తప్పు చేస్తే దొరకక తప్పదు

Jun 28 2024, 08:59

తెలంగాణలో టీచర్లకు రేవంత్ సర్కార్ గుడ్‌న్యూస్.. నెరవేరిన ఎన్నో ఏళ్ల కల, ఫుల్ హ్యాపీ

Telangana Govt Teachers Promotions: తెలంగాణలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు పదోన్నతులు దక్కాయి. మొత్తం 18,942 మంది టీచర్లకు ప్రమోషన్లు దక్కినట్లు ప్రభుత్వం తెలిపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరు విద్యా శాఖ కూడా ఉంది.. దీంతో పదోన్నతుల విషయంలో వేగంగా నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం కలిగింది అంటున్నారు. చట్టపరమైన అడ్డంకులు

Telangana Govt Teachers Promotions: తెలంగాణలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు పదోన్నతులు దక్కాయి. మొత్తం 18,942 మంది టీచర్లకు ప్రమోషన్లు దక్కినట్లు ప్రభుత్వం తెలిపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరు విద్యా శాఖ కూడా ఉంది.. దీంతో పదోన్నతుల విషయంలో వేగంగా నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం కలిగింది అంటున్నారు. చట్టపరమైన అడ్డంకులు తొలగిపోవడంతో పదోన్నతులకు లైన్ క్లియర్ అయ్యింది. దక్కినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఎన్నో ఏళ్ల కల నెరవేరిందని టీచర్లు హర్షం వ్యక్తం చేశారు.

తెలంగాణలో టీచర్లకు ప్రమోషన్‌లు

మొత్తం 18వేల942మందికి పదోన్నతి

సీఎం రేవంత్‌కు టీచర్ల ధన్యవాదాలు

తెలంగాణలో ఉపాధ్యాయులకు రేవంత్ రెడ్డి సర్కార్ శుభవార్త చెప్పింది. టీచర్లకు పదోన్నతులు దక్కాయి.. గత 20 ఏళ్లుగా ఎస్జీటీలు, భాషాపండితులు, పీఈటీలు ఎదురుచూస్తున్నారి కలనెరవేరింది. మొత్తం 18వేల942మందికి ఈ పదోన్నతులు దక్కగా.. ఈ ప్రక్రియకు ఇబ్బందిగా మారిన చట్టపరమైన వివాదాలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పరిష్కరించారు. మల్టీజోన్‌-1 ప్రభుత్వ, స్థానిక సంస్థలకు సంబంధించి..

ఎస్జీటీ నుంచి స్కూల్‌ అసిస్టెంట్‌ - 10,083, స్కూల్‌ అసిస్టెంట్‌ నుంచి ప్రధానోపాధ్యాయులు - 1,094మందికి ప్రమోషన్లు దక్కాయి. మల్టీజోన్‌-2 విషయానికి వస్తే.. ఎస్జీటీ నుంచి స్కూల్‌ అసిస్టెంట్‌ - 6,989 స్కూల్‌ అసిస్టెంట్‌ నుంచి ప్రధానోపాధ్యాయులు - 776మందకి పదోన్నతలు వచ్చాయి.

విద్యాశాఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఉంది.. అందుకే ఉపాధ్యాయుల ప్రమోషన్లపై స్పెషల్‌గా ఫోకస్ పెట్టారు. అంతేకాదు హైకోర్టు, సుప్రీంకోర్టుల్లోని చట్టపరమైన అడ్డంకులు తొలగిపోవడంతో పదోన్నతులకు లైన్ క్లియర్ అయ్యింది. ఈ ప్రక్రియలో ఎలాంటి వివాదాలకు అవకాశం లేకుండా పెద్ద సంఖ్యలో మల్టీజోన్‌ 1, 2 పరిధిలోని ప్రభుత్వ, స్థానిక సంస్థల ఉపాధ్యాయులకు మంచి జరిగింది. గురువారంతో టీచర్ల ప్రమోషన్ల ప్రక్రియ ముగియగా.. ఆన్‌లైన్‌లో అత్యంత పారదర్శకతతో పూర్తిచేయడంపై ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. పదోన్నతులు అర్హతకు తగినట్లు దక్కడంతో ఉపాధ్యాయులు రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jun 28 2024, 08:37

High Court | విద్యుత్తు కమిషన్‌పై కేసీఆర్‌ పిటిషన్‌ సబబే.. స్పష్టంచేసిన హైకోర్టు ధర్మాసనం

విద్యుత్తు కొనుగోళ్లు, థర్మల్‌ ప్లాంట్ల నిర్మాణంపై జస్టిస్‌ ఎల్‌ నరసింహారెడ్డి నేతృత్వంలో విచారణ సంఘం ఏర్పాటును సవాల్‌ చేస్తూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ దాఖలు చేసిన పిటిషన్‌కు నంబర్‌ కేటాయించాలని హైకోర్టు నిర్ణయించింది

High Court | విద్యుత్తు కమిషన్‌పై కేసీఆర్‌ పిటిషన్‌ సబబే.. స్పష్టంచేసిన హైకోర్టు ధర్మాసనం విద్యుత్తు కొనుగోళ్లు, థర్మల్‌ ప్లాంట్ల నిర్మాణంపై జస్టిస్‌ ఎల్‌ నరసింహారెడ్డి నేతృత్వంలో విచారణ సంఘం ఏర్పాటును సవాల్‌ చేస్తూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ దాఖలు చేసిన పిటిషన్‌కు నంబర్‌ కేటాయించాలని హైకోర్టు నిర్ణయించింది. 

High Court | విద్యుత్తు కమిషన్‌పై కేసీఆర్‌ పిటిషన్‌ సబబే.. స్పష్టంచేసిన హైకోర్టు ధర్మాసనం

అభ్యంతరాలను తోసిపుచ్చిన బెంచ్‌

నంబర్‌ కేటాయించాలని రిజిస్ట్రీకి ఆదేశం

పిటిషన్‌లోని అంశాలపై నేడు విచారణ

కేసీఆర్‌ తరఫున సుప్రీం న్యాయవాది ఆదిత్య సోంధి బలమైన వాదనలు

High Court | కొనుగోళ్లు, థర్మల్‌ ప్లాంట్ల నిర్మాణంపై జస్టిస్‌ ఎల్‌ నరసింహారెడ్డి నేతృత్వంలో విచారణ సంఘం ఏర్పాటును సవాల్‌ చేస్తూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ దాఖలు చేసిన పిటిషన్‌కు నంబర్‌ కేటాయించాలని హైకోర్టు నిర్ణయించింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ జూకంటి అనిల్‌కుమార్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం గురువారం హైకోర్టు రిజస్ట్రీకి ఆదేశాలు జారీచేసింది. విద్యుత్తు వ్యవహారాలపై రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది మార్చి 14న జస్టిస్‌ ఎల్‌ నరసింహారెడ్డి నేతృత్వంలో విచారణ సంఘాన్ని నియమించింది. యాదాద్రి, భద్రాద్రి థర్మల్‌ విద్యుత్తు కేంద్రాల నిర్మాణం, ఛత్తీస్‌గఢ్‌-తెలంగాణ మధ్య విద్యుత్తు కొనుగోలు ఒప్పందాల్లో అక్రమాలు జరిగాయని ప్రభుత్వం ఆరోపించింది. కమిషన్‌ ఏర్పాటు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కేసీఆర్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. విద్యుత్తుశాఖ ముఖ్య కార్యదర్శిని, జస్టిస్‌ ఎల్‌ నరసింహారెడ్డి విచారణ సంఘాన్ని, వ్యక్తిగత హోదాలో జస్టిస్‌ ఎల్‌ నరసింహారెడ్డిని ఇందులో ప్రతివాదులుగా పేరొన్నారు. అయితే, జస్టిస్‌ నరసింహారెడ్డిని ప్రతివాదిగా చేర్చడంపై హైకోర్టు రిజిస్ట్రీ అభ్యంతరం తెలిపారు. నంబర్‌ కేటాయించేందుకు నిరాకరించారు. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ పిటిషన్‌ గురువారం హైకోర్టు ధర్మాసనం ముందు కు వచ్చింది.

దాదాపు 45 నిమిషాలపాటు వాదప్రతివాదనలు జరిగాయి. కేసీఆర్‌ తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది అదిత్య సోంధి బలంగా వాదనలు వినిపించారు. ఆయనతో ఏకీభవించిన ధర్మాసనం.. హైకోర్టు రిజిస్ట్రీ లేవనెత్తిన అభ్యంతరాలను తోసిపుచ్చింది. పిటిషన్‌కు నం బర్‌ను కేటాయించాలని ఆదేశించింది. జస్టిస్‌ నరసింహారెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ పిటిషనర్‌ అభియోగాలు మోపిన నేపథ్యంలో, పిటిషన్‌పై శుక్రవారం విచారణ చేపడతామని వెల్లడించింది. అయితే, విద్యుత్తు విచారణ సంఘం కాలపరిమితి ఈ నెలాఖరుతో ముగుస్తున్నదని, కమిషన్‌ తన విచారణ నివేదికను ఈ నెల 30వ తేదీ వరకు ప్రభుత్వానికి సమర్పించే అవకాశం ఉన్నదని సోంధి పేర్కొన్నారు. గడువు పమీపిస్తున్న కారణంగా విచారణపై స్టే విధించాలని ఆయన కోరారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. పిటిషన్‌కు నెంబర్‌ కేటాయింపుపై రిజిస్ట్రీ లేవనెత్తిన అంశం వరకే నేటిగురువారం విచారణ పరిమితమైందని అందువల్ల కమిషన్‌పై స్టే జారీ చేయలేమని స్పష్టం చేసింది. కేసీఆర్‌ పిటిషన్‌లోని అంశాలపై శుక్రవారం విచారణ చేపడతామని వెల్లడించింది.

విచారణ పూర్తికాకముందే నిర్ణయానికి

కేసీఆర్‌ తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది ఆదిత్య సోంధి వాదనలు వినిపించారు. విచారణ ఎలా ఉండాలో కమిషన్‌ ఏర్పాటు నోటిఫికేషన్‌లోనే దిశానిర్దేశం చేసినట్టుగా ఉన్నదని, ఇది చట్ట వ్యతిరేకమని తెలిపారు. జస్టిస్‌ ఎల్‌ నరసింహారెడ్డి కూడా ఏకపక్షంగా వ్యవహరించారని చెప్పారు. పిటిషనర్‌ విచారణకు హాజరుకావాలని ఏప్రిల్‌ 14న విచారణ సంఘం నోటీసులు జారీ చేసిందని, అయితే లోక్‌సభ ఎన్నికల ప్రచార హడావుడిలో ఉన్నందున తనకు జూన్‌ 15వ తేదీ వరకు గడువు ఇవ్వాలంటూ కేసీఆర్‌ కమిషనర్‌కు లేఖ రాశారని వివరించారు. అయితే అంతలోనే జస్టిస్‌ నరసింహారెడ్డి ఈ నెల 11వ తేదీన విలేకరుల సమావేశం నిర్వహించారని చెప్పారు. ఈ సందర్భంగా ధర్మాసనం కల్పించుకొని ‘జస్టిస్‌ నరసింహారెడ్డి ప్రెస్‌కాన్ఫరెన్స్‌ ఏర్పాటు చేశారా?’ అని ప్రశ్నించారు. దీనికి సోంధి అవునని సమాధానం ఇచ్చారు. ‘విలేకరుల సమావేశం నిర్వహించడమే కాదు, అప్పటివరకు జరిపిన విచారణ గురించి కూడా ఆయన బాహాటంగా వెల్లడించారు. పైగా విద్యుత్‌ కొనుగోలు ధర ఎకువగా నిర్ణయించారంటూ విచారణ పూర్తికాకముందే ఒక నిర్ణయానికి వచ్చారు. ఇప్పటికే విచారణలో 25 మందిని గుర్తించామని, మాజీ సీఎం కేసీఆర్‌, మరొక అధికారిని విచారణకు రావాలని నోటీసులు ఇస్తే గడువు కోరారని కూడా జస్టిస్‌ నరసింహారెడ్డి చెప్పారు. పూర్తి స్థాయిలో విచారణ ముగించకుండానే, పిటిషనర్‌ వాదనలు వినకుండానే ఏకపక్షంగా తన వైఖరిని బహిర్గతం చేయడం సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధం’ అని సోంధి గుర్తు చేశారు. జస్టిస్‌ నరసింహారెడ్డి విలేకరుల సమావేశాన్ని నిర్వహించడాన్ని తప్పుపడుతూ కేసీఆర్‌ లేఖ రాశారని సోంధి పేర్కొన్నారు. పరిధిని దాటిన కారణంగా విచారణ నుంచి తప్పుకోవాలని కోరారన్నారు. దీనిపై జస్టిస్‌ నరసింహారెడ్డి నుంచి స్పందన రాలేదన్నారు. తప్పు జరిగిపోయిందంటూ నోటీసు దశలోనే కమిషన్‌ నిర్ణయానికి వచ్చేయడాన్ని, ఈ విషయాన్ని విలేకరుల సమావేశంలో వెల్లడించడాన్ని తీవ్రంగా పరిగణించాలని కోరారు. కమిషన్‌ ఈ నెల 30న ప్రభుత్వానికి నివేదికను అందజేయనున్నదని తెలిపారు. ఆలోగా హైకోర్టు స్పందించాలని కోరారు

జస్టిస్‌ ఎల్‌ఎన్‌ఆరే స్వయంగా చెప్పారు

‘పీలా పోతినాయుడు ఏలేరు కుంభకోణం’పై ఏర్పాటైన జస్టిస్‌ బీకే సోమశేఖర కమిషన్‌ను సవాల్‌ చేసిన కేసులో హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ ఎల్‌ నరసింహారెడ్డి స్వయంగా వెలువరించిన తీర్పు ఈ కేసుకు బాగా వర్తిస్తుందని ఆదిత్య సోంధి తెలిపారు. విచారణ కమిషన్‌ బాధ్యతలు నిర్వహించే వ్యక్తికి కాండక్ట్‌ ఉండాలని ఆ తీర్పులో పేరొన్నారని గుర్తుచేశారు. అయితే ప్రస్తుత ఘటనలో విచారణ సంఘం తన బాధ్యతలను పక్షపాతంగా, ఏకపక్షంగా నిర్వర్తిస్తున్నదని, విలేకరుల సమావేశంలో వెల్లడించిన విషయాలే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. కమిషన్‌ ఆఫ్‌ ఎంక్వయిరీస్‌ యాక్ట్‌ ప్రకారం ఏర్పడే విచారణ సంఘాలకు నిర్దిష్ట బాధ్యతలు మాత్రమే ఉంటాయని రామకృష్ణ దాల్మియా కేసులో కోర్టు తీర్పు ఇచ్చిందని తెలిపారు.

నోటిఫికేషనే లోపభూయిష్టం

విచారణ సంఘం కోసం ప్రభుత్వం వేసిన నోటిఫికేషనే లోపభూయిష్టంగా ఉన్నదని సోం ది తెలిపారు. విద్యుత్తు కొనుగోళ్లు, విద్యుత్తు ప్లాంట్ల ఏర్పాట్లల్లో అక్రమాలు జరిగాయంటూ కమిషన్‌కు దిశానిర్దేశం చేయడం తప్పు అని స్పష్టం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో కమిషన్‌ తన పరిధిని దాటి విచారణ పూర్తి కాకుండా, అసంపూర్తి సమాచారం ఆధారంగా మీడియాకు వివరాలు వెల్లడించడం దాల్మియా కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పునకు వ్యతిరేకం అని సోంధి వాదించారు. కమిషన్‌ ఏం చేయబోయేదీ ముందే విలేకరులకు చెప్ప డం చట్ట వ్యతిరేకమని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కమిషన్‌కు న్యాయపరమైన అధికారాలు ఉండవని, కమిషన్‌ తన ఎదుట ఉన్న అంశంపై విచారణ చేసి ప్రభుత్వానికి నివేదిక మాత్రమే ఇవ్వాలని స్పష్టం చేశా రు. ఈ నిబంధనను జస్టిస్‌ నరసింహారెడ్డి ఉల్లంఘించారని పేర్కొన్నారు. యాదాద్రి థర్మల్‌ పవర్‌ప్లాంట్‌ ఏర్పాటుకు వినియోగించే సాంకేతికత వల్ల ప్రభుత్వానికి రూ.వెయ్యి కోట్ల వరకు నష్టం వస్తుందని, ఇప్పటికే రూ.250 కోట్ల నుంచి రూ.300 కోట్ల వరకు నష్టం వచ్చిందని కూడా జస్టిస్‌ నరసింహారెడ్డి తేల్చేశారని పేర్కొన్నారు. దీని ద్వారా కమిషన్‌ తుది నివేదిక ఏవిధంగా ఉండబోతున్నదో కూడా స్పష్టం అవుతున్నదని సోంధి చెప్పారు. కమిషన్‌ ఏకపక్షంగా వ్యహరిస్తున్నదని చెప్పడానికి ఇవే నిదర్శమని వాదించారు. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే జస్టిస్‌ నరసింహారెడ్డిని వ్యక్తిగతంగా ప్రతివాదిగా చేయాల్సివచ్చిందని సోంధి వివరించారు

పూర్తి వివరాలు తెలియాలి కదా?

సోంధి వాదనలు కొనసాగుతున్న దశలో ప్రభుత్వం తరఫున అడ్వకేట్‌ జనరల్‌ ఏ సుదర్శన్‌రెడ్డి కల్పించుకున్నారు. పిటిషన్‌కు రిజిస్ట్రీ నంబర్‌ కేటాయించేందుకు నిరాకరించిన అంశంపై వాదనలు వినిపించకుండా విద్యుత్తు వ్యవహారాలపై వాదనలు వినిపించడాన్ని వ్యతిరేకరించారు. దీనిపై సీనియర్‌ న్యాయవాది ఆదిత్య సోంధి కల్పించుకొని.. కేసు వివరాలు చెప్తేనే జస్టిస్‌ నరసింహారెడ్డిని ఎందుకు ప్రతివాదిగా చేయాల్సివచ్చిందో తెలుస్తుందని, అందుకే వివరాలన్నీ చెప్పాలని కోరారు. దీనిపై స్పందించిన ధర్మాసనం కేసు వివరాలు చెప్పకపోతే పిటిషన్‌కు నంబర్‌ కేటాయించాలో లేదో ఎలా నిర్ణయించగలమని ప్రశ్నించింది.

ఎస్‌ఈఆర్సీని కాదని కమిషన్‌ చెల్లదు

గత ప్రభుత్వంలో విద్యుత్తు వ్యవహారాల్లో అక్రమాలు జరిగాయని చెప్పడం, దీనికి అనుగుణంగా కమిషన్‌ పిటిషనర్‌కు 8-బీ ప్రకారం నోటీసు ఇవ్వడం చెల్లదని సోంధీ వాదించారు. మాజీ సీఎం కోట్ల విజయభాసర్‌రెడ్డి వర్సెస్‌ ఏపీ ప్రభుత్వం మధ్య జరిగిన కేసులో హైకోర్టు ఈ మేరకు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు ఆమోదించిందని గుర్తుచేశారు. నామినేషన్‌ ప్రాతిపదికపై నిర్ణయం తీసుకున్నారని, ప్రభుత్వానికి ఆర్థికంగా నష్టం చేకూరిందని చెప్పే అధికారం కమిషన్‌కు లేదని తెలిపారు. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నింటినీ ఎస్‌ఈఆర్సీ రాష్ట్ర విద్యుత్‌ రెగ్యులేటరీ అథారిటీ Confirmation చెప్పారు. న్యాయప్రాధికార సంస్థ అ యిన ఈఆర్సీ నిర్ణయాలపై విచారణ సంఘాన్ని ఏర్పాటు చేయడానికి వీలు లేదన్నారు. ఎస్‌ఈఆర్సీ నిర్ణయం చట్టవిరుద్ధంగా ఉందని భావిస్తే, ఆప్టెప్‌లు సుప్రీంకోర్టులో అప్పీల్‌ చేసుకునే అవకాశం ఉన్నదన్నారు. ఇవేమీ చేయకుండా గత ప్రభుత్వం తప్పు చేసిందని నిర్ధారణకు వచ్చేసినట్లుగా కమిషన్‌ ఏర్పాటుకు నోటిఫికేషన్‌ ఇవ్వడం, ఆ తర్వాత విచారణ సంఘం వ్యవహరించిన తీరును తీవ్రంగా పరిగణించాలని ధర్మాసనాన్ని సోంధీ కోరారు.

వచ్చేసినట్లుగా కమిషన్‌ ఏర్పాటుకు నోటిఫికేషన్‌ ఇవ్వడం, ఆ తర్వాత విచారణ సంఘం వ్యవహరించిన తీరును తీవ్రంగా పరిగణించాలని ధర్మాసనాన్ని సోంధీ కోరారు.

రాజకీయ కక్ష సాధింపులో భాగమే

రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే విచారణ సంఘాన్ని ఏర్పాటు చేశారని సోంధి వాదించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వా త విద్యుత్తు సమస్యలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో నామినేషన్‌ విధానంలో ఛత్తీస్‌గఢ్‌ – తెలంగాణ మధ్య ఒప్పందాలు జరిగాయని తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందాలు లే దా వివాదాలపై విచారణ సంఘం వేసేందుకు వీలు లేదని పేర్కొన్నారు. రాజ్యాంగ ధర్మాసనాలే ఆ వివాదాలపై విచారణ చేసి ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. పర్యావరణ అనుమతులు పొందిన తర్వాతే భదాద్రి, భద్రాద్రి థర్మల్‌ విద్యుత్తు ప్లాంట్లపై అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని తెలిపారు. విద్యుత్తు రెగ్యులేటరీ కమిషన్‌, నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ (ఎన్జీటీ) అనుమతులు ఇచ్చాయని, కేంద్ర ప్రభుత్వం కూడా అనుమతి ఇచ్చిందని పేర్కొన్నారు. కాబట్టి కేవలం రాజకీయ కక్షతోనే ఏదో తప్పు జరిగిందని చూపేందుకు ప్రభుత్వం కమిషన్‌ను ఏర్పాటు చేసిందన్నారు. ప్రతిష్ఠాత్మకమైన బీహెచ్‌ఈఎల్‌ ద్వారా పనులు చేయించుకునేందుకు నామినేషన్‌ విధానాన్ని ఎంచుకున్నట్టు చెప్పారు. సబ్‌ క్రిటికల్‌ టెక్నాలజీ, సూపర్‌ క్రిటికల్‌ టెక్నాలజీ వ్యవహారంపై కూడా కమిషన్‌ తన వైఖరిని వెల్లడించడం చెల్లదని వాదించారు. ఏది మంచో, ఏది ఉత్తమ మో బహిరంగంగా చెప్పే అధికారం కమిషన్‌కు లేనేలేదని స్పష్టం చేశారు. కమిషన్‌కు న్యాయపరమైన అధికారాలు లేవని చెప్పారు. కమిషన్‌ కేవలం ప్రభుత్వానికి సిఫార్సులతో కూడిన నివేదిక మాత్రమే ఇవ్వాలని సోంధీ పేర్కొన్నారు.

సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా

గతంలో ఉమ్మడి ఏపీ ప్రభుత్వం, మాజీ సీఎం కే విజయభాసర్‌రెడ్డి మధ్య జరిగిన కేసులో హైకోర్టు వెలువరించిన తీర్పునకు విరుద్ధంగా జస్టిస్‌ నర్సింహారెడ్డి కమిషన్‌ తీరు ఉన్నదని సోంధి వాదించారు. కమిషన్‌ ఆఫ్‌ ఎంక్వయిరీస్‌ యాక్ట్‌ సెక్షన్‌ 8(3) విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సైతం సమర్థించిందని తెలిపారు. ధర్మాసనం వెలువరించిన ఆ తీర్పులో కమిషన్‌కు న్యాయపరమైన అధికారాలు లేవని చెప్పిందని గుర్తుచేశారు. విచారణ సంఘం విచారణ పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక మాత్రమే ఇవ్వాలని, ఎవరికైనా శిక్షలు విధించడం, జరిమానాలు విధించడం వంటి ఉత్తర్వుల జారీ అధికారం కమిషన్‌కు ఉండవని సుప్రీంకోర్టు కూడా స్పష్టంగా చెప్పిందని పేర్కొన్నారు. ఉదాహరణకు మానవ హకుల కమిషన్‌ సిబ్బందికి జీతాలు చెల్లించాలన్న ఉత్తర్వులను రాజ్యాంగ ధర్మాసనాలు రద్దు చేశాయని గుర్తు చేశారు. కమిషన్‌ న్యాయ నిర్ణయాలు వెల్లడించేందుకు చట్టంలో వెసులుబాటు లేదని వివరించారు

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jun 28 2024, 08:24

T20 WC 2024: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. తొలి కెప్టెన్‌గా రికార్డ్!

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. టీ20 ప్రపంచకప్ చరిత్రలో నాకౌట్ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసిన తొలి భారత కెప్టెన్‌గా రికార్డ్ సాధించాడు. టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా ఇంగ్లండ్‌తో గురువారం జరిగిన సెమీఫైనల్-2లో భారత్ 68 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది.

ఈ మ్యాచ్‌లో రోహిత్ (39 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 57) హాఫ్ సెంచరీతో రాణించాడు. దాంతో టీ20 ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ నమోదు చేసిన తొలి భారత కెప్టెన్‌గా గుర్తింపు పొందాడు.

2007 టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో అప్పటి కెప్టెన్ ధోనీ 21 బంతుల్లో 36 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు నాకౌట్ మ్యాచ్‌ల్లో భారత కెప్టెన్ చేసిన హయ్యెస్ట్ స్కోర్‌గా ఉండగా రోహిత్ శర్మ అధిగమించాడు.

టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌లో 5వేల పరుగుల మైలురాయి అందుకున్నాడు. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ 12883 పరుగులతో టాప్‌లో ఉండగా.. ధోనీ 11207, మహమ్మద్ అజారుద్దీన్ 8095, సౌరవ్ గంగూలీ 7643 రోహిత్ కన్నా ముందున్నారు.

సిక్సర్లలో రోహిత్ హాఫ్ సెంచరీ

టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే అత్యధిక సిక్స్‌లు బాదిన తొలి భారత బ్యాటర్‌గానూ రోహిత్ శర్మ అరుదైన ఫీట్ సాధించాడు. టీ20 ప్రపంచకప్‌ల్లో ఇప్పటి వరకు రోహిత్ శర్మ 50 సిక్స్‌లు బాదాడు. 63 సిక్స్‌లతో క్రిస్ గేల్ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు.

బాబర్ ఆజామ్ రికార్డ్ బద్దలు..

అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక విజయాలు నమోదు చేసిన కెప్టెన్‌గానూ రోహిత్ శర్మ చరిత్రకెక్కాడు. ఈ క్రమంలో బాబర్ ఆజామ్ రికార్డును రోహిత్ శర్మ అధిగమించాడు. ఇప్పటి వరకు 61 మ్యాచ్‌లకు సారథ్యం వహించిన రోహిత్ శర్మ 49 మ్యాచ్‌ల్లో భారత్‌ను గెలిపించాడు. మరోవైపు బాబర్ ఆజామ్ 85 మ్యాచ్‌ల్లో పాక్‌కు 48 విజయాలు అందించాడు.

అక్షర్, కుల్దీప్ తీన్మార్..

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 171 పరుగులు చేసింది. రోహిత్ శర్మ హాఫ్ సెంచరీకి తోడుగా సూర్యకుమార్ యాదవ్36 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 47, హార్దిక్ పాండ్యా13 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 23 దూకుడుగా ఆడారు.

ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ జోర్డాన్ మూడు వికెట్లు తీయగా.. రీస్ టోప్లీ, జోఫ్రా ఆర్చర్, సామ్ కరణ్, ఆదిల్ రషీద్ తలో వికెట్ తీసారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఇంగ్లండ్ భారత స్పిన్నర్ల ధాటికి 16.4 ఓవర్లలో 103 పరుగులకే కుప్పకూలింది.

జోస్ బట్లర్(15 బంతుల్లో 4 ఫోర్లతో 23), హ్యారీ బ్రూక్(19 బంతుల్లో 3 ఫోర్లతో 25) టాప్ స్కోరర్లుగా నిలవగా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ మూడేసి వికెట్లు తీయగా.. జస్‌ప్రీత్ బుమ్రా 2 వికెట్లు పడగొట్టాడు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jun 28 2024, 08:15

Hyderabad: అమెరికాలో తెలుగోళ్ల హవా,,

ఇంట్లో తెలుగు.. వీధిలో తెలుగు.. యునివర్సిటీలో తెలుగు.. కార్యాలయంలోనూ తెలుగే.. ఇదేదో ఆంధ్రానో, తెలంగాణో అనుకుంటే పొరబడినట్టే! అగ్రరాజ్యం అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో ఇటీవలికాలంలో కనిపిస్తున్న పరిస్థితి ఇది.

ఇంట్లో తెలుగు.. వీధిలో తెలుగు.. యునివర్సిటీలో తెలుగు.. కార్యాలయంలోనూ తెలుగే.. ఇదేదో ఆంధ్రానో, తెలంగాణో అనుకుంటే పొరబడినట్టే! అగ్రరాజ్యం అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో ఇటీవలికాలంలో కనిపిస్తున్న పరిస్థితి ఇది. ఆ దేశంలో ఎక్కువ మంది మాట్లాడే 350 విదేశీ భాషల్లో తెలుగు 11వ స్థానంలో నిలిచింది. అమెరికాలో ఎక్కువగా మాట్లాడే భారతీయ భాషల జాబితాలో మనకన్నా ముందు హిందీ, గుజరాతీ ఉన్నాయి. కొన్నాళ్లుగా.. ఉన్నత విద్య, ఉపాధి కోసం ఇతర దేశాల నుంచి అమెరికాకు చేరుకుంటున్నవారిలో తెలుగువారి జనాభా గణనీయంగా పెరుగుతోంది. అమెరికా ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన గణాంకాలు ఈ విషయాన్ని అధికారికంగా స్పష్టం చేస్తున్నాయి. 2016తో పోలిస్తే 2024లో అమెరికాలో ఉంటున్న తెలుగువారి జనాభా నాలుగింతలు పెరిగిందని ఇటివలే విడుదలైన యూఎస్‌ సెన్సస్‌ బ్యూరో డేటా చెబుతోంది. ఆ నివేదిక ప్రకారం..

2016లో అమెరికాలో తెలుగు మాట్లాడేవారి సంఖ్య 3.2 లక్షలు ఉండగా..ఇప్పుడది 12.3 లక్షలకు చేరింది.

తెలుగు జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో క్యాలిఫోర్నియా ప్రథమస్థానంలో ఉంది. అక్కడ 2 లక్షల మంది తెలుగువారున్నారు. తర్వాతటెక్సస్‌(1.5 లక్షలు), న్యూజెర్సీ(1.1లక్షలు), ఇల్లినాయ్‌(83 వేలు), వర్జీనియా(78వేలు), జార్జియా(52 వేలు) ఉన్నాయి.

అమెరికాకు ఏటా వచ్చే మొత్తం విదేశీ విద్యార్థుల్లో తెలుగు విద్యార్థుల వాటా దాదాపు 13 శాతం.

అమెరికాకు ఏటా వచ్చే మొత్తం విదేశీ విద్యార్థుల్లో తెలుగు విద్యార్థుల వాటా దాదాపు 13 శాతం.

ఉపాధి కోసం వెళ్లేవారి సంఖ్యలోనూ ఏటా వృద్ధి నమోదవుతోంది. ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌ నుంచి అత్యధికులు అమెరికాకు వెళ్తుండగా.. వీరిలో సింహభాగం తెలుగు రాష్ట్రాల నుంచే ఉంటున్నారు

అమెరికాలోని అనేక ప్రముఖ వర్సిటీల్లోని విదేశీ విద్యార్థుల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థుల వాటా పెరుగుతోంది. కెంట్‌ స్టేట్‌ వర్సిటీలో మనోళ్ల ప్రవేశాలు ఎక్కువగా ఉండడంతో ‘విద్యార్థులకు స్వాగతం’ అంటూ తెలుగులో ఆహ్వానం పలకడం పట్ల మన విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఏటా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ నుంచి 60 వేల నుంచి 70 వేల మంది విద్యార్థులు, 10 వేల మందికి పైగా హెచ్‌1బీ వీసాపై అమెరికాకు చేరుకోవడమే అక్కడ మన హవా ఇంతగా పెరడగానికి ప్రధాన కారణం. ఇండియన్‌ మొబిలిటీ రిపోర్ట్‌-2024 ప్రకారం.. చదువుకోవడానికి అమెరికా వెళ్తున్న భారతీయ విద్యార్థుల్లో మన తెలుగువారి వాటా ఏకంగా12.5 శాతం!!

అమెరికాలో ఉండే అన్ని దేశాలవారు, జాతులవారు బయట మాట్లాడేది ఆంగ్లమైనా.. ఇంట్లో మాట్లాడేది మాత్రం మాతృభాషే. అలా ఆ దేశంలో ఉంటున్న భారతీయుల్లో.. ఇంట్లో మాతృభాష మాట్లాడే వారి సంఖ్య పెరుగుదలలో తెలుగువారిదే అగ్రస్థానం. 2010లో అక్కడ 2.17 లక్షల మంది ఇంట్లో తెలుగు మాట్లాడుతుండగా.. 2021 నాటికి వారి సంఖ్య 111 శాతం వృద్ధి రేటుతో 4.59 లక్షలకు చేరింది

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jun 27 2024, 19:54

ఐఫోన్ విసిరికొట్టి పుష్ప2 షూటింగ్ నుంచి వెళ్లిపోయిన దర్శకుడు సుకుమార్?

దేశవ్యాప్తంగా అత్యంత క్రేజ్ ఉండి, ఎప్పుడు వస్తుందా అని సినీ ప్రియులంతా ఉత్కంఠతో ఎదురుచూసే సినిమాల్లో పుష్ప2 ఒకటి. పుష్ప1 అనూహ్యంగా తెలుగుకు మించి బాలీవుడ్ లో ఘనవిజయం సాధించింది. దీంతో తెలుగులోకన్నా హిందీలోనే పుష్ప2పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్, రవిశంకర్, మోహన్ నిర్మిస్తున్నారు. రెండోభాగంపై భారీ అంచనాలుండటతో హీరో, నిర్మాత, దర్శకులు స్క్రిప్ట్ లో కొన్ని మార్పుచేర్పులు చేసి, బడ్జెట్ ను భారీగా పెంచి సినిమాను చేస్తున్నారు.

కొన్ని సన్నివేశాల రీషూట్

ప్రతి సన్నివేశం బాగా రావాలనే తపనతో సుకుమార్ ఉన్నారు. ఆగస్టు 15న విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడటానికి ప్రధాన కారణం ఏమిటంటే సుకుమార్ పర్ఫెక్షన్ కోసం తపిస్తుండటమే.

తాజాగా ఈ సినిమా షూటింగ్ లో ఓ సంఘటన చోటుచేసుకుంది. దర్శకుడు సుకుమార్ తన ఐఫోన్ ను సెట్ లో కోపంతో బలంగా విసిరికొట్టారు. అంతేకాదు.. అక్కడినుంచి వెళ్లిపోయారు కూడా. చాలా సన్నివేశాలు సరిగా రాలేదనే ఉద్దేశంతో ఆయన రీషూట్ చేస్తున్నారు. అందులో భాగంగానో కీలకమైన సన్నివేశం ఎన్నిసార్లు తీసినా సరిగా రావడంలేదు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jun 27 2024, 19:41

Nithiin - Multplex: ఏషియన్ నితిన్ సితారా 'కల్కి'తో షురూ!

హీరో నితిన్(Nithiin)మల్టీప్లెక్స్‌ థియేటర్‌ బిజినెస్‌లోకి అడుగుపెట్టబోతున్నారనే వార్త కొంతకాలంగా నెట్టింట వైరల్‌ అవుతున్న సంగతి తెలిసిందే! దానిని నిజం చేశారు నితిన్.

హీరో నితిన్(Nithiin)మల్టీప్లెక్స్‌ థియేటర్‌ బిజినెస్‌లోకి అడుగుపెట్టబోతున్నారనే వార్త కొంతకాలంగా నెట్టింట వైరల్‌ అవుతున్న సంగతి తెలిసిందే! దానిని నిజం చేశారు నితిన్. మహేష్‌బాబు మొదలుకొని అల్లు అర్జున్‌, రవితేజ, విజయ్‌ దేవరకొండ వరకూ థియేటర్స్‌ బిజినెస్‌లో ఉన్నారు.

ఇప్పుడు నితిన్ కూడా ఆ జాబితాలో చేరారు. ఏషియన్‌ సంస్థతో కలిసి 'ఏషియన్‌ నితిన్‌ సితార' (Asian nithiin Sitara) అనే మల్టీప్లెక్స్‌ ప్రారంభించారు.

నితిన్‌కు ఇంతకుముందే సితార థియేటర్‌ ఉంది. సంగారెడ్డిలో ఉన్న ఈ థియేటర్‌ను రెనోవేషన్‌ చేయించి ఏషియన్‌ సంస్థతో కలిసి సరికొత్త హంగులతో మల్టీప్లెక్స్‌గా మార్చారు.

దీనికి ఏషియన్‌ నితిన్‌ సితార అని పేరు పెట్టారు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే.. ప్రభాస్‌ హీరోగా నటించిన కల్కి 2898 ఎడీ’ చిత్రంతో ఈ మల్టీప్లెక్స్‌ అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం నితిన రాబినహుడ్‌, తమ్ముడు చిత్రాలతో బిజీగా ఉన్నారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jun 27 2024, 19:13

KCR: ఓమ్నీ వ్యాన్‌ను నడిపిన మాజీ సీఎం కేసీఆర్.. అసలు కారణమిదే!

తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కొత్త అవతారంలో కనిపించారు. డ్రైవర్‌గా మారి ఓమ్నీ వ్యాన్‌‌ను స్వయంగా నడిపారు. దాదాపు పదేళ్లపాటు ముఖ్యమంత్రిగా, అంతకుముందు వివిధ హోదాలు...

తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) కొత్త అవతారంలో కనిపించారు. డ్రైవర్‌గా మారి ఓమ్నీ వ్యాన్‌‌ను స్వయంగా నడిపారు. దాదాపు పదేళ్లపాటు ముఖ్యమంత్రిగా, అంతకుముందు వివిధ హోదాలు, ఉద్యమ సమయంలో కూడా ఎప్పుడూ కనిపించవి విధంగా కేసీఆర్ ఇప్పుడు కొత్తగా కనిపించడం ఆసక్తికరంగా మారింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అయితే.. కేసీఆర్ ఇలా ఓమ్నీ వ్యాన్ నడిపింది ఏదో సరదా కోసమో కాదు. దానికి ఒక కారణం ఉంది. అదేంటంటే.. బాత్‌రూమ్‌లో జారిపడ్డ ఘటనలో కేసీఆర్‌కు తుంటి ఎముక ఫ్రాక్చర్ అయిన విషయం తెలిసిందే. ఆ గాయం నుంచి ఆయన క్రమంగా కోలుకుంటున్నారు. యశోద ఆసుపత్రిలో చికిత్స పొందిన కేసీఆర్.. తొలుత వాకర్ సహకారంతో అడుగులు వేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఆ ఫ్రాక్చర్ దాదాపు నయం కావడంతో స్వయంగా కారు నడిపి చూడాలంటూ వైద్యులు ఆయనకు సూచించారు. డాక్టర్ల సలహా మేరకు కేసీఆర్ ఇలా ఓమ్నీ వ్యాన్ నడిపారు. దీంతో కేసీఆర్ సాధారణ స్థితికి చేరుకుంటున్నారంటూ బీఆర్ఎస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. సారు మళ్లీ కారు నడపడం మొదలుపెట్టారంటూ సోషల్ మీడియా వేదికగా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

కాగా తుంటి ఎముక ఫ్రాక్చర్‌ పూర్తిగా నయం కాకముందే కేసీఆర్ లోక్‌సభ ఎన్నికల క్షేత్రంలో ప్రచారం నిర్వహించారు. అసలే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన పార్టీని గట్టెక్కించేందుకు ఆయన నడుంబిగించారు.

విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. బస్సు యాత్రలు కూడా చేపట్టారు. అయినప్పటికీ లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీకి ఆశాజనక ఫలితాలు రాలేదు. ఇక జనాలతో మమేకం అయ్యేందుకు కేసీఆర్ కొన్ని కార్యక్రమాలను నిర్వహించారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jun 27 2024, 18:08

Hyderabad: తొమ్మిది మందికి ప్రొబేషనరీ ఐఏఎ్‌సల హోదా..

రాష్ట్రంలోని తొమ్మిది మంది జూనియర్‌ ఐఏఎస్‌ అధికారులకు కేంద్ర ప్రభుత్వం ‘ప్రొబేషనరీ హోదా’ కల్పించింది. ఈమేరకు వారి సర్వీసులను కన్ఫర్మ్‌ చేస్తూ కేంద్ర సిబ్బంది, ప్రజా విజ్ఞప్తులు, పెన్షన్ల మంత్రిత్వ శాఖ అండర్‌ సెక్రటరీ భూపిందర్‌ పాల్‌ సింగ్‌ బుధవారం ఉత్తర్వులను జారీ చేశారు.

రాష్ట్రంలోని తొమ్మిది మంది జూనియర్‌ ఐఏఎస్‌ అధికారులకు కేంద్ర ప్రభుత్వం ‘ప్రొబేషనరీ హోదా’ కల్పించింది. ఈమేరకు వారి సర్వీసులను కన్ఫర్మ్‌ చేస్తూ కేంద్ర సిబ్బంది, ప్రజా విజ్ఞప్తులు, పెన్షన్ల మంత్రిత్వ శాఖ అండర్‌ సెక్రటరీ భూపిందర్‌ పాల్‌ సింగ్‌ బుధవారం ఉత్తర్వులను జారీ చేశారు. వీరి సర్వీసులను కన్ఫర్మ్‌ చేస్తూ రాష్ట్రపతి ఆమోదం తెలిపారని ఆయన పేర్కొన్నారు.

ఇందులో 2020 బ్యాచ్‌కు చెందిన కధిరవన్‌ పలని ఉండగా, మిగతా ఎనిమిది మంది 2021 బ్యాచ్‌కు చెందినవారున్నారు. కధిరవన్‌ పలనికి 2023 సంవత్సరం అక్టోబరు 7 నుంచి ప్రొబేషనరీ ఐఏఎ్‌సగా కన్ఫర్మేషన్‌ ఇవ్వగా.. 2021 బ్యాచ్‌కు చెందిన శివేంద్ర ప్రతాప్‌, సంచిత్‌ గాంగ్వార్‌, ఫైజాన్‌ అహ్మద్‌, లెనిన్‌ వత్సల్‌ టొప్పో, పి.గౌతమి, పర్మర్‌ పింకేశ్‌కుమార్‌ లలిత్‌కుమార్‌, రాధికా గుప్తా, పి.శ్రీజలకు 2023 సంవత్సరం డిసెంబరు 5 నుంచి కన్ఫర్మేషన్‌ ఇచ్చారు

వీరంతా ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లుగా పని చేస్తున్నారు. అసోం క్యాడర్‌కు చెందిన సంచిత్‌ గాంగ్వార్‌ను 2022 సంవత్సరం డిసెంబరు 23న తెలంగాణ క్యాడర్‌కు బదిలీ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

వీరితో పాటు త్రిపుర రాష్ట్రానికి చెందిన మరో ఐదుగురు ఐఏఎ్‌సలకూ కేంద్రం ప్రొబేషనరీ హోదా కల్పించింది. ఈ హోదా రావడంతో వీరంతా ఇక మీదట రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేసిన రెవెన్యూ డివిజన్లకు సబ్‌-కలెక్టర్లుగా పనిచేసే అవకాశం ఉంటుంది.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jun 27 2024, 18:01

నా వాళ్లు నలుగురు.. అయితే మా వాళ్లు ఇద్దరు

మంత్రివర్గంలో ఖాళీగా ఉన్న 6 స్థానాల కోసం 10 నుంచి 12 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌ రెడ్డి నలుగురి పేర్లను హైకమాండ్‌కు ప్రపోజ్‌ చేసినట్లు సమచారం.

తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై సస్పెన్స్ వీడటం లేదు. నేతల మధ్య సమన్వయం కొరవడటంతో కేబినెట్ బెర్తుల ఖరారులో జాప్యం జరుగుతోంది. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ఢిల్లీలో ముమ్మర కసరత్తు జరుగుతోంది. కేబినెట్‌లో ఖాళీగా ఉన్న 6 స్థానాలను భర్తీ చేయడంపై నేతలంతా దృష్టి సారించారు. గడిచిన 3 రోజులుగా సీఎం సహా కీలక మంత్రులంతా ఢిల్లీలోనే మకాం వేశారు. మంత్రివర్గ విస్తరణతో పాటు పీసీసీ అధ్యక్షుడి నియామకంపై అధిష్టానం పెద్దలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌గాంధీలతో సమావేశమయ్యారు. ఈ భేటీల్లో మంత్రివర్గ విస్తరణకు గ్రీన్‌సిగ్నల్‌ లభించడంతో పాటు, కొన్ని పేర్లపై సానుకూలత వ్యక్తమైనట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో ఆయా పేర్లపై రాష్ట్ర సీనియర్‌ మంత్రుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీంతో కేబినెట్‌ విస్తరణ జాప్యం అవుతోంది. అంతా ఓ క్లారిటీ వచ్చి, చర్చించుకుని మరోసారి ఢిల్లీకి వస్తే ఫైనల్ లిస్టు ప్రకటిద్దామని అధిష్టానం చెప్పినట్లు సమాచారం.

మంత్రివర్గంలో ఖాళీగా ఉన్న 6 స్థానాల కోసం 10 నుంచి 12 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌ రెడ్డి నలుగురి పేర్లను హైకమాండ్‌కు ప్రపోజ్‌ చేసినట్లు సమచారం. మంత్రివర్గంలో ప్రాధాన్యం లేని నిజామాబాద్‌ జిల్లా నుంచి సుదర్శన్‌రెడ్డిని, ముదిరాజ్‌ సామాజికవర్గం నుంచి వాకిటి శ్రీహరిని, ఎస్టీ సామాజిక వర్గం నుంచి బాలు నాయక్‌ని, మైనార్టీ వర్గం నుంచి షబ్బీర్ అలీ పేర్లను సూచించినట్లు తెలుస్తోంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మరో ఇద్దరి పేర్లు సూచించినట్లు తెలిసింది.

రెడ్డి సామాజికవర్గం నుంచి రేసులో రాజగోపాల్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డి, పరిగి రామ్మోహన్‌రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. ఈ నేతలంతా ఢిల్లీలోనే ఉండి సీఎం రేవంత్‌రెడ్డితో గట్టిగా లాబీయింగ్ చేస్తున్నారు.

వివేక్ వెంకటస్వామి, ప్రేమ్‌సాగర్‌రావు, బాలు నాయక్‌, షబ్బీర్‌ అలీ రేసులో ఉన్నారు. ఒకే జిల్లా కావడంతో వివేక్‌, ప్రేమ్‌సాగర్‌రావులో ఒకరికే ఛాన్స్ ఉండనుంది. అంతా ఒక్కతాటిపైకి వస్తే శ్రావణమాసంలోనే కేబినెట్‌ విస్తరణ ఉండే ఛాన్స్.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jun 27 2024, 17:04

ఏపీ ఉద్యోగులకు చంద్రబాబు గుడ్ న్యూస్! మరో ఏడాది పొడిగింపు..!

ఏపీలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఉద్యోగుల విషయంలో సానుకూల నిర్ణయాలు తీసుకుంటోంది. గత వైసీపీ పాలనలో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడిన నేపథ్యంలో వారికి అన్ని విషయాల్లోనూ మేలు జరిగేలా ఒక్కో నిర్ణయం వెలువరిస్తోంది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.

అయితే రాష్ట్ర స్ధాయి ఉద్యోగులకు మాత్రమే వర్తించేలా ఈ నిర్ణయం ఉంది.

రాష్ట్రానికి రాజధానిగా 2015లో అమరావతిని ఎంపిక చేసిన తర్వాత విభజిత రాష్ట్రంలో వేగంగా అభివృద్ధి జరిగేందుకు వీలుగా అప్పటి టీడీపీ ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చి పనిచేసే ఉద్యోగులకు ఐదు రోజుల పని దినాల నిబంధన కూడా ఒకటి. అంటే సోమవారం నుంచి శుక్రవారం వరకూ మాత్రమే వీరు పనిచేసేలా వెసులుబాటు ఇచ్చారు.

దీన్ని అప్పటి టీడీపీ సర్కార్ తో పాటు ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం కూడా కొనసాగించింది. దీని గడువు ఇవాళ్టితో ముగిసింది.

ఈ నేపథ్యంలో రాష్ట్ర స్థాయి ఉద్యోగులకు వారానికి ఐదు రోజుల పని విధానం పొడిగిస్తూ సీఎం చంద్రబాబు ఇవాళ మరోసారి నిర్ణయం తీసుకున్నారు. సెక్రటేరియట్, హెచ్ ఓడీ కార్యాలయాల్లో పని చేసే ఉద్యోగులకు ఐదు రోజుల పనిదినాలు పొడిగించేలా ఇచ్చే ఉత్తర్వులకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. ఇవాల్టితో వారానికి ఐదు రోజుల పనిదినాల నిబంధన గడువు ముగుస్తున్న నేపథ్యంలో చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై ఈరోజు లేదా రేపు ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వ నిర్ణయంతో సీఎం చంద్రబాబు కు ఉద్యోగులు ధన్యవాదాలు తెలిపారు.