నడిమిదొడ్డి గ్రామం లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమo లో.. ఎమ్మెల్యే మరియు ద్విసభ్య కమిటీ సభ్యులు..
శిoగనమల నియోజకవర్గం నార్పల మండలం నడిమిదొడ్డి గ్రామం లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమo లో *శిoగనమల నియోజకవర్గం ఏమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ గారు,జిల్లా అధ్యక్షులు వెంకటశివుడు యాదవ్ గారు,టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ద్విసభ్య కమిటి సభ్యులు ఆలం నరసానాయుడు గారు, ద్విసభ్య కమిటి సభ్యులు ముంటిమడుగు కేశవరెడ్డి గారు, జిల్లా అధికార ప్రతినిధి పర్వతనేని శ్రీధర్ బాబు గారు, జిల్లా నాయకులు ఆలం వెంకట నరసానాయుడు గారు* ఇంటి ఇంటికి తిరిగి పింఛన్ పంపిణీ చేశారు ఈరోజు నుంచి ఉదయం 6 గంటల నుండి పెన్షన్ల పంపిణి పూర్తి చేయాలనీ అధికారులకు సూచనలు ఇచ్చారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారని, ఇప్పటికే 5 హామీలు అమలు చేశామని, మిగిలిన హామీలు కూడా త్వరలో నెరవేరుస్తామని తెలియజేసారు.ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షులు,మాజీ మండల అధ్యక్షులు,మండలం లోని సీనియర్ నాయకులు, క్లస్టర్, యూనిట్,భూత్ ఇంచార్జ్ లు, సర్పంచ్ లు, మాజీ సర్పంచులు, గ్రామ కమిటి అధ్యక్షులు, ఎంపీటీసీలు, మాజీ ఎంపీటీసీ లు,ఉమ్మడి తెలుగుదేశం పార్టీ,జనసేన పార్టీ,బిజెపి పార్టీ నాయకులు, కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తాం : టిడిపి రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి కాటప్ప గారి రామలింగారెడ్డి..
ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తాం : టిడిపి రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి కాటప్ప గారి రామలింగారెడ్డి.

శింగనమల నియోజకవర్గం, బుక్కరాయసముద్రం మండల కేంద్రం నందు ఈ రోజు ఉదయం 6 గంటల నుండే పెంచిన పెన్షన్ల పంపిణి కార్యక్రమం ప్రారంభమైంది. మండల కేంద్రము నందు టిడిపి రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి కాటప్ప గారి రామలింగారెడ్డి గారు*,*జిల్లా అధికార ప్రతినిధి పర్వతనేని శ్రీధర్ బాబు* మండల నాయకులతో కలిసి పెన్షన్ల పంపిణీలో పాల్గొన్నారు. అక్కడ నుండి ఇంటింటికి వెళ్ళీ పెన్షన్లు పంపిణి చేస్తున్నారు. ఉదయం 6 గంటల నుండి ఈ రోజు లోపుగా పెన్షన్ల పంపిణి పూర్తి చేయాలనీ అధికారులకు సూచనలు ఇచ్చారు. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారని, ఇప్పటికే 5 హామీలు అమలు చేశామని, మిగిలిన హామీలు కూడా త్వరలో నెరవేరుస్తామని ఈ సందర్భంగా *టిడిపి రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి కాటప్ప గారి రామలింగారెడ్డి గారు* పేర్కొన్నారు.... ఈ కార్యక్రమంలో , మండల కన్వీనర్ అశోక్ కుమార్ టిడిపి సీనియర్ నాయకులు అనిల్ గారు,మాజీ సర్పంచ్ నారాయణ స్వామి,లక్ష్మీ నారాయణ, మల్లేసు, కేసన్న,రామా నాయుడు,SK వెంకటేశు,సాకే రామకృష్ణ,రవి కుమార్,బాబయ్య, బుసగాని నరేంద్ర, సురేష్ చౌదరి, కాటమయ్య, పశులూరు కుమార్,నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది...
నార్పల మండల సర్వసభ్య సమావేశంలో కీలక అంశాలపై చర్చించిన ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ..
శింగనమల నియోజకవర్గం,నార్పల మండల ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశానికి హాజరైన నియోజవర్గ ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ గారు, మాట్లాడుతూ గత వైసిపి ప్రభుత్వం హయాంలో పేదలకు ఇంటి నివేసిన స్థలాలు మంజూరు చేసిన వాటిలో అనర్హులకు కేటాయించినట్లు తెలిసి వచ్చిందని, అధికారులు లేఅవుట్లలో విచారణ జరిపి అర్హులకు ఇంటి స్థలాలు దక్కేలాగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మండలంలో విద్యుత్ ఎ.ఇ. లేకపోవడం ఎమ్మెల్యే శ్రావణి శ్రీ గారు గ్రహించారు.అలాగే నార్పల మండలంలోని ప్రతి గ్రామంలో ఆగస్టు 15వ తేదీలోగా విద్యుత్ వీధి దీపాలు ఏర్పాటు చేయవలసిందిగా సంబంధించిన అధికారులకు ఆదేశించారు.ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రాత్రివేళ డ్యూటీ డాక్టర్,సెక్యూరిటీ లేరని వాపోయారు.ఒక వ్యక్తికి ఆర్.డబ్ల్యూ.యస్. తరపున సరఫరా చేసే నీటిని 15 లీటర్ల నుండి 40 లీటర్లు పెంచాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి వినతి చేయడమైనదని,మంత్రి గారు సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే శ్రావణి శ్రీ గారు తెలిపారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే గారు అడిగిన ప్రశ్నలకు అధికారులు జవాబుదారీతనం లేకుండా నిధులు లేవని కుంటి సాకులు బాధాకరం అని తెలిపారు.సమస్యలు అక్కడికక్కడే పరిష్కరించే వీలు ఉంటే వెంటనే తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో సుపరిపాలన దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని తెలిపారు.
న్యూఢిల్లీలో కేంద్ర మంత్రివర్యులను కలిసిన ద్విసభ్య కమిటీ సభ్యుడు ముంటిమడుగు కేశవరెడ్డి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కె. రామలింగా రెడ్డి..
భారతదేశం యొక్క రాజధాని న్యూఢిల్లీ లో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రివర్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు గారిని వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన శింగనమల నియోజకవర్గ ద్విసభ్య కమిటీ సభ్యుడు ముంటిమడుగు కేశవరెడ్డి గారు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కాటప్పగారి రామలింగారెడ్డి గారు..
పల్లెటూరు వేషధారణలో వెళ్లి ఏసీబీ ఆకస్మిక తనిఖీలు
అనంతపురం మార్కెట్ యార్డులో ఏసీబీ సోదాలు ఎవరూ గుర్తుపట్టకుండా మారు వేషంలో వెళ్లారు భారీగా అక్రమాలు జరుగుతున్నాయని గుర్తించారు.అనంతపురం మార్కెట్ యార్డ్.. ముగ్గురు వ్యక్తులు లుంగీ, పాత చొక్కా.. మెడలో తువ్వాలుతో లోపలికి వెళ్లారు. గొర్రెలు, ఎద్దులు కొనడానికి వచ్చారని అధికారులు భావించారు. కొద్దిసేపటికి అసలు విషయం బయటపడింది.. వచ్చింది ఏసీబీ అధికారులని తెలిసి అవాక్కయ్యారు. అవినీతి చేసేవారిని పట్టుకునేందుకు ఇలా మారు వేషంలో వెళ్లారని తేలింది. మార్కెట్ యార్డులో అక్రమాలు జరుగుతున్నాయని ఫిర్యాదులు రావడంతో.. యార్డులో జరుగుతున్న తతంగం మొత్తంపై ఆరా తీసి వారి ఆటకట్టించారు.
లక్ష్మయ్య గారి కుటుంబానికి 10000/- రూ.లు ఆర్థికసాయం చేసి అండగా నిలిచినా టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కాటప్పగారి రామలింగారెడ్డి..
ఆర్థిక సమస్యలతో సతమాతం అవుతున్న బలిజ లక్ష్మయ్య గారి కుటుంబానికి 10000/- రూ.లు ఆర్థికసాయం చేసి అండగా నిలిచినా టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గ పరిశీలకులు కాటప్పగారి రామలింగారెడ్డి గారు. ఈ రోజు శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండలం సిద్దారంపురం గ్రామంలో ఆర్థిక సమస్యలతో సతమాతం అవుతున్న బలిజ లక్ష్మయ్య గారి కుటుంబానికి ₹10000/- రూపాయలు ఆర్థికసాయం చేసి అండగా నిలిచినా టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కాటప్పగారి రామలింగారెడ్డి గారు. ఈ కార్యక్రమంలో కాటమయ్య, చిన్నమద్దిలేటి, నారాయణస్వామి, తలారి నాగేంద్ర, చిన్నారాజు, మారుతీ, రవి, చెన్నమయ్య, పవన్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులను మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా ఎస్పీ..
అనంతపురం 28.07.2024 రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులను మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా ఎస్పీ.. రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు శ్రీ పయ్యావుల కేశవ్ గారిని జిల్లా ఎస్పీ శ్రీ కె.వి.మురళీకృష్ణ గారు ఆదివారం మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతపురం నగరంలోని రాంనగర్ లో ఉన్న మంత్రి గారి నివాసంలో మంత్రివర్యులుని ఎస్పీ కలిసి పూల మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.
బ్రహ్మయ్య స్వామి దేవాలయం నిర్మాణానికి ₹5000/- రూ.లు విరాళం అందజేసిన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కాటప్పగారి రామలింగారెడ్డి..

బ్రహ్మయ్య స్వామి దేవాలయం నిర్మాణానికి ₹5000/- రూపాయలు అందజేసిన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గ పరిశీలకులు కాటప్పగారి రామలింగారెడ్డి గారు. ఈ రోజు శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండలం రేకులకుంట గ్రామంలోని బ్రహ్మయ్య స్వామి గుడి నిర్మాణానికి ₹5000/- రూపాయలు అందజేసిన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యనిర్వాహక కార్యదర్శి కాటప్పగారి రామలింగారెడ్డి గారు* ఈ కార్యక్రమంలో ఐటీడీపి మండల అధ్యక్షులు హేమంత్ కుమార్ యాదవ్, బ్రహ్మయ్య ఆచారి, కొండన్న, సుబ్బయ్య, నారాయణ స్వామి, తలారి నాగేంద్ర,మారుతీ, నరసింహులు, మరియు ఆలయకమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

పేకాట స్థావరంపై పోలీసులు దాడులు..
అనంతపురం గార్లదిన్నె మండల కేంద్రంలో పేకాట స్థావరంపై పోలీసులు దాడులు పేకాట ఆడుతున్న 10 మందిని పట్టుకున్న పోలీసులు వారి నుండి 20 ద్విచక్ర వాహనాలు స్వాదీనం... సుమారు 4,11,000 రూపాయలు నగదు స్వాదీనం చేసుకున్న పోలీసులు...
పీర్ల పండుగ ఉత్సవ కార్యక్రమంలో పాల్గొన్నా టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కాటప్పగారి రామలింగారెడ్డి..
స్వాగ్రామం సిద్దారంపురంలోని పీర్ల పండుగ ఉత్సవ కార్యక్రమంలో పాల్గొన్నా టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కాటప్పగారి రామలింగారెడ్డి గారు మరియు కుటుంబ సభ్యులు ఈ రోజు శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండలం స్వాగ్రామం సిద్దారంపురం లోని పీర్ల పండుగ ఉత్సవ కార్యక్రమంకు హాజరుఅయిన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కాటప్పగారి రామలింగారెడ్డి గారిని ఘన స్వాగతం పలికిన గ్రామ పెద్దలు మరియు గ్రామ ప్రజలు