సాగర్‌ నీటి విడుదలకు మా సమ్మతి అక్కర్లేదా?

తమను సంప్రదించకుండానే నాగార్జున సాగర్‌ కుడికాలువ నుంచి 3 టీఎంసీల నీటి విడుదలకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) చైర్మన్‌ శుక్రవారం ఇచ్చిన ఉత్తర్వులపై తెలంగాణ అధికారులు విస్మయం వ్యక్తం చేశారు.

తమను సంప్రదించకుండానే నాగార్జున సాగర్‌ కుడికాలువ నుంచి 3 టీఎంసీల నీటి విడుదలకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) చైర్మన్‌ శుక్రవారం ఇచ్చిన ఉత్తర్వులపై తెలంగాణ అధికారులు విస్మయం వ్యక్తం చేశారు.

ఏకపక్షంగా ఉత్తర్వులిచ్చే అధికారం చైౖర్మన్‌కు ఎక్కడిదంటూ ఆక్షేపించారు.

ప్రధానంగా నీటి విడుదలపై ఏ నిర్ణయం తీసుకోవాలన్నా త్రిసభ్య కమిటీకే అధికారం ఉంటుంది. ఈ కమిటీలో కృష్ణాబోర్డు సభ్య కార్యదర్శి కన్వీనర్‌గా.. తెలుగు రాష్ట్రాల ఈఎన్‌సీలు సభ్యులుగా ఉంటారు.

ఈ కమిటీలో ఏ ఒక్కరు సమ్మతి తెలపకపోయినా.. నీటి విడుదలకు ఆదేశాలు జారీ చేయడానికి వీల్లేదు. ఏకాభిప్రాయం కుదరకపోతే కృష్ణాబోర్డు సమావేశంలో చర్చించాలి.

అయినా అంగీకారం కుదరకపోతే కేంద్ర జలశక్తిశాఖ మంత్రి నేతృత్వంలోని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులుండే అపెక్స్‌ కౌన్సిల్‌లోతేల్చుకోవాలి.

అవన్నీ పట్టించుకోకుండా ఉత్తర్వులిచ్చిన బోర్డు చైర్మన్‌ను నిలదీయాలని రాష్ట్ర అధికారులు భావిస్తున్నారు.

లేని అప్పు ఉన్నట్టుగా చంద్రబాబు చెబుతున్నారు

టీడీపీ ప్రభుత్వం విడుదల చేస్తున్న శ్వేతపత్రాలపై మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ కౌంటర్‌ ఇచ్చారు. ఇవాళ జగన్‌ మీడియాతో మాట్లాడుతూ.. 52 రోజులుగా రాష్ట్రం పురోగతి వైపు వెళ్తోందా అని, తిరోగమనంలో వెళ్తోందా అని ఆయన ప్రశ్నించారు. ఈ విషయంపై రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయాలని, దాడులు, అత్యాచారాలు, ఆస్తుల ధ్వంసం జరుగుతోందన్నారు. ప్రశ్నించే స్వరం ఉండకూడదు అనే విధంగా ప్రభుత్వం అణిచివేత ధోరణితో ముందుకు వెళ్తోందని, బడ్జెట్ కూడా రెగ్యులర్ విధానంలో ప్రవేశ పెట్టలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు జగన్‌. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ దారుణమైన పరిస్థితి అని, రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశ పెట్టే ధైర్యం కూడా చంద్రబాబు కి లేదన్నారు.

రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశ పెడితే హామీల అమలుకు సంబంధించి కేటాయింపులు చూపాలని, మోసపూరిత హామీలపై నిధులను బడ్జెట్ లో చూపించక పోతే ప్రజలు రోడ్డు పైకి వచ్చి ఆందోళనకు దిగుతారు అని చంద్రబాబుకు తెలుసునన్నారు. రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశ పెడితే ప్రజలకు అన్ని విషయాలు తెలుస్తాయని చంద్రబాబు ఇలా చేస్తున్నారని, రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెడితే హామీల్లో కేటాయింపులు చేయరు కాబట్టి ప్రజలకు తెలుస్తుంది అని ఇలా చేస్తున్నారన్నారు.

అంతేకాకుండా..’ప్రజలను భయానక వాతావరణంలో ఉంచటానికి దాడులు, ఆస్తుల ధ్వంసం వంటి ఘటనలు చేస్తున్నారు. చంద్రబాబు ఎప్పుడు వంచెన, గోబెల్స్ ప్రచారం అనే విధానం ఫాలో అవుతారు.

రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉందనే విధంగా ప్రస్తుతం చంద్రబాబు ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచినపుడు, బీజేపీతో కలిసి వెళ్ళటానికి, బీజేపీ నుంచి విడిపోవటానికి ఇలా ప్రతిసారి చంద్రబాబు అనుసరించే విధానం ఇదే.

రాష్ట్రం ఆర్దికంగా ధ్వంసం అయిందనే కథని ఇటీవల చంద్రబాబు ఎక్కువగా చెబుతూ వస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల నుంచి తప్పుకోవడానికి చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికలు అయ్యాక అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చంద్రబాబు ఇదే ప్రయత్నం చేస్తున్నారు.

14 లక్షల కోట్లు ఉన్నాయి అని చంద్రబాబు ప్రచారం చేస్తున్నారు. లేని అప్పు ఉన్నట్టుగా చంద్రబాబు చెబుతున్నారు’ అని వైఎస్‌ జగన్‌ వ్యా్‌ఖ్యానించారు.

పోలవరం.. మూడేళ్లలో పూర్తి!

పోలవరం ప్రాజెక్టు మూడేళ్లలో పూర్తి కావాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షను వ్యక్తం చేశారు. కొత్త డయాఫ్రం వాల్‌ నిర్మాణం పూర్తి కావడానికి రెండు సీజన్ల సమయం పడుతుందని, దీనికి సమాంతరంగా మిగిలిన పనులు చేపట్టి మూడేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేయాలన్న సంకల్పంతో పనిచేస్తున్నామని చెప్పారు. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును జగన్‌ ప్రభుత్వం

పోలవరం ప్రాజెక్టు మూడేళ్లలో పూర్తి కావాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షను వ్యక్తం చేశారు. కొత్త డయాఫ్రం వాల్‌ నిర్మాణం పూర్తి కావడానికి రెండు సీజన్ల సమయం పడుతుందని, దీనికి సమాంతరంగా మిగిలిన పనులు చేపట్టి మూడేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేయాలన్న సంకల్పంతో పనిచేస్తున్నామని చెప్పారు. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును జగన్‌ ప్రభుత్వం సకాలంలో పూర్తి చేయకపోగా.. నాశనం చేసిందని.. దరిమిలా రూ.30 వేల కోట్ల మేర నష్టం వాటిల్లిందని తెలిపారు. పోలవరం ప్రాజెక్టుపై తీర్మానం చేసి కేంద్రానికి పంపే నిమిత్తం గురువారం సాయంత్రం అత్యవసర మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేశారు. రూ.990 కోట్లతో కొత్త డయాఫ్రం వాల్‌ నిర్మించాలని, ఇందుకు కేంద్రం సహకరించాలని ఈ సందర్భంగా తీర్మానించారు.

పోలవరం పూర్తిచేసే బాధ్యతను కేంద్రం తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ‘ప్రాజెక్టు సకాలంలో పూర్తయి ఉంటే 960 మెగావాట్ల జల విద్యుత్కేంద్రం ఉత్పత్తిలోకి వచ్చేది. అది అందుబాటులోకి రాకపోవడం వల్ల చాలా ఎక్కువ ధరకు బయట నుంచి కరెంటు కొనాల్సి వస్తోంది. పంటలకు కూడా ప్రాజెక్టు నీరు అందుబాటులోకి రాలేదు. ఇవన్నీ లెక్కవేస్తే నష్టం రూ.30 వేల కోట్ల వరకు తేలుతోంది’ అని చంద్రబాబు అన్నారు. ప్రాజెక్టు తొలిదశలో 41.15 మీటర్ల కాంటూరు.. మలిదశలో 45.72 మీటర్ల కాంటూరులో నిర్మాణాలంటూ సందేహాలకు తావివ్వకుండా.. గరిష్ఠ నీటి నిల్వ 196.40 టీఎంసీ మేర ప్రాజెక్టు నిర్మాణం సాగాలని.. ఆ మేరకు కేంద్రం సహకరించి నిధులివ్వాల్సిందిగా కోరదామని చెప్పారు. ‘కొత్త డయాఫ్రం వాల్‌ నిర్మించాలని కేంద్ర జల సంఘం చైర్మన్‌ కుశ్వీందర్‌ వోహ్రా తీసుకున్న నిర్ణయం మేరకు.. కేంద్రం స్పందించి.. సకాలంలో ఆదేశాలు జారీ చేయాలి. కేంద్రం త్వరితగతిన నిర్ణయం తీసుకుంటే.. ఈ ఏడాది నవంబరు నుంచే పనులు ప్రారంభించే వీలుంటుంది’ అని చంద్రబాబు చెప్పినట్లు సమాచారం.

తప్పుడు ప్రచారం చేయడంలో వైసీపీ ఆరితేరిందని, ఉపేక్షించకుండా అవసరమైన సందర్భాల్లో మంత్రులు తక్షణం వాటిని తిప్పికొట్టాలని కేబినెట్‌ నిర్ణయించింది. ’2019 ఎన్నికల ముందు జగన్‌పై జరిగిన కోడి కత్తి దాడిని మనం పెద్ద సీరియ్‌సగా తీసుకోలేదు. అలాగే బాబాయి హత్యను వాళ్ళు చేసి మనపై తోసివేసినా మనం అంత బలంగా స్పందించలేదు. వాటి ప్రభావం ఉండదనుకున్నాం. కానీ అవి ప్రభావం చూపాయి. ఈసారి ఎన్నికల ముందు జగన్‌పై గులకరాయి దాడి జరిగిన వెంటనే మనం స్పందించి అది డ్రామా అని విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లాం. పెద్దఎత్తున ప్రచారం చేశాం. అప్పటికే జగన్‌ వ్యవహారాలు వారికి అర్థమై గులకరాయి దాడిని నమ్మలేదు. కొద్ది రోజుల క్రితం వినుకొండలో ఇద్దరు వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగి అందులో ఒకరు హత్యకు గురైతే.. జగన్‌ దానిని మన పార్టీకి పూయాలని చూశారు. రాష్ట్రంలో 36 రాజకీయ హత్యలు జరిగాయంటూ ఢిల్లీ వెళ్లి యాగీ చేయాలని చూశారు. చనిపోయిన వారి పేర్లు ఇవ్వాలని జాతీయ మీడియా అడిగితే సమాధానం చెప్పలేక జగన్‌ వెళ్లిపోయారు.

ఇటువంటివి మనం కూడా అందుకోవాలి. ప్రతి దుష్ప్రచారాన్నీ తిప్పికొట్టాలి’ అని చంద్రబాబు స్పష్టం చేశారు. టీడీపీ శ్రేణులు ప్రతీకార దాడులకు, కక్ష సాధింపు చర్యలకు దిగవద్దని తాను పదేపదే ఉద్దేశపూర్వకంగానే చెబుతున్నానని అన్నారు. ’జగన్‌ మనపై ఎన్నో దాడులు చేశాడు. చేయాల్సినంత అరాచకం చేశాడు. కానీ మళ్లీ గెలవగలిగాడా? వాళ్లు చేసిన అరాచకానికి చట్టప్రకారం శిక్ష పడేలా చూద్దాం. చట్టాన్ని మన చేతుల్లోకి తీసుకోవడం ఎందుకు? చట్టం తన పని తాను చేసుకుంటుంది’ అని వ్యాఖ్యానించారు. కాగా... గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ అసెంబ్లీలో ఆమోదించిన తీర్మానాన్ని కేబినెట్‌ ధ్రువీకరించింది.

కేబినెట్‌లోని ప్రతి మంత్రికీ ఎంబీఏ చదివిన ఒక ఎగ్జిక్యూటివ్‌ అసిస్టెంట్‌ను పాలనా వ్యవహారాల్లో సహాయకారిగా నియమించాలని మంత్రివర్గం నిర్ణయించింది. మంత్రుల పేషీల్లో ఉండాల్సిన సిబ్బందికి సంబంధించిన ప్రతిపాదనలను కేబినెట్‌ సమావేశంలో ఆమోదించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంత్రుల పేషీల్లో సిబ్బంది నియామకానికి మంత్రివర్గం ఆమోదం తెలపాల్సి ఉండడంతో గురువారంనాటి సమావేశంలో సంబంధిత తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదించారు. దీని ప్రకారం ప్రతి పేషీకి 8 మంది చొప్పున సిబ్బందిని మంజూరు చేశారు. ఇందులో ఎగ్జిక్యూటివ్‌ అసిస్టెంట్‌ పోస్టు కూడా ఉంది. గతంలో ఈ పదవి లేదు. దీనిని కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తారు. ఆయా శాఖలకు సంబంధించిన అంశాలను అధ్యయనం చేసి సూచనలు, సలహాలు ఇవ్వడం కోసం ఈ పోస్టును కొత్తగా సృష్టించారు. మంచివారిని చూసి పేషీల్లో సిబ్బందిగా పెట్టుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. మంత్రుల కార్యాలయాల్లో ఆరోగ్యకర వాతావరణం ఉండాలని, శాఖాపరమైన అంశాలపై వెంటనే ప్రతిస్పందించే వారిని చూసి పెట్టుకుంటే ఫలితాలు బాగా ఉంటాయని తెలిపారు.

పోలవరం ప్రాజెక్టును 194.6 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నిర్మించాలని నిర్ణయించాం. దీనివల్ల 23.5 లక్షల ఎకరాల పాత ఆయకట్టును స్థిరీకరించడమే గాక కొత్తగా 7.2 లక్షల ఎకరాలను సాగులోకి తీసుకురావచ్చు. తాగునీటి అవసరాలకు 4.9 టీఎంసీలు, పారిశ్రామిక అవసరాలకు 18.5 టీఎంసీలు వినియోగించుకునే అవకాశం ఉంది. జలవిద్యుత్కేంద్రం ద్వారా 960 మెగావాట్ల కరెంటు ఉత్పత్తి అవుతుంది. పోలవరం నిర్మాణ బాధ్యతను పూర్తిగా తీసుకుంటానని బడ్జెట్‌లో ప్రతిపాదించినందుకు కేంద్ర పభుత్వానికి ధన్యవాదాలు. 45.72 మీటర్ల కాంటూరు మేరకు 194.60 టీఎంసీల పూర్తి సామర్థ్యంతో నిర్మించాలన్న నిర్ణయానికి కట్టుబడి రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇందుకు కేంద్రం పూర్తిగా సహకరించి అవసరమైన నిధులను త్వరితగతిన మంజూరు చేయాలి.

టార్గెట్ ష‌ర్మిల‌: అటు నుంచి న‌రుక్కొస్తున్న జ‌గ‌న్‌ ?

మ‌రి ఇప్పుడు ఏం చేయాలి? అస‌లు శ‌త్రువు.. పైకి క‌నిపిస్తున్న కూట‌మి అయినా.. అంతః శ‌త్రువు.. మా త్రం ష‌ర్మిలేన‌న్న‌ది వైసీపీ గుర్తించిన తాజా స‌త్యం.

మైకు ప‌ట్టుకుంటే.. జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌ల తూటాలు. మీడియా ముందుకు వ‌స్తే.. వ‌దిలి పెట్టకుండా.. ఏకుడే ఏకుడు! గ‌తం-వ‌ర్త‌మానం.. అన్న తేడా లేదు.. మొత్తంగా 'క‌లిపి కొట్ట‌రా కావేటి రంగా!' అన్న‌ట్టుగా కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల‌.. త‌న అన్న వైఎస్ జ‌గ‌న్ పాల‌న‌ను ఏకేస్తున్న విష‌యం తెలిసిందే. ఎన్నిక‌ల‌కు ముందు అధికారంలో ఉన్నాడు.. కాబ‌ట్టి.. ఏకేశారంటే అర్థం ఉంది. కానీ, ఎన్నిక‌లు అయిపోయి.. 11 స్థానాల‌కు ప‌రిమిత‌మైన త‌ర్వాత కూడా.. ష‌ర్మిల వ‌దిలి పెట్ట‌డం లేదు.

ఢిల్లీలో ధ‌ర్నా- అని జ‌గ‌న్ అంటే.. ఎవ‌రి కోసం చేస్తున్న‌వ్‌. వివేకాను హ‌త్య చేసిన‌ప్పుడు ఎందుకు చేయలే. ప్ర‌త్యేక హోదా కోసం ఎందుకు చేయ‌లే. పోలవ‌రం నిధుల కోసం ఎందుకు చేయ‌లే.. అంటూ.. అధికార ప‌క్షం కూట‌మి పార్టీల నాయ‌కుల కంటే కూడా.. దూకుడుగా అన్న‌పైకి మాట‌ల తూటాలు పేల్చేసింది ష‌ర్మిల‌క్క‌!! నిజానికి కూట‌మి పార్టీల నేతలు చేసే విమ‌ర్శ‌ల‌కైనా స‌మాధానం చెప్పుకోవ‌చ్చేమో.. కౌంట‌ర్ ఇచ్చుకోవ‌చ్చేమో.. కానీ, ష‌ర్మిల కౌంట‌ర్ ఇచ్చేందుకు కూడా స్కోప్ లేకుండా వాయించేస్తోంది!!.

మ‌రి ఇప్పుడు ఏం చేయాలి? అస‌లు శ‌త్రువు.. పైకి క‌నిపిస్తున్న కూట‌మి అయినా.. అంతః శ‌త్రువు.. మా త్రం ష‌ర్మిలేన‌న్న‌ది వైసీపీ గుర్తించిన తాజా స‌త్యం. అందుకే చాలా వ్యూహాత్మ‌కంగా అడుగులు వేసి.. ఉభ య కుశ‌లోప‌రి అన్న‌ట్టుగా జ‌గ‌న్ వ్య‌వ‌హ‌రించి ఉంటార‌ని.. జాతీయ మీడియా అనుమానం వ్య‌క్తం చేస్తోం ది. దీనికి సంబంధించి ఒక‌రిద్ద‌రు జాతీయ విశ్లేష‌కులు చేసిన వ్యాఖ్య‌ల‌ను గ‌మ‌నిస్తే.. ఢిల్లీలో ధ‌ర్నా చేసిన జ‌గ‌న్‌.. త‌న ధ‌ర్నా కార్య‌క్ర‌మానికి కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూట‌మి పార్టీల‌ను ఆహ్వానించారు.

వారంతా వ‌చ్చారు. జ‌గ‌న్‌కు ద‌న్నుగా నిలిచారు. ఇలా.. చేయడం వెనుక జ‌గ‌న్ వ్యూహం.. 'అవ‌స‌ర‌మైతే.. నేను మీవెంటే' అన్న సంకేతాలు ఇవ్వ‌డం. అంటే.. రేపు మోడీని దీటుగా ఇండియా కూట‌మి ఎదుర్కొనాల్సి వ‌స్తే.. ప‌రోక్షంగానో.. ప్ర‌త్య‌క్షంగానో.. జ‌గ‌న్‌వారికి స‌హ‌క‌రించే అవ‌కాశం ఉంటుంద‌న్న సంకేతాల‌ను వైసీపీ అధినేత పంపించార‌న్న‌ది జాతీయ విశ్లేష‌కులు చెబుతున్న మాట‌. ద‌క్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యంగా ఏపీలో ఎన్డీయూ కూట‌మి అధికారంలో ఉంది. కాబ‌ట్టి చంద్ర‌బాబు ఎలానూ త‌మ‌తో క‌లిసివ‌చ్చే అవ‌కాశం లేదు.

సో.. ఎటూ కాకుండా.. త‌ట‌స్థంగా ఉన్న‌ది జ‌గ‌న్ ఒక్క‌రే. కాబ‌ట్టి.. ఆయ‌న‌కు మ‌ద్ద‌తు ఇవ్వ‌డం ద్వారా.. రేపు 'ఏదైనా' అవ‌స‌రం ఏర్ప‌డితే.. ఆయ‌న‌ను వినియోగించుకునేందుకు ఇండియా కూట‌మి నాయ‌కులు వ్యూహాత్మ‌కంగా అడుగులు వేశార‌ని అంటున్నారు. ఇక‌, ఇక్క‌డ జ‌గ‌న్ ఆశిస్తున్న‌ది.. త‌న చేతుల‌కు మ‌ట్టి అంట‌కుండా.. ఇండియా కూట‌మిలో త‌న‌ను స‌మ‌ర్ధించేందుకు వ‌చ్చిన వారి ద్వారా కాంగ్రెస్‌ను లైన్‌లో పెట్టి.. ఏపీలో ష‌ర్మిల దూకుడును త‌గ్గించే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌న్న‌ది జాతీయ విశ్లేష‌కుల అంచ‌నా.

అంటే.. ఇక్క‌డ నేరుగా జ‌గ‌న్ జోక్యం ఉండ‌దు. ఇండియా కూట‌మి పార్టీలు ఎలానూ త‌న‌కు మ‌ద్ద‌తు ఇచ్చాయి కాబ‌ట్టి.. రేపు వారికి కూడా ఆయ‌న మ‌ద్ద‌తు ఉంటుంద‌నే సంకేతాలు ఇచ్చారు. ఇదేస‌మ‌యంలో ష‌ర్మిల‌ను ఆయ‌న వారితోనే(ఇండియా కూట‌మి పార్టీల కీల‌క నేత‌ల‌తో) కాంగ్రెస్‌కు చెప్పించి.. ష‌ర్మిల‌ను క‌ట్ట‌డి చేసే వ్యూహం ఉంద‌న్న‌ది వీరి మాట‌. ఇదే క‌నుక జ‌రిగితే.. కాంగ్రెస్‌కు కూడా.. ఇప్ప‌టికిప్పుడు త‌మ‌కు మ‌ద్ద‌తిచ్చే త‌ట‌స్థ పార్టీల అవ‌స‌రం ఉంది కాబ‌ట్టి.. మిత్ర ప‌క్షాల ద్వారా..జ‌గ‌న్ చేయించే ప్ర‌య‌త్నానికి స‌మ్మ‌తించినా.. స‌మ్మ‌తించ‌వ‌చ్చు.. త‌ద్వారా ష‌ర్మిల దూకుడును క‌ట్ట‌డి చేయొచ్చు. మ‌రి ఈ విశ్లేష‌ణ నిజ‌మేనా? భ‌విష్య‌త్తులో అలానే జ‌రుగుతుందా? జ‌గ‌న్ వేసి అడుగు ఫలించి.. చెల్లి మెల్లిమెల్లిగా వెనక్కు త‌గ్గుతుందా? అనేది చూడాలి.

బడ్జెట్లో కార్శికుల, ఉద్యోగుల, పెన్షనర్ల సంక్షేమం మాటేది జులై 30 న హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద భారీ రాష్ట్రస్థాయి మౌన దీక్ష

విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యతనివ్వాలి 

కేటాయించిన బడ్జెట్ ను ఖర్చు చేయాలి 

పెండింగ్ డీఏలు, పీఆర్సీ బకాయిల విడుదల, నగదు రహిత ఆరోగ్య పధకంలో మార్పులు తదితరాల పరిష్కారంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ జులై 30 న హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద రాష్ట్ర పెన్షనర్ల ఐకాస ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి భారీ మౌన దీక్ష నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ఆల్‌ పెన్షనర్స్‌ అండ్‌ రిటైర్డ్‌ పర్సన్స్‌ అసోసీయేషన్‌ (టాప్రా) రాష్ట్ర కార్యదర్శి వి. కృష్ణ మోహన్ వెల్లడించారు.

 

ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు పెండింగ్ లోనున్న నాలుగు డీఏల చెల్లింపు, 2023 జులై ఒకటో తేదీ నుంచి అమలు కావాల్సిన రెండో పీఆర్సీ గురించి, ఫిట్ మెంట్ గురించి బడ్జెట్లో ప్రకటిస్తుందని ఆశించినప్పటికీ భంగపాటు ఎదురైంది. జీపీఎఫ్, మెడికల్ రీయింబర్స్మెంట్ తదితర బిల్లులు ఈ- కుబేర్ లో పెండింగ్ లో ఉన్నాయి.

అధికారంలోకి వస్తే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) ను రద్దు చేసి పాత పెన్షన్ స్కీమ్ (ఓపీఎస్) ను పునరుద్ధరిస్తామంటూ మ్యానిఫెస్టోల్లో ప్రకటించిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు కానీ, కేంద్రంలో 01.01.2004 నుంచి నూతన పెన్షన్ స్కీమ్ (ఎన్ పీఎస్) ను అమలు పరచి వృద్ధాప్య భద్రత లేకుండా చేసిన బిజెపి ప్రభుత్వం కానీ తమ బడ్జెట్ ప్రసంగాల్లో ఓపీఎస్ ను అమలు చేస్తామనే ప్రస్తావన కూడా లేదు. మొదటి తారీఖున జీతాలు, పెన్షన్లు ఇస్తున్నామనే మాట తప్పి ఇతర సమస్యలను బడ్జెట్లో ప్రస్తావించక పోవడం ఆందోళనకరం.

కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ ప్రస్తావన కానీ, ఉపాధి కల్పన, రిక్రూట్మెంట్ పాలసీ విధానాన్ని కానీ ప్రస్తావించలేదు. బీడీ కార్మికులకు "చేయూత" జీవిత బీమా ఈఎస్ఐ, అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు, దీనికి బడ్జెట్లో కేటాయింపులు, ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు, స్వీగ్గి జోమాటో వంటి గిగ్ కార్మికులకు సామాజిక భద్రత కల్పిస్తూ రాజస్థాన్ తరహా చట్టాన్ని మ్యానిఫెస్టోలో వాగ్దానం చేసిన విషయం మర్చిపోయినట్లున్నారు. చిరు వ్యాపారులు, ఫుట్ పాత్ వ్యాపారులకు వడ్డీ లేని రుణ సదుపాయం కల్పిస్తామన్న హామీని గాలి కొదిలేసారు.

పెరిగిన ధరల కనుగుణంగా కనీస వేతనాల జి.వోల సవరణ ప్రస్తావనే లేదు. అభయ హస్తం పేరిట వీధి వ్యాపారులకు ప్రత్యేక జోన్స్ ఏర్పాటు, హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు, హెల్త్ కార్డులతో సహా ప్రతి మండలంలో "హమాలీ నగర్" ఏర్పాటు చేస్తామని చెప్పినా వాటి గురించి ప్రస్తావనే లేదు.

మిషన్ భగీరథ కార్మికులకు కనీస వేతనాలు, గ్రామ పంచాయతీ కార్మికుల, మధ్యాహ్న భోజన కార్మికుల బకాయి వేతనాలు చెల్లింపునకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పథకాల్లో పని చేస్తున్న స్కీం వర్కర్లకు కనీస వేతనాలు, చట్టబద్ధ హక్కులు కల్పించే చర్యలే లేవు.

విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యతనివ్వాలని, కేటాయించిన బడ్జెట్ ను ఖర్చు చేయాలని, రైతు భరోసా కౌలు రైతులకు కూడా ఇవ్వాలని, వాగ్ధానాలు అమలు పరుస్తూ బడ్జెట్లో మార్పులు చేయాలని ఉద్యోగుల, ఆఫీసర్ల, పెన్షనర్ల జాతీయ నేత వి. కృష్ణ మోహన్ ఆర్థిక మంత్రికి విజ్ఞప్తి చేశారు.

కేజ్రీవాల్‌, కవిత జ్యుడీషియల్‌ కస్టడీ మళ్లీ పొడిగింపు

మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ సీఎం అర్వింద్‌ కేజ్రీవాల్‌, మాజీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్‌ కస్టడీని ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టు మరోసారి పొడిగించింది.

మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ సీఎం అర్వింద్‌ కేజ్రీవాల్‌, మాజీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్‌ కస్టడీని ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టు మరోసారి పొడిగించింది.

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దాఖలు చేసిన మనీ లాండరింగ్‌ కేసులో కేజ్రీవాల్‌ కస్టడీని ఈనెల 31 వరకు పొడిగించగా..

సీబీఐ దాఖలు చేసిన అవినీతి కేసులో ఆగస్టు 8వ తేదీ వరకు పొడిగిస్తూ న్యాయమూర్తి కావేరి బవేజా గురువారం ఆదేశాలు జారీ చేశారు.

అలాగే సిసోడియా, కవితతో పాటు ఇతర నిందితుల జ్యుడీషియల్‌ కస్టడీని కూడా ఈ నెల 31 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.

తిహాడ్‌ జైలు నుంచే వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిందితులను కోర్టు ముందు హాజరుపరిచారు.

బ్రిడ్జి కూల్చివేత.. ఆ రూట్‌లో ఏళ్లపాటు ట్రాఫిక్ ఆంక్షలు

నగరంలోని దశాబ్దాల నాటి బ్రిడ్జిని కూల్చేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. ఆ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తీర్చేందుకు ఆ చారిత్రాత్మక బ్రిడ్జిని కూలగొట్టి.. దాని స్థానంలో అత్యాధునిక బ్రిడ్జిని నిర్మించేందుకు ప్రణాళికలు చేస్తున్నారు. అయితే ఈ బ్రిడ్జిని కూల్చి.. కొత్త బ్రిడ్జి ప్రారంభించేందుకు 2 ఏళ్ల సమయం పట్టనుంది.

ఈ క్రమంలోనే ఆ ప్రాంతంలో 2 ఏళ్ల పాటు ట్రాఫిక్‌ను ఆంక్షలు విధించనున్నారు. అంతేకాకుండా నో పార్కింగ్ నిబంధనలు కూడా అమలు చేయనున్నారు. ఇంతకీ ఆ బ్రిడ్జి ఏది. ఏ నగరంలో ఉందో ఈ స్టోరీలో చూద్దాం.

ప్రస్తుతం దేశంలో నగరాల్లో జనాభా రోజురోజుకూ పెరిగిపోతోంది. ఇక వాహనాల సంఖ్య కూడా గణనీయంగా పెరిగిపోతుండటంతో.. ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతోంది. నగరాల్లో ట్రాఫిక్‌ సమస్యను తీర్చేందుకు ప్రభుత్వాలు ఫ్లై ఓవర్లు, అండర్ పాస్‌లు నిర్మిస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే పాత, శిథిలావస్థకు చేరుకున్న బ్రిడ్జిలను కూల్చివేసి.. వాటి స్థానంలో కొత్త బ్రిడ్జిలను నిర్మిస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే మహారాష్ట్రలోని ముంబై మహా నగరంలో మరో కీలక ఫ్లై ఓవర్ నిర్మించనున్నారు. దీని కోసం ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన బ్రిడ్జిని కూల్చివేయనున్నారు. ఇందుకోసం ఆ మార్గంలో 2 ఏళ్ల పాటు ట్రాఫిక్ మళ్లించనున్నారు. అదే సియోన్ రోడ్ ఓవర్ బ్రిడ్జ్.

ఇప్పటికే ఈ సియోన్ ఆర్వోబీపైకి భారీ వాహనాలను అనుమతించకుండా అధికారులు నిషేధం విధించారు. కేవలం తేలికపాటి వాహనాలకు మాత్రమే ఈ సియోన్ ఆర్వోబీపైకి ఎక్కేందుకు అనుమతి ఉంది. వచ్చే 3 ఏళ్లలో సెంట్రల్ ముంబైలోని ట్రాఫిక్ సమస్యలను మార్చే ప్రణాళికల్లో భాగంగా ముంబై ట్రాఫిక్ పోలీసులు.. చారిత్రక సియోన్ రోడ్ ఓవర్ బ్రిడ్జిని కూల్చివేసి..

దాని స్థానంలో మరో హైటెక్ వంతెనను నిర్మించనున్నట్లు ప్రకటించారు. దీనికోసం జులై 31 వ తేదీ అర్ధరాత్రి నుంచి సియోన్ రోడ్ ఓవర్ బ్రిడ్జిని మూసివేయనుండగా.. 2026 జూలై 31వ తేదీ వరకు కొత్త ప్రాజెక్టును ప్రారంభించనున్నట్లు తెలిపారు.

ఈ సియోన్ రోడ్ ఓవర్ బ్రిడ్జ్‌కు ముంబై నగరంలో అధిక ప్రాధాన్యం ఉంటుంది. ఎందుకంటే మంబైలోని సియోన్ తూర్పు, సియోన్ పశ్చిమ ప్రాంతాలను కలిపే కీలక బ్రిడ్జ్. ఇక వచ్చే నెల 1వ తేదీ నుంచి సియోన్ రోడ్ ఓవర్ బ్రిడ్జి కూల్చివేత ప్రక్రియ ప్రారంభం అవుతుందని ముంబై ట్రాఫిక్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఈ క్రమంలోనే ఆ మార్గంలో వెళ్లే వాహనాలన్నింటినీ 2 ఏళ్ల పాటు దారి మళ్లించనున్నట్లు వెల్లడించారు.

మరోవైపు.. ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ఆయా మార్గాల్లో నో పార్కింగ్ ఆంక్షలు కూడా విధించారు. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే.. ముంబై ట్రాఫిక్ సమస్యలకు కొంత పరిష్కారం దొరుకుతుందని.. నగరంలో కీలకమైన తూర్పు-పశ్చిమ ప్రాంతాలకు మరింత మెరుగైన రవాణా సౌకర్యం ఉంటుందని చెప్పారు.

రైతు భరోసాపై తుమ్మల కీలక వ్యాఖ్యలు..!

రైతు భరోసాపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కీలక వ్యాఖ్యలు చేశారు. రైతు భరోసా నిధులు త్వరలోనే విడుదల చేస్తామని చెప్పారు. అయితే రైతు భరోసా ఎవరికి ఇవ్వాలనే దానిపై మేధావులు, రైతుల అభిప్రాయం తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

అన్ని జిల్లాల నుంచి రైతు అభిప్రాయం సేకరించిన తర్వాత రైతు భరోసా మార్గదర్శకాలను రూపొందిస్తామని చెప్పారు. అంతుకు ముందు అసెంబ్లీ కూడా రైతు భరోసా పథకం ఎలా ఉండాలో చర్చించిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని వివరించారు.

రైతు భరోసాపై మార్గదర్శకాలు విడుదల చేసిన తర్వాత అన్నదాతల ఖాతాల్లో నిధులు జమ చేస్తామని తెలిపారు. గత ప్రభుత్వం ప్రజాప్రతినిధులు, సినీ స్టార్లకు, బడా వ్యాపారవేత్తలకు రైతు బంధు ఇచ్చారని. ఇలా రూ.25 వేల కోట్లు ఇచ్చారని శాసన మండలిలో తుమ్మల చెప్పారు. ప్రభుత్వానికి ఎంత ఇబ్బంది ఉన్నా.. రుణ మాఫీ చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే రూ. లక్ష లోపు రుణ మాపీ చేసినట్లు ప్రకటించారు. ఆగస్ట్ 15 లోపు రూ.2 లక్షల వరకు రుణ మాఫీ చేస్తామని చెప్పారు.

కాగా ఈసారి తెలంగాణ బడ్జెట్ లో వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఈ బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి రూ. 72 వేల 659 కోట్లు కేటాయించారు.

ఇందులో రైతు భరోసా కింద ఎకరానికి రూ. 15 వేలు, రూ .2 లక్షల రుణమాఫీ కోసం రూ.32 వేల కోట్లు కేటాయించారు. యూనివర్సిటీల కోసం రూ.500 కోట్లు, ఆరోగ్య శ్రీ లిమిట్ రూ.5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచారు. ఆర్టీసీలో ఫ్రీ జర్నీకి రూ.2,351 కోట్లు, రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల 50 వేల ఇండ్ల నిర్మాణం కోసం కూడా నిధులు కేటాయించారు.

MMTS కు రూ. 50 కోట్లు, HMDA కు రూ. 500 కోట్లు, రోడ్లు భవనాల శాఖకు రూ. 5 వేల 790 కోట్లు, GHMC కోసం రూ. 3 వేల 65 కోట్లు, విద్యా రంగానికి రూ. 21 వేల 292 కోట్లు, హోం శాఖకు రూ. 9 వేల 564 కోట్లు, పరిశ్రమల శాఖకు రూ. 2 వేల 762 కోట్లు, ఇరిగేషన్ శాఖకు రూ. 22 వేల 301 కోట్లు, విద్యుత్ శాఖకు రూ. 16 వేల 410 కోట్లు, అడవులు పర్యవరణ శాఖకు రూ. 1, 064 కోట్లు, IT రంగానికి రూ. 774 కోట్లు కేటాయించగా.. వైద్య ఆరోగ్య శాఖ రూ. 11 వేల 468 కోట్లు SC సంక్షేమం కోసం రూ. 33 వేల 124 కోట్లు కేటాయించారు. రిజినల్ రింగ్ రోడ్డునిర్మాణం కోసం రూ. 1525 కోట్లు, స్త్రీ శిశు సంక్షేమం కోసం రూ. 2 వేల 736 కోట్లు స్త్రీ శిశు సంక్షేమం కోసం రూ. 2 వేల 736 కోట్లు కేటాయించారు.

ప్రతిపక్ష నేతగా తొలిసారి అసెంబ్లీకి కేసీఆర్

మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలంగాణ అసెంబ్లీకి చేరుకున్నారు. గురువారం ఉదయం అసెంబ్లీకి వచ్చిన ఆయనకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పూలబొకే ఇచ్చి స్వాగతం పలికారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా తొలిసారి అసెంబ్లీకి కేసీఆర్ హాజరయ్యారు. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ గత ఎన్నికల్లో ఓటిమిని చవిచూసింది.

మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (Former CM KCR) తెలంగాణ అసెంబ్లీకి (Telangana Assembly) వచ్చారు. గురువారం ఉదయం అసెంబ్లీకి వచ్చిన ఆయనకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పూలబొకే ఇచ్చి స్వాగతం పలికారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా తొలిసారి అసెంబ్లీకి కేసీఆర్ హాజరయ్యారు. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ గత ఎన్నికల్లో ఓటిమిని చవిచూసింది. అనూహ్యంగా కాంగ్రెస్ గెలుపొందడం, రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించడం త్వరత్వరగా జరిగిపోయాయి.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన తొలి అసెంబ్లీ సమావేశాలకు ప్రధాన ప్రతిపక్ష నేత అయిన కేసీఆర్ గైర్హాజరయ్యారు. అయితే ఫలితాల తర్వాత ఫామ్‌హౌస్‌లోని బాత్రూమ్ కాలు జారిపడటంతో కేసీఆర్ తుంటి ఎముకకు శస్త్ర చికిత్స జరిగింది. దీంతో ఆయన కొంతకాలం విశ్రాంతి తీసుకున్నారు.

ఈ కారణంగానే ఆయన సమావేశాలకు హాజరుకావడం లేదని బీఆర్‌ఎస్ నేతలు చెప్పుకుంటూ వచ్చారు. ఇక కొద్దిగా కోలుకున్న తర్వాత ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసేందుకు కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు.

అయితే ఈ నెల 23 నుంచి మొదలైన అసెంబ్లీ సమావేశాలకు కూడా కేసీఆర్ గైర్హాజరయ్యారు. కానీ రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు కావడంతో కేసీఆర్ ఖచ్చితంగా వస్తారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. అసలు కేసీఆర్ సమావేశాలకు హాజరు అవుతారా?... లేదా? అనే దానిపై నిన్న మొన్నటి వరకు సందిగ్ధత నెలకొంది. చివరకు అనుకున్న విధంగానే కేసీఆర్ నేడు అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు

ఈనెల 23 నుంచి అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. నేడు అసెంబ్లీలో ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఈ క్రమంలో సమావేశాలు మొదలైన తర్వాత మూడవ రోజు కేసీఆర్ సభకు హాజరయ్యారు. అయితే... బడ్జెట్ ప్రవేశపెట్టే ఒక్కరోజు మాత్రమే కేసీఆర్ సభకు వస్తారని.. తరువాత సభకు దూరంగా ఉండనన్నట్లు సమాచారం. మరి మరికొద్దిరోజుల పాటు జరిగే సమావేశాల్లో మాజీ ముఖ్యమంత్రి పాల్గొంటారా?.. లేరా..? అనేది వేచి చూడాలి.

కాగా... మరికాసేపట్లో కాంగ్రెస్ ప్రభుత్వం 2024-25 బడ్జెట్‌ను తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. డిప్యూటీ సీఎం, రాష్ట్ర ఆర్థిక మంత్రి బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే శాసనసభలో ప్రవేశపెట్టనున్న 2024-25 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ప్రతులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అందజేశారు. వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు డిప్యూటీ సీఎం భట్టి నివాసం ప్రజాభవన్‌లో అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి ఆశీస్సులను భట్టి దంపతులు తీసుకున్నారు. అలాగే రూ.2 లక్షల 95 వేల కోట్ల బడ్జెట్‌కు తెలంగాణ మంత్రి వర్గం ఆమోద ముద్ర వేసింది.

దేశంలో ఈ వ్యర్థాలు అధికంగా ఉత్పత్తి చేసే తొలి 3 రాష్ట్రాల్లో ఏపీ లేదు: పవన్‌

దేశంలో ఈ వ్యర్థాలు అధికంగా ఉత్పత్తి చేసే తొలి 3 రాష్ట్రాల్లో ఏపీ లేదని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ అన్నారు. వీటిని సమర్థంగా తొలగింపునకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ఇందులో భాగంగా ఏపీలో పలు చోట్ల రీసైకిల్ యూనిట్లు నెలకొల్పడం జరిగిందని చెప్పారు.

రాబోయే రోజుల్లో ప్రతి జిల్లాలోనూ ఈ యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్లు పవన్ వివరించారు.

శాసనసమండలి సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా మండలి సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానమిచ్చారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో ఈ వ్యర్థాల తొలగింపునకు తీసుకున్న చర్యలపై ఎమ్మెల్సీలు ప్రశ్నలు వేశారు. వీటికి ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సమాధానం ఇచ్చారు. రాబోయే రోజుల్లో ప్రతి జిల్లాలోనూ ఈ వ్యర్థాల రీ సైక్లింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తామని పవన్​ తెలిపారు. ప్రైవేట్ భాగస్వామ్యంతో వీటిని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.

దేశంలో ఈ వ్యర్థాలు అధికంగా ఉత్పత్తి చేసే మొదటి మూడు రాష్ట్రాల్లో ఏపీ లేదని పవన్ కల్యాణ్ తెలిపారు. వీటిని సమర్థంగా తొలగించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఈ వ్యర్థాలను సేకరించి రీ సైక్లింగ్ చేసేందుకు అని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్​లో పలు చోట్ల రీ సైకిల్​ యూనిట్లు నెలకొల్పడం జరిగిందన్నారు. రాబోయే రోజుల్లో ప్రతి జిల్లాలోనూ వీటిని ఏర్పాటు చేస్తామని పవన్ కల్యాణ్ వెల్లడించారు.

మరోవైపు మోనజైట్, సిలికాన్‌ను ప్రైవేట్ ఏజెన్సీలకు అక్రమంగా విక్రయంపై ఎమ్మెల్సీలు ప్రశ్నలు వేశారు. వీటికి గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సమాధానమిచ్చారు.

గార, భీమిలి బీచ్‌లో అక్రమ తవ్వకాలు జరిగిన మాట వాస్తవమేనని కొల్లు రవీంద్ర చెప్పారు. ప్రైవేట్ ఏజెన్సీలకు కట్టబెట్టి తవ్వకాలు జరిపి దోచుకున్నారని తెలిపారు. గోపాలకృష్ణ ద్వివేది, వెంకటరెడ్డి స్వయంగా వెళ్లి ఒప్పందాలు చేసుకున్నారని ఆయన ఆరోపించారు.