ప్రజలలో ఉన్న వ్యతిరేకతే ఈ మార్పు
ప్రజలలో ఉన్న వ్యతిరేకతే ఈ మార్పు
.. ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అని అన్నారు. ప్రజలలోను వ్యతిరేకత ఓటు ద్వారా మార్పు చూపించారని.. ప్రజలు మార్పు కోరుకున్నారని అందుకనే ఇంతటి ఘన విజయాన్ని అందించారని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం గాజువాక నియోజకవర్గం 76వ వార్డు భర్మా కాలనీలో వార్డు కార్పొరేటర్ గందం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అమ్మవారు మొక్కను చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారు కి పసుపు కుంకమలు సమర్పించి, 101 కొబ్బరికాయలు అమ్మవారి సమర్పించి ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సందర్భంగా వార్డు కార్పొరేటర్ గదం శ్రీనివాసరావు మాట్లాడుతూ పల్లా శ్రీనివాసరావు ఎంఎల్ఏ గా విజయం సాధించి, తెలుగుదేశం పార్టీ అధికారంలో వస్తే అమ్మవారి కి పసుపు , కుంకుమ సమర్పిస్తామని మొక్కుకున్నామని, ఆ మొక్కు ను చెల్లించుకున్నామని తెలిపారు. ఎమ్మెల్యే వల్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ గాజువాక ప్రజలు అఖండ విజయాన్ని అందించారని వారికి ఎప్పుడూ రుణపడి ఉంటానని, ఎన్నికల సమయం లో ఇచ్చిన హామీలను ధపల వారీగా నెరవేరుస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు. కార్యక్రమంలో వార్డు అధ్యక్షుడు బాసేట్టి అప్పారావు, తాటికొండ సుదర్శన్, కాతా బాలకృష్ణ, వెల్లంకి శివరాం ప్రసాద్, వి య్యప్ప వెంకన్న, రౌతు గోవింద్, ములకల పల్లి ఈశ్వర రావు, కూన వెంకట రావు, రాజా, సత్యారావు, శివ టీడీపి నాయకులు కార్యకర్తలు అభిమానులు మహిళలు యువకులు తది తరులు పాల్గొన్నారు.
Jun 07 2024, 14:11