ప్రభుత్వ భూములపై సేద్యం చేస్తున్న పేద రైతాంగానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తక్షణం భూయాజమాన్య హక్కు పట్టాలను ఇవ్వాలి

ప్రజా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి అభ్యర్థన

 తెలంగాణ రాష్ట్ర యావత్తు ఎన్ని ధరణి భూ సమస్యలున్నవో ఒక్క నల్లగొండ జిల్లాలో అన్ని ఉన్నాయని, సుమారుగా 16 వేల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని, వాటన్నింటినీ పరిష్కారం చేసే వైపు నూతన రెవెన్యూ సంస్కరణలు రాష్ట్రంలో తీసుకురావాలని, సుదీర్ఘకాలం నుండి ప్రభుత్వ భూములను సేద్యం చేస్తున్న SC, BC పేదరైతాంగానికి భూ యాజమాన్య హక్కు పట్టాలను తక్షణం ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలని" ప్రజా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి నూతన ప్రభుత్వాన్ని కోరారు.

 ఈరోజు చిట్యాల మండలంలోని బోయగుబ్బ గ్రామంలో సుదీర్ఘకాలం నుండి ప్రభుత్వ భూములను సేద్యం చేస్తున్న పేద రైతులు ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

 భూమి పంపిణీ అనేది KCR ప్రభుత్వం ఏనాడూ చేపట్టలేదని, పేదల చేతుల్లో ఉన్న భూముల్ని లక్షలాది ఎకరాలను గుంజుకోవడానికి ప్రయత్నించారని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ భూములపై సేధ్యం చేస్తున్న రైతులకు పట్టాలు ఇవ్వాలని కోరారు.

 ఇందులో గుర్జా పరమేష్ గౌడ్, గుర్జా లింగస్వామిగౌడ్, గండమల్ల రాములు, గండమల్ల కిషన్, భాజ ప్రమీల, రెడ్డిమల్ల నరసింహ, లక్క కృష్ణయ్య పాల్గొన్నారు.

దేశ ప్రజలకు అసదుద్దీన్ ఓవైసీ బహిరంగ క్షమాపణ చెప్పాలి పాలకూరి రవి గౌడ్

 వివాదాస్పద నినాదాలతో పార్లమెంటులో లోకసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన హైదారాబాద్ పార్లమెంట్ సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ

భారతదేశ ప్రజలకు బహిరంగ క్షమాపణలు తెలపాలని నల్గొండ పార్లమెంట్ కాంటెస్ట్ అభ్యర్థి పాలకూరి రవి గౌడ్ డిమాండ్ చేశారు

భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు అని సోదర భావంతో మెలుగుతున్నటువంటి ఈ దేశ ప్రజలలో మత పరమైన విద్వేష వ్యాఖ్యలు చేయడం సరైన విధానం కాదని..

పార్లమెంటులో దేశం పట్ల ఈదేశ ప్రజల పట్ల ఈ దేశ రాజ్యాంగం పట్ల గౌరవ మర్యాదలు లేకుండా ప్రమాణం చేసినటువంటి అసదుద్దీన్ ని ఈదేశ ప్రజలకు బహిరంగ క్షమాపణ తెలియజేయాలని పాలకూరి రవి గౌడ్ డిమాండ్ చేశారు

కేబుల్ బ్రిడ్జి పై నుండి దూకి యువకుడు ఆత్మహత్యయత్నం

కేబుల్ బ్రిడ్జి పై నుండి దూకి యువకుడు ఆత్మహత్యయత్నం

మాదాపూర్ కేబుల్ బ్రిడ్జి పై నుండి దూకి ఆత్మహత్యకు యత్నించిన యువకుడిని కాపాడిన మాదాపూర్ పోలీసులు.

మాదాపూర్ పర్వత్ నగర్ లో నివాసం ఉంటూ క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్న సాయి కిరణ్(23).

ఆర్థిక ఇబ్బందులు తాళలేక సోమవారం దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి పై నుండి దూకి ఆత్మహత్యకు సాయి కిరణ్ ప్రయత్నించాడు.

అక్కడే ఉన్న పోలీసులు గమనించి యువకుడికి కాపాడి కౌన్సిలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు యువకుడిని పోలీసులు అప్పగించారు...

అనుమతుల్లేని ఎస్పిఆర్ పాఠశాలను తక్షణమే సీజ్ చేయాలి

 బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్దన్ గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వ ఎలాంటి అనుమతులు లేకుండా నల్గొండ జిల్లా కేంద్రంలో దేవరకొండ రోడ్ లో

ఎస్. పి .ఆర్

హైస్కూల్ పేరుమీద పాఠశాలను చలాయిస్తున్నారు దీనికి ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేవు ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా నడిపిస్తున్న పాఠశాల యజమానియం పైన చట్టపరమైన చర్యలు తీసుకొని

విద్యార్థులకు నష్టం జరగకుండా చూడాలని విద్యాశాఖ అధికారి గారిని కోరుతున్నాము తన ఇష్టానుసారంగా ప్రవేట్ పాఠశాలలను నెలకొల్పి పేద విద్యార్థుల నుండి లక్షల రూపాయలను దండుకుంటున్న ప్రైవేట్ పాఠశాలల యజమాన్యం పైన చర్యలు తీసుకోవాలి అని జిల్లా కలెక్టర్ గారిని కోరుతున్నాము

జిల్లా వ్యాప్తంగా అనేక ప్రైవేట్ పాఠశాలలు ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా చాలాఇస్తున్నారు తక్షణమే జిల్లా కలెక్టర్ గారు చరువచూపి ఇలాంటివి ఎక్కడున్నా తక్షణమే సీజ్ చేసే విధంగా ఆదేశాలు జారీ చేయాలని బీసీ విద్యార్థి సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం

అంగన్వాడీల వేతనాలు పెంచాలి

రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని అమలు చేయాలి

AITUC కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి డిమాండ్

అంగన్వాడీల వేతనాలు 18 వేలకు పెంచుతామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా తక్షణమే వేతనాలు పెంచాలని ఇతర హామీలు అమలు చేయాలని

ఏఐటీయూసీ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షులు ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి

ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. AITUC ఆధ్వర్యంలో సోమవారం నల్లగొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు అంగన్వాడీలు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం అంగన్వాడిల సమస్యలను పరిష్కరించకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా2023 సెప్టెంబర్ 11 నుండి అక్టోబర్ 4 వరకు 24 రోజుల సమ్మె చేస్తే గత ప్రభుత్వం పట్టించుకోలేదని,కాంగ్రెస్ పార్టీ అంగన్వాడి సమస్యల పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చేర్చిన విధంగా అంగన్వాడీలకు తక్షణమే 18 వేల వేతనం చెల్లించాలని కోరారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ టీచర్లకు పది లక్షలు హెల్పర్ కు 5 లక్షలు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రస్తుతం రిటైర్మెంట్ బెనిఫిట్స్ టీచర్ కు లక్ష రూపాయలు ఆయాకు 50 వేలు మాత్రమే చెల్లిస్తూ ప్రభుత్వం చేతులు దులుపుకుంటుందని అన్నారు. అంగన్వాడి లపై పనిబారం తగ్గించాలని ,పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని , ఖాళీగా ఉన్న సూపర్వైజర్ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేసారు. గ్రామస్థాయిలో అన్ని రకాల పనులు అంగన్వాడీల చేత చేయిస్తూ అంగన్వాడీలను నిర్లక్ష్యం చేయడం తగదని అన్నారు. అంగన్వాడి సెంటర్ కు గుడ్లు నాణ్యత లేకుండా వస్తున్నాయని, సొంత భవనాలు నిర్మించాలని కోరారు. గత ప్రభుత్వం జారీ చేసిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ కు సంబంధించిన జీవో నెంబర్ 10ని వెంటనే రద్దు చేయాలని కోరారు. గతంలో సమ్మె కాలపు 24 రోజుల వేతనం వెంటనే విడుదల చేయాలని కోరారు. ప్రభుత్వ వెబ్సైట్లో అంగన్వాడీ లను ప్రభుత్వ ఉద్యోగులుగా చూపుతున్నారని దీనివలన ప్రభుత్వ సంక్షేమ పథకాలు అంగన్వాడీలకు అందడం లేదని అన్నారు.

అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎడమ సుమతమ్మ మాట్లాడుతూ గత 50 సంవత్సరాలుగా అంగన్వాడీ టీచర్లు గా ఆయాలుగా పనిచేస్తున్న నేటికీ గౌరవ వేతనం పొందుతూ వెట్టిచాకిరి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇంటి అద్దెలు కూరగాయల బిల్లులు గ్యాస్ బిల్లులు సకాలంలో చెల్లించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఏఐటియుసి అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎడమ సుమతమ్మ,జిల్లా ఉపాధ్యక్షురాలు శాంత కుమారి, కోట్ల శోభ, శంతాబాయి,సాయి సుజిత ,బి రాణి, అన్నపూర్ణ,ప్రభావతి, అంజలి,రమణ,వణజా, విజయ,టీ సరిత,దస్లి,జగదేశ్వరీ, పద్మావతి, సునీత, కేదారి,స్వప్న బక్కమ్మ,ch తారక, జయంతి జంగమ్మ, జ్యోతి, ప్రమీల, అరుణ విజయలక్ష్మి, భద్రమ్మ, రెడ్డి బాయ్,AITUC డివిజన్ కార్యదర్శి విశ్వనాధులు లెనిన్, AISF జిల్లా ప్రధాన కార్యదర్శి పి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ధర్నా అనంతరం కలెక్టర్ కార్యాలయంలో ఐసీడీఎస్ పీడీ కార్యాలయంలో సమర్పించడం జరిగింది.

ఇంటి స్థలాలకు ప్రభుత్వ భూములు కానీ, భూ-కొనుగోలు పథకం ద్వారా భూములు సేకరించి, నిలువ నీడలేని నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇచ్చి, ఇండ్లు నిర్మించాలి

ప్రజా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి డిమాండ్

 నకిరేకల్ మండలంలో అనేక గ్రామాల్లో 50 సంవత్సరాల క్రితం నిరుపేదలకు ఇంటి స్థలాలను ఇచ్చి, ఇండ్లు కూడా నిర్మించారని గత సుదీర్ఘకాలంగా ఆయా దళిత, బిసి కుటుంబాలు రెండు, మూడు కుటుంబాలుగా పెరగడం వలన ఆయా ఇళ్లల్లో నివసించలేని దుర్భర పరిస్థితులు ఏర్పడ్డాయని,

ఈ స్థితిలో ప్రభుత్వం నిలువ నీడలేని నిరుపేదలకు ఇంటి స్థలాల కోసం ధనాడ్య వర్గాలు అక్రమంగా ఆక్రమించిన ప్రభుత్వ భూములను పేదల ఇండ్ల స్థలాలకు కేటాయించి కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తానంటున్న ఇందిరమ్మ ఇళ్ళను మంజూరు చేయాలని పేదల ఎడల చిత్తశుద్ధి ఉన్న ప్రభుత్వం తన యొక్క నిజాయితీని నిరూపించుకోవాలని ప్రజా పోరాట సమితి (PRPS) రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి కోరారు.

 ఈరోజు నకిరేకల్ మండలం నోములలో జరిగిన పేదల సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

 ఇందులో గ్యార సాలయ్య మాచర్ల ఎల్లయ్య గ్వార పీరయ్య మామిడి బిక్షం మాచర్ల గోపి మాచర్ల పరమేష్ ఎర్ర ప్రమీల తదితరు పాల్గొన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ భూములపై సేద్యం చేస్తున్న పేదరైతాంగానికి పట్టాలు ఇవ్వాలి.ప్రజా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి

 ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ప్రభుత్వ భూములను సేద్యం చేస్తున్న పేదలకు భూ యాజమాన్య పట్టాలు ఇస్తానని ప్రకటించింది.

వెనువెంటనే ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం భూపట్టాలు ఇవ్వాలి. ప్రభుత్వ భూములపై పేదలకు రాజ్యాంగం హక్కులు కల్పించింది. గత పాలకపక్షాలన్నీ ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని ప్రైవేట్ శక్తులకు కైంకర్యం చేశాయి. కనీసం పేదలు సేద్యం చేస్తున్న భూములకైన ముందు పట్టాలు ఇచ్చి, ఇది పేదప్రజల ప్రభుత్వం అని నిరూపించుకోవాలి." ప్రజా పోరాట సమితి (PRPS) రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకటస్వామి కోరారు.

 ఈరోజు నకిరేకల్ మండలం నోముల, కేతేపల్లి మండలం బొప్పారం గ్రామాల్లో జరిగిన రైతుల సమావేశాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు.

ఈ సమావేశాల్లో PRPS మండల అధ్యక్షుడు గ్యార సాలయ్య, నాయకులు గ్యార లక్ష్మయ్య, మాచర్ల లింగయ్య, మామిడి భిక్షం, గుండె లింగయ్య, మామిడి నాగయ్య, దుర్గం పరశురాములు, బట్ట సైదులు, ఆనంతుల వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు.

రింగ్ రోడ్డు కాదుదొంగ రోడ్డు

తమ అనుచరుల లబ్ధికోసమే ప్లాన్ 3

ఉప సమహరించుకోకుంటే... ఉద్యమిస్తాం.... కంచర్ల.

కలక్టర్ కు వినతి పత్రం సమర్పించిన.. బాధితులు

నేడు మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో... నల్లగొండ రింగ్ రోడ్ బాధిత కుటుంబాలవారు.. పెద్ద ఎత్తున కలెక్టర్ కార్యాలయం లో... కలెక్టర్ నారాయణ రెడ్డి గారిని కలుసుకొని... వినతి పత్రం సమర్పించారు..

సందర్బంగా కలెక్టర్ తాము స్వయంగా... స్థల పరిశీలన జరిపి.. ప్రభుత్వం తోనూ ఇండ్లు, ప్లాట్లు కోల్పోతున్న బాధితులతోను మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు...

అనంతరం... మీడియా తో మాట్లాడుతూ కంచర్ల...

ఇది రింగ్ రోడ్ కాదు దొంగ రోడ్ అని... తమ అనుచరులకు దోచి పెట్టడానికి..

మంత్రి నాటకం ఆడుతున్నారని... 3000 కుటుంబాలను తాము కష్టపడి చమటోడ్చి... సంపాదించుకున్న ప్లాట్లు.. ఇండ్లు.. నష్ట పోతున్నా పట్టించు కోకుండా...అధికారం ఉందనే అహంకారం తో మొండి వైఖరి ప్రదర్శిస్తున్నారని...బాధితుల గోడు పట్టించుకోవట్లేదని న్నారు... అందరికి ఆమోదయోగ్యమైన.. ప్లాన్ 1,2, వదిలేసి.. తమ అనుచరుల లబ్ధికోసం ప్లాన్ 3 ఎంచుకున్నారని ఆరోపించారు... తక్షణం... ప్లాన్ 3 ఉపసంహారించుకోవాలని.. లేకుంటే బాధితుల తరుపున తాము పోరాడుతామని... 

15 రోజుల సమయం ఇస్తున్నామని... ఈలోగా ప్లాన్ 3 ఉత్తర్వులను ఉపసంహరించుకోకుంటే...ఎంతమంది బాధితులున్నారో వారందరి తో కలిసి.. పాదయాత్ర చేస్తామని... ఆతర్వాత.. ఉత్తర్వులు రద్దు చేసేవరకు దశల వారీగా ఉద్యమిస్తామని..ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

భారీ ఎత్తున రింగ్ రోడ్ బాధితులతో పాటు...జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ అధ్యక్షులు రెగట్టే మల్లిఖార్జున రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి,ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్,పట్టణ పార్టీ అధ్యక్షులు బోనగిరి దేవేందర్,కాంచనపల్లి రవీందర్ రావు,జమాల్ ఖాద్రి,కౌన్సిలర్ మారగోని గణేష్,మెరుగు గోపి,షంశుద్దీన్, గంజి రాజేందర్,వజ్జే శ్రీనివాస్,దొడ్డి రమేష్, సైదిరెడ్డి,తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణకు హోం మంత్రి కావలెను!

తెలంగాణకు హోం మంత్రి కావలెను!

తొమ్మిదిన్నరేళ్లు ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం వల్ల శాంతిభద్రతలు క్షీణించాయి.

ఘర్షణలు, హత్యలు, అత్యాచారాలు, అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి.

గత ఆరు నెలలుగా రాష్ట్రంలో శాంతిభద్రతలను పర్యవేక్షించేందుకు తెలంగాణకు హోం మంత్రి లేడు.. ప్రజల భద్రతను పట్టించుకునే దిక్కే లేదు.

అందుకే వెంటనే

తెలంగాణకు హోం మంత్రి కావలెను

జులై 7న వరంగల్ లో జరిగే 30 ఏళ్ల మాదిగల ఆత్మగౌరవ కవాతును జయప్రదం చేయండి - MRPS

ఈరోజు మిర్యాలగూడ నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన ఎమ్మార్పీఎస్ MSP ముఖ్య కార్యకర్తల సమావేశం MSP నియోజకవర్గ ఇన్చార్జి మచ్చ ఏడుకొండలు మాదిగ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్య అతిథులుగా MSP జిల్లా అధ్యక్షుడు బకరం శ్రీనివాస్ మాదిగ, MRPS నల్గొండ జిల్లా అధ్యక్షులు ఇరిగి శ్రీశైలం మాదిగ గార్లు హాజరై సంయుక్తంగా మాట్లాడుతూ.

భారత రాజ్యాంగంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారు కల్పించిన రిజర్వేషన్లు షెడ్యూల్ కులాలలోని అన్ని ఉపకులాలకు జనాభా నిష్పత్తి ప్రకారంగా పంపిణీ జరగాలని అస్తిత్వ ఆత్మగౌరవ పోరాటాలకు పురుడుబోసిన ఎమ్మార్పీఎస్ ఉద్యమం ఆవిర్భవించి జులై 7 నాటికి గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ* గారి నాయకత్వంలో ఏర్పడి నేటికీ 30 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుందని తెలిపారు. ప్రపంచంలో ఇంత ఘన చరిత్ర కలిగిన ఉద్యమం దండోరా ఉద్యమం అని అన్నారు. ఎమ్మార్పీఎస్ ఉద్యమం ఆవిర్భవించిన నాటి నుండి కేవలం మాదిగల కోసమే కాకుండా సమాజంలో అన్ని వర్గాల ప్రజా సమస్యల మీద వృద్ధులు, వికలాంగులు, వితంతులు పెన్షన్ల పెంపు కోసం మరియు గుండె జబ్బు చిన్నారుల, ఉచిత వైద్యం కోసం చేసిన పోరాటమే ఆరోగ్యశ్రీ కార్డు రూపకల్పనకు దారిదీసిందని తెలిపారు. 

ఎమ్మార్పీఎస్ చేసిన పోరాటమే సమాజంలో అన్ని వర్గాలకు మేలు కలిగిందని తెలిపారు. 

తమ లక్ష్యసాధనైనా ఎస్సీ వర్గీకరణకు అతి త్వరలోనే నూతనంగా కేంద్రంలో అధికారంలోకి వచ్చిన గౌరవ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఎన్డీఏ ప్రభుత్వంలో ఎస్సీ వర్గీకరణ సాధిస్తామని 

 ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. 

జులై 7 నాటికి ఎమ్మార్పీ శ్రేణులు గ్రామ మండల పూర్తిస్థాయి కమిటీలను పూర్తిచేసుకుని

నల్ల షర్టు బ్లాక్ పాయింట్తో డ్రెస్ కోడ్ తో జూలై 7న వరంగల్లో జరిగే మాదిగల ఆత్మగౌరవ కవాతుకు లక్షలాదిగా తరలిరావాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి జిల్లావ్యాప్తంగా మాదిగ పల్లెలు రాజకీయాలకు అతీతంగా ప్రతి గ్రామం నుండి ప్రతి మాదిగ బిడ్డ వరంగల్ కేంద్రానికి తరలిరావాలని కోరారు.

ఈ కార్యక్రమంలో MRPS నియోజక వర్గ ఇంచార్జి సండ్ర నాగరాజు మాదిగ, దైద రవి మాదిగ, MRPS జిల్లా సీనియర్ నాయకులు, జిల్లా ప్రధాన కార్యదర్శి సందాల శంబయ్య మాదిగ , కలకొండ హరీష్ మాదిగ, రావులపటి శ్రీను మాదిగ, మంద అంజి మాదిగ, మహంకాళి సురేష్ మాదిగ, మోహన్ మాదిగ, దైద సురేష్ మాదిగ, మంద శివ మాదిగ, మంద శ్రీను మాదిగ, వాళ్లపుదాసు నాగయ్య మాదిగ తదితరులు పాల్గొన్నారు.