ఇంటి పత్రాలు రెడీగా ఉంచుకోండి...
పన్ను లెక్కను పక్కాగా కట్టేందుకు జీహెచ్‌ఎంసీ(GHMC) సిద్ధమైంది. ఇందులో భాగంగా భవన నిర్మాణ అనుమతుల వివరాలు, నివాసయోగ్య పత్రం(ఓసీ), తాజా ఆస్తి పన్ను చెల్లింపు రశీదు, నీటి, విద్యుత్ బిల్లులు, యజమాని గుర్తింపు కార్డు, వాణిజ్య భవనమైతే ట్రేడ్ లైసెన్స్ వివరాలు సేకరించనున్నారు.
పన్ను లెక్కను పక్కాగా కట్టేందుకు జీహెచ్‌ఎంసీ(GHMC) సిద్ధమైంది. ఇందులో భాగంగా భవన నిర్మాణ అనుమతుల వివరాలు, నివాసయోగ్య పత్రం(ఓసీ), తాజా ఆస్తి పన్ను చెల్లింపు రశీదు, నీటి, విద్యుత్ బిల్లులు, యజమాని గుర్తింపు కార్డు, వాణిజ్య భవనమైతే ట్రేడ్ లైసెన్స్ వివరాలు సేకరించనున్నారు. ఎంపికైన ఏజెన్సీ సిబ్బంది క్షేత్రస్థాయిలో సమాచారం తీసుకుంటారని అధికారులు చెబుతున్నారు.
ప్రతీ భవనం నుంచి ఆస్తిపన్ను, వాణిజ్య సంస్థల నుంచి ట్రేడ్ లైసెన్స్ రుసుము వసూలు చేయాలని బల్దియా లక్ష్యంగా పెట్టుకుంది. ఉప్పల్, హయత్‌నగర్, హైదర్‌నగర్, కూకట్‌పల్లి(Uppal, Hayatnagar, Hydernagar, Kukatpally), కేపీహెచ్‌బీ కాలనీ, మియాపూర్, చందానగర్ ప్రాంతాల్లో సర్వే ప్రారంభించనున్నారు. దశల వారీగా ఇతర ప్రాంతాలకూ విస్తరిస్తామని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి కాట తెలిపారు. సిబ్బందికి వివరాలు ఇచ్చి పౌరులు సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
బిల్ కలెక్టర్లు, ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్లపై ఫిర్యాదుల నేపథ్యంలో ఆస్తిపన్ను మదింపునకు మాన్యువల్‌గా దరఖాస్తు విధానం నిలిపివేశారు. ఆన్‌లైన్ సెల్ఫ్ అసెస్మెంట్ పద్ధతిని కొనసాగించారు. దీంతో గతంతో పోలిస్తే మదింపు జరుగుతున్న భవనాల సంఖ్య తగ్గిందని, ఈ ప్రభావం ఆదాయంపైనా పడుతోందని భావించిన జీహెచ్‌ఎంసీ మాన్యువల్(GHMC Manual)గా దరఖాస్తుల స్వీకరణను తిరిగి ప్రారంభించింది. సర్కిల్, జోనల్ కార్యాలయాల్లో పౌరుల నుంచి అసెస్మెంట్ దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఇప్పటి వరకు పన్ను చెల్లించని భవనాలను గుర్తించి దరఖాస్తు చేసుకోవాలని యజమానులకు నోటీసులు జారీ చేస్తున్నారు. డ్రోన్, క్షేత్రస్థాయి సర్వే నేపథ్యంలో యజమానుల నుంచి అసె్‌సమెంట్ దరఖాస్తులు తీసుకుంటున్నారు
డ్రోన్, క్షేత్రస్థాయి సర్వేతో భవనాల పక్కాగా లెక్క తేలడంతోపాటు.. ఎన్ని నిర్మాణాల నుంచి పన్ను వసూలవుతోంది..? ఇప్పటికీ మదింపు జరగని భవనాలెన్ని..? అన్న దానిపై స్పష్టత రానుంది. నివాస కేటగిరీలో పన్ను చెల్లిస్తు.. నివాసేతర అవసరాలకు వినియోగిస్తోన్న నిర్మాణాలనూ గుర్తిస్తారు.
శాటిలైట్ చిత్రాలతోపాటు, డ్రోన్ సర్వే ద్వారా ఏరియాల వారీగా భవనాలు, ఎన్ని అంతస్తులున్నాయన్నది తేలుతుంది. భవన నిర్మాణ విస్తీర్ణం ఎంత..? పన్ను ఎంత విస్తీర్ణానికి చెల్లిస్తున్నరనేది నిర్ధారించేందుకు కొలతలూ తీసుకుంటారని రెవెన్యూ విభాగం అధికారొకరు తెలిపారు. వీటి ఆధారంగా సవరణ మదింపు చేపడతారు. నిర్ణీత స్థాయి కంటే ఎవరైనా ఎక్కువ పన్ను చెల్లిస్తోన్నా.. దానినీ సవరిస్తారు. అనుమతి లేని నిర్మాణాలకు 100 శాతం పెనాల్టీ విధిస్తారు.
ఇప్పటి వరకు మదింపు జరగని భవనాలను పన్ను పరిధిలోకి తీసుకువచ్చి జీహెచ్‌ఎంసీ చట్టం 1955 ప్రకారం ఒకటిన్నర నుంచి రెండున్నర సంవత్సరాల పెనాల్టీతో పన్ను నిర్ణయిస్తారు. ట్రేడ్ లైసెన్స్ లేకుండా వ్యాపారం చేస్తోన్న సంస్థల లెక్కలూ సర్వేతో తేలనున్నాయి.
ప్రస్తుతం 80 వేల ట్రేడ్ లైసెన్స్‌లు ఉండగా.. వీటి సంఖ్య రెండు లక్షలకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. అదే సమయంలో కూలిన భవనాల పీటీఐఎన్‌లూ సర్వే అనంతరం తొలగించే అవకాశముంది. దీంతో ప్రస్తుతం గ్రేటర్‌లో ఎన్ని భవనాలున్నాయి..? మదింపు జరిగినవి..? ఎంత మంది పన్ను చెల్లిస్తున్నారు..? అన్న దానిపై స్పష్టత రానుంది
Jul 30 2024, 15:05