తప్పు చేస్తే దొరకక తప్పదు

Jun 27 2024, 11:24

Srisailam: టన్నెల్‌ పనులకు పరుగులు

శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) టన్నెల్‌ తవ్వకం ప్రక్రియను గాడిలో పెట్టడానికి ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. ఇన్‌లెట్‌ (శ్రీశైలం) నుంచి టన్నెల్‌ తవ్వే ప్రక్రియలో సాంకేతిక సమస్యలు తలెత్తుతుండటంతో నిర్మాణ సంస్థ జేపీకి సబ్‌ కాంట్రాక్ట్‌గా పనిచేస్తున్న రాబిన్స్‌ను ఈ దఫా ఉన్నతస్థాయి సమావేశానికి పిలవాలని సర్కారు నిర్ణయించింది.

ఎస్‌ఎల్‌బీసీ సొరంగం వేగవంతానికి చర్యలు.. ఇన్‌లెట్‌ నుంచి సత్వర తవ్వకానికి కసరత్తు

జేపీ సబ్‌ కాంట్రాక్టర్‌కు ప్రభుత్వం పిలుపు

నవంబరులో ఔట్‌లెట్‌ నుంచి టన్నెలింగ్‌

బేరింగ్‌తోపాటు ఇతర పరికరాలకు ఆర్డర్లు

ఏకకాలంలో రెండువైపులా తవ్వకం

ఎడమ గట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) టన్నెల్‌ తవ్వకం ప్రక్రియను గాడిలో పెట్టడానికి ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. ఇన్‌లెట్‌ (శ్రీశైలం) నుంచి టన్నెల్‌ తవ్వే ప్రక్రియలో సాంకేతిక సమస్యలు తలెత్తుతుండటంతో నిర్మాణ సంస్థ జేపీకి సబ్‌ కాంట్రాక్ట్‌గా పనిచేస్తున్న రాబిన్స్‌ను ఈ దఫా ఉన్నతస్థాయి సమావేశానికి పిలవాలని సర్కారు నిర్ణయించింది. ఇన్‌లెట్‌ వైపు నుంచి సీపేజీలు టన్నెల్‌ తవ్వకానికి ప్రధాన అవరోధంగా ఉండగా, ఔట్‌లెట్‌ వైపు గట్టి రాయి ఉండటం, మాటిమాటికీ బేరింగులు, బిట్లు దెబ్బతింటుండడంతో పనులు ముందుకు కదలడం లేదు. ఈ నేపథ్యంలో టన్నెల్‌ పురోగతిపై ఇటీవలే ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.. తవ్వకం పనుల్లో పురోగతి లేకుంటే చర్యలు తప్పవని అధికారులకు వార్నింగ్‌ ఇచ్చారు.

ఔట్‌లెట్‌ (మన్నెవారిపల్లి-అచ్చంపేట) వైపు ఉన్న టీబీఎంలో బేరింగులు పాడైపోవడంతో.. కొత్త బేరింగులతోపాటు ఇతర పరికరాల కోసం ఆర్డర్లు పెట్టారు. ఈ పరికరాలన్నీ ఆగస్టుకల్లా చేరితే.. వీటిని బిగించి, నవంబరులో ఔట్‌లెట్‌ వైపు నుంచి టన్నెల్‌ తవ్వకం చేపట్టే అవకాశాలను పరిశీలిస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడగానే ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ పనులను అత్యంత ప్రాధాన్య జాబితాలో చేర్చిన విషయం తెలిసిందే. టన్నెల్‌ తవ్వకానికి గల అవరోధాలపై అధ్యయనం చేయడానికి ఒక కమిటీని కూడా వేశారు. ఆ కమిటీ సిఫారసులతో ఇప్పటికే రూ.50 కోట్లను వెనువెంటనే విడుదల చేశారు.

ప్రాజెక్టు నిర్మాణ అంచనాలను రూ.3150 కోట్ల నుంచి రూ.4468 కోట్లకు సవరించాలని ప్రతిపాదనలు ప్రభుత్వానికి చేరడంతో త్వరలోనే దీనికి ఆమోదముద్ర పడే అవకాశాలున్నాయి. ఇన్‌లెట్‌లో సత్వరం తవ్వకాలు ప్రారంభించాలని, నవంబరులో ఔట్‌లెట్‌ వైపు నుంచి ప్రారంభించి.. రెండువైపులా ఏకకాలంలో తవ్వకం కొనసాగించాలని నిర్ణయించారు.

రెండువైపులా టన్నెల్‌ తవ్వకం ప్రారంభిస్తే.. నెలకు 300 మీటర్ల చొప్పున 33 నెలల్లో టన్నెల్‌ పూర్తి చేయగలమని నిర్మాణ సంస్థ ప్రభుత్వానికి సంకేతాలిచ్చింది.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jun 27 2024, 10:57

హైదరాబాద్-విజయవాడ ప్రయాణికులకు కేంద్రం గుడ్ న్యూస్..!

హైదరాబాద్ నుంచి విజయవాడకు రోడ్డు మార్గాన వెళ్లే ప్రయాణికులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణకు మాత్రమే రాజధానిగా మారిన హైదరాబాద్ నుంచి ఏపీ రాజధాని అమరావతికి వెళ్లాలంటే కీలకమైన హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిని ఆరు లైన్లుగా విస్తరించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే దీనిపై నిర్ణయం తీసుకున్నా అమలులో తీవ్ర జాప్యం జరిగింది. ఇప్పుడు వివాదాలన్నీ పరిష్కరించిన కేంద్రం.. రోడ్డు విస్తరణ పనులకు పచ్చజెండా ఊపింది

హైదరాబాద్ నుంచి విజయవాడ మధ్య చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం నుంచి ఏపీలోని నందిగామ వరకూ ఉన్న 181.50 కిలోమీటర్ల రహదారిని 2010లో ఆరు లైన్లుగా విస్తరించేందుకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) జీఎమ్మార్ సంస్థకు బాధ్యతలు అప్పజెప్పింది. కానీ 181.50 కిలోమీటర్ల రోడ్డును రూ.

1740 కోట్లతో నాలుగు లైన్లుగా మార్చిన జీఎమ్మార్ 2012 నుంచి పంతంగి, కొర్లపహాడ్, చిల్లకల్లు టోల్ ప్లాజాల ద్వారా టోల్ వసూలు చేసుకుంటోంది. ఇలా 2025 జూన్ వరకూ వసూలు చేసుకునేందుకు జీఎమ్మార్ కు గడువు ఉంది. కానీ మధ్యలో దీన్ని ఆరులైన్లుగా మార్చే ప్రతిపాదన వచ్చింది.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jun 27 2024, 10:50

ఏపీలో వారికి చంద్రబాబు సర్కార్ గుడ్‌న్యూస్.. ఆ పథకం కింద రూ.లక్షన్నర నుంచి లక్ష!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పథకాలకు పేర్లు మారుస్తోంది. తాజాగా మరో పథకానికి పేరు మారుస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. 2014లో చంద్రబాబు ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయగా.. ఆ తర్వాత జగన్ సర్కార్ పేరు మార్చి అమలు చేసింది. ఇప్పుడు తాజాగా చంద్రబాబు ప్రభుత్వం పేరు మార్చేసి అమలుకు సిద్ధమవుతోంది. త్వరలోనే విధివిధానాలను కూడా ఖరారు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆ పథకం వివరాలు ఇలా ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో కొలువుదీరిన చంద్రబాబు ప్రభుత్వం పాలనలో దూకుడు పెంచింది. గత ప్రభుత్వ హయాంలో పథకాలకు సంబంధించి వరుసగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పలు పథకాలకు పేర్లు మార్చింది కొత్త ప్రభుత్వం.. తాజాగా మరో రెండు పథకాలకు పేర్లు మారుస్తూ నిర్ణయం తీసుకుంది. వైఎస్సార్ కళ్యాణమస్తు పథకానికి చంద్రన్న పెళ్లి కానుకగా మార్చేశారు. అలాగే జగనన్న విదేశీ విద్యా దీవెన (మైనార్టీల కోసం) పథకం పేరును.. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఓవర్సీస్ ఎడ్యుకేషన్ స్కీమ్ ఫర్ మైనార్టీస్‌గా మారుస్తూ ఆదేశాల జారీ చేశారు. ఈ మేరకు జీవోలు విడుదల చేశారు.

మధ్య అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం చంద్రన్న పెళ్లి కానుక పేరుతో ఈ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ప్రకారం.. ఎస్సీ, ఎస్టీల్లో కులాంతర వివాహాలు చేసుకుంటే వారికి రూ.75వేలు నగదు ప్రోత్సాహకం అందజేశారు. అలాగే గిరిపుత్రిక కల్యాణం కింద ఎస్టీలకు రూ. 50వేలు, అంతేకాదు కులాంతర వివాహం చేసుకునే బీసీలకు రూ.50 వేలు, దుల్హన్‌ పథకం కింద మైనార్జీలకు రూ.50 వేలు అందించారు. అదే దివ్యాంగులైన వధువు, వరులకు రూ.లక్ష చొప్పున అందజేశారు. ఈ పథకం ద్వారా.. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న మిగతా వర్గాల యువత ఎస్టీలను వివాహం చేసుకుంటే రూ. 50 వేలు, అదే ఎస్సీలను పెళ్లి చేసుకుంటే రూ.40 వేలు, బీసీలను చేసుకుంటే రూ.30 వేలు, ఓసీలను చేసుకుంటే రూ.20 వేల చొప్పున చంద్రన్న కానుక అందించారు.

గత ప్రభుత్వం వైఎస్సార్ కళ్యాణమస్తు కింద ఎస్సీ, ఎస్టీల వివాహాలకు రూ.లక్ష .. ఎస్టీ, ఎస్టీల కులాంతర వివాహాలకు రూ.1.20 లక్షలు.. అలాగే బీసీలకు రూ.50 వేలు.. కులాంతర వివాహాలకు రూ.75వేలు అందజేసింది. అదే మైనార్టీలకు రూ.లక్ష.. దివ్యాంగులకు రూ.1.50 లక్షలు.. వీరితో పాటూ భవన నిర్మాణ కార్మికులకు రూ.40 వేలు అందజేసింది. మరి ఈసారి చంద్రబాబు ప్రభుత్వం ఈ చంద్రన్న పెళ్లి కానుక కింద ఎంత ఇస్తుందన్నది క్లారిటీ లేదు. అయితే గత ప్రభుత్వం ఇచ్చినట్లుగానే ఈసారి ప్రోత్సహకాన్ని అందజేస్తారని చెబుతున్నారు.. త్వరలోనే విధివిధానాలు, మార్గ దర్శకాలు ఖరారు చేయనున్నారు.

గత ప్రభుత్వం ఈ పథకానికి సంబంధించి కొన్ని నిబంధనల్ని అమలు చేసింది. వివాహ తేదీ నాటికి వరుడి వయస్సు 21 ఏళ్లు..వధువు వయస్సు 18 ఏళ్లు నిండి ఉండాలి.. ఇద్దరు పదో తరగతి పూర్తి చేసి ఉండాలి. అలాగే తొలి విహానికి మాత్రమే ఆర్థిక సాయం అందిస్తారు.. వధువు, వరుడు ఇద్దరి కుటుంబాల ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో అయితే నెలకు రూ.10వేలు, అదే పట్టణ ప్రాంతాల్లో రూ.12వేలు లోపు ఉంటేనే అర్హులు. అలాగే మూడు ఎకరాలకు మించి మాగాణి, 10 ఎకరాలకు మించి మెట్టభూమి ఉండకూడదు.. కానీ మెట్ట, మాగాణి రెండు కలిపి 10 ఎకరాలలోపు ఉండొచ్చనే నిబంధన విధించారు. మరి ఈ నిబంధనల్ని ఏవైనా సడలిస్తారా అన్నది చూడాలి

మరోవైపు ఏపీ ప్రభుత్వం మరికొన్ని పథకాలకు పేర్లు మార్చింది. గత ప్రభుత్వ హయాంలో వైఎస్సార్ పింఛన్‌ కానుక అని పేరు ఉంటే.. ఇప్పుడు ఎన్టీఆర్ భరోసాగా మార్చారు. వైఎస్సార్ రైతు భరోసాను.. అన్నదాత సుఖీభవగా మార్చారు. జగనన్న విదేశీ విద్యా దీవెనను అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధిగా పేరు మార్పు. వైఎస్సార్ విద్యోన్నతి పథకానికి ఎన్టీఆర్ విద్యోన్నతిగా పేరు మార్పు. జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రొత్సాహాకానికి సివిల్ సర్వీసెస్ పరీక్షల ప్రొత్సాహాకం, జగనన్న విద్యా, వసతి దీవెనల పథకాలకి పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్‌గా పేరు మారుస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jun 26 2024, 20:29

ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎప్పటినుండంటే..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మహిళలకు ఎన్నికలకు ముందు టిడిపి కూటమి ఇచ్చిన హామీలలో భాగంగా ఉచిత బస్సు ప్రయాణంపై రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కోసం ఎదురు చూస్తున్న వేళ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి నెలలోగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందజేస్తామని గుడ్ న్యూస్ చెప్పారు.

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై మంత్రి చెప్పిందిదే

పక్క రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటకలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అమలుపై పూర్తిస్థాయిలో రివ్యూ నిర్వహించి, అక్కడి లోటుపాట్లను గుర్తించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా పకడ్బందీగా పథకాన్ని అమలు చేస్తామని ఆయన తెలిపారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, మహిళలకు ఉపయోగపడే విధంగా ఉంటుందని మంత్రి పేర్కొ న్నారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jun 26 2024, 20:06

మేడిగడ్డ బ్యారేజ్ తో రేవంత్ ప్రభుత్వానికి రూ. 800 కోట్లకుపైనే కాసులవర్షం

తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ విమర్శలకు, ఆరోపణలు, ప్రత్యారోపణలకు కేంద్ర బిందువుగా మారిన కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కాసుల వర్షం కురిపించబోతోంది.

రాష్ట్ర ఖజానాకు ఇది వరంగా మారింది. మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిన నేపథ్యంలో నీటిని దిగువకు వదలడంతో ప్రాజెక్టు ఎగువ భాగాన భారీగా ఇసుకమేటలు బయటపడ్డాయి.

మేడిగడ్డ ఇసుకతో 800 కోట్లకు పైగా ఆదాయం

దీంతో ఈ ఇసుకను తవ్వి విక్రయించాలని తెలంగాణ సర్కార్ భావిస్తోంది ఈ మేరకు ఇసుకను వేలం వేయడానికి టెండర్లను కూడా ఆహ్వానిస్తుంది.

మేడిగడ్డలోని ఇసుక అమ్మకం ద్వారా భారీగా ఆదాయం వస్తుందన్న అంచనాలు ఉన్నాయి. మేడిగడ్డ బ్యారేజీ తో రాష్ట్రానికి 800 కోట్లకు పైగా ఆదాయం వస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jun 26 2024, 19:49

TG Govt: దివ్యాంగుల రిజర్వేషన్‌పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

దివ్యాంగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. విద్యాసంస్థల్లో వీరికి 5% రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

హైదరాబాద్: దివ్యాంగులకు తెలంగాణ ప్రభుత్వం (TG Govt) శుభవార్త తెలిపింది. విద్యాసంస్థల్లో వీరికి 5% రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఉన్నత విద్యా సంస్థలు, ప్రభుత్వం నుంచి సహాయం పొందుతున్న ఇతర ఉన్నత విద్యా సంస్థలు బెంచ్‌ మార్క్ వైకల్యం ఉన్న వ్యక్తుల కోసం ఐదు శాతం కంటే తక్కువ సీట్లను రిజర్వ్ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది.

బెంచ్‌ మార్క్ వైకల్యం ఉన్న వ్యక్తులకు ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశానికి ఐదేళ్ల గరిష్ట వయోపరిమితి సడలింపు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jun 26 2024, 19:41

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. నాలుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయంటున్న ఐఎండీ.

ఏపీ, తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాల విస్తరణతో పాటు ఆవర్తన ప్రభావంతో మరికొన్ని రోజులు వానలు కురిసే అవకాశం ఉంది. మరో వైపు పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో నైరుతి రుతుపవనాలు మరింత చురుకుదనం సంతరించుకోనున్నాయి. ఫలితంగా పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్నిచోట్ల భారీ వర్షాలు కురవనున్నాయి.

ఏపీ, తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాల విస్తరణతో పాటు ఆవర్తన ప్రభావంతో మరికొన్ని రోజులు వానలు కురిసే అవకాశం ఉంది. మరో వైపు పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో నైరుతి రుతుపవనాలు మరింత చురుకుదనం సంతరించుకోనున్నాయి.

ఫలితంగా పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్నిచోట్ల భారీ వర్షాలు కురవనున్నాయి. ఏపీలో పార్వతీపురం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రకటించింది ఐఎండీ.

అలాగే, తెలంగాణలో కూడా పలు జిల్లాలకు వర్షసూచన చేసింది వాతావరణశాఖ. హన్మకొండ, ములుగు, భద్రాద్రి, ఖమ్మం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెబుతోంది. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో కుండపోత వర్షం కురిసింది. భారీ వర్షానికి సత్తుపల్లి ఓపెన్‌కాస్ట్‌ గనుల్లో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది.

15వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి, మట్టి తొలగింపు పనులు నిలిచిపోయినట్టు చెప్పారు సింగరేణి అధికారులు. దాదాపు 10 సెంటీమీటర్ల వర్షం కురవడంతో సత్తుపల్లిలో అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలతోపాటు రోడ్లపైనా పెద్దఎత్తున నీరు నిలిచిపోయింది. సత్తుపల్లితోపాటు పెనుబల్లి, కల్లూరు మండలాల్లో కూడా కుండపోత వర్షం కురిసింది.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jun 26 2024, 19:26

హైదరాబాద్ నుంచి ఈ రెండు ప్రాంతాలకు 4 లైన్ల రోడ్లు.. DPR ప్రక్రియ వేగవంతం చేయాలన్న మంత్రి కోమటిరెడ్డి

హైదరాబాద్-మన్నెగూడ, హైదరాబాద్-కల్వకుర్తి రహదారులను నాలుగు లైన్ల రహదారులుగా తీర్చిదిద్దాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కోరారు. ఈ మేరకు ఎన్‌హెచ్‌ఏఐ సంస్థ ఛైర్మన్ సంతోష్ యాదవ్‌తో భేటీ అయి.. ప్రతిపాదనలపై చర్చించారు. ఈ రహదారుల నిర్మాణానికి త్వరగా డీపీఆర్ సిద్ధం చేయాలని కోరారు.

తెలంగాణలో రహదారుల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు. కేంద్రం సహకారంతో రహదారులను అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఈ మేరకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) కార్యాలయంలో సంస్థ ఛైర్మన్ సంతోష్ కుమార్ యాదవ్‌తో తాను భేటీ అయినట్లు చెప్పారు.

తెలంగాణలో హైవేల నిర్మాణాలను వేగవంతం చేయాలని కోరామన్నారు. ప్రధానంగా బీవోటీ కన్సెషనరీ జీఎంఆర్ సంస్థ వివాదం పరిష్కరం కోసం ఎదురుచూడకుండా హైదరాబాద్ – విజయవాడ NH-65 రోడ్డు నిర్మాణ పనులను ఆరు లేన్లుగా నిర్మించాలని కోరారు.

వాహనాల రద్దీ కారణంగా ప్రమాదాల్లో చనిపోతున్న అమాయక ప్రజల ప్రాణాలను కాపాడాన్నారు. అలాగే NH-163 (హైదరాబాద్ – మన్నెగూడ) రోడ్డుకు ఉన్న NGT సంబంధిత సమస్యకు సత్వర పరిష్కారాన్ని కనుగొనాలని కోరారు. ఏడాదికి పైగా పెండింగ్‌లో ఉన్న నాలుగు లేన్ల నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలన్నారు. అధిక వాహన రద్దీ మూలంగా.. తీవ్ర ప్రమాదాలకు కారణమవుతున్న NH-765 (హైదరాబాద్ – కల్వకుర్తి) రోడ్డును నాలుగు లేన్లుగా నిర్మించేందుకు కావాల్సిన డీపీఆర్ (DPR) తయారీ ప్రక్రియని వేగవంతం చేయాలని సంస్థ ఛైర్మన్‌ను సంతోష్ కుమార్‌ను కోరారు. తక్షణమనే DPR తయారీ ప్రక్రియను ప్రారంభిస్తామని ఆయన హామీ ఇచ్చినట్లు మంత్రి కోమటిరెడ్డి వెల్లడించారు.

ఇక రాష్ట్రంలో 16 జాతీయ రహదారుల మంజూరీ, RRR నిర్మాణం, ఉప్పల్-ఘట్ కేసర్ ఫ్లైఓవర్ పనుల పూర్తి వంటి అంశాలపై రెండ్రోజుల క్రితం మంత్రి కోమటిరెడ్డి కేంద్ర రోడ్డు రవాణా మరియు జాతీయ రహదారుల శాఖా మంత్రి నితిన్ గడ్కరీ గారితో సమావేశమైన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వ వినతుల పట్ల ఆయన సానుకూలంగా స్పందించారు. ఉప్పల్ ఫ్లైఓవర్ పనుల కోసం కొత్త టెండర్లు పిలవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jun 26 2024, 15:33

తెలంగాణకు శుభవార్త వినిపించిన కేంద్రం

తెలంగాణకు కేంద్రం శుభవార్త వినిపించింది. రాష్ట్రంలో మరో సరికొత్త రైల్వే లైన్ త్వరలోనే అందుబాటులోకి రాబోతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కొత్త రైల్వే లైన్ల పనులు, రైల్వేస్టేషన్ల ఆధునికీకరణ, పాత స్టేషన్ల పునరుద్ధరణ వంటివి జరుగుతున్నాయి.

ఇందులో భాగంగా తెలంగాణలో కొత్త రైల్వే లైను కోసం సర్వే జరుగుతోంది. తాండూరు నుంచి జహీరాబాద్ వరకు కొత్త లైను నిర్మించనున్నారు. దీనికి సంబంధించి దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. సర్వే పనులు పూర్తి కాగానే రూ.1400 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనను అమలు పరుస్తారు.

జరగుతున్న సర్వే పనులు

ఈ రైలు మార్గం అందుబాటులోకి వస్తే కేవలం గంటన్నర వ్యవధిలోనే తాండూరు నుంచి జహీరాబాద్ చేరుకోవడానికి వీలుపడుతుంది. ఈ మార్గంలో రైల్వే లైను ఏర్పాటు చేయాలంటూ వ్యాపారస్తుల నుంచి కొంతకాలంగా డిమాండ్ వస్తోంది. ఈ డిమాండ్ కు అనుగుణంగానే దక్షిణ మధ్య రైల్వే అధికారులు సర్వే పనులు ప్రారంభింపచేశారు. ప్రస్తుతం ఉన్న రైలు మార్గం వికారాబాద్ మీదుగా నిర్మించారు. దీనివల్ల తాండూరు నుంచి జహీరాబాద్ చేరుకోవడానికి 104 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తోంది. దీనికి మూడు గంటల సమయం పడుతోంది. కొత్త మార్గం అందుబాటులోకి వస్తే గంటన్నరలోనే జహీరాబాద్ చేరుకోవచ్చు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jun 26 2024, 13:03

గ్రామపంచాయతీ కార్మికుల జీతభత్యాలను పెంచుతామని గత KCR-BRS ప్రభుత్వం ఇచ్చిన హామీలను, ప్రస్తుత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అమలుపరచాలనీ

ప్రజా పోరాట సమితి (PRPS) ఆధ్వర్యంలో రామన్నపేట తహసిల్దార్ ఆఫీస్ ముందు ధర్నా

 9 ఏళ్ల KCR పాలనలో 200 రోజుల సమ్మె పోరాటం అనంతరం, గ్రామపంచాయతీ కార్మికుల జీతభత్యాలను పెంచుతామని ఇచ్చిన హామీలకు స్పష్టమైన GO లను తీసుకురాలేదు. ఆనాడు గ్రామపంచాయతీ కార్మికుల అసమ్మతే KCR ప్రభుత్వాన్ని కూల్చింది. సుప్రీంకోర్టు 22 వేల రూ.ల జీతాన్ని అమలుపరచాలని తీర్పునిచ్చిన నేపథ్యంలో ప్రస్తుత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామపంచాయతీ వర్కర్లను నిర్లక్ష్యం చేయకుండా జీతభత్యాలను పెంచాలని, పెంచకపోతే ప్రజా వ్యతిరేకతను ఎదుర్కోవలసి వస్తుందనిPRPS రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి హెచ్చరించారు.

 ఈరోజు మండలంలోని పలు గ్రామాలకు చెందిన గ్రామ పంచాయతీ వర్కర్లు PRPS ఆధ్వర్యంలో రెవెన్యూ ఆఫీసు ముందు ధర్నా చేశారు.

 తహసిల్దార్ కు మెమోరాన్డాన్ని అందజేశారు. జీతభత్యాలు పెంచడంతోపాటు మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని కోరారు ఇందులో రాములు మల్లయ్య కృష్ణయ్య, లక్ష్మమ్మ, జానకమ్మ పాల్గొన్నారు.