నూతన వధూవరులను ఆశీర్వధించిన తండు సైదులు గౌడ్

 కనగంటి వెంకన్న గౌడ్ -రేణుక ల పుత్రిక అనూష -రాజశేఖర్ గౌడ్ లను సాగర్ రోడ్ జూలకంటి ఇంద్ర రెడ్డి ఫంక్షన్ హాల్ లో హాజరై నూతన వధూవరులని ఆశీర్వదించిన 

BRS పార్టీ రాష్ట్ర నాయకులు Ex జడ్పీటీసీ చంద్రం ఫౌండేషన్ చైర్మన్ డా. తండు సైదులు గౌడ్ ఈ కార్యక్రమంలో కనగల్ మండలం గౌడ సంఘం అధ్యక్షులు చింతల విజయ్ గౌడ్, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు అయితగోని జనార్దన్ గౌడ్,బీసీ యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కారింగ్ నరేష్ గౌడ్, బీసీ విద్యార్థి సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కొంపెల్లి రామన్న గౌడ్ వేణు, సాయి, తరుణ్ తదితరులు పాల్గొన్నారు.

కనగల్ మండలం యడవెల్లి గ్రామం లో శ్రీశ్రీశ్రీ కంఠమహేశ్వర సూరంబా దేవి, వనం మైసమ్మ, వనం ఎల్లమ్మ ల విగ్రహ ప్రతిష్టలో పాల్గొన్న తండు సైదులు గౌడ్

  కనగల్ మండలం ఏడవెల్లి గ్రామం లో శ్రీశ్రీశ్రీ కంఠమహేశ్వర స్వామి & సురమాంబ దేవి వనమైసమ్మ వనం ఎల్లమ్మల పూజా కార్యక్రమం లో పాల్గొని మరియు భూమి పూజ నుండి గుడి నిర్మాణం వరకు సుమారు 5 లక్షల విరాళం అందించిన  

BRS పార్టీ రాష్ట్ర నాయకులు Ex జడ్పీటీసీ చంద్రం ఫౌండేషన్ చైర్మన్ డా. తండు సైదులు గౌడ్ ఈ కార్యక్రమంలో కనగల్ మండలం గౌడ సంఘం అధ్యక్షులు చింతల విజయకుమార్, ఎంపీటీసీ కర్నాటి జగత్ గౌడ్,బీసీ యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కారింగ్ నరేష్ గౌడ్ కనగల్ మండలంకాంగ్రెస్ పార్టీ ఓబీసీ ఉపాధ్యక్షులు గౌని నరేష్ గౌడ్, గౌని వెంకన్నగౌడ్ , గౌని లింగస్వామిగౌడ్ ,కర్నాటి శంకర్ గౌడ్ గ్రామ గౌడ పెద్దలు కమిటీ సభ్యులు గ్రామ గౌడ బంధువులు తదితరులు పాల్గొన్నారు.

వరంగల్-నల్గొండ-ఖమ్మం గ్రాడ్యుయేట్ MLC ఎన్నికల షెడ్యూల్ రిలీజ్

తెలంగాణలో గ్రాడ్యుయేట్ MLC స్థానానికి షెడ్యూల్ రిలీజ్ అయింది. ఖమ్మం -వరంగల్-నల్గొండ MLC స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. 

మే 2న నోటిఫికేషన్ విడుదల కానుంది. 27న పోలింగ్, జూన్ 5న ఫలి తాలు వెలువడనున్నాయి. అసెంబ్లీ ఎన్నిక ల్లో...పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. 

ఈనేపథ్యంలో..ఖమ్మం-వరంగల్-నల్గొండ MLC స్థానా నికి ఎన్నిక అనివార్యమైం ది. దీంతో గ్రాడ్యుయేట్ MLC స్థానానికి ఈసీ తాజాగా షెడ్యూల్ రిలీజ్ చేసింది..

పెద్దపల్లి జిల్లాల్లో విస్త్రృతంగా పోలీసుల తనిఖీలు

తెలంగాణ పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో పోలీ సులు విస్తృత తనిఖీలు చేపడుతున్నారు.

తాజాగా పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలొ ఎన్నికల లొ ఓటర్లను ఎలాంటి ప్రలోభాలకు గురి చేయకుండా ఉండేందుకు నగదు, ఇతర వస్తువుల అక్రమ రవాణాను అరిక ట్టేందుకు ముత్తారం ఎస్ఐ మధుసూదన్ రావు ఆధ్వ ర్యంలో పోలీసులు గురు వారం సాయంత్రం తనిఖీలు నిర్వహించారు. 

మండలంలోని మచ్చుపేట గ్రామ ప్రధాన రహదారిపై వెళ్లే వాహనాలను ఆపి పరిశీలించారు. ఈ సంద ర్భంగా ఎస్ఐ మధుసూదన్ రావు మాట్లాడుతూ.. 

ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఎవరూ కూడా రూ.50వేల రూపాయల నగదును మించి తీసుకెళ్ల రాదని, ఒకవేళ తీసుకెళ్తూ పోలీసుల తనిఖీల్లో పట్టు బడితే ఎన్నికల అధికారు లకు అప్పగించడం జరుగుతుందని సరైన ఆధారాలు చూపిస్తే ఆ నగదును తిరిగి అప్పగి స్తారని తెలిపారు. 

ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

మే 24 నుండి ఇంటర్మీడియట్ అడ్వాన్సుడ్ సప్లమెంటరీ పరీక్షలు

తెలంగాణ ఇంట‌ర్ ఫ‌స్టియ‌ ర్, సెకండియ‌ర్ ఫ‌లితాలు విడుద‌లైన సంగ‌తి తెలి సిందే. ఫ‌స్టియ‌ర్‌లో 60.01 శాతం, సెకండియ‌ర్‌లో 64.19 శాతం ఉత్తీర్ణ‌త న‌మోదైంది.

ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్‌లో బాలి క‌లు 68.35 శాతం ఉత్తీర్ణ‌త సాధించ‌గా, బాలురు 51.50 శాతం న‌మోదు చేశారు. ఇక సెకండియ‌ర్‌లో బాలిక‌లు 72.53 శాతం ఉత్తీర్ణ‌త సాధించ‌గా, బాలురు 56.10 శాతం ఉత్తీర్ణ‌త సాధించారు.

గ‌తేడాది ఇంట‌ర్ ఫ‌లితాల్లో ఫ‌స్టియ‌ర్‌లో 62.85 శాతం, సెకండియ‌ర్‌లో 67.27 శాతం ఉత్తీర్ణ‌త న‌మోదైంది. అంటే 2023 ఫ‌లితాల‌తో పోల్చితే ఈ ఏడాది ఉత్తీర్ణ‌త శాతం స్వ‌ల్పంగా త‌గ్గింది.

ఇక తాజాగా విడుద‌లైన ఇంట‌ర్‌ ఫ‌లితాల్లో ఫెయిలైన వారికి మే 24 నుంచి అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌ను న్నారు.

ఫ‌స్టియ‌ర్‌కు ఉద‌యం 9 నుంచి మ‌. 12 గంట‌ల వ‌ర‌కు సెకండియ‌ర్ విద్యార్థుల‌కు మ‌. 2.30 నుంచి సాయంత్రం 5.30 గంట‌ల వ‌ర‌కు నిర్వ‌హించ‌ నున్నారు.

అడ్వాన్స్‌డ్ సప్లిమెంట‌రీ ప‌రీక్ష‌లకు సంబంధించిన ప‌రీక్ష ఫీజును ఏప్రిల్ 25 నుంచి మే 2వ తేదీ వ‌ర‌కు ఆయా కాలేజీల్లో స్వీక‌రించ‌ నున్నారు. రీకౌంటింగ్, రీవెరి ఫికేష‌న్‌కు సంబంధించి కూడా ఇదే స‌మ‌యంలో ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించా ల్సి ఉంటుంది.

రీకౌంటింగ్ కోసం ఒక్కో పేప‌ర్‌కు రూ. 100, రీకౌంటింగ్‌కు ఒక్కో పేప‌ర్‌కు రూ. 600 చెల్లించాల్సి ఉంటుంది...

భారీ రోడ్ షో కార్యక్రమం లో పాల్గొన్న నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ ఎన్నికల ఇంచార్జ్ బిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్ రె

కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ గారి ఆధ్వర్యంలో నేడు నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలోని కల్వకుర్తి నియోయోజక వర్గంలో

నేడు అమనగల్ నుంచి జి మాడుగుల వరకు భారీ రోడ్ షో నిర్వహించడం జరిగింది

ఈ కార్యక్రమంలో మాజీ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ లు ZPTC లు MPTC మున్సిపల్ చైర్మన్ లు

కౌన్సిలర్ మాజీ సర్పంచ్ లు వివిధ హోదాలో వున్న ప్రజా ప్రతినిధులు,రాష్ట్ర జిల్లా స్థాయి నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు..

ఏపీ లొ ఇద్దరు ఐపీఎస్‌ అధికారులపై బదిలీ వేటు

ఏపీ సీఎం జగన్‌పై దాడి ఘటన నేపథ్యంలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికా రులపై ఎలక్షన్ కమిషన్ ఈసీ వేటు వేసింది.

ఏపీ ఇంటెలిజెన్స్ డీజీ పీఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ సీపీ కాంతి రాణాలను బదిలీ చేస్తూ ఈసీ ఆదేశాలు జారీ చేసిం ది.

తక్షణమే వారిని విధుల నుంచి తప్పించాలని ప్రభు త్వాన్ని ఆదేశిస్తూ ఉత్తర్వు ల్లో పేర్కొంది.

2024 సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యే వరకు ఎన్నికల తో సంబంధం లేని విధుల ను వారికి అప్పగించాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది....

రేపే JEE తుది ఫలితాలు విడుదల

JEE మెయిన్-2 ఫలితాలు రేపు 25న విడుదల చేయ నున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెల్లడించింది.

ఇప్పటికే జేఈఈ మెయి న్-2 తుది కీ విడుదలైంది. ఏప్రిల్ 4 నుంచి 12 వరకు జేఈఈ మెయిన్-2 పరీక్ష నిర్వహించారు. దేశవ్యా ప్తంగా 12.57 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.

జేఈఈ మెయిన్1, 2లో సాధించిన మెరుగైన స్కోరు ను పరిగణనలోకి తీసుకొని మెరిట్ లిస్ట్‌ను ఎన్టీఏ విడు దల చేయనుంది....

నేటి నుండి కొండగట్టులో హనుమాన్ జయంతి వేడుకలు

తెలంగాణలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండ గట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో నేటి నుండి మూడు రోజులపాటు జరగనున్న హనుమాన్ జయంతి వేడుకల ఏర్పా ట్లను ఆదివారం సాయంత్రం అడిషనల్ కలెక్టర్ దివాకర పరిశీ లించారు.

తాగునీటి వసతి ఏర్పాట్లు, కోనేరు, కళ్యాణకట్ట, ఆల య పరిసరాలను తదితర ప్రాంతాలను ఆయన పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట పలువురు అధికారులు ఉన్నారు..

మే 1న తెలంగాణ పదో తరగతి పరీక్ష ఫలితాలు

తెలంగాణలో పదోతరగతి పరీక్షల ఫలితాలను వెల్లడించేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది.

మార్చి 18 నుంచి ఏప్రిల్‌ 2 వరకు పదోతరగతి పరీక్షలు నిర్వహించగా, ఏప్రిల్ 3 నుంచి 20 వరకు జవాబు పత్రాల స్పాట్ వాల్యూయే షన్ ప్రక్రియ పూర్తయింది.

ఫలితాలను డీకోడింగ్ చేయడానికి మరో వారం రోజులకుపైగా సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో ఈ నెల 30న ఫలితాలను వెల్లడించాలని అధికారులు భావిస్తున్నారు.

ఒకవేళ ఆ రోజు కుదరని పక్షంలో మే 1న వెల్లడించే అవకాశం ఉంది...