ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలి.. రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత సూచన..
ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలి.. త్వరలోనే ఇదే అంశంపై ముఖ్యమంత్రి గారిని, వ్యవసాయశాఖ మంత్రిని కలుస్తాం* *పండ్ల తోటల పెంపకం పరిమితిని 5 ఎకరాల నుంచి 10 ఎకరాలకు పెంచాలి* *రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత సూచన* ప్రస్తుతం వ్యవసాయం చేయాలంటే.. పెట్టుబడులు పెరిగి భారంగా మారిందని.. ఇలాంటి పరిస్థితుల్లో ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయడమే సరైన పరిష్కారమని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అభిప్రాయ పడ్డారు. ఇదే అంశాన్ని గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా సార్లు చెప్పారని గుర్తు చేశారు. అనంతపురంలోని తన క్యాంపు కార్యాలయంలో పలువురు రైతులు పరిటాల సునీతను కలిసి నేటి వ్యవసాయ పరిస్థితుల గురించి చర్చించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు పెట్టుబడులు తగ్గిస్తేనే వ్యవసాయం మనుగడ సాధ్యమవుతుందన్నారు. అనంతపురం లాంటి కరువు జిల్లాలో రైతులను ఆదుకునేందుకు ఉపాధి హామీ పథకంలో భాగంగా పండ్ల తోటల పెంపకాన్ని చేపడుతున్నారన్నారు. ప్రస్తుతం ఐదు ఎకరాలలోపు ఉన్న రైతులకు మాత్రమే ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నారు. అయితే అనంతపురం జిల్లాలో ఎక్కువమంది 5నుంచి 10 ఎకరాల వరకు భూములు ఉన్న రైతులే ఉన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని పండ్ల తోటల పెంపకం పథకాన్ని 10 ఎకరాల లోపు రైతులకు కూడా వర్తింపజేయాలి. పరిమితిని పది ఎకరాలకు పెంచితే ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. ఉమ్మడి జిల్లాలో అత్యంత తక్కువ వర్షపాతం ఉన్నందున రైతుల్ని ఉద్యాన పంటల వైపు నడిపించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ జిల్లాలో సంప్రదాయ పంటలు సాగు చేస్తున్న రైతులు నష్టాలు మూట కట్టుకుంటున్నారని అన్నారు. పండ్లతోటల సాగు ఎక్కువ పెట్టుబడితో కూడుకున్నది కాబట్టి రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత మన ప్రభుత్వంపై ఉందన్నారు. పరిమితిని పది ఎకరాలకు పెంచడం ద్వారా లక్షలాది మంది రైతులకు ఉపయోగపరంగా ఉంటుందన్నారు. పది ఎకరాల వరకు అర్హతను పెంచి 5 ఎకరాల్లో పండ్ల మొక్కలు పెంపకానికి అవకాశం కల్పిస్తే రైతులకు మేలు జరుగుతుందని తెలిపారు. ఇదే అంశాన్ని త్వరలోనే ముఖ్యమంత్రి, వ్యవసాయశాఖ మంత్రిని కలిసి వివరిస్తామని సునీత అన్నారు....
చట్టాలను తెల్సుకోండి అభివృద్ధిలో ముందుకు కదలండి సీఐ వెంకటేశ్వర్లు..
చట్టాలను తెల్సుకోండి అభివృద్ధిలో ముందుకు కదలండి సీఐ వెంకటేశ్వర్లు..

బుక్కరాయసముద్రం మండలంలోని చట్టాల పైన అవగాహన కార్యక్రమాన్ని సిఐ వెంకటేశ్వర్లు పసులూరు సిద్దారంపురం రెడ్డిపల్లి గ్రామాల నందు గ్రామంలోని యువతతో కలిసి నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చట్టలవలన ఉపయోగాలు తెలియజేయడం జరిగింది గ్రామంలో నందు మొహరం సందర్భంగా ఎటువంటి సంఘటనలు జరగకుండా జరుపుకోవాలని గ్రామ ప్రజలకు యువతకు తెలియజేయడం జరిగినది ఈ కార్యక్రమంలో గ్రామ పోలీస్ అధికారి కానిస్టేబుల్ రవి నాయక్ గ్రామ పెద్దలు యువతి యువకులు పాల్గొన్నారు
వ్యాధి నిరోధక టీకాల*(ఇమ్యునైజేషన్) కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ యుగంధర్..
బుక్కరాయసముద్రం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉన్న ఒకటవ సచివాలయ పరిధిలో జరుగుతున్న వ్యాధి నిరోధక టీకాల (ఇమ్యునైజేషన్) కార్యక్రమాన్ని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ యుగంధర్ ఆకస్మిక తనిఖీ చేసి వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని పరిశీలించారు, వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని యు విన్ యాప్ లో అప్లోడ్ చేస్తున్నారా లేదా, ఇప్పటి వరకు యూ విన్ యాప్ లో ఎంత మందిని నమోదు చేశారని ఆరా తీశారు, అలాగే స్టాఫ్ డయేరియా కార్యక్రమం పైన రెండు నెలల నుంచి ఐదు సంవత్సరంల లోపు పిల్లలకు ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు సర్వే చేసినప్పుడు ఇచ్చారా లేదా అని పిల్లల తల్లులను అడిగి తెలుసుకున్నారు, ఇ ఆశ యాప్ ప్రతిరోజు లాగిన్ అవుతున్నారా లేదా, అర్హత దంపతులను ఎలా నమోదు చేయాలో తెలుసా లేదా అని, వారికీ అందించే సేవల పైన ఆశా కార్యకర్తలకు అవగాహన ఉందా లేదా అని అడిగారు, ప్రతిరోజు ఆశ కార్యకర్తలందరూ కిల్కారికాల్స్ పైన గర్భవతులకు మరియు బాలింతలకు అవగాహన కల్పించాలని తెలియజేశారు, కిల్కారి కాల్స్ 72 వారాలు లేదా 18 నెలల పాటు ఉచితంగా అందించబడుతుందని తెలియజేశారు, హై రిస్క్ గర్భవతులను గుర్తించి తప్పనిసరిగా ఎస్కార్ట్ పర్సన్ ను మ్యాప్ చేయాలని తెలియజేశారు, హెచ్ బి న్ సి, హెచ్ బి వై సి , ఎలా చేస్తారని ఆశ కార్యకర్తలను అడిగారు, తప్పనిసరిగా అన్ని కాన్పులు ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ గా ఉండాలని , మాతృ మరణాలు, శిశు మరణాలు జరగకుండా మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారని పర్యవేక్షక సిబ్బంది అడిగి వారికి అవగాహన కల్పించారు, ప్రతి ఆశ కార్యకర్తల సమావేశానికి తప్పనిసరిగా ఆశా కార్యకర్తలకు అందజేసిన ఆశా కిట్ కిట్టుతో హాజరుకావాలని వారికి ప్రతి సమావేశంలోనూ అవగాహన కల్పించాలని తెలియజేశారు. ఆర్ సి హెచ్ లో గర్భవతుల నమోదు 95 శాతానికి తగ్గకుండా ఉండాలని తెలియజేశారు, తప్పనిసరిగా మీ పరిధిలో ఉన్న హాస్టల్స్ విజిట్ చేసి డయేరియా పైన మరియు సీజనల్ వ్యాధుల పైన ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంల వైద్యాధికారి డాక్టర్ తహెరున్నిస గారు , డిస్టిక్ హెల్త్ ఎడ్యుకేటర్ సుబ్రహ్మణ్యం గారు, పి హెచ్ ఎన్ చెన్నమ్మ, సూపర్వైజర్ ఈశ్వరమ్మ ,సత్యనారాయణ శాస్త్రి, హెల్త్ అసిస్టెంట్ ధనుంజయ, ఆనంద్, ఆఫీస్ అపార్డినేట్ శివరాజ్, ఆశా కార్యకర్తలు సునీత ,వాణి, లక్ష్మీదేవి ,లక్ష్మీ పాల్గొన్నారు
టీడీపీ నాయకుడు ముత్యాల్ రెడ్డి భార్య లక్ష్మీదేవి పార్థివ దేహమునకు పూలమాల వేసి నివాళులర్పించిన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆలం నరసానాయుడు..
నార్పల మండలం నడిమిదొడ్డి గ్రామనికి చెందిన టీడీపీ నాయకుడు ముత్యాల్ రెడ్డి భార్య లక్ష్మీదేవి అనారోగ్యం తో మృతి చెందడం జరిగింది.ఈ విషయం తెలుసుకున్న టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ద్విసభ్య కమిటి సభ్యులు ఆలం నరసానాయుడు గారు* అక్కడికి వెళ్లి మృతదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. వారి కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యంగా ఉండండి అని చెప్పి తెలుగుదేశం పార్టీ మరియు వ్యక్తి గతంగా నేను అనివిధాలా అండగా ఉంటామని తెలియజేసారు. ఈ కార్యక్రమం లో పిట్టు రంగారెడ్డి, రాఘవ నాయుడు, తిప్పన్న,నారాయణ స్వామి, B నారాయణ స్వామి,చంద్రమోహన్ రెడ్డి,నల్లప్ప,నాగర్జున,నాగర్జున రెడ్డి,K నల్లప్ప,జగదీష్,పెద్ద నల్లప్ప,గౌస్ మోద్దీన్,హనుమంత్ రెడ్డి,ఈశ్వర్ రెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర బడ్జెట్ లో ఏపీకి నిధుల కేటాయింపు హర్షనీయం.. మాసూల చంద్రమోహన్..
కేంద్ర బడ్జెట్ లో ఏపీకి నిధుల కేటాయింపు హర్షనీయం.. మాసూల చంద్రమోహన్.. రాష్ట్ర తెలుగు యువత మాజీ కార్యదర్శి* *మార్కెట్ యార్డ్ మాజీ డైరెక్టర్* కేంద్ర ఎన్డీఏ ప్రభుత్వం బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించడం పట్ల రాష్ట్ర తెలుగు యువత మాజీ కార్యదర్శి మార్కెట్ యార్డ్ మాజీ డైరెక్టర్ మాసూల చంద్రమోహన్ హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు,, పవన్ కళ్యాణ్ కృషితో ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునర్ నిర్మాణం కొరకు ఎన్డీఏ ప్రభుత్వం 15000 కోట్లు కేటాయించడం అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టుకు అధిక నిధులు కేటాయింపు హర్షనీయం అని, అలాగే విభజన చట్ట ప్రకారం వైజాగ్- చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కు మరియు హైదరాబాద్- బెంగళూరు పారిశ్రామిక కారిడార్ కు ఏడాది నిధులు కేటాయింపు,వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ, ప్రకాశం జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీని ఇవ్వడం పట్ల మార్కెట్ యార్డ్ మాజీ డైరెక్టర్ చంద్రమోహన్ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే అది ఒక్క చంద్రబాబు నాయుడుకే సాధ్యమని అన్నారు.
కౌలు రైతుల పంట సాగు హక్కు పత్రాలను పొందండి... జిల్లా వ్యవసాయ అధికారిని శ్రీమతి ఉమామహేశ్వరమ్మ...
కౌలు రైతులు పంట సాగు హక్కు పత్రాలను పొందండి... అనంతపురం జిల్లా వ్యవసాయ అధికారిని శ్రీమతి ఉమామహేశ్వరమ్మ...

బుక్కరాయసముద్రం మండలములోని వడియం పేట గ్రామం రైతులు భూమి యజమాని నుండి భూమిని కౌలుకు తీసుకున్నచో పంట సాగు హక్కు పత్రాలను సంబంధిత గ్రామ రెవెన్యూ అధికారులను సంప్రదించి సాగు హక్కు పత్రాలను పొందాలని రైతులను కోరారు. పంట సాగు హక్కు పత్రాల అవగాహనా కార్యక్రమం నకు హాజరై రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ రైతులు కౌలుకు తీసుకున్నచో వెంటనే యజమాని మరియు కౌలుదారు సంబంధిత గ్రామ రెవిన్యూ అధికారిని సంప్రదించి పాస్ పుస్తకం జిరాక్స్ రెండు ఫోటో లు మరియు దరఖాస్తు ను నింపి ఇచినచో పంట సాగు హక్కు పత్రాన్ని ఇస్తారని తెలియజేసారు. దీని యొక్క కాల పరిమితి 11 నెలలు మాత్రమే ఉంటుందని యజమానికి ఎటువంటి ఇబ్బంది ఉండదని తెలియజేసారు. కౌలు రైతుకు పంట మీద మాత్రమే హక్కు ఉంటుందని భూమి పై ఉండదని తెలియజేసారు.కౌలు రైతుకు ప్రభుత్వం నుండి పెట్టుబడి సహాయం వస్తుందని పంట నష్ట పోతే పెట్టుబడి రాయుతి, ఇన్సూరెన్సు,పంట నష్ట పరిహారం, పంట కనీస మద్దతు ధరతో అమ్ముటకు వీళవుతుందని తెలియజేసారు కావున రైతులందరు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేసారు. ఈ కార్యక్రమం లో మండల వ్యవసాయధికారి శ్యాం సుందర్ రెడ్డి,గ్రామ రెవెన్యూ అధికారిని శిరీష, వ్యవసాయసహాయకుడు శ్రీనివాస్, ఎంపీ ఈఒ తిరుమలేష్, గ్రామ రైతులు పాల్గొన్నారు.
పి.ఆర్.వన్ యాప్ లో డ్రైనేజీ కాలువలను గుంతలను చెత్త దిబ్బలను ఎలా రిజిస్టర్ చేయాలో యాప్ పై అవగాహన కల్పించిన.. D.P.O, జిల్లా ఇన్చార్జి సీ.ఈ.ఓ

అనంతపురం జిల్లా పంచాయతీ అధికారి, జిల్లా ఇన్చార్జి సీఈఓ ప్రభాకర్ రావు అనంతపురం వారు బుక్కరాయసముద్రం గ్రామపంచాయతీకి సందర్శించి పి ఆర్ వన్ యాప్ కు సంబంధించి గ్రామంలో ఉన్న మురికాలువలు కసువు దిబ్బలు ,కంప చెట్లు ,ట్యాంకులు రిజిష్టర్ చేసే టప్పుడు ఫోటో రిజిష్టర్ చేసిన తర్వాత క్లీన్ చేసిన తరువాత ఫోటో అప్లోడ్ చేయవలెనని DPO గారు పంచాయితీ సిబ్బంది చేయుచున్న అన్ లైన్ పరిశీలించడ మైన ది. ఈ కార్యక్రమం నకు సర్పంచ్ అమ్మవారిపేట పార్వతి గారు, EORD దామోదరమ్మ గారు. పంచాయితి కార్యదర్శులు,ఇంజనీరింగ్ అసిస్టెంట్స్,పంచాయితి సిబ్బంది అందరూ పాల్గొన డ మైన ది.

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్య లను తెలిపిన ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ..
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల అనంతరం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి,జనసేన పార్టీ అధ్యక్షులు గౌ|| శ్రీ పవన్ కళ్యాణ్ గారినిమర్యాదపూర్వకంగా కలిసి,నియోజకవర్గ సమస్యలు,గ్రామీణ తాగునీరు మరియు పారిశుద్ధ్యనికి సంబంధించిన పెండింగ్ బిల్లులు,అలాగే నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి ఆయన దృష్టికి తీసుకెళ్లిన శింగనమల నియోజకవర్గం శాసనసభ్యురాలు బండారు శ్రావణి శ్రీ గారు.
పీర్ల పండుగ ఉత్సవ కార్యక్రమంకు ₹10000/- రూ.లు అందజేసిన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కాటప్పగారి రామలింగారెడ్డి..
స్వాగ్రామం మైన సిద్దారంపురంలోని పీర్ల పండుగ ఉత్సవ కార్యక్రమంకు ₹10000/- రూపాయలు అందజేసిన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గ పరిశీలకులు కాటప్పగారి రామలింగారెడ్డి గారు. ఈ రోజు శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండలం స్వాగ్రామం సిద్దారంపురం లోని పీర్ల పండుగ ఉత్సవ కార్యక్రమంకు ₹10000/- రూపాయలు అందజేసిన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కాటప్పగారి రామలింగారెడ్డి గారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మరియు కాటమయ్య,మద్దిలేటి, రవి, నరసింహులు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన శింగనమల నియోజకవర్గ ద్విసభ్య కమిటీ సభ్యులు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి..

అమరావతి అసెంబ్లీ సెక్రటరియేట్ లో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర IT & విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన శింగనమల నియోజకవర్గ ద్విసభ్య కమిటీ సభ్యులు ఆలం నరసనాయుడు గారు, ముంటిమడుగు కేశవరెడ్డి గారు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కాటప్పగారి రామలింగారెడ్డి గారు, జిల్లా అధికార ప్రతినిధి పర్వాతనేని శ్రీధర్ బాబు గారు .