అన్నదాత సుఖీభవ
విసుకు చెందిన రైతులు కూటమి వైపు మొగ్గారు. ఇప్పుడు ఆ కూటమి రైతుపక్షాన ఏడాదికి రూ.20 వేలు చొప్పున వారి ఖాతాల్లో వేస్తూ... అన్నదాత సుఖీభవ అంటూ దీవించింది
పేరుకే పథకం. ఎప్పుడు ఖాతాలో సొమ్ము పడుతుందో తెలియదు. ఏ తేదీన వేస్తారో.. వేయరో కూడా సొమ్ము పడేంత వరకు అనుమానమే. పేరుకు మాత్రం రైతు ప్రభుత్వం. పైపైకి మాత్రం రైతన్నలు అంటే తనకెంతో ఇష్టం. ఈ ఐదేళ్లు ఇలా కృత్రిమంగా గడిపేశారు. రైతు భరోసా పేరిట రైతుకు సకాలంలో చెందాల్సిన సొమ్మును అందకుండా చేశారు. ఆఖరికి ఎన్నికలకు ముందు కొందరు రైతులకు ఏదో ముట్టచెప్పారు. మరికొందరికీ మొండిచేయి చూపారు. విసుకు చెందిన రైతులు కూటమి వైపు మొగ్గారు. ఇప్పుడు ఆ కూటమి రైతుపక్షాన ఏడాదికి రూ.20 వేలు చొప్పున వారి ఖాతాల్లో వేస్తూ... అన్నదాత సుఖీభవ అంటూ దీవించింది.
అప్పుడేమో రైతుకు దక్కని భరోసా
గడిచిన ఐదేళ్లలో జగన్ సర్కార్ అన్ని వర్గాలను నమ్మించి మోసం చేసినట్లే రైతులను వదల్లేదు. సాధా రణంగా తొలకరి ఆరంభమైన వెంటనే వ్యవసాయ పనులు ముమ్మరవుతాయి. ఆ లోపే అటు సహకార సంఘాల నుంచి రుణం కాని, ప్రభుత్వం విధాన నిర్ణయమైన ప్రత్యేక పథకం ద్వారా గాని రైతుకు సొమ్ము చేతిలో పడాలి. కాని జగన్ సర్కార్ పట్టించు కోలేదు. వ్యవసాయ ఆధారిత జిల్లా అయిన ఉమ్మడి పశ్చిమలో సాగు చేసే రైతుల సంఖ్య మిగతా జిల్లాల కంటే అత్యధికమే. గడిచిన ప్రభుత్వంలో రైతులను ఆదుకునేందుకు రైతు భరోసా ప్రకటించారు. ఏటా రూ.13 వేలు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం ఇచ్చే మరో రూ.6 వేలు మొత్తం మీద కలిపి రూ.19 వేలు రైతు లకు అందిస్తామంటూ ఊదరగొట్టారు. రైతు ఖాతా లను తెరిపించారు. వ్యవసాయ సీజన్ ఆరంభం కాక మునుపే మే, జూన్ నెలల్లో గతంలో కేంద్రం ఇచ్చే మొత్తం రూ.6 వేలను మూడింటిగా విభజించి సీజ నల్ వారీగా రూ.2 వేలు చొప్పున రైతు ఖాతాలో పడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా రూ.13 వేలు ప్రకటించగా, దీనిని రెండుగా విభజించి ఒకసారి రూ.5,500, రెండో దఫా రూ.2 వేలుగా రైతు ఖాతాల్లో జమ చేయాల్సి ఉంది. కాని చానాళ్ళు ఖరీఫ్ ఆరంభా నికి ముందే బటన్ నొక్కినా సొమ్ము రైతు ఖాతాల్లో జమే కాలేదు. ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తాం అంటూ నాన్చి వేసేవారు. పైకి మాత్రం అందరి ఖాతాల్లోనూ సొమ్ములు జమ చేసినట్లు గొప్పలు చెప్పేవారు. కేంద్రం ఇచ్చే వాటాను తానే ఇస్తున్నట్లు గొప్పలకు పోయారు. దీనికి సమాంతరంగా సహకార సంఘా లను భ్రష్టు పట్టించారు. రైతు భరోసా కింద యాంత్రీ కరణ పరికరాలు, విత్తనాలు, ఎరువులు ఇస్తామని చెప్పి నానా హంగామా చేశారు. ఇది కూడా కొంత మందికే పరిమితమైంది. గడిచిన ఐదేళ్ళలోనూ గోదా వరి రైతు ఎక్కడా సంతృప్తి చెందిన దాఖలాలే లేవు.
విసుకు చెందిన రైతులు కూటమి వైపు మొగ్గారు. ఇప్పుడు ఆ కూటమి రైతుపక్షాన ఏడాదికి రూ.20 వేలు చొప్పున వారి ఖాతాల్లో వేస్తూ... అన్నదాత సుఖీభవ అంటూ దీవించింది
ఇప్పుడేమో అన్నదాత సుఖీభవ
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల్లో కొత్త ఆశలు అలుముకున్నాయి. తాము అధి కార పగ్గాలు చేపట్టిన వెంటనే ఏటా రైతు ఖాతాలో రూ.20 వేలు జమ చేస్తామని, ఎన్నికల సమయంలో కూటమి నేతలు హామీలు ఇచ్చారు. ఇప్పుడు ఆ మాట ను అక్షరాల నిలబెట్టుకోవడానికి కూటమి ప్రభుత్వం సంసిద్ధమైంది. రైతు ఖాతాలో గడిచిన ప్రభుత్వం ఖరీఫ్‌కు కొంత సొమ్ము జమ చేసినా కొంత మాత్రమే రైతుకు చేరింది. మిగతా సొమ్ము అంతా గప్‌చిప్. కూటమి ప్రభుత్వం తాను ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అన్నదాత సుఖీభవ కింద రైతులకు ఏటా రూ.20 వేలు చెల్లించాలి. దీనిలో కేంద్రం వాటా రూ.6వేలు కాగా, రాష్ట్రవాటా రూ.14 వేలు, ఈ ప్రాతి పదికపై రైతుల ఖాతాల్లో సొమ్ములు చెల్లించి వ్యవసాయాన్ని ప్రోత్సహించాల్సి ఉంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రైతుభరోసా కింద అప్పట్లో రెండున్నర లక్షల మందికి పైగానే సొమ్ములు అందు కోగా, ఒక్క ఏలూరు జిల్లాలోనే లక్షా 50 వేల మందికి పైగా రైతులు ఉన్నారు. దీనికి తోడు కౌలు రైతులు ఉమ్మడి జిల్లాలో 3 లక్షలు ఉండగా, ఏలూరు జిల్లాలో లక్షా 30 వేల మందికి పైగానే ఉన్నారు. ఇంతకు ముందు మాదిరి కేంద్రం వాటాను మూడు వాటా లుగా విభజిస్తారా ? రాష్ట్ర వాటాను రెండు విడతలా ? లేదా ? మూడు విడతలు చేస్తారా ? అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు రైతుకు అవసర మైన సొమ్మును సకాలంలో అందించే ప్రయత్నం చేస్తారా ? అనేది ఇప్పుడు తేలాల్సి ఉంది. తొలకరి ప్రారంభమై చానాళ్ళు అయింది. చాలామంది రైతుల చేతుల్లో చిల్లిగవ్వలేదు. ఒకవైపు చూస్తే సొసైటీలు పడకేశాయి. ఇంకోవైపు అధికవడ్డీ ఇచ్చే వారంతా కాపు కాసుకొని కూర్చొన్నారు. వీటన్నింటి నడుమ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఖరీఫ్‌లోనే ఏం చేయబోతుందనేదే ప్రధాన ప్రశ్న. మరోవైపు కౌలు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే పథకాలు వర్తించవు. ఇదొక ప్రధాన సమస్య. ఈసారి అన్నదాత సుఖీభవలో రైతులకు సంతృప్తిని ఇచ్చే అనేక అంశాలు ఉన్నాయి. అందుకనే వైసీపీతో విభేదించి అంతా కూటమి పక్షాన చేరారు. కొత్త ప్రభుత్వంపై ఆశలు పెంచుకు
విసుకు చెందిన రైతులు కూటమి వైపు మొగ్గారు. ఇప్పుడు ఆ కూటమి రైతుపక్షాన ఏడాదికి రూ.20 వేలు చొప్పున వారి ఖాతాల్లో వేస్తూ... అన్నదాత సుఖీభవ అంటూ దీవించింది.
పేరుకే పథకం. ఎప్పుడు ఖాతాలో సొమ్ము పడుతుందో తెలియదు. ఏ తేదీన వేస్తారో.. వేయరో కూడా సొమ్ము పడేంత వరకు అనుమానమే. పేరుకు మాత్రం రైతు ప్రభుత్వం. పైపైకి మాత్రం రైతన్నలు అంటే తనకెంతో ఇష్టం. ఈ ఐదేళ్లు ఇలా కృత్రిమంగా గడిపేశారు. రైతు భరోసా పేరిట రైతుకు సకాలంలో చెందాల్సిన సొమ్మును అందకుండా చేశారు. ఆఖరికి ఎన్నికలకు ముందు కొందరు రైతులకు ఏదో ముట్టచెప్పారు. మరికొందరికీ మొండిచేయి చూపారు. విసుకు చెందిన రైతులు కూటమి వైపు మొగ్గారు. ఇప్పుడు ఆ కూటమి రైతుపక్షాన ఏడాదికి రూ.20 వేలు చొప్పున వారి ఖాతాల్లో వేస్తూ... అన్నదాత సుఖీభవ అంటూ దీవించింది.
అప్పుడేమో రైతుకు దక్కని భరోసా
గడిచిన ఐదేళ్లలో జగన్ సర్కార్ అన్ని వర్గాలను నమ్మించి మోసం చేసినట్లే రైతులను వదల్లేదు. సాధా రణంగా తొలకరి ఆరంభమైన వెంటనే వ్యవసాయ పనులు ముమ్మరవుతాయి. ఆ లోపే అటు సహకార సంఘాల నుంచి రుణం కాని, ప్రభుత్వం విధాన నిర్ణయమైన ప్రత్యేక పథకం ద్వారా గాని రైతుకు సొమ్ము చేతిలో పడాలి. కాని జగన్ సర్కార్ పట్టించు కోలేదు. వ్యవసాయ ఆధారిత జిల్లా అయిన ఉమ్మడి పశ్చిమలో సాగు చేసే రైతుల సంఖ్య మిగతా జిల్లాల కంటే అత్యధికమే. గడిచిన ప్రభుత్వంలో రైతులను ఆదుకునేందుకు రైతు భరోసా ప్రకటించారు. ఏటా రూ.13 వేలు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం ఇచ్చే మరో రూ.6 వేలు మొత్తం మీద కలిపి రూ.19 వేలు రైతు లకు అందిస్తామంటూ ఊదరగొట్టారు. రైతు ఖాతా లను తెరిపించారు. వ్యవసాయ సీజన్ ఆరంభం కాక మునుపే మే, జూన్ నెలల్లో గతంలో కేంద్రం ఇచ్చే మొత్తం రూ.6 వేలను మూడింటిగా విభజించి సీజ నల్ వారీగా రూ.2 వేలు చొప్పున రైతు ఖాతాలో పడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా రూ.13 వేలు ప్రకటించగా, దీనిని రెండుగా విభజించి ఒకసారి రూ.5,500, రెండో దఫా రూ.2 వేలుగా రైతు ఖాతాల్లో జమ చేయాల్సి ఉంది. కాని చానాళ్ళు ఖరీఫ్ ఆరంభా నికి ముందే బటన్ నొక్కినా సొమ్ము రైతు ఖాతాల్లో జమే కాలేదు. ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తాం అంటూ నాన్చి వేసేవారు. పైకి మాత్రం అందరి ఖాతాల్లోనూ సొమ్ములు జమ చేసినట్లు గొప్పలు చెప్పేవారు. కేంద్రం ఇచ్చే వాటాను తానే ఇస్తున్నట్లు గొప్పలకు పోయారు. దీనికి సమాంతరంగా సహకార సంఘా లను భ్రష్టు పట్టించారు. రైతు భరోసా కింద యాంత్రీ కరణ పరికరాలు, విత్తనాలు, ఎరువులు ఇస్తామని చెప్పి నానా హంగామా చేశారు. ఇది కూడా కొంత మందికే పరిమితమైంది. గడిచిన ఐదేళ్ళలోనూ గోదా వరి రైతు ఎక్కడా సంతృప్తి చెందిన దాఖలాలే లేవు.
ఇప్పుడేమో అన్నదాత సుఖీభవ
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల్లో కొత్త ఆశలు అలుముకున్నాయి. తాము అధి కార పగ్గాలు చేపట్టిన వెంటనే ఏటా రైతు ఖాతాలో రూ.20 వేలు జమ చేస్తామని, ఎన్నికల సమయంలో కూటమి నేతలు హామీలు ఇచ్చారు. ఇప్పుడు ఆ మాట ను అక్షరాల నిలబెట్టుకోవడానికి కూటమి ప్రభుత్వం సంసిద్ధమైంది. రైతు ఖాతాలో గడిచిన ప్రభుత్వం ఖరీఫ్‌కు కొంత సొమ్ము జమ చేసినా కొంత మాత్రమే రైతుకు చేరింది. మిగతా సొమ్ము అంతా గప్‌చిప్. కూటమి ప్రభుత్వం తాను ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అన్నదాత సుఖీభవ కింద రైతులకు ఏటా రూ.20 వేలు చెల్లించాలి. దీనిలో కేంద్రం వాటా రూ.6వేలు కాగా, రాష్ట్రవాటా రూ.14 వేలు, ఈ ప్రాతి పదికపై రైతుల ఖాతాల్లో సొమ్ములు చెల్లించి వ్యవసాయాన్ని ప్రోత్సహించాల్సి ఉంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రైతుభరోసా కింద అప్పట్లో రెండున్నర లక్షల మందికి పైగానే సొమ్ములు అందు కోగా, ఒక్క ఏలూరు జిల్లాలోనే లక్షా 50 వేల మందికి పైగా రైతులు ఉన్నారు. దీనికి తోడు కౌలు రైతులు ఉమ్మడి జిల్లాలో 3 లక్షలు ఉండగా, ఏలూరు జిల్లాలో లక్షా 30 వేల మందికి పైగానే ఉన్నారు. ఇంతకు ముందు మాదిరి కేంద్రం వాటాను మూడు వాటా లుగా విభజిస్తారా ? రాష్ట్ర వాటాను రెండు విడతలా ? లేదా ? మూడు విడతలు చేస్తారా ? అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు రైతుకు అవసర మైన సొమ్మును సకాలంలో అందించే ప్రయత్నం చేస్తారా ? అనేది ఇప్పుడు తేలాల్సి ఉంది. తొలకరి ప్రారంభమై చానాళ్ళు అయింది. చాలామంది రైతుల చేతుల్లో చిల్లిగవ్వలేదు. ఒకవైపు చూస్తే సొసైటీలు పడకేశాయి. ఇంకోవైపు అధికవడ్డీ ఇచ్చే వారంతా కాపు కాసుకొని కూర్చొన్నారు. వీటన్నింటి నడుమ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఖరీఫ్‌లోనే ఏం చేయబోతుందనేదే ప్రధాన ప్రశ్న. మరోవైపు కౌలు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే పథకాలు వర్తించవు. ఇదొక ప్రధాన సమస్య. ఈసారి అన్నదాత సుఖీభవలో రైతులకు సంతృప్తిని ఇచ్చే అనేక అంశాలు ఉన్నాయి. అందుకనే వైసీపీతో విభేదించి అంతా కూటమి పక్షాన చేరారు. కొత్త ప్రభుత్వంపై ఆశలు పెంచుకున్నారు.
కౌలు రైతులను ఏం చేయబోతున్నారు .?
గడిచిన తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కౌలు రైతులకు ప్రత్యేక కార్డులను ప్రభుత్వం ప్రకటించింది. అప్పట్లో కౌలురైతులకు కార్డులు అందించడంలో ఉమ్మడి పశ్చిమ రాష్ట్రంలోనే తొలి వరుసలో నిలిచింది. అప్పటి కలెక్టర్ వాణీ మోహన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వ్యవసాయంలో తగిన పరపతి అందేలా చేసేందుకు కౌలు కార్డులను నియోజక వర్గాల వారీగా లక్ష్యాలుగా తీసుకుని మంజూరు చేశారు. కాని రానురాను గడిచిన ఐదేళ్ళల్లో కౌలు రైతు పరిస్థితి మళ్ళీ అడ్డం తిరిగింది. నిత్యం చెమడోచ్చి వ్యవసాయమే లక్ష్యంగా పని చేస్తున్న కౌలు రైతులకు పరపతి లేదు, అంతకంటే మించి అధిక వడ్డీలకు ఇచ్చేవారంతా పీక్కు తినడం లోనే తొలి వరుసలో ఉన్నారు. ఈ పరిస్థితిని తట్టు కోలేక కౌలు రైతు కుటుంబాల్లో అనేకమంది ఆత్మ హత్యలు చేసుకున్నారు. ఇవేమి అప్పటి జగన్ ప్రభు త్వానికి పట్టనే లేదు. కాని కూటమి మాత్రం తాము అధికారంలోకి వచ్చిన వెంటనే కౌలురైతుకు అండగా ఉంటామని ప్రకటించారు. రాష్ట్రప్రభుత్వం ప్రకటించిన అన్నదాత సుఖీభవ పథకంలో కౌలు రైతులను చేరుస్తారా? లేదా? అనేదే ఇప్పుడు అందరి ఎదుట ఉన్న ప్రశ్న. ఈ అంశాలన్నింటిని రాష్ట్రప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంటుందని, త్వరలోనే ఖచ్చితమైన మార్గదర్శకాలు వెలువడతాయని చూఛాయగా అధికారులు చెబుతున్నారు.
Jun 28 2024, 09:37