అమ్మవారి పేట గ్రామంలో ఘనంగా తల్లిపాలు వారోత్సవాలు..
అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలంలోని అమ్మవారిపేట గ్రామం నందు తల్లిపాల వారోత్సవాల కార్యక్రమము నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంల ఐ.సి.డి.ఎస్. సూపర్వైజర్ బి అన్నపూర్ణాదేవి అధ్యక్షతన నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో తల్లిపాల విశిష్టతను తెలియజేస్తూ, బిడ్డ పుట్టిన గంట లోపల ముర్రుపాలుబిడ్డ కు త్రాగించాలని సూచించారు. అమ్మవారిపేట గ్రామంలోని వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో MLHP రామ హారిక, ANM నాగరత్నమ్మ, అంగన్వాడీ కార్యకర్తలు వెంకటలక్ష్మి, ఈశ్వరమ్మ, ఆశ ధనలక్ష్మి గ్రామంలోని గర్భవతులు, బాలింతలు, ఇతరులు పాల్గొన్నారు.
కుమారుడు ఆలూరు విరాట్ పుట్టినరోజు సందర్భంగా అనాథాశ్రమానికి విరాళం.. మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, ఆలూరు సాంబ శివారెడ్డి దంపతులు..
కుమారుడు ఆలూరు విరాట్ పుట్టినరోజు సందర్భంగా అనాథాశ్రమానికి విరాళం.. ప్రతి ఏటా పుట్టినరోజున లక్ష విరాళం అందిస్తాం .. మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, ఆలూరు సాంబ శివారెడ్డి దంపతులు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, ఆలూరు సాంబ శివారెడ్డి దంపతుల తనయుడు ఆలూరు విరాట్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. చెరువుకట్ట మీద ఉన్న షిరిడి సాయి దేవాలయానికి కుటుంబ సభ్యులతో వెళ్లి సాయిబాబాను దర్శించుకున్నారు. అర్చకులు పూజలు నిర్వహించారు. నార్పల మండలం కురగానపల్లి గ్రామంలో ఉన్న చిన్న కేశవ అనాథ ఆశ్రమానికి ఆలూరు దంపతుల కుమారుడు ఆలూరు విరాట్ జన్మదినం సందర్భంగా రూ.1,00,000/ లక్ష రూపాయల విరాళాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆలూరు దంపతులు మాట్లాడుతూ.. తమ కుమారుడు విరాట్ పది సంవత్సరాలు పూర్తి చేసుకుని 11వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాడని చెప్పారు. తమ కుమారుని పుట్టినరోజున ప్రతి ఏటా చిన్న కేశవ అనాథ ఆశ్రమానికి లక్ష రూపాయలు అందజేస్తామని వారు తెలిపారు. ఆశ్రమంలో ఉన్న అవ్వ తాతలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి ఆశ్రమ నిర్వాహకులను కోరారు. మీ అందరి ఆశీస్సులు, దీవెనలు తమ కుమారునికి అందించాలని కోరారు.
కల్లూరు వద్ద స్టేట్ బ్యాంక్ ఏటిఎం లో చోరి చేసిన దుండుగలు..
అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కల్లూరు వద్ద స్టేట్ బ్యాంక్ ఏటిఎం లో చోరి చేసిన దుండుగలు గ్యాస్ కట్టర్ తో ఏటీఎం ను పగలగొట్టి అందులో ఉన్న నగదు దోచుకెళ్లిన దుండుగులు సంఘటన స్థలనికి పోలీసులు చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.
సరసమైన ధరలకు, నాణ్యమైన సరుకుల అమ్మకాలు మరింత పెంచాలి.. జిల్లాలో 51 ప్రత్యేక కౌంటర్ల ఏర్పాటు.. జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్.
నగరంలోని రైతుబజార్ ని, జిల్లా ఉద్యానశాఖ కార్యాలయాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అనంతపురం, ఆగస్టు 02 సరసమైన ధరలకు అందించే నాణ్యమైన సరుకులు అమ్మకాలను మరింత పెంచాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం అనంతపురం నగరంలోని రైతుబజార్ లో రైతు బజార్లు మరియు పెద్ద సంస్థాగత దుకాణాల వద్ద సరసమైన ధరలలో అందించే నాణ్యమైన సరుకులు అమ్మకం స్టోర్ ని జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నాణ్యమైన సరుకుల అమ్మకాలపై విస్తృత ప్రచారం కల్పించాలని ఆదేశించారు. బయట మార్కెట్ కన్నా తక్కువగా అందించే నాణ్యమైన సరుకులు అమ్మకాలను వినియోగదారులు సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. వినియోగదారుల వ్యవహారాలు, ఆహార మరియు పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో రైతు బజార్లు మరియు పెద్ద సంస్థాగత దుకాణాల వద్ద తక్కువ ధరలకు నిత్యావసర సరుకులను అందించడం జరుగుతోందన్నారు. ప్రస్తుతం బయట మార్కెట్లో నిత్యవసర సరుకులైన కందిపప్పు (దేశవాళి) కిలో ధర 181 రూపాయలు, బియ్యం (స్టీమ్డ్, బిపిటి/సోనామసూరి)కిలో ధర 55.85 రూపాయలు, బియ్యం (పచ్చి, బిపిటి/సోనామసూరి) కిలో ధర 52.40 రూపాయలు ఉందన్నారు. గత నెల జులై 11 వతేదీ నుంచి 31వ తేదీ వరకు రైతు బజార్ లో కందిపప్పు (దేశవాళి) కిలో ధర 160 రూపాయలు, బియ్యం (స్టీమ్డ్, బిపిటి/సోనామసూరి)కిలో ధర 49 రూపాయలు, బియ్యం (పచ్చి, బిపిటి/సోనామసూరి) కిలో ధర 48 రూపాయల తక్కువ ధరకు విక్రయించడం జరిగిందన్నారు. ప్రస్తుతం నాణ్యమైన సరుకుల ధరలను మరింత తగ్గించి జిల్లాలోని రైతు బజార్లు మరియు పెద్ద సంస్థాగత దుకాణాల వద్ద కందిపప్పు (దేశవాళి) కిలో ధర 150 రూపాయలు, బియ్యం (స్టీమ్డ్, బిపిటి/సోనామసూరి)కిలో ధర 48 రూపాయలు, బియ్యం (పచ్చి, బిపిటి/సోనామసూరి) కిలో ధర 47 రూపాయలకు అందించడం జరుగుతోందన్నారు. ఆహార మరియు పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో అతి తక్కువ ధరలకు అందించే నాణ్యమైన సరుకులను అందరూ ఉపయోగించుకోవాలని కోరారు. జిల్లాలో 51 ప్రత్యేక కౌంటర్ల ద్వారా అమ్మకాలు చేపట్టాలి. జిల్లాలో 51 ప్రత్యేక కౌంటర్ల ద్వారా సరసమైన ధరలలో అందించే నాణ్యమైన సరుకుల అమ్మకాలు చేపట్టాలన్నారు. అనంతపురం నగరంలోని రైతు బజార్, రుద్రంపేటలోని రెవెన్యూ సూపర్ మార్కెట్ (డి-మార్ట్), శ్రీనివాస్ నగర్ లోని రిలయన్స్ మార్ట్, ఆకుతోటపల్లిలోని రిలయన్స్ రిటైల్ లిమిటెడ్, కళ్యాణదుర్గం బైపాస్ రోడ్డులోని రిలయన్స్ రిటైల్ లిమిటెడ్ లో, రాంనగర్ లోని రిలయన్స్ మార్ట్ లో, రామచంద్ర నగర్ లోని విశాల్ మైగా మార్ట్ లో, టీచర్స్ కాలనీలోని ఎస్సీ డిగ్రీ కాలేజ్ వద్దనున్న మోర్ సూపర్ మార్కెట్లో, ఐదవ రోడ్డులోని మోర్ సూపర్ మార్కెట్లో నాణ్యమైన సరుకుల అమ్మకాలు చెప్పడం జరుగుతుందన్నారు. అలాగే ఆత్మకూరు మండల కేంద్రంలోని వాసవి రిటైల్ షాప్ లో, బెలుగుప్ప మండల కేంద్రంలోని జనరల్ స్టోర్ లో, బుక్కరాయసముద్రంలోని సూపర్ కే మాల్ లో, బొమ్మనహల్ లోని హోల్ సేలర్స్ వద్ద, బ్రహ్మాసముద్రంలోని జనరల్ స్టోర్ లో, డీ.హీరేహల్ లో హోల్ సేలర్స్ వద్ద, గార్లదిన్నెలోని విలేజ్ మార్ట్ లో, గుత్తి పట్టణంలోని హోల్ సేలర్స్ వద్ద మరియు అనంతపురం రోడ్డులోని మోర్ సూపర్ మార్కెట్ లో, గుమ్మగట్ట మండల కేంద్రంలోని జనరల్ స్టోర్ లో, గుంతకల్లు పట్టణంలోని రిలయన్స్ రిటైల్ లిమిటెడ్ లో, గోకుల్ కిరాణా షాప్, ఎస్.ఎల్.వి టాకీస్ వద్ద ఉన్న మోర్ సూపర్ మార్కెట్లో, మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న సెవెన్ హిల్స్ సూపర్ బజార్ లో, ఎన్టీఆర్ సర్కిల్ లోని హోల్ సేలర్స్ వద్ద అమ్మకాలు జరుగుతాయన్నారు. కళ్యాణదుర్గం పట్టణంలోని కన్యకా పరమేశ్వరి కాంప్లెక్స్ లో, హోల్ సేలర్స్ వద్ద & రిటైలర్స్ వద్ద, కంబదూరు మండల కేంద్రంలోని ఎన్టీఆర్ సర్కిల్ లో ఉన్న హోల్ సేలర్స్ వద్ద, కనేకల్లు పట్టణంలోని శ్రీ చిక్కనేశ్వర షాపులో, కూడేరులోని విలేజ్ మార్ట్ లో, కుందుర్పిలోని హోల్ సేలర్స్ లో, నార్పలలోని మహిళా మార్ట్, పామిడిలోని హైపర్ మార్ట్, పెద్దపప్పూరులోని జనరల్ స్టోర్ లో, పెద్దవడుగూరులోని హోల్ సేలర్స్ లో, పుట్లూరులోని హోల్ సేలర్స్ లో, రాప్తాడులోని సూపర్ మార్ట్ లో, రాయదుర్గం పట్టణంలోని రిలయన్స్ రిటైలర్ లిమిటెడ్, నీలకంటేశ్వర ట్రేడర్స్ వారి హోల్ సేలర్స్ లో, సెట్టూరు మండల కేంద్రంలోని జనరల్ స్టోర్ లో, సింగనమలలోని జనరల్ స్టోర్ లో, తాడిపత్రి పట్టణంలోని తాలూకా కార్యాలయం ఎదురుగా ఉన్న రిలయన్స్ రిటైల్ లిమిటెడ్, కృష్ణాపురం జీరో రోడ్డులోని రిలయన్స్ రిటైల్ లిమిటెడ్, ద మండి మర్చంట్ అసోసియేషన్ వారి హోల్ సేలర్స్ వద్ద, సీబీ రోడ్డులోని మోర్ సూపర్ మార్కెట్లో, ఎల్&టి అల్ట్రాటెక్ క్యాంపస్ లోని మోర్ సూపర్ మార్కెట్లో మరియు రామచంద్ర నగర్ లోని విశాల్ మెగా మార్ట్ లో, ఉరవకొండ పట్టణంలోని ఓల్డ్ బస్టాండ్ వద్దనున్న హోల్ సేలర్స్ వద్ద, కవిత హోటల్ వద్దనే ఉన్న హోల్ సేలర్స్ వద్ద, వజ్రకరూరు మండల కేంద్రంలోని ఆర్కే జనరల్ స్టోర్ లో, విడపనకల్లోని హోల్ సేలర్స్ వద్ద, యాడికిలోని హోల్ సేలర్స్ వద్ద, యల్లనూరు మండల కేంద్రంలోని జనరల్ స్టోర్ లో సరసమైన ధరలలో అందించే నాణ్యమైన సరుకుల అమ్మకం చేపట్టడం జరుగుతోందన్నారు. అమ్మకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా రైతు బజార్ లో ఎన్ని షాపులు ఉన్నాయి, ఎన్ని షాపులను లీజుకు ఇవ్వడం జరిగింది, తదితర వివరాలను జిల్లా కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం షాప్ యజమానులతో మాట్లాడుతూ ఎన్ని సంవత్సరాలు నుంచి షాప్ లను నడుపుతున్నారు, బాగా వ్యాపారం జరుగుతుందా, అంటూ వివరాలు ఆరా తీశారు. జిల్లా ఉద్యానశాఖ కార్యాలయాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్. అనంతరం జిల్లా ఉద్యానశాఖ కార్యాలయాన్ని, ఎపిఎంఐపి కార్యాలయాన్ని, ఉద్యానశాఖ శిక్షణా కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఆయా కార్యాలయాలకు ISO 9001:2015 సర్టిఫికేట్ లు వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు జిల్లా కలెక్టర్ సూచించారు. ఆయా కార్యాలయాల ద్వారా నాణ్యమైన సేవలు అందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జ్ ఆర్డీఓ వసంత బాబు, డిఎస్ఓ శోభారాణి, ఉద్యాన శాఖ జిల్లా అధికారి నరసింహారావు, ఏపీఎంఐపి పిడి రఘునాథరెడ్డి, మార్కెటింగ్ ఏడీ సత్యనారాయణ చౌదరి, డిప్యూటీ తహసీల్దార్ పునీత్, రైతు బజార్ అధికారులు, ఆయా శాఖల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
సుప్రీం కోర్ట్ తీర్పు హర్షినియం.. మాదిగ మందకృష్ణకి, చంద్రబాబు నాయుడుకి, నరేంద్ర మోడీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన.. మొండి పోగుల ఎర్రి స్వామి..
సుప్రీం కోర్ట్ తీర్పు హర్షినియం.. మాదిగ మందకృష్ణ గారికి, చంద్రబాబు నాయుడుకి, నరేంద్ర మోడీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన టిడిపి జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ మొండి పోగుల ఎర్రి స్వామి* ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు వంద తరాల భవిష్యత్తును నిర్దేశించబోతుందని ఈ విజయంతో మాదిగ, ఉపకులాలు ముందడుగు వేస్తాయి. ఈ సందర్భంగా *మొండి పోగుల ఎర్రి స్వామి* మాట్లాడుతూ జాతి గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటారని దశాబ్దల కాలం నుండి ఎస్సీల్లో వెనకబడిన కులాలకు న్యాయం జరగడం లేదని ఏ బి సి డి వర్గీకరణ చేస్తేనే మాదిగ మాదిగ ఉప కులాలకు న్యాయం జరుగుతుందని భావించి పోరాటం కొనసాగించిన మందకృష్ణ మాదిగ గారి పోరాటంతో భారతదేశం మొత్తం మాదిగ మాదిగ ఉపకులలకు జరుగుతున్న అన్యాలను చవి చూసిన నేపథ్యంలో భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు మాదిగ మాదిగ ఉపకులాలకు జరుగుతున్న అన్యాయాలపై ఎస్సీ ఉప కులాలకు వర్గీకరణ చేస్తేనే న్యాయం జరుగుతుందని భావించిన ఏకైక వ్యక్తి భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు మాదిగ మాదిగ ఉపకులకు మద్దతుగ నిలబడి మాదిగ ఉప కులాలకు సంబంధించి హైదరాబాదులో జరిగిన బహిరంగ సభలో ఇచ్చిన మాట మేరకు నెరవేర్చిన ప్రధాని నరేంద్ర
మతసామరస్యానికి ప్రత్యేకత గూగూడు కుళ్లాయిస్వామి, ఆంజనేయ స్వాములు వారిని దర్శించుకున్న.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి..
మతసామరస్యానికి ప్రత్యేకత గూగూడు కుళ్లాయిస్వామి, ఆంజనేయస్వామి ఆలయాలు దేశంలోనే గొప్ప పుణ్యక్షేత్రంగా నిలిచాయని శింగనమల మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అన్నారు. నార్పల మండలం గూగూడు గ్రామంలో వెలసిన కుళ్లాయిస్వామి, ఆంజనేయ స్వామి, సమీపంలోని పెద్దమ్మ స్వామిని కుటుంబ సభ్యులతో కలసి దర్శించుకున్నారు. గ్రామస్తులు సన్నాయి వాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. కుళ్లాయి స్వామికి చెక్కర చదివింపులు చేయించారు. ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు ప్రత్యేక దర్శనం చేయించి శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచు, వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
ఎన్టీఆర్ పెన్షన్ భరోసా పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీపీ దాసరి సునీత..
ఎన్టీఆర్ పెన్షన్ భరోసా పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీపీ దాసరి సునీత.

సింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండలం వెంకటాపురం గ్రామంలో జరిగిన ఎన్టీఆర్ పెన్షన్ భరోసా పంపిణి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బుక్కరాయసముద్రం ఎంపీపీ దాసరి సునీత గారు, ఐ సి డి ఎస్ పిడి శ్రీదేవి, గ్రామ సర్పంచ్ వసంత, ఎంపీడీవో శోభారాణి, ఈ ఓ ఆర్ డి దామోదరమ్మ, స్థానిక నాయకులు జొన్న రామయ్య, బుల్లె నారాయణస్వామి, రామకృష్ణ, రామాంజనేయులు వివిధ నాయకులు పాల్గొన్నారు
నడిమిదొడ్డి గ్రామం లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమo లో.. ఎమ్మెల్యే మరియు ద్విసభ్య కమిటీ సభ్యులు..
శిoగనమల నియోజకవర్గం నార్పల మండలం నడిమిదొడ్డి గ్రామం లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమo లో *శిoగనమల నియోజకవర్గం ఏమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ గారు,జిల్లా అధ్యక్షులు వెంకటశివుడు యాదవ్ గారు,టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ద్విసభ్య కమిటి సభ్యులు ఆలం నరసానాయుడు గారు, ద్విసభ్య కమిటి సభ్యులు ముంటిమడుగు కేశవరెడ్డి గారు, జిల్లా అధికార ప్రతినిధి పర్వతనేని శ్రీధర్ బాబు గారు, జిల్లా నాయకులు ఆలం వెంకట నరసానాయుడు గారు* ఇంటి ఇంటికి తిరిగి పింఛన్ పంపిణీ చేశారు ఈరోజు నుంచి ఉదయం 6 గంటల నుండి పెన్షన్ల పంపిణి పూర్తి చేయాలనీ అధికారులకు సూచనలు ఇచ్చారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారని, ఇప్పటికే 5 హామీలు అమలు చేశామని, మిగిలిన హామీలు కూడా త్వరలో నెరవేరుస్తామని తెలియజేసారు.ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షులు,మాజీ మండల అధ్యక్షులు,మండలం లోని సీనియర్ నాయకులు, క్లస్టర్, యూనిట్,భూత్ ఇంచార్జ్ లు, సర్పంచ్ లు, మాజీ సర్పంచులు, గ్రామ కమిటి అధ్యక్షులు, ఎంపీటీసీలు, మాజీ ఎంపీటీసీ లు,ఉమ్మడి తెలుగుదేశం పార్టీ,జనసేన పార్టీ,బిజెపి పార్టీ నాయకులు, కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తాం : టిడిపి రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి కాటప్ప గారి రామలింగారెడ్డి..
ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తాం : టిడిపి రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి కాటప్ప గారి రామలింగారెడ్డి.

శింగనమల నియోజకవర్గం, బుక్కరాయసముద్రం మండల కేంద్రం నందు ఈ రోజు ఉదయం 6 గంటల నుండే పెంచిన పెన్షన్ల పంపిణి కార్యక్రమం ప్రారంభమైంది. మండల కేంద్రము నందు టిడిపి రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి కాటప్ప గారి రామలింగారెడ్డి గారు*,*జిల్లా అధికార ప్రతినిధి పర్వతనేని శ్రీధర్ బాబు* మండల నాయకులతో కలిసి పెన్షన్ల పంపిణీలో పాల్గొన్నారు. అక్కడ నుండి ఇంటింటికి వెళ్ళీ పెన్షన్లు పంపిణి చేస్తున్నారు. ఉదయం 6 గంటల నుండి ఈ రోజు లోపుగా పెన్షన్ల పంపిణి పూర్తి చేయాలనీ అధికారులకు సూచనలు ఇచ్చారు. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారని, ఇప్పటికే 5 హామీలు అమలు చేశామని, మిగిలిన హామీలు కూడా త్వరలో నెరవేరుస్తామని ఈ సందర్భంగా *టిడిపి రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి కాటప్ప గారి రామలింగారెడ్డి గారు* పేర్కొన్నారు.... ఈ కార్యక్రమంలో , మండల కన్వీనర్ అశోక్ కుమార్ టిడిపి సీనియర్ నాయకులు అనిల్ గారు,మాజీ సర్పంచ్ నారాయణ స్వామి,లక్ష్మీ నారాయణ, మల్లేసు, కేసన్న,రామా నాయుడు,SK వెంకటేశు,సాకే రామకృష్ణ,రవి కుమార్,బాబయ్య, బుసగాని నరేంద్ర, సురేష్ చౌదరి, కాటమయ్య, పశులూరు కుమార్,నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది...
నార్పల మండల సర్వసభ్య సమావేశంలో కీలక అంశాలపై చర్చించిన ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ..
శింగనమల నియోజకవర్గం,నార్పల మండల ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశానికి హాజరైన నియోజవర్గ ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ గారు, మాట్లాడుతూ గత వైసిపి ప్రభుత్వం హయాంలో పేదలకు ఇంటి నివేసిన స్థలాలు మంజూరు చేసిన వాటిలో అనర్హులకు కేటాయించినట్లు తెలిసి వచ్చిందని, అధికారులు లేఅవుట్లలో విచారణ జరిపి అర్హులకు ఇంటి స్థలాలు దక్కేలాగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మండలంలో విద్యుత్ ఎ.ఇ. లేకపోవడం ఎమ్మెల్యే శ్రావణి శ్రీ గారు గ్రహించారు.అలాగే నార్పల మండలంలోని ప్రతి గ్రామంలో ఆగస్టు 15వ తేదీలోగా విద్యుత్ వీధి దీపాలు ఏర్పాటు చేయవలసిందిగా సంబంధించిన అధికారులకు ఆదేశించారు.ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రాత్రివేళ డ్యూటీ డాక్టర్,సెక్యూరిటీ లేరని వాపోయారు.ఒక వ్యక్తికి ఆర్.డబ్ల్యూ.యస్. తరపున సరఫరా చేసే నీటిని 15 లీటర్ల నుండి 40 లీటర్లు పెంచాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి వినతి చేయడమైనదని,మంత్రి గారు సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే శ్రావణి శ్రీ గారు తెలిపారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే గారు అడిగిన ప్రశ్నలకు అధికారులు జవాబుదారీతనం లేకుండా నిధులు లేవని కుంటి సాకులు బాధాకరం అని తెలిపారు.సమస్యలు అక్కడికక్కడే పరిష్కరించే వీలు ఉంటే వెంటనే తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో సుపరిపాలన దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని తెలిపారు.