తప్పు చేస్తే దొరకక తప్పదు

Jun 28 2024, 08:15

Hyderabad: అమెరికాలో తెలుగోళ్ల హవా,,

ఇంట్లో తెలుగు.. వీధిలో తెలుగు.. యునివర్సిటీలో తెలుగు.. కార్యాలయంలోనూ తెలుగే.. ఇదేదో ఆంధ్రానో, తెలంగాణో అనుకుంటే పొరబడినట్టే! అగ్రరాజ్యం అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో ఇటీవలికాలంలో కనిపిస్తున్న పరిస్థితి ఇది.

ఇంట్లో తెలుగు.. వీధిలో తెలుగు.. యునివర్సిటీలో తెలుగు.. కార్యాలయంలోనూ తెలుగే.. ఇదేదో ఆంధ్రానో, తెలంగాణో అనుకుంటే పొరబడినట్టే! అగ్రరాజ్యం అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో ఇటీవలికాలంలో కనిపిస్తున్న పరిస్థితి ఇది. ఆ దేశంలో ఎక్కువ మంది మాట్లాడే 350 విదేశీ భాషల్లో తెలుగు 11వ స్థానంలో నిలిచింది. అమెరికాలో ఎక్కువగా మాట్లాడే భారతీయ భాషల జాబితాలో మనకన్నా ముందు హిందీ, గుజరాతీ ఉన్నాయి. కొన్నాళ్లుగా.. ఉన్నత విద్య, ఉపాధి కోసం ఇతర దేశాల నుంచి అమెరికాకు చేరుకుంటున్నవారిలో తెలుగువారి జనాభా గణనీయంగా పెరుగుతోంది. అమెరికా ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన గణాంకాలు ఈ విషయాన్ని అధికారికంగా స్పష్టం చేస్తున్నాయి. 2016తో పోలిస్తే 2024లో అమెరికాలో ఉంటున్న తెలుగువారి జనాభా నాలుగింతలు పెరిగిందని ఇటివలే విడుదలైన యూఎస్‌ సెన్సస్‌ బ్యూరో డేటా చెబుతోంది. ఆ నివేదిక ప్రకారం..

2016లో అమెరికాలో తెలుగు మాట్లాడేవారి సంఖ్య 3.2 లక్షలు ఉండగా..ఇప్పుడది 12.3 లక్షలకు చేరింది.

తెలుగు జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో క్యాలిఫోర్నియా ప్రథమస్థానంలో ఉంది. అక్కడ 2 లక్షల మంది తెలుగువారున్నారు. తర్వాతటెక్సస్‌(1.5 లక్షలు), న్యూజెర్సీ(1.1లక్షలు), ఇల్లినాయ్‌(83 వేలు), వర్జీనియా(78వేలు), జార్జియా(52 వేలు) ఉన్నాయి.

అమెరికాకు ఏటా వచ్చే మొత్తం విదేశీ విద్యార్థుల్లో తెలుగు విద్యార్థుల వాటా దాదాపు 13 శాతం.

అమెరికాకు ఏటా వచ్చే మొత్తం విదేశీ విద్యార్థుల్లో తెలుగు విద్యార్థుల వాటా దాదాపు 13 శాతం.

ఉపాధి కోసం వెళ్లేవారి సంఖ్యలోనూ ఏటా వృద్ధి నమోదవుతోంది. ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌ నుంచి అత్యధికులు అమెరికాకు వెళ్తుండగా.. వీరిలో సింహభాగం తెలుగు రాష్ట్రాల నుంచే ఉంటున్నారు

అమెరికాలోని అనేక ప్రముఖ వర్సిటీల్లోని విదేశీ విద్యార్థుల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థుల వాటా పెరుగుతోంది. కెంట్‌ స్టేట్‌ వర్సిటీలో మనోళ్ల ప్రవేశాలు ఎక్కువగా ఉండడంతో ‘విద్యార్థులకు స్వాగతం’ అంటూ తెలుగులో ఆహ్వానం పలకడం పట్ల మన విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఏటా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ నుంచి 60 వేల నుంచి 70 వేల మంది విద్యార్థులు, 10 వేల మందికి పైగా హెచ్‌1బీ వీసాపై అమెరికాకు చేరుకోవడమే అక్కడ మన హవా ఇంతగా పెరడగానికి ప్రధాన కారణం. ఇండియన్‌ మొబిలిటీ రిపోర్ట్‌-2024 ప్రకారం.. చదువుకోవడానికి అమెరికా వెళ్తున్న భారతీయ విద్యార్థుల్లో మన తెలుగువారి వాటా ఏకంగా12.5 శాతం!!

అమెరికాలో ఉండే అన్ని దేశాలవారు, జాతులవారు బయట మాట్లాడేది ఆంగ్లమైనా.. ఇంట్లో మాట్లాడేది మాత్రం మాతృభాషే. అలా ఆ దేశంలో ఉంటున్న భారతీయుల్లో.. ఇంట్లో మాతృభాష మాట్లాడే వారి సంఖ్య పెరుగుదలలో తెలుగువారిదే అగ్రస్థానం. 2010లో అక్కడ 2.17 లక్షల మంది ఇంట్లో తెలుగు మాట్లాడుతుండగా.. 2021 నాటికి వారి సంఖ్య 111 శాతం వృద్ధి రేటుతో 4.59 లక్షలకు చేరింది

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jun 27 2024, 19:54

ఐఫోన్ విసిరికొట్టి పుష్ప2 షూటింగ్ నుంచి వెళ్లిపోయిన దర్శకుడు సుకుమార్?

దేశవ్యాప్తంగా అత్యంత క్రేజ్ ఉండి, ఎప్పుడు వస్తుందా అని సినీ ప్రియులంతా ఉత్కంఠతో ఎదురుచూసే సినిమాల్లో పుష్ప2 ఒకటి. పుష్ప1 అనూహ్యంగా తెలుగుకు మించి బాలీవుడ్ లో ఘనవిజయం సాధించింది. దీంతో తెలుగులోకన్నా హిందీలోనే పుష్ప2పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్, రవిశంకర్, మోహన్ నిర్మిస్తున్నారు. రెండోభాగంపై భారీ అంచనాలుండటతో హీరో, నిర్మాత, దర్శకులు స్క్రిప్ట్ లో కొన్ని మార్పుచేర్పులు చేసి, బడ్జెట్ ను భారీగా పెంచి సినిమాను చేస్తున్నారు.

కొన్ని సన్నివేశాల రీషూట్

ప్రతి సన్నివేశం బాగా రావాలనే తపనతో సుకుమార్ ఉన్నారు. ఆగస్టు 15న విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడటానికి ప్రధాన కారణం ఏమిటంటే సుకుమార్ పర్ఫెక్షన్ కోసం తపిస్తుండటమే.

తాజాగా ఈ సినిమా షూటింగ్ లో ఓ సంఘటన చోటుచేసుకుంది. దర్శకుడు సుకుమార్ తన ఐఫోన్ ను సెట్ లో కోపంతో బలంగా విసిరికొట్టారు. అంతేకాదు.. అక్కడినుంచి వెళ్లిపోయారు కూడా. చాలా సన్నివేశాలు సరిగా రాలేదనే ఉద్దేశంతో ఆయన రీషూట్ చేస్తున్నారు. అందులో భాగంగానో కీలకమైన సన్నివేశం ఎన్నిసార్లు తీసినా సరిగా రావడంలేదు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jun 27 2024, 19:41

Nithiin - Multplex: ఏషియన్ నితిన్ సితారా 'కల్కి'తో షురూ!

హీరో నితిన్(Nithiin)మల్టీప్లెక్స్‌ థియేటర్‌ బిజినెస్‌లోకి అడుగుపెట్టబోతున్నారనే వార్త కొంతకాలంగా నెట్టింట వైరల్‌ అవుతున్న సంగతి తెలిసిందే! దానిని నిజం చేశారు నితిన్.

హీరో నితిన్(Nithiin)మల్టీప్లెక్స్‌ థియేటర్‌ బిజినెస్‌లోకి అడుగుపెట్టబోతున్నారనే వార్త కొంతకాలంగా నెట్టింట వైరల్‌ అవుతున్న సంగతి తెలిసిందే! దానిని నిజం చేశారు నితిన్. మహేష్‌బాబు మొదలుకొని అల్లు అర్జున్‌, రవితేజ, విజయ్‌ దేవరకొండ వరకూ థియేటర్స్‌ బిజినెస్‌లో ఉన్నారు.

ఇప్పుడు నితిన్ కూడా ఆ జాబితాలో చేరారు. ఏషియన్‌ సంస్థతో కలిసి 'ఏషియన్‌ నితిన్‌ సితార' (Asian nithiin Sitara) అనే మల్టీప్లెక్స్‌ ప్రారంభించారు.

నితిన్‌కు ఇంతకుముందే సితార థియేటర్‌ ఉంది. సంగారెడ్డిలో ఉన్న ఈ థియేటర్‌ను రెనోవేషన్‌ చేయించి ఏషియన్‌ సంస్థతో కలిసి సరికొత్త హంగులతో మల్టీప్లెక్స్‌గా మార్చారు.

దీనికి ఏషియన్‌ నితిన్‌ సితార అని పేరు పెట్టారు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే.. ప్రభాస్‌ హీరోగా నటించిన కల్కి 2898 ఎడీ’ చిత్రంతో ఈ మల్టీప్లెక్స్‌ అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం నితిన రాబినహుడ్‌, తమ్ముడు చిత్రాలతో బిజీగా ఉన్నారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jun 27 2024, 19:13

KCR: ఓమ్నీ వ్యాన్‌ను నడిపిన మాజీ సీఎం కేసీఆర్.. అసలు కారణమిదే!

తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కొత్త అవతారంలో కనిపించారు. డ్రైవర్‌గా మారి ఓమ్నీ వ్యాన్‌‌ను స్వయంగా నడిపారు. దాదాపు పదేళ్లపాటు ముఖ్యమంత్రిగా, అంతకుముందు వివిధ హోదాలు...

తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) కొత్త అవతారంలో కనిపించారు. డ్రైవర్‌గా మారి ఓమ్నీ వ్యాన్‌‌ను స్వయంగా నడిపారు. దాదాపు పదేళ్లపాటు ముఖ్యమంత్రిగా, అంతకుముందు వివిధ హోదాలు, ఉద్యమ సమయంలో కూడా ఎప్పుడూ కనిపించవి విధంగా కేసీఆర్ ఇప్పుడు కొత్తగా కనిపించడం ఆసక్తికరంగా మారింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అయితే.. కేసీఆర్ ఇలా ఓమ్నీ వ్యాన్ నడిపింది ఏదో సరదా కోసమో కాదు. దానికి ఒక కారణం ఉంది. అదేంటంటే.. బాత్‌రూమ్‌లో జారిపడ్డ ఘటనలో కేసీఆర్‌కు తుంటి ఎముక ఫ్రాక్చర్ అయిన విషయం తెలిసిందే. ఆ గాయం నుంచి ఆయన క్రమంగా కోలుకుంటున్నారు. యశోద ఆసుపత్రిలో చికిత్స పొందిన కేసీఆర్.. తొలుత వాకర్ సహకారంతో అడుగులు వేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఆ ఫ్రాక్చర్ దాదాపు నయం కావడంతో స్వయంగా కారు నడిపి చూడాలంటూ వైద్యులు ఆయనకు సూచించారు. డాక్టర్ల సలహా మేరకు కేసీఆర్ ఇలా ఓమ్నీ వ్యాన్ నడిపారు. దీంతో కేసీఆర్ సాధారణ స్థితికి చేరుకుంటున్నారంటూ బీఆర్ఎస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. సారు మళ్లీ కారు నడపడం మొదలుపెట్టారంటూ సోషల్ మీడియా వేదికగా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

కాగా తుంటి ఎముక ఫ్రాక్చర్‌ పూర్తిగా నయం కాకముందే కేసీఆర్ లోక్‌సభ ఎన్నికల క్షేత్రంలో ప్రచారం నిర్వహించారు. అసలే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన పార్టీని గట్టెక్కించేందుకు ఆయన నడుంబిగించారు.

విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. బస్సు యాత్రలు కూడా చేపట్టారు. అయినప్పటికీ లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీకి ఆశాజనక ఫలితాలు రాలేదు. ఇక జనాలతో మమేకం అయ్యేందుకు కేసీఆర్ కొన్ని కార్యక్రమాలను నిర్వహించారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jun 27 2024, 18:08

Hyderabad: తొమ్మిది మందికి ప్రొబేషనరీ ఐఏఎ్‌సల హోదా..

రాష్ట్రంలోని తొమ్మిది మంది జూనియర్‌ ఐఏఎస్‌ అధికారులకు కేంద్ర ప్రభుత్వం ‘ప్రొబేషనరీ హోదా’ కల్పించింది. ఈమేరకు వారి సర్వీసులను కన్ఫర్మ్‌ చేస్తూ కేంద్ర సిబ్బంది, ప్రజా విజ్ఞప్తులు, పెన్షన్ల మంత్రిత్వ శాఖ అండర్‌ సెక్రటరీ భూపిందర్‌ పాల్‌ సింగ్‌ బుధవారం ఉత్తర్వులను జారీ చేశారు.

రాష్ట్రంలోని తొమ్మిది మంది జూనియర్‌ ఐఏఎస్‌ అధికారులకు కేంద్ర ప్రభుత్వం ‘ప్రొబేషనరీ హోదా’ కల్పించింది. ఈమేరకు వారి సర్వీసులను కన్ఫర్మ్‌ చేస్తూ కేంద్ర సిబ్బంది, ప్రజా విజ్ఞప్తులు, పెన్షన్ల మంత్రిత్వ శాఖ అండర్‌ సెక్రటరీ భూపిందర్‌ పాల్‌ సింగ్‌ బుధవారం ఉత్తర్వులను జారీ చేశారు. వీరి సర్వీసులను కన్ఫర్మ్‌ చేస్తూ రాష్ట్రపతి ఆమోదం తెలిపారని ఆయన పేర్కొన్నారు.

ఇందులో 2020 బ్యాచ్‌కు చెందిన కధిరవన్‌ పలని ఉండగా, మిగతా ఎనిమిది మంది 2021 బ్యాచ్‌కు చెందినవారున్నారు. కధిరవన్‌ పలనికి 2023 సంవత్సరం అక్టోబరు 7 నుంచి ప్రొబేషనరీ ఐఏఎ్‌సగా కన్ఫర్మేషన్‌ ఇవ్వగా.. 2021 బ్యాచ్‌కు చెందిన శివేంద్ర ప్రతాప్‌, సంచిత్‌ గాంగ్వార్‌, ఫైజాన్‌ అహ్మద్‌, లెనిన్‌ వత్సల్‌ టొప్పో, పి.గౌతమి, పర్మర్‌ పింకేశ్‌కుమార్‌ లలిత్‌కుమార్‌, రాధికా గుప్తా, పి.శ్రీజలకు 2023 సంవత్సరం డిసెంబరు 5 నుంచి కన్ఫర్మేషన్‌ ఇచ్చారు

వీరంతా ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లుగా పని చేస్తున్నారు. అసోం క్యాడర్‌కు చెందిన సంచిత్‌ గాంగ్వార్‌ను 2022 సంవత్సరం డిసెంబరు 23న తెలంగాణ క్యాడర్‌కు బదిలీ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

వీరితో పాటు త్రిపుర రాష్ట్రానికి చెందిన మరో ఐదుగురు ఐఏఎ్‌సలకూ కేంద్రం ప్రొబేషనరీ హోదా కల్పించింది. ఈ హోదా రావడంతో వీరంతా ఇక మీదట రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేసిన రెవెన్యూ డివిజన్లకు సబ్‌-కలెక్టర్లుగా పనిచేసే అవకాశం ఉంటుంది.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jun 27 2024, 18:01

నా వాళ్లు నలుగురు.. అయితే మా వాళ్లు ఇద్దరు

మంత్రివర్గంలో ఖాళీగా ఉన్న 6 స్థానాల కోసం 10 నుంచి 12 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌ రెడ్డి నలుగురి పేర్లను హైకమాండ్‌కు ప్రపోజ్‌ చేసినట్లు సమచారం.

తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై సస్పెన్స్ వీడటం లేదు. నేతల మధ్య సమన్వయం కొరవడటంతో కేబినెట్ బెర్తుల ఖరారులో జాప్యం జరుగుతోంది. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ఢిల్లీలో ముమ్మర కసరత్తు జరుగుతోంది. కేబినెట్‌లో ఖాళీగా ఉన్న 6 స్థానాలను భర్తీ చేయడంపై నేతలంతా దృష్టి సారించారు. గడిచిన 3 రోజులుగా సీఎం సహా కీలక మంత్రులంతా ఢిల్లీలోనే మకాం వేశారు. మంత్రివర్గ విస్తరణతో పాటు పీసీసీ అధ్యక్షుడి నియామకంపై అధిష్టానం పెద్దలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌గాంధీలతో సమావేశమయ్యారు. ఈ భేటీల్లో మంత్రివర్గ విస్తరణకు గ్రీన్‌సిగ్నల్‌ లభించడంతో పాటు, కొన్ని పేర్లపై సానుకూలత వ్యక్తమైనట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో ఆయా పేర్లపై రాష్ట్ర సీనియర్‌ మంత్రుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీంతో కేబినెట్‌ విస్తరణ జాప్యం అవుతోంది. అంతా ఓ క్లారిటీ వచ్చి, చర్చించుకుని మరోసారి ఢిల్లీకి వస్తే ఫైనల్ లిస్టు ప్రకటిద్దామని అధిష్టానం చెప్పినట్లు సమాచారం.

మంత్రివర్గంలో ఖాళీగా ఉన్న 6 స్థానాల కోసం 10 నుంచి 12 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌ రెడ్డి నలుగురి పేర్లను హైకమాండ్‌కు ప్రపోజ్‌ చేసినట్లు సమచారం. మంత్రివర్గంలో ప్రాధాన్యం లేని నిజామాబాద్‌ జిల్లా నుంచి సుదర్శన్‌రెడ్డిని, ముదిరాజ్‌ సామాజికవర్గం నుంచి వాకిటి శ్రీహరిని, ఎస్టీ సామాజిక వర్గం నుంచి బాలు నాయక్‌ని, మైనార్టీ వర్గం నుంచి షబ్బీర్ అలీ పేర్లను సూచించినట్లు తెలుస్తోంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మరో ఇద్దరి పేర్లు సూచించినట్లు తెలిసింది.

రెడ్డి సామాజికవర్గం నుంచి రేసులో రాజగోపాల్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డి, పరిగి రామ్మోహన్‌రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. ఈ నేతలంతా ఢిల్లీలోనే ఉండి సీఎం రేవంత్‌రెడ్డితో గట్టిగా లాబీయింగ్ చేస్తున్నారు.

వివేక్ వెంకటస్వామి, ప్రేమ్‌సాగర్‌రావు, బాలు నాయక్‌, షబ్బీర్‌ అలీ రేసులో ఉన్నారు. ఒకే జిల్లా కావడంతో వివేక్‌, ప్రేమ్‌సాగర్‌రావులో ఒకరికే ఛాన్స్ ఉండనుంది. అంతా ఒక్కతాటిపైకి వస్తే శ్రావణమాసంలోనే కేబినెట్‌ విస్తరణ ఉండే ఛాన్స్.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jun 27 2024, 17:04

ఏపీ ఉద్యోగులకు చంద్రబాబు గుడ్ న్యూస్! మరో ఏడాది పొడిగింపు..!

ఏపీలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఉద్యోగుల విషయంలో సానుకూల నిర్ణయాలు తీసుకుంటోంది. గత వైసీపీ పాలనలో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడిన నేపథ్యంలో వారికి అన్ని విషయాల్లోనూ మేలు జరిగేలా ఒక్కో నిర్ణయం వెలువరిస్తోంది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.

అయితే రాష్ట్ర స్ధాయి ఉద్యోగులకు మాత్రమే వర్తించేలా ఈ నిర్ణయం ఉంది.

రాష్ట్రానికి రాజధానిగా 2015లో అమరావతిని ఎంపిక చేసిన తర్వాత విభజిత రాష్ట్రంలో వేగంగా అభివృద్ధి జరిగేందుకు వీలుగా అప్పటి టీడీపీ ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చి పనిచేసే ఉద్యోగులకు ఐదు రోజుల పని దినాల నిబంధన కూడా ఒకటి. అంటే సోమవారం నుంచి శుక్రవారం వరకూ మాత్రమే వీరు పనిచేసేలా వెసులుబాటు ఇచ్చారు.

దీన్ని అప్పటి టీడీపీ సర్కార్ తో పాటు ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం కూడా కొనసాగించింది. దీని గడువు ఇవాళ్టితో ముగిసింది.

ఈ నేపథ్యంలో రాష్ట్ర స్థాయి ఉద్యోగులకు వారానికి ఐదు రోజుల పని విధానం పొడిగిస్తూ సీఎం చంద్రబాబు ఇవాళ మరోసారి నిర్ణయం తీసుకున్నారు. సెక్రటేరియట్, హెచ్ ఓడీ కార్యాలయాల్లో పని చేసే ఉద్యోగులకు ఐదు రోజుల పనిదినాలు పొడిగించేలా ఇచ్చే ఉత్తర్వులకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. ఇవాల్టితో వారానికి ఐదు రోజుల పనిదినాల నిబంధన గడువు ముగుస్తున్న నేపథ్యంలో చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై ఈరోజు లేదా రేపు ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వ నిర్ణయంతో సీఎం చంద్రబాబు కు ఉద్యోగులు ధన్యవాదాలు తెలిపారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jun 27 2024, 16:56

KTR | సాగునీటి రంగంలో కేసీఆర్ కృషికి సీతారామ ప్రాజెక్టు మ‌రో నిద‌ర్శ‌నం.. కేటీఆర్ ట్వీట్


KTR | సాగునీటి రంగంలో తెలంగాణ తొలి ముఖ్య‌మంత్రి కేసీఆర్ కృషికి సీతారామ ప్రాజెక్టు మ‌రో నిద‌ర్శ‌న‌మ‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.

KTR | హైద‌రాబాద్ : సాగునీటి రంగంలో తెలంగాణ తొలి ముఖ్య‌మంత్రి కేసీఆర్ కృషికి సీతారామ ప్రాజెక్టు మ‌రో నిద‌ర్శ‌న‌మ‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఖ‌మ్మం, కొత్త‌గూడెం జిల్లాల ప‌రిధిలోని 10 ల‌క్ష‌ల ఎక‌రాల‌కు ఈ ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందనుంద‌ని ఆయ‌న తెలిపారు. సీతారామ ప్రాజెక్టు ట్ర‌య‌ల్ ర‌న్ విజ‌య‌వంతం కావ‌డంతో.. ఇంజినీర్లు, బ్యూరోక్రాట్లు, ఏజెన్సీలు, ప్రజాప్ర‌తినిధుల‌కు కేటీఆర్ శుభాకాంక్ష‌లు తెలిపారు.

కాగా, సీతారామ ప్రాజెక్టు నా గుండెకాయలాంటిదని గతంలోనే కేసీఆర్‌ పేర్కొన్న విషయం తెలిసిందే.

అంతేకాదు చెప్పినట్లుగానే ప్రాజెక్ట్‌ పనుల్లో వేగం పెంచి త్వరగా పూర్తి చేసే ప్రయత్నం చేశారు. సీతారామ పనులు కేసీఆర్‌ హయాంలోనే 70శాతం పనులు పూర్తయ్యాయి. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రూ. 17 వేల కోట్ల అంచనాతో ఈ ప్రాజెక్టును చేపట్టారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jun 27 2024, 16:49

Harish Rao: రైతు బందు డబ్బులు ఎప్పుడు వేస్తారు?

సిద్దిపేట జిల్లా కేంద్రంలోని రెడ్డి సంక్షేమ సంఘంలో జడ్పీ చైర్మన్ రోజా శర్మ అధ్యక్షతన జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. జిల్లా కలెక్టర్ మను చౌదరి,మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో హరీష్ రావు మాట్లాడుతూ.. రైతు బందు డబ్బులు ఎప్పుడు వేస్తారని ప్రశ్నించారు.

సిద్దిపేట: సిద్దిపేట జిల్లా కేంద్రంలోని రెడ్డి సంక్షేమ సంఘంలో జడ్పీ చైర్మన్ రోజా శర్మ అధ్యక్షతన జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది.

జిల్లా కలెక్టర్ మను చౌదరి,మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో హరీష్ రావు మాట్లాడుతూ.. రైతు బందు డబ్బులు ఎప్పుడు వేస్తారని ప్రశ్నించారు. రైతు భరోసా విధివిధానాలు ఏమిటని అడిగారు. రైతు బందు పంట అయ్యాక ఇస్తారా?.. పంట ముందు ఇస్తారా? అంటూ హరీష్ రావు ప్రశ్నల వర్షం కురిపించారు. రాష్ట్రంలో సిద్దిపేట జిల్లాను పదవ తరగతి ఫలితాల్లో రెండవ స్థానంలో నిలిపినందుకు ఉపాధ్యాయులకు అభినందనలు తెలిపారు.

నాలుగు నెలల మధ్యాహ్నం భోజన కార్మికులకు జీతాలు వెంటనే విడుదల చేయాలి. విద్యార్థులకు ఒక్క జత బట్టలు మాత్రమే ఇచ్చారు. రెండవ జత బట్టలు అన్ని జిల్లాలకు ఇచ్చినట్లు సిద్దిపేట జిల్లకు వెంటనే ఇవ్వాలి. మన ఊరు మన బడి మిగిలిన పనులను వెంటనే పూర్తి చేసి ఇవ్వాల్సిన బిల్లులు ఇవ్వాలి. ఉపాధి హామీ పథకంలో సీసీ రోడ్ పోసిన కాంట్రాక్టర్‌లకు 7నెలల నుంచి బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఏప్రిల్, మే, జూన్ మూడు నెలల ఆసరా పెన్షన్‌లు రాలేదు.

సకాలంలో పెన్షన్ రాక వృద్దులు ఇబ్బంది పడుతున్నారు. కాళేశ్వరం కాలువలలో మట్టి పడి నీటి విడుదలలో ఇబ్బంది ఉంది కనుక వాటిని శుద్ధి చేయాలి. ఆరు నెలల్లో గ్రామపంచాయితీలకు రూపాయి రాలేదు. మహిళ ప్రాంగణం, వృద్ధాశ్రమం, వర్కింగ్ ఉమెన్ హాస్టల్ వాడుకలోకి తీసుకురావాలి. సఖి సెంటర్ సిబ్బందికి 7నెలలుగా వేతనాలు రాలేదు’’ అని హరీష్ రావు పేర్కొన్నారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jun 27 2024, 14:59

జై పాలస్తీనా..! ఒవైసీ నినాదంతో కొత్త రగడ… తప్పొప్పులపై చర్చ

ఈసారే ఈ విపరీత ధోరణి విపరీతంగా కనిపించింది… లోకసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత రకరకాల నినాదాలు చేశారు సభ్యులు… రాహుల్ గాంధీ అయితే రాజ్యాంగ ప్రతిని అందరికీ చూపిస్తూ ప్రమాణం చేసి, చివరలో జై సంవిధాన్ అన్నాడు… దాన్ని అభ్యంతరపెట్టాల్సిన అవసరం లేదు… కానీ.

ప్రత్యేకంగా రాజ్యాంగాన్ని అక్కడ ప్రదర్శించాల్సిన అవసరమేముంది.

బీజేపీ నాటి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ (50 ఏళ్లయిన సందర్భంగా) ని తిట్టిపోస్తోంది… స్పీకర్ కూడా తన ప్రసంగంలో నాటి ఎమర్జెన్సీ రోజుల్ని ప్రస్తావించి కాంగ్రెస్ ను తిట్టిపోసాడు… మోడీ మెచ్చాడు… అసలు మోడీయే పెద్ద నియంత, తను రాజ్యాంగాన్ని మార్చేస్తాడు అంటూ ఇండి కూటమి కౌంటర్ చేస్తోంది… ఈ రాజకీయ సమరం, వాగ్వాదాలు, వ్యూహాలు ప్రమాణస్వీకారాలను ప్రభావితం చేయడం బాగోలేదు…

పార్లమెంటులో ప్రమాణస్వీకారాలు కూడా ఓ రాజకీయ సభలాగా తలపించడం సరికాదనిపిస్తుంది… నవ్వులపాలు చేస్తున్నారు… చాలామంది అసలు మాతృభాషలోనే స్పష్టంగా పదాల్ని పలుకుతూ పలకలేరు… తడబడతారు… ఇంగ్లిషులోనే కాదు, తమకు అలవాటైన మాతృభాషలోనూ పదాల్ని పలకలేకపోగా, ఈ నినాదాలు… ప్రమాణ స్వీకారానికి వస్తున్నప్పుడు ఇంట్లో కాస్త రిహార్సల్ వేసుకుని వేస్తే ఏం నష్టం.

తమ గౌరవాన్ని, తమ పార్టీ గౌరవాన్ని, సభ గౌరవాన్ని కాపాడాలి కదా… మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ నినాదాలు మరీ కంట్రవర్సీని క్రియేట్ చేశాయి… జై పాలస్తీనా అన్నాడు… తనను తాను కోట్లాది ముస్లింల గొంతుగా ప్రదర్శించుకోవడం..! కానీ భారత దేశ సార్వభౌమాధికారానికి వేదికవంటి పార్లమెంటులో జరిగే ఈ రాజ్యాంగ బద్ధ ప్రమాణ స్వీకారాల కార్యక్రమాన్ని దానికి ఎంచుకోవడం దేనికి..? అక్కడ వేరే దేశానికి జై కొట్టడం ఏమిటి.

సరే, పాలస్తీనాకు సంఘీభావం, మద్దతు ప్రకటించదలుచుకుంటే అది బయట ప్రసంగాల్లో, ఇతర కార్యక్రమాల్లో చేసుకోవచ్చు… దాన్ని ఎవరూ అభ్యంతరపెట్టరు… ఇక రేప్పొద్దున అందరికీ ఇదే అలవాటై, ఇంకెవరో జై ఇజ్రాయిల్ అంటే..? మరెవరో జై చైనా అంటే.. ఇది ఎక్కడి దాకా.. ఈ దేశ పార్లమెంటులో ఇతర దేశాలకు జేజేలు ఏమిటి..

నిజానికి తాము చదవాల్సిన ఫార్మాట్‌ను చదివేసి, స్పీకర్‌కు ఓ దండం పెట్టి వేదిక దిగిపోతుంటారు చాలామంది… ఓవరాక్షన్ అసలు ఉండదు… కొందరు జైహింద్ అంటారు చివరలో… అది మతాన్ని సూచించేది కాదు, హిందుస్థాన్‌ అని మన దేశాన్ని సూచించేది, ఈ దేశం పట్ల విధేయతను ప్రకటించేది… కాకపోతే కొందరు సభ్యులు తమ ప్రాంతాన్ని సూచించేలా ఏరియా స్పెసిఫిక్ దుస్తుల్లో, వాళ్ల మాతృభాషలో ప్రమాణం చేయడానికి ఇష్టపడతారు… మనవాళ్లు ధోవతులు, తలపాగాలు ధరించినట్టు

సరే, ఒవైసీ దగ్గరకొద్దాం… తన జై పాలస్తీనా నినాదాన్ని సమర్థించేవారికీ కొదువ లేదు… తప్పేముంది..? ఇజ్రాయిల్ దురహంకారాన్ని, దాడుల్ని వ్యతిరేకించడానికి ఆ వేదికను వాడుకున్నాడు, అందులో అభ్యంతరపెట్టాల్సింది ఏముందనేది వారి వాదన… కానీ ఇది పార్లమెంటరీ రూల్స్, సంప్రదాయాలకు వ్యతిరేకం కాబట్టి, రాజ్యాంగంలోని ఆర్టికల్ 102డీ స్పూర్తికి కూడా వ్యతిరేకం కాబట్టి ఒవైసీని సభ నుంచి బయటికి పంపించాల్సిందే అంటూ కొందరు లాయర్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు…

ఆర్టికల్ 102డీ ప్రకారం ఒవైసీ నినాదం తప్పు, పార్లమెంటరీ సంప్రదాయాల ఉల్లంఘన అనేది వారి వాదన సారాంశం… సరే, రాష్ట్రపతి ఏదైనా నిర్ణయం తీసుకోవాలన్నా మోడీ అండ్ కో సూచనలే ఆధారం అవుతాయి… ఒవైసీ రాజకీయంగా బీజేపీ హైకమాండ్‌కు పరోక్షంగా రాజకీయ మిత్రుడే గానీ ప్రత్యర్థి కాదనే ప్రచారం చాన్నాళ్లుగా ఉన్నదే కదా… ఆ తెర వెనుక రాజకీయాలు ఎలా ఉన్నా, ఒవైసీ విషయంలో మోడీ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించకపోవచ్చు… పైగా 102డీ ప్రకారం వేరే దేశానికి విధేయత ప్రకటిస్తే అనర్హత వేటు ఉంటుంది…

కానీ ఇక్కడ ఒవైసీ పాలస్తీనాకు విధేయతను ప్రకటించలేదు… అది పాలస్తీనాకు మద్దతు, సంఘీభావం… ఆ రెండింటి నడుమ తేడా ఉంది… అయితే బీజేపీ సభ్యులు వ్యతిరేకించడంతో ఒవైసీ నినాదాలను ప్రొటెం స్పీకర్ రికార్డుల నుంచి ఆల్రెడీ తొలగించాడు… ఇక తదుపరి చర్యలు ఏమీ ఉండకపోవచ్చు… మన ఒవైసీయే కదా…! పైగా దీని మీద దేశం మొత్తమ్మీద ఓ చర్చ జరగడం, ఇండి కూటమికి మరో అవకాశం ఇవ్వడం మోడీ సర్కారుకు ఇష్టం ఉండకపోవచ్చు కాబట్టి

చివరలో… సరదాగా…. అవునూ, ఒవైసీ మీద నిజంగానే అనర్హత వేటు వేస్తే ఇక మళ్లీ హైదరాబాద్ పాతబస్తీలో మాధవీలత మళ్లీ ప్రచారరంగంలోకి అడుగుపెట్టాల్సిందేనా..? అప్పుడిక అక్బరుద్దీన్ ఒవైసీ మజ్లిస్ అభ్యర్థి అవుతాడా.