలను నివేదిక రూపంలో ఇవ్వడానికి రూ.40 లక్షల వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేశారు.

ప్రస్తుతం ఉచిత ఇసుక వ్యవహారాలను భూగర్భ గనుల శాఖ అధికారులు పర్యవేక్షిస్తున్నందున బ్యాథిమెట్రిక్‌ సర్వేకు అవసరమైన నిధులను ఇవ్వాలని భూగర్భ గనుల శాఖ అధికారులకు జలవనరుల శాఖ అధికారులు లేఖ రాశారు. ఇలా నిధులను ఇచ్చే అధికారం తమకు లేదని చెప్పిన భూగర్భ గనుల శాఖ అధికారులు ఆ ప్రతిపాదనను ఉన్నతాధికారులకు పంపారు.

టలు వేసిన ఇసుకను గుర్తించడానికి ఈ బ్యాథిమెట్రిక్‌ సర్వేను నిర్వహిస్తారు. దీన్నే హైడ్రోగ్రాఫిక్‌ సర్వే అని వ్యవహరిస్తారు. నదీగర్భంలో నేల ఏ ఆకారంలో ఉంది. ఎక్కడెక్కడ ఎత్తు పల్లాలు ఉన్నాయి, ఇసుకను అక్కడ తవ్వడం వల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తాయన్న అంశాలను ఈ సర్వేలో తెలుసుకుంటారు.

ఈ సర్వే చేయడానికి అత్యాధునిక టెక్నాలజీతో కూడిన బోటు ఉంటుంది. దానిద్వారా మాత్రమే ఈ సర్వేను నిర్వహించడానికి అవకాశం ఉంటుంది. బోటుకు సెన్సార్‌, జీపీఎస్‌ సిస్టమ్‌ ఉంటాయి. ఏడీసీపీ (అకాస్టిక్‌ డాప్లర్‌ కరెంట్‌ ప్రొఫైలర్స్‌) ద్వారా నీటి ప్రవాహాన్ని తెలుసుకుంటారు. అలల తీవ్రతను ఈ ఏడీసీపీ తెలియజేస్తుంది.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 06 2024, 12:13

సమావేశం తర్వాత కేంద్ర మంత్రి కీలక ప్రకటన..!

బంగ్లాదేశ్ అల్లర్ల నేపథ్యంలో కేంద్ర విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి జై శంకర్ ఇవాళ(మంగళవారం) అఖిలపక్ష నేతలను కలవనున్నారు. దీనికి సంబంధించి ఆ దేశ పరిస్థితులను ఇప్పటికే ఆయన నిశితంగా పరిశీలిస్తున్నారు. బంగాదేశ్ పరిస్థితులపై విదేశాంగ, హోంశాఖ, రక్షణ శాఖ మంత్రులతోపాటు ఉన్నతాధికారులతో ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటికే సమీక్ష నిర్వహించారు.

బంగ్లాదేశ్ అల్లర్ల నేపథ్యంలో కేంద్ర విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి జై శంకర్ ఇవాళ(మంగళవారం) అఖిలపక్ష నేతలను కలవనున్నారు. దీనికి సంబంధించి ఆ దేశ పరిస్థితులను ఇప్పటికే ఆయన నిశితంగా పరిశీలిస్తున్నారు. బంగాదేశ్ పరిస్థితులపై విదేశాంగ, హోంశాఖ, రక్షణ శాఖ మంత్రులతోపాటు ఉన్నతాధికారులతో ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటికే సమీక్ష నిర్వహించారు.

సరిహద్దు వెంట పటిష్ఠ భద్రత ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. గత రెండ్రోజులుగా అక్కడ జరుగుతున్న పరిణామాలు, బంగ్లాదేశ్ తాజా మాజీ ప్రధాని షేక్ హసీనా భారత్‌కు రావడం, సరిహద్దు భద్రత వంటి అంశాలను అఖిలపక్ష నేతలకు కేంద్ర మంత్రి వివరించనున్నారు. అఖిలపక్ష భేటీ తర్వాత ఉభయ సభల్లో జై శంకర్ కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం.

మరోవైపు పశ్చిమబెంగాల్, అస్సాం ప్రాంతాల్లో బంగ్లా సరిహద్దులను భద్రతాదళాలు కట్టుదిట్టం చేశాయి. గత రెండ్రోజులుగా బంగ్లా సరిహద్దుల్లోనే బీఎస్ఎఫ్ చీఫ్ నితిన్ అగర్వాల్ మకాం వేశారు. షేక్ హసీనా భారత్‌కు రావడంతో ఆందోళనకారులు సైతం వచ్చే ప్రమాదం ఉన్నందుకు అన్ని సరిహద్దుల వద్ద పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టారు. మరోవైపు బంగ్లాదేశ్ ఢాకా నుంచి విమాన సర్వీసులను కూడా కేంద్రం ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే.

బంగ్లాదేశ్‌లో స్వాతంత్ర్య సమరయోధుల వారసులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 30శాతం రిజర్వేషన్‌ను నిరసిస్తూ అల్లర్లు చెలరేగిన సంగతి తెలిసిందే. ఆందోళన కారులపై షేక్ హసీనా ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలని చూసింది. దాంతో ఆందోళనకారులు మరింత రెచ్చిపోవడంతో రంగంలోకి దిగిన ఆర్మీ.. పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో ఆదివారం ఒక్కరోజే 100మంది ఆందోళనకారులు మృతిచెందారు. ఇప్పటివరకూ అల్లర్లలో 300మంది వరకూ చనిపోయారు.

పరిణామాల అనంతరం ఆ దేశ ప్రధాని షేక్ హసీనా నిన్న తన పదవికి రాజీనామా చేసి భారత్‌కు చేరుకున్నారు. అనంతరం బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ వాకర్-ఉజ్-జమాన్ ఆధ్వర్యంలో సైనిక పాలన విధించారు.

ఆ దేశంలో ఇంకా కర్ఫ్యూ కొనసాగుతోంది. అయితే కొత్తగా ఏర్పడబోయే మధ్యంతర ప్రభుత్వానికి విద్యార్థి సంఘాల వేదిక ‘యాంటీ డిస్క్రిమినేషన్ స్టూడెంట్ మూవ్‌మెంట్’ కీలక ప్రతిపాదన చేసింది. కొత్త ప్రభుత్వ ప్రధాన సలహాదారుడిగా నోబెల్ గ్రహీత డాక్టర్ ముహమ్మద్ యూనస్‌ను నియమించాలని విజ్ఞప్తి చేసింది.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 06 2024, 12:12

మాజీ సీఎం జగన్ భద్రతపై క్లారిటీ ఇచ్చిన ఏపీ పోలీసుశాఖ

తనకు వ్యక్తిగత భద్రత తగ్గించారని, సీఎంగా ఉన్నప్పటి సెక్యూరిటీని ఇవ్వాలంటూ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఏపీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ స్పందించింది.

ప్రస్తుతం ఆయనకు జడ్‌ ప్లస్‌ సెక్యూరిటీ కొనసాగుతోందని, భద్రత తగ్గించారనే వాదనలో నిజం లేదని రాష్ట్ర పోలీసుశాఖ, ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మాజీ సీఎం హోదాలో జగన్‌‌కు నిబంధనల మేరకే భద్రతా సిబ్బందిని కేటాయించామని పోలీసుశాఖ స్పష్టం చేసింది.

చంద్రబాబు మాజీ సీఎంగా ఉన్నప్పుడు ఆయనకు అందించిన భద్రతనే ప్రస్తుతం జగన్‌కు కూడా కొనసాగిస్తున్నట్టు ఏపీ పోలీసుశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. జగన్‌ సీఎంగా ఉన్న సమయంలో ఆ హోదాను బట్టి అదనంగా కల్పించిన భద్రతను మాత్రమే తగ్గించామని

ప్రస్తుతం మాజీ సీఎం కావడంతో ముఖ్యమంత్రి స్థాయి భద్రత కల్పించడం సాధ్యంకాదని ఏపీ పోలీసు వర్గాలు అంటున్నాయి. కాగా జూన్‌ 3 నాటికి తనకున్న భద్రతను పునరుద్ధరించాలని కోరుతూ ఏపీ హైకోర్టులో మాజీ సీఎం జగన్ పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

జగన్ భద్రతకు సంబంధించిన వివరాలను ఏపీ పోలీసు వర్గాలు పంచుకున్నాయి. ఇన్‌స్పెక్టర్‌ స్థాయి అధికారిని భద్రత ఇన్‌ఛార్జిగా పెట్టామని చెప్పారు. 

ప్రస్తుతం జగన్‌కు 58 మంది సిబ్బందితో భద్రత కల్పిస్తున్నామని, ఆయన ఇంటి వద్ద 10 మంది సాయుధ గార్డులు ఉంటున్నారని, షిఫ్టుకు ఇద్దరు చొప్పున మొత్తం ఆరుగురు పీఎస్‌వోలు 24 గంటల పాటు భద్రత కల్పిస్తారని చెప్పారు.

నిరంతరం అందుబాటులో ఉండేలా ఆరుగురు డ్రైవర్లను జగన్‌కు కేటాయించామని వివరించారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 06 2024, 11:38

భారత్ - బంగ్లా సరిహద్దుల్లో కొనసాగుతున్న హైఅలర్ట్

భారత్ - బంగ్లా సరిహద్దుల్లో హైఅలర్ట్ కొనసాగుతోంది. బంగ్లాదేశ్ పరిణామాల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. బంగ్లా-భారత్ సరిహద్దుల్లో రాకపోకలను భద్రతా సిబ్బంది తాత్కాలికంగా నిలిపివేసింది.

భారత్ - బంగ్లా సరిహద్దుల్లో హైఅలర్ట్ కొనసాగుతోంది. బంగ్లాదేశ్ పరిణామాల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.

బంగ్లా-భారత్ సరిహద్దుల్లో రాకపోకలను భద్రతా సిబ్బంది తాత్కాలికంగా నిలిపివేసింది. సరిహద్దులకు అదనపు బలగాలను బీఎస్ఎఫ్ తరలించింది.

ఆర్మీ యూనిట్లను కూడా ప్రభుత్వం అప్రమత్తం చేసింది. బంగ్లాదేశ్ విద్యార్థి సంఘం నేతలతో నేడు ఆ దేశ ఆర్మీ చీఫ్ భేటీ అయ్యారు. మధ్యాహ్నం 12.00 గంటలకు విద్యార్థి సంఘాల సమన్వయకర్తలతో సమావేశం జరిగింది.

దేశంలో నెలకొన్న అశాంతి, అల్లర్ల నేపథ్యంలో కీలక భేటీ జరిగింది. బంగ్లా ప్రధాని షేక్ హసీనా దేశం విడిచి వెళ్లిన తర్వాత కూడా అల్లర్లు కొనసాగాయి. ప్రధాని నివాసం, చీఫ్ జస్టిస్ నివాసం సహా అనేక అధికారిక నివాసాల్లోకి చొరబడి ఆందోళనకారులు లూటీ చేశారు.

అల్లర్లను అదుపుచేసే ప్రయత్నాల్లో బంగ్లాదేశ్ ఆర్మీ, పోలీసు బలగాలు ఉన్నాయి. బంగ్లా రాజధాని ఢాకా పరిసర ప్రాంతాల్లో పలుచోట్ల కాల్పులు జరిగాయి. ఆందోళన చేస్తున్న విద్యార్థులు, ఇస్లామిక్ గ్రూపులపై కాల్పులు జరిగాయి. సోమవారం ఒక్కరోజే హింసాత్మక ఘటనల్లో 135 మంది మృతి చెందారు. పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ ఆంక్షలు అమలవుతున్నాయి. బంగ్లాదేశ్‌లో నెలకొన్న పరిణామాల ప్రభావం భారత్‌-బంగ్లాదేశ్‌ వాణిజ్యంపై పడుతోంది. ఈ క్రమంలోనే సోమవారం మధ్యాహ్నం నుంచి ఇరు దేశాల మధ్య వాణిజ్య కార్యకలాపాలు నిలిచిపోయినట్టు వ్యాపారులు చెబుతున్నారు. ఆదివారం నాడే బంగ్లాదేశ్‌ ప్రభుత్వం మూడు రోజుల ట్రేడ్‌ హాలిడేను ప్రకటిస్తూ నోటిఫికేషన్‌ జారీ చేసింది. అయితే అత్యవసర సర్వీసులను మాత్రం దీని నుంచి మినహాయించింది.

బంగ్లాదేశ్‌లోని అన్ని లాండ్‌ పోర్టుల్లో ఎగుమతి, దిగుమతుల కార్యకలాపాలు నిలిచిపోయాయి. పశ్చిమ బెంగాల్‌ ఎగుమతిదారుల కోఆర్డినేషన్‌ కమిటీ సెక్రటరీ ఉజ్జల్‌ సాహ తెలిపారు. బంగ్లాదేశ్ కస్టమ్స్‌ నుంచి క్లియరెన్స్‌ లేకపోవడం వల్ల ఎగుమతి, దిగుమతి కార్యకలాపాలన్నీ నిలిచిపోయాయి. ఇదిలా ఉండగా.. బంగ్లాదేశ్‌లో నెలకొన్న సంక్షోభం పట్ల భారత ఎగుమతిదారులు సోమవారం ఆందోళన వ్యక్తం చేశారు. ఆ దేశంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ద్వైపాక్షిక వాణిజ్యంపై ప్రభావం చూపుతాయంటున్నారు. అయితే త్వరలోనే పరిస్థితులు సద్దుమణుగుతాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. దక్షిణాసియాలో బంగ్లాదేశ్‌.. భారత్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉండగా.. ఆసియాలో బంగ్లాదేశ్‌కు భారత్‌ రెండో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 05 2024, 21:47

కేసీఆర్‌కు నోటీసులు.. హరీశ్‌రావు సహ మరో 8 మందికి సైతం..

మేడిగడ్డ బ్యారేజీ డ్యామేజ్ వ్యవహారంలో భూపాలపల్లి ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు కేసీఆర్, హరీశ్‌రావు సహా మొత్తం ఎనిమిది మందికి నోటీసులు జారీచేసింది.

మేడిగడ్డ బ్యారేజీ డ్యామేజ్ వ్యవహారంలో భూపాలపల్లి ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు కేసీఆర్, హరీశ్‌రావు సహా మొత్తం ఎనిమిది మందికి నోటీసులు జారీచేసింది. నాగవెల్లి రాజలింగమూర్తి దాఖలు చేసిన రివిజన్ పిటిషన్‌ను స్వీకరించిన కోర్టు... సెప్టెంబరు 5న విచారణ జరపనున్నట్లు పేర్కొన్నది.

ఆ విచారణకు రావాల్సిందిగా ఎనిమిది మందికీ నోటీసులను జారీచేసింది. గతంలో భూపాలపల్లి ఫస్ట్ క్లాస్ ప్రిన్సిపల్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో విచారణ జరిగిన అనంతరం రివిజన్ పిటిషన్ దాఖలు చేయడంతో ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి విచారణ జరపనున్నారు. మేడిగడ్డ బ్యారేజీ డ్యామేజీపై గతేడాది అక్టోబరు 25న స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని, ఆ తర్వాత జిల్లా ఎస్పీకి, డీజీపీకి కూడా కంప్లైంట్ చేశానని, ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడంతో పాటు ఎలాంటి చర్యలు తీసుకోనందున కోర్టును ఆశ్రయించానని నాగవెల్లి రాజలింగమూర్తి ఆ రివిజన్ పిటషన్‌లో పేర్కొన్నారు.

తొలుత ఫస్ట్ క్లాస్ ప్రిన్సిపల్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ వేశానని, తన పిటిషన్‌ను కొట్టివేసిందని, దానికి కారణాలను కూడా తనకు తెలియజేయలేదని, విధిలేని పరిస్థితుల్లో హైకోర్టును ఆశ్రయించానని, ఆ తర్వాత రివిజిన్ పిటిషన్‌ను జిల్లా కోర్టులో దాఖలు చేయాల్సిందిగా సూచించడంతో ఇప్పుడు దాఖలు చేయాల్సి వచ్చిందని రాజలింగమూర్తి పేర్కొన్నారు.

బ్యారేజీలోని ఏడవ బ్లాకులో పిల్లర్ భూమిలోకి కుంగిపోవడం, పెద్ద శబ్దంతో ఒక పిల్లర్‌కు పగుళ్ళు రావడంతో అసిస్టెంట్ ఇంజినీర్ స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని, తీవ్రవాద శక్తుల ప్రమేయం ఉన్నదనే అనుమానాన్ని వ్యక్తం చేశారని, పోలీసులు కూడా ఐపీసీలోని సెక్షన్ 427 ప్రకారం ఎఫ్ఐఆర్ (నెం. 174/2023) నమోదు చేశారని, మరుసటి రోజే దాన్ని క్లోజ్ చేశారని పిటిషనర్ గుర్తుచేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ (లక్ష్మీ బ్యారేజీ)కు డిజైన్ మొదలు నిర్మాణంలో నాణ్యతాలోపం, నిర్వహణలో నిర్లక్ష్యం వరకు అప్పటి ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్, ఇరిగేషన్ మంత్రిగా హరీశ్‌రావు సహా ఒక్కో స్థాయిలో ఒక్కొక్కరు బాధ్యులుగా ఉన్నారని రివిజన్ పిటిషన్‌లో పేర్కొన్నారు.

కేసీఆర్, హరీశ్‌రావుతో పాటు అప్పటి ఇరిగేషన్ సెక్రటరీ రజత్ కుమార్, సీఎంఓ కార్యదర్శి స్మితా సభర్వాల్, ఇంజినీర్-ఇన్-చీఫ్ హరిరామ్, చీఫ్ ఇంజినీర్ శ్రీధర్, ప్రాజెక్టు కాంట్రాక్టు దక్కించుకున్న ‘మెఘా’ నిర్మాణ సంస్థ అధినేత కృష్ణారెడ్డి, బ్యారేజీని నిర్మించిన ఎల్ అండ్ టీ ప్రతినిధులను పిటిషనర్ ప్రతివాదులుగా పేర్కొనడంతో ఈ ఎనిమిది మందికీ భూపాలపల్లి ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జీ నోటీసులు జారీచేశారు. సెప్టెంబరు 5న విచారణ జరగనున్నందున ఈ ఎనిమిది మంది హాజరవుతారా?... లేక వారి తరఫున న్యాయవాదుల్ని పంపుతారా?... అనేది ఆసక్తికరంగా మారింది.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 05 2024, 21:39

కేజ్రీవాల్‌కి దక్కని ఊరట.. బెయిల్ పిటిషన్‌ని కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు

ఢిల్లీ లిక్కర్ స్కాం(Delhi Liquor Scam) కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కి(CM Arvind Kejriwal) షాక్ తగిలింది. ఢిల్లీ హైకోర్టులో ఆయన వేసిన బెయిల్ పిటిషన్‌పై(Bail Petition) విచారించిన ధర్మాసనం పిటిషన్‌ని కొట్టేసింది.

ఢిల్లీ లిక్కర్ స్కాం(Delhi Liquor Scam) కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కి(CM Arvind Kejriwal) షాక్ తగిలింది. ఢిల్లీ హైకోర్టులో ఆయన వేసిన బెయిల్ పిటిషన్‌పై(Bail Petition) విచారించిన ధర్మాసనం పిటిషన్‌ని కొట్టేసింది.

దీంతో బెయిల్‌పై ఆశలు పెట్టుకున్న కేజ్రీవాల్‌కి ఊరట దక్కలేదు. ఈ ఘటనను చట్టవిరుద్ధమైన అరెస్టు అని చెప్పలేమని జస్టిస్ నీనా బన్సల్ కృష్ణతో కూడిన ధర్మాసనం పేర్కొంది. బెయిల్ దరఖాస్తు కోసం కేజ్రీవాల్ ట్రయల్ కోర్టును ఆశ్రయించే స్వేచ్ఛ ఉందని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది.

లిక్కర్ కేసులో అవినీతి జరిగిందంటూ సీబీఐ తనను అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హైకోర్టులో పిటిషన్ వేశారు. కేజ్రీవాల్ తరఫున సీనియర్ న్యాయవాదులు అభిషేక్ మను సింఘ్వీ, ఎన్ హరిహరన్, రమేష్ గుప్తా వాదనలు వినిపించారు. సీబీఐ తరఫున ఎస్పీపీ సింగ్‌ హాజరయ్యారు. ఈ పాలసీపై కేజ్రీవాల్‌తోపాటు అప్పటి లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ కూడా సంతకం చేశారని సింఘ్వి వాదించారు

మాజీ ఎల్జీ, బ్యూరోక్రాట్‌లను కూడా నిందితులుగా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు మొత్తం కుంభకోణంలో కేజ్రీవాల్ ప్రమేయం ఉందని, అందుకు తమ వద్ద సాక్ష్యాలు ఉన్నాయని సింగ్ తెలిపారు. అరెస్టు చట్టవిరుద్ధం కాదని ట్రయల్ కోర్టు ఇప్పటికే నిర్ధారణకు వచ్చిందని ఆయన అన్నారు. కేజ్రీవాల్‌పై సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేసిందని.. ముఖ్యమంత్రికి బెయిల్‌పై విడుదలయ్యే అర్హత లేదని సింగ్ పేర్కొన్నారు. సహ నిందితులు మనీష్ సిసోదియా, కె కవితపై ఛార్జిషీట్ దాఖలు చేసినప్పటికీ కోర్టు బెయిల్ నిరాకరించిన విషయాన్ని గుర్తు చేశారు.

ఇన్సూరెన్స్ అరెస్ట్' అనే పదాన్ని ఉపయోగించడం సరికాదని ఆయన పేర్కొన్నారు. కేజ్రీవాల్‌కు సీబీఐ ముందస్తు నోటీసు ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయన వ్యాఖ్యానించారు. కేజ్రీవాల్ ట్రయల్ కోర్టును ఆశ్రయించకుండానే నేరుగా బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు.

లిక్కర్ స్కాం కేసుల్లోనే ఆయన జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ప్రస్తుతం తిహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేసింది. మేలో, సాధారణ ఎన్నికల దృష్ట్యా జూన్ 01 వరకు సుప్రీంకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జూన్ 2న ఆయన తిరిగి లొంగిపోయారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 05 2024, 21:38

వియార్ సారీ.. కండక్టర్ల లూటీ ఘటనపై స్పందించిన సజ్జనార్

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ స్కీమ్ ఎంత ప్రశంసలు అందుకుంటున్నదో అంతే స్థాయిలో విమర్శలపాలవుతున్నది.

తాజాగా కొంత మంది కండక్టర్ల లూటీ నిర్వాకాన్ని ఓ నెటిజన్ బయటపెట్టగా దానిపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ రియాక్ట్ అయ్యారు.

కొందరు కండక్టర్లు మహాలక్ష్మి స్కీమ్ ను తమ లూటీ కోసం ఉపయోగించుకుంటున్నారని పురుషుల వద్ద టికెట్ చార్జి వసూలు చేస్తూ వారికి మాత్రం ఫ్రీ టికెట్ ఇస్తున్నారని ఓ నెటిజన్ ఆరోపించారు.

ఇదేంటని ప్రశ్నిస్తే పొరపాటున అలా జరిగిందని ఆ టికెట్ ను చంచివేసి మరో టికెట్ ఇస్తున్నారని.. జూన్ 26 తేదీన, జులై 7వ తేదీన ఆగస్టు 4వ తేదీన తన వద్ద డబ్బులు తీసుకుని కండక్టర్లు మహాలక్ష్మి స్కీమ్ కు సంబంధించిన టికెట్లు ఇచ్చారని సదరు నెటిజన్ ఎక్స్ (ట్విట్టర్)లో తన అనుభవాన్ని షేర్ చేశాడు.

ఇది మామూలు లూటీ కాదని.. ఈ వ్యవహారంపై దృష్టి సారించాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కు ట్యాగ్ చేశాడు. స్పందించిన సజ్జనార్..

జరిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని ఈ ఘటనకు బాధ్యలపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. మహాలక్ష్మి టికెట్లపై మరింత నిఘా పెట్టాలని ఈ తరహా జరుగుతున్న మోసాలపై ఉన్నతాధికారులు దృష్టి సారించాలని పలువురు నెటిజన్లు కోరుతున్నారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 05 2024, 21:34

అమెరికా-జపాన్ మార్కెట్ల పతనం.. భారత్‌ ఎకానమీపై ప్రభావం ఉంటుందా?

నేడు వారంలో మొదటి రోజైన సోమవారం (ఆగస్టు 5న) దేశీయ స్టాక్ మార్కెట్‌కు(stock market) బ్లాక్ సోమవారంగా నిలిచిపోయింది. అయితే అమెరికా-జపాన్ మార్కెట్ల క్షీణత సందర్భంగా భారత్‌ ఎకానమీపై ప్రభావం చూపుతుందా అని పలువురు ప్రశ్నిస్తు్న్నారు. ఆ విశేషాలేంటో ఇక్కడ చుద్దాం.

నేడు వారంలో మొదటి రోజైన సోమవారం (ఆగస్టు 5న) దేశీయ స్టాక్ మార్కెట్‌కు(stock market) బ్లాక్ సోమవారంగా నిలిచిపోయింది. ఇదే రోజు జపనీస్ స్టాక్ ఎక్స్ఛేంజీ నిక్కీ 225లో 13 శాతం లేదా 4750 పాయింట్లు పతనమైంది. మరోవైపు మాంద్యం భయంతో గత ట్రేడింగ్ సెషన్‌లో అమెరికా స్టాక్ మార్కెట్ భారీగా క్షీణించింది. దీంతో భారత మార్కెట్లలో గందరగోళం ఏర్పడి ఈరోజు ట్రేడింగ్‌లో బీఎస్‌ఈ సెన్సెక్స్ ఏకంగా 2700 పాయింట్లు నష్టపోయింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 825 పాయింట్లు పడిపోయింది. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ స్టాక్‌లు కూడా భారీగా పతనమయ్యాయి. ఈ క్రమంలో స్టాక్ మార్కెట్‌లో ఈ పతనం కారణంగా ఒక్క రోజే ఇన్వెస్టర్లు రూ.17.50 లక్షల కోట్ల నష్టాన్ని చవిచూశారు

అయితే అమెరికా-జపాన్ మార్కెట్ల క్షీణత సందర్భంగా భారత్‌ ఎకానమీపై ప్రభావం చూపుతుందా అని పలువురు ప్రశ్నిస్తు్న్నారు. ప్రస్తుతం గందరగోళం ఉన్నప్పటికీ భారతీయ మార్కెట్లు ఇతరులకన్నా త్వరగా స్థిరపడవచ్చని అమెరికా సంస్థ Dezerv సహ వ్యవస్థాపకుడు వైభవ్ పోర్వాల్ అన్నారు. భారత్‌లోకి ఎఫ్‌ఐఐ ప్రవాహాలు అనేక కారణాల వల్ల పెరిగాయని గుర్తు చేశారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఇతర ప్రపంచ దేశాల కంటే మెరుగ్గా ఉందని, ఇది పెట్టుబడిదారులకు ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మారిందన్నారు. ఇలాంటి సమయంలో పెట్టుబడిదారులు భారతదేశంతో సహా ఇతర చోట్ల మెరుగైన రాబడిని కోరుకునే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఈ క్రమంలోనే ఈ ఏడాది చివరి నాటికి వడ్డీరేట్లు 1.16 శాతం తగ్గవచ్చని జెఫరీస్ విశ్లేషకుడు క్రిస్టోఫర్ వుడ్ అంచనా వేశారు. జూన్ ఉపాధి డేటాకు ముందు ఈ అంచనా 0.86 శాతం మాత్రమేనని అన్నారు. అయితే ఈ కోత అమెరికా స్టాక్స్‌కు ప్రయోజనం చేకూర్చాల్సిన అవసరం లేదని, ఎక్కువ కోతలకు అవకాశం ఉన్న ఆసియా, అభివృద్ధి చెందుతున్న దేశాల స్టాక్ మార్కెట్లకు ఇది మంచి ప్రయోజనం చేకూరుస్తుందని క్రిస్టోఫర్ వుడ్ చెప్పారు.

క్రిస్టోఫర్ వుడ్ ప్రకారం భారత పెట్టుబడులకు మద్దతు ఇక్కడ చాలా బలంగా ఉందన్నారు. అయితే జపాన్‌లో అది లేదు. కాబట్టి భారతీయ స్టాక్ మార్కెట్ మరింత వృద్ధిని చూడవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఇదే సమయంలో గోల్డ్‌మన్ సాచ్స్ సోమవారం US మాంద్యం సంభావ్యతను వచ్చే ఏడాది 15 శాతం నుంచి 25 శాతానికి పెంచింది. అయినప్పటికీ ఆశాజనకంగా ఉండటానికి అనేక కారణాలను పేర్కొంది. ఆగస్ట్‌లో ఉద్యోగ వృద్ధి పుంజుకుంటుందని, ద్రవ్యోల్భణం కూడా అదుపులోనే ఉందని తెలిపింది.

మరోవైపు ఉద్యోగావకాశాల డిమాండ్ పటిష్టంగా ఉందని, తిరోగమనానికి దారితీసే స్పష్టమైన షాక్ ఏమీ లేనందున అమెరికా మార్కెట్ వేగంగా పెరుగుతుందని మరికొంత మంది ఆర్థికవేత్తలు అంటున్నారు. పెద్ద ఆర్థిక అసమతుల్యత లేకుండా స్థిరంగా ఉందని, అవసరమైతే వడ్డీరేట్లను తగ్గించే వెసులుబాటు ఫెడరల్ రిజర్వ్‌కు ఉందని వారు ప్రస్తావించారు.