భారీ రోడ్ షో కార్యక్రమం లో పాల్గొన్న నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ ఎన్నికల ఇంచార్జ్ బిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్ రె

కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ గారి ఆధ్వర్యంలో నేడు నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలోని కల్వకుర్తి నియోయోజక వర్గంలో

నేడు అమనగల్ నుంచి జి మాడుగుల వరకు భారీ రోడ్ షో నిర్వహించడం జరిగింది

ఈ కార్యక్రమంలో మాజీ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ లు ZPTC లు MPTC మున్సిపల్ చైర్మన్ లు

కౌన్సిలర్ మాజీ సర్పంచ్ లు వివిధ హోదాలో వున్న ప్రజా ప్రతినిధులు,రాష్ట్ర జిల్లా స్థాయి నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు..

ఏపీ లొ ఇద్దరు ఐపీఎస్‌ అధికారులపై బదిలీ వేటు

ఏపీ సీఎం జగన్‌పై దాడి ఘటన నేపథ్యంలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికా రులపై ఎలక్షన్ కమిషన్ ఈసీ వేటు వేసింది.

ఏపీ ఇంటెలిజెన్స్ డీజీ పీఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ సీపీ కాంతి రాణాలను బదిలీ చేస్తూ ఈసీ ఆదేశాలు జారీ చేసిం ది.

తక్షణమే వారిని విధుల నుంచి తప్పించాలని ప్రభు త్వాన్ని ఆదేశిస్తూ ఉత్తర్వు ల్లో పేర్కొంది.

2024 సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యే వరకు ఎన్నికల తో సంబంధం లేని విధుల ను వారికి అప్పగించాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది....

రేపే JEE తుది ఫలితాలు విడుదల

JEE మెయిన్-2 ఫలితాలు రేపు 25న విడుదల చేయ నున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెల్లడించింది.

ఇప్పటికే జేఈఈ మెయి న్-2 తుది కీ విడుదలైంది. ఏప్రిల్ 4 నుంచి 12 వరకు జేఈఈ మెయిన్-2 పరీక్ష నిర్వహించారు. దేశవ్యా ప్తంగా 12.57 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.

జేఈఈ మెయిన్1, 2లో సాధించిన మెరుగైన స్కోరు ను పరిగణనలోకి తీసుకొని మెరిట్ లిస్ట్‌ను ఎన్టీఏ విడు దల చేయనుంది....

నేటి నుండి కొండగట్టులో హనుమాన్ జయంతి వేడుకలు

తెలంగాణలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండ గట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో నేటి నుండి మూడు రోజులపాటు జరగనున్న హనుమాన్ జయంతి వేడుకల ఏర్పా ట్లను ఆదివారం సాయంత్రం అడిషనల్ కలెక్టర్ దివాకర పరిశీ లించారు.

తాగునీటి వసతి ఏర్పాట్లు, కోనేరు, కళ్యాణకట్ట, ఆల య పరిసరాలను తదితర ప్రాంతాలను ఆయన పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట పలువురు అధికారులు ఉన్నారు..

మే 1న తెలంగాణ పదో తరగతి పరీక్ష ఫలితాలు

తెలంగాణలో పదోతరగతి పరీక్షల ఫలితాలను వెల్లడించేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది.

మార్చి 18 నుంచి ఏప్రిల్‌ 2 వరకు పదోతరగతి పరీక్షలు నిర్వహించగా, ఏప్రిల్ 3 నుంచి 20 వరకు జవాబు పత్రాల స్పాట్ వాల్యూయే షన్ ప్రక్రియ పూర్తయింది.

ఫలితాలను డీకోడింగ్ చేయడానికి మరో వారం రోజులకుపైగా సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో ఈ నెల 30న ఫలితాలను వెల్లడించాలని అధికారులు భావిస్తున్నారు.

ఒకవేళ ఆ రోజు కుదరని పక్షంలో మే 1న వెల్లడించే అవకాశం ఉంది...

రేపు మళ్లీ వైన్స్ షాప్ లు బంద్

మందుబాబులకు హైదరా బాద్ నగర పోలీసులు బ్యాడ్ న్యూస్ చెప్పారు. రేపు హనుమాన్ జయంతి సందర్భంగా నగర వ్యాప్తం గా మద్యం దుకాణాలు, బార్లు మూసి వేయాలని అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.

నిబంధనలు ఉల్లంఘించి ఎవరైనా దుకాణాలు తెరిస్తే కఠిన చర్యలు తీసుకుంటా మని హెచ్చరించారు. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా హనుమా న్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఇప్పటికే సంబంధిత అధికా రులు ఆయా ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

అందులో భాగంగానే మ ద్యం విక్రయాలను నిలిపి వేస్తూ ఆదేశాలు జారీ చేశారు. పర్వదినాలు, పండుగ దినాల్లో రాష్ట్రంలో మద్యం షాపులు మూసివే యడం ఆనవాయితీగా వస్తోంది.

అలాగే లోక్ సభ ఎన్నికలు కూడా ఉండటం తో ఎలాం టి వివాదాలు, మత ఘర్షణ లకు తావు ఉండకూడదని పోలీసు శాఖ ఈ నిర్ణయం తీసుకుంది...

ఛేజింగ్‌లో అతి కష్టపడి గెలిచిన గుజరాత్

మొహాలీలోని మహారాజా యదవీంద్ర స్టేడియం వేది కగా ఆదివారం పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో అతి కష్టం మీద గుజరాత్ విజయం సాధించింది.

స్వల్ప టార్గెట్‌తో ఛేజింగ్‌కు దిగన గుజరాత్‌… 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈజీ టార్గెట్ చేజింగ్‌లో వికెట్లు కోల్పోతున్న.. నిల కడగా ఆడుతూ గుజరాత్‌ బ్యాటర్లు లక్ష్యాన్ని చేరుకు న్నారు. 5 బంతులు మిగిలి ఉండగానే టార్గెట్‌ చేధించారు.

ఈ విజయంతో పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉన్న గుజరాత్ 8 పాయింట్లతో 6వ స్థానానికి చేరుకుంది. శుభ్‌మన్‌గిల్‌ (35), సాయి సుదర్శన్‌ (31) ఇద్దరూ ఫర్వాలేదనిపించారు.

ఇక చివరలో రాహుల్‌ తెవాటియా (31) విజృంభిం చడంతో 19.1 ఓవర్‌లోనే లక్ష్యాన్ని చేధించి.. పంజాబ్‌ ను ఓడించారు. ఇక మిగిలి న బ్యాటర్లెవ్వరూ అంతగా మెప్పంచలేకపోయారు...

ముంబైకి ఈ మ్యాచ్ కీలకం

ఐపిఎల్‌లో భాగంగా ఈరో జు జరిగే కీలక మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో మాజీ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ తలపడనుంది.

రాజస్థాన్ ఏడు మ్యాచుల్లో ఆరింటిలో గెలిచి అగ్రస్థా నంలో కొనసాగుతోంది.

ముంబై కేవలం మూడు మ్యాచుల్లో మాత్రమే విజయం సాధించింది. దీంతో రాజస్థాన్‌తో జరిగే మ్యాచ్ జట్టుకు కీలకంగా మారింది. రాజస్థాన్ వరుస విజయాలతో ఈ సీజన్‌లో పెను ప్రకంపనలు సృష్టి స్తోంది.

మరోవైపు ముంబై తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడంలో విఫలమ వుతోంది. కిందటి మ్యాచ్‌లో పంజాబ్‌పై చెమటోడ్చి విజయం సాధించింది. ఇలాంటి స్థితిలో బలమైన రాజస్థాన్‌తో పోరు ముంబైకి సవాల్‌గా మారింది.

కెప్టెన్ హార్దిక్ పాండ్య జట్టు ను ముందుండి నడిపించ లేక పోతున్నాడు. అతని వైఫల్యం జట్టుపై బాగానే ప్రభావం చూపుతోంది. అయితే ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్‌లు ఫామ్‌ లో ఉండడం ముంబైకి కాస్త ఊరటనిచ్చే అంశంగా మారింది.

రోహిత్ నిలకడైన బ్యాటిం గ్‌తో జట్టుకు అండగా నిలుస్తున్నాడు. ఇషాన్ కిషన్ కూడా బాగానే బ్యాటింగ్ చేస్తున్నాడు. సూర్యకుమార్ యాదవ్ కూడా జోరుమీదున్నాడు. టిమ్ డేవిడ్, షెఫర్డ్, నబి, తిలక్‌వర్మలతో ముంబై బ్యాటింగ్ బలంగా ఉంది.

ఇక బుమ్రా బౌలింగ్‌లో అద్భుతంగా రాణిస్తున్నా డు. కొయెట్జి, శ్రేయస్ గోపా ల్, నబి కూడా పర్వాలేదని పిస్తున్నారు. కాగా, సమష్టి గా రాణిస్తే ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం ముంబైకి అసాధ్యమేమీ కాదు.

మరోవైపు రాజస్థాన్ వరుస విజయాలతో జోరుమీదుం ది. ఈ మ్యాచ్‌కు కూడా సమరోత్సాహంతో సిద్ధమైం ది. సంజు శాంసన్, జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్, రొమన్ పొవెల్, హెట్‌మెయిర్, ధ్రువ్ జురెల్ వంటి మ్యాచ్ విన్నర్లు జట్టులో ఉన్నారు.

అంతేగాక బౌల్ట్, అశ్విన్, అవేశ్ ఖాన్, యజువేంద్ర చాహల్ వంటి బౌలర్లు కూడా జట్టులో ఉన్న విష యం తెలిసిందే. దీంతో ఈ మ్యాచ్‌లో కూడా రాజస్థాన్ విజయమే లక్షంగా బరిలోకి దిగుతోంది...

ఇవాళ ఎమ్మెల్సీకవిత బెయిల్ పిటిషన్ పై విచారణ

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వ కుంట్ల కవిత బెయిల్ పిటిషన్‌పై రౌస్ ఎవెన్యూలో గల సీబీఐ ప్రత్యేక కోర్టు నేడు విచారించనుంది.

ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మె ల్సీ కవిత రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై సోమవారం రౌస్ అవెన్యూ కోర్టు విచారించ నుంది. మధ్యాహ్నం కోర్టు విచారణ చేపట్టి తీర్పు వెల్లడించనుంది.

ఢిల్లీ లిక్కర్ కేసులో మార్చి 15న కవితను ఈడీ అరెస్ట్ చేసి కోర్టు అనుమతితో వారం రోజుల కస్టడీకి తీసుకుంది. ఆ తర్వాత విజ్ఒప్తితో 14 రోజుల జ్యుడీషియల్ కస్టడి విధించింది కోర్టు.

దీంతో కవితను తీహార్ జైలుకు తరలించారు. ఈ క్రమంలో ఎంటరైన సిబిఐ.. కోర్టు అనుమతితో ఏప్రిల్ 11న కవితను జైలు నుంచి అరెస్ట్ చేసి మూడు రోజుల కస్టడీ తీసుకుని విచారిం చింది.ఆ తర్వాత కోర్టులో ప్రవేశపెట్టగా.. మరో తొమ్మి ది రోజుల పాటు కవితకు జ్యుడీషియల్ కస్టడీ విధిం చడంతో ఆమెను మళ్లీ తీహార్ జైలుకు తరలిం చారు.

అయితే ఈ రెండు కేసుల్లో బెయిల్ కోసం కవిత కోర్టును ఆశ్రయించింది. క‌విత పిటిష‌ న్‌ను స్వీకరించిన జస్టిస్ కావేరి భవేజా నేతృత్వంలో ని ధర్మాసనం నేడు మధ్యాహ్నం 2 గంటలకు విచారణ జరపనుంది...

రేపు పిఠాపురం అసెంబ్లీ స్థానానికి పవన్ కళ్యాణ్ నామినేషన్

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నేప థ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతు న్నారు.

పవన్‌ కల్యాణ్‌ ఈ నెల 23 న‌ పిఠాపురం అసెంబ్లీ స్థానా నికి నామినేషన్‌ దాఖలు చేయనున్నారని ఆ పార్టీ నియోజకవర్గ ఎన్నికల కమిటీ సమన్వయకర్త మర్రెడ్డి శ్రీనివాస్‌ తెలిపారు.

రేపు ఉదయం 10 గంటలకు చేబ్రోలు నుంచి గొల్లప్రోలు మీదుగా పిఠాపురం పాదగ య వరకు వేల మందితో ర్యాలీగా తరలి వెళ్లి పవన్‌ నామినేషన్‌ వేస్తారని వెల్ల డించారు.

అదే రోజు సాయంత్రం ఉప్పాడలోని ప్రధాన కూడలిలో భారీ బహిరంగ సభలో పవన్ కల్యాణ్ ప్రసంగించనున్నారని చెప్పారు.

ఈ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి తరఫున పోటీ చేస్తున్నారు......