GHMC జీహెచ్‌ఎంసీ కౌన్సిల్‌ సమావేశం రసాభాస.. పోడియంను చుట్టుముట్టిన బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు

జీహెచ్‌ఎంసీ (GHMC) సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. కౌన్సిల్‌ సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు మేయర్‌ పోడియాన్ని చుట్టుముట్టారు.

మేయర్‌ గద్వాల విజయలక్ష్మికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.

హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ (GHMC) సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. కౌన్సిల్‌ సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు మేయర్‌ పోడియాన్ని చుట్టుముట్టారు. మేయర్‌ గద్వాల విజయలక్ష్మికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు.

పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.

పలువురు కార్పొరేటర్లు మేయర్‌తో వాగ్వాదానికి దిగారు. వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. దీంతో సమావేశ మందిరంలో గందరగోళం నెలకొన్నది. దీంతో బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లపై మేయర్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు

Andhra Pradesh: అమరావతికి వచ్చేస్తాం..

అమరావతి రాజధానిలో సంస్థల ఏర్పాటు అంశాన్ని సీఆర్‌డీఏ అత్యంత ప్రాధాన్యంగా తీసుకుంటోంది.

అమరావతి రాజధానిలో సంస్థల ఏర్పాటు అంశాన్ని సీఆర్‌డీఏ అత్యంత ప్రాధాన్యంగా తీసుకుంటోంది. అమరావతిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన 130 సంస్థలకు భూములు కేటాయించారు. సీఆర్‌డీఏ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగం వాటి యాజమాన్యాలతో సంప్రదింపులు జరుపుతోంది.

ఇక్కడ సంస్థను ఎప్పుడు ఏర్పాటు చేస్తారు.. పనులు ఎప్పుడు ప్రారంభిస్తారు.. వంటి అంశాలపై చర్చిస్తోంది. కార్యాలయాల ఏర్పాటుపై శుక్రవారం నాటికి 80శాతం సంస్థల నుంచి సానుకూలత వచ్చిందని సీఆర్‌డీఏ వర్గాలు చెబుతున్నాయి. ఇంకా 25కుపైగా సంస్థల నుంచి స్పష్టత రావాల్సి ఉంది. కొన్ని సంస్థలు వైసీపీ ప్రభుత్వ హయాంలో బెదిరింపుల కారణంగా తరలిపోవటంవల్ల వాటినుంచి ఎలాంటి స్పష్టత రాలేదు. అమరావతిలో సంస్థల ఏర్పాటు నిమిత్తం మొత్తం 130 సంస్థలకు 1,660 ఎకరాలు కేటాయించారు. అప్పట్లో ఆయా సంస్థలకు కొన్ని లీజు ప్రాతిపదికన, మరికొన్ని అవుట్‌రేట్‌ సేల్‌ ప్రాతిపదికన రూ.677.10కోట్ల విలువైన భూములు కేటాయించారు.

గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.546కోట్ల మేర ఆయా సంస్థలు చెల్లింపులు చేశాయి. మరో రూ.131కోట్లు చెల్లించాల్సి ఉంది. రాజధానిలో 45 కేంద్ర సంస్థలకు భూములు కేటాయించగా.. వాటిలో తాజాగా 40 సంస్థలు కార్యకలాపాలు ప్రారంభించేందుకు సుముఖత వ్యక్తం చేశాయి.

రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి 25 సంస్థలకు భూములు కేటాయించగా దాదాపు వాటన్నింటి నుంచీ సానుకూలత వచ్చింది. మరికొన్ని ప్రైవేటు సంస్థలు సానుకూలంగా స్పందించాయి. మొత్తానికి మరో వారం రోజుల్లో అమరావతిలో ఏర్పాటు కాబోయే సంస్థల మీద స్పష్టత వస్తుంది. రెండు నెలల్లో అవి పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సీఆర్‌డీఏ అధికారులు భావిస్తున్నారు.

Congress: ఈనెల 10న తెలంగాణకు కురియన్ కమిటీ

Telangana: పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ వైఫల్యాలపై అధ్యయనానికి పలు రాష్ట్రాల్లో ఏఐసీసీ నిజనిర్ధారణ కమిటీలు వేసింది. ఈ నేపథ్యంలో ఈనెల 10న కురియన్ కమిటీ రానుంది.

మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, ఒడిస్సా, ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలో ఏఐసీసీ నిజనిర్ధారణ కమిటీలు వేసింది.

పార్లమెంట్ ఎన్నికల్లో (Parliament Elections) కాంగ్రెస్ (Congress) వైఫల్యాలపై అధ్యయనానికి పలు రాష్ట్రాల్లో ఏఐసీసీ (AICC) నిజనిర్ధారణ కమిటీలు వేసింది. ఈ నేపథ్యంలో ఈనెల 10న కురియన్ కమిటీ రానుంది.

మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, ఒడిస్సా, ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలో ఏఐసీసీ నిజనిర్ధారణ కమిటీలు వేసింది. తెలంగాణలో (Telangana) నిజనిర్ధారణ కోసం కురియన్ కమిటీని అధిష్టానం నియమించింది.

కురియన్‌తో పాటు రక్హిబుల్ హుసేన్, పర్గత్ సింగ్‌లతో తెలంగాణ కమిటీ ఏర్పాటు అయ్యింది. ఈనెల 10న రాష్ట్రానికి రానున్న కమిటీ... తెలంగాణలో పలువురు కాంగ్రెస్ నేతల నుంచి సమాచారాన్ని సేకరించనుంది. రెండు మూడు రోజుల పాటు తెలంగాణలోనే ఉండి పలు నియోజకవర్గాలు తిరిగే అవకాశం ఉంది. కురియన్ కమిటీ రిపోర్ట్ తర్వాతే కార్పొరేషన్ పదవులు ఇద్దామనే ఆలోచనలో హస్తం నేతలు ఉన్నట్లు సమాచారం.

జీన్స్, టీషర్ట్‌తో ఆమ్రపాలి.. డిఫరెంట్ లుక్‌లో హైదరాబాద్‌ రోడ్లపై దూకుడు

జీహెచ్ఎంసీ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన ఐఏఎస్ ఆఫీసర్ ఆమ్రపాలి కాటా.. డిఫరెంట్ లుక్‌లో కనిపించారు.

అప్పుడెప్పుడో పెళ్లి కాకముందు.. వరంగల్ కలెక్టర్‌గా ఉన్న సమయంలో ట్రెక్కింగ్‌ లాంటివి చేసినప్పుడు మాత్రమే జీన్స్ టీషర్ట్‌లో కనిపించిన ఆమ్రపాలి..

మరోసారి ఆ లుక్‌లో కనిపించారు. జీన్స్, టీషర్ట్‌తో హైదరాబాద రోడ్లపై సాధారణ అమ్మాయిలా ఎంట్రీ ఇచ్చి.. పలు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఆయా ప్రాంతాల్లోని పారిశుద్ధ్య నిర్వహణను పరిశీలించారు.

అనంతరం.. రోడ్లపై ఉన్న ప్రజలతో మాట్లాడి.. పారిశుద్ధ్యంపై అవగాహన కల్పించారు. సిబ్బంది పని తీరు ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు.

విద్యార్థులతోనూ ఆమె సరదాగా ముచ్చటించారు. కాగా.. ఆమ్రపాలికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసుపై తొలిసారి స్పందించిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వం

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసుపై ఇన్నాళ్లూ మీడియాలో వార్తలు రావడం తప్ప ఏనాడూ పెదవి విప్పని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తొలిసారి ఈ విషయంలో స్పందించింది.

ఈ కేసులో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నామని, తప్పించుకు తిరుగుతున్న నిందితులు సహా ఒక్కర్ని కూడా వదలబోమని హెచ్చరించింది.

ప్రజాస్వామ్య వ్యవస్థ మూలాలను దెబ్బతీసేలా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, దీని ప్రభావం సమాజంపై తీవ్రంగా ఉందని ఆవేదన వ్యక్తం చేసింది. కేసు దర్యాప్తు విషయంలో ఎలాంటి పక్షపాతం లేకుండా చట్టానికి లోబడి, సీనియర్ పోలీసు అధికారులు సహా నేరంలో బాధ్యులైన ఏ ఒక్కరినీ విడిచిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది.

ఇప్పటికే చార్జ్‌షీట్ దాఖలు చేశామని, వెలుగులోకి వస్తున్న కొత్త అంశాలపై ఆధారాలు సేకరించేందుకు, తదుపరి దర్యాప్తు కొనసాగించేందుకు ట్రయల్ కోర్టు అనుమతి తీసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది. కాగా, ఈ కేసు తదుపరి విచారణ ఈ నెల 23న జరగనుంది.

కాగా, ఈ కేసులో హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసిన ప్రభుత్వం.. ఫోన్ ట్యాపింగ్ బాధితుల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు పొంగులేటి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, హైకోర్టు జడ్జి శరత్ తదితరుల పేర్లు ఉన్నట్టు పేర్కొంది. మరోవైపు, ఇదే కేసుపై కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించింది. ఫోన్ ట్యాపింగ్ కేసుపై రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు చేస్తోందని, వివరాలు పరిశీలించాక స్పందిస్తామని కేంద్రం కూడా అఫిడవిట్ దాఖలు చేసింది

Rythu Runa Mafi | రుణమాఫీకి నిధులెట్ల?.. దిక్కుతోచని స్థితిలో కాంగ్రెస్‌ ప్రభుత్వం

రాష్ట్రంలో వ్యవసాయ రుణాల మాఫీకి గడువు సమీపిస్తుండటంతో కాంగ్రెస్‌ ప్రభుత్వం దిక్కతోచని స్థితిలో పడింది. రుణమాఫీతోపాటు 6 గ్యారంటీల అమలుకు కావాల్సిన నిధులను ఎలా సమీకరించాలన్న దానిపై మల్లగుల్లాలు

రాష్ట్రంలో వ్యవసాయ రుణాల మాఫీకి గడువు సమీపిస్తుండటంతో కాంగ్రెస్‌ ప్రభుత్వం దిక్కతోచని స్థితిలో పడింది. రుణమాఫీతోపాటు 6 గ్యారంటీల అమలుకు కావాల్సిన నిధులను ఎలా సమీకరించాలన్న దానిపై మల్లగుల్లాలు పడుతున్నది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తి బడ్జెట్‌ను ఈ నెలాఖరులోగా ప్రవేశపెట్టాల్సి ఉండటంతో సంబంధిత అంచనాలను ఆర్థిక శాఖ సిద్ధం చేస్తున్నది.

దీనిలో భాగంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క ఆధ్వర్యంలో శాఖల వారీగా సమీక్షలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు వ్యవసాయం, జౌళి, రెవెన్యూ తదితర శాఖలతో బడ్జెట్‌ సన్నాహక సమావేశాలు నిర్వహించారు. ఉద్యోగుల జీతాలతోపాటు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు కోసం ఆదాయాన్ని పెంచుకునేందుకు కొత్త నిర్ణయాలను తీసుకునే అవకాశాలను పరిశీలిస్తున్నట్టు తెలుస్తున్నది.

రూ.28 వేల కోట్లకు చేరిన అప్పు

రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పటికీ నుంచి ఇప్పటివరకు రూ.28 వేల కోట్ల అప్పులు తెచ్చింది. ఈ నెలాఖరు నాటికి మొత్తం అప్పు రూ.31 వేల కోట్లకు చేరుకునే అవకాశాలు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో వ్యవసాయ రుణాల మాఫీ, రైతు భరోసా, 6 గ్యారంటీలు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుకు అవసరమైనన్ని నిధులను బడ్జెట్‌లో కేటాయించడం కాంగ్రెస్‌ ప్రభుత్వానికి కష్టమేనని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

రైతు నుంచి లంచం తీసుకుంటూ పట్టుబడిన అవినీతి చేప..

ఓ రైతు నుండి 8000 రూపాయలు లంచం తీసుకొని వనపర్తి జిల్లా గోపాల్ పేట తహశీల్దార్ శ్రీనివాసులు ఏసీబీ అధికారులకు బుధవారం పట్టుబడ్డాడు. ఇందుకు సంబంధించి మహబూబ్ నగర్ ఏసీబీ డి.ఎస్.పీ కృష్ణ గౌడ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

మండల పరిధిలోని పలకపాటు గ్రామం జింకల మిట్ట తండాకు చెందిన ముడావత్ పాండు నాయక్ అనేవ్యక్తి తనకున్న వ్యవసాయ పొలంలో కోళ్ల ఫారం షెడ్ నిర్మాణం చేశాడు. ఆ స్థలాన్ని నాన్ అగ్రికల్చర్ గా మార్చేందుకు ఈనెల 21వ తేదీన చాలన్ చెల్లించాడు. ఈనెల 22వ తేదీన పాండు నాయక్, అతని భార్య సౌందర్య కలిసి తహశీల్దారు వద్దకు వెళ్లి నిర్మించిన పౌల్ట్రీ ఫామ్ కు నాలా పర్మిషన్ ఇవ్వాలని అడగగా.. తహశీల్దార్ 15వేల రూపాయలు ఇవ్వాలి అని డిమాండ్ చేశాడు. పాండు నాయక్ తాము అంతా ఇచ్చుకోలేమని తగ్గించాలని కోరగా పదివేల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకున్నారు.

ఈనెల 23వ తేదీన మరోసారి వచ్చి సార్ అన్ని డబ్బులు కూడా ఇవ్వలేము అనగా చివరగా ఎనిమిది వేల రూపాయలు ఇస్తే నాలా పర్మిషన్ ఇస్తామని చెప్పడంతో పాండు నాయక్ ఇంటికి వెళ్లి అవినీతి నిరోధక శాఖ అధికారులకు సంబంధించిన వీడియోలను చూసి.. మహబూబ్ నగర్ డీఎస్పీ కృష్ణ గౌడ్ కు సమాచారం ఇచ్చి అతనిని స్వయంగా కలిశారు.

ఇందులో భాగంగా కృష్ణ గౌడ్ తో పాటు మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాకు చెందిన నలుగురు సీఐలు, పదిమంది ఇతర సిబ్బందితో కలిసి రైతు పాండు నాయక్ కు ఎనిమిది వేల రూపాయలను ఇచ్చే విధంగా పథకం రూపొందించి అమలు చేశారు. డబ్బులు ఇచ్చి బయటకు వచ్చిన రైతు విషయాన్ని అధికారులకు తెలపడంతో వారు లోపలికి వెళ్లి తహశీల్దార్ ను అదుపులోకి తీసుకొని, 8000 రూపాయలు స్వాధీనపరచుకొని కేసునమోదు చేశారు.

సారు కారు 16 నుంచి జీరోకి బీఆర్ఎస్

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అధికారం దూరం అయినా ఆ పార్టీ నేతల వ్యవహార శైలి మారలేదని వివరించారు. ఇప్పటికీ ఆ పార్టీ నేతలు వాట్సాప్ యూనివర్సిటీలో జీవిస్తున్నారని మండిపడ్డారు. గతంలో సారు కారు 16 అన్నారు.. అలా అని జీరోకి వచ్చారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ సహా బీఆర్ఎస్ నేతలంతా ఊహాల్లోంచి బయటకు రావాలని కోరారు. బయటకు వస్తే వాస్తవ పరిస్థితి ఏంటో తెలుస్తోందని సూచించారు.

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అధికారం దూరం అయినా ఆ పార్టీ నేతల వ్యవహార శైలి మారలేదని వివరించారు. ఇప్పటికీ ఆ పార్టీ నేతలు వాట్సాప్ యూనివర్సిటీలో జీవిస్తున్నారని మండిపడ్డారు. గతంలో సారు కారు 16 అన్నారు.. అలా అని జీరోకి వచ్చారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ సహా బీఆర్ఎస్ నేతలంతా ఊహాల్లోంచి బయటకు రావాలని కోరారు. బయటకు వస్తే వాస్తవ పరిస్థితి ఏంటో తెలుస్తోందని సూచించారు.

తెలంగాణ రాష్ట్రంలో తమ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరుగుతోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సంచలన ఆరోపణలు చేశారు. ఆ కుట్ర బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు తెలుసు అని వివరించారు. ఆ కుట్రను సహించలేక వారంతా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని వెల్లడించారు. ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలు చేరారని, మరింత మంది వస్తారని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం చేపట్టే సంక్షేమ కార్యక్రమాలు చూసి ఎమ్మెల్యేలు వస్తున్నారని స్పష్టం చేశారు.

ఎమ్మెల్యేల పార్టీ మార్పు గురించి బీఆర్ఎస్ నేతలు సుద్దులు చెబుతున్నారు.. గతంలో ఏం జరిగిందని ప్రశ్నించారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను.. సీఎల్పీని విలీనం చేయలేదా అని నిలదీశారు.

ఆదిత్యనాథ్ దాస్‌ను నీటిపారుదల శాఖ సలహాదారునిగా నియమించడంపై భట్టి విక్రమార్క స్పందించారు. ఆయన నీటి పారుదల రంగంలో నిపుణులు, అందుకే అడ్వైజర్‌గా నియమించుకున్నాం. ఒకవేళ ఆదిత్యనాథ్ మా అంచనాలు అందుకోకుంటే పక్కన పెడతాం అని తెగేసి చెప్పారు.

4న విద్యా సంస్థల బంద్‌ : ఎస్‌ఎఫ్‌ఐ

విద్యారంగ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ జూలై 4వ తేదీన జరిగే విద్యా సంస్థల బంద్‌ను జయప్రదం చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ మండల కార్యదర్శి పుట్టల ఉదయ్‌కుమార్‌ పిలుపునిచ్చారు.

విద్యారంగ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ జూలై 4వ తేదీన జరిగే విద్యా సంస్థల బంద్‌ను జయప్రదం చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ మండల కార్యదర్శి పుట్టల ఉదయ్‌కుమార్‌ పిలుపునిచ్చారు.

మంగళవారం జరిగిన ఎస్‌ఎఫ్‌ఐ మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశానికి డాక్టర్లను అందించే నీట్‌ పరీక్షపత్రాన్ని లీక్‌చేయడంతో 20లక్షల మంది విద్యార్థుల జీవితం అగమ్యగోచరంగా మారిందన్నారు.

విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగే విద్యా సంస్థల బంద్‌ కార్యక్రమంలో విద్యార్ధులు, తల్లిదండ్రులు, యాజమాన్యాలు సహకరించాలని కోరారు. ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు బుంగమట్ల శివ, పిల్లి కార్తీక్‌, దాసరి కార్తీక్‌, ముఖేష్‌ పాల్గొన్నారు.

కుళ్లిన రొయ్యలు.. గడువు ముగిసిన పన్నీర్.. ఫుడ్‌సేఫ్టీ అధికారుల దాడుల్లో బయటపడ్డ నిజాలు

నగరంలోని టాస్క్‌ఫోర్స్ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. గచ్చిబౌలి, నానక్‌రామ్ గూడలోని ప్రముఖ రెస్టారెంట్లపై బుధవారం ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు.

తబలారస రెస్టారెంట్‌లో కల్తీ ఆహార పదార్థాలతో వంటకాలు చేయాడాన్ని గుర్తించారు. ఫ్రిజ్‌లో కుళ్ళిన రొయ్యలు, గడువు ముగిసిన పన్నీర్, పుట్టగొడుగులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

నగరంలోని టాస్క్‌ఫోర్స్ అధికారుల (Taskforce officers) దాడులు కొనసాగుతున్నాయి. గచ్చిబౌలి, నానక్‌రామ్ గూడలోని ప్రముఖ రెస్టారెంట్లపై బుధవారం ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. తబలారస రెస్టారెంట్‌లో కల్తీ ఆహార పదార్థాలతో వంటకాలు చేయాడాన్ని గుర్తించారు.

ఫ్రిజ్‌లో కుళ్ళిన రొయ్యలు, గడువు ముగిసిన పన్నీర్, పుట్టగొడుగులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. నాన్ వెజ్ వంటకాల్లో మోతాదుకు మించి కలర్స్ వేస్తున్నట్లు ధ్రువీకరించారు.

హకూన మటాటా చైనీస్ రెస్టారెంట్‌లో నాణ్యత లేని ఆహార పదార్థాలతో వంటలు తయారు చేస్తున్నట్లు సోదాల్లో బయటపడింది. అలాగే కిచెన్‌లో అపరిశుభ్రతమైన వాతావరణాన్ని గుర్తించారు. అయితే ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ సర్టిఫికెట్లు లేకుండానే రెస్టారెంట్ల నిర్వహణ జరుగుతోంది అధికారులు తెలిపారు. ఆహార పదార్థాల శాంపిల్స్‌ను ల్యాబ్ పంపించారు. అలాగే పలు రెస్టారెంట్లకు టాస్క్ ఫోర్స్ అధికారులు నోటీసులు ఇచ్చారు.