కన్నా బాబు ఓటమి కి కారణంలు.
కన్నబాబురాజు ఓటమికి కారణాలు ప్రజా మార్పు --యలమంచలి
: మాజీ ఎమ్మెల్యే కన్నబాబురాజు ఓటమికి కారణాలు పలు విధాలుగా చెప్పుకోవచ్చు ఒకటి తన వెనుక ఉన్న కేడర్ను సమాలోచనతో నడపకపోవడం తన నిర్ణయమే శిరోధార్యమని ఎన్నాళ్లు జరిగిందని తెలిపారు.ఇప్పటివరకు తనకు దీటైన నాయకుడు లేకపోవడం ఒకటి తనకు అనుకూలంగా రాష్ట్ర పరిస్థితులు మారడం ఇప్పటివరకు కలిసి వచ్చింది. యలమంచిలి పట్టణంలో మున్సిపాలిటీ పాలకవర్గం విషయంలో వైసీపీ పార్టీవారే రెండు వర్గాలుగా వ్యవహరించడం వల్ల పట్టణంలో అధిక శాతం ఓట్లు కూటమికి పోవటానికి ముఖ్య కారణం అయ్యాయి. క్షత్రియ వంశానికి చెందిన కన్నబాబు రాజు కులంబలం పెద్దగా లేకపోయినా గతంలో తన మామగారైన సత్యం రాజు టిడిపిలో మంచిపట్టున్న నాయకుడిగా పేరు ఉండటం ఆ కుటుంబం నుంచి రావడంతో ప్రజా ఆదరణ కలిసొచ్చింది. నాయకులు కార్యకర్తలు తమకు సమాజంలో గుర్తింపు లేకుండా పోతుందని ఈ ఎన్నికల ముందే అచ్యుతాపురం మండలంలో బలమైన నాయకులు పార్టీ ఫిరాయించారు. ఇది ఒక మైనస్, అలాగనే ఎమ్మెల్యే వెనకాల ఉండాలి తప్పదు అని ముక్కుతూ, ములుగుతూ తిరిగే నాయకులు ఎన్నికల్లో అంత ఉత్సాహం కనపరిచినట్లు లేదు, ఇదంతా ఒక్కటి అయితే ఈ ఎన్నికల ముందు నుంచి కూడా తన కొడుకే ఎమ్మెల్యే అని వారసత్వాన్ని చూపించి తిరగటం చాలామందికి మింగుడు పడలేదు. కన్నబాబు రాజు ముందు మాట్లాడాలంటే భయం ఎక్కువ ఎవరు ఏ సమస్యతో వచ్చినా మీరే కలవండి మేము అడగలేము అని కింద స్థాయి నాయకులు తప్పుకునేవారు. ఇవన్నీ వాటమికి కారణాలు గాని చెప్పాలి. తన పైన పోటీలో ఉన్న ఓటమి అభ్యర్థి సుందరపు విజయ్ కుమార్ గత 15 సంవత్సరాల నుండి కన్నబాబుకి ఎదురీత ఈదుతూనే వచ్చారు. తన పైన ఉన్న సానుభూతి కులం బలం కలిసొచ్చింది.
Jun 05 2024, 12:29