మా ప్రభుత్వం హ్యాట్రిక్ కొట్టబోతుంది..
పేదల కోసం ఎన్నో నిర్ణయాలు తీసుకోబోతున్నాం..
దేశం కోసం పనిచేసే ఎన్డీఏ, దేశంలో అస్థిరతను పెంచే ఇండియా కూటమి మధ్య పోరు జరుగుతోంది..
మీ ఓటు వల్లే రామమందిరం నిర్మాణం జరిగింది..
బలమైన ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం వల్లే రామమందిరం సాధ్యమైంది-ప్రధాని నరేంద్ర మోడీ
రఘువీర్ గెలుపుకోసం గడ్డికొండారం గ్రామంలో జోరుగా కాంగ్రెస్ ప్రచారం
ఈరోజు గడ్డి కొండారం గ్రామంలో గౌరవ మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశాల పిలుపుమేరకు మన నల్గొండ నియోజకవర్గ అభ్యర్థి శ్రీ కుందూరు రఘువీర్ రెడ్డి అత్యధిక మెజారిటీతో గెలవాలని గడప గడపకు ప్రచారం చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు కంచర్ల చంద్రారెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు చెన్నపాక శ్యామ్, ఉపాధ్యక్షులు సున్నం నాగరాజు, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కస్పరాజు అనిల్, సోషల్ మీడియా కన్వీనర్ పాలడుగు భూపతి రాజు, కంచర్ల రమేష్ రెడ్డి,ముంత రాజు, పాలడుగు ఆంజనేయులు, కందుల అశోక్, దొడ్డేని వెంకన్న, జక్కలి సతీష్, భీమనపల్లి జానయ్య, దూదిమెట్ల లింగస్వామి,దూదిమెట్ల మహేష్, భీమనపల్లి శ్రీను, దాసరి మంగయ్య, ఆల కుంట్ల సైదులు, జక్కలి రామలింగం,మరియుతదితరులు పాల్గొన్నారు.
మాదిగల మద్దతు.. బిఆర్ఎస్ పార్టీకే
మాదిగల ద్రోహి రేవంత్ రెడ్డి
మాదిగలను అణిచివేస్తున్న కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్తాం.
నల్లగొండలో కంచర్ల కృష్ణారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తాం..
మారపాక నరేందర్ మాదిగ ఎమ్మార్పీఎస్ నల్లగొండ అధ్యక్షులు
నేడు నల్గొండలో జిల్లా ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు మారపాక నరేందర్ మాదిగ ఏర్పాటుచేసిన.. ప్రెస్ మీట్ లో..మాట్లాడుతూ.... కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాదిగలను తీవ్రంగా అణిచివేస్తున్నదని, రేవంత్ రెడ్డి మాదిగల ద్రోహి అని అన్నారు.
రేవంత్ రెడ్డి కి ఈ ఎన్నికలలో గోరి కట్టాలన్నారు.
ఎస్సీ ఎస్టీ..వర్గాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అని, ఎస్సీ ఎస్టీ మైనార్టీ పేద వర్గాల వారు పార్లమెంట్ ఎన్నికల్లో వారికి తగిన బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా వారు కోరారు,
పార్లమెంట్ ఎన్నికలలో.. తెలంగాణ ఎమ్మార్పీఎస్.. బిఆర్ఎస్ పార్టీకి తమ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందన్నారు
నల్లగొండలో కంచర్ల కృష్ణారెడ్డి విజయానికి ఎమ్మార్పీఎస్ పని చేస్తుందని చెప్పారు
మాదిగ, మాదిగ ఉపకులాలు.. బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి గారిఓటు వేసి గెలిపించాలని ఈ సందర్భంగా కోరారు.
ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ మైనార్టీ పేద వర్గాలు కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాలని కోరారు.
ఈ ప్రెస్ మీట్ లో..ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు నకరికంటి అంజయ్య మాదిగ,ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముదిగొండ ఎల్లేష్ మాదిగ,ఎమ్మార్పీఎస్ ఇన్చార్జులు..
మొండి కత్తి అశోక్ మాదిగ నాగార్జునసాగర్,....బచ్చలకూరి నాగరాజు మాదిగ కోదాడ నియోజకవర్గం...,పొట్ట మురళి మాదిగ దేవరకొండ...,పెరిక నారాయణ మాదిగ నల్గొండ...,దైద నాగరాజు మాదిగ మిర్యాలగూడ...,లింగాల వరప్రసాద్ మాదిగ సూర్యాపేట.... మేదరి సత్యనారాయణ మాదిగ హుజూర్నగర్... చింతల లక్ష్మణ్ మాదిగ, జిల్లా ఉపాధ్యక్షులు ఎమ్మార్పీఎస్. దర్శనం శివ మాదిగ జిల్లా కార్యదర్శి..., అందుకుల సైదులు మాదిగ చందంపేట మండల అధ్యక్షులు.. ఎలిమినేట్ ఈశ్వర్ మాదిగ డిండి మండల అధ్యక్షులు,.. బొజ్జ యేసు మాదిగ జిల్లా ఉపాధ్యక్షులు... కుందూరు లింగస్వామి మాదిగ గుర్రంపోడు మండల అధ్యక్షులు.. తదితరులు పాల్గొన్నారు.
నల్లగొండ పార్లమెంట్ నల్లగొండ నియోజకవర్గం కార్నర్ మీటింగ్ లో పాల్గొన్న - నల్లగొండ పార్లమెంట్ కో కన్వీనర్ పిల్లి రామరాజు యాదవ్
లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా..నల్లగొండ పార్లమెంట్ అభ్యర్ది శానంపూడి సైది రెడ్డి కి మద్దతుగా నల్లగొండ మండలం తొరగాల్ గ్రామంలో నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో పాల్గొన్న నల్లగొండ పార్లమెంట్ కో కన్వీనర్ - పిల్లి రామరాజు యాదవ్
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి మండల అధ్యక్షలు బోగరి అనిల్ కోఆర్డినేటర్ వెంకట్ రెడ్డి బూత్ అధ్యక్షలు లక్ష్మణ్ మరియు కార్యకర్తలు శ్రవణ్ మరియు తదితరులు పాల్గొన్నారు…
హైదరాబాద్: తెలంగాణ ప్రత్యేక మ్యానిఫెస్టోను కాంగ్రెస్ విడుదల చేసింది.
ఐదు న్యాయాలు, తెలంగాణకు ప్రత్యేక హామీల పేరుతో దీన్ని రూపొందించారు. మ్యానిఫెస్టో తెలుగు ప్రతిని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షీ విడుదల చేశారు.
కార్యక్రమంలో మంత్రి శ్రీధర్‌బాబు, కాంగ్రెస్ ముఖ్య నేతలు పాల్గొన్నారు.
అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకొని మ్యానిఫెస్టో తయారు చేసినట్లు మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. ఇందులో 23 అంశాలు చేర్చినట్లు చెప్పారు. కేంద్రంలో అధికారంలోకి రాగానే విభజన చట్టం హామీలు అమలు చేస్తామన్నారు. క్రీడలను ప్రోత్సహించేందుకు కృషి చేస్తామని తెలిపారు. యువత కోసం వివిధ యూనివర్సిటీలు తెస్తామన్నారు. మేడారం జాతరకు జాతీయ హోదా కల్పిస్తామని చెప్పారు. సుప్రీం కోర్టు ప్రత్యేక బెంచ్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఏపీలో కలిపిన 5 గ్రామాలను మళ్లీ రాష్ట్రంలో విలీనం చేస్తామన్నారు. పాలమూరు-రంగారెడ్డికి జాతీయ హోదా కల్పిస్తామని తెలిపారు. నవోదయ, కేంద్రీయ విద్యాలయాలు పెంచుతామని చెప్పారు. పార్టీ నేతలు, కార్యకర్తలు.. ప్రతి గడపకు మ్యానిఫెస్టోను తీసుకెళ్లాలని సూచించారు.
లోక్‌సభ ఎన్నికల్లో కాషాయ పార్టీని మట్టికరిపించి విపక్ష ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు.
బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగాన్ని, మన హక్కులను కాపాడుకునేందుకు విపక్ష కూటమి సర్వశక్తులూ ఒడ్డుతుందని స్పష్టం చేశారు. యూపీలోని సైఫైలో శుక్రవారం ఓ వార్తాసంస్ధతో అఖిలేష్ యాదవ్ మాట్లాడారు.
రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తున్న బీజేపీని దీటుగా నిలువరిస్తామని చెప్పారు. రాయ్‌బరేలి నుంచి నామినేషన్ దాఖలు చేసిన రాహుల్ గాంధీకి అఖిలేష్ మద్దతు పలికారు. కాంగ్రెస్ కంచుకోట రాయ్‌బరేలి నుంచి నామినేషన్ వేసిన రాహుల్‌కు ఆయన అభినందనలు తెలిపారు.
మరోవైపు రాహుల్ రాయ్‌బరేలి నుంచి పోటీ చేయడంతో కాషాయ పాలకులు భయపడుతున్నారని, అందుకే వారు కుటుంబం, కుటుంబ పార్టీ అంటూ విమర్శలు గుప్పిస్తున్నారని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ భార్య, మొయిన్‌పురి ఎస్పీ అభ్యర్ధి డింపుల్ యాదవ్ అన్నారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా తుడిచిపెట్టాలని మోదీ ప్రభుత్వం కోరుకుంటోందని ఆమె ఆరోపించారు.
ఓటమి భయంతో సహనం కోల్పోతున్న కాంగ్రెస్ నాయకులు
అధికార బలంతో అడ్డదారులు తొక్కేందుకు కాంగ్రెస్ నాయకుల తాపత్రయం
ఓటమి భయం హరీష్ రావు రాకతో ఉన్మాదంగా మారిందంటున్న బిఆర్ఎస్ కార్యకర్తలు
ఓటమి భయం తట్టుకోలేక హరీష్ రావు గారి రోడ్ షో ఫ్లెక్సీలను, జెండాలను మున్సిపల్ సిబ్బందితో తొలగిస్తున్న అధికార పార్టీ నాయకులు
ఎన్ని ఉన్మాద పనులు చేసిన కంచర్ల కృష్ణారెడ్డి గారు గెలవడం ఖాయమంటున్న సామాన్య జనం
రైలు కింద పడి గుర్తుతెలియని వ్యక్తి మృతి
మందమర్రి- మంచిర్యాల రైల్వే స్టేషన్ల మధ్య బుధ వారం సాయంత్రం రైలు కింద పడి గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు.
మృతుని వయస్సు 50 నుండి 55 సంవత్సరాలు ఉండగా, తెలుపు రంగు తల వెంట్రుకలు, క్రీమ్ రంగు షర్టు, వంకాయ రంగు ప్యాంటు ధరించి ఉన్నాడు.
మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. రైల్వే ఎస్సై సుధాకర్ ఆదేశాల మేరకు హెడ్ కానిస్టేబుల్ కెంసారం సంపత్ కేసు దర్యాప్తు చేస్తున్నారు..
నేడు కోమరంభీం, సిద్దిపేట జిల్లాల్లో రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం
తెలంగాణలో లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఆసిఫా బాద్, కాగజ్ నగర్ నియోజ కవర్గాల్లో పర్యటించను న్నారు.
బహిరంగ సభల్లో పాల్గొని ఆయన ప్రసంగించనున్నా రు. అనంతరం సిద్దిపేటలో జరిగే కార్నర్ మీటింగ్ లో ఆయన పాల్గొననున్నారు. మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు తరఫున రేవంత్ ప్రచారం చేయనున్నారు.
May 18 2024, 17:16