తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 07 2024, 08:22

Engineering Colleges: 4వేలకు పైగా సీఎస్‌ఈ సీట్లు..

కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ (సీఎ్‌సఈ), సీఎ్‌సఈ అనుబంధ కోర్సుల్లో గతేడాదికన్నా 4,500 సీట్లు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ (సీఎ్‌సఈ), సీఎ్‌సఈ అనుబంధ కోర్సుల్లో గతేడాదికన్నా 4,500 సీట్లు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

కోర్‌ బ్రాంచ్‌లు అయిన సివిల్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, మెటలర్జీ వంటి ఇంజనీరింగ్‌ కోర్సులను నిర్వహించే కాలేజీలకు మరింత ప్రోత్సాహం ఇవ్వడంలో భాగంగా సీఎ్‌సఈ సీట్లను పెంచేందుకు సర్కారు సుముఖంగా ఉన్నట్లు సమాచారం. అయితే ఎప్‌సెట్‌ రెండోదశ కౌన్సెలింగ్‌ తర్వాత సీట్ల పెంపు నిర్ణయాన్ని ప్రకటించాలని విద్యాశాఖ ఉన్నతాధికారులు భావిస్తున్నారు.

ఈ విద్యా సంవత్సరంలో కోర్‌ బ్రాంచ్‌ల్లో సీట్లు తగ్గించుకొని ఆమేరకు సీట్లను సీఎ్‌సఈలో పెంచుకునేందుకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ)కి కొన్ని కాలేజీలు దరఖాస్తు చేసుకున్నాయి. అలాగే, మరికొన్ని కళాశాలలు కోర్‌ బ్రాంచ్‌లను అలాగే కొనసాగిస్తూ అదనంగా సీఎ్‌సఈ కోర్సుల్లో సీట్ల పెంపునకు దరఖాస్తు చేశాయి. ప్రైవేటు కాలేజీల అభ్యర్థనలకు ఏఐసీటీఈ అమోదం తెలిపినప్పటికీ, కోర్‌ బ్రాంచ్‌ ల్లో సీట్ల తగ్గింపునకు సర్కారు విముఖత చూపుతున్నట్టు తెలిసింది.

ఈ క్రమంలో కోర్‌ బ్రాంచ్‌ల సీట్ల తగ్గింపు కోరుకున్న కళాశాలల్లో సుమారు 1,700 సీట్లు తగ్గుతుండగా, కోర్‌ బ్రాంచ్‌లు నిర్వహిస్తున్న కాలేజీలకు సుమారు 4,500 సీఎ్‌సఈ సీట్లకు అనుమతి లభించవచ్చని ఉన్నతాధికారులు చెబుతున్నారు. అయితే, ఎప్‌సెట్‌ మొదటి దశ కౌన్సెలింగ్‌కు గతేడాది సీట్ల ప్రకారమే కాలేజీలకు అనుమతులు ఇస్తుండగా, రెండో దశ కౌన్సెలింగ్‌ నాటికి సీట్ల పెంపు ఉండే అవకాశం ఉందని ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీల యాజమాన్యాల సంఘం ప్రతినిధులు చెబుతున్నారు. కాగా, ఈ నెల 8నుంచి మొదటి విడత వెబ్‌ ఆప్షన్స్‌ ఎక్సర్‌సైజ్‌ ప్రారంభం కానుండడంతో కళాశాలలకు అఫిలియేషన్‌/కోర్సులు/సీట్ల కేటాయింపు వివరాలను శనివారం సాయంత్రం జేఎన్‌టీయూ అధికారులు ఉన్నత విద్యామండలికి సమర్పించారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 07 2024, 08:19

రైతు భరోసా కటాఫ్.. ఐదెకరాలు!

రైతు భరోసా స్కీమ్ విధివిధానాల తయారు కోసం రైతుల నుంచి వ్యవసాయ శాఖ సలహాలు, సూచనలు తీసుకుంటున్నది. ఇప్పటివరకు సుమారు 31 వేల మంది రైతులు ఈ స్కీమ్‌పై తమ అభిప్రాయాలు తెలుపగా, అందులో మెజార్టీ రైతులు ఐదెకరాలకు కటాఫ్ పెట్టి రైతు భరోసా స్కీమ్ అమలు చేయాలని కోరినట్లు ప్రభుత్వవర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

కటాఫ్ లేకుండా స్కీమ్ అమలు చేయడం వల్ల ప్రజాధనం వృథా అవడంతో పాటు అనుకున్న లక్ష్యం నెరవేరదని అభిప్రాయపడుతున్నట్టు సమాచారం

రైతు భరోసా స్కీమ్ కోసం ఎలాంటి కండీషన్లు పెట్టాలనే అంశంపై త్వరలో జరుగనున్న బడ్జెట్ సమావేశాల్లో చర్చకు పెట్టాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఈ లోపు రైతుల నుంచి కూడా అభిప్రాయాలు, సూచనలు తీసుకుంటున్నది. రైతు వేదిక లు, వ్యవసాయ సహకార సంఘాలు, జిల్లా, మండల పరిషత్ సమావేశాల సమయంలో అక్కడికి వచ్చిన రైతులు, రాజకీయ నాయకుల నుంచి వ్యవసాయ శాఖ సలహాలు స్వీకరిస్తున్నది. ఇప్పటివరకు సుమారు 31 వేల మంది నుంచి లిఖిత పూర్వకంగా సలహాలు సేకరించినట్టు తెలిసింది. అందులో మెజార్టీ మంది ఐదెకరాలకు కటాఫ్ పెట్టి, రైతు భరోసా స్కీమ్ అమలు చేయాలని చెప్పినట్టు సమాచారం. అసలైన రైతులకు ప్రయోజనం కలగాలంటే, కండీషన్లు పెట్టాలని సూచించినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు వ్యవసాయ శాఖ సేకరించిన అభిప్రాయాలు, సూచనలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలోని సబ్ కమిటీకి సమర్పించే చాన్స్ ఉంది.

త్వరలో మంత్రుల సబ్ కమిటీ రైతులు, రైతు సంఘాలు నుంచి అభిప్రాయాలు సేకరించే అవకాశం ఉంది. అందుకోసం ప్రత్యేకంగా జిల్లాలో పర్యటించే చాన్స్ ఉందని తెలుస్తోంది. ఈ ప్రక్రియ మొత్తం ఈ నెల చివరిలోపు పూర్తి చేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నట్టు తెలిసింది. ఈ లోపు వ్యవసాయ శాఖ మరిన్ని జిల్లాలకు చెందిన రైతుల నుంచి సలహాలు తీసుకోవాలని భావిస్తోంది. లిఖిత పూర్వకంగా మాత్రమే సలహాలు తీసుకోవాలని, వీలైతే రైతు పేరు, ఫోన్ నెంబర్ వివరాలను సేకరించాలని భావిస్తున్నట్టు సమాచారం.

రైతు భరోసా స్కీమ్‌ను కౌలు రైతులకు సైతం వర్తింపజేస్తామని కాంగ్రెస్ తన ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నది. దీంతో కౌలు రైతులను గుర్తించడం పెద్ద సమస్యగా మారిందనే చర్చ జరుగుతున్నది. ఎలా గుర్తించాలి అనే అంశంపై ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలిసింది. కౌలు చేస్తున్న రైతు ఇచ్చిన సమాచారం సరిపోదని, భూ యజమాని తన భూమిని ఫలాన రైతుకు కౌలుకు ఇచ్చినట్టు అఫడవిట్ సమర్పిస్తేనే సమస్యకు పరిష్కారం లభిస్తుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఎంత మంది అఫిడవిట్ ఇచ్చేందుకు ముందుకు వస్తారనే అనుమానం అధికారులకు పట్టుకున్నది.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 07 2024, 08:16

Nalgonda: డిండి గురుకులంలో 16 మంది విద్యార్థినులను కొరికిన ఎలుకలు..

నల్లగొండ జిల్లా డిండి మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో 16 మంది విద్యార్థినులను ఎలుకలు గాయపర్చాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

నల్లగొండ జిల్లా డిండి మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో 16 మంది విద్యార్థినులను ఎలుకలు గాయపర్చాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గాయాలైన విద్యార్థినులకు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్న పాఠశాల ఏఎన్‌ఎం, ప్రిన్సిపాల్‌.. ఎలుకలు తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవడంలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారు.

ఈ నెల 2న ఆరుగురు, 3న ఆరుగురు, 5న నలుగురిని ఎలుకలు గాయపరచగా, వైద్యం అందించినట్లు ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం రికార్డుల్లో నమో దు చేశారు. ఈ విషయమై ప్రిన్సిపాల్‌ పద్మను వివరణ కోరగా నలుగురిని మాత్రమే ఎలుకలు గాయపర్చినట్లు తెలిపారు.

విద్యార్థినుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రిన్సిపాల్‌ను వెంటనే సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ శనివారం ఎన్‌ఎ్‌సయూఐ, ఏఐఎ్‌సఎఫ్‌, ఏఐవైఎఫ్‌ ఆధ్వర్యంలో గురుకులం ఎదుట ధర్నా నిర్వహించారు. కాగా, పాఠశాలలో 5వ తరగతి నుంచి ఇంటర్‌ వరకు 640 మంది విద్యార్థినులు విద్యను అభ్యసిస్తున్నారు.

పాఠశాల చుట్టూ పిచ్చిమొక్కలు, గడ్డి, చెత్తాచెదారం పేరుకుపోవడంతో పాములు తిరుగుతున్నాయని విద్యార్థినులు తెలిపారు. పరిసరాల్లో మురుగునీరు పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతోందని, ఈగలు, దోమలు వ్యాపించి బాలికలు అనారోగ్యం పాలవుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 06 2024, 12:46

L&T Metro | టీవోడీకి గుడ్‌బై.. ఒక్కొక్కటిగా థర్డ్‌ పార్టీకి అప్పగిస్తున్న ఎల్‌అండ్‌టీ మెట్రో

వాణా ఆధారిత అభివృద్ధి అన్న నినాదానికి ఎల్‌ అండ్‌ టీ మెట్రో స్వస్తి పలుకుతోంది.

సమగ్ర రవాణా వ్యవస్థతో అత్యంత మెరుగైన అభివృద్ధి సాధించవచ్చన్న లక్ష్యంతో చేపట్టిన రవాణా ఆధారిత అభివృద్ధికి తూట్లు పొడుస్తూ ..ఎల్‌ అండ్‌ టీ మెట్రో సంస్థ క్రమంగా రియల్‌ ఎస్టేట్‌ కార్యకలాపాలను చేపట్టకుండా ఇతర సంస్థలకు అప్పగిస్తుండటంతో టీవోడీ లక్ష్యం దెబ్బతింటోంది

L&T Metro | రవాణా ఆధారిత అభివృద్ధి అన్న నినాదానికి ఎల్‌ అండ్‌ టీ మెట్రో స్వస్తి పలుకుతోంది.

సమగ్ర రవాణా వ్యవస్థతో అత్యంత మెరుగైన అభివృద్ధి సాధించవచ్చన్న లక్ష్యంతో చేపట్టిన రవాణా ఆధారిత అభివృద్ధికి తూట్లు పొడుస్తూ ..ఎల్‌ అండ్‌ టీ మెట్రో సంస్థ క్రమంగా రియల్‌ ఎస్టేట్‌ కార్యకలాపాలను చేపట్టకుండా ఇతర సంస్థలకు అప్పగిస్తుండటంతో టీవోడీ లక్ష్యం దెబ్బతింటోంది.

ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన రవాణా ఆధారిత అభివృద్ధి కేంద్రాలైన మెట్రోమాల్స్‌ను దీర్ఘ కాలిక లీజుకు ఇచ్చేందుకు ఎల్‌ అండ్‌ టీ సంస్థ ప్రైవేటు సంస్థలతో సంప్రదింపులు చేస్తోంది.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 06 2024, 12:44

GHMC జీహెచ్‌ఎంసీ కౌన్సిల్‌ సమావేశం రసాభాస.. పోడియంను చుట్టుముట్టిన బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు

జీహెచ్‌ఎంసీ (GHMC) సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. కౌన్సిల్‌ సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు మేయర్‌ పోడియాన్ని చుట్టుముట్టారు.

మేయర్‌ గద్వాల విజయలక్ష్మికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.

హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ (GHMC) సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. కౌన్సిల్‌ సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు మేయర్‌ పోడియాన్ని చుట్టుముట్టారు. మేయర్‌ గద్వాల విజయలక్ష్మికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు.

పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.

పలువురు కార్పొరేటర్లు మేయర్‌తో వాగ్వాదానికి దిగారు. వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. దీంతో సమావేశ మందిరంలో గందరగోళం నెలకొన్నది. దీంతో బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లపై మేయర్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 06 2024, 12:40

Andhra Pradesh: అమరావతికి వచ్చేస్తాం..

అమరావతి రాజధానిలో సంస్థల ఏర్పాటు అంశాన్ని సీఆర్‌డీఏ అత్యంత ప్రాధాన్యంగా తీసుకుంటోంది.

అమరావతి రాజధానిలో సంస్థల ఏర్పాటు అంశాన్ని సీఆర్‌డీఏ అత్యంత ప్రాధాన్యంగా తీసుకుంటోంది. అమరావతిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన 130 సంస్థలకు భూములు కేటాయించారు. సీఆర్‌డీఏ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగం వాటి యాజమాన్యాలతో సంప్రదింపులు జరుపుతోంది.

ఇక్కడ సంస్థను ఎప్పుడు ఏర్పాటు చేస్తారు.. పనులు ఎప్పుడు ప్రారంభిస్తారు.. వంటి అంశాలపై చర్చిస్తోంది. కార్యాలయాల ఏర్పాటుపై శుక్రవారం నాటికి 80శాతం సంస్థల నుంచి సానుకూలత వచ్చిందని సీఆర్‌డీఏ వర్గాలు చెబుతున్నాయి. ఇంకా 25కుపైగా సంస్థల నుంచి స్పష్టత రావాల్సి ఉంది. కొన్ని సంస్థలు వైసీపీ ప్రభుత్వ హయాంలో బెదిరింపుల కారణంగా తరలిపోవటంవల్ల వాటినుంచి ఎలాంటి స్పష్టత రాలేదు. అమరావతిలో సంస్థల ఏర్పాటు నిమిత్తం మొత్తం 130 సంస్థలకు 1,660 ఎకరాలు కేటాయించారు. అప్పట్లో ఆయా సంస్థలకు కొన్ని లీజు ప్రాతిపదికన, మరికొన్ని అవుట్‌రేట్‌ సేల్‌ ప్రాతిపదికన రూ.677.10కోట్ల విలువైన భూములు కేటాయించారు.

గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.546కోట్ల మేర ఆయా సంస్థలు చెల్లింపులు చేశాయి. మరో రూ.131కోట్లు చెల్లించాల్సి ఉంది. రాజధానిలో 45 కేంద్ర సంస్థలకు భూములు కేటాయించగా.. వాటిలో తాజాగా 40 సంస్థలు కార్యకలాపాలు ప్రారంభించేందుకు సుముఖత వ్యక్తం చేశాయి.

రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి 25 సంస్థలకు భూములు కేటాయించగా దాదాపు వాటన్నింటి నుంచీ సానుకూలత వచ్చింది. మరికొన్ని ప్రైవేటు సంస్థలు సానుకూలంగా స్పందించాయి. మొత్తానికి మరో వారం రోజుల్లో అమరావతిలో ఏర్పాటు కాబోయే సంస్థల మీద స్పష్టత వస్తుంది. రెండు నెలల్లో అవి పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సీఆర్‌డీఏ అధికారులు భావిస్తున్నారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 04 2024, 19:56

Congress: ఈనెల 10న తెలంగాణకు కురియన్ కమిటీ

Telangana: పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ వైఫల్యాలపై అధ్యయనానికి పలు రాష్ట్రాల్లో ఏఐసీసీ నిజనిర్ధారణ కమిటీలు వేసింది. ఈ నేపథ్యంలో ఈనెల 10న కురియన్ కమిటీ రానుంది.

మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, ఒడిస్సా, ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలో ఏఐసీసీ నిజనిర్ధారణ కమిటీలు వేసింది.

పార్లమెంట్ ఎన్నికల్లో (Parliament Elections) కాంగ్రెస్ (Congress) వైఫల్యాలపై అధ్యయనానికి పలు రాష్ట్రాల్లో ఏఐసీసీ (AICC) నిజనిర్ధారణ కమిటీలు వేసింది. ఈ నేపథ్యంలో ఈనెల 10న కురియన్ కమిటీ రానుంది.

మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, ఒడిస్సా, ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలో ఏఐసీసీ నిజనిర్ధారణ కమిటీలు వేసింది. తెలంగాణలో (Telangana) నిజనిర్ధారణ కోసం కురియన్ కమిటీని అధిష్టానం నియమించింది.

కురియన్‌తో పాటు రక్హిబుల్ హుసేన్, పర్గత్ సింగ్‌లతో తెలంగాణ కమిటీ ఏర్పాటు అయ్యింది. ఈనెల 10న రాష్ట్రానికి రానున్న కమిటీ... తెలంగాణలో పలువురు కాంగ్రెస్ నేతల నుంచి సమాచారాన్ని సేకరించనుంది. రెండు మూడు రోజుల పాటు తెలంగాణలోనే ఉండి పలు నియోజకవర్గాలు తిరిగే అవకాశం ఉంది. కురియన్ కమిటీ రిపోర్ట్ తర్వాతే కార్పొరేషన్ పదవులు ఇద్దామనే ఆలోచనలో హస్తం నేతలు ఉన్నట్లు సమాచారం.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 04 2024, 19:52

జీన్స్, టీషర్ట్‌తో ఆమ్రపాలి.. డిఫరెంట్ లుక్‌లో హైదరాబాద్‌ రోడ్లపై దూకుడు

జీహెచ్ఎంసీ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన ఐఏఎస్ ఆఫీసర్ ఆమ్రపాలి కాటా.. డిఫరెంట్ లుక్‌లో కనిపించారు.

అప్పుడెప్పుడో పెళ్లి కాకముందు.. వరంగల్ కలెక్టర్‌గా ఉన్న సమయంలో ట్రెక్కింగ్‌ లాంటివి చేసినప్పుడు మాత్రమే జీన్స్ టీషర్ట్‌లో కనిపించిన ఆమ్రపాలి..

మరోసారి ఆ లుక్‌లో కనిపించారు. జీన్స్, టీషర్ట్‌తో హైదరాబాద రోడ్లపై సాధారణ అమ్మాయిలా ఎంట్రీ ఇచ్చి.. పలు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఆయా ప్రాంతాల్లోని పారిశుద్ధ్య నిర్వహణను పరిశీలించారు.

అనంతరం.. రోడ్లపై ఉన్న ప్రజలతో మాట్లాడి.. పారిశుద్ధ్యంపై అవగాహన కల్పించారు. సిబ్బంది పని తీరు ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు.

విద్యార్థులతోనూ ఆమె సరదాగా ముచ్చటించారు. కాగా.. ఆమ్రపాలికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 04 2024, 19:07

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసుపై తొలిసారి స్పందించిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వం

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసుపై ఇన్నాళ్లూ మీడియాలో వార్తలు రావడం తప్ప ఏనాడూ పెదవి విప్పని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తొలిసారి ఈ విషయంలో స్పందించింది.

ఈ కేసులో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నామని, తప్పించుకు తిరుగుతున్న నిందితులు సహా ఒక్కర్ని కూడా వదలబోమని హెచ్చరించింది.

ప్రజాస్వామ్య వ్యవస్థ మూలాలను దెబ్బతీసేలా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, దీని ప్రభావం సమాజంపై తీవ్రంగా ఉందని ఆవేదన వ్యక్తం చేసింది. కేసు దర్యాప్తు విషయంలో ఎలాంటి పక్షపాతం లేకుండా చట్టానికి లోబడి, సీనియర్ పోలీసు అధికారులు సహా నేరంలో బాధ్యులైన ఏ ఒక్కరినీ విడిచిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది.

ఇప్పటికే చార్జ్‌షీట్ దాఖలు చేశామని, వెలుగులోకి వస్తున్న కొత్త అంశాలపై ఆధారాలు సేకరించేందుకు, తదుపరి దర్యాప్తు కొనసాగించేందుకు ట్రయల్ కోర్టు అనుమతి తీసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది. కాగా, ఈ కేసు తదుపరి విచారణ ఈ నెల 23న జరగనుంది.

కాగా, ఈ కేసులో హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసిన ప్రభుత్వం.. ఫోన్ ట్యాపింగ్ బాధితుల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు పొంగులేటి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, హైకోర్టు జడ్జి శరత్ తదితరుల పేర్లు ఉన్నట్టు పేర్కొంది. మరోవైపు, ఇదే కేసుపై కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించింది. ఫోన్ ట్యాపింగ్ కేసుపై రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు చేస్తోందని, వివరాలు పరిశీలించాక స్పందిస్తామని కేంద్రం కూడా అఫిడవిట్ దాఖలు చేసింది

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 04 2024, 19:05

Rythu Runa Mafi | రుణమాఫీకి నిధులెట్ల?.. దిక్కుతోచని స్థితిలో కాంగ్రెస్‌ ప్రభుత్వం

రాష్ట్రంలో వ్యవసాయ రుణాల మాఫీకి గడువు సమీపిస్తుండటంతో కాంగ్రెస్‌ ప్రభుత్వం దిక్కతోచని స్థితిలో పడింది. రుణమాఫీతోపాటు 6 గ్యారంటీల అమలుకు కావాల్సిన నిధులను ఎలా సమీకరించాలన్న దానిపై మల్లగుల్లాలు

రాష్ట్రంలో వ్యవసాయ రుణాల మాఫీకి గడువు సమీపిస్తుండటంతో కాంగ్రెస్‌ ప్రభుత్వం దిక్కతోచని స్థితిలో పడింది. రుణమాఫీతోపాటు 6 గ్యారంటీల అమలుకు కావాల్సిన నిధులను ఎలా సమీకరించాలన్న దానిపై మల్లగుల్లాలు పడుతున్నది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తి బడ్జెట్‌ను ఈ నెలాఖరులోగా ప్రవేశపెట్టాల్సి ఉండటంతో సంబంధిత అంచనాలను ఆర్థిక శాఖ సిద్ధం చేస్తున్నది.

దీనిలో భాగంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క ఆధ్వర్యంలో శాఖల వారీగా సమీక్షలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు వ్యవసాయం, జౌళి, రెవెన్యూ తదితర శాఖలతో బడ్జెట్‌ సన్నాహక సమావేశాలు నిర్వహించారు. ఉద్యోగుల జీతాలతోపాటు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు కోసం ఆదాయాన్ని పెంచుకునేందుకు కొత్త నిర్ణయాలను తీసుకునే అవకాశాలను పరిశీలిస్తున్నట్టు తెలుస్తున్నది.

రూ.28 వేల కోట్లకు చేరిన అప్పు

రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పటికీ నుంచి ఇప్పటివరకు రూ.28 వేల కోట్ల అప్పులు తెచ్చింది. ఈ నెలాఖరు నాటికి మొత్తం అప్పు రూ.31 వేల కోట్లకు చేరుకునే అవకాశాలు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో వ్యవసాయ రుణాల మాఫీ, రైతు భరోసా, 6 గ్యారంటీలు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుకు అవసరమైనన్ని నిధులను బడ్జెట్‌లో కేటాయించడం కాంగ్రెస్‌ ప్రభుత్వానికి కష్టమేనని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.