ఓ.పి టికెట్ పై ఆధార్ లింక్ ఓ.టీ.పిని రద్దు పరిచి సత్వరమే రోగులకు వైద్యం అందించాలి -సామ్రాట్ కే.బి.మధు డిమాండ్..
ఓ.పి టికెట్ పై ఆధార్ లింక్ ఓ.టీ.పిని రద్దు పరిచి సత్వరమే రోగులకు వైద్యం అందించాలి -సామ్రాట్ కే.బి.మధు డిమాండ్
ఉమ్మడి అనంతపురం జిల్లాలో ని ప్రభుత్వ సర్వ జన ఆసుపత్రిలో రోజు వేలాది మంది పేద ప్రజలు తమ ఆరోగ్యం మెరుగు పర్చుకోవడా నికి చికిత్స నిమిత్తం వస్తున్న రోగులకు ఓ.పి టికెట్ తీసుకోవడం లో అనేక కష్టాలకు గురి కావడమే కాకుండా ఆధార్ నంబర్ లింకు తో ఓ.టీ.పి తోసమయం వృతా చేస్తున్నారు ఈ సందర్బంగా ఓ.పి సమయం పూర్తి అయి డాక్టర్లు రౌండ్స్ కు వెళ్లి వార్డులో అడ్మిట్ లో ఉన్నరోగులకు వైద్యం చేయడానికి వెళ్లి పోతారు ఈ సమయంలో ఓ.పి విభాగం లో చికిత్స ఆలస్యమై రోగులు వైద్యం అందాకా అనేక ఇబ్బందులకు గురి అవుతున్నా రు ఈ సమయంలో రోగులు అత్యవసర చికిత్స విభాగంకు వెళ్లి తే అక్కడ పరిస్థితి వర్ణనాతీతం అత్యవసర పరిస్థితుల్లో వచ్చిన రోగులకు వైద్యం అందించడం లో నిర్లక్ష్యం చూపుతున్న సిబ్బంది పైన చర్యలు తీసుకోవాలని అనంతపురం గవర్నమెంట్ హాస్పిటల్ లో ఒక వైపు ఓ. టీ. పి తో ఇబ్బందులు పడి ఆతరువాత వైద్యం విద్యంకోసం నా నాతంటాలు పడవలసి వున్నదని వెంటనే ఓ. టీ. పి ఆధార్ లింకు రద్దు పరచాలని సత్వరమే ఓ. టీ. పి టికెట్ అందజేసి సత్వరమే రోగులకు వైద్యం అందె విదంగా చూడాలని అదే విదంగా అత్యవసర చికిత్స విభాగంలో వైద్యం సేవలు అందించడానికి ఎక్కువ మంది డాక్టర్లను మరియు సిబ్బంది తో పాటు ఎం.ఎన్.ఓ లను ఉంచాలని ఎం.ఆర్.పి.యస్ ఆధ్వర్యంలో సూపర్నెంట్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది అదేవిధంగా అత్యవసరంగా వచ్చిన రోగులకు స్ట్రక్చర్ లేక ఎమర్జెన్సీ విభాగం నుండి సిటీ స్కాన్ కు గాని లేదా ఎక్స్రే లకు గాని తీసుకెళ్లాలనుకుంటే చాలాసేపు వేచి ఉండాల్సి వస్తుంది, అలాగే వైద్యం కోసం వచ్చిన రోగులను స్టాంపు కోసమని సంతకాల కోసమని చీటికిమాటికి తిప్పుతున్నారు. అత్యవసరంగా యాక్సిడెంట్లు అయి గాయాలతో వచ్చిన రోగులను కనీసం డ్రెస్సింగ్ చేయడానికి కూడా తగిన సిబ్బంది ఆ విభాగంలో లేరు. ఎమర్జెన్సీగా వచ్చిన రోగులను సరైన సమయానికి వైద్యం అందించడంలో సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారు. అలాగే ప్రధానంగా ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యం కోసం ఎంతోమంది వస్తుంటారు అలాంటి చోట కనీస పరిశుభ్రత లేకుండా అలాగే దుర్వాసన వస్తున్న కూడా అ వార్డుని ఎప్పటి కప్పుడు శుభ్రంగా ఉంచడం లేదు. ఇవి అన్ని దృష్టిలో ఉంచుకొని ఎమర్జెన్సీ వార్డులో రోగుల వైద్యం కోసం బెడ్లు, అలాగే రోగులను తరలించడా నికి స్ట్రక్చర్లు వార్డ్ బాయ్స్ మరియు అక్కడ సిబ్బందిని పెంచాలని అత్యవసరంలో వచ్చిన రోగులను సరైన సమయానికి చికిత్స అందించే విధంగా చూడాలని Mrps, Msp కమిటీ ద్వారా సర్వజన ఆసుపత్రి సూపరేంటెండెంట్ గారికి మెమోరాండం ఇచ్చి త్వరగా రోగులకి చికిత్స అందె విదంగా చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సామ్రాట్ కే. బి. మధు మాదిగ యం.ఆర్. పి.యస్, యం.యస్.పి ఉమ్మడి జిల్లా అధ్యక్షులు, Msp సీనియర్ నాయకులు నిషార్ అహమ్మద్ మహాజన్, యం.ఆర్.పి.యస్.జిల్లా ప్రధాన కార్యదర్శి రేకులకుంట రామాంజి,సీనియర్ నాయకు లు రేకులకుంట వెంకటేష్, బి. కే.యస్,యం.ఆర్.పి.యస్ మండల అధ్యక్షులు రెడ్డిపల్లి నాగరాజు తదితరులు పాల్గొన్నారు ఇట్లు సామాజికఉద్యమవందనాలతో నిషార్ అహమ్మద్ మహాజన్ ఎం.యస్.పి సీనియర్ నాయకులు
Jul 25 2024, 08:27