వ్యాధి నిరోధక టీకాల*(ఇమ్యునైజేషన్) కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ యుగంధర్..
బుక్కరాయసముద్రం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉన్న ఒకటవ సచివాలయ పరిధిలో జరుగుతున్న వ్యాధి నిరోధక టీకాల (ఇమ్యునైజేషన్) కార్యక్రమాన్ని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ యుగంధర్ ఆకస్మిక తనిఖీ చేసి వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని పరిశీలించారు, వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని యు విన్ యాప్ లో అప్లోడ్ చేస్తున్నారా లేదా, ఇప్పటి వరకు యూ విన్ యాప్ లో ఎంత మందిని నమోదు చేశారని ఆరా తీశారు, అలాగే స్టాఫ్ డయేరియా కార్యక్రమం పైన రెండు నెలల నుంచి ఐదు సంవత్సరంల లోపు పిల్లలకు ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు సర్వే చేసినప్పుడు ఇచ్చారా లేదా అని పిల్లల తల్లులను అడిగి తెలుసుకున్నారు, ఇ ఆశ యాప్ ప్రతిరోజు లాగిన్ అవుతున్నారా లేదా, అర్హత దంపతులను ఎలా నమోదు చేయాలో తెలుసా లేదా అని, వారికీ అందించే సేవల పైన ఆశా కార్యకర్తలకు అవగాహన ఉందా లేదా అని అడిగారు, ప్రతిరోజు ఆశ కార్యకర్తలందరూ కిల్కారికాల్స్ పైన గర్భవతులకు మరియు బాలింతలకు అవగాహన కల్పించాలని తెలియజేశారు, కిల్కారి కాల్స్ 72 వారాలు లేదా 18 నెలల పాటు ఉచితంగా అందించబడుతుందని తెలియజేశారు, హై రిస్క్ గర్భవతులను గుర్తించి తప్పనిసరిగా ఎస్కార్ట్ పర్సన్ ను మ్యాప్ చేయాలని తెలియజేశారు, హెచ్ బి న్ సి, హెచ్ బి వై సి , ఎలా చేస్తారని ఆశ కార్యకర్తలను అడిగారు, తప్పనిసరిగా అన్ని కాన్పులు ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ గా ఉండాలని , మాతృ మరణాలు, శిశు మరణాలు జరగకుండా మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారని పర్యవేక్షక సిబ్బంది అడిగి వారికి అవగాహన కల్పించారు, ప్రతి ఆశ కార్యకర్తల సమావేశానికి తప్పనిసరిగా ఆశా కార్యకర్తలకు అందజేసిన ఆశా కిట్ కిట్టుతో హాజరుకావాలని వారికి ప్రతి సమావేశంలోనూ అవగాహన కల్పించాలని తెలియజేశారు. ఆర్ సి హెచ్ లో గర్భవతుల నమోదు 95 శాతానికి తగ్గకుండా ఉండాలని తెలియజేశారు, తప్పనిసరిగా మీ పరిధిలో ఉన్న హాస్టల్స్ విజిట్ చేసి డయేరియా పైన మరియు సీజనల్ వ్యాధుల పైన ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంల వైద్యాధికారి డాక్టర్ తహెరున్నిస గారు , డిస్టిక్ హెల్త్ ఎడ్యుకేటర్ సుబ్రహ్మణ్యం గారు, పి హెచ్ ఎన్ చెన్నమ్మ, సూపర్వైజర్ ఈశ్వరమ్మ ,సత్యనారాయణ శాస్త్రి, హెల్త్ అసిస్టెంట్ ధనుంజయ, ఆనంద్, ఆఫీస్ అపార్డినేట్ శివరాజ్, ఆశా కార్యకర్తలు సునీత ,వాణి, లక్ష్మీదేవి ,లక్ష్మీ పాల్గొన్నారు
Jul 30 2024, 10:55