రైలు కింద పడి గుర్తుతెలియని వ్యక్తి మృతి

మందమర్రి- మంచిర్యాల రైల్వే స్టేషన్ల మధ్య బుధ వారం సాయంత్రం రైలు కింద పడి గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. 

మృతుని వయస్సు 50 నుండి 55 సంవత్సరాలు ఉండగా, తెలుపు రంగు తల వెంట్రుకలు, క్రీమ్ రంగు షర్టు, వంకాయ రంగు ప్యాంటు ధరించి ఉన్నాడు. 

మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. రైల్వే ఎస్సై సుధాకర్ ఆదేశాల మేరకు హెడ్ కానిస్టేబుల్ కెంసారం సంపత్ కేసు దర్యాప్తు చేస్తున్నారు..

నేడు కోమరంభీం, సిద్దిపేట జిల్లాల్లో రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఆసిఫా బాద్, కాగజ్ నగర్ నియోజ కవర్గాల్లో పర్యటించను న్నారు. 

బహిరంగ సభల్లో పాల్గొని ఆయన ప్రసంగించనున్నా రు. అనంతరం సిద్దిపేటలో జరిగే కార్నర్ మీటింగ్ లో ఆయన పాల్గొననున్నారు. మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు తరఫున రేవంత్ ప్రచారం చేయనున్నారు.

తాండూరు సబ్ ఇన్స్పెక్టర్ సస్పెండ్

తాండూరు ఎస్‌ఐపై సస్పె న్షన్ వేటు పడింది. పిడిఎస్ రైస్ అక్రమ దందా కేసును దర్యాప్తు చేస్తున్నప్పుడు అలసత్వం వహించడంతో ఎస్‌ఐ కె జగదీష్‌ను ఐజి ఎవి రంగనాథ్ సస్పెండ్ చేస్తూ బుధవారం సాయం త్రం ఉత్తర్వులు జారీ చేశారు. 

ఎన్నికల నిర్వహణతో పాటు నేర సమీక్షకు సంబందించి రామగుండ కమిషనరేట్ కార్యాలయానికి ఐజి ఎవి రంగనాథ్ వచ్చాడు. పిడిఎస్ రైస్ కేసులపై రంగనాథ్ సమీక్ష జరిపారు. 

ఏప్రిల్ 20న తాండూరు పోలీస్ స్టేషన్‌లో పట్టుబడిన పిడిఎస్ బియ్యం అక్రమ దందా కేసుపై సమీక్ష నిర్వహించాడు. 

ఈ కేసు విషయంలో ఎస్‌ఐ జగదీష్ అలసత్వం వహిం చడంతో పాటు పలు ఆరోపణలు రావడంతో సదరు ఎస్‌ఐని సస్పెండ్ చేస్తున్నట్లు ఐజి ప్రకటిం చారు...

నేడు ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు నోటిఫికేషన్‌

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు నోటిఫి కేషన్‌ జారీచేయనుంది. శాసన మండలిలో వరంగల్‌- ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ ఉపఎన్నిక కోసం గురువా రం నుంచి ఈ నెల 9 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 

13వ తేదీ వరకు నామినే షన్లను ఉపసంహరించు కోవచ్చు. ఈ నెల 27న పోలింగ్‌ నిర్వహిస్తారు. జూన్‌ 5న ఓట్లు లెక్కిస్కా రు. దీనికి సంబంధించి ఈసీ ఇప్పటికే షెడ్యూల్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే.

గత ఎన్నికల్లో ఎమ్మెల్సీగా విజయం సాధించిన పల్లా రాజేశ్వర్‌ రెడ్డి గతేడాది డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ ఎమ్మె ల్యేగా ఎన్నికయ్యారు. దీం తో తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఈనే పథ్యంలో ఖమ్మం-వరం గల్‌-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమయింది. 

గత ఎన్నికల్లో రెండో స్థానం లో నిలిచిన చింతపండు నవీన్‌ తీన్మార్‌ మల్లన్న ఈసారి కాంగ్రెస్‌ పార్టీ తరఫున బరిలో దిగుతు న్నారు.కాగా, ఈ నియోజ కవర్గం పరిధిలో 4,61,806 మంది పట్టభద్రులు ఓటర్లు గా నమోదయ్యారు. 

ఈ ఉపఎన్నికకు నల్లగొండ జిల్లా కలెక్టర్‌ను ఎన్నికల అధికారిగా ఈసీ నియమిం చింది. పోటీచేయాలనున్న అభ్యర్థులు నల్లగొండ కలెక్టరేట్‌లో నామినేషన్లు సమర్పించాల్సి ఉంటుంది.....

పెద్దపల్లి పార్లమెంటు అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ ను అధిక మెజార్టీతో గెలిపించాలి: దుద్దిల్ల శ్రీనుబాబు

తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని రాష్ట్ర ఐటి,పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు సోదరుడు, శ్రీపాద ట్రస్ట్ చైర్మన్ దుద్దిళ్ల శ్రీనుబాబు అన్నారు.

బుధవారం సాయంత్రం కాటారం సబ్ డివిజన్ పరిధిలోని ఐదు మండలాల కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో శ్రీను బాబు, ప్రముఖ సినీ నిర్మాత కాంగ్రెస్ నాయకులు బండ్ల గణేష్ హాజరై మాట్లా డారు 

మంథని నియోజకవర్గ ప్రాంత అభివృద్ధి ప్రదాత రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.పెద్దపల్లి పార్ల మెంటు నియోజకవర్గ ఇన్చార్జిగా ఏడు అసెంబ్లీ నియోజకవర్గలలో పర్య టిస్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన గడ్డం వంశీకృష్ణ గెలుపు కోసం కృషి చేయాలన్నారు. 

ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గడపగడపకు తిరుగుతూ వంశీకృష్ణ గెలుపు కోసం కృషి చేయాలని కోరారు. రైతులకు, మహిళలకు అన్ని వర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడు అండగా ఉంటుందన్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీధర్ బాబు గెలుపు కోసం ఎలా గైతే కష్టపడి 6 గ్యారంటీల ను గడపగడకి తీసుకెళ్ళి విజయం సాధించామో త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో కూడా ఇంటిం టికీ 5 న్యాయ్ పథకాలను తీసుకెళ్లి పెద్దపల్లి పార్లమెం ట్ నియోజకవర్గం లో అత్య ధిక మెజారిటీ మంథని నియోజకవర్గం నుండి వచ్చేలా ప్రతి ఒక్క కార్యకర్త కృషిచేయాలని పిలుపుని చ్చారు. 

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు,కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ఏపీలో మే 1న బ్యాంకు ఖాతాల్లోకి పెన్షన్‌

ఏపీలో మే 1న బ్యాంకు ఖాతాల్లోకి పెన్షన్ల పంపిణీలో ఏపీ ప్రభుత్వం కీలక మార్గ దర్శకాలు జారీ చేసింది. పెన్షన్ల కోసం సచివాలయా లకు రానవసరం లేదని, మే 1న లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో పెన్షన్ నగదు జమ చేయాలని సర్కార్ నిర్ణయిం చింది. 

బ్యాంక్ ఎకౌంట్ లేనివారికి, దివ్యాంగులు, ఆరోగ్య సమ స్యలు ఉన్నవారికి ఇంటి వద్దనే పెన్షన్ పంపిణీ చేయనున్నారు. మే ఒకటి నుండి 5వ తేదీ లోపు ఇంటి వద్ద పెన్షన్ పంపిణీ చేసేలా సచివాలయ ఉద్యోగులతో ఏర్పాట్లు చేస్తున్నారు. 

పెన్షన్ల పంపిణీలో లబ్ధిదారు లకు ఇబ్బందులు లేకుండా చూడాలన్న ఈసీ ఆదేశాల తో విధివిధానాల్లో ప్రభు త్వం మార్పులు చేసింది...

ఇంటర్ లో ఫెయిల్ అయినందుకు మరో విద్యార్థిని ఆత్మహత్య

మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండ లంలోని ఎర్రచక్రు తండాకు చెందిన గుగు లోతు స్వాతి (17) అనే విద్యార్థిని ఇంటర్ పరీక్ష ఫలితాల్లో పేలవడం తో మనస్థాపానికి గురై ఆత్మ హత్య చేసుకుంది. 

ఎర్రచక్రు తండాలో వ్యవసా య కూలి పనులు చేస్తూ జీవనం గడుపుతున్న గుగులోతు బీమా, పద్మల రెండవ కుమార్తె స్వాతి తొర్రూర్ లోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ చదివి ఇటీవలే పరీక్ష ఫలితాలు రావడంతో ఫెయిల్ అని తెలవడంతో మనస్థాపానికి గురై ఆదివారం రాత్రి పురుగుల మందు తాగింది. 

విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు మహ బూబాబాద్ లోని ఏరియా ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్న క్రమంలో సోమ వారం ఉదయం తుది శ్వాస విడిచింది. 

విషయం తెలుసుకున్న మహబూ బాద్ జిల్లా బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మాలోతు కవిత మృతదే హాన్ని పరిశీలించారు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసు కొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు..

నేడు ఇంటర్నేషనల్ డ్యాన్స్ డే

ఇంటర్నేషనల్ డ్యాన్స్ డేని ప్రపంచ డ్యాన్స్​ డేగా కూడా పిలుస్తారు. 64 కళల్లో ఒకటై న డ్యాన్స్​ను గౌరవిస్తూ.. ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 29న అంతర్జాతీయ నృత్య దినోత్సవం జరుపుకుం టారు. 

వివిధ సాంస్కృతిక నృత్యా లను విశ్వవ్యాప్తంగా పరిచ యం చేయడంతో పాటు.. ఈ రంగాన్ని అభివృద్ధి చేయడంకోసం దీనిని నిర్వహిస్తున్నారు. 

జాతి, మత అడ్డంకులు లేకుండా.. అందరూ సంతోషంగా దీనిలో పాల్గొనేలా చూడడమే దీనిముఖ్య ఉద్దేశం..

జిల్లా ఆఫీస్‌లో జెండా ఆవిష్కరించిన మాజీ మంత్రి

సిద్దిపేట జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్బావ దినోత్సవ వేడుకలు ఈరోజు ఘనంగా నిర్వహించారు.

మాజీ మంత్రి హరీష్ రావు జిల్లా కార్యాలయంలో జెండా ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలిపారు. 2001 ఏప్రిల్ మాసం హైదరాబాద్ జల దృశ్యంలో ప్రారంభమైన తెలంగాణ ఉద్యమం నేడు దేశానికే ఆదర్శం అయిందని హరీష్ రావు అన్నారు. 

నాడు కొనాయిపల్లి వెంకటేశ్వర ఆలయంలో పూజలు చేసి పదవులకు రాజీనామా చేసి ఉద్యమం ప్రారంభించామని గుర్తు చేశారు. కేసీఆర్ లేకుంటే.. తెలంగాణ లేదని.. తెలం గాణ లేకుంటే.. సిద్ధిపేట జిల్లానే ఉండేది కాదన్నారు. 

గత పదేళ్లలో తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపిన ఘనత కేసీఆర్‌దే అని హరీష్ రావు అన్నారు. కేసీఆర్ అభివృద్ధిలో ఆదర్శంగా ఉంటే.., రేవంత్ రెడ్డి తిట్లలో ఆదర్శంగా ఉన్నారని విమర్శించారు.

ఉపాధి హామీ పనులను పరిశీలించిన గ్రామీణ అభివృద్ధి అధికారి

పెద్దపల్లి జిల్లా పెద్దకల్వల గ్రామంలో శనివారం జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి రవీందర్ ఉపాధి హామీ పనులను పరిశీలించారు. 

ఈ సందర్భంగా కూలీలతో మాట్లాడుతూ వేసవికాలం తీవ్రమైన ఎండల పట్ల జాగ్రత్తగా ఉండాలని, కనీస జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 

ఉపాధి హామీ సిబ్బంది పనులకు వచ్చే కూలీలకు సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు...