ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తాం : టిడిపి రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి కాటప్ప గారి రామలింగారెడ్డి..
ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తాం : టిడిపి రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి కాటప్ప గారి రామలింగారెడ్డి.
శింగనమల నియోజకవర్గం, బుక్కరాయసముద్రం మండల కేంద్రం నందు ఈ రోజు ఉదయం 6 గంటల నుండే పెంచిన పెన్షన్ల పంపిణి కార్యక్రమం ప్రారంభమైంది. మండల కేంద్రము నందు టిడిపి రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి కాటప్ప గారి రామలింగారెడ్డి గారు*,*జిల్లా అధికార ప్రతినిధి పర్వతనేని శ్రీధర్ బాబు* మండల నాయకులతో కలిసి పెన్షన్ల పంపిణీలో పాల్గొన్నారు. అక్కడ నుండి ఇంటింటికి వెళ్ళీ పెన్షన్లు పంపిణి చేస్తున్నారు. ఉదయం 6 గంటల నుండి ఈ రోజు లోపుగా పెన్షన్ల పంపిణి పూర్తి చేయాలనీ అధికారులకు సూచనలు ఇచ్చారు. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారని, ఇప్పటికే 5 హామీలు అమలు చేశామని, మిగిలిన హామీలు కూడా త్వరలో నెరవేరుస్తామని ఈ సందర్భంగా *టిడిపి రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి కాటప్ప గారి రామలింగారెడ్డి గారు* పేర్కొన్నారు.... ఈ కార్యక్రమంలో , మండల కన్వీనర్ అశోక్ కుమార్ టిడిపి సీనియర్ నాయకులు అనిల్ గారు,మాజీ సర్పంచ్ నారాయణ స్వామి,లక్ష్మీ నారాయణ, మల్లేసు, కేసన్న,రామా నాయుడు,SK వెంకటేశు,సాకే రామకృష్ణ,రవి కుమార్,బాబయ్య, బుసగాని నరేంద్ర, సురేష్ చౌదరి, కాటమయ్య, పశులూరు కుమార్,నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది...
Aug 02 2024, 06:47