కరీంనగర్ జిల్లాలో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన తహసీల్దార్

ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిని అరికట్టాలని పాలకులు ఎంతగా ప్రయత్నిస్తున్నా కొందరు అధికారుల్లో మాత్రం మార్పు రావడం లేదు. ప్రజలకు పనులు చేయాలంటే ఎంతో కొంత డిమాండ్ చేసి తీసుకుంటున్నారు.

తెలంగాణలో మరో అవినీతి అధికారి ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కాడు.

ఓ రైతు పహాణీ పత్రం కోసం వెళితే తహసీల్దార్ పదివేల రూపాయలు లంచం డిమాండ్ చేసి అడ్డంగా దొరికిపోయాడు.

కరీంనగర్ జిల్లా ఓదెల మండలం కొమిరె గ్రామానికి చెందిన కాడం తిరుపతి అనే రైతు ఇటీవల తాను కొనుగోలు చేసిన భూమిని తండ్రి మల్లయ్య పేరిట పట్టా చేసుకోవడానికి పలుమార్లు తహసీల్దార్ జాహేద్ పాషాను సంప్రదించాడు.

ఆయన రూ. 50వేలు లంచం డిమాండ్ చేయడంతో మూడు దఫాలుగా ఆయన సహాయకుడు ధర్మేందర్‌కు లంచం ముట్టజెప్పాడు. అయినా పట్టా ఇవ్వకపోవడంతో ప్రజావాణికి ధరఖాస్తు చేసుకున్నాడు. దీంతో పట్టాదారు పాసుపుస్తకం వచ్చింది. 

అయితే బ్యాంక్ రుణం తీసుకునేందుకు గానూ పహాణీ నకలు అవసరం కావడంతో తిరుపతి మళ్లీ తహసీల్దార్ వద్దకు వెళ్లాడు. మరో రూ. పదివేలు లంచంగా ఇస్తేనే పహాణీ నకలు పత్రాలు ఇస్తానని చెప్పడంతో ఇక లంచం ఇవ్వలేని తిరుపతి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.

నిన్న జుహేద్ పాషా డ్రైవర్ అంజద్ పాషా, సహాయకుడు దాసరి ధర్మేందర్‌కు రైతు లంచం ఇస్తుండగా, ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మురుగు శుద్ధి.. ఇక శరవేగంగా...

మహానగరానికి తాగునీటినందించే జంట జలాశయాలు హిమాయత్‌సాగర్‌, ఉస్మాన్‌సాగర్‌(గండిపేట)లోకి చుక్క మురుగునీరు చేరకుండా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపడుతోంది. ఈ జలాశయాల ఎగువన పెద్ద ఎత్తున నిర్మాణాలు జరుగుతుండడంతో భారీగా మురుగు వచ్చి చేరుతోంది.

మహానగరానికి తాగునీటినందించే జంట జలాశయాలు హిమాయత్‌సాగర్‌, ఉస్మాన్‌సాగర్‌(గండిపేట)లోకి చుక్క మురుగునీరు చేరకుండా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపడుతోంది. ఈ జలాశయాల ఎగువన పెద్ద ఎత్తున నిర్మాణాలు జరుగుతుండడంతో భారీగా మురుగు వచ్చి చేరుతోంది.

మరో హుస్సేన్‌సాగర్‌(Hussainsagar)గా మారకముందే మురుగును వేగంగా శుద్ధి చేసి వదిలేందుకు వాటర్‌బోర్డు చేసిన ప్రతిపాదనకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. జంట జలాశయాల ఎగువ భాగంలో రూ.65 కోట్లతో నాలుగు మురుగునీటి శుద్ధి ప్లాంట్ల(ఎస్టీపీ) నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. పాలనాపరమైన అనుమతులు కూడా రావడంతో త్వరలో పనులు ప్రారంభించేందుకు జలమండలి సన్నద్ధమవుతోంది. నెలరోజుల్లో టెండర్‌ ప్రక్రియను పూర్తి చేసి శంకుస్థాపన చేసేందుకు అడుగులేస్తోంది.

జంట జలాశయాల ఎగువ ప్రాంతాల్లో పెద్దఎత్తున ఫామ్‌హౌస్‏లు వెలిశాయి. పలు రిక్రియేషన్‌ సెంటర్లు ఏర్పాటయ్యాయి. దీంతోపాటు ఆయా గ్రామాల నుంచి మురుగునీరంతా ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌(Osmansagar, Himayatsagar)లలో చేరుతోంది.

దీన్ని అరికట్టకపోతే మున్ముందు జలాశయాల ఉనికికే ప్రమాదం ఉన్నందున ఎస్టీపీల నిర్మాణం చేపట్టాలని జలమండలి నిర్ణయించింది. నగరంలోని మణికొండ, సన్‌సిటీ, పాతబస్తీ(Manikonda, Suncity, Old Town)లోని పలు ప్రాంతాలకు ప్రతినిత్యం ఉస్మాన్‌సాగర్‌ నుంచి 97 మిలియన్‌ లీటర్లు, హిమాయత్‌సాగర్‌ నుంచి 36 మిలియన్‌ లీటర్ల నీటిని శుద్ధి చేసి సరఫరా చేస్తున్నారు.

20 ఎంఎల్‌డీల సామర్థ్యం గల ఈ నాలుగు ఎస్టీపీల నిర్మాణానికి రూ.65 కోట్ల మేర వ్యయమవుతుందని అంచనా వేశారు. ఈ పనులను దక్కించుకునే సంస్థ వాటర్‌బోర్డుతో ఒప్పందం చేసుకున్న తర్వాత తొమ్మిది నెలల్లో పనులు పూర్తి చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే ఉస్మాన్‌సాగర్‌ ఎగువన జన్వాడ, హిమాయత్‌నగర్‌ ప్రాంతాల్లో, హిమాయత్‌సాగర్‌ ఎగువన నాగిరెడ్డిగూడ(Nagireddyguda), కాముని నాలా సంగమం వద్ద అవసరమైన భూమిని సేకరించినట్లు తెలిసింది. ఎస్టీపీలు నిర్మించే సంస్థయే రెండేళ్లపాటు పూర్తి నిర్వహణ బాధ్యత వహించాల్సి ఉంటుందని టెండర్‌ నిబంధనల్లో పొందుపరిచారు.

స్టీపీలను నిర్మించనున్నారు. ఉస్మాన్‌సాగర్‌ ఎగువన 9 ఎంఎల్‌డీ(మిలియన్‌ లీటర్‌ ఫర్‌ డే) సామర్థ్యంతో రెండు ఎస్టీపీల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. 4 ఎంఎల్‌డీల సామర్థ్యంలో జన్వాడ వద్ద బుల్కాపూర్‌ నాలా సమీపంలో ఒకటి, చిలుకూరు జోన్‌ పరిధిలోని హిమాయత్‌నగర్‌ వద్ద 5 ఎంఎల్‌డీల సామర్థ్యంతో మరొకటి నిర్మించనున్నారు.

అలాగే హిమాయత్‌సాగర్‌ ఎగువన 11 ఎంఎల్‌డీల సామర్థ్యంతో రెండు ఎస్టీపీలను నిర్మించనున్నారు. అజీజ్‌నగర్‌, బంగళ్‌గూడ, నాగిరెడ్డిగూడ జోన్‌ పరిధిలో నుంచి వచ్చే మురుగును శుద్ధి చేసేలా నాగిరెడ్డిగూడ వద్ద 5ఎంఎల్‌డీల సామర్థ్యంతో ఎస్టీపీని నిర్మించడానికి నిర్ణయించారు. అదేవిధంగా మరో ఎస్టీపీని కోత్వాల్‌గూడ, శంషాబాద్‌, కవాగూడ జోన్ల పరిధిలో నుంచి వచ్చే మురుగును శుద్ధి చేసేలా కాముని నాలా సంగమం వద్ద 6ఎంఎల్‌డీల సామర్థ్యంతో ఎస్టీపీని నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

రిల్ హీరో కాదు రియల్ హీరో: మోహన్ లాల్

రిల్ హీరో అంటే సినిమాల్లో హీరోయిన్ క‌ష్టాల్లో ఉంటే గూండాలతో ఫైట్ చేసి ఆమెను కాపాడుతాడు కానీ ఇక్కడ సీన్ రివర్స్ వంద లాది మంది ప్రాణాలను కాపాడడానికి వచ్చి రియ‌ల్ హీరో అనిపించుకున్నారు కేర‌ళ న‌టుడు మోహ‌న్‌ లాల్‌. 

ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియా లో మోహ‌న్‌లాల్‌పై ఇలాంటి ప్ర‌శ‌సంలే కురుస్తున్నాయి. ఇంత‌కీ ఆయ‌న ఏం చేశా రంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిం దే. ఇటీవ‌ల కురిసిన భారీ వర్షాల కార‌ణంగా వ‌య‌ నాడ్‌లో వ‌ర‌ద బీభ‌త్సం సృష్టిస్తున్న విష‌యం తెలిసిందే. 

ప్ర‌కృతి వైప‌రీత్యాన్ని కొండ చెరియ‌లు విరిగిప‌డ్డాయి, ఇళ్లు, చెట్లు నేల మ‌ట్టాయి. వేలాది మంది స‌ర్వ‌స్వం కోల్పోయారు. దీంతో వీరిని అండ‌గా నిలిచేందుకు ఆర్మీ రంగంలోకి దిగిన విష‌యం తెలిసిందే. అయితే తాజాగా ఆర్మీతో క‌లిసి రెస్యూ ఆప‌రే ష‌న్‌లో భాగమ‌య్యారు హీరో మోహ‌న్‌లాల్‌. 

స్వ‌యంగా గ్రౌండ్‌లోకి దిగి గౌర‌వ లెఫ్టినెంట్ క‌ల్న‌ల్ హోదాలో స‌హాయ‌క చ‌ర్య‌ల్లో పాల్గొన్నారు. ఇప్ప‌ టికే సీఎం స‌హాయ నిధికి రూ. 25 ల‌క్ష‌ల విరాళం అందించిన మోహ‌న్‌లాల్‌, తాజాగా స్వ‌యంగా రంగంలోకి దిగారు. 

కోజికోడ్‌ నుంచి రోడ్డు మార్గంలో వయనాడ్‌కి వచ్చిన మోహన్‌లాల్‌… ఆర్మీ బేస్‌ క్యాంప్‌లో సైనికులను కలిశారు. ఆ తర్వాత ఆర్మీతో కలిసి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. 

తాత్కాలిక బ్రిడ్జ్‌ల నిర్మాణం, బాధితులకు సహాయం చేయడంలో పాలుపంచు కున్నారు. ఈ సంద‌ర్భంగా మోహ‌న్ లాల్ మాట్లాడుతూ.. 

దేశంలో జరిగిన ఘోర విపత్తుల్లో వయనాడ్‌ విధ్వంసం ఒకటన్నారు. సంఘ‌ట‌న స్థ‌లానికి వ‌చ్చి చూస్తే ఏ స్థాయిలో నష్టం జరిగిందో అర్ధమైందన్నారు.

హైదరాబాద్‌లో కలిసిపోతున్న సంగారెడ్డి !

మహానగరం విస్తరిస్తూంటే.. ఆ చుట్టుపక్కల ప్రాంతాలు శరవేగంగా అందులో కలిసిపోతూంటాయి. హైదరాబాద్ విస్తరణతో … సంగారెడ్డి కూడా కూడా మహానగరంలో భాగంగా మారుతోంది. మొత్తం సంగారెడ్డి జిల్లా పారిశ్రామికంగా అభివృద్ది చెందడానికి హైదరాబాద్ కారణం అవుతోంది.

కొన్ని వేల మంది కార్మికులు రోజూ హైదరాబాద్ నుంచి రాకపోకలు సాగిస్తూంటారు. అయితే ఇప్పుడు ఆ పారిశ్రామిక విప్లవం కారణంగా రియల్ ఎస్టేట్ కూడ పుంజుకుంటోంది. అక్కడే నివాసయోగ్యమైన కాలనీలు పెరిగిపోతున్నాయి.

ఒకప్పుడు హైదరాబాద్‌లో ఓల్డ్ ముంబై హైవే అంటే… చందానగర్ శివారు అనుకునేవారు. కానీ ఇప్పుడు సంగారెడ్డి అనుకునే పరిస్థితి వచ్చింది. చందానగర్..రామచంద్రాపురం, పటాన్ చెరు, ఇస్నాపూర్, కంది, సంగారెడ్డి ఇలా…రియల్ ఎస్టేట్ వ్యాప్తి చెందింది.  హైదరాబాద్ నుంచి సంగారెడ్డి వరకూ రియల్ ఎస్టేట్ వెంచర్లు భారీగా ఉన్నాయి. పెద్ద ఎత్తున స్థలాలు కొనుగోలు చేసిన ఔత్సాహికులు ఇప్పుడిప్పుడే ఇళ్లు కట్టుకునేందుకు రెడీ అవుతున్నారు. భవిష్యత్ లో సంగారెడ్డి వరకూ మెట్రో వస్తుందన్న అంచనాలు ఉన్నాయి.

పారిశ్రామికంగా సంగారెడ్డి జిల్లా మంచి అభివృద్ధి సాధిస్తోంది. నిజానికి ముందు నుంచీ పటాన్ చెరు పారిశ్రామిక ప్రాంతమే. కానీ కాలుష్యం అన్న పేరు ఉంది. ఇటీవలి కాలంలో కాలుష్యం లేకుండా పరిశ్రమలు జాగ్రత్త పడుతున్నాయి. గతంలో ఫ్యాక్టరీలపై పొగగొట్టాలుండేవి. ఇప్పుడు అలాంటివి లేవు. భారీ పరిశ్రమలు.. చాలా వరకూ కాలుష్యాన్ని నిర్వీర్యం చేసుకునే చర్యలు తీసుకున్నాయి. ఈ కారణంగా హౌసింగ్ ప్రాజెక్టులకూ డిమాండ్ పెరుగుతోంది.

ఇప్పటికే బీహెచ్‌ఈఎల్ నుంచి సంగారెడ్డి వరకూ రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరగడంతో త ధరలు కూడా స్థిరంగా పెరుగుతున్నాయి. ఇస్నాపూర్‌లో ఇప్పిడిప్పుడే కాలనీలు పెరుగుతున్నాయి. అక్కడ రూ. కోటి వరకూ పెట్టుకుంటే విశాలమైన ఇండిపెండెంట్ హౌస్ వస్తుంది.

 సంగారెడ్డి వరకూ ఈ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇప్పుడు సిటీకి కాస్త దూరంగా అనిపించినా భవిష్యత్‌లో అలాంటి చోట్ల కొనుగోలు చేయడం… కష్టమవుతుంది. ఇప్పుడు కొనుక్కున్నవారే అదృష్టవంతులన్నట్లుగా సీన్ మారిపోతుంది.

25 మీటర్ల పిస్టల్ షూటింగ్‌లో నాల్గవ స్థానంతో సంతృప్తి చెందాల్సి వచ్చిన మను బాకర్

పారిస్ ఒలింపిక్స్‌లో మను భాకర్ హ్యాట్రిక్ పతకాలు సాధించలేకపోయాడు. 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో ఆమె నాలుగో స్థానంలో నిలిచింది. మూడు, నాలుగో స్థానంలో ఉన్న షూటర్లు సమాన పాయింట్లు సాధించారు.

దీని తర్వాత మను మరియు హంగరీకి చెందిన మేజర్ వెరోనికా మధ్య కాల్పులు జరిగాయి. ఇందులో హంగేరీ షూటర్ నాలుగుసార్లు లక్ష్యాన్ని చేధించగా మను మూడు లక్ష్యాలను చేధించగలిగాడు.

శనివారం జరిగిన 25 మీటర్ల పిస్టల్ షూటింగ్‌లో మను భాకర్ స్వర్ణ పతకానికి అతి చేరువైంది. ఆమె ఒక్కసారిగా రెండో స్థానంలో నిలిచింది. బంగారంపై ఆశలు చిగురించాయి. అతను మొదటి సిరీస్‌లో 10.2 కంటే ఎక్కువ 5 షాట్‌లలో 2 కొట్టాడు. రెండో సిరీస్‌లో 5 షాట్‌లకు 4 కచ్చితంగా కొట్టి నాలుగో స్థానానికి చేరుకుంది.

మూడో సిరీస్‌లో కూడా మను 10.2 కంటే ఎక్కువ 4 షాట్లు చేశాడు. దీంతో ఆమె నాలుగో స్థానం నుంచి రెండో స్థానానికి ఎగబాకింది. ఆరో సిరీస్ తర్వాత కూడా ఆమె రెండో స్థానంలో నిలిచింది.

మరోవైపు నలుగురు షూటర్లు ఒక్కొక్కరుగా ఎలిమినేట్ అయ్యారు. ఇప్పుడు మను భాకర్ సహా నలుగురు షూటర్లు పతకాల రేసులో మిగిలారు. ఇక్కడ మను షాట్‌ ఒకటి కొద్దిగా బలహీనంగా మారింది.

దీంతో ఆమె మరియు హంగరీకి చెందిన వెరోనికా మేజర్ మూడో స్థానం కోసం షూట్‌ఆఫ్‌కు దారితీసింది. షూట్-ఆఫ్‌లో మను భాకర్ కొట్టిన బలహీనమైన షాట్ ఆమెను పతక రౌండ్‌కు దూరం చేసింది. వెరోనికా ముందంజ వేయగా, మను భాకర్ నాలుగో స్థానంలో నిలిచారు.

344 మంది మృతి.. వయనాడ్ కొండచరియల్లో రాడార్, డ్రోన్లతో గాలింపు

కేరళ వయనాడ్‌లో సృష్టించిన ప్రకృతి విలయం యావత్ దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ విపత్తులో ఇప్పటివరకు 344 మంది మృతి చెందగా.. మరో 250 మందికిపైగా కనిపించడం లేదు. ఇక సహాయక చర్యల్లో భాగంగా శిథిలాల కింది నుంచి ప్రాణాలతో బయటికి వస్తుండటంతో.. బాధిత కుటుంబాల్లో తమ వారు బతికి ఉన్నారనే ఆశలు నెలకొంటున్నాయి. ఈ క్రమంలోనే రాడార్ టెక్నాలజీని ఉపయోగించి శిథిలాల కింద ప్రాణాలతో ఉన్న వారిని గుర్తించి బయటికి తీసుకువస్తున్నారు.

కేరళ ప్రకృతి బీభత్సంలో అంతకంతకూ మృతుల సంఖ్య పెరుగుతుండటం తీవ్రంగా కలిచివేస్తోంది. ఇక ఇప్పటివరకు ఈ ఘోరకలిలో మరణించిన వారి సంఖ్య 344 కు పెరిగింది. మరో 281 మంది ఆచూకీ గల్లంతైంది. మరోవైపు.. శిథిలాల కింద చిక్కుకున్న వారు 3, 4 రోజుల తర్వాత ప్రాణాలతో బయటపడుతున్నారు.

దీంతో గల్లంతైన వారి కోసం ప్రస్తుతం టెక్నాలజీని రంగంలోకి దించారు. రాడార్ టెక్నాలజీతో కొందరు మృతదేహాల కోసం రెస్క్యూ బృందాలు ఇప్పటికీ ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగుతోంది.

మంగళవారం తెల్లవారుజామున మెప్పాడి స‌మీపంలోని వివిధ ప్రాంతాల్లో భారీగా కొండ‌చ‌రియ‌లు విరిగిపడిన విషయం తెలిసిందే. ఈ విపత్తులో మరణించిన వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం తీవ్ర సంచలనంగా మారింది. మరోవైపు.. శిథిలాల కింద చిక్కుకున్నవారిని గుర్తించేందుకు అత్యాధునిక సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. డ్రోన్లు, థర్మల్‌ స్కానర్ల ద్వారా ఆచూకీ గల్లంతైన వారి కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. ముండక్కైలో కొట్టుకుపోయిన ఓ దుకాణం దగ్గర శిథిలాల కింద.. ప్రాణాలతో చిక్కుకున్నారని థర్మల్‌ స్కానర్‌ అలర్ట్ చేయడంతో.. అక్కడ 3 మీటర్ల లోతు తవ్వారు. 5 గంటల పాటు గాలింపు చేపట్టినా మనిషి ఆనవాళ్లు దొరకలేదు.

వయనాడ్‌ ఘటనకు సంబంధించి నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఎర్త్‌ సైన్స్‌ స్టడీస్‌ రిటైర్డ్ సైంటిస్ట్ సోమన్‌ కీలక విషయాలు వెల్లడించారు. ఇందులో తీవ్రంగా విధ్వంసం జరిగిన ముండక్కై, చురల్మల ప్రాంతాలు.. నది ఒడ్డున ఉన్నాయని పేర్కొన్నారు. గతంలో కూడా ఇక్కడ కొండచరియలు విరిగి నదిలో పడి ఉండవచ్చని.. అలా నదీ ప్రవాహం దిశ మారగా ఏర్పడిన ప్రాంతంపైనే ఇప్పుడు ఇళ్లు, దుకాణాలు ఏర్పాటు చేశారని అభిప్రాయపడ్డారు. తిరిగి ఆ నది నీటి ప్రవాహం.. గతంలో ప్రవహించిన దిశను మళ్లీ తీసుకోవడంతోనే ఆ దుర్ఘటన చోటు చేసుకుని ఉండవచ్చని తెలిపారు. కొండచరియలు విరిగిపడటం ప్రారంభమైన వెల్లరిమల సముద్ర మట్టానికి 2 వేల అడుగుల ఎత్తులో ఉందని.. ముండక్కై, చురల్మల మాత్రం 900 – 1000 అడుగుల ఎత్తులో ఉన్నాయని.. దీంతో కొండ పైనుంచి రాళ్లు చాలా వేగంగా కిందకు దూసుకొచ్చాయని తెలిపారు

మరోవైపు పశ్చిమ కనుమలలోని 56800 చదరపు కిలోమీటర్ల ప్రాంతం పర్యావరణపరంగా సున్నితమైనదని పేర్కొంటూ కేంద్రం తాజాగా ముసాయిదా నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పరిధిలో వయనాడ్‌లో ప్రస్తుతం కొండచరియలు విరిగిపడి విధ్వంసానికి గురైన 13 గ్రామాలు కూడా ఉన్నాయి. పర్యావరణ సున్నిత ప్రాంతాలకు సంబంధించి తాజాగా ఇచ్చిన నోటిఫికేషన్‌పై ఏమైనా అభ్యంతరాలు ఉంటే 60 రోజుల్లోగా తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది.

కేరళలో 9993.7 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని సున్నిత ప్రాంతంగా కేంద్రం గుర్తించింది. అదేవిధంగా మహారాష్ట్రలో 17,340 చదరపు కిలోమీటర్లు.. కర్ణాటకలో 20,668 చదరపు కిలోమీటర్లు.. తమిళనాడులో 6,914 చదరపు కిలోమీటర్లు.. గోవాలో 1,461 చదరపు కిలోమీటర్లు.. గుజరాత్‌లో 449 చదరపు కిలోమీటర్ల ప్రాంతం పర్యావరణ పరంగా సున్నిత ప్రాంతం కిందికు వస్తుందని తెలిపింది.

నిజామాబాద్‌-జగ్దల్‌పూర్‌ 4 వరుసల రహదారి.. ముగిసిన సర్వే, త్వరలోనే పనులు ప్రారంభం

తెలంగాణలో మరో రహదారి విస్తరణకు అధికారులు సిద్ధమయ్యారు. నిజామాబాద్‌-జగ్దల్‌పూర్‌ 4 వరుసల రహదారిని విస్తరించనున్నారు. ఈ మేరకు అధికారులు కసరత్తు మెుదలుపెట్టారు. విస్తరణకు సంబంధించిన సర్వే పనులు పూర్తి కాగా.. ప్రజల నుంతి అభ్యంతరాలు స్వీకరిస్తున్నారు. అనంతరం విస్తరణ పనులు ప్రారంభించనున్నారు.

తెలంగాణలో రహదారుల విస్తరణపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఫోకస్ పెట్టాయి. హైదరాబాద్-విజయవాడ హైవేను 4 నుంచి 6 వరుసలుగా విస్తరించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇక హైదరాబాద్-బెంగళూరు హైవేను కూడా విస్తరించేందుకు ఫ్లాన్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో తెలంగాణలో మరో హైవే విస్తరణ పనులు చేపట్టనున్నారు. నిజామాబాద్‌-జగ్దల్‌పూర్‌ 63వ నెంబర్‌ నేషనల్ హైవే విస్తరణ చేపట్టనున్నారు. ఈ హైవే విస్తరణలో కీలకమైన అలైన్‌మెంట్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. భూ సేకరణకు వీలుగా తాజాగా ప్రజాప్రాయ సేకరణకు నోటిఫికేషన్‌ జారీ చేశారు.

నిజమాబాద్ జిల్లా ఆర్మూర్‌ నుంచి జగిత్యాల మీదుగా ఈ హైవే విస్తరణ చేపట్టనున్నారు. మంచిర్యాల సెక్షన్‌ పరిధిలో 131.8 కిలోమీటర్ల మేర 4 వరుసలుగా విస్తరించేందుకు అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

మెట్‍‌పల్లి, కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి, లక్షెట్టిపేట, హాజీపూర్‌ పట్టణాల నుంచి గతంలో సర్వే నిర్వహించారు. అయితే ఆ మార్గాల్లో దుకాణాలు, ఆలయాలు, జనావాసాలు ఉండటంతో అభ్యంతరాలు వచ్చాయి. దీంతో అధికారులు రహదారిని బైపాస్ చశారు. అందుకు సంబంధించిన సర్వే పనులు ఇప్పటికే పూర్తి కాగా ప్రస్తుతం ప్రజాభిప్రాయ సేకరణకు అధికారులు రెడీ అయ్యారు.

నాలుగు వరుసల హైవే విస్తరణ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ఆగస్టు 5న లక్షెట్టిపేటలో ప్రజాభిప్రాయ సేకరణకు నిర్వహించారు. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) ప్రాజెక్టు డైరెక్టర్‌ కె.ఎన్‌.అజయ్‌ మణి కుమార్‌ ఆధ్వర్యంలో ఈ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేటు భూములతో పాటు ఫారెస్ట్ భూములు రహదారి భూ సేకరణలో ప్రభావితం కానున్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో పర్యావరణాన్ని ప్రభావితం చేసే సామాజిక, ఆర్థిక అంశాలను విస్తరణ ప్రాజెక్టు అధికారులు పరిగణనలోకి తీసుకోనున్నారు. వాటికి ఎలాంటి ఆటంకం కలగకుండా తీసుకోవాల్సిన చర్యలు, అభ్యంతరాలపై చర్చించనున్నారు.

ప్రజల నుంచి అభ్యంతరాలు, వినతుల అనంతరం అధికారులు చర్యలు తీసుకోనున్నారు. అన్ని సమస్యలు పరిష్కారం అయితే త్వరలోనే రహదారి విస్తరణ పనులు ప్రారభం కానున్నాయి. రహదారి పనులు పూర్తయితే పలు జిల్లాల్ల ప్రజలకు ఎంతో మేలు జరగనుంది.

ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలు.. జేపీ వెంచర్స్‌కు సుప్రీంలో షాక్

ఏపీలో ఇసుకను అక్రమంగా తవ్వేసిన కేసులో జేపీ వెంచర్స్‌కు సుప్రీంకోర్టులో బిగ్‌షాక్ తగిలింది. ఈ కేసులో నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్జీటీ) రూ. 18 కోట్లు విధించడంపై జేపీ సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ రూ. 18 కోట్ల జరిమానా నుంచి విముక్తి కల్పించాలన్న అభ్యర్థనను ధర్మాసనం తోసిపుచ్చింది.

ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలపై సుప్రీంకోర్టు నిన్న విచారణ జరిపింది. ఈ అంశంపై తాజా నివేదికలతో ఏపీ ప్రభుత్వం, కేంద్ర అటవీ, పర్యావరణశాఖ అఫిడవిట్‌లు దాఖలు చేశాయి.

ఇప్పటికే ఎనిమిది జిల్లాల్లో తనిఖీలు జరిపామని కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వశాఖ అఫిడవిట్‌లో పేర్కొంది. తనిఖీల్లో తేలిన విషయాలన్నీ కోర్టు ముందు ఉంచామని అదనపు సొలిసిటర్ జనరల్ తెలిపారు.

వరదల కారణంగా అక్రమ ఇసుక తవ్వకాల అనవాళ్లు కొట్టుకుపోయాయనీ, వాటిని తేల్చడానికి శాస్త్రీయ పద్ధతుల్లో విచారణ చేపట్టాలని భావిస్తున్నామని ఏపీ ప్రభుత్వం తెలిపింది. శాస్త్రీయ అధ్యయనానికి కొన్ని సంస్థలను సంప్రదించామని, అన్నీ అధ్యయనం చేసి నివేదిక సమర్పించడానికి మూడు నెలల గడువు కావాలని ఏపీ ప్రభుత్వం కోరింది. 

ఇసుక తవ్వకాల వ్యవహారంలో కీలకపాత్ర పోషించిన జేపీ వెంచర్స్‌ను వదిలిపెట్టవద్దని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. అక్రమ తవ్వకాలకు బాధ్యులైన ఏపీ ఎండీసీ మాజీ ఎండీ వెంకటరెడ్డిని సస్పెండ్ చేసిన విషయాన్ని ఏపీ ప్రభుత్వ న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు.

తదుపరి విచారణను ఆగస్టు 31కి వాయిదా వేసిన ధర్మాసనం.. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్లను క్షుణ్ణంగా పరిశీలించి ఏమి చేయాలన్నది ఆదేశిస్తామని తెలిపింది.

మినిమమ్‌’ బ్యాలెన్స్‌..!

కనీస నిల్వలు పాటించని సేవింగ్స్‌ అకౌంట్‌ ఖాతాదారుల నుండి బ్యాంక్‌లు జరిమానా పేరుతో భారీగా సొమ్ము వసూలు చేయడం దారుణం. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బిఐ) మినహా పదకొండు ప్రభుత్వ రంగ బ్యాంకులు 2023-24 ఆర్థిక సంవత్సరంలో పొదుపు ఖాతాల్లో కనీస నిల్వను నిర్వహించడంలో విఫలమైనందుకు ఖాతాదారుల నుండి రూ.2,331 కోట్లు వసూలు చేశాయని కేంద్ర ఆర్థిక శాఖ పార్లమెంటుకు నివేదించింది.

అంతకు ముందు ఏడాది అంటే 2022-23లో రూ. 1,855 కోట్లు పిండుకోగా ఇప్పుడు 25.63 శాతం అదనంగా ఈ బ్యాంకులు గుంజుకున్నాయన్నమాట. గత మూడేళ్లలో కనీస నిల్వను నిర్వహించనందుకు ఖాతాదారుల నుండి రూ.5,614 కోట్లు వసూలు చేశాయి. ఈ విధంగా ఖాతాదారుల నుండి జరిమానా పేరిట డబ్బు అప్పనంగా కొట్టేయడం బ్యాంకులకు తగని పని. కార్పొరేట్లకు లక్షల కోట్ల రూపాయలను ఉదారంగా మాఫీ చేస్తున్న బ్యాంకులు సామాన్యుల నుండి ఇలా గోళ్లూడగొట్టి వసూలు చేయడం అమానుషం.

బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బిఐ మాత్రం 2019-20 నుంచి కనీస బ్యాలెన్స్‌ మెయింటెయిన్‌ చేయని ఖాతాదారులపై జరిమానా విధించడాన్ని నిలిపివేయడం కొంత ఊరట కలిగించే విషయం. ప్రభుత్వ రంగ బ్యాంకుల సంగతిలా వుంటే రకరకాల రూపాల్లో జనం సొమ్ము కొల్లగొట్టే ప్రయివేటు బ్యాంకులు తమ ఖాతాల్లో కనీస నిల్వలు ఉంచడంలో విఫలమైతే ఖాతాదారుల నుంచి భారీ మొత్తాలను వసూలు చేస్తున్నాయి. ఆ విధంగా బ్యాంకులు సేవింగ్స్‌ ఖాతాదారుల నుండి ఈ రూపంలో సొమ్ము లూటీ చేయడం అమానుషం.

బ్యాంకుల్లో సేవింగ్స్‌ ఖాతా తెరిచేది పేదలు, సామాన్య మధ్యతరగతి వారేనని వేరుగా చెప్పనక్కరలేదు. అంతే కాదు! వివిధ రకాల ప్రభుత్వ పథకాలకు, రాయితీలు పొందడానికీ బ్యాంకు ఖాతా తప్పనిసరి అంటూ జనం చేత వాటిని తెరిపించేది ప్రభుత్వ అధికారులు లేదా వాటి ప్రమోటర్లే కదా! నరేంద్ర మోడీ తొలిసారి ప్రధాని అయిన సందర్భంలో విదేశాల్లోని నల్లధనాన్ని ప్రజల ఖాతాలో వేస్తామని సాగించిన భారీ ప్రచారాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఈ పాపంలో పాలకుల పాత్ర ఎంతుందో విదితమవుతుంది.

ఆనాటి జన్‌ధన్‌ ఖాతాల హడావుడి కూడా ఎవరూ మర్చిపోలేరు. ఒకవైపున సర్కారువారే ఖాతాలు తెరిపించి వాటికి అనుసంధానంగా ఇన్సూరెన్స్‌ కూడా జత చేసి ఆ ప్రీమియంను ఖాతాదారుల నుండి వసూలు చేసిన విషయం చాలా మందికి అసలు తెలియనే తెలియదు.

ఈ రూపంలో ఏటా ప్రీమియం కత్తిరింపు జరిగి కనీస నిల్వ తరిగిపోయిన ఖాతాదారులు కోకొల్లలు. ఇది కూడా బ్యాంకులు చేస్తున్న మరోవిధమైన లూటీయే కదా! పొదుపు ఖాతా నిర్వహణకు ఆ యా బ్యాంకులకు ఓవర్‌హెడ్స్‌ రూపంలో కొంత ఖర్చయ్యేమాట నిజమేకానీ వారు జరిమానా పేరిట గుంజుతున్నంత మొత్తమైతే అవ్వదన్నది నిర్వివాదాంశం.

అన్నిటి ధరలు విపరీతంగా పెరిగిపోతుండగా మరోవైపున ప్రజల ఆదాయాలు తరిగిపోతున్నాయని ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. ధరలు, నిరుద్యోగం అన్న రెండు ప్రధానాంశాలే ఇటీవలి సాధారణ ఎన్నికల్లో ప్రభావితం చేశాయని పలు సర్వేలు నిగ్గు తేల్చాయి. ఇటువంటి నేపథ్యంలో ప్రజలు బ్యాంకుల్లో పొదుపు చేయడం అనేది ఓ మిలియన్‌ డాలర్ల ప్రశ్న లాంటిది. ఏడాదికేడాది ప్రజల పొదుపు తరిగిపోతున్నదని కేంద్ర గణాంకాల సంస్థ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ప్రతికూల పరిస్థితుల్లో ప్రజల్లో పొదుపు పట్ల అవగాహన కలిగించి, ఆసక్తి పెంచడం బ్యాంకులు, అంతకు మించి ప్రభుత్వమూ చేపట్టవలసి వుంది. ఆ పని మానేసి కనీస ఖాతా నిల్వ లేదనో ఇంకో పేరుతోనో ప్రజలపై భారాలు వేస్తూ పోతే అసలు బ్యాంకు గడపనెక్కడానికే జనం భయపడే స్థితి దాపురించే ప్రమాదముంది.

2008లో ప్రపంచాన్ని చుట్టుముట్టిన ఆర్థిక సంక్షోభం భారతదేశాన్ని అంతలా దెబ్బ తీయకపోవడానికి మన బ్యాంకింగ్‌ రంగమూ, ద్రవ్య నిర్వహణా వ్యవస్థల పటిష్టత ఒక ముఖ్య కారణమని విశ్లేషకులు నిర్ధారించారు. మన బ్యాంకింగ్‌ వ్యవస్థను మరింతగా పటిష్టపరుచుకోవాలి. ఇంకా ఎక్కువ మందిని వాటి పరిధిలోకి తేవడం ఎంతో అవసరం. ప్రజల్లో పొదుపు పట్ల ఆసక్తి పెంచేందుకు తగు ప్రోత్సాహకాలివ్వాలి తప్ప బ్యాంకులు రకరకాల పేర్లతో జరిమానాలు విధించడం ఇప్పటికైనా మానుకోవాలి.

వయనాడ్ బాధితులకు న‌య‌న‌తార, విఘ్నేశ్ దంపతుల భారీ విరాళం!

కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటన యావత్‌ దేశాన్ని కలిచి వేస్తోంది. జులై 26న వాయనాడ్‌లో మూడు కొండచరియలు విరిగిపడటంతో 300 మందికి పైగా మృతిచెందారు. వందలాది మంది గాయ‌ప‌డ్డారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దీంతో బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు ప్రముఖ సినీ నటీనటులు ముందుకు వచ్చి సాయం చేస్తున్నారు. 

గత కొన్ని రోజులుగా పలువురు ప్రముఖులు కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు అందించారు. సూర్య, జ్యోతిక, ఫహద్ ఫాసిల్, రష్మిక మందన్న సహా పలువురు ప్రముఖులు రిలీఫ్ ఫండ్‌కు విరాళాలు అందించారు.

ఈ నేపథ్యంలో స్టార్ హీరోయిన్ నయనతార, ఆమె భ‌ర్త‌, కోలీవుడ్ ద‌ర్శ‌కుడు విఘ్నేశ్ శివన్ తమ వంతు సాయంగా రూ.20లక్షలను కేరళ ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా అందించారు.

ఈ సంద‌ర్భంగా ఈ జంట వారి ఇద్దరు కుమారులతో పాటు వయనాడ్‌లోని ప్రజల జీవితాలను పునర్నిర్మించడానికి తమ మద్దతును తెలియజేస్తూ ఒక లేఖ కూడా రాశారు.

వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన విషాద‌క‌ర ఘ‌ట‌న‌ మా హృదయాలను క‌లిచివేసింది. సమాజం అనుభవించిన విధ్వంసం, నష్టాలు దయనీయంగా ఉన్నాయి. సంఘీభావంగా బాధిత కుటుంబాలకు తక్షణ సహాయం కోసం మేము ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 20లక్షలు అందిస్తున్నాము" అని లేఖ‌లో పేర్కొన్నారు. 

కాగా, నయనతార స్వస్థలం కేరళ. ఆమె తల్లిదండ్రులు ఓమన కురియన్, కురియన్ కొడియాట్టు కేరళలోని తిరువల్లలో నివాసం ఉంటున్నారు. ఈ దంపతులకు డయానా మరియం కురియన్‌గా ఆమె జన్మించారు.

ఇక విఘ్నేష్ శివన్, నయనతార దంప‌తులకు ఉలగ్, ఉయిర్ అనే కవల పిల్ల‌లు ఉన్నారు. ప్ర‌స్తుతం న‌య‌నతార న‌టించిన‌ రెండు తమిళ చిత్రాలు 'ది టెస్ట్స‌, 'మన్నంగట్టి సిన్స్ 1960' విడుద‌ల కావాల్సి ఉన్నాయి. అలాగే విఘ్నేష్ శివన్ ప్రస్తుతం తన దర్శకత్వంలో 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' అనే చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు.