Tank Accident Ladakh: లడఖ్‌లో ఘోర ప్రమాదం.. ఐదుగురు సైనికులు మృతి..

కేంద్రపాలిత ప్రాంతం లడఖ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ట్యాంక్ ఎక్సర్‌సైజ్‌లో భాగంగా నది దాటుతుండగా ఈ ప్రమాదం జరిగింది. లడఖ్‌లోని వాస్తవ నియంత్రణ రేఖకు సమీపంలో నది దాటుతున్న సమయంలో ట్యాంక్ ప్రమాదానికి గురై ఐదుగురు సైనికులు మరణించారు

కేంద్రపాలిత ప్రాంతం లడఖ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ట్యాంక్ ఎక్సర్‌సైజ్‌లో భాగంగా నది దాటుతుండగా ఈ ప్రమాదం జరిగింది. లడఖ్‌లోని వాస్తవ నియంత్రణ రేఖకు సమీపంలో నది దాటుతున్న సమయంలో ట్యాంక్ ప్రమాదానికి గురై ఐదుగురు సైనికులు మరణించారు.

T-72 ట్యాంక్‌లో మందిర్ మోర్హ్ నది దాటుతుండగా ఒక్కసారిగా ప్రవాహ ఉద్ధృతి పెరిగి ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు వెల్లడించారు. దౌలత్‌ బెగ్‌ ఓల్డీ ప్రాంతంలో భారత సైన్యం నిర్వహించిన విన్యాసాల్లో శనివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. నదిని దాటే ట్యాంక్‌ విన్యాసాలు చేస్తుండగా..

ఒక్కసారిగా నీటి ఉద్ధృతి పెరిగింది. దీంతో ఐదుగురు జవాన్లు నదిలో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో జూనియర్‌ కమిషన్డ్‌ అధికారి ఉన్నట్లు రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి.

విన్యాసాలు చేస్తుండగా..

దౌలత్ బేగ్ ఓల్డి ప్రాంతంలో ఆర్మీ సైనికులు నదిలో ట్యాంక్ క్రాసింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ సమయంలో నది నీటిమట్టం ఒక్కసారిగా పెరగడంతో ట్యాంక్ నీటిలో చిక్కుకుంది. ఈ మేరకు రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు. లడఖ్‌లోని ఎల్‌ఎసి సమీపంలో అకస్మాత్తుగా వచ్చిన వరదలో ఐదుగురు ఆర్మీ సైనికులు కొట్టుకుపోయారని అధికారులు తెలిపారు. నీటిలోంచి ఇప్పటి వరకు కొందరి మృతదేహాలను వెలికితీశారు. ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.

నేడు స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు రాక

అసెంబ్లీ స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు శనివారం నగరానికి రానున్నారు.

అసెంబ్లీ స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు శనివారం నగరానికి రానున్నారు. సభాపతిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారిగా జిల్లాకు వస్తుండడంతో ఘనంగా స్వాగతం పలికేందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయన శనివారం ఉదయం గన్నవరం విమానాశ్రయంలో బయలుదేరి పది గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు.

ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా దసపల్లా హోటల్‌కు వెళతారు. అక్కడ ఆయన్ను నగర ప్రముఖులు, అధికారులు, టీడీపీ నాయకులు కలవనున్నారు. మధ్యాహ్నం భోజనం చేసిన తరువాత అనకాపల్లి వెళ్లి నూకాంబికా అమ్మవారిని దర్శించుకుంటారు. అక్కడ నుంచి నర్సీపట్నం వెళతారు.

జిల్లా ప్రజా పరిషత్‌ స్థాయీ సంఘ సమావేశాలు శనివారం ఉదయం పది గంటల నుంచి జరుగుతాయని సీఈఓ ఎం.పోలినాయుడు తెలిపారు. జడ్పీ సమావేశ మందిరంలో చైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర అధ్యక్షతన ఉదయం 10 గంటలకు రెండు, ఐదు, 11 గంటలకు మూడు, నాలుగు స్థాయీ సంఘ సమావేశాలు నిర్వహిస్తామన్నారు.

మధ్యాహ్నం 12 గంటలకు ఒకటి, ఆరు, ఏడు స్థాయీ సంఘ సమావేశాలు జరుగుతాయని...ఈ సమావేశాలకు సభ్యులు హాజరుకావాలని ఆయన కోరారు.

ఆవులు, గొర్రెలు మరియు కోళ్ల పెంపకానికి ప్రభుత్వం నుండి 58,000 సబ్సిడీ. ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి

వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న రైతులకు వ్యవసాయం స్థిరమైన ఆదాయాన్ని తెచ్చిపెడుతుందని భరోసా ఇవ్వలేరు. ఎందుకంటే మన దేశంలో వ్యవసాయం వాతావరణంపై ఆధారపడి ఉండడం, కరువు, అనావృష్టి, చీడపీడలు, సీజన్‌లో కనీస ధర లేకపోవడం తదితర కారణాల వల్ల రైతు కష్టాలు పడుతున్నాయి. వీటన్నింటి మధ్య భారతదేశం ప్రాథమికంగా గ్రామాల దేశం మరియు మన దేశంలో చాలా మంది ప్రజలు జీవనోపాధి కోసం వ్యవసాయాన్ని అనుసరిస్తున్నారు.

ఈ విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగానికి ప్రత్యేక పథకాలు, వ్యవసాయ యంత్రాల కొనుగోలుకు సబ్సిడీ రుణాలు, సబ్సిడీ రుణాలు, రాయితీపై విత్తనాలు, ఎరువుల పంపిణీ, పంటల బీమా, కిసాన్ సమ్మాన్ ద్వారా సబ్సిడీ నిధులు పెద్ద మొత్తంలో కేటాయించాయి. ఫండ్ పథకాలు మరియు ఇతర పథకాలు.

ఇప్పుడు వ్యవసాయం, పాడిపరిశ్రమ, గొర్రెలు, కోళ్లు మరియు మేకల పెంపకానికి అనుకూలం మరియు అభివృద్ధి చెందింది. వ్యవసాయంతో పాటు వ్యవసాయం, గొర్రెలు, కోళ్లు, మేకల పెంపకం, పాడిపరిశ్రమ, పందుల పెంపకం, పశుపోషణ, చేపల వేట మొదలైన వాటి కోసం రైతులు తమ సొంత వ్యాపారాన్ని ప్రారంభించి, తద్వారా ఆర్థికంగా బలపడాలని ప్రోత్సహిస్తారు.

దీన్ని ఎలా పొందాలి, ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి, ఏ పత్రాలు అందించాలి, వివరాలు ఇలా ఉన్నాయి ప్రస్తుతం మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం కింద రైతులు ఈ సదుపాయాన్ని పొందవచ్చు. మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం ద్వారా గొర్రెలు, కోళ్లు, మేకల పెంపకం, పాడిపరిశ్రమపై ఆధారపడిన రైతులకు షెడ్డు అవసరం కాబట్టి షెడ్డు నిర్మాణానికి రూ.57 వేల వరకు సబ్సిడీ ఇస్తారు.

తెలుగు రాష్టాల న రైతులు మాత్రమే ఈ పథకానికి అర్హులు.

దరఖాస్తుదారులు షెడ్ నిర్మాణానికి సొంత వ్యవసాయ భూమిని కలిగి ఉండి, గొర్రెల కోళ్ల మేకల పెంపకం లేదా పాడి లేదా చేపల వేటలో నిమగ్నమై ఉండాలి.

షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగలకు చెందిన దరఖాస్తుదారులకు అధిక ప్రాధాన్యత ఇవ్వబడుతుంది నాలుగు కంటే ఎక్కువ పశువులను తరలించే రైతులు దరఖాస్తు చేసుకోవచ్చు.

పశువైద్యుని నుండి ధృవీకరణ పొందాలి.

ఈ పథకం కింద నిర్మించే షెడ్డు 10 అడుగుల వెడల్పుతో పాటు 18 అడుగుల గోడతో పాటు 5 అడుగుల ఎత్తులో గోడ, పార, పశుగ్రాసం ట్యాంక్‌తో నిర్మించాలి. లోపల పశువులకు వెంటిలేషన్ మరియు వెలుతురు వచ్చే విధంగా షీట్లను కూడా నిర్మించాలి.

రూ.57,000 బడ్జెట్ లో రూ.10,556 వేతనాలకు, రూ.46,444 అవసరమైన సామగ్రి కొనుగోలుకు వినియోగిస్తున్నారు.

అవసరమైన పత్రాలు

దరఖాస్తుదారుడి ఆధార్ కార్డు తప్పనిసరి

బ్యాంక్ పాస్ బుక్ వివరాలు

షెడ్ నిర్మాణం కోసం ప్రతిపాదిత స్థలం గురించి పత్రాలు పశువుల కోసం పొందిన మెడికల్ సర్టిఫికేట్

సూచించిన దరఖాస్తు ఫారమ్

ఇతర ముఖ్యమైన పత్రాలు

jagan: ఫలితాలు చూసి.. అన్నీ వదిలేసి హిమాలయాలకు పోదామనిపించింది!

ఫలితాలు చూశాక.. షాక్‌ అయ్యా.. ఇదేంటి, ఇంత చేస్తే ఈ రిజల్ట్‌ ఏంటి? అసలు అన్నీ వదిలేసి హిమాలయాలకు వెళ్లిపోదామనిపించింది’.. మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్‌ చేసిన వ్యాఖ్యలివి.

ఫలితాలు చూశాక.. షాక్‌ అయ్యా.. ఇదేంటి, ఇంత చేస్తే ఈ రిజల్ట్‌ ఏంటి? అసలు అన్నీ వదిలేసి హిమాలయాలకు వెళ్లిపోదామనిపించింది’.. మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్‌ చేసిన వ్యాఖ్యలివి.

ఆ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో గత వారం నిర్వహించిన సమావేశంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఆలస్యంగా బయటికొచ్చాయి.

ఫలితాలను చూసినప్పుడు తన మానసిక పరిస్థితి గురించి నేతలకు వివరించే క్రమంలో ఆయనీ మాటలు అన్నట్లు తెలిసింది. ‘నిజంగా వెళ్లిపోదామనే అనిపించింది. ఆ షాక్‌లోంచి బయటకు రావడానికి రెండు మూడు రోజుల పైనే పట్టింది.

కానీ, ఎన్నికల్లో సీట్లు రాకపోయినా 40 శాతం ఓట్లు మన పార్టీకి వచ్చాయి, అంటే అంత పెద్ద సంఖ్యలో జనం మన పట్ల నమ్మకాన్ని పెట్టుకున్నారు. అది చూశాకనే మనం నిలబడాలి, మనకు ఓట్లు వేసిన జనం కోసం పని చేయాలనిపించింది. దాంతోనే మెల్లగా ఫలితాల నుంచి బయటికొచ్చా.

Telangana Weather Forecast: బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు వర్ష సూచన

బంగాళాఖాతంలో ఉత్తర ఒడిశా తీరానికి సమీపంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో తెలంగాణలో పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ మేరకు వాతావరణ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.

శని ఆదివారాల్లో 15 జిల్లాల్లో బలమైన గాలులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని సూచించింది. కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలకు పసుపు రంగు హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్ లోనూ తేలికిపాటి వర్షాలు పడే అవకాశం ఉంది.

ఇక రాష్ట్రంలో శుక్రవారం పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం కొల్లాయిలో అత్యధికంగా 6 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండలో 3.6, రాయికల్ మండలం అల్లీపూర్‌లో 3.1, హనుమకొండ జిల్లా నడికుడిలో 2.6, ములుగు జిల్లా వాజేడు మండలం ధర్మవరంలో 2.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. రంగారెడ్డి, మంచిర్యాల, కరీంనగర్, కామారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, వరంగల్, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లోనూ చిరు జల్లులు పడ్డాయి

Dharmapuri Srinivas: కాంగ్రెస్ సీనియర్ నేత డి. శ్రీనివాస్ కన్నుమూత

కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం తెల్లవారుజామున 3 గంటలకు హైదరాబాద్‌లోని తన నివాసంలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచినట్టు కుటుంబసభ్యులు తెలిపారు.

నిజామాబాద్ జిల్లాకు చెందిన డీఎస్ కాంగ్రెస్ పార్టీలో పీసీసీ అధ్యక్షుడిగా, మంత్రిగా సేవలందించారు. రాష్ట్ర విభజన తరువాత 2015లో బీఆర్ఎస్‌లో చేరి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆ తరువాత మళ్లీ కాంగ్రెస్‌లో చేరారు. డీఎస్‌కు ఇద్దరు కుమారులు కాగా పెద్ద కుమారుడు ధర్మపురి అర్వింద్ ప్రస్తుతం బీజేపీ తరపున నిజామాబాద్ ఎంపీగా ఉన్నారు. పెద్ద కుమారుడు సంజయ్ గతంలో నిజామాబాద్ మేయర్‌గా పనిచేశారు

డీఎస్ 1948 సెప్టెంబర్ 27న జన్మించారు. నిజాం కళాశాలలో డిగ్రీ పూర్తి చేసిన ఆయన 1989లో కాంగ్రెస్ తరపున నిజామాబాద్ అర్బన్ ఎమ్యెల్యేగా తొలిసారి ఎన్నికయ్యారు. 1999, 2004 ఎన్నికల్లోనూ విజయం సాధించారు. 1989-94 మధ్య కాలంలో గ్రామీణాభివృద్ధి, ఐ అండ్ పీఆర్ శాఖ మంత్రిగా, 2004-08 మధ్య కాలంలో ఉన్నతవిద్య, అర్బన్, లాండ్ సీలింగ్ శాఖల మంత్రిగా ఉన్నారు. 2004, 2009 ఎన్నికల సందర్భంగా పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు. 2004 నాటి టీఆర్ఎస్-కాంగ్రెస్ పొత్తులో క్రీయాశీలకంగా వ్యవహరించారు. పార్టీని అధికారంలో తెచ్చేందుకు వైఎస్‌తో కలిసి కృషి చేశారు.

సోనియాకు విధేయుడిగా గుర్తింపు పొందిన డీఎస్‌కు ప్రణబ్ ముఖర్జీ తదితర సీనియర్ నేతలతో కూడా సన్నిహిత సంబంధాలు ఉండేవి. 2013- 15 వరకూ శాసన మండలి సభ్యునిగా బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం శాసనమండలిలో విపక్ష నేతగా కొనసాగారు. రెండోసారీ ఎమ్మెల్సీగా అవకాశం రాకపోవడంతో అసంతృప్తి చెంది 2018లో కాంగ్రెస్‌కు రాజీనామా చేసి టీఆర్ఎస్‌లో చేరారు. 2016-22 మధ్య టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. ఆ సమయంలోనే పార్టీతో విభేదించి మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు.

తండ్రి దూరమవడంపై కుమారుడు అర్వింద్ కన్నీటి పర్యంతమయ్యారు. ‘‘అన్నా అంటే నేనున్నానని.. ఏ ఆపదలో అయినా ఆదుకునే శీనన్న ఇక లేరు. నా తండ్రి, గురువు అన్నీ మా నాన్నే. పోరాడు భయపడకు అని నేర్పింది ఆయనే. ప్రజలను ప్రేమించి, ప్రజల కొరకే జీవించు అని చెప్పేవారు. నాన్నా.. నువ్వు ఎప్పటికీ నాతోనే ఉంటావు. నాలోనే ఉంటావు’’ అని అర్వింద్ కన్నీరుమున్నీరయ్యారు.

TG News: రంగారెడ్డి జిల్లాలో భారీ పేలుడు.. ఆరుగురి మృతి


జిల్లాలోని షాద్‌నగర్‌లో గల సౌత్‌ గ్లాస్‌ పరిశ్రమలో భారీ పేలుడు జరిగింది. పేలుడు ఘటనలో ఆరుగురు కార్మికులు మృతిచెందారు. బాయిలర్‌ పేలినట్లు స్థానికులు చెబుతున్నారు.

రంగారెడ్డి: జిల్లాలోని షాద్‌నగర్‌లో గల సౌత్‌ గ్లాస్‌ పరిశ్రమలో భారీ పేలుడు జరిగింది. పేలుడు ఘటనలో ఆరుగురు కార్మికులు మృతిచెందారు.

బాయిలర్‌ పేలినట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రమాద సమయంలో పరిశ్రమలో 30 మంది పనిచేస్తున్నారు. వారిలో 20 మంది కార్మికులకు తీవ్రగాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలు అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. మరో నలుగురి ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పరిశ్రమలో చెల్లాచెదురుగా శరీర భాగాలు పడ్డాయి

ఒకేసారి పేలుడు సంభవించినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రులకు తరలించారు. ఈ దుర్ఘటన ఎలా జరిగిందనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు.

ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతులు ఒడిశా, బిహార్‌, యూపీ వాసులుగా గుర్తించారు. తీవ్ర గాయాలైన వారిని మెరుగైన చికిత్స కోసం ఉస్మానియా, గాంధీ ఆస్పత్రికి తరలించే అవకాశం ఉంది.

మాన్యం చెల్క ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సొంత భవనం త్వరగా పూర్తి చేయాలి. ఐద్వా డిమాండ్

మాన్యం చెల్క ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సొంత భవనం త్వరగా పూర్తి చేయాలి. ఐద్వా డిమాండ్

అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా ఆధ్వర్యంలో ఈ రోజు మాన్యం చేల్క ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో సర్వే నిర్వహించడం జరిగింది. ఐద్వా అధ్యక్ష మరియు కార్యదర్శి మాట్లాడుతూ నల్లగొండ పట్టణంలోని మాన్యం చెల్కా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సొంత భవనం లేక ఇక్కడ సిబ్బంది ఎన్నో ఇబ్బందులకు గురి అవుతున్నారు. వచ్చిన పేషెంట్లకు గాలి వెళుతురు లేక ఇబ్బంది పడుతున్నారు.వెంటనే సొంత భవనం నిర్మించాలని కోరుతూ ఇక్కడ స్టాఫ్ 15 మంది ఉన్నారు.

ఒకే డాక్టరు రోజు కి 100 మంది పేషెంట్లను చూడడం జరుగుతుంది. కావున ఇంకొక డాక్టర్ ని రిఫర్ చేయాలని కోరుతూ ప్రతి మంగళవారం ఆరోగ్య మహిళ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఒకే డాక్టర్ రోజు చూసే 100 మందికి కాక అదనంగా పేషెంట్లు వస్తారు. వాళ్లకు ఫార్మసిస్ వాళ్లే మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది.

అలా కాకుండా డాక్టరు పరీక్షలు చేసి చూస్తే బాగుంటుందన్నారు. గవర్నమెంట్ నిధులు కేటాయించి సొంత హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలని కోరుతూ ఇక్కడ స్టాఫ్ కి శాలరీస్ కూడా మంత్లీ మంత్లీ రావటం లేదు వైఫై కనెక్షన్ వాళ్ళ సొంత ఖర్చులతోనే ఉపయోగిస్తున్నారు.

అలాగే కరెంట్ బిల్లు కూడా (20000) ఇరవై వెయ్లు పెండింగ్ లో ఉంది. ఈ సమస్యలపై త్వరగా ప్రభుత్వం స్పందించి ఇక్కడ కావలసిన నిధులు కేటాయించాలి అని డిమాండ్ చేసినారు.

మాకు మేయరూ మీకు ఉప మేయరూ...!

అపుడే పదవుల పంపకాలు మొదలయిపోయాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పక్షం రోజులు కాలేదు. లోకల్ బాడీస్ విషయంలో గోడ దూకుళ్లకు తెర లేపాలని చూస్తున్నారు. విశాఖ కార్పొరేషన్ ఇపుడు వైసీపీ చేతిలో ఉంది

నాలుగేళ్ల వరకూ మేయర్ మీద అవిశ్వాసం పెట్టకూడదని వైసీపీ ప్రభుత్వం హయాంలో చట్టం చేశారు. ఇపుడు ఆ చట్టాన్ని మార్చి మూడేళ్ళకే అని సవరిస్తారని అంటున్నారు. 2021 మార్చిలో విశాఖ మేయర్ పీఠం వైసీపీ పరం అయింది. ప్రస్తుతం ఉన్న చట్టం ప్రకారం చూసుకుంటే 2025 మార్చి వరకూ మేయర్ సీటుకు ఢోకాలేదు.

కానీ టీడీపీ తమ్ముళ్ళ ఆరాటం అలాగే అధినాయకత్వం ఆలోచనలు చూస్తూంటే మూడేళ్ళకే అవిశ్వాసం అన్న సవరణలను తొందరలోనే తెస్తారని అంటున్నారు. 98 మంది కార్పోరేటర్లు ఉన్న విశాఖ కార్పొరేషన్ లో వైసీపీకి 57 మంది ఉన్నారు. టీడీపీకి 30 మంది ఉంటే జనసేన ప్లస్ బీజేపీకి కలిపి నలుగురు ఉన్నారు. వీరు కాకుండా ఎక్స్ అఫీషియో మెంబర్ గా ఎమ్మెల్యేలు ఎంపీలు కలసి చూస్తే టీడీపీ మెజారిటీ యాభైకి చేరుకుంటుందని అంటున్నారు.

వైసీపీ నుంచి కొందరిని తమ వైపు తిప్పుకుంటే దర్జాగా విశాఖ మేయర్ పీఠం తమ చేతిలోకి వస్తుందని టీడీపీ నేతలు అంటున్నారు. గతంలో విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన నాయకునికే మేయర్ పీఠం అప్పగించాలని చూస్తున్నారు. తమకు సహకరించిన జనసేన బీజేపీలకు చెరో ఉప మేయర్ ఇస్తారని అంటున్నారు.

విశాఖ కార్పొరేషన్ కి 2026 ఏప్రిల్ దాకా పదవీ కాలం ఉంది. దాంతో రానున్న రెండేళ్ళలోనూ తమ ఆధీనంలో విశాఖ కార్పోరేషన్ ని ఉంచుకుంటే మొత్తం మెగా సిటీ అంతా టీడీపీ కూటమి గుప్పిట్లో ఉంటుందని భావిస్తున్నారు. విశాఖ మేయర్ పీఠం టీడీపీకి దక్కి నాలుగు దశాబ్దాలు అవుతోంది. 1987లో తొలిసారి గెలిచిన టీడీపీకి మళ్లీ ఆ చాన్స్ రాలేదు. దాంతో చరిత్రను తిరగరాయాలని చూస్తోంది. అంతే కాకుండా విశాఖ సిటీలో వైసీపీని రాజకీయంగా మరింతగా దెబ్బ తీయాలన్న అసలైన వ్యూహం ఇందులో ఉంది అని అంటున్నారు.

తెలంగాణలో పవన్‌కు వై కేటగిరి సెక్యూరిటీ: రోడ్డు మార్గంలో క్షేత్రదర్శనం

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలంగాణలో పర్యటించనున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. ఉప ముఖ్యమంత్రి హోదాలో పర్యటించబోతోండటం ఇదే తొలిసారి.

ఆయన పర్యటన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. తెలంగాణలో వై సెక్యూరిటీ భద్రతను పవన్ కల్యాణ్‌కు కల్పించారు.

ప్రస్తుతం పవన్ కల్యాణ్ వారాహి అమ్మవారి దీక్షలో ఉన్న విషయం తెలిసిందే. ఆయన మాల ధారణ చేశారు.

11 రోజులపాటు నిష్ఠగా ఈ దీక్ష చేయనున్నారు. ఈ సమయంలో ఆహారంగా పాలు, పండ్లు, ద్రవ పదార్థాలను మాత్రమే తీసుకుంటారు. గత ఏడాది కూడా ఆయన ఇదే దీక్ష చేశారు.