ఆ చెట్లు చాలా డేంజర్..తక్షణమే తొలగించండి..డిప్యూటీ సీఎం పవన్ ఆదేశం

ఏపీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యావరణం పై ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇటీవల పవన్ కళ్యాణ్ ఓ చెట్టు గురించి మాట్లాడుతూ అది చాలా డేంజర్ వెంటనే తొలగించండి అని అధికారులకు సూచించారు.

ఏపీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యావరణం పై ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇటీవల పవన్ కళ్యాణ్ ఓ చెట్టు గురించి మాట్లాడుతూ అది చాలా డేంజర్ వెంటనే తొలగించండి అని అధికారులకు సూచించారు.

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ చెట్టు గురించి ప్రస్తావించారు. ఈ కోనో కార్పస్ చెట్లను గతంలో తన ఫాంహౌస్‌లో పెంచానని పవన్ తెలిపారు.

అయితే వాటితో ప్రమాదం అని తెలిసి తొలగించాను అన్నారు.

కాకినాడలో మొత్తం 4,602 కానో కాన్ఫరస్ చెట్లు ఉన్నట్లు గుర్తించారు అధికారులు. ఈ చెట్లను దశల వారీగా తొలగించాలని డిప్యూటీ సీఎం అధికారులకు సూచించారు. ఏడాకుల చెట్టు (కోనో కార్పస్) ప్రజల ఆరోగ్యానికి మంచిది కాదంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేయడంతో వాటిని తొలగించే పనిలో పడ్డారు అధికారులు.

దక్షిణ అమెరికాకు చెందిన కోనో కార్పస్ జాతి మొక్కల్ని సుందరీకరణ కోసం వాడుతున్నారు. వాటి వలన

భూగర్భజలాలు తగ్గపోతాయని, ప్రజల ఆరోగ్యాలకు కూడా ప్రమాదమని ఓ అధ్యయనంలో తేలింది. దీంతో ఉప ముఖ్యమంత్రి ఆదేశాలను అనుసరించి ఏపీలో వాటిని తొలగించే ప్రక్రియ ప్రారంభమైంది.

Indigo: ఇండిగోకు షాక్.. హైదరాబాద్ దంపతులకు పరిహారం ఇవ్వాలని ఆదేశం..

ఇండిగో ఎయిర్ లైన్స్ షాక్ తగిలింది. 2021లో హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు విమానంలో ప్రయాణించిన సమయంలో హైదరాబాద్‌కు చెందిన దంపతులకు రూ.10,000 పరిహారం చెల్లించాలని ఇండిగో ఎయిర్‌లైన్స్‌ని వినియోగదారుల ఫోరం ఆదేశించింది.

అపరిశుభ్రమైన విమానం కారణంగా ఈ ఫైన్ విధించారు. ఈ విషయాన్ని ఫిర్యాదుదారు డి రాధాకృష్ణ తెలిపారు.

జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమీషన్-1 హైదరాబాద్‌లో విమానంలో అపరిశుభ్రతపై రాధాకృష్ణ ఫిర్యాదు చేశారు.

కోచ్‌లో చెత్త, ప్లాస్టిక్ సీసాలు, ఉపయోగించిన నాప్‌కిన్‌లతో నింపారని ఆయన ఆరోపించారు.

విమానంలో అపరిశుభ్రత కారణంగా, తన జీవిత భాగస్వామికి వికారం, వాంతులు వచ్చినట్లు ఆయన తెలిపారు.

మరోవైపు, విమానంలో పరిస్థితుల కారణంగా తన జీవిత భాగస్వామి ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలను ఫిర్యాదుదారు గతంలో ఎన్నడూ ప్రస్తావించలేదని ఇండిగో ఆరోపించింది.

Streetbuzz News

గంజాయి జోలికి పోవద్దు

దండం పెట్టి మరీ వేడుకుంటున్నాను. గంజాయి జోలికి పోవద్దు, మన పిల్లల్ని ఆ ఉచ్చులో దించొద్దు. మరీ ముఖ్యంగా గంజాయి సాగు వద్దే వద్దు’ అని మహిళా శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రజలను కోరారు.

దండం పెట్టి మరీ వేడుకుంటున్నాను. గంజాయి జోలికి పోవద్దు, మన పిల్లల్ని ఆ ఉచ్చులో దించొద్దు.

మరీ ముఖ్యంగా గంజాయి సాగు వద్దే వద్దు’ అని మహిళా శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రజలను కోరారు. మన్యంలో గంజాయి నిర్మూలనపై బుధవారం కలెక్టరేట్‌లో అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో ఏ అరాచకం జరిగినా గంజాయి ప్రభావమే కారణంగా, దానికి మన జిల్లాయే మూలమనే ప్రచారం జరగడం ఆవేదన

కలిగిస్తోందన్నారు. యువత డబ్బు కోసం గంజాయి ఉచ్చులో చిక్కుకోవద్దని, మరీ ముఖ్యంగా గిరిజనులు అసలు గంజాయి సాగు జోలికి వెళ్లొద్దని అభ్యర్థించారు.

ఎవరైనా డబ్బు ఆశచూపి గంజాయి సాగు చేయాలని గిరిజనులను ప్రోత్సహిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

జిల్లాలో గంజాయిని పూర్తిగా నిర్మూలించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. అందులో భాగంగా వంద రోజుల్లో గంజాయిని నిర్మూలించాలనే ఆలోచనతో సీఎం చంద్రబాబు ఉన్నారని, అందుకు అవసరమైన ప్రణాళికలను రూపొందిస్తున్నారని తెలిపారు.

Telangana ప్రేమించిన యువతి తల్లిదండ్రులను చంపిన ఉన్మాది.. వరంగల్‌ జిల్లాలో దారుణం

Telangana వరంగల్‌ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమించిన యువతి తల్లిదండ్రులను ఓ ఉన్మాది దారుణంగా హత్య చేశాడు. అడ్డొచ్చిన యువతితోపాటు ఆమె సోదరుడిపై కూడా దాడికి తెగబడ్డాడు.

వివరాల్లోకి వెళ్తే.. వరంగల్‌ జిల్లా చెన్నారావుపేట మండలం చింతల్‌తండాకు చెందిన బానోతు శివ, సుగుణ దంపతులు. వీరికి ఇద్దరు సంతానం.

కూతురు దీపికను అదే గ్రామానికి చెందిన యువకుడు బన్నీ ప్రేమిస్తున్నానని వెంటపడుతున్నాడు.

ఈ క్రమంలో గురువారం ఉదయం దీపిక ఇంటికి వచ్చిన బన్నీ తల్వార్‌తో ఆమె తల్లిదండ్రులపై దాడి చేశాడు.

అడ్డొచ్చిన దీపిక, ఆమె సోదరుడిపై కూడా తల్వార్‌తో బన్నీ దాడి చేశాడు. ఈ ఘటనలో బానోతు శివ, సుగుణ అక్కడికక్కడే మృతిచెందారు. దీపిక, ఆమె సోదరుడు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలిని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

నిందితుడు బన్నీని అరెస్టు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

పూరీలో ఘోర అపచారానికి కారకులెవరు? అన్ని వేళ్లూ వారివైపే.. విచారణకు కమిటీ!

ఈ ఏడాది పూరీ జగన్నాథుడి రథయాత్ర రెండు రోజుల పాటు జరిగింది. ఒకే రోజున స్వామివారికి మూడు వేడుకలు నిర్వహించాల్సి రావడంతో రథయాత్ర ఆలస్యంగా మొదలైంది. జులై 7న ఆదివారం సాయంత్రం కావడంతో కొద్ది దూరం వెళ్లిన రథాలు నిలిపివేసి.. మర్నాడు సోమవారం ఉదయం మళ్లీ రథాలను లాగుతూ పెంచిన తల్లి గుండిచా మందిరానికి చేర్చారు. 53 ఏళ్ల తర్వాత పూరీలో ఒకే రోజున మూడు వేడుకలు జరగడంతో భక్తులు పోటెత్తారు.

పూరీ జగన్నాథుడి రథయాత్రలో బలభద్రుని పొహండి వేడుకలో జరిగిన ఘోర తప్పిదంపై భక్తులు మండిపడుతున్నారు. గతంలో ఎన్నడూ ఇలాంటి అపచారం జరగలేదని వారు ఆవేదనకు గురవుతున్నారు. రథం నుంచి గుండిచా మందిరంలోకి తరలిస్తుండగా బలభద్రుని విగ్రహం ఒరిగి.. సేవాయత్‌లపై పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 9 మందికి గాయాలయ్యాయి. అయితే, విగ్రహం ఒరిగిపోవడానికి సేవలతో ప్రమేయం లేని యువ సేవాయత్‌లు ఎక్కువ సంఖ్యలో రథంపై గుంపుగా ఉండడమే కారణమా? లేక చారమాల సక్రమంగా కట్టలేదా? అనేది ప్రస్తుతం

సోమవారం సాయంత్రం పెంచిన గుండిచా ఆలయానికి చేరుకున్న చతుర్దామూర్తులు జగన్నాథ, బలభద్ర, దేవి సుభ్రద, సుదర్శనులకు మంగళవారం రాత్రి పొహండి జరిగింది. అయితే, సేవాయత్‌లు ఈ ఉత్సవాన్ని ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. భక్తుల నుంచి సంభావన అందుకోవడానికి సేవాయత్‌లకు పొహండి గొప్ప అవకాశం. దీంతో సేవలతో ప్రమేయం లేనివారు రథాలపై గుంపులుగా పొగయ్యారు. పొహండి తిలకించడానికి వచ్చిన భక్తులతో గుండిచా ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది.

తొలుత జగన్నాథుడు, సుదర్శనుని పొహండి జరిగిన తర్వాత బలభద్రున్ని గుండిచా సన్నిధికి తీసుకెళ్లే సమయంలో రథంపై ఉన్న సేవాయత్‌లు ఎక్కువ సమయం తీసుకున్నారు. అలాగే, స్వామి వెనుకవైపు ‘చారమాల’ సక్రమంగా కట్టలేదు. రథం నుంచి విగ్రహాల తరలింపు ఘట్టంలో వాటిని ఊపుతూ తీసుకెళతారు. చారమాల కట్టడంలో లోపం ఉంటే విగ్రహం ముందుకు ఒరిగిపోయి.. బరువు పెరుగుతాయి. ఈ నేపథ్యంలో శ్రీక్షేత్ర, గుండిచా పొహండి వేడుకల్లో అనుభవం గలిగిన సేవాయత్‌లు విధులు నిర్వహించాల్సి ఉంటుంది.

ఈ ఘటనపై ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ స్పందిస్తూ.. ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి అపచారాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఇక, ఘటన గురించి తెలిసిన వెంటనే.. న్యాయశాఖ మంత్రి పృథ్వీరాజ్‌ హరిచందన్‌లను సీఎం మోహన్ చరణ్ మాఝి పూరీకి పంపించారు. అక్కడకు చేరుకున్న మంత్రి హరిచందన్‌ రాత్రి 12 వరకు పూరీలో ఉండి.. పొహండి ముగిసే వరకు పరిస్థితి సమీక్షించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.

పొహండి ఘటనను జగన్నాథేచ్ఛగా పేర్కొన్నారు. ఇందులో సేవాయత్‌ల తప్పిదం తమ దృష్టికి రాలేదని, ఇలాంటి అపశ్రుతులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

మరోవైపు, ఈ ఘటనపై విచారణకు జగన్నాథ ఆలయ యంత్రాంగం ముగ్గురు సభ్యులతో కమిటీని వేసింది. పూరీ రాజు గజపతి మహారాజ్ దివ్యసింగ్ దేవ్ నేతృత్వంలోని ఈ కమిటీలో అడిషినల్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్, ఆలయ డిప్యూటీ సూపరింటిండెంట్ సభ్యులుగా ఉన్నారు. పది రోజుల్లో ఈ కమిటీ నివేదికను అందజేయనుంది. విచారణలో భాగంగా డ్రోన్ ఫుటేజ్‌లను పరిశీలించి, రథంపై ఎవరున్నారు? ఏం జరిగింది? అనేది తెలుసుకోనుంది.

Water Projects: ఆల్మట్టికి 84 వేల క్యూసెక్కుల వరద..

కృష్ణా-గోదావరి బేసిన్‌లో ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులకు వరద కొనసాగుతోంది. బుధవారం కృష్ణా బేసిన్‌లో ఎగువన ఉన్న ఆల్మట్టి ప్రాజెక్టుకు 84 వేల క్యూసెక్కుల వరద వచ్చింది.

ప్రాజెక్టులకు వరద కొనసాగుతోంది. బుధవారం కృష్ణా బేసిన్‌లో ఎగువన ఉన్న ఆల్మట్టి ప్రాజెక్టుకు 84 వేల క్యూసెక్కుల వరద వచ్చింది.

జలాశయం పూర్తి నీటినిల్వ సామర్థ్యం 129.72 టీఎంసీలు కాగా... 81.44 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఈ జలాశయం నిండితే తెలంగాణ కీలక ప్రాజెక్టులకు నీరు విడుదల కానుంది. రెండ్రోజుల్లో ఆల్మట్టి నుంచి నీటిని విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక తుంగభద్ర ప్రాజెక్టుకు 27,544 క్యూసెక్కుల వరద వచ్చింది.

తుంగభద్ర నీటి నిల్వ సామర్థ్యం 100.86 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 25.17 టీఎంసీల నిల్వ ఉంది. శ్రీశైలం ప్రాజెక్టుకు 2,256 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. గోదావరి బేసిన్‌లోని మేడిగడ్డ బ్యారేజీకి 41 వేల క్యూసెక్కులు,

తుపాకులగూడెం(సమ్మక్కసాగర్‌) బ్యారేజీకి 64 వేల క్యూసెక్కులు, దుమ్ముగూడెం(సీతమ్మసాగర్‌)కు 66 వేల క్యూసెక్కులు, అన్నారం బ్యారేజీకి 650 క్యూసెక్కులు, సుందిళ్లకు 956 క్యూసెక్కుల వరద రాగా.. వచ్చిన నీటిని వచ్చినట్లే దిగువకు వదిలిపెడుతున్నారు. శ్రీపాద ఎల్లంపల్లికి 396 క్యూసెక్కులు, కడెం 464 క్యూసెక్కులు, శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు 1,852 క్యూసెక్కులు, సింగూరులకు 300 క్యూసెక్కుల వరద రికార్డయింది.

నీట్‌ పరీక్షలో మాల్​ప్రాక్టీస్‌ జరగలేదు'- సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్​

Centre Additional Affidavit On NEET UG In SC :నీట్‌ యూజీ 2024 పరీక్షలో మాస్​ మాల్​ప్రాక్టీస్‌ జరిగిందనడానికిగానీ, కొన్ని కేంద్రాల్లో విద్యార్థులు లబ్ధి పొందేలా అక్రమాలు జరిగాయనడానికిగానీ ఆధారాలు లేవని కేంద్రం బుధవారం సుప్రీంకోర్టుకు తెలిపింది.

మద్రాస్‌ ఐఐటీ నిర్వహించిన ఈ పరీక్షల ఫలితాల డేటా విశ్లేషణలో, మార్కుల పంపిణీలో అసాధారణ అంశాలేవీ కనిపించలేదని పేర్కొంది.

మార్కులు సాధారణంగానే ఉన్నాయని తెలిపింది. 2024-25 సంవత్సరానికిగానూ అండర్ గ్రాడ్యుయేట్ సీట్లకు సంబంధించిన కౌన్సిలింగ్​ ప్రక్రియ

జూలై మూడో వారం నుంచి నాలుగు రౌండ్లలో నిర్వహించనున్నట్లు సుప్రీంకోర్టుకు సమర్పించిన అదనపు అఫిడవిట్‌లో కేంద్రం వెల్లడించింది.

NEET-UG 2024పై గురువారం సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరపనున్న నేపథ్యంలో కేంద్రం ఈ అఫిడవిట్‌ సమర్పించింది.

High Court: జడ్జి, కుటుంబ సభ్యుల పేర్లు ఎలా వెల్లడిస్తారు?

ఫోన్‌ట్యాపింగ్‌ వ్యవహారంలో హైకోర్టు జడ్జి, కుటుంబ సభ్యుల పేర్లు, ఫోన్‌ నంబర్లు ప్రచురించడంపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఫోన్‌ట్యాపింగ్‌ కేసును రిపోర్టింగ్‌ చేసేటప్పుడు సంయమనం పాటించాలని ప్రింట్‌, ఎలకా్ట్రనిక్‌ మీడియాకు సూచించింది.

ఫోన్‌ట్యాపింగ్‌ వ్యవహారంలో హైకోర్టు జడ్జి, కుటుంబ సభ్యుల పేర్లు, ఫోన్‌ నంబర్లు ప్రచురించడంపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఫోన్‌ట్యాపింగ్‌ కేసును రిపోర్టింగ్‌ చేసేటప్పుడు సంయమనం పాటించాలని ప్రింట్‌, ఎలకా్ట్రనిక్‌ మీడియాకు సూచించింది.

గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో నాయకులు, ప్రముఖులు, వ్యాపారులతోపాటు హైకోర్టు జడ్జి ఫోన్‌ను సైతం ట్యాప్‌ చేశారని వచ్చిన వార్తలను హైకోర్టు సూమోటోగా స్వీకరించి, విచారిస్తోంది. ఈ పిటిషన్‌పై సీజే జస్టిస్‌ అలోక్‌ అరాఽధే, జస్టిస్‌ టి.వినోద్‌కుమార్‌ ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది.

ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్‌ ఆధారంగా పలు పత్రికల్లో హైకోర్టు జడ్జి, వారి కుటుంబసభ్యుల పేర్లు, ఫోన్‌ నంబర్లు ప్రచురితం అయ్యాయి.

దీనిపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని కౌంటర్‌ దాఖలు చేసినందున ప్రస్తుతానికి ఎలాంటి ఆదేశాలు ఇవ్వడం లేదని.. మీడియా సంయమనం పాటిస్తుందని విశ్వసిస్తున్నామని పేర్కొంది. తదుపరి విచారణ 23కు వాయిదా వేసింది.

రివర్స్‌లో తిరుగుతున్న భూకేంద్రం.. ఏం జరగబోతోంది?

భూమి ఉపరితలం నుంచి కిందకు వెళ్లే కొద్దీ సగటున ప్రతి 32 మీటర్లకు 1 డిగ్రీ ఉష్ణోగ్రత పెరుగుతుంది. అంటే, భూ ఉపరితలంపై ఉష్ణోగ్రత 13 డిగ్రీలు ఉంటే.. భూ కేంద్రం వద్ద ఏకంగా 6 వేల డిగ్రీలు ఉంటుంది. అంటే, ఇది సూర్యుడి ఉపరితలం వద్ద ఉష్ణోగ్రతకు సమానం. భూమిపైకి ప్రవహించే లావా, గీజర్ల ఆధారంగా లోపలి ఉండే ఉష్ణోగ్రతను అంచనా వేశారు. అయితే, కొన్నాళ్లుగా భూ కేంద్ర మండలం వేగం నెమ్మదించింది.

భూమి కూర్పు మనం అనుకున్నదానికంటే చాలా క్లిష్టంగా ఉంటుంది. ఇది నిరంతరం మారుతూ ఉంటుంది. భూ అంతర్భాగాన్ని భూపటలం (క్రస్ట్), భూప్రచారం (మాంటెల్), భూ కేంద్ర మండలం (కోర్) అనే మూడు జోన్లుగా ఖగోళన శాస్త్రవేత్తలు విభజించారు. అయితే, వీటిలో భూకేంద్ర మండలం (Earth Core) స్వతంత్రంగా తిరుగుతున్నట్టు (భ్రమణం) పలు సిద్ధాంతాలు రుజువు చేశాయి. కానీ, ప్రస్తుతం అంతర్గత భూకేంద్ర మండలం వేగం అనూహ్యంగా నెమ్మదించి, అపసవ్య దిశ (రివర్సు)లో

భూ కేంద్ర మండలం అనేది భూమిలో అత్యంత వేడి ప్రదేశం. ఇక్కడ ఉష్ణోగ్రత సూర్యుడి ఉపరితలంతో సమానంగా ఉంటుంది. భూ అంతర్భాగంలో 5,180 కి.మీ. లోతులో ఉండే ఈ ప్రదేశం ఐరన్, నికెల్ వంటి ఖనిజాలతో నిండి ఉంటుంది. లోపలి కోర్ చుట్టూ ద్రవరూప ఖనిజాల బాహ్య కోర్ ఉంటుంది. ఇది భూమికి మిగిలిన భాగాలతో ఒక అవరోధంగా పనిచేస్తుంది. ఈ అవరోధం వేడి లోహపు బంతిని పోలి ఉంటుంది. అయితే, భూకేంద్ర మండలం స్వతంత్ర భ్రమణానికి మిగిలిన గ్రహంతో సమానంగా ఉండాల్సిన అవసరం లేదు. మనం నివసించే భూమి బయట పొరను భూపటలం (Earth Crust) అంటారు. ఈ పొర భూ ఉపరితలంపై 30 నుంచి 100 కి.మీ. మేర విస్తరించి ఉంటుంది. ఇక్కడ అధికంగా ఉండే మూలకం ఆక్సిజన్ (Oxygen).

డెన్మార్క్‌కు చెందిన భూగర్భ శాస్త్రవేత్త ఇంజే లెహ్‌మాన్ 1936లో తొలిసారిగా ఎర్త్ కోర్ అంతర్గత భాగాన్ని గుర్తించారు. అప్పటి నుంచి భూ కేంద్ర మండలం భ్రమణ వేగం, తిరిగే దిశపై చర్చ జరుగుతూనే ఉంది. ఎందుకంటే తమ అభిప్రాయాన్ని నిరూపించడానికి శాస్త్రవేత్తలకు పరిమిత ఆధారాలు ఉండటమే కారణం. భూ అంతర్గత నమూనాలను ప్రత్యక్షంగా పరిశీలించడం లేదా సేకరించడం అసాధ్యం. చాలా పరిశోధనలు, అధ్యయనాలు వేర్వేరు సమయాల్లో కోర్ గుండా వెళ్లే సారూప్య బలాల తరంగాల మధ్య వైవిధ్యాలపై ఆధారపడి ఉంటాయి.

భూమిపై పదేపదే భూకంపాలు, పేలుళ్ల సమయంలో వచ్చిన సీస్మోగ్రామ్‌ల డేటా గత కొన్ని సంవత్సరాలుగా భూమి ఉపరితలంతో పోలిస్తే ఘన అంతర్గత కోర్ భ్రమణ వేగం నిరంతరం క్షీణిస్తున్నట్లు సూచిస్తుంది’ అని జూన్‌లో ప్రచురించిన నేచర్ జర్నల్‌లో ఫలితాల్లో పేర్కొన్నారు. ఈ పరిశోధన భూ భ్రమణ వేగాన్ని ధ్రువీకరించడమే కాకుండా.. కోర్ క్షీణత కొన్ని దశాబ్దాలుగా మందగించినట్టు 2023లో శాస్త్రవేత్తల చేసిన వాదనకు బలాన్ని ఇస్తోంది. గతేడాది ప్రతిపాదించిన మోడల్ భూమి కోర్ భ్రమణ వేగం.. దిశను వివరించింది.

కోర్ అంతర్గత భాగం భూమి క్రస్ట్ కంటే వేగంగా తిరుగుతుందని, కానీ ఇప్పుడు నెమ్మదిగా తిరుగుతోందని ఆ మోడల్ పేర్కొంది. కొంతకాలం కోర్, భూమి భ్రమణం సరిపోలాయి. తరువాత కోర్ భ్రమణ వేగం రివర్స్ దిశలో కదలడం ప్రారంభించిన తర్వాత మరింత తగ్గిందని తెలిపింది. ఇక, భూమి ఉపరితలం నుంచి లోపలికి వెళ్లే కొద్దీ క్రమంగా ఉష్ణోగ్రత పెరుగుతూ ఉంటుంది.

ఆ రైతులకు రుణమాఫీ, రైతు భరోసా పథకాలు. తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణ: తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన వచ్చినా.. రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. లబ్ధిదారుల జాబితా నుంచి ఎక్కడ తొలగిస్తారోనని వారిలో ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే ప్రభుత్వం రకరకాల అభ్యంతరాలను లేవనెత్తుతోంది. తాజాగా మంత్రి చేసిన వ్యాఖ్యలు మరింత గందరగోళాన్ని పెంచాయి.

రైతుబంధు పథకాల అమలుకు తెలంగాణ ప్రభుత్వం పక్కా మార్గదర్శకాలు రూపొందిస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ఎప్పుడు ఎలాంటి ప్రకటన చేస్తుందో రైతులు నిశితంగా గమనిస్తున్నారు. ఈ క్రమంలో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిన్న వ్యవసాయ, ఉద్యానవన, మార్కెటింగ్ శాఖల అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి ఏం మాట్లాడారోనని రైతులు చూస్తున్నారు. అయితే పంట నమోదు ప్రక్రియను తప్పనిసరి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. రైతులకు భరోసా, పంటల బీమాతోపాటు మార్కెటింగ్‌ ప్రణాళికకు పంట నమోదు ప్రక్రియే ప్రాతిపదిక అని స్పష్టం చేశారు.

తుమ్మల మాట్లాడుతూ.. రైతుల సంక్షేమమే కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో తొలి ప్రాధాన్యతనిస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ. 50,000 నుండి రూ. వచ్చే 3 నెలల్లో రైతులకు 60,000 కోట్లు. రైతు రుణమాఫీ, రైతు భరోసా, పంటల బీమా, రైతుబీమా పథకాలను 3 నెలల్లో అమలు చేస్తామన్నారు. అంటే సెప్టెంబరు నెలాఖరులోగా రుణమాఫీతోపాటు రైతు భరోసా అమలులోకి వస్తుందని ఆశించవచ్చు.

వాస్తవానికి రైతుబీమాలో కొత్త క్లెయిమ్‌లు పెడితే.. ఇప్పటికే 1222 క్లెయిమ్‌లు.. ఇప్పటికీ పరిష్కారం కాలేదు. ప్రస్తుతం తెలంగాణలో ఆశించిన స్థాయిలో వర్షాలు పడలేదు. దీంతో రైతులు పంటలు నష్టపోతామనే భయంతో ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు పంటలకు రైతు బీమాను త్వరగా అమలు చేయాలి. కానీ, ఇప్పుడు ఇన్సూరెన్స్ ఇచ్చినా, పంట నష్టపోయినప్పుడు క్లెయిమ్ డబ్బులు చెల్లించడం లేదు. ఎందుకంటే పాత క్లెయిమ్‌లు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని పరిష్కరిస్తేనే కొత్త వాటిని పరిగణనలోకి తీసుకోవచ్చు. దీనిపై మంత్రి స్వయంగా ఆందోళన వ్యక్తం చేశారు.

మొత్తానికి నిన్న జరిగిన సమీక్షా సమావేశంలో ఓ కీలక అంశం చోటు చేసుకుంది. పంటలను అధికారులు నమోదు చేస్తే ఆ పంటల రైతులకు మాత్రమే రుణమాఫీ, రైతు భరోసా వంటి పథకాలు అందుతాయి. రైతులు తమ పంటలను అధికారుల వద్ద నమోదు చేయకుంటే.. అధికారులు ఆ పంటలను ఉన్న పంటలుగా లెక్కించడం లేదు. దాంతో పాటు.. వారికి రుణమాఫీ, రైతుబీమా, పంటల బీమా, రైతుబీమా తదితరాలు వర్తిస్తాయి. కావున రైతులు, అధికారులు దీనిపై దృష్టి సారించాలి. అధికారులు రిజిస్ట్రేషన్ కోసం వస్తే వెంటనే పంట వివరాలు చెప్పాలన్నారు.

ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం పంటలు, భూములకు సంబంధించి సర్వే నిర్వహిస్తోంది. ఈ సర్వే ఆధారంగానే రైతు భరోసా అమలు చేస్తామన్నారు. సర్వేకు వచ్చే అధికారులు.. రైతులను సముదాయించి వారికి ఎంత భూమి ఉంది, ఏ పంటలు వేశారు. మీరు ఎన్ని సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నావు అని కూడా అడుగుతారు. అధికారులు అడిగే ప్రశ్నలకు రైతులు సవివరంగా సమాధానమిచ్చి తమ పంటల నమోదు చేయించుకోవాలి. దీని నుండి అన్ని ప్రణాళికలను పొందవచ్చు.