అనంతపురం జిల్లా నూతన ఎస్పీగా శ్రీ కె.వి.మురళీకృష్ణ IPS గారు పదవీ బాధ్యతల స్వీకరణ..

అనంతపురం జిల్లా నూతన ఎస్పీగా శ్రీ కె.వి. మురళీకృష్ణ IPS గారు జిల్లా పోలీసు కార్యాలయంలోని తన ఛేంబర్లో పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈసందర్భంగా మీడియాతో మాట్లాడుతూ అనకాపల్లి ఎస్పీగా 15 నెలలు పనిచేశాను. అక్కడ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేలా పటిష్ట చర్యలు చేపట్టాం. సాధారణ బదిలీలలో భాగంగా అనంతపురం జిల్లా ఎస్పీగా నియమించారు. ప్రతిష్టాత్మకమైన అనంతపురం జిల్లా ఎస్పీగా బాధ్యతలు తీసుకోవడం ఆనందంగా ఉంది. ఈ జిల్లా ఎస్పీగా నాకు అవకాశమిచ్చిన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి మరియు రాష్ట్ర డిజిపి గారికి ధన్యవాదాలు * ప్రభుత్వ ప్రాధాన్యతలలో ఒకటైన బేసిక్ పోలీసింగ్ లో భాగమైన అంశాలపై దృష్టిపెడతాం. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక పట్ల ప్రత్యేక చొరవ చూపి ప్రజలకు మరింత సేవలు అందేలా కార్యాచరణ రూపొందిస్తాం. గంజాయి నియంత్రణపై చట్టపరమైన గట్టి చర్యలు తీసుకుంటాం. గంజాయి అక్రమ రవాణాదారులు, విక్రేతలు, వినియోగదారులను గుర్తించి చట్టపరంగా కఠినంగా వ్యవహరిస్తాం. జిల్లా ప్రశాంతంగా ఉంచేందుకు అన్ని వర్గాల ప్రజలు సహకారం తీసుకుంటాం. శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా పని చేస్తాం. నిష్పక్షపాతంగా, చట్టపరంగా వ్యవహరిస్తాం. ఎవరైనా విఘాతం కల్గిస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయి. మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల నియంత్రణపై దృష్టి సారిస్తాం. క్షేత్రస్థాయిలో మహిళా సమస్యలను గుర్తించి తగు పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. ముఖ్యంగా మహిళలు, చిన్నారుల పట్ల అనుచితంగా ప్రవర్తించిన వాళ్లకు... వాళ్ల యెడల నేరాలకు పాల్పడిన వాళ్లను కఠినంగా శిక్షించేలా చర్యలు చేపట్టడం జరుగుతుంది. జిల్లాలో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు స్వచ్ఛంధ సంస్థల ప్రతినిధులు, ప్రజా ప్రతినిధులు, కళాశాలల యజమానులు, పరిశ్రమల యజమానుల సహకారం తీసుకుంటాం. జిల్లాలో పని చేస్తున్న హోంగార్డుల నుండీ పోలీసు సిబ్బంది, అధికారులు మరియు వారి కుటుంబాల సంక్షేమం పట్ల ప్రత్యేక దృష్టి సారిస్తాం. పోలీసులకు అవసరమైన సంక్షేమ చర్యలను తీసుకుంటాం. ప్రజలతో మమేకమై మెరుగైన సేవలు అందిస్తూ పోలీసుశాఖ పట్ల విశ్వాసాన్ని, ప్రతిష్టను పెంపొందించేందుకు కృషి చేస్తాం. పోలీసులు, మీడియా కలిసి సుహృద్భావ వాతావరణంలో ప్రజల శ్రేయస్సు కోసం పని చేస్తాం..

బుక్కరాయసముద్రం మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు మొక్కలు నాటిన జిల్లా పరిషత్ CEO మండల ఎంపీపీ..
అనంతపురం జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి శ్రీమతి వైఖోమ్ నిదియా దేవి ఐఏఎస్ గారు బుక్కరాయసముద్రం మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు "హరిత అనంత" కార్యక్రమం క్రింద మొక్కలు నాటించి ప్రతిజ్ఞ చేయించి ప్రతి మొక్క ను సంరక్షించడానికి ప్రతి ఒక్కరూ వారు నాటిన మొక్క ను అడాప్ట్ చేసుకోవాలని తెలిపారు.ఈ కార్య్రమంలో ఎంపీపీ శ్రీమతి దాసరి సునీత గారు, ఎంపిడిఓ శ్రీమతి యం. శోభారాణి గారు EORD APO s. ,AO Senior assistant. Typist ఉపాధి హామీ సిబ్బంది తో పాటు వెలుగు సిబ్బంది అందరూ పాల్గొన్నారు
అర్హత కలిగిన విభిన్న ప్రతిభావంతులకు కృత్రిమ కాళ్లు అందజేయాలి.. జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్..
అర్హత కలిగిన విభిన్న ప్రతిభావంతులకు కృత్రిమ కాళ్లు అందజేయాలి.. జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్..  ముగ్గురు విభిన్న ప్రతిభావంతులకు కృత్రిమ కాళ్లు పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్* అనంతపురం, జులై 15 : - *అనంతపురం కలెక్టరేట్ లోని రెవెన్యూ భవనంలో సోమవారం నిర్వహించిన "ప్రజా సమస్యల పరిష్కార వేదిక" కార్యక్రమంలో ముగ్గురు విభిన్న ప్రతిభావంతులకు కృత్రిమ కాళ్ల (ఆర్టిఫిషియల్ లెగ్స్)ను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ పంపిణీ చేశారు. వికలాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పుట్లూరు మండలం కందిగోపుల గ్రామానికి చెందిన వెంకట రామయ్య, ఆత్మకూరు మండలం బి.యాలేరు గ్రామానికి చెందిన ఓబులమ్మ, గుత్తి ఆర్ఎస్ కు చెందిన భాగ్యమ్మ అనే ముగ్గురు విభిన్న ప్రతిభావంతులకు ఒక్కొక్కటి 3 వేల రూపాయలు విలువ చేసే కృత్రిమ కాళ్లను మరియు వెయ్యి రూపాయలు విలువచేసే చేతి కర్రలను జిల్లా కలెక్టర్ వారు కూర్చున్న చోటుకే స్వయంగా వెళ్లి అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అర్హత కలిగిన విభిన్న ప్రతిభావంతులకు కృత్రిమ కాళ్లు అందజేసేందుకు విస్తృతంగా అవగాహన కల్పించాలని వికలాంగుల సంక్షేమ శాఖ ఎడిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వికలాంగుల సంక్షేమ శాఖ ఎడి రసూల్, తదితరులు పాల్గొన్నారు.
సామాన్య భక్తులతో కలిసి క్యూలో వెళ్లి కుళ్లాయి స్వామి ఆంజనేయస్వామి వారిని దర్శించుకున్న ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ..
సామాన్య భక్తులతో కలిసి క్యూలో వెళ్లి కుళ్లాయి స్వామి ఆంజనేయస్వామి దేవాలయలను దర్శించుకున్న ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ గూగూడు గ్రామాన్ని ఒక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం మత సామరస్యానికి ప్రతీక ఈ జంట ఆలయాలు ఎమ్మెల్యే ఐన తర్వాత మొదటి సారి ఉత్సవాలు జరగడం చాలా సంతోషం గతంలో ఉన్న ప్రజా ప్రతినిధులు గుగూడు అభివృద్ధి మరిచారు కుల్లాయి స్వామి ఆశీస్సులతో గుగూడు గ్రామ అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తాం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ కు ఇక్కడ ఉన్న సమస్యలను గురించి వివరించాం ఎంపీ సానుకూలంగా స్పందించి తప్పుకుండా ఆలయ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామన్నారు కుళాయి స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు, ముఖ్యంగా పోలీసులు భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ప్రత్యేక చొరవ చూపిస్తున్నారు ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఆలం నరసా నాయుడు,జిల్లా నాయకులు ఆలం వెంకట్ నరస నాయుడు,ఆంజనేయులు టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు
గూగూడు మొహరం బ్రహ్మోత్సవాలు సందర్బంగా శ్రీ గూగూడు కుల్లాయి స్వామి, శ్రీ ఆంజనేయ స్వాములను దర్శించుకున్న ఎమ్మెల్యే, ఎంపీ, ద్విసభ్య కమిటీ సభ్యులు
శింగనమల నియోజకవర్గం నార్పల మండలం గూగూడు మొహరం బ్రహ్మోత్సవాలు సందర్బంగా గ్రామం లో ఎంతో ప్రసిద్ధి గాంచిన జంట ఆలయాలైన శ్రీ గూగూడు కుల్లాయి స్వామి, శ్రీ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్న *ఎంపీ అంబికా లక్ష్మి నారాయణ గారు,ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ గారు రాష్ట్ర టిడిపి అధికార ప్రతినిధి, ద్విసభ్య కమిటీ సభ్యులు ఆలం నరసానాయుడు గారు* మత సామరస్యానికి ప్రతీక ఈ జంట ఆలయాలుకుల్లాయి స్వామి ఆశీస్సులతో గుగూడు గ్రామ అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తాం. ఈ కార్యక్రమం లో జిల్లా టీడీపీ నాయకులు ఆలం వెంకట నరసానాయుడు గారు, ఆకుల ఆంజనేయులు గారు పాల్గొన్నారు.కుళాయి స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు, ముఖ్యంగా పోలీసులు భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ప్రత్యేక చొరవ చుపిస్తున్నారని తెలియజేసారు.ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
అంతర్జాతీయ జూనియర్ బాస్కెట్ బాల్ టోర్నమెంట్ కీ సెలక్ట్ అయిన ద్వారాకనాథ్ రెడ్డిని అభినందించిన టీడీపీ రాష్ట్ర నాయకులు కాటప్పగారి రామలింగారెడ్డి..
అంతర్జాతీయ జూనియర్ బాస్కెట్ బాల్ టోర్నమెంట్ కీ సెలక్ట్ అయినా అనంతపురం పట్టణంకీ చెందిన కాటప్పగారి రామలింగారెడ్డి గారి మిత్రుడు ద్వారాక హరినాథ్ రెడ్డి గారి కుమారుడు ద్వారాకనాథ్ రెడ్డి. శ్రీలంకలో జరిగిన జూనియర్ బాస్కెట్ బాల్ టోర్నమెంట్ లో విజేత గా నిలిచి భారతీయ జెండా ను రెపరెపలాడించిన ,ఈ రోజు స్వాగ్రామం అనంతపురంకీ విచ్చేసిన శుభసందర్బంగా మారురు టోల్ గేట్ దగ్గర ద్వారాకనాథ్ రెడ్డి గారికి పుష్పగుచ్చాం, శాలవతో సన్మానించి ఘన స్వాగతం పలికిన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కాటప్పగారి రామలింగారెడ్డి గారు, టీడీపీ నాయకులు అనిల్ చౌదరి, చంద్రశేఖర్ నాయుడు గారు, తదితరులు.
దళిత మైనర్ బాలికపై అత్యాచారానికి ప్రయత్నించిన అగ్రకులానికి చెందిన నాగరాజు..
దళిత మైనర్ బాలికపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించిన అగ్రకులానికి చెందిన నాగరాజు పై కఠిన చర్యలు తీసుకోవాలి ఎంఆర్పిఎస్ నాయకులు డిమాండ్!! లేనిపక్షంలో ఉద్యమాలు చేపడతాం దళిత బాలికలకు రక్షణ కరువైనది!! వివరాలలోకి. వెళితే సింగనమల నియోజకవర్గం లోనే నార్పల మండలం నార్పల గ్రామంలోని చోటు చేసుకున్నది!! ఈ సంఘటన వెలుగులోకి రాకుండా స్టేషన్లో ఉన్నటువంటి ఇద్దరు కానిస్టేబుళ్లు ఇద్దరు ప్రధాన పత్రిక విలేకరులు సంఘటనను తప్పుదారి పట్టించారని సమాచారం!! అదేవిధంగా ఈ విషయాన్ని ఎస్ఐ గారికి కూడా తెలియకుండా ఉంచాలని ప్రయత్నం చేయడం గమనార్ధం!! విషయం తెలుసుకున్న ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి గారు వెంటనే కేసు నమోదు చేసి నిందితుడు పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగినది!! బాలికపై అత్యాచారయత్నం » కామాంధుడికి దేహశుద్ధి నార్పల, జూలై 14: అనంతపురం జిల్లా నార్పల మండల కేంద్రంలో జిరాక్స్ సెంటర్ యజమాని నాగరాజు (45) ఆదివారం ఎనిమిదో తరగతి విద్యార్థినిపై అత్యాచారానికి యత్నించాడు. విద్యార్థిని ఆధార్ కార్డు జిరాక్స్ చేయించుకునేందుకు నార్పలలోని మసీదు వద్ద ఉన్న జిరాక్స్ సెంటర్కు వెళ్లింది. షాపు యజమాని నాగ రాజు.. విద్యార్థినిని లోపలకి రా అంటూ తీసుకెళ్లి, అసభ్యంగా ప్రవర్తించాడు. అత్యా చారానికి యత్నించాడు. అక్కడి నుంచి తప్పించుకున్న బాలిక ఇంటికి పరుగులు తీసింది. విషయాన్ని కుటుంబీకులకు తెలిపింది. కుటుంబీకులు, బంధువులు జిరాక్స్ సెంటర్ వద్దకు చేరుకుని, నాగరాజుకు దేహశుద్ధి చేశారు. అగ్రకులస్తుడుపై పోక్సో చట్టం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి 60 రోజుల్లోనే నిందితుడికి శిక్షపడే విధంగా పోలీసు ఉన్నత అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం!! ఎమ్మార్పీఎస్ నాయకులు రంగాపురం పుల్లప్ప, చిన్న ఆంజనేయులు, వెంకటాపురం చంద్ర, గడ్డం నాగయ్య పల్లి జయరాం, నార్పల మేకల రాజు, ఎస్ రమణ,
గ్రామ పంచాయతీలకు 250 కోట్లు నిధులు విడుదల.. ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి కృతజ్ఞతలు తెలిపిన .... వైవీబీ రాజేంద్రప్రసాద్..
గ్రామ పంచాయతీలకు 250 కోట్లు నిధులు విడుదల చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి కృతజ్ఞతలు తెలిపిన ....వైవీబీ రాజేంద్రప్రసాద్ ఆంధ్రప్రదేశ్ *పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు వై.వి. బి రాజేంద్రప్రసాద్* పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర కమిటి ప్రతినిధులతో కలిసి ఈ రోజు మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు* గారిని మరియు *రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ యాదవ్* గారిని కలిసి కృతజ్ఞతలు తెలపడం జరిగింది.

ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ గతంలో హామీ ఇచ్చిన విధంగా గ్రామపంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధులు 250 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేసినందుకు రాష్ట్రంలోని 12918 గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పిటిసిలు, మరియు మూడున్నర కోట్ల గ్రామీణ ప్రజల అందరి తరపున మా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్, సర్పంచ్ల సంఘాల నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేసి సత్కరించడం జరిగింది.

గత ఐదు సంవత్సరాలుగా వివిధ పద్దుల కింద గత జగన్ ప్రభుత్వం దొంగిలించి , దారి మళ్లించిన వేల కోట్ల నిధులను కూడా ఇప్పించ వలసినదిగా ముఖ్య మంత్రి గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది . రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికిరాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారికి మరియు రాష్ట్ర మంత్రి అనగానే సత్యప్రసాద్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలపడం అయినది.

ఈ కార్యక్రమంలో వై.వి.బి రాజేంద్ర ప్రసాద్ గారితో పాటు పంచాయతీ రాజ్ ఛాంబర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిర్రు ప్రతాపరెడ్డి, ఉపాధ్యక్షులు కొత్తపు ముని రెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ కార్యనిర్వాహక కార్యదర్శి డేగల కృష్ణమూర్తి సింగం శెట్టి సుబ్బ రామయ్య,చిత్తూరు జిల్లా పంచాయతీ రాజ్ చాంబర్ అద్యక్షుడు చుక్కా ధనుంజయ యాదవ్ నిట్టూరి శివాజీ పంచాయతీరాజ్ ఛాంబర్ సభ్యులు పాల్గొన్నారు.
Breaking... నిన్నటి రోజున జిల్లా ఎస్పీ పర్యటించింది.. అంతలోనే ఇంత దారుణమా.. మద్యం మత్తులో ఒకరి పై ఒకరు దాడి..
గుగుడు కుళ్లాయి స్వామి బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం ఎంతో వైభవంగా నిర్వహించాలని నిన్నటి రోజున జిల్లా ఎస్పీ పర్యటించి వెళ్లారు అంతలోనే అనంతపురం గుగూడు కుళ్లాయి స్వామి బ్రహ్మోత్సవాలకు వచ్చిన ఇద్దరు వ్యక్తులు మద్యం మత్తులో ఒకరి పై ఒకరు దాడి నార్పల మండలం గూగుడు గ్రామంలో ఉత్సవాలకు విచ్చేసిన బెంగళూరుకు చెందిన నాగరాజు, ధర్మవరానికి చెందిన శ్రీకాంత్ ఇద్దరూ మద్యం సేవించి గొడవ బెంగళూరుకు చెందిన నాగరాజు పై ధర్మవరానికి చెందిన శ్రీకాంత్ బీర్ బాటిల్లతో దాడి నాగరాజు అనే వ్యక్తి కి తల భాగంలో బలమైన గాట్లు తీవ్ర రక్త స్రావం కావడంతో చికిత్స నిమిత్తం 108 వాహనం ద్వారా అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు
నాణ్యమైన విద్య.. మనందరి నినాదం కావాలి.. ఎంఈఓలకు జిల్లా కలెక్టర్ ఉద్బోధ..
నాణ్యమైన విద్య.. మనందరి నినాదం కావాలి.. ఎంఈఓలకు జిల్లా కలెక్టర్ ఉద్బోధ
పనితీరు మరింత మెరుగుపడాలి.. అన్ని మండలాల్లోనూ ఒకే స్థాయి పనితీరు కనబరిచాలి* - *: 'నేను బడికి పోతా..' కార్యక్రమం కింద వచ్చే వారంలోపు 100 శాతం నమోదు ప్రక్రియ పూర్తి చేయాలి* - *: బడి ఈడు పిల్లలు బడిలో ఉండాలే కానీ పనిలో కాదు* - *: మధ్యాహ్న భోజన పథకం అమలుపై ప్రత్యేక దృష్టి పెట్టాలి* - *: జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్* అనంతపురం, జులై 11 : *నాణ్యమైన విద్య.. మనందరి నినాదం కావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ ఎంఈఓలకు ఉద్బోధించారు. అనంతపురం కలెక్టరేట్ లోని రెవెన్యూ భవనంలో గురువారం విద్యాశాఖ పరిధిలోని నేను బడికి పోతా, అకడమిక్ మానిటరింగ్ వింగ్, సివిల్ మరియు ఇంజనీరింగ్ పనులు, మధ్యాహ్న భోజనం, నాడు- నేడు, అదనపు తరగతి గదులు, తదితర అంశాలపై ఎంఈఓలు, విద్యాశాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ సమగ్రంగా సమీక్ష సమావేశం నిర్వహించారు.* - *ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యాశాఖ పరిధిలోని అన్ని మండలాల్లోనూ ఎంఈఓలు ఒకే స్థాయి పనితీరు కనబరిచాలని, వారి పనితీరు మరింత మెరుగుపడాలని ఆదేశించారు. పనితీరులో ఎలాంటి నిర్లక్ష్యం ఉండరాదన్నారు. కే.జి.బి.వీలలో పదవ తరగతి ఉత్తీర్ణత శాతం తక్కువగా ఉందని, ఇంటర్ మొదటి సంవత్సరం ఉత్తీర్ణత శాతం తక్కువ ఉందని, ప్రతి ఏడాది తగ్గుతోందని, ప్రత్యేక దృష్టి సారించి ఉత్తీర్ణత శాతం మరింత పెంచాలని ఆదేశించారు. "నేను బడికి పోతా" కార్యక్రమంలో భాగంగా బడి ఈడు పిల్లలు బడిలో ఉండాలేకానీ పనిలో ఉండకుండా చూడాల్సిన బాధ్యత తీసుకోవాలన్నారు. పామిడి మండలంలో 87 హ్యాబిటేషన్లలో, ఉరవకొండ మండలంలో 84 హ్యాబిటేషన్లలో ఈ కార్యక్రమం కింద చేపట్టగా, సెట్టూరు మండలంలో కేవలం ఒక హ్యాబిటేషన్ లో ఈ కార్యక్రమం చేపట్టారని, అలా ఎక్కువ తక్కువ కాకుండా అన్ని మండలాల్లోనూ పూర్తిగా ఈ కార్యక్రమం చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమం కింద మొత్తం 3,356 మందిని గుర్తించగా, ఉరవకొండలోనే 1,617 మందిని గుర్తించారని, మిగిలిన చోట్ల ఎందుకు గుర్తించలేదని ప్రశ్నించారు. సి.డబ్ల్యూ.ఎస్.ఎన్ కింద బుక్కరాయసముద్రంలో మాత్రమే ముగ్గురిని గుర్తించారని, మిగిలిన చోట్ల గుర్తించలేదని, చిన్నారుల ఎన్రోల్మెంట్ ప్రక్రియను కూడా ఎలాంటి పెండింగ్ లేకుండా వచ్చేవారంలోపు 100 శాతం పూర్తి చేయాలని ఎంఈఓలను ఆదేశించారు. బడిలో చదవాల్సిన పిల్లలు చదువుకునేలా జిల్లా అంత ఈ కార్యక్రమం చేపట్టాలని, కానీ కొన్ని మండలాలే ఈ కార్యక్రమాన్ని పూర్తిచేశాయి తప్ప మిగతా మండలాలు ఎందుకు పూర్తి చేయలేదో చెప్పాలన్నారు. ఇకనుండి ప్రతిరోజు రిపోర్టును పంపాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమం కింద పోస్టర్ల ఆవిష్కరణ, డాక్యుమెంటరీ ఫిల్మ్ లను చేపట్టాలన్నారు.* - *అకడమిక్ మానిటరింగ్ వింగ్ కింద జ్ఞాన జ్యోతి కార్యక్రమంలో భాగంగా ఎస్జిటీలు, అంగన్వాడీ టీచర్లకు పూర్తిస్థాయిలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని, షెడ్యూల్ వచ్చిన తర్వాత ట్రైనింగ్ చేపట్టాలన్నారు. జ్ఞాన ప్రకాష్ రిఫ్రెషర్ శిక్షణ కింద ప్రతి ఒక్కరికి శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని, లక్ష్యం నిర్దేశించుకుని పనులు పూర్తి చేయాలని, వచ్చే ఆగస్టు ఒకటో తేదీ నాటికి శిక్షణ కేంద్రంలో పనులు మొదలు కావాలన్నారు. ఇంప్లిమెంటేషన్ ఆఫ్ స్పెషల్ ఎన్రోల్మెంట్ డ్రైవ్ అమలులో భాగంగా విద్య అవగాహన శిబిరాలు నిర్వహించడం, కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు, విద్య మరియు సౌకర్యాలు ప్రాముఖ్యతను పోస్టర్ల ద్వారా, డాక్యుమెంటరీ లు, గతంలో పాఠశాలలో చదివి ప్రయోజకులుగా ఉన్న వారిని ఆదర్శంగా చూపుతూ, పిల్లల తల్లితండ్రులకు, గ్రామ పెద్దలకు, పిల్లలకు అందుబాటులో ఉండే విద్యా సౌకర్యాలపై విస్తృత ప్రచారం చేపట్టాలన్నారు. సోషియల్ మీడియాలో ప్రచారం చేయడం వంటి కార్యక్రమాలను ప్రతి ఒక్క గ్రామాలు, మండలాల వారిగా చేపట్టాలని ఆదేశించారు. జిల్లాలో విద్యార్థులకు కిట్ల పంపిణీకి సంబంధించి నోట్ పుస్తకములు పంపిణీ పూర్తి కాగా, మిగిలిన యూనిఫామ్స్, బ్యాగ్, బెల్ట్స్, డిక్షనరీలు, బూట్లు, టెస్ట్ బుక్ లు త్వరితగతిన అందేలా చూడాలన్నారు. పీఎంశ్రీ స్కూల్స్ సంబంధించిన పనులు ఏ స్థితుల్లో ఉన్నవి, పనులు ఆగిపోయాయి, దీనికి సంబంధించిన పూర్తి నివేదికను అందజేయాలని ఆదేశించారు. నాడు - నేడు పాఠశాల పనులకు సంబంధించిన బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని తెలపగా, ఎన్ని బిల్లులు ఉన్నాయో పెండింగ్ బిల్లుల జాబితాను తయారుచేసి ఇవ్వాలని తెలిపారు.* - *జిల్లాలో 1,694 పాఠశాలల్లో 1,87,954 మంది చిన్నారులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేయడం జరుగుతోందని, దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఏ పాఠశాలలో కూడా మధ్యాహ్న భోజన పథకానికి వంట మనుషులు లేరు అనేది ఉండడానికి వీలులేదని, ఎక్కడైనా సమస్య వచ్చిన 24 గంటల్లోపు పరిష్కరించాలని డిఈఓని ఆదేశించారు. అన్ని పాఠశాలల్లో బయటికి వచ్చి తిని వెళ్లడం లాంటివి ఉండరాదని, పాఠశాలల్లోనే భోజనం అందించాలన్నారు. పాఠశాల వేళలో పిల్లలు బయటికి వెళ్లకుండా చూడాలని, నిబంధనలను అతిక్రమించరాదన్నారు. పిల్లలతో ఎక్కడా పని చేయించకుండా చూడాలన్నారు. ప్రతి నెల 15వ తేదీలోపు బిల్లులు సబ్మిట్ చేయాలని, బిల్లుల సబ్మిట్ ఆలస్యం అయితే చర్యలు తీసుకోవడానికి వెనకాడమన్నారు. చిన్నారులకు అందించే చిక్కీల గడువు తేదీని ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. ప్రతినెలా డిఈఓ, సమగ్ర శిక్ష, బీసీ సంక్షేమం, ట్రైబల్ వెల్ఫేర్, బీసీ రెసిడెన్షియల్, తదితర అధికారులతో సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.* - *విద్యాశాఖలో క్యాడర్ వారీగా అధికారుల స్థాయి నుంచి వాచ్మెన్ వరకు ఖాళీల వివరాలను మొత్తం ఎక్స్ఎల్ సీట్లో అందించాలన్నారు. ఖాళీల వివరాలకు సంబంధించి ప్రభుత్వానికి జిల్లా కలెక్టర్ నుంచి లెటర్ పంపించాలన్నారు. మండల స్థాయిలో ఎంఈఓలతో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేయాలని, కేజీబీవీ ప్రిన్సిపాల్ వాట్సాప్ గ్రూప్ కూడా ఏర్పాటు చేయాలన్నారు.* - *ఈ సమావేశంలో డీఈవో వరలక్ష్మి, విద్యాశాఖ ఏడీలు కృష్ణయ్య, నాగరాజు, ఏఎంఓ చంద్రశేఖర్ రెడ్డి, సీఎంవో గోపాల్, జిసిడివో వాణిదేవి, కార్యాలయం సూపరింటెండెంట్లు, సిబ్బంది, ఎంఈవో 1, 2లు, తదితరులు పాల్గొన్నారు..