జర్నలిస్టుల సంక్షేమానికి కృషి
జర్నలిస్టుల సంక్షేమానికి కృషి ఏపీజేయూ రాష్ట్ర నిర్వహణ కమిటీ అధ్యక్షులు కాకుమాను వెంకట వేణు విజయవాడ,గ్రేటర్ టుడే:ఆల్ ఇండియా స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ ఫెడరేషన్ న్యూఢిల్లీ అనుబంధ సంస్థ ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల యూనియన్ (ఏపీజేయూ) రాష్ట్ర కార్యవర్గ సమావేశం విజయవాడలోని ఓ హోటల్లో యూనియన్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కాకుమాను వెంకట వేణు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో తమ యూనియన్ జర్నలిస్టుల సంక్షేమంతో పాటు అన్ని జిల్లాల్లో యూనియన్ కమిటీలు ఏర్పాటుకు కృషి చేయనున్నట్లు తెలిపారు. అందుకు ఇప్పటికి జిల్లాల్లో ఉన్న కన్వీనర్లు తగిన తోడ్పాటు అందించాలని కోరారు. ఈ సందర్భంగా రాజమండ్రి, కాకినాడ, కడప జిల్లాలకు కన్వీనర్లుగా వి.ఆదినారాయణ,పి.శ్రీనివాసరావు, గరగా ప్రసాద్, గిరిబాబు, హనుమాన్ రెడ్డి లను నియమిస్తూ వారికి నియామక పత్రాలు అందించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు సిద్దార్థ, ప్రధాన కార్యదర్శి శేఖర్ బాబు, రాష్ట్ర నాయకులు విష్ణువర్ధన్, రఫీ, భగవాన్, హేమసుందర్, సుబ్బాచారి పాల్గొన్నారు. సమావేశంలో భాగంగా ముందుగా ఈనాడు పత్రిక సంపాదకుడు రామోజీరావు మరణాన్ని చింతిస్తూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించి సంతాపంని తెలిపారు. .రామోజీరావు కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు..
పత్రికా రంగానికి వన్నెతెచ్చిన మహనీయులు రామోజీరావు
పత్రికా రంగానికి వన్నెతెచ్చిన మహనీయులు రామోజీరావుఅని గాజువాక బిజెపి కన్వీనర్ కరణంరెడ్డి నరసింగరావు. అన్నారు. ఢిల్లీ ఆంధ్ర భవన్ మీడియా పాయింట్ దగ్గర రామోజీరావు చిత్ర పటానికి పలువురు నాయకులు ఘణ నివాళులర్పించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ దేశంలో పత్రిక రంగంకి వన్నె తెచ్చిన మహనీయులు రామోజీరావు అని
అన్నారు. ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు అకాల మరణం పత్రికా రంగానికి తీరని లోటని అన్నారు.
దేశ వ్యాప్తంగా ఎంతోమందికి మీడియా రంగంలో ఉపాది కల్పించారని అన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు గొల్ల బాబురావు ,బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాశీ రాజు, బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర నాయకులు ములకలపల్లి ప్రకాష్ ,యల్లబిల్లి వెంకటరావు మరియు వివిధ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆయనకు నివాళులర్పించారు.
పదవ తరగతి, ఇంటర్మీడియట్, విద్యార్థులకు మెరిట్ స్కాలర్ షిప్
          మెరిట్ స్కాలర్ షిప్ ను పదవ తరగతి, ఇంటర్మీడియట్ - బంజారా బజరంగీ భేరి
.    కృష్ణాపురం గ్రామం నందు బంజారా బజరంగీ భేరి సంఘం ఆధ్వర్యంలో చేతక్  మెరిట్ విద్యార్థులకు ఇవ్వడం జరిగింది. జిల్లా నాయకులు భూక్యా.నాగ రాజు నాయక్ మాట్లాడుతూ రాజపుత్ర స్వతంత్ర పోరాట యోధుడు మహా రాణా ప్రతాప్ స్వారీ చేసే గుర్రం ప్రపంచంలోనే అత్యంత బలశాలి, వీర పరాక్రమం కలిగినదిగా చేతక్ ప్రసిద్ధి పొందిందని అన్నారు. ఈ చేతక్ యుద్ధ రంగంలో రాణించినట్లు విద్యార్థులు తమ చదువుల్లో ఉన్నత ప్రతిభను సాధించాలని అన్నారు. సంఘం ప్రధాన కార్యదర్శి భూక్యా. వేణు గోపాల్ మాట్లాడుతూ గిరిజన విద్యార్థులను విద్యారంగంలో ప్రోత్సహించడం కోసం వారిలో పోటీని పెంచడం కోసం చేతక్ పేరు మీదుగా మెరిట్ స్కాలర్ షిప్ ను పదవ తరగతిలో ప్రధమ, ద్వితీయ నాగ భవాని, షణ్ముక్ లకు ఇంటర్మీడియట్ నందు ప్రధమ, ద్వితీయ బోడ.కిరణ్, జరభల.ఆసీస్ లకు అందించడం జరిగిందని అన్నారు. ఉపాధ్యాయ సంఘం నాయకులు కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ మన జీవితాలను మార్చే ఆయుధం విద్య అని పేదరికం,సమస్యలు ఎన్ని ఎదురైనా విద్యార్థులు చదువును వదులుకోకూడదని అన్నారు. పదవ తరగతిలో, ఇంటర్మీడియట్ లో మెరిట్ సాధించిన విద్యార్థుల తల్లిదండ్రులకు సంఘం తరుపున ఘనంగా సన్మానించారు. విద్యార్థులకు జ్ఞాపికతో నగదు పారితోషకం ను అందించారు. మెరిట్ స్కాలర్ షిప్ కు జరభల కృష్ణ, విమలా బాయి దంపతులు 5 వేల రూపాయలు ఆర్ధిక సహకారాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో చందా నాయక్, పూర్ణయ్య, వెంకా నాయక్, రమేష్ నాయక్, బిగనాధం నాయక్, రాజా నాయక్, ప్రమీలా దేవి, రవి నాయక్, రాజ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
అక్షర యోధునికి రామోజీరావుకి ఘన నివాళి
ఏజెన్సీ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో
అక్షర యోధునికి     తెలుగు పత్రిక రంగానికి ఎనలేని కృషిచేసిన రామోజీరావు.
.     తెలుగు పత్రిక రంగానికి మచ్చు తునకగా ఎనలేని కృషి చేసిన వ్యక్తి రామోజీరావు అని, అక్షర యోధుడు, పత్రిక రంగానికి నాంది పలికి దేశంలో ఎంతో మంది జర్నలిస్ట్ లను తయారుచేసి ప్రజల పక్షాన పోరాడే సైనికులుగా గుర్తింపు తెచ్చిన రామోజీరావు మృతికి చింతూస్తూ గుమ్మలక్ష్మీపురం ఏజెన్సీ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో శనివారం నివాళి అర్పించడం జరిగింది. మీడియా రంగాన్ని సరికొత్త ధోరణిల్లో ఎంతో ఎత్తుకు తీసుకువెళ్లిన ఘనత రామోజీరావుకు దక్కుతుందని అన్నారు. రామోజీరావు మరణం పత్రికా రంగానికి తీరని లోటు అని అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షులు పైడా కొండలరావు (ఆంధ్ర జ్యోతి),అధ్యక్షులు సరిపల్లి శ్రీనివాసరావు(ఆంధ్రపత్రిక), ఉపాధ్యక్షులు పాలక ప్రేమానందు (95న్యూస్),కార్యదర్శి బేత కుమారస్వామి (అంద్రప్రభ), జర్నలిస్ట్ సభ్యులు కే.రాము (వార్త), శంకర్ రావు(గ్రేటర్ టుడే), కే.వెంకటరావు( విశాలాంద్ర )శ్రీనివాస్( టీ వీ9), ఎన్టీవీ టి.వినోద్, రాజా, ఎంఎంటీవీ నాని, ఏ ఎస్ ఎమ్ రాజు(నేటిరధసారధి), ప్రకాష్ (రాజ్ న్యూస్ ),కిషోర్(1tv), కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
పల్లా గెలుపు కోసం కృషి చేసిన కార్యకర్తలకు అభినందనలు

ప్రజా మార్పు -రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ వార్డులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి బొండా జగన్నాథం (జగన్) 87వ వార్డ్ పార్టీ కార్యాలయం నందు కూటమి కార్యకర్తలతో రాష్ట్ర కార్యదర్శి, స్థానిక వార్డ్ కార్పొరేటర్ బోండా జగన్నాధం జగన్ గారు ఆధ్వర్యంలో సమావేశం ఎర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య సారాంశం ఇటీవల జరిగిన సర్వత్రిక ఎన్నికలలో గాజువాక కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ పల్లా శ్రీనివాసరావు గారిని రాష్ట్రంలోనె అత్యధిక మెజారిటీతో గెలిపించిన ప్రతి కార్యకర్తకు ధన్యవాదములు తెలుపడం జరిగింది.ఈ కార్యక్రమంలో బిజెపి కో కన్వీనర్ లక్కరాజు సోమరాజు, టీడీపీ వార్డ్ అధ్యక్షులు రాజన్ రాజు,ప్రగడ దానయ్య, డి. అప్పలనాయుడు, రమణ మూర్తి, వై. భాస్కర్ రావు,పీవీఎన్ మూర్తి, ఏటీఎన్ మూర్తి,బొట్టా అప్పలస్వామి,మజ్జి అప్పారావు,కడుపుట్ల శ్రీను, ప్రసాద్,కె. వెంకటరావు,దాలయ్య, కె. శ్రీను, రాజు,టీ ఎస్ మూర్తి, కె. సన్యాసిరావు, s. సూరిబాబు, సంజీవ్, రంజిత్ ,తదితరులు పాల్గొన్నారు.
ప్రజలలో ఉన్న వ్యతిరేకతే ఈ మార్పు
ప్రజలలో ఉన్న వ్యతిరేకతే ఈ మార్పు .. ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అని అన్నారు. ప్రజలలోను వ్యతిరేకత ఓటు ద్వారా మార్పు చూపించారని.. ప్రజలు మార్పు కోరుకున్నారని అందుకనే ఇంతటి ఘన విజయాన్ని అందించారని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం గాజువాక నియోజకవర్గం 76వ వార్డు భర్మా కాలనీలో వార్డు కార్పొరేటర్ గందం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అమ్మవారు మొక్కను చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారు కి పసుపు కుంకమలు సమర్పించి, 101 కొబ్బరికాయలు అమ్మవారి సమర్పించి ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సందర్భంగా వార్డు కార్పొరేటర్ గదం శ్రీనివాసరావు మాట్లాడుతూ పల్లా శ్రీనివాసరావు ఎంఎల్ఏ గా విజయం సాధించి, తెలుగుదేశం పార్టీ అధికారంలో వస్తే అమ్మవారి కి పసుపు , కుంకుమ సమర్పిస్తామని మొక్కుకున్నామని, ఆ మొక్కు ను చెల్లించుకున్నామని తెలిపారు. ఎమ్మెల్యే వల్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ గాజువాక ప్రజలు అఖండ విజయాన్ని అందించారని వారికి ఎప్పుడూ రుణపడి ఉంటానని, ఎన్నికల సమయం లో ఇచ్చిన హామీలను ధపల వారీగా నెరవేరుస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు. కార్యక్రమంలో వార్డు అధ్యక్షుడు బాసేట్టి అప్పారావు, తాటికొండ సుదర్శన్, కాతా బాలకృష్ణ, వెల్లంకి శివరాం ప్రసాద్, వి య్యప్ప వెంకన్న, రౌతు గోవింద్, ములకల పల్లి ఈశ్వర రావు, కూన వెంకట రావు, రాజా, సత్యారావు, శివ టీడీపి నాయకులు కార్యకర్తలు అభిమానులు మహిళలు యువకులు తది తరులు పాల్గొన్నారు.
ఉపాధి హామీ కూలీని పెంచిలి
ఉపాధి హామీ కూలీలకు 200 రోజులు పని కల్పించి రోజు కూలి 600 ఇవ్వాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గని శెట్టి డిమాండ్. ,మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు ప్రతి కుటుంబానికి 200 రోజులు పని దినాలు కల్పించి రోజు కూలి 600 రూపాయలు ఇవ్వాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గని శెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు పరవాడ మండలం భరణి కం గ్రామంలో శుక్రవారం పర్యటించి డిమాండ్ చేశారు. మండుటెండలో పని చేస్తున్న ఉపాధి కూలీలకు పేస్లిప్లు ఇచ్చేవారు ఇప్పుడు ఇవ్వడం లేదు ఎండవేడికి ప్రభుత్వం ఉపాధి కూలీలకు టెంట్లు ఏర్పాటు చేసి మజ్జిగ, మంచినీరు సౌకర్యం కల్పించాలని 30 శాతం వేసవి అలవెన్సు ఇచ్చి ఆదుకోవాలని, ప్రతి 15 రోజులకి ఒకసారి పని చేసిన కూలి డబ్బులు ఇవ్వాలని సంవత్సరానికి ప్రతి కుటుంబానికి 200 రోజులు పని దినాలు కల్పించి రోజు వేతనం 600 ఇవ్వాలని కోరారు ,ఈ కార్యక్రమంలో భరణం కం ఉపాధి హామీ కార్మికులు పాల్గొన్నారు.
వెండితెర మహనీయులు దగ్గుపాటి రామా నాయుడు
వెండితెర వెలుగు రామానాయుడు. —' మా-ఎపి' దిలీప్ రాజా-
వెండితెరకు వెలుగులు నింపిన మహనీయుడు స్వర్గీయ రామానాయుడు అని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, ఆంధ్ర ప్రదేశ్ వ్యవస్థాపకుడు, సినీ దర్శకుడు దిలీప్ రాజా అన్నారు. స్థానిక మా - ఎపి' కార్యాలయంలో గురువారం మూవీ మొఘల్, దాదా సాహెబ్ ఫాల్కేఅవార్డు గ)హీత, శతచిత్రాల నిర్మాత డాక్టర్ దగ్గుపాటి రామానాయుడు 88వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.  ప్రపంచ చలన చిత్ర చరిత్రలో అయిదు దశాబ్దాలుగా సినీపరిశ్రమ కు ఎనలేని చేసి 15 భాషల్లో 155 సినిమాలను నిర్మించిన ఏకైక వ్యక్తి రామానాయుడు అని దిలీప్ రాజా తెలిపారు. . రామానాయుడు స్వీయ నిర్మాణ సంస్థ అయిన సురేష్ ప్రొడక్షన్ లో 24 మంది నూతన దర్శకులను 12 మంది టాప్ హీరోయిన్లను పరిచయం అయ్యారని ఆయన చెప్పారు. భారత ప్రభుత్వం రామానాయుడు సేవకు గుర్తింపుగా 2012లో నాటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ద్వారా పద్మ భూషణ్ ద్వారా అందుకోవడమే కాకుండా రఘుపతి వెంకయ్య లాంటి ప్రతిష్టాత్మక అవార్డులు ఆయన సొంతమయ్యాయని తెలిపారు. రామానాయుడు నిర్మించిన సినిమాల్లో ఎన్టీఆర్, అక్కినేని,, శోభన్ బాబు లాంటి  అగ్ర హీరోలు   గా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయని ఆయన గుర్తు చేశారు. రామానాయుడు చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో వర్ధమాన నటి టీనాచౌదరి, మా ఏపి సభ్యులు మిలటరీ ప్రసాద్, మన్నెసత్యనారాయణ, సహాయ దర్శకులు వెంకీ రావణ్, ఇంటూరి విజయ భాస్కర్, మధుకర్, యం. శ్రీకాంత్ తదితరు పాల్గొన్నారు.
సిపిఎం కు ఓటేసిన ఓటర్లకు ధన్యవాదాలు
ప్రజామార్పు.. చింతపల్లి సిపిఎం పార్టీ ఎంపీ కి ఓటు వేసిన వారికి ధన్యవాదాలు కొత్త రాష్ట్ర ప్రభుత్వానికి గిరిజన ప్రాంతంలో సమస్యలు స్వాగతం పలుకుతాయని సిపిఎం అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గం ఇంచార్జ్ బోనంగి చిన్నయ్య పడాల్ అన్నారు, గురువారం చింతపల్లి జికేవిది కొయ్యూరు మండలాల సిపిఎం పార్టీ కార్యకర్తలతో ఎన్నికల సమీక్ష నిర్వహించారు, ఈ సందర్భంగా చిన్నయ్య పడాల్ మాట్లాడుతూ అరకు పార్లమెంటు సిపిఎం పార్టీ అభ్యర్థికి ఎన్నికల మెటీరియల్ ఖర్చులు తప్ప ప్రజలకు ఖర్చు పెట్టకుండా 1 లక్ష23 వేల ఓట్లు స్వచ్ఛందంగా ఓట్లు వేసిన ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక నిరుద్యోగ వర్గాలతో పాటు ముస్లిం మైనారిటీ వారికి గ్రామ గిరిజన ప్రజలకు సిపిఎం పార్టీ కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తుందని అన్నారు, అంతేకాకుండా ఓటర్లు చూపించిన అభిమానానికి ఎల్లప్పుడూ సమస్యలపై అండగా నిలబడి సిపిఎం పార్టీ మీ తరఫున పోరాటం చేస్తుందని అన్నారు, అలాగే రాష్ట్రంలో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వానికి గిరిజన ప్రాంతం సమస్యలతో స్వాగతం పలుకుతుందని అన్నారు, అనేక గ్రామాలలో త్రాగు సాగునీరు రోడ్లు కరెంటు వంటి మౌలికమైన సదుపాయాలతో పాటు, రాజ్యాంగం కల్పించిన గిరిజన చట్టాలు హక్కులు 1/70 చట్టం జీవో నెంబర్ 3 నకిలీ గిరిజనులు ఐదవ షెడ్యూల్ ప్రాంతం కాపాడవలసిన బాధ్యత ఏర్పడబోయే ప్రభుత్వ మీద ఉందని అన్నారు, ఇదే కాకుండా గిరిజన ప్రాంతంలో అరకు చింతపల్లి కొయ్యూరు మండలాల్లో హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణాలు నిలుపుదల, అడవుల సంరక్షణ పేరుతో అంబానీ ఆదానీలకు భారతదేశం అడవులు ప్రైవేటీకరణను గిరిజనులు వ్యతిరేకిస్తున్న విషయం రాష్ట్ర ప్రభుత్వం పరిగణంలో తీసుకోవాలని సూచించారు, గిరిజన గ్రామాలలో లెటర్ రైట్ మైనింగ్ ఎర్రమట్టి లాంటి ఖనిజాలను తీసి ఆ ప్రాంతాలను పంట పొలాలు మంచినీళ్లకు దూరం చేస్తున్నారని ఇటువంటి వాటి పైన కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలని అన్నారు, పాడేరు అరకు చింతపల్లి కేంద్రంగా చిన్న తరహా పరిశ్రమాలు కాఫీ మిర్యాలు మొక్కజొన్న చింతపండు అడ్డాకులు విస్తర్లు ఏర్పాటు చేసి గిరిజన నిరుద్యోగ యువతీ యువకులను ఉపాధి కల్పించవలసిన బాధ్యత ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జీకే వీధి మండల కార్యదర్శి అంపురంగి బుజ్జిబాబు. ఎస్ సూరిబాబు కో య్యూరు, పాంగి ధనుంజయ్ చింతపల్లి, సాగిన చిరంజీవి గడుతూరి సత్యనారాయణ వై అప్పలనాయుడు ఎస్ సింహాచలం సానా తదితరులు పాల్గొన్నారు.
నెలరోజుల్లో అగనంపూడి టోల్ ప్లాజా ఎత్తివేస్తా: పల్లా
నెలరోజుల్లో అగనంపూడి టోల్ ప్లాజా ఎత్తివేస్తా
  పల్లా గాజువాక నియోజకవర్గం పరిధిలో అగనంపూడి టోల్ ప్లాజాను నెలరోజుల్లో ఎత్తివేసేందుకు చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు హామీ ఇచ్చారు. గాజువాక టీడీపీ కార్యాలయంలో కేక్ కట్ చేసి విజయోత్సవ సంబరాలు   గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటు పరం కాకుండా  కాపాడుతామని హామీ ఇచ్చారు. . గాజువాక ఖ్యాతి దేశానికి తెలిసేలా తనకు అఖండ విజయం చేకూర్చిన  నియోజకవర్గం  ప్రజలకు అభినందనలు తెలియజేశారు.