సిపిఎం కు ఓటేసిన ఓటర్లకు ధన్యవాదాలు
ప్రజామార్పు..
చింతపల్లి సిపిఎం పార్టీ ఎంపీ కి ఓటు వేసిన వారికి ధన్యవాదాలు కొత్త రాష్ట్ర ప్రభుత్వానికి గిరిజన ప్రాంతంలో సమస్యలు స్వాగతం పలుకుతాయని సిపిఎం అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గం ఇంచార్జ్ బోనంగి చిన్నయ్య పడాల్ అన్నారు, గురువారం చింతపల్లి జికేవిది కొయ్యూరు మండలాల సిపిఎం పార్టీ కార్యకర్తలతో ఎన్నికల సమీక్ష నిర్వహించారు, ఈ సందర్భంగా చిన్నయ్య పడాల్ మాట్లాడుతూ అరకు పార్లమెంటు సిపిఎం పార్టీ అభ్యర్థికి ఎన్నికల మెటీరియల్ ఖర్చులు తప్ప ప్రజలకు ఖర్చు పెట్టకుండా 1 లక్ష23 వేల ఓట్లు స్వచ్ఛందంగా ఓట్లు వేసిన ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక నిరుద్యోగ వర్గాలతో పాటు ముస్లిం మైనారిటీ వారికి గ్రామ గిరిజన ప్రజలకు సిపిఎం పార్టీ కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తుందని అన్నారు, అంతేకాకుండా ఓటర్లు చూపించిన అభిమానానికి ఎల్లప్పుడూ సమస్యలపై అండగా నిలబడి సిపిఎం పార్టీ మీ తరఫున పోరాటం చేస్తుందని అన్నారు, అలాగే రాష్ట్రంలో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వానికి గిరిజన ప్రాంతం సమస్యలతో స్వాగతం పలుకుతుందని అన్నారు, అనేక గ్రామాలలో త్రాగు సాగునీరు రోడ్లు కరెంటు వంటి మౌలికమైన సదుపాయాలతో పాటు, రాజ్యాంగం కల్పించిన గిరిజన చట్టాలు హక్కులు 1/70 చట్టం జీవో నెంబర్ 3 నకిలీ గిరిజనులు ఐదవ షెడ్యూల్ ప్రాంతం కాపాడవలసిన బాధ్యత ఏర్పడబోయే ప్రభుత్వ మీద ఉందని అన్నారు, ఇదే కాకుండా గిరిజన ప్రాంతంలో అరకు చింతపల్లి కొయ్యూరు మండలాల్లో హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణాలు నిలుపుదల, అడవుల సంరక్షణ పేరుతో అంబానీ ఆదానీలకు భారతదేశం అడవులు ప్రైవేటీకరణను గిరిజనులు వ్యతిరేకిస్తున్న విషయం రాష్ట్ర ప్రభుత్వం పరిగణంలో తీసుకోవాలని సూచించారు, గిరిజన గ్రామాలలో లెటర్ రైట్ మైనింగ్ ఎర్రమట్టి లాంటి ఖనిజాలను తీసి ఆ ప్రాంతాలను పంట పొలాలు మంచినీళ్లకు దూరం చేస్తున్నారని ఇటువంటి వాటి పైన కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలని అన్నారు, పాడేరు అరకు చింతపల్లి కేంద్రంగా చిన్న తరహా పరిశ్రమాలు కాఫీ మిర్యాలు మొక్కజొన్న చింతపండు అడ్డాకులు విస్తర్లు ఏర్పాటు చేసి గిరిజన నిరుద్యోగ యువతీ యువకులను ఉపాధి కల్పించవలసిన బాధ్యత ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జీకే వీధి మండల కార్యదర్శి అంపురంగి బుజ్జిబాబు. ఎస్ సూరిబాబు కో య్యూరు, పాంగి ధనుంజయ్ చింతపల్లి, సాగిన చిరంజీవి గడుతూరి సత్యనారాయణ వై అప్పలనాయుడు ఎస్ సింహాచలం సానా తదితరులు పాల్గొన్నారు.
Jun 06 2024, 18:37