హైదరాబాద్ నుంచి ఈ రెండు ప్రాంతాలకు 4 లైన్ల రోడ్లు.. DPR ప్రక్రియ వేగవంతం చేయాలన్న మంత్రి కోమటిరెడ్డి

హైదరాబాద్-మన్నెగూడ, హైదరాబాద్-కల్వకుర్తి రహదారులను నాలుగు లైన్ల రహదారులుగా తీర్చిదిద్దాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కోరారు. ఈ మేరకు ఎన్‌హెచ్‌ఏఐ సంస్థ ఛైర్మన్ సంతోష్ యాదవ్‌తో భేటీ అయి.. ప్రతిపాదనలపై చర్చించారు. ఈ రహదారుల నిర్మాణానికి త్వరగా డీపీఆర్ సిద్ధం చేయాలని కోరారు.

తెలంగాణలో రహదారుల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు. కేంద్రం సహకారంతో రహదారులను అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఈ మేరకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) కార్యాలయంలో సంస్థ ఛైర్మన్ సంతోష్ కుమార్ యాదవ్‌తో తాను భేటీ అయినట్లు చెప్పారు.

తెలంగాణలో హైవేల నిర్మాణాలను వేగవంతం చేయాలని కోరామన్నారు. ప్రధానంగా బీవోటీ కన్సెషనరీ జీఎంఆర్ సంస్థ వివాదం పరిష్కరం కోసం ఎదురుచూడకుండా హైదరాబాద్ – విజయవాడ NH-65 రోడ్డు నిర్మాణ పనులను ఆరు లేన్లుగా నిర్మించాలని కోరారు.

వాహనాల రద్దీ కారణంగా ప్రమాదాల్లో చనిపోతున్న అమాయక ప్రజల ప్రాణాలను కాపాడాన్నారు. అలాగే NH-163 (హైదరాబాద్ – మన్నెగూడ) రోడ్డుకు ఉన్న NGT సంబంధిత సమస్యకు సత్వర పరిష్కారాన్ని కనుగొనాలని కోరారు. ఏడాదికి పైగా పెండింగ్‌లో ఉన్న నాలుగు లేన్ల నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలన్నారు. అధిక వాహన రద్దీ మూలంగా.. తీవ్ర ప్రమాదాలకు కారణమవుతున్న NH-765 (హైదరాబాద్ – కల్వకుర్తి) రోడ్డును నాలుగు లేన్లుగా నిర్మించేందుకు కావాల్సిన డీపీఆర్ (DPR) తయారీ ప్రక్రియని వేగవంతం చేయాలని సంస్థ ఛైర్మన్‌ను సంతోష్ కుమార్‌ను కోరారు. తక్షణమనే DPR తయారీ ప్రక్రియను ప్రారంభిస్తామని ఆయన హామీ ఇచ్చినట్లు మంత్రి కోమటిరెడ్డి వెల్లడించారు.

ఇక రాష్ట్రంలో 16 జాతీయ రహదారుల మంజూరీ, RRR నిర్మాణం, ఉప్పల్-ఘట్ కేసర్ ఫ్లైఓవర్ పనుల పూర్తి వంటి అంశాలపై రెండ్రోజుల క్రితం మంత్రి కోమటిరెడ్డి కేంద్ర రోడ్డు రవాణా మరియు జాతీయ రహదారుల శాఖా మంత్రి నితిన్ గడ్కరీ గారితో సమావేశమైన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వ వినతుల పట్ల ఆయన సానుకూలంగా స్పందించారు. ఉప్పల్ ఫ్లైఓవర్ పనుల కోసం కొత్త టెండర్లు పిలవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

తెలంగాణకు శుభవార్త వినిపించిన కేంద్రం

తెలంగాణకు కేంద్రం శుభవార్త వినిపించింది. రాష్ట్రంలో మరో సరికొత్త రైల్వే లైన్ త్వరలోనే అందుబాటులోకి రాబోతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కొత్త రైల్వే లైన్ల పనులు, రైల్వేస్టేషన్ల ఆధునికీకరణ, పాత స్టేషన్ల పునరుద్ధరణ వంటివి జరుగుతున్నాయి.

ఇందులో భాగంగా తెలంగాణలో కొత్త రైల్వే లైను కోసం సర్వే జరుగుతోంది. తాండూరు నుంచి జహీరాబాద్ వరకు కొత్త లైను నిర్మించనున్నారు. దీనికి సంబంధించి దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. సర్వే పనులు పూర్తి కాగానే రూ.1400 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనను అమలు పరుస్తారు.

జరగుతున్న సర్వే పనులు

ఈ రైలు మార్గం అందుబాటులోకి వస్తే కేవలం గంటన్నర వ్యవధిలోనే తాండూరు నుంచి జహీరాబాద్ చేరుకోవడానికి వీలుపడుతుంది. ఈ మార్గంలో రైల్వే లైను ఏర్పాటు చేయాలంటూ వ్యాపారస్తుల నుంచి కొంతకాలంగా డిమాండ్ వస్తోంది. ఈ డిమాండ్ కు అనుగుణంగానే దక్షిణ మధ్య రైల్వే అధికారులు సర్వే పనులు ప్రారంభింపచేశారు. ప్రస్తుతం ఉన్న రైలు మార్గం వికారాబాద్ మీదుగా నిర్మించారు. దీనివల్ల తాండూరు నుంచి జహీరాబాద్ చేరుకోవడానికి 104 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తోంది. దీనికి మూడు గంటల సమయం పడుతోంది. కొత్త మార్గం అందుబాటులోకి వస్తే గంటన్నరలోనే జహీరాబాద్ చేరుకోవచ్చు.

గ్రామపంచాయతీ కార్మికుల జీతభత్యాలను పెంచుతామని గత KCR-BRS ప్రభుత్వం ఇచ్చిన హామీలను, ప్రస్తుత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అమలుపరచాలనీ

ప్రజా పోరాట సమితి (PRPS) ఆధ్వర్యంలో రామన్నపేట తహసిల్దార్ ఆఫీస్ ముందు ధర్నా

 9 ఏళ్ల KCR పాలనలో 200 రోజుల సమ్మె పోరాటం అనంతరం, గ్రామపంచాయతీ కార్మికుల జీతభత్యాలను పెంచుతామని ఇచ్చిన హామీలకు స్పష్టమైన GO లను తీసుకురాలేదు. ఆనాడు గ్రామపంచాయతీ కార్మికుల అసమ్మతే KCR ప్రభుత్వాన్ని కూల్చింది. సుప్రీంకోర్టు 22 వేల రూ.ల జీతాన్ని అమలుపరచాలని తీర్పునిచ్చిన నేపథ్యంలో ప్రస్తుత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామపంచాయతీ వర్కర్లను నిర్లక్ష్యం చేయకుండా జీతభత్యాలను పెంచాలని, పెంచకపోతే ప్రజా వ్యతిరేకతను ఎదుర్కోవలసి వస్తుందనిPRPS రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి హెచ్చరించారు.

 ఈరోజు మండలంలోని పలు గ్రామాలకు చెందిన గ్రామ పంచాయతీ వర్కర్లు PRPS ఆధ్వర్యంలో రెవెన్యూ ఆఫీసు ముందు ధర్నా చేశారు.

 తహసిల్దార్ కు మెమోరాన్డాన్ని అందజేశారు. జీతభత్యాలు పెంచడంతోపాటు మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని కోరారు ఇందులో రాములు మల్లయ్య కృష్ణయ్య, లక్ష్మమ్మ, జానకమ్మ పాల్గొన్నారు.

ప్రభుత్వ భూములపై సేద్యం చేస్తున్న పేద రైతాంగానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తక్షణం భూయాజమాన్య హక్కు పట్టాలను ఇవ్వాలి

ప్రజా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి అభ్యర్థన

 తెలంగాణ రాష్ట్ర యావత్తు ఎన్ని ధరణి భూ సమస్యలున్నవో ఒక్క నల్లగొండ జిల్లాలో అన్ని ఉన్నాయని, సుమారుగా 16 వేల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని, వాటన్నింటినీ పరిష్కారం చేసే వైపు నూతన రెవెన్యూ సంస్కరణలు రాష్ట్రంలో తీసుకురావాలని, సుదీర్ఘకాలం నుండి ప్రభుత్వ భూములను సేద్యం చేస్తున్న SC, BC పేదరైతాంగానికి భూ యాజమాన్య హక్కు పట్టాలను తక్షణం ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలని" ప్రజా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి నూతన ప్రభుత్వాన్ని కోరారు.

 ఈరోజు చిట్యాల మండలంలోని బోయగుబ్బ గ్రామంలో సుదీర్ఘకాలం నుండి ప్రభుత్వ భూములను సేద్యం చేస్తున్న పేద రైతులు ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

 భూమి పంపిణీ అనేది KCR ప్రభుత్వం ఏనాడూ చేపట్టలేదని, పేదల చేతుల్లో ఉన్న భూముల్ని లక్షలాది ఎకరాలను గుంజుకోవడానికి ప్రయత్నించారని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ భూములపై సేధ్యం చేస్తున్న రైతులకు పట్టాలు ఇవ్వాలని కోరారు.

 ఇందులో గుర్జా పరమేష్ గౌడ్, గుర్జా లింగస్వామిగౌడ్, గండమల్ల రాములు, గండమల్ల కిషన్, భాజ ప్రమీల, రెడ్డిమల్ల నరసింహ, లక్క కృష్ణయ్య పాల్గొన్నారు.

దేశ ప్రజలకు అసదుద్దీన్ ఓవైసీ బహిరంగ క్షమాపణ చెప్పాలి పాలకూరి రవి గౌడ్

 వివాదాస్పద నినాదాలతో పార్లమెంటులో లోకసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన హైదారాబాద్ పార్లమెంట్ సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ

భారతదేశ ప్రజలకు బహిరంగ క్షమాపణలు తెలపాలని నల్గొండ పార్లమెంట్ కాంటెస్ట్ అభ్యర్థి పాలకూరి రవి గౌడ్ డిమాండ్ చేశారు

భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు అని సోదర భావంతో మెలుగుతున్నటువంటి ఈ దేశ ప్రజలలో మత పరమైన విద్వేష వ్యాఖ్యలు చేయడం సరైన విధానం కాదని..

పార్లమెంటులో దేశం పట్ల ఈదేశ ప్రజల పట్ల ఈ దేశ రాజ్యాంగం పట్ల గౌరవ మర్యాదలు లేకుండా ప్రమాణం చేసినటువంటి అసదుద్దీన్ ని ఈదేశ ప్రజలకు బహిరంగ క్షమాపణ తెలియజేయాలని పాలకూరి రవి గౌడ్ డిమాండ్ చేశారు

కేబుల్ బ్రిడ్జి పై నుండి దూకి యువకుడు ఆత్మహత్యయత్నం

కేబుల్ బ్రిడ్జి పై నుండి దూకి యువకుడు ఆత్మహత్యయత్నం

మాదాపూర్ కేబుల్ బ్రిడ్జి పై నుండి దూకి ఆత్మహత్యకు యత్నించిన యువకుడిని కాపాడిన మాదాపూర్ పోలీసులు.

మాదాపూర్ పర్వత్ నగర్ లో నివాసం ఉంటూ క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్న సాయి కిరణ్(23).

ఆర్థిక ఇబ్బందులు తాళలేక సోమవారం దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి పై నుండి దూకి ఆత్మహత్యకు సాయి కిరణ్ ప్రయత్నించాడు.

అక్కడే ఉన్న పోలీసులు గమనించి యువకుడికి కాపాడి కౌన్సిలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు యువకుడిని పోలీసులు అప్పగించారు...

అనుమతుల్లేని ఎస్పిఆర్ పాఠశాలను తక్షణమే సీజ్ చేయాలి

 బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్దన్ గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వ ఎలాంటి అనుమతులు లేకుండా నల్గొండ జిల్లా కేంద్రంలో దేవరకొండ రోడ్ లో

ఎస్. పి .ఆర్

హైస్కూల్ పేరుమీద పాఠశాలను చలాయిస్తున్నారు దీనికి ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేవు ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా నడిపిస్తున్న పాఠశాల యజమానియం పైన చట్టపరమైన చర్యలు తీసుకొని

విద్యార్థులకు నష్టం జరగకుండా చూడాలని విద్యాశాఖ అధికారి గారిని కోరుతున్నాము తన ఇష్టానుసారంగా ప్రవేట్ పాఠశాలలను నెలకొల్పి పేద విద్యార్థుల నుండి లక్షల రూపాయలను దండుకుంటున్న ప్రైవేట్ పాఠశాలల యజమాన్యం పైన చర్యలు తీసుకోవాలి అని జిల్లా కలెక్టర్ గారిని కోరుతున్నాము

జిల్లా వ్యాప్తంగా అనేక ప్రైవేట్ పాఠశాలలు ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా చాలాఇస్తున్నారు తక్షణమే జిల్లా కలెక్టర్ గారు చరువచూపి ఇలాంటివి ఎక్కడున్నా తక్షణమే సీజ్ చేసే విధంగా ఆదేశాలు జారీ చేయాలని బీసీ విద్యార్థి సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం

అంగన్వాడీల వేతనాలు పెంచాలి

రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని అమలు చేయాలి

AITUC కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి డిమాండ్

అంగన్వాడీల వేతనాలు 18 వేలకు పెంచుతామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా తక్షణమే వేతనాలు పెంచాలని ఇతర హామీలు అమలు చేయాలని

ఏఐటీయూసీ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షులు ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి

ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. AITUC ఆధ్వర్యంలో సోమవారం నల్లగొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు అంగన్వాడీలు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం అంగన్వాడిల సమస్యలను పరిష్కరించకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా2023 సెప్టెంబర్ 11 నుండి అక్టోబర్ 4 వరకు 24 రోజుల సమ్మె చేస్తే గత ప్రభుత్వం పట్టించుకోలేదని,కాంగ్రెస్ పార్టీ అంగన్వాడి సమస్యల పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చేర్చిన విధంగా అంగన్వాడీలకు తక్షణమే 18 వేల వేతనం చెల్లించాలని కోరారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ టీచర్లకు పది లక్షలు హెల్పర్ కు 5 లక్షలు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రస్తుతం రిటైర్మెంట్ బెనిఫిట్స్ టీచర్ కు లక్ష రూపాయలు ఆయాకు 50 వేలు మాత్రమే చెల్లిస్తూ ప్రభుత్వం చేతులు దులుపుకుంటుందని అన్నారు. అంగన్వాడి లపై పనిబారం తగ్గించాలని ,పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని , ఖాళీగా ఉన్న సూపర్వైజర్ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేసారు. గ్రామస్థాయిలో అన్ని రకాల పనులు అంగన్వాడీల చేత చేయిస్తూ అంగన్వాడీలను నిర్లక్ష్యం చేయడం తగదని అన్నారు. అంగన్వాడి సెంటర్ కు గుడ్లు నాణ్యత లేకుండా వస్తున్నాయని, సొంత భవనాలు నిర్మించాలని కోరారు. గత ప్రభుత్వం జారీ చేసిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ కు సంబంధించిన జీవో నెంబర్ 10ని వెంటనే రద్దు చేయాలని కోరారు. గతంలో సమ్మె కాలపు 24 రోజుల వేతనం వెంటనే విడుదల చేయాలని కోరారు. ప్రభుత్వ వెబ్సైట్లో అంగన్వాడీ లను ప్రభుత్వ ఉద్యోగులుగా చూపుతున్నారని దీనివలన ప్రభుత్వ సంక్షేమ పథకాలు అంగన్వాడీలకు అందడం లేదని అన్నారు.

అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎడమ సుమతమ్మ మాట్లాడుతూ గత 50 సంవత్సరాలుగా అంగన్వాడీ టీచర్లు గా ఆయాలుగా పనిచేస్తున్న నేటికీ గౌరవ వేతనం పొందుతూ వెట్టిచాకిరి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇంటి అద్దెలు కూరగాయల బిల్లులు గ్యాస్ బిల్లులు సకాలంలో చెల్లించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఏఐటియుసి అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎడమ సుమతమ్మ,జిల్లా ఉపాధ్యక్షురాలు శాంత కుమారి, కోట్ల శోభ, శంతాబాయి,సాయి సుజిత ,బి రాణి, అన్నపూర్ణ,ప్రభావతి, అంజలి,రమణ,వణజా, విజయ,టీ సరిత,దస్లి,జగదేశ్వరీ, పద్మావతి, సునీత, కేదారి,స్వప్న బక్కమ్మ,ch తారక, జయంతి జంగమ్మ, జ్యోతి, ప్రమీల, అరుణ విజయలక్ష్మి, భద్రమ్మ, రెడ్డి బాయ్,AITUC డివిజన్ కార్యదర్శి విశ్వనాధులు లెనిన్, AISF జిల్లా ప్రధాన కార్యదర్శి పి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ధర్నా అనంతరం కలెక్టర్ కార్యాలయంలో ఐసీడీఎస్ పీడీ కార్యాలయంలో సమర్పించడం జరిగింది.

ఇంటి స్థలాలకు ప్రభుత్వ భూములు కానీ, భూ-కొనుగోలు పథకం ద్వారా భూములు సేకరించి, నిలువ నీడలేని నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇచ్చి, ఇండ్లు నిర్మించాలి

ప్రజా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి డిమాండ్

 నకిరేకల్ మండలంలో అనేక గ్రామాల్లో 50 సంవత్సరాల క్రితం నిరుపేదలకు ఇంటి స్థలాలను ఇచ్చి, ఇండ్లు కూడా నిర్మించారని గత సుదీర్ఘకాలంగా ఆయా దళిత, బిసి కుటుంబాలు రెండు, మూడు కుటుంబాలుగా పెరగడం వలన ఆయా ఇళ్లల్లో నివసించలేని దుర్భర పరిస్థితులు ఏర్పడ్డాయని,

ఈ స్థితిలో ప్రభుత్వం నిలువ నీడలేని నిరుపేదలకు ఇంటి స్థలాల కోసం ధనాడ్య వర్గాలు అక్రమంగా ఆక్రమించిన ప్రభుత్వ భూములను పేదల ఇండ్ల స్థలాలకు కేటాయించి కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తానంటున్న ఇందిరమ్మ ఇళ్ళను మంజూరు చేయాలని పేదల ఎడల చిత్తశుద్ధి ఉన్న ప్రభుత్వం తన యొక్క నిజాయితీని నిరూపించుకోవాలని ప్రజా పోరాట సమితి (PRPS) రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి కోరారు.

 ఈరోజు నకిరేకల్ మండలం నోములలో జరిగిన పేదల సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

 ఇందులో గ్యార సాలయ్య మాచర్ల ఎల్లయ్య గ్వార పీరయ్య మామిడి బిక్షం మాచర్ల గోపి మాచర్ల పరమేష్ ఎర్ర ప్రమీల తదితరు పాల్గొన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ భూములపై సేద్యం చేస్తున్న పేదరైతాంగానికి పట్టాలు ఇవ్వాలి.ప్రజా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి

 ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ప్రభుత్వ భూములను సేద్యం చేస్తున్న పేదలకు భూ యాజమాన్య పట్టాలు ఇస్తానని ప్రకటించింది.

వెనువెంటనే ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం భూపట్టాలు ఇవ్వాలి. ప్రభుత్వ భూములపై పేదలకు రాజ్యాంగం హక్కులు కల్పించింది. గత పాలకపక్షాలన్నీ ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని ప్రైవేట్ శక్తులకు కైంకర్యం చేశాయి. కనీసం పేదలు సేద్యం చేస్తున్న భూములకైన ముందు పట్టాలు ఇచ్చి, ఇది పేదప్రజల ప్రభుత్వం అని నిరూపించుకోవాలి." ప్రజా పోరాట సమితి (PRPS) రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకటస్వామి కోరారు.

 ఈరోజు నకిరేకల్ మండలం నోముల, కేతేపల్లి మండలం బొప్పారం గ్రామాల్లో జరిగిన రైతుల సమావేశాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు.

ఈ సమావేశాల్లో PRPS మండల అధ్యక్షుడు గ్యార సాలయ్య, నాయకులు గ్యార లక్ష్మయ్య, మాచర్ల లింగయ్య, మామిడి భిక్షం, గుండె లింగయ్య, మామిడి నాగయ్య, దుర్గం పరశురాములు, బట్ట సైదులు, ఆనంతుల వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు.